-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nagendra Babu"



చిత్రం:  శ్రావణమాసం (2005)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
నటీనటులు: కృష్ణ, హరికృష్ణ , పోసాని కృష్ణ మురళి , కార్తికేయ, గజాల, కళ్యాణి 
నిర్మాత, దర్శకత్వం: పోసాని కృష్ణ మురళి
విడుదల తేది: 26.02.2005



Songs List:



తెలుగువారి పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: వెనిగాళ్ళ రాంబాబు
గానం: యస్.పి. బాలు, మాళవిక

తెలుగువారి పెళ్లి



నువ్వు ఎదురుగా ఉంటె పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: చిన్నీ చరణ్, రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

నువ్వు ఎదురుగా ఉంటె 



చిలక రెక్క పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: గణేష్, రాజ్ కుమార్, జై సూర్య 
గానం: ఉష 

చిలక రెక్క




గోల్కొండ కట్టినోడు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ముని 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

గోల్కొండ కట్టినోడు 



చినుకు చినుకు పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్ 
గానం: యస్.పి. బాలు, కౌశల్య 

చినుకు చినుకు 



సైదులా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: ఆంగ్రోత్ భీమా
కాకి కథ: సుద్దాల అశోక్ తేజ 
గానం: కౌశల్య 

సైదులా 




హాయ్ హైలెస్సా పాట సాహిత్యం

 
చిత్రం:  శ్రావణమాసం (2005)  
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం: రాజ్ కుమార్
శ్లోకం: ఆంగ్రోత్ భీమా 
గానం: మాలతి 

హాయ్ హైలెస్సా 


Palli Balakrishna Friday, March 5, 2021



చిత్రం: కౌరవుడు (2000)
సంగీతం: మణి శర్మ
నటీనటులు: నాగేంద్ర బాబు, రమ్య కృష్ణ
దర్శకత్వం: జోతి కుమార్
నిర్మాత: కె. పద్మజ
విడుదల తేది: 28.07.2000





చిత్రం: కౌరవుడు (2000)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: కె. ఎస్. చిత్ర

అమ్మ పాడని జోల ఆకాశజోలా ఆ...ఆ...
అమ్మ పాడని జోల ఆకాశజోల
అమ్మపోయని లాల మేఘాలలాల
అమ్మగా నీజోల నే పాడు వేళ
అమ్మోరు చల్లగా కాపాడు వేళ

లాలి లాలి లాలి లాలి (2)

వెదురుతోటలు వేసే వేసంగి ఈలా
సందె పొద్దులు వేసే సంపంగి మాలా
వెదురు తోటలు వేసే వేసంగి ఈల
సందె పొద్దులు వేసే సంపంగి మాల
గొంతువిప్పని ప్రేమ కోయిలలు పాడ
గొంతువిప్పని ప్రేమ కోయిలలు పాడ
కొమ్మనై ఊంచేను అమ్మ ఉయ్యాల

లాలి లాలి లాలి లాలి

ఏడుకొండలవాడి ఎత్తుగా పాడి
అన్నమయ్య ఊపేను తెలుగుటుయ్యాల
ఏడుకొండలవాడి ఎత్తుగా పాడి
అన్నమయ్య ఊపేను తెలుగుటుయ్యాల
వరదయ్య పాటలో వరదలై పొంగే
వరదయ్య పాటలో వరదలై పొంగే
ముద్దుమురిపాల మా మువ్వగోపాలా

లాలి లాలి లాలి లాలి

అమ్మ పాడని జోల ఆకాశజోల
అమ్మపోయని లాల మేఘాలలాల
అమ్మగా నీజోల నే పాడు వేళ
అమ్మోరు చల్లగా కాపాడు వేళ

లాలి లాలి లాలి లాలి (2)

Palli Balakrishna Friday, May 22, 2020

చిత్రం: హ్యాండ్సప్ (2000)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం:
గానం:
నటీనటులు: నాగేంద్ర బాబు, జయసుధ, బ్రహ్మానందం,  సోను సూద్, రాఘవ లారెన్స్, నగ్మా, దీప్తి భట్నాగర్, ప్రత్యేక పాత్రలో చిరంజీవి, మాస్టర్ వరుణ్ తేజ్
దర్శకత్వం: శివనాగేశ్వర రావు
నిర్మాత: నితిన్ కపూర్
విడుదల తేది: 10.02.2000


Palli Balakrishna Tuesday, April 30, 2019



చిత్రం: విష్ణు (1990)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: కృష్ణ , సితార, నాగేంద్ర బాబు
దర్శకత్వం: వి.బి.ఎల్. వి. ప్రసాద్
నిర్మాత: బి.టి.లక్ష్మీ
విడుదల తేది: 21.09.1990



Songs List:



హల్లో కమాన్ సూపర్ స్టార్ పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: మనో, యస్. పి. శైలజ 

హల్లో కమాన్ సూపర్ స్టార్ 



నువ్వు అవునన్నా పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: మనో, పి. సుశీల 

నువ్వు అవునన్నా 



ఓ కలికి పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: మనో

ఓ కలికి 



రారా అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: విష్ణు (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: మనో

రారా అందగాడా 

Palli Balakrishna Thursday, March 14, 2019


చిత్రం: రుక్మిణి (1997)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల (All)
గానం: సుజాత
నటీనటులు: వినీత్, రుక్మిణి విజయ్ కుమార్ (తొలిపిరిచయం)
మాటలు: జి.సత్యమూర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: రమణమూర్తి జొన్నాడ
విడుదల తేది: 1997

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా ఉట్టి కారుకూతలే..
ఆట అంటె నాదెగాని లేడిపిల్లదా ఉట్టి పిచ్చిగంతులే..
పొలాల వెంట ఛెంగుమంటు సాగుతూ పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి
చంద్రుడే సిగ్గుతో మబ్బు చాటు చేరుకోడా

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు....
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె....

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకీ ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారిలాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే
ఫలాని దాని మొగుడు గొప్పవాడనీ అనాలి అందరూ
అలాని నాకు ఎదురు చెప్పకూడదే మహానుభావుడూ
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు అ మగాడు
ఇక్కడే ఎక్కడో తపస్సు చేస్తు ఉంటాడు

గోదారి రేవులోన రాదారి నావలోన
నా మాట చెప్పుకుంటు ఉంటారంటా
నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని
నాలాంటి అందగత్తె నేనేనంట
కూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ
పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చి
ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట


Palli Balakrishna Thursday, February 28, 2019



చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , ప్రభుదేవా, అంకిత , కిరణ్ రాథోడ్, నాగబాబు
దర్శకత్వం: నిధి ప్రసాద్
నిర్మాత: హర్షా రెడ్డి
విడుదల తేది: 18.06. 2004



Songs List:



గుమ్మా గుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: స్మిత

గుమ్మా గుమ్మా 




తొలి తొలిగా పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: చక్రి, చైత్ర అంబడిపూడి 

తొలి తొలిగా 




మన్మధుడా పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: రేవతి 

మన్మధుడా 




కన్నె తనం వన్నెతనం పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: టిప్పు, స్మిత

పల్లవి:
కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
దాదా దామిని సోకుల చింతామణి
కాదా నెచ్చెలి అందాల ఆకలి
నవ్వే పాలపిట్ట నీ సొగసు పూలబుట్ట
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా

వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా

చరణం: 1
పండువెన్నెల్లో కొనసాగించారా
చెంతకు చేరి నే కాదంటానా
తేనె రాసుకో గోరంటు చేసుకో
బుగ్గే ఇచ్చుకో వదలను ఇంకా
అగ్గై కోరిక రేగింది చూడిక
వయసే ఆపేది ఎన్నాల్లింక
వడిసి పట్టేయన చూసేయన ఎగాదిగా
ముగ్గే పెట్టేయనా బంధానికె పునాదిగా
త్వరగా వచ్చేయన సయ్యాటకు రవ్వల జాణ

వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది

చరణం: 2
పాలకన్నుల్లో నా సొగసరి జాణ
దాచుకున్నావే నే చూసిన చాన
పోరా పోకిరి చాల్లే నీ అల్లరి
గేలం వెయ్యకు మాటలతోటి
వస్తా సుందరి అందంగా రాపిడి
చేస్తా చూసుకో వయసును మీటి
చూపుతో వయ్యారంగా సోదాచెయ్యి అందాలన్నీ
దొరలా సుకిస్తాగా అందించవే సింగారాన్ని
అందుకో వయ్యారాలు ఆరేసింది ఈ అలివేణి

కన్నె తనం వన్నెతనం గుప్పుమనే సుందరి
గుండెనరం ఎందుకిలా లాగుతున్నది
వెచ్చదనం వెన్నతనం నాకుంది లేరా
కొంటె తనం చూపి ఇలా లేపుకుపోరా
దాదా దామిని సోకుల చింతామణి
కాదా నెచ్చెలి అందాల ఆకలి
నవ్వే పాలపిట్ట నీ సొగసు పూలబుట్ట
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా
గిల్లిపోతే ఎట్టా నా లేతబుగ్గ ఇట్టా
తీసుకెళ్తా పిల్లా పూదోట పొదలకిట్టా హేయ్...



దొంగల స్టోరీ పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: రవివర్మ, చక్రి 

దొంగల స్టోరీ 



గున్ గునారే పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే దొరికితే (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి 
గానం: చక్రి , సునందా 

గున్ గునారే 

Palli Balakrishna Monday, December 11, 2017




చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతలు: నాగేంద్ర బాబు, చిరంజీవి
విడుదల తేది: 22.09.1988



Songs List:



హే పాపా పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు
చెయ్యగలిగిన గడసరి యువకుడు

పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్నీ ల్యాండు గుండెల్లొ గడ బిడగా  
పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్నీ ల్యాండు గుండెల్లొ గడ బిడగా

పాపలంత మెచ్చుకున్న పట్టు చూడరో
ఫ్రాకులోని సోకు చూడరో
ఒళ్ళు దాటి తుల్లి పడ్డ ఒంపు చూడరో
జంపు దాటి సొంపు చూడరో
త్రిల్లురో ఒళ్ళూ గిల్లురో గుండె జల్లురో

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు
సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు

ఈడు చూడు పోసు చూడు ఈవుటీజులో
మొగ్గ విచ్చుకున్న మోజులో
చూపు చూడు ఊపు చూడు టాపు చూడరో
జీన్సు గున్న చాన్సు చూడరో
అల్లరు రాగ వల్లరు చూసి వెల్లరో

టీనేజు .....
టీనేజి గాల్సు నా జట్టు
కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకు నీకేలేరా

నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు
చెయ్యగలిగిన గడసరి యువకుడు



ఓరినాయనో పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం:  మనో, చిత్ర

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో
ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో
జిల్లు జిల్లంటూ ఒళ్ళు తూలింది
ఎర్ర ఎర్రంగా సిగ్గు కందింది
వెన్న ముద్దల్లే గుద్దుకున్న చిన్నదాని వన్నెదాడికీ
కన్నె ఒంపుల్లో సద్దుకున్న చిన్నవాడి కన్ను వేడికీ

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో

ఒద్దనవద్దూ మెత్తని ముద్దు
హత్తుకుపోతె బిత్తరిపోదా ఇద్దరి హద్దు
ఒడ్డుకు నెట్టు ఒంటరి తెడ్డు
సిగ్గుల నావకు లగ్గం రేవున లంగరు దించు
కొత్త మోమాటం తీరాలమ్మో
కొంటె ఆరాటం ఆగాలయ్యో
సందిట పట్టి పందెం కట్టి గుట్టే లాగేస్తా
నును సిగ్గుల చుట్టు అగ్గిని పెట్టి పిండెను పండిస్తా

గుబురు చాటున్న మల్లెమొగ్గ
తుళ్ళి పడే మోజు ఎప్పుడో
గుబులు దొంకల్లో మొగలి సెగలు
రగులుకునే రోజు ఎప్పుడో

ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో

గుప్పున మండే నిప్పుల చెండు
వెన్నెల ఒళ్ళో వెచ్చగ తుల్లే అల్లరి చిందూ
అందిన పండు చిచ్చుల విందు
రెచ్చిన కొద్ది ముచ్చట పెంచే మెత్తని దిండూ
పూల బంతులతో ఆడాలయ్యో
పాల పుంతల్నే చూడాలమ్మో
చెయ్యక తప్పని తియ్యని తప్పుని చేసే తొందరలో
మన ఇద్దరి మద్యన ఉక్కిరిబిక్కిరి కాని నిద్దర్లో

బిందె లోతుల్లో ఉంగరాన్ని
అందుకునే పండగెప్పుడో
సంద్య చీకట్లో సంబరాలు
చెంగుమనే సందడెప్పుడో

ఓరినాయనో సోకు షాకు కొట్టిందమ్మో
ఓరిదేవుడో చిలిపి చీమ కుట్టిందయ్యో
జిల్లు జిల్లంటూ ఒళ్ళు తూలింది
ఎర్ర ఎర్రంగా సిగ్గు కందింది
వెన్న ముద్దల్లే గుద్దుకున్న చిన్నదాని వన్నెదాడికీ
కన్నె ఒంపుల్లో సద్దుకున్న చిన్నవాడి కన్ను వేడికీ



లవ్లి లకుముకి పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, జానకి

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా
తీర్చవా శింగారాలు చిలికిన తహతహా
ఓర్చుకో కంగారేల తుంటరి టిమటిమా
తొలి వలపు రాగాల గొడవ సాగాలి
కలల కవ్వింతలో

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా

ఆరుబైట కథా అల్లరైతె ఎలా
ఇంత పచ్చి శృంగారమా
కళ్ళు పచ్చబడీ ఒళ్ళు వెచ్చబడీ
పక్కకొస్తె నిష్టూరమా
ఉల్లిపొర్ల సిగ్గిలన్ని ఒలుచుకుంటు
అల్లుకున్న ఊపిరంత చిచ్చోనమ్మా
తెల్లవార్లు ముల్లు విప్పి నుల్లు పూలు
తుల్లుతున్న తాపమింక పిచ్చోనమ్మా

దూరం తీరే దారే చూడూ
భారం తీరే బేరం ఆడూ
మన మొదటి మైకాలు మధనలోకాలు
మలుపు తిప్పాలమ్మా

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా

ఊగుతున్న కొద్ది ఆగుతుంది నిసి 
రేగుతున్న ఆత్రాలలో
తీరుతున్న కొద్ది ఊరుతుంది కసి 
మోగుతున్న మోహాలలో
పూల పక్క వాడంగానె రేగి చుక్క వాలుతుంది వాలు కళ్ళ వాకిల్లలో
వెన్నెలమ్మ వెల్లువయ్యి ఝల్లు మంటు తుళ్ళుతుది చల్లబడ్డ ఆకళ్ళలో

తీసే శ్వాసే వేసే తాళం
పూసే ఆశే చేసే స్నానం
చిరి చెమట వాగుల్లొ చిలిపి దహాలు కరిహిపోవాలమ్మా

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా
తీర్చవా శింగారాలు చిలికిన తహతహా
ఓర్చుకో కంగారేల తుంటరి టిమటిమా
తొలి వలపు రాగాల గొడవ సాగాలి
కలల కవ్వింతలో

లవ్లి లకుముకి మోలి పిలుపుకి లవ్లో పడ్డానమ్మా
జాలీ చకుముకి మోలి చెలిమికి వల్లో పడ్డానమ్మా



నాటుకొట్టుడు పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం:  బాలు, జానకి

పల్లవి:
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే

చరణం: 1
ముట్టడించి కొట్టాలా బుగ్గల్లో నా ముద్దు
మట్టగించి తొక్కాలా మంచాలే ఈ పొద్దు
కోకపల్లి రాజ్యంలో కొటగుమ్మమేడుందో
ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో
చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు
కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు
రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో
చిక్కులిప్ప తీసే దాకా మోమాటాలమ్మో
శృంగారానికి సింగంలాంటి చిన్నోడొస్తుంటే
సిగ్గు ఎగ్గు పుట్టిళ్ళల్లో నుగ్గైపోతుంటే
తాకిడి వేళా చెలి తట్టుకోవాలా
కస్సుబుస్సు పూజలతో కాముడికి నమో నమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే

చరణం: 2
చప్పరింత కొట్టాలా మైకంలో ఓమాటు
అప్పగింతలియ్యాలా మెత్తంగా ఈనాడు
పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో
పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో
దండయాత్ర చెయ్యాలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వాలా ఏనాడో ఓనాడు
పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో
తేనేబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో
వయ్యారానికి ఉయ్యాలోచ్చే వూహే చూస్తుంటే
ఉట్టి పట్టి చట్టే కొట్టే ఊపే వస్తుంటే
గుద్దులాటల్లో తొలి ముద్దులాటల్లో
మొగ్గే విచ్చే మోజులతో ప్రేమలకే...  ఘుమో ఘుమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో

నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే
నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే



చెంపల తళుకుల పాట సాహిత్యం

 
చిత్రం:  త్రినేత్రుడు  (1988)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, జానకి

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా
బిగిసిన రైకలో సొగసుల కేకలే
ఎగసిన వేలలో ఎగబడగా... కలబడగా

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

నలిగి మెత్తగ అలిగే సొగసే 
మత్తుగ అత్తరు కొడుతుంటే
చిదిపి సన్నగ కదిపి వలపే
వంటికి వత్తిడి పెడుతుంటే

నా రెక్క నీ పిక్క అంటించగా
తైతక్క లాటెదో పుట్టించగా
లోలోన పైపైన రెట్టింతగా
లోతైన మోహాలు ముట్టించగా

మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ
ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ
మబ్బుల చాటున జాబిలి చేజిక్కనీ
ఊకిరి చూపుల చుక్కని కొండెక్కనీ
తొలిగా కలిసీ నడిపే కథలో రేగే శృంగారమే

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

అడిగి ముద్దుల కరిగే
ఒడిలో ప్రేమకు ఉగ్గులు కడుతుంటే
ఒదిగి కౌగిలి తొడిగే
అమ్మడి ముంగిట ముగ్గులు పెడుతుంటే

నా కన్ను నీ కన్ను కవ్వింతగా
వెన్నెల్లు పగటేల పుట్టించగా
నీ పోసు నా మోజు పూసంతగా
చీకట్లో చిరు తిల్లు తినిపించగా

పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ
పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ
పున్నమి నాటికి పువ్వులు తలకెక్కనీ
పువ్వులు వాలిన తుమ్మెద మత్తెక్కనీ
తడిగా పొడిగా తగిలే తపనే తీరే సాయంత్రమే

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా
బిగిసిన రైకలో సొగసుల కేకలే
ఎగసిన వేలలో ఎగబడగా... కలబడగా

చెంపల తళుకుల కెంపుల లేడి జోడి కావే
ఒంపులు తిరిగిన సొంపుల బ్యూటీ నీదే లేరా

Palli Balakrishna Sunday, October 8, 2017



చిత్రం: హీరో (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హరిచరన్ , ప్రియ
నటీనటులు: నితిన్, భావన, నాగేంద్ర బాబు, రమ్యకృష్ణ
దర్శకత్వం: జి.వి.సుధాకర్ నాయుడు
నిర్మాత: మన్యం రమేష్
విడుదల తేది: 24.10.2008

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)

వలపంటే అదే .. నీ వలనే అనీ
కలిగిందే అనీ .. వయసన్నదీ

వయసంతా .. పెదవుల్లో
కదిలిందే ఏదో .. కోరిందే
కదిలే ఈ కాలం .. ఆగిందే

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే

ఊపిరిలో ఆవిరులే వేసాకాలం
వేసవిలో నీ చెలిమే శీతాకాలం
కలకాలం .. కలగాలీ .. కులుకుల్లో జ్వరం
కలిగే .. ఆ జ్వరమే .. ఉడికించే వరం

ఎన్నో వరములనే నువ్వే ఇస్తున్నా
ఇంకా ఇంకొకటీ కావాలంటున్నా !

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే

ఇంకొకటీ వేరొకటీ నాదౌతుంటే
ఇప్పటికీ ఇచ్చినదీ ఇంకా కొంతే
ఇది కొంతే .. అనుకుంటే .. ఇక ఇస్తాను నా
ప్రాణం .. అది చాలా .. మరి ఈ జన్మకీ

ప్రాణం లో వెలిగే ప్రేమే కావలెనే
ప్రేమించే మదిలో చోటే కావలెనే

కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)

Palli Balakrishna Thursday, September 14, 2017




చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, త్రిష
దర్శకత్వం: ఎ. ఆర్.మురగదాస్
నిర్మాత: కె.నాగేంద్ర బాబు
విడుదల తేది: 20.09.2006



Songs List:



గొగొ గోవా మగువా పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రంజిత్, మహాలక్ష్మి అయ్యర్

గొగొ గోవా మగువా గొపెమ్మకు మోడల్ నువ్వ
ఆజ అంధ్ర మగడా గోరింకల లీడర్ నువ్వ
లెక లెక పిలిచాక ఆగలెనుగా
ఆగలెక వలచగా ఒక్కసారిగా
Do u know మెగదలదాక
Do u know హై సోకు తిన్న
Do u know హైజాకు అయ్య
ఓ... ఓయె
Do u know నీ పిచ్చి చుసా
Do u know వైజస్గు వెళ్ళ
Do u know వైద్యాని తెచ్చ
ఓ... ఓయె

All your love,give me now
Need some more,dont u know
Thats with me,to the beat
టక తైత తైత తైతూ
శంఝొ నా సంఝొ నా సాగుతున్న సావసనా
స్వప్నలీ సత్యలై సులువుగ దొరుకును కద
చినదాన నువ్విల చంగుమన్న ఈ సమయనా
ఎంతైనా సొమ్మున్న కనులకు చులకన కద
కులుకులొనె కలకనాలొయి నిన్నె కలిసాక
కలికి ఈడె తళుకుమందొయి నీతొ గడపక
Do u know నినుచుసినానె
Do u know పనిముసినానె
Do u know పెనవెసినానె
ఓ... ఓయె
స
సున్లోన సున్లోన సూటిపోటి చుపుల్లోనా
నా అందం నా సొంతం అటు ఇటు అదిరెను కద
నజరాన నేరుగా అందుకున్న ఆనందాన
నీలోన థిల్లన తికమక తెలిపెను కద
సిలుకు బొమ్మ చిలక కొమ్మ నిన్నె పట్టుకొనా
కసురుకున్న కలుపుకుంటు కానె కొట్టుకొనా
Do u know నిను కొరినానొయి
Do u know దరి చెరినానొయి
Do u know మితి మీరినానొయి



సిగ్గుతో ఛీ ఛీ... పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: హరిహరన్, సాధన సర్గం

పల్లవి: 
సిగ్గుతో ఛీ ఛీ... చీరతో పేచీ
ఆపినా ఆగునా ప్రేమపిచ్చి
వద్దకే వచ్చి బుగ్గలే గిచ్చి
ఆపదే తీర్చనా ముద్దులిచ్చి
కన్నులే కాచి వెన్నెలై వేచి
నిన్నిలా చూసి నన్ను ఇచ్చేసి
లాలించి చూపించు నీలో రుచి

చరణం: 1
పూవై పూచి తేనే దాచి వచ్చా నేరుగా
ఆచి తూచి నిన్నే కాచి నాదంటానుగా
నిన్నే మెచ్చి చేయే చాచి 
అందించానుగా
నువ్వే నచ్చి అన్నీ మెచ్చి ఉన్నానింతగా
నిదురే కాచి నిను గెలిచి
నిదురే లేచి ఎద తెరిచి
ప్రేమించే దారి చూపించి

చరణం: 2
ఈడై వచ్చి పెంచే పిచ్చి మోసా జాలిగా
నువ్వే నాకు తోడై తోచి నన్నే పంచగా
ఆలోచించి ఆలోచించి చేరా సూటిగా
ఒళ్లోకొచ్చి వడ్డించాలి నిన్నే విందుగా
మనసందించా మైమరచి
మనసావాచా నిను వలచి
కవ్వించే కానుకందించి



I want a spider man పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ 
గానం: నవీన్, రీటా

I want a spider man
I want a super man
నాకే కవాలి దాసోహం
If you wanna if you wanna if you wanna be my love
అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే
వస్తే బ్రమలన్ని తొలగాలే
If you wanna if you wanna if you wanna be my girl
దేకో దిల్ షేకంతా
సీకో నా స్టైల్ అంతా
రోకో నా వంట్లో వేడంతా
నీ జతలో సెగ వుందటె నే జగడం సాగిస్తా
నీ పొగరే నాతో సమరం చేస్తె చిలిపి చురకలేస్తా

ఇష్కు విష్కునీ కవాలా నాతో నువ్వే ఆజా
మిస్సు కిస్సు నిన్నడగాలా మొదలు పెట్టవే పూజా
చస్క మస్కలా చోటుందీ మసక చీకటికి లేజా
లేటు చెయ్యకా కం అందీ కోరి పిలిచినది కాజా

హేయ్ తుల్లే వొల్లే నన్నే గిల్లి తాపం రేపేనా నా పైనా దిల్లానా
అట్టె అంటు చిట్ట విప్పి ఆపై జారావా హైరానా నాకేగా
మత్తుగున్నది కోక జారే కోకకున్నదీ కాక
ఇస్త మెత్తగా టీకా సోకా
రెచ్చిపోయెలా రాక వస్తే గుచ్చుకుంటదీ కోకా
తగ్గిఉండవోయ్ ఇంకా ఇంకా
నీ ఎగసే పసి అందాలే నే ఒడుపుగ పట్టెస్తా
నీ తలుకే నాకే మైకం తెస్తే తగిలి వదలనింకా

ఇష్కు విష్కునీ కవాలా నాతో నువ్వే ఆజా
మిస్సు కిస్సు నిన్నడగాలా మొదలు పెట్టవే పూజా
చస్క మస్కలా చోటుందీ మసక చీకటికి లేజా
లేటు చెయ్యకా కం అందీ కోరి పిలిచినది కాజా

I want a spider man
I want a super man
నాకే కవాలి దాసోహం
If you wanna if you wanna if you wanna be my girl
అబ్బో నీ సరదాలే ఎంతో విడ్డురాలే
వస్తే బ్రమలన్ని తొలగాలే
If you wanna if you wanna if you wanna be my love

సిగ్గే లేదె హద్దే దాటె స్పీడె నీలోనా
ఓ జానా సుల్తానా
హేయ్ దమ్మే ఉంటె జట్టె కట్టు ఆజా దీవానా వస్తావా మస్తానా
రెచ్చగొట్టకే జానా నాకే చిచ్చు పెట్టకే లోనా
రెచ్చిపోతే అయిపోదా బాదా
వద్దు చెప్పకోయ్ బాల ఎన్నో చూసినానులే చాలా
చెయ్యి సోకుకే పూజా రాజా
నీ మెరిసే పెదవందిస్తే నా అదరం జత చేస్తా
నీ తపనే తడిగా తాకిందంటె తనువు తడిమి చూస్తా

ఇష్కు విష్కునీ కవాలా నాతో నువ్వే ఆజా
మిస్సు కిస్సు నిన్నడగాలా మొదలు పెట్టవే పూజా
చస్క మస్కలా చోటుందీ మసక చీకటికి లేజా
లేటు చెయ్యకా కం అందీ కోరి పిలిచినది కాజా



హెయ్ తోబారే తోబా పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యస్.పి.బాలు, సునీత 

హెయ్ తోబారే తోబా తేరీతో మే తోబా

ఓణీలో సోనీ శోభ బాగుంది హాయ్ రబ్బా  
గుండెల్లో పెళ్లి నావ కళ్ళల్లో ఉందోయబ్బా హేయ్
హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ 
హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా
హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా 
హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో
సింధురి సింగారి సిద్దంగుండమ్మో 
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి బద్రంగుండమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో

చరణం: 1
గుభాళించన గులాబివలే ఇలా పూల గాలాలు వేసేయ్నా
ప్రయోగించకే ప్రతీ సోకుని భరాయించ లేవమ్మ నా ధన్ ధనా
పోని ఏం చెయ్యమంటావు చెప్పేసేయ్ రబ్బా
బిజిలీ గడి బిజిలీ గడి ఇక గజిబిజి భజనల అలజడి
పోను పోను నువ్వే నేర్చుకుంటావోయబ్బా -  రబ్బా

హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ 
హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా
హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా 
హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో
సింధురి సింగారి సిద్దంగుండమ్మో 
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి బద్రంగుండమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో

చరణం: 2
నీ ఆవేసఖ నీ గారాలలో ధగా చేసుకో దాగి నాలోనే
దిగాలెందుకే దిగా ముందుకే తగాదాల భోగాలు చూపేందుకే
ఇంక నా బెంగ లావంగా మారిందోరబ్బా
బిజిలీ గడి బిజిలీ గడి ఇక గజిబిజి భజనల అలజడి
ఇంకె నీ పొంగు ఆపంగ వీళ్ళేదోయబ్బా రబ్బా

హెయ్ తౌబారే తౌబా - వయ్యారి గుడ్లగూబ 
హె తౌబా మళ్ళీ తౌబా - ఓయమ్మో అంత డాబా
హె తౌబా తౌబా తౌబా - గుయ్యందే గుండె గుబా 
హెయ్ తౌబారే త్వరలోనే బాజాలమ్మో
సింధురి సింగారి సిద్దంగుండమ్మో 
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి బద్రంగుండమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో




సూర్యుడే సెలవని పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు

సూర్యుడే సెలవని అలసి పోయేనా..
కాలమే శిలా వలె నిలిచి పోయేనా.
మనిషి మనిషి ని కలిపిన ఓ ఋషి
భువీ ని చేరితని నిలేపెను నీ కృషి

మహాశయా విధి పదే తరిమేర
మహోష్ణమే రూదిరమే మణిగేరా.
ఆగి పోయేనా త్యాగం కదా
ఆదమరిచేనా దైవం వృధా..

ఆకాశం నినుగని పేరిసిపోతుంది
నెల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకు కురిసెను నీ కల
మనసు మనసున రాగిలేను జ్వలలా...
తుఫాను లా ఏగిసేని ప్రవచనం
తపో జ్వాలా కదిలెని ఈ యువ జనం
పంచ బూతలే తోడె సదా
పంచ ప్రాణాలే రవ పదా

ఓం ఓం ... త్రయంబకం గజ మాహే
సుధంధిం పుష్ప్ వర్దనం

స్వార్దమే పుడమి పై పరుగు తీస్తుంటే
ధుర్ధూ లే అసూరలై ఉరాకలెస్తుంటే
యుగం యుగమునా వెలిసెను దేవుడు 
జగం జగముని నడిపిన దీరుడు
మహోదాయ ఆది నువే అనుకోని
నిరీక్ష తో నిలిచేనీ జనగని
మేలుకో రాదా మా దీపమై
ఏలుకొరాదా మా బందమై



పరారె పరారె పాట సాహిత్యం

 
చిత్రం: స్టాలిన్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: శంకర్ మహదేవన్

పరారె పరారె ప ప ప పరారె
బండెక్కి బయం పరారె
చలొ రెయ్ చలొ రెయ్ చిందెసి చలొరెయ్
పందెం లొ జయం కరారె
గుండె నరం లొకె
దమ్ము రసం పంపి
కండ బలం లొనె
నిప్పు గుండం నింపి
సల సల రావొఇ ఓ సైనికుడై రావొఇ
సలాం సలాం కొట్టి నీ సెవకులవుతామొయి
ఇలంటొళ నుండి ఓ సైనికుడొస్తడొఇ
అలంటొళ నుండి నీ సెవకుడవుతడొఇ

Peace for the nation and peace for the people
jana gana mana together we say
అందరు కలిసి ఈ దెశం కొసం చెతులు కలిపింద either way

రామ బాణమంటె నీ ఆలొచనె
రావనుడు అంతె మరి నీలొ చెడె
అంజనెయుడంటె అరెయ్ నీ సహనమె
అసలు దెయ్యమంటె నీ కొపమె
చెదు నీ వెంటనె వెంటాడి చంపరా
సహనం వెటు తొ కొపన్నె తెంపరా
మీసం మెలిక తిప్పి ముందుకెయ్యరా
మొసం మక్కెలిరిచి ముందరైయరా
అన్నవెళ్ళె రూటు నీ నమ్మడమె rightu
నమ్మకమె ఆయుదమై నవ్వుతు నువ్వచవంటె

తొటివారికొసం చేయి అందివ్వర
ఆదుకున్న సాయం నిను దీవించు రా
దీపమల్లె నువ్వె నీ చూపివ్వర
రెండు సార్లు మొత్తం నువ్వు జీవించర
రక్తం పంచిన కన్నొళ్ళె తెరుగా
రక్తం ఇచ్చిన నిన్నె చుస్తరుగా
పదర పంబ రెపి సంబరం గా
స్వార్దం వెన్ను తై స్వామిరంగ
ఎక్కడిది బాసు నీ పలుకు కు ఈ పంచు
వెండితెర ముందరల వెన్నుతట్టె fans ఈ ఉంటె

Palli Balakrishna Friday, September 1, 2017



చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసిని
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.యస్.రామారావు
విడుదల తేది: 04.08.1988



Songs List:



గొడవే గొడవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ...
అడుగు అడిగేది అడుగు... వయసే మిడిసి పడుతుంటే...
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే...
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ 

చరణం: 1
మొదటే చలి గాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంప తెంచే
అసలే నీ వంపు నా కొంప ముంచే

ముదిరే వలుపులో నిదురే సేవంట
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కధలే నే వింటా
అదిరే గుండెలో శృతులే ముద్దంటా
దోబోచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ

చరణం: 2
ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు
పడితే తెలిసింది తొలిప్రేమ కాటు
కునుకే లేకున్నా ఈ నైట్ బీటు
ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు

పిలిచే వయస్సులతో జరిగే పేరంటం
మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం
చలికే వొళ్ళంతా పలికే సంగీతం
సరదా పొద్దులోకరిగే సాయంత్రం

నీ ఎడారి నిండా ఉదక మండలాలు
నీటి ధార దాటే మౌన పంజరాలు
తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం
జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు

గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ
గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ





కొక్కర పిక్కర చక్ పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు

పల్లవి :
హూ కొక్కర పిక్కర చక్ కుప్పుకర్ చక్
కుక్కుకర్ చక్ కుప్పుకర్ చక్ కుప్పుకర్ తక్
యుగాక్కర్ కొక్కర పిక్కర తక్కర కక్కర కక్కర
తిక్కర ధిక్కార కొక్కర కొక్కర పిక్కర తక్కర
కక్కర కక్కర తక్కర పిక్కర
కోక్కరో కో కో కో కో కో కో
కొక్కర కో కొక్కర కో కో కో కో కో కో కో
కొక్కర కో కో కో కో కో కో కో
కోక్కరో కో కో కో జిం జిం జిం జిం జిం జిం
జిం జిం జిం జిం జిం జిం

హే...  జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ.. ఆహ... ఆ..
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ... ఆహ్... ఏ
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే ఇడియట్
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే...  you.....
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ....  ఛీ పో
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఓ ఓ...  ఆహ్...  గెట్ లాస్ట్ 

చరణం: 1
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవులే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
చెట్టు పుట్ట పిట్ట బట్ట కట్టుకోవు లే
పుట్టేనాడు గిట్టేనాడు గుడ్డే లేదులే
పేచి లేని గోచి పెట్టె యోగి వేమన
పూచి నాదే డంగై పోకు లింగు లిటుకుమ్మా
ఆనాడు శ్రీకృష్ణుడే చీరెత్తుకేల్లేడులే...  షట్ అప్
ఈనాటి ఓ భామలో సిగ్గు ఎత్తుకేల్లావ్ లే...  you...  you
అందం చందం పంతం బంధం అన్ని దోస్తలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరె మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్..  Get away
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే
అం భం భం మేడా రంభం నీదే కుంభం నాదే లాభం

హే జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్ 

చరణం: 2
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
కావాలంటే చూపిస్తా లే కండల్లో కసి
వద్దుంటున్నా వడ్డిస్తాలే కౌగట్లిలో రుచి
21st సెంచురీని నేనే కొట్టేస్తా
చంటి చిట్టి పొట్టి అంటే ముద్దే పెట్టేస్తా ఛీ పాడు
ఏ వీధి నాట్యాలలో నేను ఆడుతుననులే యు నాటి
నా చాటు కావ్యాలకే నే పాడుతుననులే హౌ సిల్లి
పత్రం పుష్పం శిల్పం తల్పం లూటీ చేస్తాలే

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ ఓ ఆహ ఆ..
అరే మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ఆహ్
అరె సిగ్గులు విడిచిన లంగరు సింగడు వీడే.. వేవ్వే వేవ్వే
దిక్కులు కట్టిన దేవుడు లొంగడు లేవే ... ఛీఛీ ఛీపో
అం భం భం మేడా రంభం నీదే కుంభం..  నాదే లాభం

జంగిలి జిమ జిమ జాకెట్ చిమ చిమ
సందడి గుమ గుమ సంగతి యమ యమ...  ఓ ఓ
మిస్సులు మిల మిల కిస్సులు కిల కిల
డ్రెస్సులు జల జల yes అని పద పద ఓ ... ఆహ్




కరిగిపోయాను కర్పూర వీణలా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా..
కలిసిపోయాక ఈ రెండు కన్నులా...

చరణం: 1
మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో...  ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ...  ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా

కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

చరణం: 2
అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా

కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా



కొట్టండి తిట్టండి పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా...

చరణం: 1
కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా...
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమా....
శృంగార వీధిల్లోనా షికారు చేసి
ఊరోళ్ల నోళ్ళలోనా పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారు కెక్కించి
మాటిస్తే వినుకోదు
లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు
ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలుపు చిలిపి పిలుపు కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

చరణం: 2
మళ్లీ మళ్లీ అంటుంది మారాముగా
ఒల్లోకి వోచి తాకుతుంది ప్రేమా..
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించేయ్ ఆ కాస్త ప్రేమా..

మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలు ఎన్నో మలాము వేసి
వయస్సుని వసంత మాడించే
మనస్సులో తుళ్ళింత పుట్టించే
చూపుల్తో శ్రుతి కాదు
మాటల్తో మతి రాదు
ముద్దుల్తో సరి కాదు
ముట్టందే చలి పోదు
ఈ మనసు మధన తనువు తపన కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...

మహా కసి గున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముద్దులో ముంచేసే ముద్దులే తడిపేసే కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పుట్టాక పోదండీ ప్రేమా...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి
కొయ్యండి చంపండి పిచ్చిండి నమ్మండి ప్రేమా..



సరిగమ పదనిస రసనసా పాట సాహిత్యం

 
చిత్రం: మరణ మృదంగం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 1
రెండు హృదయాల పిట్టపోరూ తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారూ గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలీ చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిళీ ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ

సిగ్గో చీనీలపండు 
బుగ్గో బత్తాయిపండు 
అల్లో నేరేడుపండు నాదీ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

చరణం: 2
వయసు వడగళ్ళ వాన నీరూ వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలీ నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడీ ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదూ అందచందాల ఆ పనీ
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుందీ
లబ్జు లబ్జు మోజు మీదా లంకే అంటోందీ

అబ్బొ నా బాయ్ ఫ్రెండు 
ముద్దిస్తె నోరు పండు 
వాటేస్తె ఒళ్ళుమండునమ్మా
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస

ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా

సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా

Palli Balakrishna Tuesday, August 29, 2017
Mugguru Monagallu (1994) Telugu Songs Lyrics Album Cover

Mugguru Monagallu (1994) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mugguru Monagallu (1994)
Banner : Anjana Productions
Music : Vidyasagar
Director : K. Raghavendra Rao
Producers : Nagababu, Pawan Kalyan
Actors : Chiranjeevi
Actresses : Ramya Krishna, Roja, Nagma
Release Date : 07 January 1994

Kottu Kottu Kobbarikaya Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Kottu Kottu Kobbarikaya' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Bhuvanachandra.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువన చంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందూ అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ అరె కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందూ అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసి కోనలోన కాటు వేయనా ఆ బుస్... - ఆ బుస్... కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందూ అ కొట్టు అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ... కసి కసి చూపు విరితూపు యమగుందే నీ షేపు సొగసుల ఊపు సెగనే రేపు పెట్టమాకు షోకు ఇక ఆపు నీ పిల్లాడి కైపు లేపుతుంది టాపు ఎదలో కైపు అందాలన్నీ అందామయ్యా తీరిగ్గానే తిందామయ్యా ఒడిలో లవ్ బడిలో చదివించేయనా వడిగా వడి వడిగా నడిపించేయనా అడి యమా యమా వెన్నెల్లోనా వెన్నా ముద్దా లాగించేసేయ్ నా ఆ బుస్... - ఆ బుస్... కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందూ అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ... చిరు చిరు గాటు పెడుతుంటే పుడుతుందోయ్ ఓ హీటు మగసిరి ఫీటు పడితే స్వీటు తెలియని చోట మగ వేటు తెలిపిందే ఓ రూటు తమకపు నైటు తకదిమి రైటు ఇచ్చాశాని తాంబూలాలు పెట్టిస్తాలే పేరంటాలు మధన మధవణిని మురిపించేసుకో లలన జతి రతినే మరిపించేసుకో అడి యబ్బో యబ్బా బువ్వల దెబ్బ ఏదో ఏదో ఐపోతాందయ్యో ఆ బుస్... - ఆ బుస్... కొట్టో కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందూ అ పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్లికి ముందూ ముద్దబంతి పువ్వా ముద్దులాడ నివ్వా రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా కసి కోనలోన కాటు వేయనా ఆ బుస్... - ఆ బుస్...

Aaja Aaja Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Aaja Aaja' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by Mano and K. S. Chithra. Lyrics are written by Bhuvanachandra.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
Singers : Mano, K. S. Chithra
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువన చంద్ర గానం: మనో, కె. ఎస్. చిత్ర ఆజా ఆజా టిప్ టాప్ రోజా లేజా లేజా లేతగుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్ ఆజా ఆజా టిప్ టాప్ రోజా లేజా లేజా లేతగుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ హే హే డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ అక్కడో ఇక్కడో ఎక్కడో రైడ్ చేసుకోన ఇప్పుడే ఇక్కడే గుట్టుగా రూటు చూసుకోర సిగ్గులేని లాఠి చెయ్యమంది లూటీ కోరుకున్నదాని వెన్నుమీటి ఆపవోయి లూటీ ఓపలేను బ్యూటీ కొంటె ఊయలూపి కుర్ర ధాటి తప్పదే - తప్పదే , ఒప్పుకో - ఒప్పుకో వాలుకళ్ళు మంజరి జోడు గుళ్ళ సుందరి ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా ఆజా ఆజా టిప్ టాప్ రోజా లేజా లేజా లేతగుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా మెత్తగా హత్తుకో కేసులే పెట్టుకోరాజ చంపకో ముద్దుతో ఛార్జ్ షీట్ నింపుతా ఆజా మోతగుంది బాబు మూత లేని బెల్లు తలుచు కుంటే చాలోయ్ జిల్ జిల్ కోడె వయసు డ్రిల్ నేర్చు కుంటే థ్రిల్ తాకనివ్వు పాప ఒళ్ళు ఒళ్ళు ఏందిరో - ఏందిరో, పిల్లడో - పిల్లడో ఈల కొట్టి వేసుకో సోకు చిక్కు చేసుకో ఆజా ఆజా టిప్ టాప్ రోజా లేజా లేజా లేతగుండె లేజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా ఆజా ఆజా కొండవీటి రాజా లెఫ్ట్ రైట్ మోగనివ్వు బాజా డే అండ్ నైట్ చేద్దాం లవ్ పూజా వన్ క్లాక్ చెయ్యపట్టి గన్ పట్టి కన్నుకొట్టి టూ ఓ క్లాక్ ముద్దు మీద ముద్దు పెట్టన త్రీ ఓ క్లాక్ ఒక్కసారి యూనిఫామ్ పక్కనెట్టి ఫోర్ ఓ క్లాక్, ఫైవ్ ఓ క్లాక్, సిక్స్ ఓ క్లాక్ డింగ్ డాంగ్

Chamanthi Puvva Puvva Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Chamanthi Puvva Puvva' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Bhuvanachandra.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువన చంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా చరణం: 1 సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్ నా చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా అడిగిందే చాలు గురుడా పెనవేయ్ నా కౌగిట్లో చేరి కళలే కలబొయ్ నా సుడిరేగుతోందే సుఖమైన జ్వాల మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో అబ్బాయి నాట్యమాడేస్తుంటే... అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమా... జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా చరణం: 2 సంపంగి మొగ్గ శృతిలో సవరించు అందాల బొమ్మ ఇదిగో అలరించు శృంగార వీణ సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు మరుమల్లె వేళ మదనాల గోల పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తోంటే హహహహా హత్తుకో అందగాడ మజాలే అందుకో చందురూడా జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

Nuvvokkasari Ante Okays Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Nuvvokkasari Ante Okays' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Bhuvanachandra.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువన చంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర హేయ్ పాపాస్... నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ సాదించుదాం సరిగమా చాలించరోయ్ హడావిడి చూద్దాము రేపో మాపో రావోస్ నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ లెఫ్ట్ చూసి రైట్ చూసి ఆచి ఆచి చూసి చూసి కొద్దిపాటి రిస్క్ తీసుకో పెదవిమీద సంతకాలు పెట్టుకో ముందు చూసి వెనక చూసి హైట్ చూసి వెయిట్ చూసి ఫస్ట్ నైటు ఫిక్స్ చేసుకో ప్రేమ మాయిదాలు ఫిక్స్ చేసుకో కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్ ఉయ్యాల లూగమంది కం కం కం కం కిల్లాడీ కన్నె సోకు రిం జిమ్ రిం జిమ్ ఉయ్యాల లూగమంది కం కం కం కం చలో చెలీ అనార్కళి అటుంది పూల పక్క ప్యారీ నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ దొంగ చాటు కిస్ కిస్ రేపుతోంది కస్సు కస్సు ఒప్పుకుంటే టంచనే కదా ఆ చిట్టి గుట్టు రట్టు చెయ్యవా ఒడ్డు ఒళ్ళు తగిలినాక వయసు పొంగులెత్తినాక ఊరుకుంటే ఏమి అందమే చీర జరుతుంటే ఎంత గంధమే ఏయ్ చమక్కు రేవులోన చం చం చం చం కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం చమక్కు రేవులోన చం చం చం చం కుహుక్కు కూకు కూకు చిం చిం చిం చిం ఎడాపెడా చెడామడా మోగించు వయసు బ్రహ్మచారి నువ్వొక్క సారి అంటే ఓకేస్ ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్ ఎట్టాగు చెప్పనయ్య ఓకేస్ పెట్టేయ్ ప్రస్తుతాన్కి కామాస్ సాదించుదాం సరిగమా చాలించరోయ్ హడావిడి చూద్దాము రేపో మాపో రావోస్

Rajashekara Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Rajashekara' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by S. Janaki and S. P. Balasubrahmanyam. Lyrics are written by Vennelakanti.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Vennelakanti
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వెన్నలకంటి గానం: ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా - ఓ సఖి చెలి చాటుగా తెర చాటుగ కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో... నడుమే అడిగే వగలే మధు పత్రాలతో... నలుగే పెరిగే చెరలే శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి కొంటెగా తొలి రాతిరి చలి మంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసెయ్యవా... సొగసే బిగిసే సుడిలో తెర తీసెయ్యవా... ఎదలో కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రేయిలో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి

Rara Swamy Rara Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Rara Swamy Rara' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Bhuvanachandra.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: భువన చంద్ర గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర తద్దిమ్ తక తదిమి తకిట తకజిం త జగదపోంగు తుడుగుడు తకదింత నును జజిగిన గిన జగనంత జగనంతక తగనంతక తగనుంతక కిటతగ జగనం తగనం తాకుమ్ తరిగిడ తక తాకిటతక తాకిటతక తద్దిన్న తాకిటతక తరిగిడ తరిగిడ థోమ్ తదితత్తాత్తాం రారా... స్వామి రారా... యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా స్వామి రారా... (7) రారా... స్వామి రారా... యదువంశ సుధాంబుధి చంద్ర స్వామి రారా శతకోటి మన్మధాకారా నారీజన మానస చోరా స్వామి రారా స్వామి రారా... రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు నా సిల్క్ చీరనడుగు - అడిగా ఈ పూల రైకనడుగు - అడిగా ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు రారా రారా గోపాలా రావే రావే మధుబాలా ధీంత నననం ధీంత నననం ధీంత నననం తానా నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా ధీంత నననం ధీంత నననం ధీంత నన ధిరధిర తానా రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ మ్మ్..నట్టువాంగం కోమలాంగం జోడు కడితే రాజా రేయి పవలై హాయి సెగలై రెచ్చిపో నా రాధ వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో అది ఏం మోహమో ఇది ఏం దాహమో ఆ...రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ బేల ఓ...గగ గరిగ గగ గరిగ గగ గరి సగరిగ సరిద కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే సస సనిద సస సనిద సస సని పదరిస సస పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే ఆ...కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే తనువుల కవ్వింపు తలగడకే ఇంపు వేసేయ్ తాలింపు కానీ లాలింపు ఓకే సుందరి జల్దీ రా మరి ఆ...రారా రారా గోపాలా నిన్నే కోరే ఈ వేళ అరెరెరె రావే రావే మధుబాలా విన్నా కన్నా నీ గోల నా సిల్క్ చీరనడుగు ఈ పూల రైకనడుగు నా సిల్క్ చీరనడుగు - అడిగా ఈ పూల రైకనడుగు ఇక అడిగినదడగను చూసేయ్ నా ఒడుపు

Ammante Song Lyrics in Telugu – Mugguru Monagallu (1994)

'Ammante' song from Mugguru Monagallu (1994) movie is composed by Vidyasagar and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Mugguru Monagallu (1994)
Music : Vidyasagar
Lyricist : Veturi
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వేటూరి గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఓ... ఓ... ఓ... అమ్మంటే మెరిసే మేఘం మ్మ్... మ్మ్... మ్మ్ నాన్నంటే నీలాకాశం మ్మ్... మ్మ్... మ్మ్ అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా నాన్నంటే నీలాకాశం తల వంచేనా నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరో ప్రాణం నువ్వే మా తారాదీపం పూజా పుష్పం ఓ... అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా నాన్నంటే నీలాకాశం తల వంచేనా శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామా కథా శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా బంధాలే భస్మాలు విధే కదా వింత కథ మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మ కథ బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైన బాధల్లో కన్నీరై చల్లార్చే గతేలేని గాధల్లో ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... చింతల్లో శీమంతం శిలలోనే సంగీతం శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం ఒక బ్రహ్మను కన్నావు అమ్మకి అమ్మైనావు శివవిష్నువులిద్దరినీ చీకటిలో కన్నావు ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... త్రిముర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default