-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijaya Lalitha"



చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి కొసరాజు, జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జానకి, విజయలక్ష్మి శర్మ 
నటీనటులు: కృష్ణం రాజు, జయంతి, పల్లవి, విజయ లలిత, రామకృష్ణ 
దర్శకత్వం: ప్రత్యగాత్మ 
నిర్మాత: ఏ.వి.సుబ్బారావు 
విడుదల తేది: 01.03.1979



Songs List:



ఏమౌతుంది ఇప్పుడేమౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఏమౌతుంది.... యిప్పు డేమౌతుంది
ఇటా ఇట్టిట్టా యిది ఎందాకా పోతుంది
అహ .... నాకు తెలీక అడుగుతాను
పిల్లగాడి రిమరిమలు
పులిహోర ఘమఘమలు.... పిల్లగాడి ....
పిల్లదాని చెక్కిళ్ళు
నా చెక్కర పొంగళ్ళూ.... పిల్లదాని....
ఆకేసి వడ్డిస్తా
అవుపోసన పడతావా.... ఆ కేసి....
అవుపోసన ఆనక చూద్దాం
ఆరగింపు మొదలెడతా
ఆరగింపు మొదలెడతా.... అవుపోసన....
గోవిందా గోవిందా
ఏందయ్యా ఆచార్లూ ఏం జరిగింది
అబ్బా చెయ్యి కడిగేశాడండీ
ఎట్టా యిప్పుడేమౌతుందయ్య
రావే అరకు రాణీ
నీకు చేస్తానే వలపు బోణీ
రారా నా రాజ నిమ్మలపండు
నిన్ను రమ్మంది నా తల్లో మల్లెచెండు రారా ....
పట్టా రాసిస్తావా కమలమ్మా నీ కమతం పట్టా...
అడగాలా రామయ్య నువ్వు అడగాలా
నన్ను అడగాలా
యీ కొండ్రంతా నీ సొంతం
ఈ కొండ్రంతా నీకే సొంతం
పోయిందయ్యో పోయింది
ఏంటా గోల
కమ్మలమ్మా పోయింది కమతమూ పోయిందీ

అహ యిప్పుడే మౌతుంది
మేడెత్తు ఎదిగావు కోడెగాడా
నీకే ఓటిచ్చుకుంటాను అందగాడా

వయ్యారి కమలమ్మా
వలపుల్లో గెలిపిస్తే
నిన్నేలు కుంటానే కుతితీరా

ఎన్నికలలో ఎందరెన్ని కలలోకన్నా ఎన్నికలలో :
ఏనాటికీ నువ్వే ప్రెసిడెంటువి
నా ప్రెసిడెంటువి.




అత్తకూతురా చిట్టి మరదలా పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హోయ్ హోయ్-హోయ్.
అత్తకూతురా చిట్టిమరదలా

కొత్త చీరలో నిన్ను చూస్తుంటే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
ఏదో అవుతాదే యెర్రెత్తి పోతాదే
హోయ్ మేనత్త కొడకా మీసాల బావా
కోడె గిత్తలా కుమ్ముకొస్తుంటే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
గుబులెత్తి పోతాదే గుండెగిరి పడతాదే
నీ చిలిపి కౌగిళ్ళే నా చలువ పందిళ్లు

నీ గుండె లోగిళ్ళే నా నూరేళ్ళ సిరులూ
నా వయసులోని బిగువు నీ అడుగులోని బరువు
చూసి చూసి కళ్ళు రెండు సోలి పోతున్నాయ్

కళ్ళంటే కళ్ళా అవికలువ పువ్వుల్లా -
కళ్ళంటే.....
వొళ్ళంటే వొళ్ళా అది దొంతు మల్లెల్లా
హాయ్.... హాయ్ - హాయ్

ఆ నడక చూస్తుంటే - నీ నడుము వూగుతుంటే
ఆ నడక ....
తిమ్మిరి తిమ్మిరి జింగిరి బింగిరి అవుతోందే పిల్లా
హేయ్ అత్తకూతురా !
కల్ల బొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అయ్య బాబోయ్
అల్లరి చేశావంటే పుట్టి నింటికె ఎల్లిపోతా
ఎల్లిపో
కల్లబొల్లి మాటలంటే కప్పచేత కరిపిస్తా
అల్లరి చేశావంటే పుట్టినింటికె ఎల్లిపోతా
తాళికట్టి నెత్తిమీద తలంబ్రాలు పోస్తా తాళికట్టి....
పల్లకీలో నీ పక్కన వూరేగుతు వస్తా
తిక్క రేగిందంటే 
ఏంటా పోర్సు
బుగమేట్లో దూకేస్తా
నిన్ను దాటి యేరుదాటి
దాటి దాటి
ఏం చేస్తావ్
నీకు సవితిని తెచ్చేస్తా
ఎట్టా - ఎట్టా
నిన్ను దాటి యేరు దాటి నీకు సవితిని తెచ్చేస్తా
నిన్ను దాటి....
నీకు సవితిని తెచ్చేస్తా
నీకు సవితిని తెచ్చేస్తా



ఇంటి ముందు ఈత చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: విజయలక్ష్మి శర్మ , యస్.పి.బాలు

ఇంటి ముందూ యీత సెట్టూ
ఇంటి ఎనకా తాడి సెట్టూ
ఇంటిముందూ ....

యీత పెట్టూ యిల్లు కాదూ
తాడి సెటూ తల్లి కాదూ
తగులు కోనోడే మొగుడౌతాడా
ఆచారీ — ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ - గుళ్ళో పూజారీ
అట్టాగా అట్టయితే యిదికూడా ఇనుమరి
ఆ....వూరి ముందర వుల్లితోట
వూరిబైట మల్లితోట
వుల్లి తల్లి అవుతుందా మల్లె
మందు కొస్తుందా....
మూడు ముళ్ళస్తేనే మొగుడౌతాడా!
చుక్కా ... చుక్కా .... చుక్కా
చల్లని గంధపు చెక్కా....ముద్దుల ముద్దుల
చుక్కా .... చుక్కా .... చుక్కా
తీయని కొబ్బరిముక్కాముక్కముక్కముక్క
హద్దు యిడిసిన ఆడదానికి పద్దులు రాసి
పెట్టడానికి .... హద్దు

మొగుడో మొద్దులో ఎవడో ఒకడుండాలి.
నాలాంటి వాడెవడో అండగా నిలవాలి
అయితే ఒక పని చేత్తా
ఏంటీ
పగటిపూట నా పక్కన బజారెంట వస్తావా ఆచారీ
కొంపలంటుకు పోతాయమ్మో --
ఆచారీ పూజారీ వూరి ముందర వుల్లితోట వూరి...
ఉల్లి తల్లి అవుతుందా మల్లె మందుకొస్తుందా
మూడు ముళ్ళేస్తేనే మొగుడౌతాడా.. చుక్కా - చుక్కా- చుక్కా
చల్లని గంధపు చెక్కా ముద్దుల ముద్దుల చుక్కా
తీయని కొబ్బరి ముక్కా
సల్ల సల్లగా పక్కన చేరి సరిగమలే -
వాయించుకుంటే అయ్యబాబోయ్
సల్ల సల్లగా పక్కన చేరి, సరిగమలే -
వాయించుతుంటే
పరువు మర్యాదా పందిరెక్కి కూచుందా
నడి బజారులో మాత్రం నామోషీ వచ్చిందా
అమ్మమ్మమ్మమ్మో తప్పు అంత మాటనకే
చుక్కా-చుక్కా-చుక్కా చల్లని గంధపు చెక్కా
ముద్దుల ముద్దల అబ్బ చుక్క
తీయని కొబ్బరి ముక్కా - - ఇంటిముందు

ఇంటి ముందూ యీత సెట్టూ ఇంటి వెనకా-
తాడి సెట్టూ
ఈత సెట్లూ ఇల్లుకాదూ తాడి సెట్టూ తల్లి కాదూ
తగులు కొన్నోడే మొగుడౌతాడా ఆచారీ - ఓ ఆచారీ
ముద్దుల ఆచారీ - - గుళ్ళో పూజారీ --

ఊరు పేరూ ఉన్నవాణ్ణి ప్రెసిడెంటుకి కుడిభుజాన్ని
హోయ్ : ఊరూ పేరూ....
కొండమీద కోతినైనా తెప్పించే గొప్పోణ్ణి
గుడిలో దేముడికే నామం పెట్టేవోణ్ణి...
కొండమీద
ఆ యింకా చెప్పనా మన గొప్ప....
పేరు గొప్ప ఊరు దిబ్బ ఆపవయ్య సొంతడబ్బా -
ఆశారీ... ఓ ఆశారీ .... ముద్దుల ఆచారీ ....
ఆశారీ.... ఆశారీ - పూజారీ 

యింటి ముందూ ఈత సెట్టూ
యింటి వెనకా తాడి సెటూ
ఈత సెట్టూ ఇల్లు కాదూ తాడి సెట్టూ తల్లికాదు
తగులుకున్నోడే మొగుడౌతాడా ఆచారీ ఓ ఆచారీ 
ముద్దుల ఆచారీ....గుళ్ళో పూజారీ




నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.జానకి

నిమ్మచెట్టుకు నిచ్చేనేసి నిమ్మపళ్ళు కొయ్యబోతే
నిమ్మముళ్లు రోమ్మునాటెనురా. హాయ్ హాయ్ హాయ్ హాయ్

నిమ్మముళ్ళు రొమ్ము నాటెనురా ఓ రందగాడా
సన్న రైక సగం చిరెగెనురా
రెకెందుకు చిరిగిందని
కొప్పెందుకు చెదిరిందని రై కెందుకూ........
అత్తముందూ అంద రడిగితే
ఆ - అడిగితే ఏమైందట 
ఆ - చెప్పడాని కేముందిరా
ఆ - చెప్పడానికేముందిరా
ఓరందగాడా - సిగ్గు ముంచుకొస్తుందిరోయ్.. నిమ్మచెట్టుకు..

చెలమయ్యా చేనుకాడ నిన్ను తలచుకుంటూ కూచునుండే
చెలమయ్యా చేను ....
ఈల వేసి.... నన్ను పిలిచి చెంగుపట్టి లాగావనీ
వూరు నోరు.... వూరు నోరూ చేసుకొందిరా
వూరు నోరు చేసుకొందిరా ఓ రందగాడా
తూరుపార పట్టిందిరా హాయ్ .... హాయ్..... నిమ్మచెట్టుకు...
మావ కొడకా వస్తావని
మంచమేసి కాసుకుంటే మావకొడకా....

ఇంటిపక్క ఎంకటేసు
చెమ్మ చెక్కలాడి ఆడి ఆడి ఆడి
అబ్బా ఎవరితోటి చెప్పుకుందురా ఎవరితోటి
ఓ రండగాడ యీది పాలు చేశావురో నిమ్మచెట్టుకు



తొలిసారి మొగ్గేసింది పాట సాహిత్యం

 
చిత్రం: కమలమ్మ కమతం (1979)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తొలిసారి మొగేసింది సిగ్గూ -పాడుసిగ్గు తొలిసారి..
ఆ సిగ్గే మొగై పిండై కాయై సండై అమ్మో
కోకకొత్త బరువేసింది రైక కాస్త బిగు వేసింది
కోకకొత్త ....
ఆ సూపే సిటుకూ సిటుకూ గుండెలో దరువేసింది

నాకు సిగ్గేసింది.... తొలిసారి మొగ్గేసింది .......

కొత్తగా చూసిందేముంది సరికొత్తగా చూడని
దేముంది కొత్తగా

చూపూ చూపూ కలిసింది. అది చుట్టరికం —
కలిపేసింది. చూపూ చూపూ....
నీ చూపుల రాపిడిలో సిగ్గుకే సిగ్గేసింది..
సిగ్గే మొగ్గేసింది.....
తొలిసారి మొగ్గేసింది సిగ్గుః పాడు సిగ్గుః ....

దాచినా దోచని దేముంది
నువ్వు దోచితే దొరకని దేముంది, దాచినా
గువ్వకు గువ్వే దొరికింది
తన గుండె గూడుగా మలచింది
తొలిరాతిరి తెలారగానే

నెలవంక కనిపించింది.
నెల యింక తప్పిస్తుంది..
తొలిసారి మొగ్గేసింది
ఎనక జన్మ ఒక పులకింత
అది తలుచుకుంటే గిలి ఒళ్ళంత.... ఎనక జన్మ....
ముందు జన్మ తెలియని వింత
అది వుందో లేదో తేలన చింత ముందుజన్మ....
ఈ జన్మల వూసులు వింటే ఎందుకో నవొచ్చింది
తొలిసారి మొగ్గేసింది సిగ్గూ.... పాడు సిగూ....

Palli Balakrishna Monday, October 30, 2023



చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, కాంతారావు, ప్రభాకరరెడ్డి, రాజబాబు, శారద, సావిత్రి, విజయలలిత, రమాప్రభ
దర్శకత్వం: సి. ఎస్. రావు 
నిర్మాణసంస్థ: లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 09.08.1974



Songs List:



అంబా శాంభవీ (శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మూలం: శ్రీ రాజరాజేశ్వరి అష్టకం
గానం: ఘంటసాల

అంబా శాంభవీ చంద్రమౌళిరవళ అపర్ణ (శ్లోకం) 




ఇదిగిదిగో తీపి కల్లురా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

ఇదిగిదిగో తీపి కల్లురా ఏసుకోరా జోరైన యీత



ఏనాటి వరమో పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

ఏనాటి వరమో ఏనోము ఫలమో ఎనలేని ప్రేమ విడలేని




తాతలు ముత్తాతలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: యు. విశ్వేశ్వరరావు
గానం: యస్.పి. బాలు బృందం

తాతలు ముత్తాతలు తాతలు తాగిన



నీ రూపం నా హృదయంలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

నీ రూపం నా హృదయంలో నిరతము నిలిపేనా



వారానికి ఏడు రోజులు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని




సొమ్ముకరిది సోకొకరిదీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడంబరాలు అనుభందాలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్. జానకి

సొమ్ముకరిది సోకొకరిదీ కమ్మని కైపుల సుఖమెవరిదీ 

Palli Balakrishna Saturday, June 10, 2023



చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు రాఘవయ్య, శ్రీ శ్రీ 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు, జిక్కి (పి.జి. కృష్ణవేణి), పిఠాపురం నాగేశ్వరరావు , జోసఫ్ 
నటీనటులు: కృష్ణ, చంద్రకళ, విజయలలిత 
దర్శకత్వం: పి. సాంబశివరావు 
నిర్మాత: యం. నాగేశ్వరరావు 
విడుదల తేది: 19.04.1974


(కృష్ణ నటించిన 99 వ సినిమా)




Songs List:



శివశివ అంటావు తుమ్మెదా పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

శివశివ అంటావు తుమ్మెదా



ఓహోహో చిన్నవాడా విన్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. సుశీల 

ఓహోహో చిన్నవాడా విన్నావా



ఎవరో ఎవరో పిలిచారే పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

ఎవరో ఎవరో పిలిచారే




మనసు నిలవదు ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం నాగేశ్వరరావు 

మనసు నిలవదు ప్రియతమా




అన్నీ చదివిన అన్నలారా పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి), జోసెఫ్ 

అన్నీ చదివిన అన్నలారా



కళ్ళలో కైపుంది పాట సాహిత్యం

 
చిత్రం: ఉత్తమ ఇల్లాలు (1974)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

కళ్ళలో కైపుంది

Palli Balakrishna



చిత్రం: మమత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, అప్పలా చార్య 
గానం: పి. సుశీల, వి. రామక్రిష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, బి. వసంత , జి. ఆనంద్ 
నటీనటులు: కృష్ణ , జమున కృష్ణం రాజు, చంద్రమోహన్, విజయలలిత, హేమలత, రమాప్రభ, బేబీ శ్రీదేవి 
మాటలు: పినిశెట్టి, అప్పలా చార్య
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
కథ, నిర్మాత: కె. సి. శేఖర్ 
విడుదల తేది: 06.01.1973



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna Wednesday, December 7, 2022



చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, దాశరథి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, రమోలా, ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , విజయలలిత 
సంభాషణలు: ఆరుద్ర 
నిర్మాత, దర్శకత్వం: యస్. జానకి రామ్ 
విడుదల తేది: 04.08.1972



Songs List:



ఇదిగో వయసు రెప రెపలాడింది పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఇదిగో వయసు రెప రెపలాడింది



చూడగానే కైపెక్కించే చుక్కనురా పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

చూడగానే కైపెక్కించే చుక్కనురా 



నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు 

నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె



బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు, రమోల 

బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ



సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే వస్తా కవ్వించే పిల్లనోయి



పదరా బాటసారి పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

పదరా బాటసారి కనరా బతుకుదారి




హె హె చుక్కా ఏసాలే చుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: నిజం నిరూపిస్తా (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

హె హె చుక్కా ఏసాలే చుక్కా చూపించు నిషా 

Palli Balakrishna



చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి 
దర్శకత్వం: పి. సాంబశివ రావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు 
విడుదల తేది: 22.06.1973



Songs List:



పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

పిల్లా పాపల చల్లనిగూడు 
చెల్లా చెదురై పోయెను నేడు
ఒకరిది నేరం - ఒకరికిభారం 
జీవిత నావకు లేదా తీరం
ఏమైపోవునొ ఈ సంసారం

చరణం: 1
మంచిని మెచ్చే మనిషే లేడు 
మచ్చను చూపును ప్రతివాడు
ఇన్ని తరాల యింటి గౌరవం 
ఒక్క నిందతో మంటగలిసెరా

చరణం: 2
కన్నీళ్ళైనా కషాలెనా 
అన్నిభరించే అమ్మవు నీవు
పిల్లలకోసం జీవించాలి
నిండుకుటుంబం నిలపాలి

చరణం: 3
పసిహృదయానికి తగిలెను గాయం
యెవ్వరులేరు నీకుసహాయం 
వయసుకుమించిన పంతంతో 
పయనించే ఓ పసివాడా
విజయం నీదే నీదేరా !




నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ 

యువతరం
నవతరం
నవనవలా దే - నవతరం
ఉరకలువేసే - యువతరం
మనలా అవడం - యెవరితరం
యువతరం
నవతరం

చరణం: 1
ముందు ముందుకు సాగిపోయే
యువకులం మేము
స్వేచ్ఛకోసం పోరుసలిపే
యువతులం మేము
యెవ రేమం టె నేమి - యేపేరు పెడితేనేమి
మనమూ మనమూ యేకమైతే మార్పుసాధిస్తాం

చరణం: 2
ఆటలందూ దోరవయసు
తొంగిచూడాలి
పాటలందూ కొంటె మనసు
పొంగిపోవాలి
చేయీ చేయీ కలిపి
సరదాల తేలి తేలి
పాతకాలం రోతలన్నీ - మరిపించెయ్యాలి

చరణం: 3
యవ్వనమే అందరికీ వఠములాంటిది
నవ్వులతో గడపడమే మనకు మంచిది 
వడివడిగా నీటిలోనే బోటు షికారు
లోతు లోతు కెళుతుంటే భలే హుషారు 
ఛల్ ఛల్ ఛల్ ఛల్ బోటు షికారు 
జిల్ జిల్ జిల్ జిల్ భలే హుషారు 
జంటలుగా వలపుమజా రుచిచూడాలి




తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

తళ తళ తళ తళ మెరుపే మెరిసిందీ 
జల జల జల జల జ లేకురిసింది
ఏంచేయాలీ - అబ్బా! ఏంచేయాలీ

మిల మిల మిల కళే మెరిసినవీ
గుబ గుబ గుబ గుబ గుబులేరేగినది
ఏంచేయాలి - అబ్బా ! ఏంచేయాలి 

చరణం: 1
ఏదో చెయ్మని వయసంటే
ఏల తొందరని మనసంటుంది 
మనసుకు వయసుకు మధ్యనచిక్కి 
సొగసే ఉసూరు మంటుంది

చరణం: 2
వెచ్చని జతగా నువ్వున్నావని 
చలి నన్నెంతో మెలివేస్తుంది 
దుడుకుగ దూకే తోడున్నావని 
వలపే వరదై వంచేస్తుంది 

చరణం: 3
ఎత్తూ పల్లా లేకంచేసే
చీకటి ఎంతో బాగుంటుంది
చేయీ చేయిగ యిద్దరముంటే
చీకిటి వెచ్చని వెలుగౌతుంది




అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

అవలీలగ శ్రీరాముడు 
శివధనువును విరిచినంత
చిత్తము పొంగన్
నవ సుమ మాలను చేకొని
అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్ 
అందమునకె అందమైన సీతమ్మను
ప్రేమమీద చూచె రామమూర్తి
వీరవరుల కెల్ల వీరుడా రాముని
సంతసమున కాంచే జనక జాత
కొంత పులకరింత కొంత చక్కలిగింత 
అతని చూచినంత అదొక వింత 
పూలమాలతోడ - బాలనిండు మనమ్ము 
స్వామి కంఠసీమ వ్రాలిపోయె 




ఎవరు కారణము పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కె.హరిరావు 

ఎవరు కారణము
ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు
ఎవరు కారణము
ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు 
ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు 
దేవుడు పాపం అలోచించాడు 
మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు

సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని
చేశాడు రెండుగా దానిని
తెల్లనిదే  మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు


అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు
మంచిని నేను
మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను 
మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను 
ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను 
రావమ్మా | రావమ్మా ! మా మంచి 
ఏమి తెచ్చావు మాకు దీనినించి 
చీకటి పోగొడతాను
మీలో చీలికలన్నీ మాన్పుతాను 
అందరి నొకటిగ చేస్తాను. 
ఆనందం-అందం-అందిస్తాను 
సమతా-మమతా పండిస్తాను 
శాంతి- సౌఖ్యం-పంచేస్తాను
ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం 
మీలోకంలో స్థాపిస్తాను.

నేను నేనే
నేను నేననే అహం నేనే
నాది నాదనే స్వార్ధం నేనే
బలే బలే నువ్వేకావాలి
పక్కవాడిని తొ క్కెయ్యాలి
గొంతు పిసికి పారెయ్యాలి!
గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి!

అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను 
ధర్మాన్ని ఉరి కెక్కిసాను 
అధర్మాని కే పట్టం కడతాను
రాజకీయ రాక్షసి నా రూపం 
రాపిడి దోపిడి నా రాజ్యం 
ఫిరంగి నాకు మృదంగము 
ప్రేతభూమి నా నాట్యరంగము

మీరే, మీరే |
ఎవరికివారే కారణము
ఈ మంచి వున్నది మీలో నే
ఈ చెడ వున్నదీ మీలోనే 
మంచిని మీలో పెంచుకోవాలి
చెడునుదాంతో గెలుచుకోవాలి
ఈ జగతి స్వర్గం చేసుకోవాలి




ఈవేళ పాడేటి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల

ఈవేళ పాడేటి పాటా
నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా 
ఏ నాటికీ
ముమ్మూలకీ

చరణం: 1
మనసుంది. మన లేవు నీవూ
తనువుంది కనరాను నేనూ
చిరుగాలి నేనూ- తెరచాప నీవూ
యేనాడు చేరేము రేవూ

చరణం: 2
మన కేసిపోయేను హృదయం
చేజారిపోనీకు సమయం
మనవింత స్నేహం వెలిగించుదీపం 
తొలగించు నీపైన  శాపం

Palli Balakrishna Tuesday, December 6, 2022



చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి, ప్రయాగ, బి. విజయ రత్నం, సి.ఆర్.స్వామి 
గానం: పి.సుశీల, యస్. జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ, విజయ లలిత, కృష్ణం రాజు, కుమారి శ్రీదేవి 
మాటలు: బి.విజయ రత్నం 
దర్శకత్వం: బి.హరినారాయణ 
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత: శ్రీ బి. వి. కృష్ణ మూర్తి 
విడుదల తేది: 06.04.1972



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



ఎగాదిగా చూస్తావు ఏమయా పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: ప్రయాగ
గానం: యస్. జానకి 

ఆ... అమ్మదొంగ 
ఎగాదిగా చూస్తావు ఏమయా 



నన్నే తెలుసుకో తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి
గానం: యస్. జానకి 

నన్నే తెలుసుకో తెలుసుకో 



ఈ నిషా రేయిలోన పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: బి. విజయ రత్నం 
గానం: పి. సుశీల

ఈ నిషా రేయిలోన 




మగువే ఓ నిషా రా పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: సి.ఆర్.స్వామి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

మగువే ఓ నిషా రా 



చెలిమి పంచుకునే వెలయే పాట సాహిత్యం

 
చిత్రం: రాజమహల్ (1972)
సంగీతం: టి. వి. రాజు 
సాహిత్యం: దాశరథి
గానం: యస్. జానకి 

చెలిమి పంచుకునే వెలయే

Palli Balakrishna

Most Recent

Default