-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tapi Chanakya"



చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: నార్ల చిరంజీవి, అప్పలా చార్య, కొనకళ్ల వెంకటరత్నం, బి. వి. నరసింహారావు
గానం: మోహన్ రాజు, చిత్తరంజన్, విజయలక్ష్మీ శర్మ, రామలక్ష్మి, పుష్పలతా శ్యామ్యూల్
నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, బేబీ శ్రీదేవి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: సి. వి. ఆర్.ప్రసాద్
విడుదల తేది: 12.03.1970



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Songs List:



విధి విలాసమేలే పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా 

విధి విలాసమేలే 
అంతా విధి విలాసమేన
అది బలీయమేలే
దాని వేగమాగదులే

భయము ఎందుకు? - భయము ఎందుకు?
నడువు ముందుకు
కాలానికి హృదయం లేదు - కన్నీటికి విలువేలేదు! 
జరిగేదేదో జరగకపోదు- జగతిని నడిపే దెవంకలదు!! 
మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష 
చనిపోదామని నీవనుకున్నా - చావుకు నీపై దయయే రాదు 
మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష !! 



వల్లరి బాబోయ్ కావురోరయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: చిత్తరంజన్, రామలక్ష్మి

వల్లారి బాబోయ్ కావురోరయ్యా ! - జరుగు జరుగుమన్నా! 
నే జరగలేనన్నా ! - కొండకి పోవాల! పువ్వులు తేవాల!
నంది వాహనా గజాననా -మూషిక వాహన గజాననా
భాయీ భాయీ గజాననా! పార్వతి నందన గజాననా! 
మాపిటేలకీ సరాసరీ ! - తోపు సేలకీ వత్తావా ! హై! 
కంచె సాటునా కూకోనీ - మంచి చెడ్డా ఇంటావా? అహ 
కూకోమంటే ఎట్టయ్యో - కూడు కూరా నండద్దా (మరి) 
అయ్యో రామ ఏందయ్యో - ఆనకమళ్ళా రావయ్యో ! 
అయ్యో రామ -- అమ్మా కామాక్షమ్మ తిరుణాళ్లంటా ఆ.. ఆ.. 
ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ - మా ఇంటో అందరు ఎల్తారంటా 
ఒంటిగ నన్నే వుంచేరంటా!
అయితే ఇంకేం! అయిసరబజ్జా !
అదును దొరికింది అడ్డు సెప్పకా - ఆయారకి నేనాడికి వస్తా!!




ముసురేసిందంటే పైన పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: చిత్తూరు వి. నాగయ్య 

మునుచేసిందంటే పైన - అసలే మతిపోతది పిల్లా ! 
ససి చెడినటుంటది లోలోన - ఓ చక్కని చుక్కా ! 
ససి చెడినటుంటది లోలోన -
ముసురేసిందంటే పైన అసలే మతి పోతది మావా ! 
ససి చెడినట్లుంటది లోలోన ఓ ముద్దుల మావా !
పసి చెడినట్లుంటది లోలోన

మబ్బుతెరల మసకలలోన మంచుపొగల మెలికలలోన 
మనసేటో సిక్కడినట్లే - మనేద కుదిపేస్తది లోని
పసుపాడిన పెరులె నడుమా - పడగెత్తిన సన్ననితోవ 
నువు మసిలే చెలకలవంకే - నురగలు కక్కే నది యేమో
కోవెల చిరుగంటలు చెవిలో- కావాలని కత కలిపించీ, 
మన యిద్దరినీ మురిపిస్తె మరులు గొలిపి తెగబులిపిస్తె
ఏటి మలుపులో ధనసలే - తోట వొడలు విరిచిన వేళ
ఆ నాటి మన పరాసికాలు నవ్వుతాళె అంటది మెరుపు





ఆగవోయి ఒకసారి పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొనకళ్ల వెంకటరత్నం
గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ

ఆగవోయి ఒకసారీ - వెళ్ళిపోకు వేసారీ
కనిపించినదే నిజమనుకుంటే - విధి శాపానికి బలియౌతావు
విధి విలాస మేలే—అంతా విధి విలాస మేలే
అది బలీయమేలే-దాని వేగ మాగదులే
తిరిగి చూడవోయి వెను తిరిగి చూడవోయీ
నీ వెనుకే నీ నీడ వున్నదోయీ
సీతారాములు విడిపోలేదా ?
విధి ఎవరిని విడిచినదోయీ -
నలుడే దాస్యము చేసెను కాదా? 
అది చెప్పిన కధలెన్నో వున్నాయి.
నొసటిరాతలు సరిగావుంటే - 
మనసు కోతలు మనుషులకుండవు 
కాలం ఎదురై నిలిచిందంటే కల్లే నిజమె కనబడుతుంది.




కృష్ణా కృష్ణా నా రాధ ఇలా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ

కృష్ణా! కృష్ణా! కృష్ణా! 
నా రాత ఇలా, నలుగురిలో - సవ్వల పాలేనా? 
కలత లేని వలపులో మెలకువు గొరిగినవాడు
కానరాడు.నా పై, తన కలలనిన నడు
లోకానికి వింత నాలోగల వలపంతాం
ఏక దాగినావో అని ఎకెడ వెదకుదు నేను. 
ఎచట దాచితివే దొరవని - ఎల్లరు నన్నడిగేరు 
ఏడ కెగినావో మరి - ఏడ కెగినావో !
సరససున్న వేళ నా దౌర, నేనొకటని పొగరు
జాడ తెలియదాయె ఇక రాడని ఒక టే జెదుగు - ఏక మనసు కోత
ఒక ఏటికి ఎదురీత! కృష్ణా! కృష్ణా!!




బరువైనది రేయి పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: చిత్తూరు వి.నాగయ్య 

బరువైనదీ రేయీ కరువైనదీ హాయీ
కనుమూయలేను శిలనైన కాను!! 
విను వీధి నేలే రాజా ! నా రాజు ఏడీ ? 
కనిపించితే నా గాధా వినుపించుతావా ?
వివరించు బాల గమనించలేవా

ఏమేమో ఊహాగానం చేశాను నాలో
నా పాట ముగి సేలోగా-చెయిజారే వీణ
వీణ తునక  ఒకటే
నే దాచుకున్నా

మనలేని మమకారంతో వెదికాను లోకం
ఎటు పోయినావో ఏమో - మిగిలింది శోకం!
మిగిలింది శోకం! - బ్రతికాను
నా బాబు కోసం





అయ్యయ్యో వంటరిదాన్ని రా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: విజయలక్ష్మీ శర్మ

అయ్యయో వొంటరిదానర ఓ మావో
రారా వోఁ మావో
జంటగా వొస్తివ మంచిది 
అత్తకొడుకు ఊరెళ్ళాడు
ఆరు నెలలదాకా రాడు
ముసలత్తకు రేజీకటిరో
అబ్బబ్బ - ఈ వెన్నెల రేయి అయ్యయో
మత్తు మత్తుగా కళ్ళున్నాయి 
గమ్మత్తులు చేస్తున్నాయి. 
పూసిన గంధం ఆరింది. 
వేసిన పూవులు వాడాయి. 
వెన్నెల వేడిగా మారింది. 
యౌవన రుచి చూపిస్తా 
అరచేతికి స్వర్గం తెస్తా 
కోరినదంతా ఇస్తారో 
గుండె గుండె రగిలిస్తాను
తోడులేక ఎద కాలింది.





గాంధీ కి పెద్ద గుడి కడదాం పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: చిత్తరంజన్

గాంధీకి పెద్దగుడి కడతాం కడతాం 
కాన్కలూ చందాలు పడతాం పడతాం. 
ప్రజల కె మేము పుడతాం గిడతాం 
బహు తెల్ల టోపీలు పెడతాం పెడతాం 
శ్రీ గాంధీ నామాలు మరువాం మరువాం 
చందాలు ఇవ్వంది వదలాం కదలాం 
సిమెంటు బదులుగ బూడిద కలిపాం
కట్టకముందే, ఇంతెన కూలింది 
ఆ వంతెన కూలిందీ.
లంచాలిచ్చీ మంచాల్ వాల్చీ

లక్షలు లక్షలు సంపాదించాం తెగ సంపాదించాం 
ఎగుమతి దిగుమతి ఎక్స్పర్ట్ లమని
కలితీ పండిట్' బిరుదంయిచ్చారు.
దొడ్డ బిరుదంపట్టాము.

ఉడతా భక్తిగ మిము సేవింపగా 
ఉరుకున పరుగున పడి వొచ్చామండి 
జై కొట్టిమూర్ఖుల్ని రెచ్చ గొడుతుంటాము 
చందాల్ని కాజేసి మేడలను కడతాము 
లాడ్జీలు క్లబ్బులూ నడుపుతూ వుంటాము 
రౌడీల్ని గూండాల్ని మేపుతూవుంటాము 
దారి తప్పిన స్త్రీల బిజినెస్సు పెట్టాము 
దండిగా మొండిగా లక్షలార్జించాము 
మీ రక్తమును-ప్రజలారా

మీ రక్తమును మేము దానమిస్తుంటాము 
మిము గొల్వ వచ్చాము ఘన దేశ భక్తులం ! 
చిల్లర మంత్రికి చెల్లెలి కొడుకుని 
ఎస్సెల్సీలో ఏడేళ్లున్నా !
ఎమ్మెల్యేకొక ఆఫరు వుంది
లక్షల కట్నం బేరం వుంది! 
కాలక్షేపం కలిసొస్తుందని
ఈ విరాళాలు వేటకు వొచ్చా !
ఎప్పటికైనా మంత్రిని అవుతా
ఇప్పటినించే చందాలివ్వండి! 
భోంచేస్తుంటాను

ఎందుకయ్యా వొచ్చినావు? ఓ గాంధీ నీవు 
ఎవరి కొంపా కూల్చుతావు ఓ గాంధీ !! 
చచ్చి స్వర్గాన్నుండలేవా? ఓ గాంధీ మాకు 
చిచ్చు పెట్టగ వొచ్చినావా ఓ గాంధీ ! 
తాడి చెట్టంతగుడి తక్షణం కట్టించి 
నిలువెత్తు నీ బొమ్మ నీటుగా పెట్టించి 
రాళ్ళ రప్పల పైన రాయిస్తు నీ పేరు 
నిత్య నైవేద్యాలు నీకె పెట్టిస్తురా ! 
శాంతి శాంతంటాపు సత్యమంటావు 
హింస వొద్దంటావు ఎందుకొచ్చిన ఖర్మ ? 
మంత్రాలతో చింతకాయలి క ఠాలవు 
మా మాటవిని మనసు మార్చుకొని వెళ్ళిపో 
మా పొట్టపై దెబ్బ కొట్టొద్దు కొట్టొద్దు 
మా బ్రతుకు తెరువుల్ని పాడు చేయొద్దు 
వచ్చినా దోవనె మళ్లి తిరిగెళ్ళిపో 
వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో !



ఆగండి దేశ ద్రోహులారా పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: 
గానం: 

ఆగండి! దేశద్రోహులారా! ఆగండి! 
బాపూజీ జిందాబాద్ ఇన్క్వి లాబ్ జిందాబాద్
చాలు చాలు మీ ఆగడాలు ఆపండి
మహాత్ముని మాటలు మరుచుట తగదండీ
భారత జాతికి జీవంపోసి- బానిస బ్రతుకులు బాపిన దైవం 
బాపూజీ మన బాపూజీ జిందాబాద్

మానవులందరు ఒక్కటస్ మంచిని మదిలో పెంచమనీ 
దేశంకోసం బ్రతకమనీ - బోధించెను మన బాపూజీ 
బాపూజీ మన బాపూజీ జిందాబాద్.
సోమరితనమును మానాలి - శాంతి అహింసలు స్థాపించాలి. 
ప్రగతి పథములో నడవాలి ప్రతిమనిషీ హాయిగా బ్రతకాలి 
అపుడే భారతభూమికి క్రాంతి- అపుడే గాంధీ ఆత్మకు శాంతీ
శాంతి, శాంతి, శాంతి.




మంచివాళ్ళు ఈ బాబులు పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: బి. వి. నరసింహారావు
గానం: విజయలక్ష్మీ శర్మ, పుష్పలతా శ్యామ్యూల్

మంచివాళ్ళు యీ బాబులు 
మా మంచి వాళ్ళు యీ అమ్మలు
రంగు రంగుల బుడగలు కొంటారూ.
పిల్లలకిచ్చీ మురిపిస్తారూ-చల్లగ మురిపిస్తారూ! 
ఇల పసి పాపలె పరమాత్మలన్నారు 
ఈ యింటికి బంగరు దీపాలన్నారు. 
పిన్నా పెద్దలు మెచ్చే బుడగలు 
వన్నె చిన్నెల వెన్నెల ముద్దలు లాలాలా

పాల బుగ్గల బాలలకిస్తే పకపక నవ్వులు కురిపిస్తారూ 
అల్లరిచేసే పిల్లల కిస్తే అల్లరి గిల్లరి జాన్తానై - లా లా లా 
కల్లాకపటం తెలియని పాపలు-అల్లీ బిల్లీ యని తిరిగేరూ 
కొట్టుకున్ననూ తిట్టుకున్ననూ ఇట్టే కలిసి ఒక కై పోతారు. లాలాలా
గుళ్లో దేవుడు గుడికే అందం ఊళ్లో పిల్లలు ఊరికే అందం 
అందంచందం తెలిసిన పెద్దలు అన్నీ మాపిల్లల కే యిస్తారు. 
పిల్లలకే యిస్తారు – లా లా లా




విధి విలాసమేలే పాట సాహిత్యం

 
చిత్రం: విధి విలాసం (1970)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల
గానం: కె.బి. కె.మోహన్ రాజా 

విధి విలాస మేలే అంతా విధి విలాస మేలే
అది బలీయమేలే - దాని 'వేగ మాగదులే
అనుబంధానికి ఆవేదనకూ కనిపించని ఒక సంకెల వుంది 
ఆవేదన వలదనుకుంటె అనుబంధానికి అర్థం లేదు!
చీకటిలోనే వెలుగు పుట్టును - చింతనలోనే దొరుకును సుఖమూ 
ఆశ నిరాశల కలగలుపే ఈ మానవ జీవిత మోతుంది !!

Palli Balakrishna Friday, December 17, 2021





చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
నటీనటులు: యన్.టి.రామరావు, సావిత్రి, హరనాథ్, గిరిజ
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: వై.రామకృష్ణ ప్రసాద్, సి.వి.ఆర్.ప్రసాద్
విడుదల తేది: 08.09.1961



Songs List:



గణనాధుని పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల

గణనాధుని 





వీరాధి వీరులకే పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల

వీరాధి వీరులకే



ముద్దబంతి పూలు పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
పల్లవి:
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా..
చిట్టెమ్మా..
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా..
చెప్పమ్మా..

ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా

అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
వయసు ఉంది..
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా
కిట్టయ్యా..
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా..

అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

చరణం: 1
పుట్టింటి అరణాలూ..ఊ.. ఘనమైన కట్నాలూ..ఊ..హోయ్.. ఓ..
పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు.. అత్తవారి ఇంటినిండా వేసినా
అవి అభిమానమంత విలువ జేతునా..ఆ.. అభిమానమంత విలువ జేతునా
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అభిమానం ఆభరణం మర్యాదే భూషణం.. గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనం చెప్పుకోను వీలయా.. గొప్పతనం చెప్పుకోను వీలయా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

చరణం: 2
కాలు చేయి లోపమనీ..ఈ.. కొక్కిరాయి రూపమనీ..ఈ..
కాలు చేయి లోపమని కొక్కిరాయి రూపమని.. వదినలు నన్ను గేలిచేతురా
పిల్లని తెచ్చి పెళ్ళిజేతురా..ఆ.. పిల్లని తెచ్చి పెళ్ళి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి..
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి.. నవ్విన నాప చేనే పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా..ఆ.. నలుగురు మెచ్చు రోజు ఉండదా
అద్దమంటి మనసు ఉంది అందమైనా వయసు ఉంది
ఇంతకన్న ఉండేదేంటి కిట్టయ్యా.. ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి
హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా





కలసి ఉంటే కలదు సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల

కలసి ఉంటే కలదు సుఖం




మేలిమి బంగారు పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల

మేలిమి బంగారు



ఆటల తీరులు పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జమునా రాణి, సత్యారావు

ఆటల తీరులు





నా వరాల తండ్రీ పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

నా వరాల తండ్రీ





ఒక తల్లికి పాట సాహిత్యం

 
చిత్రం: కలసి ఉంటే కలదు సుఖం (1961)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, సుశీల

ఒక తల్లికి


Palli Balakrishna Saturday, July 24, 2021





చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: నాగేశ్వర రావు , షావుకారు జానకి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: C.V.R.ప్రసాద్
విడుదల తేది: 14.04.1955



Songs List:



ఓలియో ఓలి ఓలియో ఓలి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

ఓలియో ఓలి ఓలియో ఓలి




ఇదియే హాయి కలుపుము పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ

ఇదియే హాయి కలుపుము 



ఏరువాక సాగారో అన్నో చిన్నన్న పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం:  జిక్కీ

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కల్ల కపటం కానని వాడ
లోకం పోకడం తెలియని వాడ
కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని
నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె
పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పోటేరును కరి జూచి పన్ను కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో
హై హై హై హై.
రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పల్లెటూళ్లలో చల్లనివాళ్లు
పాలిటిక్కిుస్ తో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పదవులు తిరమని బ్రమిసే వాళ్లే
కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్
నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్
రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న




రండయ్య పోదాము పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం:  ఘంటసాల

రండయ్య పోదాము 



మారాజు వినవయ్య పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ

మారాజు వినవయ్య 



చిరునవ్వులు విరిసే పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ, కృష్ణ కుమారి 

చిరునవ్వులు విరిసే 




ఎల్లిపోతుంది ఎల్లి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం

ఎల్లిపోతుంది ఎల్లి 

Palli Balakrishna Wednesday, March 20, 2019




చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, గిరిజ
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: మంగళంపల్లి బ్రదర్స్ ( శాస్త్రి , యం. రంగా)
విడుదల తేది: 19.11.1964



Songs List:



పేరైనా అడుగ లేదు పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: పి. సుశీల.

పేరైనా అడుగ లేదు
ఊరైనా అడుగ లేదు
మనసేమో అతని విడిచి
మరలి రాదాయె

వెతలన్నీ ఆతనికే
వినిపించా నెందులలో
వెన్ను తట్టి మురిపించి
వెలిపోయాడతడెవరో

కలవరమో కలకలమో
కలిగింది నాలో ...
తగవో చిరునగవో అది
బెదరింపో లాలింపో
తెలియనీక నవ్వించీ
గిలిగింతల కవ్వించే

కనుల కైన కలనైనా
కనిపించేవని ఆశ!
ఇంతై మరి అంతై అది
నూరింతల వింతై
గుస గుసలేవో సలిపీ
కొసరి కొసరి వూరించే



సుడి గాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర.
గానం: పి. లీల

సుడి గాలిలో చిరుదీపము
మనజాల లేదోయీ
నా ఆశ నీరాయే అది 
నట్టేట పాలాయే
నాలోని ప్రేమ లోలోన కుమిలి
తానారి పోవునోయి

పాలించు వారేరీ
మొర ఆలించు వారేరి?
నీ సేవకూడ నే నోచలేదా
ఈ జన్మ చాలు చాలు




ప్రేయసీ మనోహరీ పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల

రఘు:
ప్రేయసీ మనోహరీ
వరించి చేరవే
తీయనీ మనోరథం
నా ఫలింప జేయనే

చరణం: 1
దరిజేరి పోవ నేల
హృదయ వాంఛ తీరు వేళ
తారకా సుధాకరా
తపించ సాగెనే ...
హాయిగా మనోహరా
వరించి చేరుమా

చరణం: 2 
మురిసింది కలువ కాంత
చెలుని చేయి సోకినంత
రాగ మే సరాగమై
ప్రమోద మాయెనే
హాయిగా మనోహరా
వరించి చేరుమా

చరణం: 3 
ఆ హాహాహ..... హాహాహ
ఆ హాహాహ.... హాహాహ

పెనవేసె మల్లెతీగా
మనసులోన మమతరేగె
ఊహలూ వయ్యారమూ - నా
ఉయ్యాల లూగానే

రము: 
పేయసీ మనోహరీ
వరించి చేరవే




చిలిపి కృష్ణునితోటి పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: నార్ల చిరంజీవి.
గానం: ఘంటసాల, పి. లీల

రఘు:
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింట సాటి
జో జో.... జో జో....

చెరసాలలో పుట్టి రేపల్లెలో వెలసి
గొల్ల తల్లుల మనసు కొల్లగొని నాడు
ఏ తల్లి వొడిజారి ఏలాగు చేరావొ
ఆపద లె కాపుదల లాయేనె నీకు

జో అచ్యుతానంద జోజో ముకుందా
రార పరమానంద రామగోవిందా
జోజో
పలు వేసములు పూని పగవారు హింసింప
బల్ పోకడలు చూసి బాలగోపాలుడు

రఘు:
ఈ యీడు కే ఎన్ని గండాలు గడిచాయొ
ఎంత జాతకుడమ్మ అనిపించినావు
జో అచ్యుతానంద జో జో ముకుందా
రార పరమానంద రామగోవిందా

కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి
కన్న వారికి చెరలు తొలగించినాడు

రఘు: 
వసుదేవ తనయుని వారసత్వము నిలిపి
నీవారి వేతలెల్ల నీవె తీర్చేవు

ఇద్దరు: 
చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ
ఆ స్వామితో నీవు అన్నింటసాటి
జో జో.... జో జో....



ఇచట నే ఇచట నే పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

శాంత : 
ఇచట నే ఇచట నే విరసె మొదటి ప్రేమ
ఇపుడె వేడి కంటినీరు విడి చె చందమామ
|
మనసులోని అనురాగము మనవి చేసుకొంటినీ
దోచుకొనిన అతని ప్రేమను నేను దాచుకొంటినీ
తాను నన్ను చేరగానె మోము వాల్చుకొంటినీ
తేనెలూరు కోరికలె మదిని నోచుకొంటినీ
వింత వింత ప్రణయ కాంతి వెలుగుచున్న సీమలో
యింతలో పెనుచీకటి ఆవరించ సాగనే

ప్రేమనగరు పోవదలచి, పయన మైన దారిలో
మొదటి అడుగు వేయునపుడె నడక ఆగిపోయెనే



నీమీద మనసాయెరా పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర.
గానం: రాణి.

నర్తకి: 
నీమీద మనసాయెరా
ముద్దు చెల్లించరా
నడిరేయి దాటింది
చలిగాలి వీచింది
రావేల రావేల రావేలరా

చిరునవ్వు నవ్వి
కులికింది భామ
ఒలికింది ఒయ్యారమే ! హాయ్!
ఈ రేయి రాకున్న
నే తాళ జాల
కవ్వించి కవ్వించి నవ్వించరా ! ఆహా !

కవటాకు చీరి
చిలకల్లు చుట్టి
తాంబూలమిచ్చేనురా ! హోయ్ !
నీ నోరు నా ప్రేమ
పండాలి రాజా!
నా నీటు నా గోటు నీ సొమ్మురా ! ఆహ!




మనగుట్టే నిలుపుకోవాలి పాట సాహిత్యం

 
చిత్రం: వారసత్వం (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: నార్ల చిరంజీవి.
గానం: ఘంటసాల, సుశీల.

శాంత : 
మనగుట్టే నిలుపుకోవాలి
నీ మారాము గుణమే మానాలీ
జాలిపడి నిన్ను కొని తెచ్చి నాను
నీకు మే లెంచి చోటిచ్చినాను

నీవు నా పరువు నిలబెట్టవోయి
ఇంక నీ బరువు నామీద ఉందోయి

రఘు: 
ఎవరేమన్నా దిగులెంతున్నా
అన్నీ మరిపించేవు, బోసి
నవ్వుల మురిపించేవు
నవ్వుతు కేరుతు ఆడిపాడి
నన్నలరించిన బాబూ
ఏమైనావో ఎందున్నావో
ఏ ఇడుమలబడి నలి గేవో !

సీత:
నవమాసాలు నిను మోసింది
కన్నీ రీదుట కేనా?
కన్నమ్మను నేకానా ?
జాడలు తెలిసీ రాలే నైతి
క్షణమే యుగమై పోయె
ఇంకెన్నాళ్ళకు బంగరు తండ్రీ
నా కనులకు కనిపించేవో?

శాంత: 
చిన్న దొరగారు నిదురిస్తే మేలు
ఉత్త దోబూచులాటలు చాలు
నిద్ర కన్నె లే దీవింతురోయి
ఒక్క తియ్యన్ని ముద్దీయవోయి

Palli Balakrishna Wednesday, March 6, 2019


చిత్రం: అడుగు జాడలు (1966)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల , బి.వసంత
నటీనటులు: యన్.టి.రామరావు, జమున
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: ఎమ్.సాంబశివరావు, జి. వందనం
విడుదల తేది: 29.09.1966

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 1
చలిచలి గాలులు చిలిపిగ వీచే....జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వయసే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే....యవ్వనమేమో సవ్వడి చేసే....
సవ్వడి చేసే

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 2
పిలువని కనులే పిలిచెను నన్నే...పలుకని జాబిలి వలచెను నన్నే ...
అందాలేవో అలలై ఆడే... అందని కౌగిళి అందెను నేడే..
అందని కౌగిళి అందెను నేడే .. అందెను నేడే !

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో

చరణం: 3
సొగసులు విరిసే వెన్నెలలోన
ఎగిసే ఊహల పల్లకి పైన
నీవే నేనై పయనించేమా
నేనే నీవై పయనించేమా
జీవన రాగం పలికించేమా....జీవన రాగం పలికించేమా....
పలికించేమా

మల్లెలు కురిసిన చల్లని వేళలో
మనసే పలికెను నేడేలనో... ఎలానో
అహ...హ...అహ..హా...అహ...హ...అహ...హా...



******  ******  ******


చిత్రం: అడుగు జాడలు (1966)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, బి.వసంత

పల్లవి:
తూలీ సోలెను తూరుపు గాలి
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
హైలెస్సా....హైలెస్సా....హైలెస్సా....

చరణం: 1
గాలి విసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే
బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి
చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే
తూలీ సోలెను తూరుపు గాలి

చరణం: 2
చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ
చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే
నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా





Palli Balakrishna Saturday, March 2, 2019



చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మి
కథ : జలిమ్-జెవేద్
మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజు
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
బ్యానర్: విజయా ప్రొడక్షన్స్
విడుదల తేది: 30.11.1973



Songs List:



గాలిలో పైరగాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా...
పొదామా...  సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో నీలి నింగిలో

ఎగిరిపోదామా అందాల హంసలై రాజ హంసలై
పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా 

చరణం: 1 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 
అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం

అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా




తొలి వలపులలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను ..
అది కవుల పైత్యమనుకున్నాను ..
నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను ..
నీ చెలిమి కోరుతూ ఉన్నాను..

మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..
ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు..
ఆ అలకే వలపనుకుంటారు ..

చరణం: 1
కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు..
మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు..
మొగము తిప్పుకుంటారు..

సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు..
నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు..
సాకులు చెబుతూ ఉంటారు

తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను
మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..

చరణం: 2
ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు
కుత కుత లాడుతూ ఉంటారు

తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి...

చరణం: 3
కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు...
ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ
ల.ల.లా..ఉ..ఊ..ఉ..



హుషారు కావాలంటే పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా 

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే... మందురా  

చరణం: 1
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ... ఏది?....  మందొక్కటే మందురా       

చరణం: 2
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా 

నిన్నా రేపని తన్నుకోకురా...  ఉన్నది నేడే మరువబోకురా
అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే....  మందురా 

చరణం: 3
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..తోకాడించే నీవే తోడురా  

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా...





గడసాని దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల

పల్లవి:
గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ బాబు...  ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ..దాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని..

చరణం: 1 
అరెరెరె నడకంటె నడక కాదు
చలాకి నడక.. బల్ కిలాడి నడక
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ...   అది వడిసెల రువ్వ 

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

వగలంటే వగలు కాదు వలపుల సెగలు
చూపంటే చూపు కాదు మదనుడి తూపు
ఆ నడక...  ఆ నవ్వు...  ఆ వగలు...  ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ... దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..

చరణం: 2
మాటలతోటే నన్ను మురిపించకురా
ఏమేమో పొగిడేసి బులిపించకురా
మాటలతోటే నన్ను... మురిపించకురా
ఏమేమో పొగిడేసి... బులిపించకురా

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

కవ్వించాలని నువ్వు కలలు కనకురా
కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా
గడ ఎక్కి...  తాడెక్కి...  గంతేసి...  చిందేసి
అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా 

గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని...    

చరణం: 3
తళుకు బెళుకు చూపిస్తా..
గజ్జె ఘల్లుమనిపిస్తా..

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ తళుకు...  ఆ బెళుకు... ఆ బిగువు...  ఆ బింకం
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ

గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..




అలా అలా అలా పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల 

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా... 
పొదామా...  సాగి పోదామా 

అలా అలా అలా అలా నింగిలో....  నీలి నింగిలో
ఎగిరిపోదామా....  అందాల హంసలై ...  రాజ హంసలై.... 
పోదామా ... ఎగిరి పోదామా
పోదామా ... ఎగిరి పోదామా 

చరణం: 1
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 

అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా     




తాగాను నేను తాగాను పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

పల్లవి:
తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను 
భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను   
చరణం: 1
కైపులో ఉన్నాను కలలుకంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను
వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను
నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  బాగా నేను తాగాను....  తాగాను    

చరణం: 2
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను....  మరచిపొమ్మంటాను


Palli Balakrishna Sunday, February 25, 2018


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, పండరీ భాయి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి. నాగిరెడ్డి, చక్రపాణి
విడుదల తేది: 23.09.1965

పల్లవి:
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి

విరహమె నీకు శీతలమైతే .. ఆ ..
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 1
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా ..
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. తమలపాకుతో విసిరెదనోయి..

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 2
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ ..
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి
మూగమనసె నీ మోజైతే ...
మూగమనసె నీ మోజైతే మాటాడక జరిగేరెదనోయి..
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..

విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  పి.సుశీల

పల్లవి:
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే 

చరణం: 1
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం: 2
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా సరినీవని నీ గురినేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... కలవరమాయెనులే

నా సరి నీవని... నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే

చరణం: 1
నా హృదయమునే వీణ చేసుకొని.. ప్రేమను గానం చేతువని..
ఆ...ఆ...ఆ...
నా హృదయమునే వీణ చేసుకొని... ప్రేమను గానం చేతువని
నీ గానము నా చెవి సోకగనే.. నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే .. నా మది నీదై పోవునని...

నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎపుడో తెలిసెనులే

చరణం: 2
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని

నా సరినీవని.. నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది... కలవారమాయెనులే
నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము

చరణం: 1
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా

నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..

చరణం: 2
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..
నీవంటే.. నీవనచు.. ఊఁ..ఆపావే?
నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..

నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ...ఆ..
ఊ..ఊ..ఊ..ఊ..


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
నీ పెదవులపై నవ్వు చిందితే.. మనసు చల్లగా ఉంటుందీ..
ఎందుకనో..ఓ...ఓ..ఎందుకనో

చరణం: 1
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..

కొంగున కట్టుకు నిను తిప్పాలని..
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని..
ఏదో వేడుక పుడుతుంది.... ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
కవ్వించి నీవు కలహమాడితే..  నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

చరణం: 2
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..

నీలో ఐక్యం చెందాలంటూ...నీలో ఐక్యం చెందాలంటూ... ఏదో తహతహ పుడుతుందీ.. ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో...
ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..
అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..ఓహో..ఓ...

Palli Balakrishna Saturday, December 9, 2017

Most Recent

Default