Search Box
Abhinandana (1988) Telugu Songs Lyrics
Music : Ilaiyaraaja
Actors : Karthik Muthuraman
Actress : Shobana
Supporting Cast : Sarath Babu, Rajya Lakshmi, J. V. Somayajulu
Director : Ashok Kumar
Producer : R. V. Ramana Murthy
Release Date : 10 March 1988
Ade Neevu Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Ade Neevu' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Chukkalanti Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Chukkalanti' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.
Chukkalanti (Sad) Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Chukkalanti (Sad)' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.
Eduta Neeve Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Eduta Neeve' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Manchu Kurise Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Manchu Kurise' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki.
Prema Entha Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Prema Entha' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Premaledani Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Premaledani' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Rangulalo Kalavo Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Rangulalo Kalavo' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.
Abhinandana (1988)
చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, వీటూరి, కొసరాజు నటీనటులు: కృష్ణంరాజు, రామకృష్ణ, వాణిశ్రీ, ప్రభ మాటలు, పద్యాలూ, శ్లోకాలు: వీటూరి దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి విడుదల తేది: 22.12.1979
Songs List:
జగన్మాత శ్లోక పాట సాహిత్యం
శ్లోకం 1 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: జి.వి. రంగాచార్యులు గానం: శైలజ -; జగన్మాత శ్లోకం :- వందేలోక హితం కరీమ్ శుభకరీమ్ శర్వార సంపత్కరీమ్ వందే శ్రీ భువనైక పాలన ప్రభామ్ వందే జగన్మాతరమ్
విఘ్నేశ్వర స్తుతి పాట సాహిత్యం
శ్లోకం 2 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: జి.వి. రంగాచార్యులు గానం: సాలూరి రాజేశ్వరరావు -: విఘ్నేశ్వర స్తుతి :- సర్వ విఘ్న హరమ్ దేవమ్ పార్వతీ ప్రియనందనమ్ సర్వసిద్ధి ప్రదాతారమ్ వందేశ్రీ గణనాయకమ్ వందే శ్రీ గణనాయకమ్!
నమో నమో తాండవకేళీలోలా పాట సాహిత్యం
శ్లోకం 3 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.బాలు & కోరస్ “శివలీలలు-నారద దేవతల బృందనృత్యగానం” ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకారరూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమశ్శివాయ నమో నమో తాండవకేళీలోలా నమో నమో ఆశ్రితజనపాలా దయాకిరణముల ప్రసరించే - మీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు అలనాడు - అమృతమును ఆశించి పాలకడలి మదియించగా హాలాహలమే ప్రభవించీ - విష జ్వాలలే వెదజల్లగా అభయమొసంగీ - గరళము మింగీ జగములగాచిన జగదీశా పరమేశా పృధివి రధముగా - రవి చంద్రులే చక్రాలుగా నాల్గు వేదములె హయములుగా బ్రహ్మ దేవుడే సారధిగా - మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రముకాగా ప్రళయకాల పర్జన్య గర్జనగ- భీషణ శంఖము పూరించి పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధియించి లోకాలను గాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా
విలాసాల వేళ లాలించనీ పాట సాహిత్యం
పద్యం 4 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: యస్.జానకి -: ప్రియం వద పూజ పాట :- అన్నిలోకాల నేలెడు కన్నతల్లి కామితము లెల్ల దీర్చెడు - కల్పవల్లి పూజలను గొని - దయగని భువన జనని కావరావె - కల్యాణి - శంకరుని రాణి శోకం : ఓం... ఐం.... హ్రీం.... శ్రీం.... శ్రీ మాతాయైనమః చిదగ్నికుండ సంభూతాయైనమః హర విలాసి న్యైనమః మనోరూపేక్ష కోదండాయెనమః శ్రీ చక్రనగర సామ్రాజ్యేశ్వర్యైనమః శ్రీ రాజ రాజేశ్వర్యైనమః -:పాట:- విలాసాల వేళ లాలించనీ సరాగాలతో - మనోహర లీల హృదయ వీణనే - ఇలా మేళ వించు - సదా వలపు గుండెలో - మోహాలా పాన్పు వేయనీ ఆరని - కోరికా హారతీ ఇవ్వనీ పొందులోన నిందు సేయనీ ఆడినీ - పాడనీ - రాజా ! నీ బిగి కౌగిట - పులకించనీ నీలోనన్నే లీనముకానీ రాగలహరిలో రాసకేళిలో సరసాలలో - అంచులే చూడనీ ఆడనీ – పాడనీ - రాజా !
ఎవరవయా ఏ దివ్య భువినుండి పాట సాహిత్యం
పాట 5 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి.సుశీల [వినాయకుని జన్మము - పార్వతి పాట] ఎవరవయా ఎవరవయా ఏ దివ్య భువినుండి దిగి ఈ అమ్మ ఒడిలోన ఒదిగి - ఎవరవయా ఎవరవయా ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులోగాని ఆ నవులు పలికేని ఏ వేద మంత్రాలో వేల్పులందరిలోనా తొలివేల్పువోయేమో పూజలలో మొదటి పూజ నీదేనేమో ! చిట్టిపొట్టి నడకలు - జిలిబిలి పలుకులు ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో ఎన్నెన్ని వింతలో ఎన్నెన్ని కోరికలు నిండినే కన్న ఎన్నెన్నొ స్వప్నాలు పండి చిన్నారి ఈమూర్తివై నావో ఈరేడు లోకాలు ఏలేవో
డూ - డూ - డూ - బసవన్నా పాట సాహిత్యం
పాట 6 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: రామకృష్ణ, రమోల & కోరస్ [గంగిరెద్దు వాళ్ళ నృత్యగానం] -: శివస్తోత్రం :- వచనం : శుభోజ్జయం - శుభోజ్జయం మహా ప్రభూ - గంగిరెద్దుల వాళ్ళం భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహాలోక జనలోక, తపోలోక, సత్యలోకాలను అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల పాతాళలోకాలు తిరిగి మా విద్యను ప్రదర్శించి బహుమానాలు పొందాం - మీ ఖ్యాతి విని, మీ దర్శనానికి వచ్చాం। మా విద్యను తిలకించాలి ప్రభూలు -: పాట :- డూ - డూ - డూ - బసవన్నా భళిరా అందెల బసవన్నా ఏడేడూ పదునాల్గు లోకముల మెప్పించావు గదరన్నా ప్రభువుగారికి దణ్ణం పెట్టు - ప్రతాపమంతా చూపెట్టు గజ్జెలు ఘల్లనగంతులు వెయ్- వినోదాలతో వింతలు చెయ్ రత్న కంబళం కప్పిస్తారు. బంగారపు తొడు వేయిస్తారూ విష్ణువు మోహిని రూపుతొ చేసిన నృత్యవిలాసం చూడండి నటరాజుగ శివమూర్తి చేసినా నాట్య కౌశలం తిలకించండి గంధర్వులె మా ఆట పాటలకు సిగ్గుతో తల వంచాలండీ కర్మవశమున మేము వేషాలు వేశాము దేశ దిమ్మరులమై యాచింప వచ్చాము ధాటి గల్గినా ధర్మప్రభువులు ఓహో ఓహో మాట తప్పనీ మహారాజులూ ఓహో ఓహో అడిగిందానికి కాదనబోరు - ప్రాణమైనా ఇచ్చేస్తారూ ! పరమశివుని నిజగర్భంలో దాచుకున్న శివభకులు మీరూ -: శివ స్తోత్రం :- సాంబ సదా శివ - శంభో శంకర పరమ దయాకర - భక్తవశంకర నంది వాహనా- నాగభూషణా ఫాలలోచనా - భయ విమోచనా కాలకూట - విషకంఠాభరణా చంద్ర చూడహే - గిరిజా రమణా శ్రీకర శుభకర - త్రిపురాసురహర సురగణ వందిత - మునిజన సన్నుత ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ శివ శివ శివ శివ - శత్రుభయంకర హర హర హర హర వ్యాఘ్రాంబరధర జయ జయ జయ జయ - జగదోద్దారా ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ ఆఁడపిండ బ్రహ్మాండమునంతా నిండియున్న అఖిలాండేశ్వరా దీనులగాచే దీన శరణ్యా భ క్తులబ్రోచే పరమపావనా మా మొర వినవా - రావా - రావా శంభోశంకర సాంబసదా శివ శంభోశంకర సాంబసదా శివ హర హర హర హర శంభోశంకర శంభోశంకర సాంబసదా శివ
బాలను లాలించరా గజననా పాట సాహిత్యం
పాట 7 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల [లాలస నృత్యగానం] బాలను లాలించరాగజననా-మేలిమి నెరజాణరా కళలను తెలిసిన రసికండవనుకొని ఏరికోరి చేరినాను కదరా - కనరా - కొనరా కన్నెలేడిరా - ఇది వన్నెలాడిరా కనులు విప్పరా - మనసు చెప్పరా లేత వయసులో తపము లేలరా నీ మీద మరులాయె నన్నేలుకోరా.. ఈ లాలసను మన్నించి అంతులేని వింతహాయి నిడరా లేరా - రారా - ఔరా పంతమాడితే - కేరింత లాడనా నువు బిగువు చూపితే - నే తెగువ చేయనా కౌగిలించకా కదలి పోనురా నీ బెట్టు సడలింతు పట్టి వలపింతు కాంత కోరితే - కరిగి పోవనీ హొంతకారి - యింతదాక - భువిలో దీవిలో కలడా చెలుడా
ఏది చల్లనా పాట సాహిత్యం
సాకీ 8 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, విజయలక్ష్మీ శర్మ [శివపార్వతుల ప్రణయ నృత్యగానం] మ్రోగిమ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణలతీగెలు ఆగనేలా పరుగు సందడుల గలగలలు ఆ మంచు మలలందు వాగులు ఆవైపు ఆకాశ సౌధాని కెందుకో అడ్డుగా మేఘాల తెరలు ఆ వెనుసాగునేమో ఆది దంపతుల పార్వతీ పరమేశ్వరుల ప్రణయ లీలలు -: పాట :- పార్వతి : ఏది చల్లనా శివుడు : ఏది తియ్యనా పార్వతి : శిరసున ఆ జాబిల్లి మల్లి పువ్వా శివుడు : అరవిరిసిన ఆ పెదవుల లేతనవ్వా శివుడు : ఇటు చూడు గిరిరాజ నందినీ ఈ పూలు పరచిన వేడినీ పార్వతి : ఎవ్వారు పరచారో గాని ఎవరి పవ్వళింపులకో శివుడు : ఏ సురవల్లీ సుమములో ఏరి ఏరి ఈమేసు నొచ్చునని పార్వతి : ఏ ప్రేయసీ ప్రియుల కోసమో ! శివుడు : చేరి చేరి - ఇలా, ఇలా ఒరగవచ్చునని
కోటి నదులందు మునిగిన మేటి ఫలము పాట సాహిత్యం
పద్వం 9 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: రమేష్ -: వినాయకుని పద్యం :- కోటి నదులందు మునిగిన మేటి ఫలము భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము కన్న తలిదండ్రులకు ప్రదక్షణము సేయ కలుగుననుచు - వేదాలు తెలుపలేదే |
ఒక వంక వరినీల కబరీ భరమ్ము పాట సాహిత్యం
దండకం 10 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: శైలజ, రమేష్ [అర్ధనారీశ్వర స్తుతి] ఒక వంక వరినీల కబరీ భరమ్ము ఒక వంక ఘనజటా జూట భరితమ్ము ఒక వంక మణి మయోజ్వల కుండలాలు ఒక వంక భయద పన్నగ భూషణాలు ఒక వంక కారుణ్య అవలోకనాలు ఒక కంట విస్ఫులింగ గచ్చటాలు ఒక వంక రమణీయ కాంచనాంబరము ఒక వంక నిర్వికారము దిగంబరము ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము ఒక పదమ్మున ప్రళయ తాండవ విజృంభణము విశ్వశ్రేయార్దకము సృష్టి పరమార్థమ్ము శక్తి శివశక్తుల సంగమ స్వరూపమ్ము సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము - అనశ్వరము శుభకరము - అర్ధనారీశ్వరము
విశ్వరూప సందర్శనం పాట సాహిత్యం
స్తోత్రం 11 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: శైలజ, రమేష్ [విశ్వరూప సందర్శనం] శ్రీమన్మహా దేవదేవా అమేయ ప్రభావా భవా భవ్య కారుణ్య భావా శివా! భవానీ ప్రియా చిన్మయానంద హృదయా అద్వయా దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా! అవ్వయా ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధారచక్రాన విహరించి - సంరక్తితో సృష్టి గావించి పాలించవే సూర్య చంద్రాగ్నులే - నీదు నేత్రాలుగా । నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా భూమి నీ పాదపీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా ___జమే నీకు నీరాజనమ్ముగా వాయువే వింజామరమ్ముగా - నభము భత్రమ్ముగా పంచ భూతాలు సతతమ్ము సేవించగా సప్తపాదోనిధుల్ – సుప్త శైలేంద్రముల్ సర్వలోకాలు - తీర్ధాలు నీ కుక్షిలో సదా ప్రక్షి ప్తమై యుండవే నిశ్వరూపా నమో వేద భువన ప్రదీపా సంతతానంద కేళీకలాపా జగద్గిత కీర్తి లసత్ భూకవర్తీ సదానందమూర్తీ నమో దేవతా చక్రవర్తీ నను స్తే.... నను స్తే....నమః ...
కిల కిల నగవుల జలకము లాడగ పాట సాహిత్యం
పాట 12 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: వాణీ జయరాం [వైశాలీ గంధర్వ కన్యల జలక్రీడలు] కిల కిల నగవుల జలకము లాడగ జలి బిలి పలుకుల సరసము లాడగ మేను పొంగాలి - నెమ్మేను పొంగాలి తేలి తేలి తూలిపోయి ఆటలాడాలీ సయ్యాట లాడాలి ప్రేమలోనా - తొలి ప్రేమలోనా దోరవయసు వాడే - నను కోరి చేరుతాడే దొంగాటలూ - దోబూచులూ ఆడించునే అందానికి ఋతురాజు చందానికి నెలరాజు విందుల తన పొందులనన్నేలే చెలికాడు నా మదిలో నెలకొన్న రతిరాజు నిన్న రేయి కలలో ఆ వన్నెకాడు పొదలో నన్నెంతగా - గిలిగింతల ఆలరించెనే నా సొగసును మెచ్చాడే - బిగి కౌగిలి యిచ్చాడే నే సిగ్గుతో వారించినా విడలేదే ఆ స్వప్నమె పండాలి – సౌభాగ్యం నిండాలి
కండకావరమున కాంతల చెరబట్టి పాట సాహిత్యం
పద్యం 13 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: యస్.పి.బాలు -: యుద్ధభూమి వినాయకుని పద్యం :- కండకావరమున కాంతల చెరబట్టి ఏడ్పించి నందులకిది ఫలమ్ము తాపసులను బట్టి తాళ్ళ తోడను గట్టి ఈడ్పించి నందుల కిది ఫలమ్ము సురయక్ష కిన్నర గరుడోరగాదుల హింసించి నందుల కిది ఫలమ్ము మాన నీయుల డాసి మతిభ్రష్టులను చేసి ఇకిలించి నందుల కిది ఫలమ్ము ధరణి నీ వంటి విశ్వ విధ్వంసకులను సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు తులువ ఇకనైన మా శక్తి తెలుసు కొమ్ము పొమ్ము దిక్కున్నచోటుకి పొమ్ము.. పొమ్ము
యుద్ధ భూమి మూషికుని పద్యం పాట సాహిత్యం
పద్యం 14 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: మాధవపెద్ది సత్యం [యుద్ధ భూమి మూషికుని పద్యం] ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చినన్ రోషకషాయ నేత్రుడయి రుద్రుడు పాశుపతాగ్ని చిమ్మినన్ భీషణ సంగరాంగణ విభీషణుడాహవదుర్నిరీక్ష్యుడు ఈ మూషిక చక్రవర్తినిల మోహర ముందున గెల్వ శక్యమే
పాహిమాం - పాహిమాం హే జగన్మాతా పాట సాహిత్యం
స్తోత్రం 15 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: యస్.జానకి [ప్రియంవద స్తోత్రం] పాహిమాం - పాహిమాం హే జగన్మాతా సౌభాగ్య నిర్ణేత - శ్రిత పారిజాతా హ్రీంకార సుప్రీత - సురలోక వినుతా శ్రీచక్ర పురనేత - శ్రీ మహాలలితా పసుపుకుంకుమలేని - పడతి బ్రతుకేలా చరణంటి నీ దివ్య చరణాల మ్రోలా దయతోడ పతిభిక్ష దయసేయవమ్మా కాంతునీ ప్రాణాలు కాపాడవమ్మా నిరతమ్ము నీపూజనే చేసితేనీ సతతమ్ము నీ పేరే స్మరియించి తేనీ భక్తజన వరదవను బిరుదు నిజమేనే జగములను శాసించు శక్తి నీవేనే మాంగళ్యమును నిలుపు సర్వ మంగళవేనే కాపాడరాదా ! కరుణ రాలేదా ! పతిలేని సతిబ్రతుకు వ్యర్థమే కాదా ప్రాణాల నర్పింతు చేకొనవె తల్లీ నీలోన చేర్చుకో...ఓ కల్పవల్లీ...ఓ కల్పవల్లీ
జగన్మాతస్తుతి పాట సాహిత్యం
స్తోత్రం 16 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: వీటూరి గానం: జయదేవ్, వసంత & కోరస్ -: జగన్మాతస్తుతి :- హే పరమేశ్వరి - భక్త వశంకరి చంద్రకళాధరి లోకశుతే - వేద వినోదిని నాదస్వరూపిణి త్రిపుర విహరిణి - కల్పలతే శ్రీ జగదంబ కళా నికురంబ మనోజ్ఞనితంబ దయా కరితే జృంభిత శుంభ నిశుంభ విలాసిని వింధ్య నివాసిని శ్రీ లలితే పాహిమాం - పాహిమాం త్రైలోక్యమాతా రక్షమాం - రక్షమాం - ప్రణవసంజాతా నమో దేవ దేవీ ప్రసీద ప్రసీద నమో సర్వ శుభదా ప్రసీద - ప్రసీద
మంగళ శాసనం పాట సాహిత్యం
శ్లోకం 17 చిత్రం: శ్రీ వినాయక విజయం (1979) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: జి. వి. రంగాచార్యులు గానం: సాలూరి రాజేశ్వరరావు, శైలజ, రేఖ -: మంగళ శాసనం :- వేద వేదాంత రూపాయ బ్రహ్మ విష్ణు శివాత్మకే పంచ వదనాయ దివ్యాయ విఘ్న రాజాయ మంగళమ్ పార్వతీ వరపుత్రాయ దేవాసురసుపూజితే పంచ భూత స్వరూపాయ విఘ్నరాజాయ మంగళమ్
Shri Vinayaka Vijayamu (1979)
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: మహేష్ బాబు, అల్లరి నరేష్ ,పూజా హెగ్డే దర్శకత్వం: వంశీ పైడిపల్లి నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వర ప్రసాద్ విడుదల తేది: 09.05.2019
Songs List:
పదర పదర పదరా పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: శంకర్ మహదవన్ భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిది రా ఈ పథమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకీ బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకీ వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదర పదర పదరా ఈ హలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా నీలో ఈ చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చెలరేగే అలజడికి గెలుపల్లే మొదలయి చరితగ మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమకోసమనీ తెలిసాకా నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ నినదించేలా పదర పదర పదరా నీ గతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో
చోటి చోటి బాతే పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: దేవి శ్రీ ప్రసాద్ చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2) ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే ఈ చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు (2) చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే హో యే ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ... ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే చోటి చోటి బాతే బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే తియ్యనైన జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చ ఏమి సావాసాలే బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే చోటి చోటి బాతే బాతే మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే మీటి మీటి యాదే యాదే
నువ్వే సమస్తం పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: యజిన్ నజీర్ నువ్వే సమస్తం
ఎవరెస్ట్ అంచున పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: వేదాల హేమచంద్ర , విష్ణుప్రియ రవి కల గనే కలలకే కనులనే ఇవ్వనా ఇది కలే కాదని రుజువు నే చూపనా ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే నాలో నుంచి నన్నే తెంచి మేఘంలోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే కలగనే కనులకే కనులనే ఇవ్వనా ఇది కలే కాదని రుజువునే చూపనా హు వజ్రాలుండే ఘనిలో ఎగబడు వెలుతురులేవో ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే కనబడునా కళ్ళల్లో వర్ణాలుండే గదిలో - గదిలో కురిసే రంగులు ఏవో - ఏవో పక్కన నువ్వే నిలబడి ఉంటే మెరిసే నా చెంపల్లో - ఎల్లో నోబెల్ ప్రైజ్ ఉంటే నీకై ఫ్రీజ్ అంటే వలపుల సబ్జెక్ట్ లో ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటుందే కలగనే కనులకే కనులనే ఇవ్వనా ఇది కలే కాదని రుజువునే చూపనా
ఫిర్ షురు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: బెన్నీ దయాల్ ఫిర్ షురు
పాల పిట్టలో వలపు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: ఎమ్. ఎమ్. మనసి, రాహుల్ సిప్లిగంజ్ ఏవో గుస గుసలే నాలో వలసి విడిసి వలపే విరిసే ఎదలో... హొయ్ పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే కొండలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడపకద్దిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే మలుపు తిరిగి నా మనసిట్ఠా నీవైపుకి మళ్ళిందే పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే విల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు నీ మాటలోని రోజాలు గుచ్చుతుంటే మరి ముళ్ళు నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు నీ నడుము చూస్తే మల్లె తీగ నా మనసు దానినల్లే తూనీగ మెల్ల మెల్లగా చల్లినావుగా కొత్త కళలు బాగా పిల్లా నా గుండెల్లోన ఇల్లే కట్టేసినావె కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే
ఇదే కదా ఇదే కదా నీ కథ పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: విజయ్ ప్రకాష్ ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన.. ఓ నీటి బిందువే కదా నువు వెతుకుతున్న సంపద.. ఒకొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా ఇంకెన్ని ముందు వెచెనో అవన్నీ వెతుకుతూ... పదా మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గోప్పదో ఈ పధము రుజువు కట్టదా సిరాలు లక్ష ఒంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీ లోని వెలుగు పంచగ విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగదా
నువ్వని ఇది నీదని పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: కార్తీక్ నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా ఓ సాయం అందుకొని సాగేదె బ్రతుకంటె ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువడిగినది ఓ....ఓ....ఓ....ఓ.... ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తైనా గమ్యం మిగిలే ఉందా రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందా ఎన్నడూ నిను మరువనిది ఎప్పుడూ నిను విడువనిది ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా గుండెలో గురుతైనదీ గాయమై మరి వేచినది లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా నువు కోరే విజయం వేరే ఉందా నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే నువు మొదలయిన చోటును చూపిస్తోందా నువ్వొదిలెసిన నిన్నలలోకి అడుగె సాగేనా నువు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా
Maharshi (2019)
Yuddham (1984)
Jayam Manade (1986)
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: కృష్ణ , రాధిక శరత్ కుమార్, నరేష్ దర్శకత్వం: విజయనిర్మల నిర్మాత: కోగంటి వెంకటేశ్వరరావు విడుదల తేది: 29.08.1986
Songs List:
ఊపే ఉల్లాసము పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: రాజసీతారాం, వాణీజయరాం ఊపే ఉల్లాసము
తాకితే తహ తహ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: రాజసీతారాం, వాణీజయరాం తాకితే తహ తహ
జెండాపై కపిరాజు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: రాజసీతారాం జెండాపై కపిరాజు రెప రెపమంటే
ఉదయంలా మేలుకో సూర్య పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వేటూరి గానం: రాజసీతారాం ఉదయంలా మేలుకో సూర్య
కథ ముగుసిందీ వెత తీరింది పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల కథ ముగుసిందీ వెత తీరింది
ఉన్నా వున్నాకాచుకున్నా పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ పరమాత్మ (1986) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: రాజసీతారాం, పి. సుశీల ఉన్నా వున్నాకాచుకున్నా
Krishna Paramatma (1986)
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: పి. సుశీల, ఎస్.జానకి, రాజ్ సీతారాం నటీనటులు: కృష్ణ , శ్రీదేవి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: టి.త్రివిక్రమ రావు విడుదల తేది: 05.06.1986
Songs List:
అత్తాడి అత్తాడి పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, రాజ్ సీతారాం అత్తాడి అత్తాడి
మంజువాణి ఇంటిలో పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, రాజ్ సీతారాం మంజువాణి ఇంటిలో
నీకు చక్కిలిగింతలు పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, రాజ్ సీతారాం నీకు చక్కిలిగింతలు
పూలెట్టి కొట్టమాకు పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.జానకి, రాజ్ సీతారాం పూలెట్టి కొట్టమాకు
రా గురూ పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, రాజ్ సీతారాం రా గురూ
శ్రుంగార వీధిలో పాట సాహిత్యం
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: రాజ్ సీతారాం, పి. సుశీల శ్రుంగార వీధిలో
Khaidi Rudraiah (1986)
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ నటీనటులు: రాజా, నయన హర్షిత దర్శకత్వం: చిమ్మని మనోహర్ నిర్మాత: వై.రామచంద్రా రెడ్డి విడుదల తేది: 04.06.2004
Songs List:
స్వప్నా వాస్తవదత్త పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: వేటూరి గానం: టిప్పు పల్లవి: స్వప్నా వాస్తవదత్త - అప్నే జాస్ కి రిష్తా సత్తా మీకే చూపిస్తా స్వర్గం నేలకు తెస్తా - శబ్దం బొమ్మను గీస్తా సర్వం సొంతం అనిపిస్తా ఆకాశం నీ హద్దు - అవకాశం పదలొద్దు నేటి నీ సరిహద్దు - రేపంటూ గడపొద్దు సరదాలకు పరదా వెయ్యొద్దు.... చరణం: 1 రంగులన్ని కలబోస్తే రంభ అవుతుందిరా రంభ రాకతో పగలే రాతిరవుతుందిరా ముచ్చతో అచ్చుపడ్డ జాబిలే వెచ్చన ముచ్చటే గిచ్చుకుంటే తెచ్చుకో నిచ్చెన లబ్ డబ్ దరువుల గప్ చిప్ గొడవల లైఫే నాట్యం రా...... చిక్ బుక్ నడకల చకచక పరుగుల రైలే నేస్తం రా కలలోన నవ్వె కనుపాప - అల ఊయలూగే చిరుచేప పనికోసమంత పడిగాపా - పరిచెయ్యి బ్రతుకునే చాప దరాగా మీర్జాగాలిబ్బా! .... చరణం: 2 డుమువులు కల్పిస్తే తెలుగు పుట్టిందిరా తెలుగు పాటతో ఎదలో తేనె కురిసిందిరా కూచిపూడి ఒడిలోనే మెరుపు మెరిసిందిరా మువ్వమువ్వలో నటనే మేసు విరిచిందిరా పాగరస్ ఉడుకుల - విగరస్ వయసుల నడకే ట్రై చెయ్ రా.... సిలబస్ చదువుల - చిక్ లెట్ పెదవుల పలుకే విడిచెయరా ...... పదిలెయ్యి పాతపిడివాదం కలలింక చెయ్యి అనువాదం గురిచూసి పెట్టు కుడిపాదం గెలిచెయ్యి బ్రతుకునే పందెం కాశ్మీర్లో కార్గిల్ హీరోలా ......
పూల జల్లువై పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: ఓరుగంటి ధర్మ తేజ గానం: సుజాత మోహన్ పల్లవి: పూల జల్లువై తేనె వెల్లువై వెండి వెన్నెలై నిండు జాబిలై నన్నల్లుకో చల్లగాలివైపిల్ల వాగువై సన్న జాజులా కన్నె మోజులె వెదజల్లుకో పరుగెత్తి నా మనసు పురివిప్పే వేళ పరువాలు పులకించి పదునెక్కే వేళ కలలన్ని నిజమే చేయవా చరణం: 1 నీలి నీలి ఆకాశం నేల వాలే చూడు పాలపొంగు పయసంతా కోరుకుంది తోడు చిన్ని చిన్ని చినుకమ్మా చేసి వందనాలు వన్నెలన్ని తడిమింది పూసి చందనాలు కోయిలమ్మ గొంతులోన కొత్తరాగాలు కానుకిచ్చి పెంచుతోంది గుండె వేగాలు కలలన్నీ తీరే హాయిలో....... చరణం: 2 తుమ్మెదమ్మ కోరేది పూల పరిమళాలు వాగు వంక చేరేది ప్రేమ సాగరాలు నింగిలోని జలసాల జంట పావురాలు పచ్చనైన పాదపైన చేరి చుంబనాలు ప్రేమ పంచే తోడు నాకు పంచప్రాణాలు ప్రాణమిచ్చే నీడ వంకే నేటి పయనాలు కలకాలం కరిగే హాయిలో.....
తకిట తకిట దిమిరే పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: వేటూరి గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత జూనియర్ తకిట తకిట దిమిరే పల్లవి: తకిట తకిట ధిమిరే తలాంగు తళుకదిరే ఝనకు ఝనకులదిరే జాబిల్లి జతకుదిరే పున్నమంటి నీనవ్వులో పూల మబ్బు ముసిరే కొంగు జారిన కొత్తలో కొండగాలి విసిరే ఒకసారే ఒడి సుఖసారే వలపులడారే వయసులగోదారే చరణం: 1 అల్లరి మొగ్గల అందంలో అడిగేది ఒక్కటే బంతులు వచ్చిన బందాలు బతికేది ఒళ్ళోనే వెచ్చని వెన్నెల కన్నుల్లో వెతికేది ఒక్కటే మెత్తని మల్లెల మోహంతో మొదలయ్యే దాహాలే కులాసాగ పాడుకున్న ఎదురొచ్చే వయసుల్లో గులాజీలు గిల్లిపోకు ఎదనిచ్చే మనసుల్లో తెరతీసి వెన్నెలు దోచి కన్నులు పూసే సన్న జాజుల్లో చరణం: 2 విప్పని చెప్పని ఊసుల్లో వినిపించే కోరిక నిప్పుల పువ్వుల తోటల్లో విరహించే రాధిక కన్నుల నల్లని మేఘంలో మెరుపంటె చూపుగ ఎర్రని కుర్రని ముద్దుల్లో అలకెంతో తీపిగ వసంతాలు చల్లుకున్న వలపెంటి గొడవల్లో గుణింతాలు దిద్దుకుండాం తొలిప్రేమ చదువుల్లో ఎడచాటో ఏ పొదచాటో తుమ్మెద పాటో కమ్మని పొరపొటో
ప్రియరాగాలనే పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే మల్లెపూవల్లె విచ్చావులే నువ్వు నాకెంత నచ్చావులే ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే నీలి కనుపాపలో నన్ను నిలిపావులే నిండు మనసంత ఇచ్చావులే అందుకే నిన్ను మెచ్చానులే ..... చరణం: 1 చినుకంత స్నేహం కోరిందని - గగనాల మేఘం ఇల చేరగా ఇన్నాళ్ళ దాహం తీరిందని - చిగురాకు ప్రాణం పులకించదా కలల్లోని ఆ స్వర్గం ఇలా చేతికందింది. నిజంలోని ఆనందం మనస్సంత నిండింది నీకుతోడుండి పొమ్మన్నది నన్ను నీవెంట రమ్మన్నది... చరణం: 2 బతుకంటే అర్ధం చెబుతానని - నడిపింది హృదయం నీదారిని ఈ గాలి పయనం ఎన్నాళ్ళని - నీ ప్రేమ బంధం నన్నాపని ఋణం ఏదో మిగిలింది. అదేవిన్ను కలిపింది మరీ ఆశ కలిగింది. మరో జన్మ అడిగింది నిన్ను ప్రేమించుకోమన్నది ప్రేమునే పంచుకోమన్నది .....
కల అంటె నీవా ప్రేమా పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: కార్తీక్ పల్లవి: కల అంటె నీవా ప్రేమా కలవంటె నమ్మానమ్మా కలకాలముంటావంటే ఈ గుండెలో కలగానే మిగిలావమ్మా నా కళ్ళల్లో... ఓ ప్రేమా...... ఓ ప్రేమా...... చరణం: 1 మనసు మనసులో కలపని మనిషి - మనిషి కాడనీ బ్రతుకు బ్రతుకుతో ముడిపడిపోతే-పండగేననీ కలలన్నవే కొలువుండని కనులన్ని దండగనీ వలపన్నదే రుచి చూడని ఈ జన్మ ఎందుకనీ పన్నీరులే చిలికించుతూ కన్నీరు నింపావే....... చరణం: కనుల ఎదురుగా నిలిచి నీవే - కంటి చుక్కవా మరల తిరిగి ఇక రాలేనన్న - నింగి చుక్కవా విషమించిన విధితోటలో విరజాజ విరిసేనా మసకేసిన నిశిరాతిరై నెలవంక వెలిగేనా ఎదకోసిన ఎడబాటుతో నేనింక నేనేనా .....
మరుమల్లె చెండు పాట సాహిత్యం
చిత్రం:కల (2004) సంగీతం: ఓరుగంటి ధర్మ తేజ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బి.చరణ్ , ఫెబి పల్లవి: మరుమల్లె చెండు నవ్వే - మావిళ్ళ పండు నవ్వే మందార సందె పొద్దుల్లో - ప్రాణాలు ఆరు నువ్వే ప్రాయాల జోరు నువ్వే - పసినిమ్మపండే పంటల్లో అండాలమ్మ ఆకారం - జాబిలమ్మ జాగారం దూరంకాని సిందూరంలో గీతంలోనే గోవిందం గిల్లీ కజ్జా సంబంధం - గుండే నిండే ఆనందంలో రే హుర్రే పుట్టింది నాకు వెర్రే- సే సర్రే కుట్టింది ప్రేమజర్రే చరణం: 1 పాలరాతి చెమ్మ- మురిపాల పూల రెమ్మ - జారింది తారమ్మ చెక్కినాడు బ్రహ్మ - ఈ చక్కనైన బొమ్మ చాలంది నాజన్మ తొలుత వలపు తెలిపే - పిదవ మనసు కలిపే కలికి చిలక పిలుపే - చిలిపి కధలు నడిపే దా పదా నను రమ్మందిలే - నా ఎదా ఝం ఝం మ్మందిలే సబరసమయనా సఖీరా చరణం : 2 స్వాతి వాన కురిసే - నీలేత సొగసు మెరిసె - ముంగిళ్ళ సిగ్గుల్లో వీణముందు నిలిచే - నెరజాణ పొందు పిలిచే - ముత్యాల ముగ్గుల్లో నెలలు పొడిచే పగలే-చలికి వయసు రగిలే కలకు నిజము తగిలే - ఇలకు జతలు మిగిలే సా పస మగ సంగీతమే- నే సదా ఇక నీ సొంతమే చేతన్ చేన్ తోడన్ తోన్ చెలీరా ....
Kala (2004)
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ నటీనటులు: రాజా ఎబుల్, భూమిక దర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణ నిర్మాత: బి.సత్యనారాయణ విడుదల తేది: 01.12.2006
Songs List:
నడుమే చిటికంత పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: శంకర్ మహదేవన్ నడుమే చిటికంత
కనివిని ఎరుగని పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: సాహితి గానం: శంకర్ మహదేవన్ కనివిని ఎరుగని
సిరిసిరి మువ్వలలాగ పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: సాహితి గానం: యస్.పి. బాలు సిరిసిరి మువ్వలలాగ
ప్రేమే నేరమౌనా పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: హరిహరన్, శ్రేయా ఘోషాల్ ప్రేమే నేరమౌనా
హాయ్ లవ్లీ పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: సాహితి గానం: కె.యం.రాధాకృష్ణన్, వసుంధరాదాస్ హాయ్ లవ్లీ
సరోజ దళనేత్రి పాట సాహిత్యం
చిత్రం: మాయాబజార్ (2006) సంగీతం: కె.యం.రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర సరోజ దళనేత్రి
Maya Bazaar (2006)
చిత్రం: వేడుక (2007)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్ , హరిణి
నటీనటులు: రాజా ఎబుల్, పూనమ్ బజ్వా, నరేష్
దర్శకత్వం: వై. జితేంద్ర
నిర్మాత: వెంకటేశ్వరరావు పొన్నమనేని
విడుదల తేది: 31.05.2007
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి
తడి కన్నీరైన ఈ క్షణాన్నడుగు నువ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
తారేరె ...
నింగి నవ్వు చినుకే , చినుకు పడి నేల నవ్వు మొలకే!
కంటి నవ్వు కలలే, కలలుగనె కన్నె నవ్వు కబురే !
నీ కబురొచ్చాకే పాదం నవ్విందీ,
అది పరుగులు తీసి దగ్గరికొస్తే దూరం నవ్విందీ!
నీ పరమైనందుకు పరువం నవ్వింది, ఈ ప్రేయసి పదవే నాదే నందుకు గర్వం నవ్విందీ!
ఆ పదం వింటూ నీ ఎదల్లోకి నా పెదాలొచ్చి నవ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
దాగి ఉన్న మనసే ఎగసెగసి మూగ నవ్వు కొసరే!
వేగుతున్న వయసే, తెగ విసిగి వేడి నవ్వు విసిరే
మన తొందర చూసి సరసం నవ్విందీ!
ఇక ఇద్దరినొదిలీ వెళ్ళొస్తానని విరహం ఏడ్చిందీ!
నీ సందిట చేరీ సమయం నవ్విందీ,
ఇక ఇద్దరి మధ్యన చోటే లేదని సిగ్గే ఏడ్చిందీ!
ఆ బాధల్లోన ఈ నవ్వుల్లోన జత పడే బ్రతుకు నవ్వే!
నవ్వే నవ్వే నవ్వే , నా వెన్నెల పువ్వే నవ్వే
నాలో ప్రేమే నవ్వే, నా ప్రాణాలే నవ్వే
ఔనౌనా! నిజమేనా! పడి పడి నవ్వి తడి కన్నీరైన ఈ క్షణాన్నడుగు నువ్వే!











