-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sai Korrapati"



చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: కిరీటి, శ్రీలీల
రచన & దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి 
నిర్మాత: సాయి కొర్రపాటి 
విడుదల తేదీ:18.07.2025



Songs List:



Let's Live This Moment పాట సాహిత్యం

 
చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: Jaspreet Jasz

రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరే
బేబీ నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులే
నో టైం నో టైం అంటూ పరుగులు చాలే
బేబీ మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కార్లే

ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే దసరా కోసం
ఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకే
ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసం
ఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్

పంచువాలిటీ కి మోడలే సూర్యుడే
నిమిషమైన ఎప్పుడు లేటుగా రాడులే
టైం టేబుల్ అస్సలు మార్చడే మార్చడే
అక్కడే ఆగిపోయాడులే

హేయ్ గాలి వాటునేళ్లు మేఘమే మేఘమే
స్పీడు చూస్తే వాయు వేగమే వేగమే
ఉన్న చోటునాస్సలు ఉండదే ఉండదే
భూమినంతా చుట్టి వస్తుందిలే

హే సన్ లాగా స్టట్యూలా ఉంటావా
క్లౌడల్లే ఎంజాయ్ చేస్తావా
ఏ రైడు కావాలో నీ గుండెనే అడగవే

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్

వాన చినుకులే చిటపట చిటపట
నేలజారితే పటపట పటపట
గొడుగు చాటుకే వెళ్లాకే టకటక
ఆడనివ్వు ఒంటిపైన తరికిట

హో తిరిగిరానిదే పైసానే పండగ
రంగులెయ్యవే దానికే నిండుగా
జ్ఞాపకాలు ఎంత గొప్పవో తీపివో
పొందలేనివాడికే తెలుసుగా

ఈ మనసు ఓ తెల్ల పుస్తకమే
నింపేందుకుందోక జీవితమే
ఏ రోజు కారోజు ఓ పేజీ నింపడమే…

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్

లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లవ్ థిస్ మోమెంట్




వైరల్ వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: హరిప్రియ & DSP 

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు
చూశావ్ అంటే మైండ్‌ బ్లోయింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఫాలోవర్లందరికి నేనే డార్లింగు
నేనేమి చేసినా ఫుల్‌ ట్రెండింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఎయ్ నా పోస్ట్‌ టేస్ట్‌ ఎమో యమ్మా టెంప్టింగు
ఎప్పుడొస్తదంటూ యూత్‌ అంతా వెయిటింగు
వై వై వై వై వై వై వైరల్
అప్లోడ్‌ చేసాక డౌన్‌లోడ్‌ కోసం
చిన్న పెద్ద తేడా లేక అంత ఫైటింగు
వై వై వై వై వై వయ్యారి

దాట్స్‌ వై వై వై వై
వై వై వై ఐ యామ్‌ వైరల్‌ వయ్యారి

వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

ఏ ముత్యాల ముగ్గేస్తే
నీకింత రీచ్ వచ్చిందా దా దా దా…
ముత్యంమంత టాటూ వేస్తే
నాకింత క్రేజ్‌ వచ్చింది ది ది ది…

కొత్త కొత్త వంట చేసి
ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యావా వా వా వారేవా…
కుర్ర గుండెలోన మంటెట్టి
టాప్‌ ఆఫ్‌ ద టౌన్‌ అయ్యాను ను ను ను…

ఊర మాసు స్టెపులేస్తే
పిచ్చ పీక్స్‌ అన్నారా..
వోళ్ళు విరుచుకుంటే చాలు
రచ్చ మ్యాక్సు అన్నారు..

ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళూ..
మొద్దు అనుకుని వదిలేశారు..
హద్దులు నే రద్దనక…
వద్దన్న చేసేశారు..

హ హ ఏం చేసేసారు.. ?
వైరల్.. ఓహో

వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని

ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏవే..
నా ఫ్యాన్సు కోసమని ఇంకొంచం బరువెక్కాను ను ను ను..
ఓ పాప ఎపుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా..
ఎహ అయ్యన్నీ మాములే చూడొద్దని ఫిక్స్ అయ్యాను ను ను ను..

తగ్గమన్నా తగ్గదంట నీపైనా మా బెంగే
తప్పులేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే
నాలోన ఏం దాగున్న…
మీ చూపులు వెతికేదోకటే..
అందుకనే ఎంతోద్దన్న…
ఎగబడి తెగ కానిచ్చారే..

హ హ ఏం కానిచ్చారు.. ?
వైరల్.. ఓహో

వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్‌ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి

వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి.. హ



Junior Anthem పాట సాహిత్యం

 
చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి 
గానం: జస్ప్రీత్ జాస్

Junior Anthem




Update Avvaale పాట సాహిత్యం

 
చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి 
గానం: రామ్ మిర్యాల 

Update Avvaale




జోల పాడిన పాట సాహిత్యం

 
చిత్రం: జూనియర్ (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: ళ్యాణ్ చక్రవర్తి 
గానం: కరిముల్లా 

జోల పాడిన 

Palli Balakrishna Monday, April 6, 2026
చిత్రం: రాజా చెయ్యి వేస్తే (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారారోహిత్, తారక రత్న, ఇషా తల్వార్
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 29.04.2016

Palli Balakrishna Sunday, February 28, 2021

చిత్రం: విజేత (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నటీనటులు: కళ్యాణ్ దేవ్ , మాళవిక నయ్యర్
దర్శకత్వం: రాకేష్ శశి
నిర్మాతలు: సాయి కొర్రపాటి, రజిని కొర్రపాటి
విడుదల తేది: 12.07.2018








చిత్రం: విజేత (2018)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: లోకేస్వర్

ఆ చిల్లీ చికెను కడాయి చికెను
గ్రిల్డ్ చికెను మొఘలాయి చికెను,
చికెను రోస్టు చికెను కర్రీ
చికెను టిక్కా చికెను మంచూరియా
చికెను తందూరి చికెను పికిలు హలీం
నశాలం జివ్వుమనిపించే నాటుకోడి పులుసు
ఎన్నెన్ని రూపాలు ఎన్నెన్ని యేషాలు
ఎన్నెన్ని అవతారాలే నీకు చికెను తల్లే

ఆదివారమొస్తే గుర్తొస్తావు
లెగ్గు పీసు నాదంటే నాదని నోరూరిత్తావు
కుండలో ఉడుకుతావు
బొంగులో ఉడుకుతావు
కేఎఫ్‌సీ బకెట్‌లో దొరుకుతావు
బఫెలో వింగ్సై కడుపు నింపుతావు
మాకు బలాన్నిచ్చి బలైతావు శ్రద్ధాంజలి నీకు

ఆల్ మై చికెన్ లవర్స్
లిస్టెస్ టు ద స్టోరీ ఆఫ్ ద శాడ్ చికెన్

కో కొక్కోరోకో కొక్కోరోకో కొక్కోరోకో
కో కొక్కోరోకో లిక్కరోకో ముక్కరోకో

ఓసి పిట్టా పిట్టా కోడి భలే దిట్టంగున్న కోడి
మసాల ముస్తాబుల్తో అదిరిందే 
బంపర్ బాడీ
నిన్ను పెంచినోడు ఎవడడో 
కోసి తినేది ఇంకెవడో

కో కొక్కోరోకో కొక్కోరోకో కొక్కోరోకో

పెట్టుకొని పుట్టావో ఒంటినిండా ప్రొటీన్స్
అక్కడే దెబ్బేసిందే అదే నీకు మైనస్సు
చుట్టుపక్కలెన్ని ఉన్నా ఎనిమల్స్
అందరికీ నువ్వే కదా ఫస్ట్ చాయిసు
మరిచిపోలేము నీ సాక్రిఫైసు
నువ్వు ఎక్కడ ఉన్నా కానీ రెస్ట్ ఇన్ పీస్

కో కొక్కోరోకో కొక్కోరోకో కొక్కోరోకో

పబ్బులు రెస్టారెంట్లు ఫైవ్‌స్టార్ హోటల్సు
డైలీ నీకు దండం పెట్టి చెయ్యాలంట 
బిజినెస్సు
దేశానికి ప్రాణాలిచ్చే వాళ్లే సోల్జర్సు
మా దేశం కోసం ప్రాణం ఇచ్చే 
నీకు సెల్యూట్సు
నీ త్యాగానికి రెండే రెండు టియర్ డ్రాప్సు
నువ్వు ఎక్కడున్నా కానీ రెస్ట్ ఇన్ పీస్

కో కొక్కోరోకో కొక్కోరోకో కొక్కోరోకో

మామా కొంచెం మసాల పెంచరా

బీటు కొట్టు పిట్టా పిట్టా కోడి భలే 
దిట్టంగున్నా కోడి
మసాల ముస్తాబుల్తో అదిరిందే 
బంపరు బాడీ
నిన్ను పెంచినోడు ఎవడో కోసి తినేది 
ఇంకెవడో

కో కొక్కోరోకో కొక్కోరోకో కొక్కోరోకో
కో కొక్కోరోకో లిక్కరోకో ముక్కరోకో
ఓ మై క్యూట్ చికెన్ రెస్ట్ ఇన్ పీస్



Palli Balakrishna Friday, February 19, 2021


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: సింహా
నటీనటులు: నారారోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్రా
డైరెక్టర్: అవసరాల శ్రీనివాస్
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 09.09.2016

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 1
హే కథాకళీ చుశానీ నడకల్లో
చుశానీ నడకల్లో
హే హే నాగావళీ హొయలున్నవె మెలికల్లో ...
హొయలున్నవె మెలికల్లో
బుసకొట్టకే బంగారీ నస పెట్టకె నాంచారీ
తల తిప్పుకు పోకే టపక్కునా
ఇక పెట్టకు నన్నే ఇరుక్కునా
తెగ బెట్టుచేస్తవే బజారునా
చుట్టు జనాలు చూడాలనా ?
సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 2
హే అనార్కలీ అరసున్నా నడుముల్లో
అరసున్నా నడుముల్లో
హే హే దీపావళీ వచ్చిందీ మే-నెల్లో
నడిరాతిరి తెల్లారీ పోతున్నా పొలమారీ
నువు కాదని అంటే పుసుక్కునా
నా ప్రాణం పోదా పుటుక్కునా
నా మనసునాపడం అయ్యేపనా ?
నువ్వు కారాలు నూరేసినా

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కార్తీక్ ,  రమ్య బెహరా

పల్లవి:
ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా సీతాకోకలా ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే వుంటుందిగా చూస్తేఇలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది

ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా

చరణం: 1
తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా
కలుస్తున్నవే నింగీనేలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ

చరణం: 2
భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ
ఇదేం చిత్రమో ఏమోగానీ

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (శ్రీ కళ్యాణ్ రమణ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: శంకర్ మహాదేవన్

పల్లవి :
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా

చరణం: 1
ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ
పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా

చరణం: 2
అందనంత దూరమేలే  నింగికీ నేలకీ
వానజల్లే రాయబారం వాటికి
మనసుంటె మార్గం ఉండదా ? ప్రతి మనిషి  నీకే చెందడా ?
ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కళ్యాణి మాలిక్ , హాయ్ రబ్బా స్మిత

ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ
ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ
ఎడారి దారిలో సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో పదాలు దాచినట్టు మహత్తుగున్నదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద


ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడంఎలా ఇదీ ?
గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ
ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా
గుండెల్లో గుచ్చుకుంటోందీ
స్వరాల వీణలే చిరాకు పాట లాగ  చెవుల్లొ గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ సహించలేనిదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: హరిణి రావు

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున

అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ ఆనకట్టే వేసుకోకూ వద్దనీ
కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ
దాచేయయకూ ఆపేయకూ అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

Palli Balakrishna Sunday, August 20, 2017

Most Recent

Default