-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "T. Trivikrama Rao"



చిత్రం: మొనగాడు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, వాణీ జయరాం 
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, జయసుధ, రోజా రమణి, బేబి శ్రీదేవి
దర్శకత్వం: టి. కృష్ణ 
నిర్మాత: టి. త్రివిక్రమ రావు 
విడుదల తేది: 1976



Songs List:

Palli Balakrishna Saturday, August 20, 2022

చిత్రం: యుద్ధం(1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం:
నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, జయసుధ, జయప్రద
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 14.01.1984

Palli Balakrishna Friday, April 5, 2019



చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: పి. సుశీల, ఎస్.జానకి, రాజ్ సీతారాం
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 05.06.1986



Songs List:



అత్తాడి అత్తాడి పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారాం

అత్తాడి అత్తాడి 



మంజువాణి ఇంటిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారాం

మంజువాణి ఇంటిలో



నీకు చక్కిలిగింతలు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారాం

నీకు చక్కిలిగింతలు 




పూలెట్టి కొట్టమాకు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి, రాజ్ సీతారాం

పూలెట్టి కొట్టమాకు



రా గురూ పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారాం

రా గురూ 



శ్రుంగార వీధిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం, పి. సుశీల

శ్రుంగార వీధిలో 



చిత్రం: ఖైదీ రుద్రయ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం:
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 05.06.1986


Palli Balakrishna



చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి, మురళీమోహన్
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
బ్యానర్: విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 29.03.1979



Songs List:



విరిసిన సిరిమల్లి.. పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి
పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

చరణం: 1
రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... అన్నయ్య అన్నాడు అది తగదని
రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... అన్నయ్య అన్నాడు అది తగదని

రాయబారమంపింది రా రమ్మని.... రాయబారమంపింది రా రమ్మని
పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని... 

నా చెల్లెలే రుక్మిణైతే... రానిస్తానా ఆ గతిని
కాళ్ళు కడిగి తెస్తాను...  తాను కోరుకున్నవాడిని

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

చరణం: 2
కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...
కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి
కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...
కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి 

రామా రామా అన్న కవలలు మామా మామా అని పిలవాలి
రామా రామా అన్న కవలలు మామా మామా అని పిలవాలి

అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి
అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షితలవ్వాలి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

చరణం: 3
అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... అన్నెంపున్నెం ఎరుగని తల్లి
అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... అన్నెంపున్నెం ఎరుగని తల్లి

కన్నతల్లి కాంచిన కలలీ అన్నయ్య కంటికి రావాలి
కన్నతల్లి కాంచిన కలలీ అన్నయ్య కంటికి రావాలి

అవి అన్నీ పండాలి... నా పండుగ కావాలి
అవి అన్నీ పండాలి... నా పండుగ కావాలి

పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి
విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి



అన్నయ్య హృదయం దేవాలయం పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ..
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..

చరణం: 1
పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం..
బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకునేది ఇద్దరి క్షేమం 

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అన్నయ్య హృదయం దేవాలయం.. ఊఁ..ఊఁ.

చరణం: 2
ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను..
మోసుకు తిరిగి...  ముచ్చట తీర్చే తండ్రినెరగను..
కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని
మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నది

అన్నయ్య హృదయం దేవాలయం..

చరణం: 3 
కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ..
కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు
నా పాలి వేదం అన్నయ్య పలుకు..
నా పాలి వేదం అన్నయ్య పలుకు..
అన్నయ్య నవ్వే  నా దారి వెలుగు.... 

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ.. 



పసుపు కుంకుమ తెస్తాడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

పల్లవి:
పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు

పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను
పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను

పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు

చరణం: 1
మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు
మబ్బులలోనా దాగున్నా... మచ్చే ఎరుగని చెందురుడు

మమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడు
మమతల వెన్నెల కురిపిస్తాడు... మనుగడ పున్నమి చేస్తాడు
అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... 

పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు

చరణం: 2
నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను
నా నీడనే నేను వెతికాను... ఆ జాడ తెలియక నిలిచాను

పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను
పిచ్చిప్రేమకు కళ్ళే లేవని పెద్దలు అన్నది నిజమేను
అహహ...ఆ... ఆ... అహహాహా... ఆ... ఆ... ఆ... 

పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
పట్టిన చేయి విడవని రాజుకు.. పట్టపు రాణిని ఔతాను

పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
ఆ.... ఆ... ఆ... ఆ... ఆ... ఉహ్మ్మ్... ఉహ్మ్... ఉహ్మ్.... 





ముందు వెనకా వేటగాళ్లు... పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పల్లవి:
ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు
ప్రేమా.. ఎంత ప్రేమా...
అమ్మమ్మ.. ఏదమ్మా...

కొండకోన పొదరిల్లు.. గుండెలోనా పడకటిల్లు
ప్రేమా.. అదే ప్రేమా
అమ్మమ్మా.. ఔనమ్మా

చరణం: 1
అడవి గాలిలా నన్ను కమ్ముకో.. ఉమ్మ్
అయోద్య రాముడల్లే ఆదుకో..
బంగారు లేడి నిన్ను అడగను పో..
శృంగార రామూడివై ఏలుకో...
నా అందాల ఏలికవై ఉండిపో.. 

ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు 
ప్రేమా.. ఎంత ప్రేమా...
అమ్మమ్మా.. ఔనమ్మా

చరణం: 2
ఆ...ఆ.. ఆ... ఆ...
ఆ.. ఆ.. ఆ.. ఆ..
అహ.. హా..
నీలాల నీ కురుల దుప్పటిలో...సిరిమల్లెపూల చిలిపి అల్లరిలో
నీ వయసు మెరిసింది కన్నులలో.. నా మనసు ఉరిమింది చూపులలో
నే కరగాలి నీ కన్నే కౌగిలిలో...
అమ్మమ్మ..ఏదమ్మా... 
కొండకోన పొదరిల్లు.. గుండెలోనా పడకటిల్లు
ప్రేమా.. అదే ప్రేమా
అమ్మమ్మా.. ఏదమ్మా

చరణం: 3
నా గుండెలో నీ తల దాచుకో
నా ఎండలో నీ చలి కాచుకో..
నా వన్నెచిన్నెలన్నీ పంచుకో..
నన్నింక నీలోనే పంచుకో...
ఈ గురుతునే బ్రతుకంతా ఉంచుకో
అమ్మమ్మా.. ఔనమ్మా

ముందు వెనకా వేటగాళ్లు... ముద్దులాడే జంట లేళ్లు
ప్రేమా.. అదే ప్రేమా...
అమ్మమ్మ..ఏదమ్మా...
అమ్మమ్మ..ఏదమ్మా... 




చలి.. జ్వరం.. పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

పల్లవి:
చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం
చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం
మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా..
మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం.. 

చలి.. జ్వరం.. చలి.. జ్వరం..  ఇది చలి జ్వరం
చందమామ పొడిచినా..అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం.. 

చలి.. జ్వరం.. చలి.. జ్వరం..  ఇది చలి జ్వరం  

చరణం: 1 
మాట వినను పొమ్మన్న మనసుల్లో.. మాటమాట రమ్మన్న వయసుల్లో
మాట వినను పొమ్మన్న మనసుల్లో.. మాటమాట రమ్మన్న వయసుల్లో

ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో.. కసికసిగా పెనవేసే కౌగిలింతలో
ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో.. కసికసిగా పెనవేసే కౌగిలింతలో

ఒకరికొకరు మందంది వింత జ్వరం..
ఆహా..ఒకరికొకరు మందంది వింత జ్వరం
ఇద్దరు ఇచ్చిపుచ్చుకొమ్మంది.. ఏమి జ్వరం..ఇది ఏమి జ్వరం..

మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం
మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా..
మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం.. 

చలి.. జ్వరం.. చలి.. జ్వరం..  ఇది చలి జ్వరం..

చరణం: 2 
మబ్బులెంత కురిసినా తడవదూ.. ఆకాశం తడవదూ
మాటలెన్ని చెప్పినా తీరదు.. ఆరాటం తీరదు
మబ్బులెంత కురిసినా తడవదూ.. ఆకాశం తడవదూ
మాటలెన్ని చెప్పినా తీరదు..ఆరాటం తీరదు

తొలకరి చినుకులే ఏరులైన తీరులో.. ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో
తొలకరి చినుకులే ఏరులైన తీరులో.. ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో

ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం..
ఆహా..ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం
పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం.. మన ప్రేమ జ్వరం 

చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం

చందమామ పొడిచినా..అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం.. 

చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది.. చెలి జ్వరం

మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం.. ఇది..చలి జ్వరం




అన్నయ్య హృదయం దేవాలయం (Female) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల 

పల్లవి:
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ..
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..

చరణం: 1
పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
పంచుకున్నది ఒకటే రక్తం.. పెంచుకున్నది ఒకటే పాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం..
బ్రతుకున్నది ఆ పాశం కోసం.. కోరుకునేది ఇద్దరి క్షేమం

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అన్నయ్య హృదయం దేవాలయం..

చరణం: 2
ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను..ఊ..
మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను..ఊ..
కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని
మాట నేర్చి నే పిలిచినదే ' అన్నా ' అన్నది

అన్నయ్య హృదయం దేవాలయం..

చరణం: 3
కృష్ణుడు పలికిన  గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ..
కృష్ణుడు పలికిన  గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు

నా పాలి వేదం అన్నయ్య పలుకు..
నా పాలి వేదం అన్నయ్య పలుకు..
అన్నయ్య నవ్వే నా దారి వెలుగు..ఊ..

అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం

అన్నయ్య హృదయం దేవాలయం..ఊఁ..ఊఁ..



లగ్గం పెడితే లగెత్తుకోచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

లగ్గం పెడితే లగెత్తు కొచ్చా - సైఁరో జంబైరో 
సరైన మొగుడు సరకారోడు ఎవడో  ఏడున్నాడో
నగలూ నాణెం అన్నీ వున్నై 
వగలూ వాటం ఎన్నో వున్నై 
పదహారేళ్లూ పద పద మంటే
బందరు బండీ ఎక్కాను సిలకఅరిస్తే నన్నాను 
సిలకలపూడి అనుకొన్నాను - ఈ
ఎలకల బోనులో పడిపోయాను
కన్నూ కన్నూ కలిసేవున్నై 
నిన్నూ నన్నూ కలవాలన్నై 
చల్లని జాబిలి సలసలమంటె చెప్పలేని గిలిదాచాను 
చెట్టు నీడకే వచ్చాను. మీ చేతిలోన పడిపోయాను 
చుక్క పొడి స్తే చక్కర కేళీ
ఈ పొద్దు గడిస్తే సర్వం ఖాళీ





ఈశానాం జగతోస్య పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు చెల్లెలు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డివోషనల్
గానం: పి.సుశీల 

ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాంప్రేయసీం 
తద్వక్షస్థ్యం నిత్యవాసర సికాంతతాన్తి సంవర్ణనీం పద్మాలఙ్కృత
పాణి పల్లవ యుగాం పద్మాసన స్ధాంశ్రియం వాత్సల్యాదిగుణో
జ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్

Palli Balakrishna Sunday, March 17, 2019



చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 14.03.1985



Songs List:



గోలీమార్... గోలీమార్... పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
గోలీమార్... గోలీమార్... గోలీమార్ మార్ మార్ 
మార్ మార్ ..మార్ మార్ .. 

కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె శృంగారమా 
వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

చరణం: 1
పుట్టంగానే మట్టైపోయే కొత్త్తచట్టం వస్తే 
ముద్దుపెట్టాలంటే అల్లాడి పోతావే అమ్మడూ 
బాణామతి చేస్తారు ప్రాణాలింక తీస్తారు 
ఉన్న మతి పోయాక ..ఉప్పుపాతరేస్తారు 
ఓ... ఇంతి బంతి పూబంతి 
ఓ... శాంతి శాంతి ఓం శాంతి 
రుద్రం రౌద్రం రిరిమ్‌షా .. మూర్ఖం మూఢం ముముర్‌షా 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

చరణం: 2
ముట్టంగానే నిప్పైపోయే కొరివి దెయ్యాలొస్తే 
కొంగులంటుకుంటే చల్లారేదెట్టాగో ఇప్పుడూ.... 
చేతబడి చేస్తారో కోడి మెడ కోస్తారో 
శ్మశానాల వీధుల్లో .. పిశాచాలు పడతారో 
ఓ... నారీ ప్యారీ వయ్యారి 
ఓ... భద్రా కాళి కంకాళి 
తీవ్రం తీండ్రం భిద్రుక్ష .. ముందు వెనుక పరీక్ష 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె శృంగారమా 
వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్



సరి..సరీ..నువ్వు చెప్పెదంత పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
కమ్ముకుపోతే సరేసరీ..కౌగిలిలోనే ఉరీఉరి
ఆఆఆ..ఉరీఉరి..య్యా
సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ 

సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ

చరణం: 1
హే..హే..ఏ..హ్హే..లలా..లలా..
వచ్చిందంటే చలికాలం..వాటేయ్యాలి కలకాలం
హోయ్..వాటాలు అన్ని చూసి ఆడేయాలి కోలాటం
అయ్యిందంటే సాయంత్రం..అంతో ఇంతో శృంగారం
బుగ్గల్లో ముద్దే పెట్టి.. పూయించాలి మందారం

చీకట్లు పుట్టే వేళ.. సిగ్గొచ్చి కుట్టే వేళ
నీ చీరకొంగు జాగ్రత్తో..ఓహో..   

దీపాలు ఊదేసి..తాపాలు తగ్గించుకో 
పులకింత రేపేసి..బంధాల్లో కట్టేసుకో

సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ 

చరణం: 2
హే..హే..హ్హా..ఆ..ఏహే..ఆహా..
ఎండలోన ఓ తాపం.. ఎన్నెల్లోన ఓ కోపం 
ఏ మందు వాడాలంట తగ్గాలంటే ఈ రోగం

మల్లెల్లోన మనసిచ్చి.. మసకల్లోన వయసిచ్చి
హోయ్..ఓ ముద్దు ఇచ్చావంటే..తగ్గేనంట ఈ తాపం

ఒళ్ళంత వేడెక్కించు..కళ్ళల్లో కైపెక్కించు
నా వన్నె చిన్నె పెంచుకో..హో

చెప్పేది ఏముంది చేసేదెంతో ఉంది..ఆహా
శృతిమించి పోయాక రాగానికంతేముందీ 

సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
కమ్ముకుపోతే సరేసరీ..కౌగిలిలోనే ఉరీఉరి
ఆఆఆ..ఉరీఉరి..య్యా
సరి..సరీ..నువ్వు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ 




దొంగ..దొంగ..ముద్దులదొంగ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
దొంగ..దొంగ..ముద్దులదొంగ
దోచాడే....బుగ్గ... కోసాడే....మొగ్గ
కౌగిలన్ని...దోపిడాయే...ఈ సయ్యాటలో..ఓ
ఈ సందిళ్ళలో..ఓ..

దొంగ..దొంగ..వెన్నెలదొంగ
వచ్చిందే....చుక్క..వాలిందే....పక్క
వత్తిళ్ళన్ని..రాత్రులాయే..ఈ ఉర్రుతలో..ఓ
ఈ ఉయ్యాలలో..ఓ..  

చరణం: 1
కొరికే నీ కళ్ళతో..కొరికి నమిలే ఆ కళ్ళతో
ఇరుకు కౌగిళ్ళు ఇస్తావనీ..ఈ
చలిగా నీ చూపుతో..చలినే నలిపే నీ ఊపుతో
ఒడికే నీ ఒళ్ళు ఇస్తావనీ..ఈ

వాయిదాలతో పెంచుకొన్నది..వయ్యారాల పరువం..మ్మ్
కొట్టే కన్ను కోరే చూపు..బాణాలేసి.. సన్నంగ
చీకట్లోన సిగ్గుతల్లి..ప్రాణం తీసీ..
ఈ తారాటలో..ఈ... తైతక్కలో..ఓ 

దొంగ దొంగ..వెన్నెలదొంగ..వచ్చిందే చుక్క
వాలిందే..ఏ..పక్కా

చరణం: 2
కొసరే నీ చూపులో..కసిగా ముసిరే కవ్వింపులో
పిలుపో వలపో..విన్నానులే..ఏ...ఏ...
ఎదిగే నీ సోకులో..ఎదిగి ఒదిగే నాజుకులో
ఉలుకో తళుకో..చూశానులే..ఏ.. ఏ.. 

పక్కవత్తిడి పక్కపాపిడి... ఇలా చెదరిపోనీ..ఈ
నచ్చేదిస్తే ఇచ్చేదిస్తా..సాయంకాలం..ఓలమ్మో
వెచ్చందిస్తే మెచ్చిందిస్త..శీతాకాలం..మ్మ్
హా..నా దోసిళ్ళతో..హా..నీ దోపిళ్ళలో..ఓ

దొంగ..దొంగ..ముద్దులదొంగ
దోచాడే...బుగ్గ..కోసాడే....మొగ్గ
వత్తిళ్ళన్ని..రాత్రులాయే..ఈ ఉర్రుతలో..ఓ
ఈ ఉయ్యాలలో..ఓ..హా..హా హా హా హా హా
హే హే హే హే హే హే   





అందమా అలా అలా.. పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా

చరణం: 1
తెల్ల చీర ఇచ్చుకో మల్లెపూల వేళలో
సన్నకాటుకిచ్చుకో సందె చీకటేళలో
కదలి వచ్చే నీలో.. కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే.. కవితలెన్నో రాశా.. ఆహాహా

కొత్త మోజుల.. మత్తు గాలికి.. సొగసు ఊపిరి.. పోసుకున్నది
రాగాలెన్నో నీలో రేగే వేళా...

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా

చరణం: 2
కొమ్మ రెమ్మ సందుల్లో మావిళ్ళ విందులో
కోకిలమ్మ వీధుల్లో రాగాల చిందులు

రామచిలకలు తెచ్చే చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా.. నీకు కానుక చేశా

మండు వేసవి.. మల్లెలావిడి.. పండు వెన్నెల.. పడుచు ఊపిరి..
నీలో నాలో ఊయ్యాలూగే వేళా..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు.. నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే.. ఏ ఏ ఏ..

అందమా అలా అలా.. అల్లుకో ఇలా ఇలా




తప్పనకా ఒప్పనకా.. పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
తప్పనకా ఒప్పనకా.. తాకాలని ఉంది
బుగ్గ..తాకాలని ఉంది
రేపనకా మాపనకా.. పెట్టాలని ఉంది
ముద్దు..పెట్టాలని ఉంది
వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే
వాయిదాలు వేస్తుంటే.. వయసాగదే
వాటేసు కున్నదాక మనసాగదే
వాటేసు కున్నదాక మనసాగదే 

కాదనకా లేదనకా.. ఇవ్వాలని ఉంది
మనసు.. ఇవ్వాలని ఉంది
రేయనకా పగలనకా.. కలవాలని ఉంది
నిన్నే కలవాలని ఉందీ
వాయిదాలు వేస్తెనే.. వయసందము
వాయిదాలు వేస్తెనే.. వయసందము 
వాటేసు కున్ననాడే.. వలపందము
వాటేసు కున్ననాడే.. వలపందము   

చరణం: 1
సంపంగి పూసే వేళ.. నీ చెంప తాకే వేళ
నీ వొంపు సొంపు నాకే ఇస్తావా
నీ మంచు తగిలే వేళ.. నా మల్లె తడిసే వేళ
నా సిగ్గు సింగారాలు దోస్తావా..
వయ్యారం కౌగిట్లోనే ఓడిస్తా..
సందిట్లో పందాలెన్నో.. గెలిపిస్తా

గెలిపించవా.. చలిపెంచవా.. వలపించవా..ఒడిపంచవా

నా లేడి లేచాక పరుగాగదూ
నా లేడి లేచాక పరుగాగదూ

నీ కోడి కూస్తుంటే పరువాగదూ
నీ కోడి కూస్తుంటే పరువాగదూ

తప్పనకా ఒప్పనకా..తాకాలని ఉంది
బుగ్గ..తాకాలని ఉంది
హోయ్.. రేయనకా పగలనకా.. కలవాలని ఉంది
నిన్ను కలవాలని ఉందీ 

చరణం: 2
నీ చేయి తాకే వేళ..నా చీర అలిగే వేళ
నా కట్టు బొట్టు అన్ని చూస్తావా..ఆ
సోకంత బలిసే వేళ..రైకంత బిగిసే వేళ
నా వేడి వాడి అన్ని చూస్తావా..ఆ
సరికొత్తా ఇరకాటంలో పెట్టేస్తా..ఆ
హోయ్..సరిహద్దే కౌగిట్లో కొట్టేస్తా..ఆ
కౌవ్వించవా..కసిపెంచవా..పొగమంచులో..పగపెంచవా

నీ గాలి వీచాక..మెరుపాగదు..
నీ గాలి వీచాక..మెరుపాగదు
నా జోలి కొచ్చాక చినుకాగదూ..
నా జోలి కొచ్చాక చినుకాగదూ

హోయ్..కాదనకా లేదనకా..ఇవ్వాలని ఉంది
మనసు..ఇవ్వాలని ఉంది
రేపనకా మాపనకా..పెట్టాలని ఉంది
ముద్దు..పెట్టాలని ఉంది

వాయిదాలు వేస్తెనే.. వయసందము
వాయిదాలు వేస్తెనే.. వయసందము  

వాటేసు కున్నదాక మనసాగదే
వాటేసు కున్నదాక మనసాగదే 




ఇది పందెం పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి

ఇది పందెం

Palli Balakrishna Saturday, September 30, 2017



చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 07.05.1992



Songs List:



డిక్కి డిక్కి డీడిక్కి పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
ఎక్కి ఎక్కి కైపెక్కి ఏదో లాగిస్తే లక్కీ
హోయ్ లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి
ఎక్కానంటే అమ్మాడి అదరాలే ఆడోపాడి
అయితే ఓకే అంతా నీకే చలో  గురు
హోయ్ గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో బరిలోకి దిగవయ్యో
డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి

ఏం పిల్లో పలాస జాంపళ్ళూ కులాస కానిదం ఖుషిగ రావే
హయ్యారే హమేషా తయ్యారే తమాష దేఖ్ రే చలో  గురు హోయ్
సరదా తీరే సలహా ఇస్తా పరదా తీసై ఫటఫటా
గడసరి నీ పని ఇహ సరి
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో బరిలోకి దిగవయ్యో
డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ కబడ్డీ కబడ్డీ

బొబట్టు వెన్నతో కలపెట్టు, పట్టరా ఒపట్టు రంజుగా కొట్టు
అరె కట్లెట్  చెయ్యకే కనికట్టు విప్పితే నీ గుట్టు కథే ఫిట్టు
ఆజా రాజా ఇస్తా కాజా తింటు సోజా మజా మజా
పదమరీ నీ పని ఇహ సరి
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో

డిక్కి డిక్కి డీడిక్కి డప్పులు వాయించెయ్ నక్కి
ఎక్కి ఎక్కి కైపెక్కి ఏదో లాగిస్తే లక్కీ 
హేయ్ లంగ వాడి లంబాడి ఆడించేస్తా కబ్బాడ్డి
ఎక్కానంటే అమ్మాడి అదరాలే ఆడోపాడి
అయితే ఓకే అంతా నీకే చలో  గురూ
గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో
హొయ్ గుడివాడ గుండమ్మో ఒడిలోకి రావమ్మో
బెజవాడ బాలయ్యో నా బండి నీదయ్యో






అరె ఓ సాంబ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

(ఈ పాటని కళ్యాణ్ రామ్  నటించిన  పటాస్ (2015) సినిమాలో  రీమిక్స్ చేశారు. పాడినవారు: జాస్ప్రీత్ జస్జ్, దివ్య కార్తీక్, సంగీతం: సాయి కార్తీక్ )

అరె ఓ సాంబ ఆయిరే రంబా
అరె ఓ రంబా ఆయారే రేంబో

బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
లవ్వాడదాం చలో రె రాణీ...

అరె ఓ సాంబ ఆయిరే రంబా
అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
అయినాసరే లొంగను ఛా ఛా

అరె ఓ రంబా ఆయారే సాంబా

చరణం: 1
ఓ కేడి.. కనకమ్మో
ఓ కేడి కనకమ్మో కవ్వించకే ముద్దు గుమ్మో
షేకించి బ్రేకించి పగ్గాలు వేస్తానే బొమ్మో
ఏదన్నా ఎంతున్నా నేరాలు  రాసుంది కాడా
ఊరంతా చూస్తారు వలవెయ్ కు నీ సోకుమాడ
కమ్మలు పెడతా గాజులు పెడతా 
ఒల్లోకొస్తే గుడులే కడతా 
నా మాట విని చల్ రె రాణీ...

అరె ఓ రంబా ఆయారే రేంబో
అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా

చరణం: 2
ఆ లాటిలు.. చూపించి
లాటిలు చూపించి బెదిరించకోయ్ టింగు రంగా
ప్రేమంటూ నీకుంటే దరి చేరనా సుబ్బరంగా
రంగేళి రంగమ్మా ఓ చోటు చూసేసుకుందాం
నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం
చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది 
లేటెెందుకిక చల్ రె రాజా

అరె ఓ సాంబ ఆయిరే రంబా
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
మస్క కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
లవ్వాడదాం చల్ రె రాణీ

అరె ఓ రంబా ఆయారే రేంబో




హేయ్ టక్కు టమారం పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

హేయ్ టక్కు టమారం బండి టప్పల బండీ
పైలా పచ్చీస్ బండి పోదామా చండీ
అటేల్తే కాకినాడ సర్దుకో పెట్టే బేడా
ఇటేల్తే నీ గుడివాడ వేయ్యవే పాను బిడా
చమాచం డెర వేద్దాం రావే అమ్మడీ
 లవ్ స్టేషన్  లో హొయ్ లవ్ స్టేషన్ లో

టక్కు టమారం బండి చమ్కిలా  బండీ
పైలా పచ్చీస్ బండి పరువాల బండీ
అటేల్తే రాజమండ్రి భళారే చిట్టి తండ్రీ
ఇటేల్తే విజయవాడ చలోరే  అందగాడా
చమాచం డెర వేద్దాం రారా బుల్లోడా
 లవ్ స్టేషన్ లో హొయ్ లవ్ స్టేషన్ లో

అదిగో ఏలూరు కొంపె కొల్లేరు నీ గంప దించేయ్ భామ
పోదాం నెల్లూరు సరసానికి పేరు జే గంట మోగించు మామ
చలోరే జనగామ చేద్దాం హంగామా చిత్తూరులో చేరుదామా
ఇదిగో బెల్గామ నిండా మునిగాము తలకోనలో తేలు దామా

ఆటైపే అనకాపల్లి కట్టవే కారు కిల్లి
జమాజం జగ్గయ్యపేట వేయరో ప్రేమకి పిఠా
ధనా ధన్ ముద్దో గిద్దో లాగించేద్దామా
హొయ్ లవ్ స్టేషన్ లో హొయ్  లవ్ స్టేషన్ లో

టక్కు టమారం బండి చమ్కిలా బండీ
పైలా పచ్చీస్  బండి పోదామా చండీ
ఇదిగో వైజాగ్ సరిగా చేసాగు తీసుకో నా బ్యాగ్ బాబు
అదిగో గుంటూరు ఇదిగో మార్టేరు మార్చేయి నీ గేర్ పాపోయ్
హాయ్రే నంద్యాల స్పీడ్ పెంచాలా నీ దారి మళ్ళించవయ్యో
హైవే రోడ్ ఉంది హైదరాబాదుంది కంగారు పడ్డ మాకే పిల్లోయ్

అటేల్తే నీ ఒంగోలు ఇటేల్తే మా కర్నూలు
ఫటాఫట్ కడపకు పోదాం లవ్ లో వడుపు చూద్దాం
ధమాధం ప్రేమించేసి ఢంకా మోగిద్దాం
 లవ్ స్టేషన్ లో హొయ్  లవ్ స్టేషన్ లో

టక్కు టమారం బండి టప్పల బండీ
పైలా పచ్చీస్   బండి పరువాల బండీ
అటేల్తే కాకినాడ సర్దుకో పెట్టే బేడా
ఇటేల్తే విజయవాడ చలోరే అందగాడా
చమాచం డెర వేద్దాం రావే అమ్మడీ
 లవ్ స్టేషన్ లో హొయ్ లవ్ స్టేషన్ లో





నీలాల నింగి పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

నీలాల నింగి 



చిటపట చినుకులు పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
హత్తుకుపోతేనే సుఖం
హద్దులు చెరిపేయ్ ఈ క్షణం  రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
చలి చలి గాలుల లోగిలి
ఇచ్చేయ్ కమ్మని కౌగిలి  రా మరి
చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే

చినుకల్లె చిటికెలు వేసి పాడాడమ్మో
నా బుగ్గల మీద రౌడీ బుల్లోడు
మెరుపల్లె ముద్దుల ముద్దర వేసాడమ్మో
ఒళ్ళంతా తడిమి తడిమి సోగ్గాడు
దాని తస్సాదియ్యా జంతర్ మంతర్ గాలి
చమ్మను పడితే మతిపోయిందమ్మో
దాని తస్సారవల జంపర్ బంపర్  సోకు
సూస్తా ఉంటే కసిరేగిందమ్మో
సాకులు ఎందుకు పోకిరి
సర్దుకు పోదాంలే మరి  రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో

జంబారే జిత్తులమారి అందుకుపోనా
వలువల్లో గిలగిల్లాడే అందాలు
వగలాడి వన్నెల చిలకా కానుకలీనా
కసి బుసిగా ఊరించేసే గంధాలు
హర్ని తస్సాచక్క బిత్తరు చూపులు దూసి
పక్కకి వస్తే పోనీ అనుకున్నా
ఓర్ని దిమ్మదియ్య ఇట్టా చుట్టుకు పోతే
కిం అనలేక కరిగి పోతున్నా
వేషాలెందుకు చోకిరి
ఇది తొలి వలపుల కిరికిరి  రా మరి

చిటపట చినుకులు తనువును తడిపే వానలో
తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
హత్తుకుపోతేనే సుఖం
హద్దులు చెరిపేయ్ ఈ క్షణం రా మరి
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
చలి చలి గాలుల లోగిలి
ఇచ్చేయ్ కమ్మని కౌగిలి  రా మరి




ఓ పాపాయో పాట సాహిత్యం

 
చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఓ పాపాయో

Palli Balakrishna



చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్ టీ ఆర్ , శోభన్ బాబు, ఎస్. వరలక్ష్మి 
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 13.01.1966



Songs List:



మత్తువదలరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల 

కృష్ణుడు ముసలి బాహ్మణుడు:
అపాయమ్ము  దాటడాని కుపాయమ్ము కావాలి!
అంధకార మలమినపుడు వెలుతురుకై  వెదకాలి!
ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు!
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు!
మత్తువదలరా నిద్దుర మత్తువదలదా!
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తౌదువురా!  

జీవితమున సగబాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగబాగం చిత్తశుద్దిలేకపోవు
అతి నిద్రా లోలుడు  తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు       

సాగినంతకాలం నా  అంతవాడు  లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు
కండబలముతోటే ఘనకార్మము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు   

చుట్టు ముట్టు ఆపదలును మట్టుబెట్ట బూనుమురా!
పిరికితనము కట్టిపెట్టి దైర్యము చేపట్టుమురా!
కర్తవ్యము నీ వంతు కాపాడుట నావంతు!
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం  




ఛాంగురే ఛాంగు ఛాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

హిడింబి: 
ఛాంగురే ఛాంగు ఛాంగురే
ఛాంగురే  బంగారు రాజా!
ఛాంగు ఛాంగురే బంగారురాజా!
మజ్జారేమగరేడా మత్తైన వగకాడా!
అయ్యారే! అయ్యారే నీకే మనసియ్యాలని వుందిరా   

ముచ్చటైన మొలక మీసముంది
భళా! అచ్చమైన సింగపు నడుముంది!
జిగిబిగీ మేనుంది సొగసులొలుకు   మోముంది
మేటి దొరవు  అమ్మక చెల్ల!నీ సాటి ఎవ్వరుండుట కల్ల          
కైపున్న మచ్చకంటిచూపు అది చూపుకాదు పచ్చలపిడిబాకు
పచ్చలపిడిబాకో విచ్చిన పువురేకో!
గుచ్చుకుంటె తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా                           

గుబులుకొనే కోడెవయసు  లెస్స   దాని గుబాళింపు ఇంకా హైలెస్స
పడుచుదనపు  గిలిగింత  గడుసు గడుసు పులకింత
ఉండనీయమేమి సేతురా కైదండలేక నిలువలేనురా   



ఏమిటయా నీ లీల పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

నారదుడు: 
ఏమిటయా నీ లీల కృష్ణా! ఏమిటయా నీలీల
ఎందులకీ గోల  మాయాలోలా                                                 

మట్టి బొమ్మలకు ప్రాణముపోసి మతినొసగి మదమత్తులజేసి
అధార్మికుల అణగార్చునెపాన అవతారము ధరియింతువయా    
 
పరమాత్ముడవై   నరులవిధాన సరసాల గొడవలో చొరబడియేవు
కన్నియ ఇంట కలతలురేపి  కళ్యాణానికే  సిద్ధమయేవు    

పల్లవి:
(అగ్నిద్యోతనుడు)
కృష్ణా!  యదుభూషణా!హేకృష్ణా!యదుభూషణా!
గోవిందా!ముకుందా!హే పావనా!                   

చరణము: 1
(అగ్నిద్యోతనుడు)
దీనులపాలిట  దైవము నీవట అమరులనేలెడి అయ్యవు నీవట!
భక్తకోటికి చింతామణివట నినునెరనమ్మిన లోటేరాదట         

చరణము: 2
(అగ్నిద్యోతనుడు)
అఖిలము నెరిగిన అంతర్యామికి వివరించే పని లేదుగదా!
నమ్మిన కొమ్మను ఏలుకొమ్మని కృష్ణా రమ్మని పిలచుట నాభాగ్యమెగా 




ప్రియురాల సిగ్గేలనే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల,  పి. సుశీల

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 
నీ మనసేలు మగవానిజేరి
ప్రియురాల సిగ్గేలనే 
నాలోన  ఊహించిన నాలోన  ఊహించిన 
కలలీనాడు ఫలియించె స్వామి
నాలోన  ఊహించిన 

ఏమీ ఎరగని గోపాలునికి  ప్రేమలేవో నేరిపినావు
ఏమీ ఎరగని గోపాలునికి  ప్రేమలేవో నేరిపినావు
మనసుదీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 

ప్రేమలు తెలిసిన దేవుడవని విని  
నా మదిలోన కొలిచితిని 
ప్రేమలు తెలిసిన దేవుడవని విని  
నా మదిలోన కొలిచితిని
స్వామివి నీవని తలచి  నీకే 
బ్రతుకే కానుక జేసితిని                   

నాలోన  ఊహించిన నాలోన  ఊహించిన 
కలలీనాడు ఫలియించె స్వామి
నాలోన  ఊహించిన 

సమయానికి  తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓభామా!
సమయానికి  తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓభామా!
ఇపుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే

ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే 
నీ మనసేలు మగవానిజేరి
ప్రియురాల సిగ్గేలనే 




నల్లని వాడైనా ఓ చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి), ఎల్.ఆర్.ఈశ్వరి 

రుక్మిణి, చెలియలు : 
నల్లని వాడైనా  ఓ చెలీ  చల్లనివాడేలే !
గోవుల గాచెడి వాడైనా  నీ గొప్పకు తగ్గని వాడే చెలీ    

మురళీ మోహనుని  చెలీ, మురిపించిన జాణవులే !
మా గోపాలుని ఇల్లాలివౌట  నీ భాగ్యమె భాగ్యము
ఇలవేలపులౌ మిమ్ముల జూచి  తరియించెను మా జన్మలే

మనసే పందిరియై చెలీ, నీ వలపులు పూలతలై
అనురాగాలే పరీమళించి ఆనందము నీయగా
మీ ప్రియగాధ  యుగయుగాలకు కథగా నిలచునులే ఓ చెలీ



భళా భళా నా బండీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం 

భీముడు: ఓహో.. హో...
భళా భళా నా బండీ  పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ  బ్రహ్మకు నోరూరునండి 

తిండి లేనిదే కండ లేదురా! కండ లేనిదే గుండె రాదురా! హే తమ్ముడూ!
గుండె దిటవుగా నున్నచో  బ్రహ్మాండములోనే ఎదురు లేదురా
కరకర ఆకలి మండుతువుంటే  కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు  ఉంటే వాడు వెర్రివాడు     

అట్టురా ! మినపట్టురా! దీన్నొదిలి పెట్టేదెట్టురా!
తీపి తీపి బొబ్బట్టురా ! అహ తింటే ఆకలి కట్టురా!
పప్పుతోటి ముద్ద గలిపి  పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే  చెప్ప శక్యమా దీని రుచి        

సాటి లేని జగజెట్టి భీముని  చేతుల తీట తీరునులే
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద  నేటి తోనె పరి మారునులే
తల్లి రుణమ్మును తీర్చెద  నా ధర్మమ్మును నెరవేర్చెద
ఓ ఆత్మబంధూ ! నీ అండ వుంటె ఎవరడ్డమైన పరిమార్చెద   




స్వాగతం సుస్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీక్రిష్ణపాండవీయం (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం:  పి. లీల, పి. సుశీల

స్వాగతం... స్వాగతం సుస్వాగతం
స్వాగతం కురుసార్వభౌమ స్వాగతం సు స్వాగతం
శత సోదర సంసేవిత సదనా అభిమానధనా సుయోధనా
స్వాగతం సు స్వాగతం
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వల రాజువు నీవే
రాగభోగ సుర రాజువు నీవే
రాజులకే రారాజువు నీవే
ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా
స్వాగతం సు స్వాగతం
తలపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజిమల్లెలై
నిన్ను మేము సేవించుటన్నది
ఎన్ని జన్మముల పున్నెమో అది
కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు శౌర్యా భరణా
స్వాగతం సు స్వాగతం


Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default