-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chaitanya Bharadwaj"



చిత్రం: గం గం గణేశ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ, నారాయణ్ సారిక
దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాత: కేదార్ సెలగం శెట్టి, వంశి కురుమంచి
విడుదల తేది: 2023



Songs List:



బృందావనివే పాట సాహిత్యం

 
చిత్రం: గం గం గణేశ (2023)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: వెంగి సుధాకర్
గానం: సిద్ శ్రీరాం

అందాల అందాల
అందం నన్నే తాకి పోయే
అందెల్లో జారి నే పడిపోయానే
మందార మందార
గంధం గాల్లో కలిసి పోయే
వయ్యారి చూపే పరుగెట్టి
వలలే పట్టి నను పట్టే
అయ్యో నా కనులే చేరి
కలలడిగే పిల్లరా
నయగారమే నాపై చల్లే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

అదో ఇదో ఎదో అనేసాకే అలజడి కలిగే
యధావిధి ఎదే ఏమాయెనే
మది వలపులు చిలికే
హడవిడి పడి పడేసావే మనసను మదినే
పదే పదే అదే సొదాయెనే

వెన్నెలైపోయే చీకటే వేళ
వన్నెలే ఉన్న వాకిటే
దారుణాలు తగవే
కన్నుల కారణాలు కనవే
విడువనులే చెలి నిను క్షణమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
సింధూరివే

సరి గమ పద పెదాలేవో ప్రేమని వెతికే
బుధ గురు అనే రోజేలనే
తొలి వలపుల జతకే
నది నదానికే ముడేసాకే
తనువులు తొనికే
అదే అదే వ్యదే కధాయేనే

నీడలా వెంట సాగని
నీలి కళ్లలో నన్ను దాగని
వాయిదాలు అనకే
గుండెలో వేదనేదో వినవే
మనువడిగే మధనుడి స్వరమే

బృందావనివే యవ్వనివే నీవే
నా మనసే నీ వశమే రా
ప్రేయసివే ఊర్వశివే నీవే
ఆరాధనమైనావే

ప్రాణాలే లేవే
పడసాగే చెలి నీ వెనుకా
నా శ్రుతివే సంగతివే నీవే
నా ఆనతివై రావే

Palli Balakrishna Thursday, October 5, 2023

Most Recent

Default