Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tejaswi Madivada"
Rojulu Marayi (2016)





చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
నటీనటులు: చేతన్ మద్దినేని, తేజేశ్వి మడివాడ, కృతిక జయకుమార్ , పార్వతీశం
కథ, స్క్రీన్ ప్లే : దాసరి మారుతి
దర్శకత్వం: మురళి కృష్ణ ముదిదని
నిర్మాత: జి.శ్రీనివాస రావు 
విడుదల తేది: 01.07.2016



Songs List:



రోజులు మారాయి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కిట్టు విస్సప్రాగడ 
గానం: రోహిత్, లిప్సిక

రోజులు మారాయి




నువ్వూ నేను అన్న పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: సురేంద్ర, నయనా నాయర్ 

నువ్వూ నేను అన్న 



ఎగిరే ఊహలకే పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: అనుదీప్ దేవ్, లిప్సిక 

ఎగిరే ఊహలకే 




రా రమ్మంటున్నా పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: హైమత్, రమ్యా బెహ్రా 

రా రమ్మంటున్నా 




వస్తున్నా ఓ నేస్తం (Revenge Song) పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (2016)
సంగీతం: JB
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, హైమత్

వస్తున్నా ఓ నేస్తం 

Palli Balakrishna Friday, August 6, 2021
Naanna Nenu Naa Boyfriends (2016)
చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రావురమేష్, హెబపటేల్ , అశ్విన్, నోయిల్ సేన్, కేరింత నూకరాజు, తేజస్వి మదివాడ
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, మానస, మహలక్ష్మి
విడుదల తేది:  16.12.2016


చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రకాశ్ పరిగోష్

మౌనమా ఓ మౌనమా మాటలేదుగా
పాదమా ఓ పాదమా బాటలేదుగా
తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

ఆశ ఆవిరైపోతుందే
శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి
చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరితీసి
బాధకు ఊపిరి పోసావే

సరదా సరదా స్వేచ్ఛను తెంచి
సంకెలలాగా మార్చావే
జతగా బ్రతికే బదులే వెతికి
జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ తప్పుకెళ్లి పోతుందే
తల్లకిందులై పోతుందే
ఆరి పోతుందే తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా
శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా
నొప్పి అనేది అందరికా

మూడే ముళ్ళు ప్రేమే కోరగ
మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగ
ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి

చిక్కు పెద్దదై పోతుందే
దిక్కు తోచకుండ పోతుందే
లెక్క నేడు మారిపోతుందే
తీరి పోతుందే చేయి జారి పోతుందే



Palli Balakrishna Monday, March 1, 2021
Anukshanam (2014)


చిత్రం: అనుక్షణం (2014)
సంగీతం:
నటీనటులు: మంచు విష్ణు, నవదీప్, రేవతి, మధుశాలిని, తేజేస్వి మదివాడ
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 13.09.2014


Palli Balakrishna Tuesday, February 19, 2019
Kerintha (2015)

చిత్రం: కేరింత (2015)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి మాడివాడ, సూకీర్తి, విస్వంత్ దుద్దుమ్పూడి, పార్వతీశం
కథ: అబ్బూరి రవి
దర్శకత్వం: సాయి కిరణ్ అడవి
నిర్మాత: దిల్ రాజు
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. చక్రవర్తి
ఎడిటర్: మధు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేది: 12.06.2015

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

నల్లని పుట్టు మచ్చ దిస్టే తీసిందా
కొత్తగా అందాన్ని ఇంకొంచం పెంచిందా
పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా
తనవెలుగే మెరుగైపోగా
హృదయం నిండుగా అచ్చయ్యావుగా
తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం

ఆలలా అలా అలా వచ్చావో
కలలా జోలలు పాడి ఏమైపోయావో
మరలా చెలి నిన్ను చూసేదెలాగో
నిను చేరే దారెటు ఉందో
అది తెలిపేందుకే నను పిలిచేందుకే
వదిలెల్లవుగా నీ చెవి ఝంకి నాతో

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం
ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను
చూస్తూ నిలబడిపోయా
మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే
ఎత్తుకుపోయే ఎద

మిల మిల మిల మిల  మెరుపులా చెల్లాయిలా
కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం
కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా
అంబరాన్ని ముద్దాడిన ఆనందం


Palli Balakrishna Sunday, February 11, 2018
Balakrishnudu (2017)

చిత్రం: బాలకృష్ణుడు (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీవల్లి
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి
నటీనటులు: నరారోహిత్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: పవన్ మల్లెల
నిర్మాతలు:  బి.మహేంద్ర బాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల తేది: 2017

రెండే రెండు కళ్ళు చాలవుగా
సంద్రంలా నా గుండె కన్నీళ్లు
రెండే రెండు కళ్ళు ఆగవుగా
ఊపిరినే నలిపేసే ఎక్కిళ్ళు
ఏమని నిమిషాన్ని అడగను నేను
నువులేని ఈ సున్యాన్ని ఏమనుకోను
మనసెంతో బాగుంది ఎప్పటివరకు
చేజారిపోయింది అశేపడకు
నీ రెక్కలు నాకిచ్చి నా స్వప్నము కదిలించి
సంతోషం తెలిశాక వెలిపోగలమా
నా రెప్పల బరువు నీ ఊసులు నడుగు
నా ప్రేమకు బదులు ఈ ప్రశ్నకు తెలుసు

రెండే రెండు కళ్ళు ఎందుకనో
కన్నీళ్లే వదిలేసే నన్ను
రెండే రెండు కళ్ళు ఎందుకని
నిలదీసి నన్ను అడిగెను
ఈ దూరం నీ దూరం తెలిసేలోపు
నీ ధ్యాసతో నా శ్వాసను కలిపేశావు
బాగుందే బాగుందే ఇప్పటివరకు
ఇకపైన కనపడదు మనసే పడకు
నీ నవ్వుల అద్దంలో నను నేను చూశాక
వెలితేదో తెలిసిందే వెలిపోయాక
నువ్వులేని రేపు ఏం తోచదు నాకు
తొలిసారి నాలో ఎండమావులు

Palli Balakrishna Saturday, November 11, 2017
Subramanyam for Sale (2015)



చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర, ఆదా శర్మ
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 24.09.2015



Songs List:



సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: రాహుల్ నంబియార్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  




I'm in love పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: ఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య అయ్యంగార్

తొలి తొలిగా తొలకరిగా తోసెను ముందుకు  తొందరలు 
కలివిడిగా కలిసెనుగా చూపుల దొంతరలు 
మనసును గట్టి మేళమే 
మనువుకు తట్టి లేపగా 
మెలకువలో కలలు కానీ మెలికలతో 
ఈ  సందల్లో సంద్రాలు నిలువెల్లముంచేస్తుంటే

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

దూరం  మాయం  కానీ ప్రాయం సాయం  రాని
నాలో  పొంగే  ప్రేమే  నీకే  సొంతం  కానీ 
మాటే  పలికే  మంత్రం 
మనసే  మంగళ  సూత్రం 
నీలో  నాలో  వయసుల  వేడే అగ్నిహోత్రం 
నీకు  నాకు  చేరువైన  ఈ  వరసలు  మారి
నీతో  సాగే  మనసు  నిన్ను  కోరి 
మగసిరికి  సొగసరికి మది  కలిసే  సుముహూర్తంలో
 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

బిందె  లోతుల్లోన రింగ్ తీసే సీను 
గుండెలోతుల్లోంచి  లాగిందంట  నన్ను 
మనసే  చిటికెన  వేలై  కలిసే  ప్రేమకు  వేలై 
రోజు  చూస్తూ  ఉంది  నీకై  వేయి  కల్లై 
నువ్వు  నేను  ఆగలేని  ఈ  తొందర  తెలిసే 
గుండెల్లోనే  మంటపాలు  వెలిసి 
విరిసిన  ఈ  తలపులిలా 
కురిసేను  లే  అక్షింతలు  గా 

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 



ఆకాశం తస్సాదియ్య పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: కృష్ణ చైతన్య,  రమ్యా బెహ్రా

ఆకాశం తస్సాదియ్య




గువ్వ గోరింకతో పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, రమ్యా బెహ్రా

(ఈ పాట ఖైది నెం 786 (1988) సినిమాలో పాట దీన్ని రీమిక్స్ చేశారు, ఒరిజినల్ గా ఈ పాటకు రాజ్-కోటి సంగీతం అందించగా, యస్.పి.బాలు, యస్.జానకి గారు పాడారు)

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై 

అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
 
జోడుకోసం గోడ దూకే వయసిది 
తెలుసుకో అమ్మాయిగారు 
అయ్యొపాపం అంత తాపం 
తగదులే తమరికి అబ్బాయిగారు 
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం 
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం 
కోరుకున్నానని ఆట పట్టించకు 
చేరుకున్నానని నన్ను దోచేయకు  
చుట్టుకుంటాను సుడిగాలిలా...

అరె  గువ్వ - హా.., గోరింకతో  - హా.. 
ఆడిందిలే బొమ్మలాట 
హేయ్.. నిండు -  హా.. నా గుండెలో - అహా.. 
మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్.. 

కొండనాగు తోడు చేరి 
నాగిని బుసలలో వచ్చే సంగీతం 
సందెకాడ అందగత్తె 
పొందులో ఉందిలే ఎంతో సంతోషం 
పువ్వులో మకరందము ఉందే నీ కోసం  
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం 
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 
దూరముంటానులే దగ్గరయ్యేందుకు 
దాచిపెడతాను నా సర్వమూ... 
 
హేయ్... గువ్వ  - హాయ్.. గోరింకతో  - హాయ్.. 
ఆడిందిలే బొమ్మలాట 
అహ.. నిండు - హా.. నా గుండెలో - అహ
మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై




తెలుగంటే పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

తెలుగంటే

Palli Balakrishna Thursday, October 12, 2017
Pandaga Chesko (2015)


చిత్రం: పండగ చేస్కో (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మేఘ
నటీనటులు: రామ్ పోతినేని,  రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: రవికిరీటి
విడుదల తేది: 29.05.2015

తొలిసారి కలవరం ఏంటో చలిజ్వరం ఏంటో ఈ కళవేంటొ
ఆ పైన మైమరపేంటో మతిమరుపేంటో ఈ గొడవేంటో
బుగ్గల్లో భూకంపాలే రప్పించేలా చేశాడెంటో
మనసంతా మాగ్నెట్లాంటి చూపులతో లాగేశాడేంటో

దునియాలో నీలాంటోడ్ని కలలోనూ చూడలే
నిను చూసిన దగ్గరనుంచి నా కలలు ఆగలే
పరువాన్నే పడగొట్టే చిఛ్చర పిడుగళ్ళె

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

ఈ గుఱ్ఱం లాంటి వయసుని ఆపే కళ్లెం నువ్వేలే
నీ హై వోల్టేజ్ టెంపర్ చూసి టెంప్టయిపోయాలే
అయ్ సూదంత నువ్ చోటిస్తే
నీ ఒళ్ళంతా టాటూ అయిపోనా
నువ్ చారణ సీన్ అందిస్తే
నే బారాణా బొమ్మయి చూపైనా

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

Palli Balakrishna Monday, September 4, 2017
Srimanthudu (2015)




చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు , శృతిహాసన్
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: వై. నవీన్, వై. రవిశంకర్, సి.వి.మోహన్, మహేష్ బాబు
విడుదల తేది: 07.08.2015



Songs List:



రామ రామ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సూరజ్ సంతోష్ , రనైనా రెడ్డి

హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమీచంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు... 
వాడే శ్రీరాముడు...

హేయ్ రాములోడు వచ్చినాడురో దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో
కోరస్: దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో

నారి పట్టి లాగినాడురో దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో
కోరస్: దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో

ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకశాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని వేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ
మరామ రామ రామ రామ రామ రామ రామ

హే రాజ్యమంటె లెక్కలేదురో దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో
కోరస్: దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో

హే పువ్వులాంటి సక్కనోడురో దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో
కోరస్: దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో

హేయ్ బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో...

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా  

హే రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ల చూపుతాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

హేయ్ జీవుడల్లే పుట్టినాడురో దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో
కోరస్: దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో

హేయ్ నేలబారు నడిచినాడురో దాని తస్సదియ్య పూల పూజలందినాడురో
కోరస్: దాని తస్సదియ్య పూల పూజలందినాడురో

హేయ్ పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా 
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా




జత కలిసే జత కలిసే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్, సుచిత్ర

జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళకొక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరూ
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు
 
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
  
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ




ఓ చారుశీలా.! పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి , దేవి శ్రీ ప్రసాద్
గానం: యాజిన్ నజీర్, దేవి శ్రీ ప్రసాద్

Oh my beautiful girl, Do you really wanna get on the floor,
Oh my glittering pearl, Let's get on and rock n roll

Oh my beautiful girl, Do you really wanna get on the floor,
Oh my glittering pearl, Let's get on and rock n roll

Oh my beautiful girl, Do you really wanna get on the floor,
Oh my glittering pearl, Let's get on and rock n roll

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!
హే... హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా
చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా
ఓ పార్టు పార్టు పిచ్చ క్యూటు ఇండియన్ మసాలా
నీ స్మైలే లవ్ సింబలా...

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!

Oh my beautiful girl, Do you really wanna get on the floor,
Oh my glittering pearl, Let's get on and rock n roll

కోనియాకులా కొత్తగుంది కిక్కు కిక్కు కిక్కు కిక్కు
చేతికందెనే సోకు బ్యాంకు చెక్కు చెక్కు చెక్కు చెక్కు
మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన గ్లామర్ డిక్ట్స్నరి నీ నడుం వొంపున సీనరీ 

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.! నాలోన గోల.!

లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా హంసా హంసా హంసా
వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా  వయసా వయసా వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే...
నా కనురెప్పలు కత్తులు దూసెనె నువ్విలా జింకలా దొరికితే

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!



పోరా శ్రీమంతుడ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: MLR కార్తికేయన్ 

పోరా శ్రీమంతుడ 



జాగో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రఘు దీక్షిత్, రీటా

జాగో 



దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సింహా, గీతా మాధురి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాంకైపొద్దో ఆడే నా మొగుడు...
హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
పెట్టుకో ఉంగరాలే తెచ్చా ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా
ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే ఓలమ్మొలమ్మో నిన్నే చూస్తే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా... హే, జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా హే సింగాపూరు వాచీ తెచ్చా హే
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
సిలకా సింగారి ఓ సిలకా సింగారి జున్ను తునకా
రంగేళి రస గుళికా గుళికా అదిరే సరుకా
స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా
తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంటా ముచ్చట
నీ గుండె మీద పులిగోరవుతా ... నీ నోటి కాడ చేప కూరవుతా
నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా
నువ్వేగాని కలకండైతే నేనో చిన్ని చీమై పుడతా
తేనీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జత కడతా

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా
తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే
నీ పక్కనుండి పచ్చిగాలి పీల్చినా ఎదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా
వెచ్చాని నీ చూపులొతున బంగారు బంగు దాస్తివే
మిరమిరా మిరియం సొగసే పంటికింద నలిగేదెపుడే
కరకరా వడియంలాగ నీ కౌగిలింతలోన నన్ను నంజుకోరా ఇప్పుడే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే సమ్మసమ్మగా దిమ్మతిరిగే
హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా




నీలా నున్నుండ నీయదె పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: MLR కార్తికేయన్ 

Neelaa Ninnundaniyyadhey Lokam/Poraa Srimanthudaa 
(Unreleased-Theatrical Version)

నీలా నున్నుండ నీయదె

Palli Balakrishna Saturday, August 19, 2017
Mister (2017)


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియర్
నటీనటులు: వరుణ్ తేజ్, హెబా పటేల్
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాతలు: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్
విడుదల తేది: 14.04.2017

ఎదొ ఎదొ బాగుందే  ఎంతొ ఎంతొ బాగుందే
నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బగుందే...

నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే
నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే

ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హృదయముంది నీకొరకె
ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె
తెల తెల్లని యెద కాగితం నీ కలలు నిండి కలలొలికె
లేదే ఇక యే కోరికె
పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ
వరించి వాలెను వెన్నెల నువ్వె

ఎంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను
నా ఊపిరి నువ్వంటు నేనెల చూపను
నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలెను నాలొ ఉన్న నిన్ను

నీ రాకకు మునుముందుగా నిశ్శబ్దమైన సంబరం
నా జీవితం పేరిప్పుదు అందల అద్బుతం
ఈ గుందెపై చేశావులే నీ వలపు సంతకం
ఆకసం తాకిందే ఆనందం...

ప్రియ స్వాగతం సుస్వాగతం
నా హృదయముంది నీకొరకె
ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె
తెల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికె
లేదే ఇక ఏ కోరికె
పిలిచె పెదల ముంగిట వరాల జల్లుగ
వరించి వాలెను వెన్నెల నువ్వె



********  *******   ********


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రమ్యా బెహారా

కనులకె తెలియని కలలతో పరిచయం
ఎపుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం
పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం
అలిగినా మనసుకె దొరికినా కొత్త లోకం
రెక్కల్ లేకున్న మబ్బులొ ఉన్న
చుక్కల్లొ ఉన్న ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న

అ అ ఆ... అ అ ఆ...

కదలనని కాలమె ఆగె తడవమని చునుకే రాలే...
కదలమని గాలులు వీచే తడమమని పువ్వులు వీచే...
ఇదివరకు ఎరుగనిదె జరిగినదా
ఎద అడుగులున్న తది కదిలినదా
ఇది ఎమొ గాని బానె ఉందే...

అ అ ఆ... అ అ ఆ...

తనననానన నానన...

తగలనని సూర్యుడు దాగె కలవమని మేఘమె లాగె
వదలమని దిగులే వీగె విడువనని నవ్వులె ఊగే
గదినొదిలి అడుగులిల కదిలినవా
మది నదిలొ అడుగులకె మొదలు ఇదా
కదలేమొ ఆషగ రమ్మంటుందే...

అ అ ఆ... అ అ ఆ...
అ అ ఆ... అ అ ఆ...



********  *******   ********


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహారా

సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి...

నా అశల దేశం రాజకుమరా రావేరా
ఈ కొమలి కోసం కోటలు దాటి వచ్చెసా
ముద్దుల యుద్దం తోనె
నా మదిలొనా నీ జెండ ఎగరైరా
హద్దులె వద్దని నేనె
ఇద్దరు గెలిచె సంధె కలిపైన
సిగ్గుల కంచెలు తెంచె
చనువుని పెంచె కలలె కలిసె కందామ
సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి.....
సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి......

పొను పొను నాకు నేనే
కొత్తగ అవుతున్న

నే కొంచెం కొంచెం పరిచయం
మరుతోందె నా ప్రపంచం
పొగడకు చాలింక
మరవను నీ రాక
మెరుపులు తెచ్చైంది నీవె
కలలె మరిచ కనులె థెరిచ నీవె

సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి......
సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి....

రాను రాను దూరమైనా
రాదులె నీ నా మధ్య
దూరె దారె దొరకకా
దగ్గరేమొ తగ్గవింక
చెరి సగం అవుయున్న
తలపులు చూస్తున్న
వరసలు కలిపె వరన
ఎదురై కుదురె ఒకటై
నడిచె నీవె.......
సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి...
సయ్యొరి సయ్యొరి సయ్యొరి సయ్యొరి
సయ్యొరి సయ్యొరి సయ్యొరి.....



********  *******   ********


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: నకాష్ అజిజ్, మోహన్ భోగరాజ్, ఆదిత్య అయ్యంగార్, అనురాగ్ కులకర్ణి

ముసిరిన చీకట్లె చీల్చెసె భొగి
మిసమిక వాకిట్లో చిందేసె ఆగి
మనసున కోపాలె మంటల్లొ కాలి
మెరిసెను ఈ నేలె రంగొలీ వాలి
పచ్చ పచ్చంగ పల్లెంతా
మరిచె సంక్రంతి తనె ఇవ్వాల
ప్రతొడు పసొడై పతంగై
అల గాల్లొ తేలాలా
పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్
పద ముంగిట్లొ ముగ్గెసి గొబ్బిల్లె వెయ్
పద కొ కొత్త అల్లుల పందాలేసేయ్
ఇక వారు వీరు అని లేనే లేరు
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జమా జూమ్ జుమోరే
జమా జం నాచోరె

ప్రేమిస్తే ప్రేమైనా రాసి ఇచ్చెసె తెచ్చె ప్రేమా
చూసాలే నీలోనా మంచే మించేసె స్తానం నీదె
మనసున ఉంటె మనదనుకుంటె
మరిచిక స్వార్దాన్నె పంచాలి సంతొషాలై
నలుగురి వెంటె నిలబడి ఉంటె
గెలుపిక వచ్చేలె అడుగెస్తె నీతోపాటే
ప్రతొడు పసొడై పతంగై అల గాల్లొ తేలాలా
పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్
పద ముంగిట్లొ ముగ్గెసి గోబిల్లే వెయ్
పద కొ కొత్త అల్లుల పందేలేసేయ్
ఇక వారు వీరు అని లేనే లేరు
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జమా జూమ్ జుమోరే
జమ జం నాచోరె

అడుగులు అగుంటె దారౌతావు
అడగని సాయాలె తీర్చేస్తావు
అడుగున మిగిలున్న ఆసె నువ్వు
నా ధ్యాసె నువ్వు
తొలచిన చెయ్యే విడిపోదె ఈ హృదయం
వినమని నీకొసం వేచె సమయం
వదలను ఏనాడు నె నీ స్నేహం
నా ఈ జీవితం నీకె సొంతం

భుజములపైనే నిలబడి నేనె
తెలియని లోకాన్నె చూసాను నీ కల్లతొ
ఎదిగిన నువ్వె కనబడగానె
మురిసెను నా గుండె పొంగేలె ఆనందమే
ప్రతొడు పసొడై పతంగై
అల గల్లొ తేలాలా
పద సందడ్లె సందడ్లె సందడ్లె చెయ్
పద ముంగిట్లొ ముగ్గెసి గొబ్బిల్లె వై
పద కొ కొత్త అల్లుల పందాలెసై
ఇక వారు వీరు అని లేనే లేరు

జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జర జుమోరే జుమోరే జుమోరే జూమ్
జమా జూమ్ జుమోరే
జమ జం నాచోరె



********  *******   ********


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రమ్యా బెహ్రా

కనులకె తెలియని కలలతో పరిచయం
ఎపుడిలా ఎరగని వెలుగుతో కొత్త స్నేహం
పెదవులే మరిచిన నవ్వుకిదే శుభదినం
అలిగినా మనసుకె దొరికినా కొత్త లోకం
రెక్కలేకున్న మబ్బులొ ఉన్న
చుక్కల్లొ ఉన్న ఆ కాంతి రెప్పల్లొనె దాచెస్తున్న
అ అ ఆ... అ అ ఆ...

కదలనని కాలమె ఆగె తడవమని చినుకే రాలే...
కదలమని గాలులు వీచే తడమమని పువ్వులు వీచే...
ఇదివరకు ఎరుగనిదె జరిగినదా
ఎద అడుగులున్న తది కదిలినదా
ఇది ఎమొ గాని బానె ఉందే...

తనననానన నానన...

తనననానన నానన...
తనననానన నానన...

అ అ ఆ... అ అ ఆ...


తనననానన నానన...
తగలనని సూర్యుడు దాగె కలవమని మేఘమె లాగె
వదలమని దిగులే వీగె విడువనని నవ్వులె ఊగే
గదినొదిలి అడుగులిల కదిలినవా
మది నదిలొ అడుగులకె మొదలు ఇదా
కదలేమొ ఆశగ రమ్మంటుందే...
అ అ ఆ... అ అ ఆ...
అ అ ఆ... అ అ ఆ...


********  *******   ********


చిత్రం: మిస్టర్ (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ నంబియర్

ఎదొ ఎదొ బాగుందే ఎంతో ఎంతొ బాగుందే
నీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బాగుందే...
నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే
నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే
ప్రియ స్వాగతం సుస్వాగతం నా హ్రుదయముంది నీకొరకె
ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె
తెల తెల్లని యేద కాగితం నీ కలలు నిండి కలలొలికె
లేదే ఇక యే కోరికె
పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ
వరించి వాలెను వెన్నెల నువ్వె

ఏంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను
నా ఊపిరి నువ్వంటు నెనెలా చూపను
నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను
నీ రాకకు మునుముందుగా నిశబ్దమె నా సంబరం
నా జీవితం పేరిప్పుడు అందల అద్బుతం
ఈ గుందెపై చేసవులె నీ వలపు సంతకం
ఆకాసం తాకిందే ఆనందం
ప్రియ స్వాగతం సుస్వాగతం నా హ్రుదయముంది నీకొరకె
ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికె
తెల తెల్లని యెద కాగితం నీ కలలు నిండి కలలొలికె
లేదే ఇక యె కోరికె
పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ
వరించి వాలెను వెన్నెల నువ్వె

Palli Balakrishna Tuesday, August 15, 2017
Babu Baga Busy (2017)


చిత్రం: బాబు బాగా బిజీ (2017)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: కరుణాకర్ ఆడిగర్ల
గానం: సునీల్ కశ్యప్
నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, మిస్థి చక్రవర్తి, తేజెస్వి మాడివాడ
దర్శకత్వం: నవీన్ మేడారాం
నిర్మాత: అభిషేక్ నామా
విడుదల తేది: 05.05.2017

ఊరినిండా పోరీలు ఊరించి చంపుతుంటారు
ఊరబెట్టి సోకును అబ్బా ఊపిరాడనివ్వరు
నాది  సిటారు కొమ్మనున్న గుండెకాయ
ఆడ చూపులకే రాలిపోయే చింతకాయ
చీర కట్టుకుంటే చెట్టుకైన ఎంత మాయ
గుండె పట్టాసు లాగ కొట్టుకుంటుందయ్య
ఉన్నదేమో జానెడు దానికుప్పెనంత ఊపుడు

హే హంటర్ వీడు హంటర్
తేనె దొంగిలించు తుమ్మెదంటే హంటర్
వీడు హంటర్ వీడు హంటర్
వీడి మీద ఉన్న కుర్రకారు మెంటర్

హా ఉప్పు కారం తిన్నది ఊరుకోదు బాడీ
గోడెల్లి దూకుతుందే ఆ పైన
మేడల్లో దూరుతుందే సందేలా
సండేలో పాకుతుండే ఇది నైటు
కోడెనాగులాగ లేసి తెల్లార్లు బజ్జోక
కంగారూ పెట్టేస్తాదో ఏదో
పాడు ఆశ మొండికేసి తెంపేది
అంటుంటే నరాలు పిండేస్తాదేమో
ఆ ఆ... నరజన్మ ఓ వరమురా
నవరసములు ఉండాలిరా

విందైనా పొందైనా ఇంకాస్త దోసుంటే
ఈ జన్మ కసలైన పరమార్ధముంటుందే


హే హంటర్ వీడు హంటర్
తేనె దొంగిలించు తుమ్మెదంటే హంటర్
వీడు హంటర్ వీడు హంటర్
వీడి మీద ఉన్న కుర్రకారు మెంటర్

Palli Balakrishna
Seethamma Vakitlo Sirimalle Chettu (2012)




చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: వెంకటేష్ , మహేష్ బాబు, సమంత, అంజలి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 11.01.2013



Songs List:



ఏం చేద్దాం...పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, శ్రీరామ చంద్ర, రంజిత్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం
ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా

ఫాలో పదుగురి బాట బోలో నలుగురి మాట
లోలో కలవరపాట దాంతో గడవదు పూట
ఇటా ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా
ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి ఎం ప్రయోజనం
సిమెంట్ భూతల సహారెడారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఎన్నో పనులను చేస్తాం ఏవో పరుగులు తీస్తాం 
ఊహూ సతమతమవుతాం ఓహొ బ్రతుకిదే అంటాం
అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే
ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా
ఏం చేద్దాం... అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం... మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం... మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం... తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా




ఆరుగుడులుంటాడా పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కళ్యాణి

ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్లిపోతే

ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా


మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా
కబుర్ల చినుకులతో పొడి కలలన్ని తడిపేయ్యడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊపీయడా
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనకే తిరుగుతూ
నేవ్వేనా సమస్తం అంటాడే
కలలోన కూడా కాలుకందనీడే

ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా


అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలాలి
కోరికేదయినా గానీ తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి వయస్సే తపిస్తూ ఉంటుంది
అపుడింక వాడు నన్ను చేరుతాడే




సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: చిత్ర

ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి అహ సిగ్గంతా చీర కట్టింది
చీరలో చందమామా ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పే తంతెందుకండి
కోదండరామయ్య వస్తున్నాడండీ

రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా

సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యమొందే వేళిది
మూడు ముళ్లు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా... ఓ...
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా
ఆ మాటా విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీతా గుండె
అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం

జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా చుట్టూ  చెట్టూ చేమా...ఓ...
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ... ఓ...




ఇంకా చెప్పాలే పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్వేతా పండిట్, రాహుల్ నంబియర్

ఓహో ఓ అబ్బాయి  నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడని కనుకుంటు వచ్చానే

వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా
నీకై జతగా అవ్వాలని...

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడని కనుకుంటూ వచ్చానే

మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవటం కోసం ఇంతలా ఇరవై ఏళ్లా
ఏం చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా
అంతొద్దే హైరానా నచ్చేస్తారంటున్నా 
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా

మేము పొమ్మంటే ఎంత సరదానా  మీకాక్షణం
మీరు వెళ్తుంటే నీడలా వస్తాం వెనకా
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనుక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు 
మా కోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా




మరీ అంతగా పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామ చంద్ర

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడా పడకు అలా
మతోయేంతగా శృతే పెంచగా విచారాలా విల విల
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా

కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరలా నిను చూడాలంటే అద్దం జడిసేలా ఓ
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా

మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా

ఎండలను  దండిస్తామా వానలను నిందిస్తామా
చలినెటో తరమేస్తామా ఛీ పొమ్మని 
కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా 
రోజులతో రాజీ పడమా సర్లేమని
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం

ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా
అయ్యెయ్యె పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా

చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు

మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు

ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా

మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు

ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా




వాన చినుకులు పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్, అంజనా సౌమ్య

వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే 
ఎట్టాగ లొంగుతుంది సొగసే

అగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరే అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని 
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే

నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటను గొడుగుగా చేసేనోయ్
అరే ఊపిరితో చలి కాసానోయ్
హే... ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా 
ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే

వాన చినుకులు, వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే

సిగ్గులతో మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిసా ఒళ్లు హరివిల్లుగ వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిరుగులు తొడిగాయో
నువ్వు కుండపోత లాగా వస్తే 
బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే

వాన చినుకులు ఇట్టా తడిపితే 
ఎట్టాగ అగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే

ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరే అబ్బాయంటే అంత అసులే
నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే



మేఘాల్లో సన్నాయి రాగం మోగింది పాట సాహిత్యం

 
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, శ్రీరామ చంద్ర

మేఘాల్లో సన్నాయి రాగం మోగింది 
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి

అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ
మెచ్చుటకు ముచ్చటగ  ఇది సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ

ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా
ఇంతమందున్నామే అనిపించే బింకం చాటుగా 
కాస్తయినా కంగారు ఉంటుందిగా
నీకయితే సహజం  తీయని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలు వచ్చిందే ఈ సమయం
మగాళ్లమమ్మా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ


రామ చిలుకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజ హంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏ మాత్రం ఏ చోటా రాజీ పడలేక
చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చెమర్చేలా
గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కనులను విచ్చేలా
కలల్లోనైనా కన్నామా కథనైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా

అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ

Palli Balakrishna Monday, July 31, 2017
Manam (2014)


చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాస్టర్ భరత్ & కోరస్
నటీనటులు: నాగార్జున, శ్రేయ శరన్, నాగచైతన్య , సమంత
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 23.05.2014

నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ...

లలలల లలాల లలలల లలాల
లలలల లలాల లాలలా

కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ
ఒకరిది మాటా ఒకరిది భావం
ఇరువురి కధలిక కదిపిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

నాననా నననా నాన నాననా నానా నాన
నాననా నననా నాన నాననా నననా నాన

హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
హా... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ

నననన ననాన నననన ననాన
నననన ననాన నానా నానా
నననన ననాన నననన ననాన
నననన ననాన నానా నానా




******   *******   ********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్

నననాననా నననాననా నాన నాననా
నననాననా నననాననా నాన నాననా ఓ...

కనిపెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపూ ఇరువురి కలయిక కంటిచూపూ
ఒకరిది మాటా ఒకరిది భావం ఇరువురి కధలిక కదిపిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

హా దీరనా దిరనా నాన దీరనా దీరనాన
దీరనా దిరనా నాన దీరనా దీరనాన

హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
పిల్లలువీల్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోలతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కధ ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా...

అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలళొ పదిలము కద ఇది
ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా...
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణముకదా... అ... అ... అ...




***********   *********   **********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి
గానం: అర్జిత్ సింగ్

ఓ కనులను తాకే ఓకలా చూపే నిన్నిలా
నన్నే మార్చినా నువ్వైయేలా...
ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా
నీనవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా
నీలోనే ఉన్నా నిప్రేమే నేకోరుతున్నా
నీలో ఉన్నా నీతోడై ఉన్నా నిన్నే నేప్రేమించినా
ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ

హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయనె
ఏమైందో ఈనిమిషం దూరమాయనే
వెన్నెలింక చీకటయ్యేలా నవ్వులింక మాయమయ్యేలా
బాధలింక నీడలాగ నాతో సాగేనా
నాలో రేగింది  ఓ గాయమే దారే చూపేనా ఈకాలం...
నీవేనేలా నీమౌనంనేలా నీ ఊసే ఈగుండెలోనా నీతోలేనా అహా...
ఓ కనులను తాకే ఓకలా... ఓ...ఓ

చంద ఓ చందమామా రావా మావెంటే రావా
పైనే నువ్వుదాక్కున్నావా...
వానా ఓ వెన్నెల వానా రావా నువ్వైనా రావా మాతో నువ్వు చిందేస్తావా...
ఓ ఈదూరం ఎందాకా తీసుకెల్లునో ఈమౌనం ఏనాటికి
వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా
పంతమింక ఊపిరయ్యేనా నీటిమీద రాతలాగ
ప్రేమే మారేనా ఇంకా ఈజీవితం ఎందుకో
కంట కన్నీరు నింపేందుకో... ఓ...ఓ
నీతో రానా నీ నీడైపోనా నీకోపం వెంటాడుతున్నా
నీలో లేనా అహా...




*******   ********   ********


చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయాఘోషల్, అశ్విన్ శేఖర్, హరి, అనూప్ రూబెన్స్

యాయాయే యాయాయా
యాయాయా యాయా యాయా యా

హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి  ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ ఏంచెయ్యనూ...
తొలిచూపు నీపైనే తొలిపలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగెనే హో హో హో
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...

ఉఁ యాయాయే ఉఁ యాయాయా
యాయాయా యాయా యాయా యా

ఓ... ఐ లవ్ యూ...ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
అంటే... ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు
హో ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహమూ ప్రేమ రెండు నావే...
హో వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే
గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే హు హూ
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే హు హూ

హో... నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్నే...
హో... ఇద్దరే ఉన్నామే ఒక్కరై అదితామే ముగ్గురైపోయె ముద్దులోనే
ప్రేమనే పంచావే పాపలాచూసావే మన ప్రేమ  పాపైందిలే...
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
ఓహో చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...

హో చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే
ఓ... చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి  ఊహలు ఎదలో ఊగెనే
ఏంచెయ్యనూ...
తొలిప్రేమ నువ్వేలే తుదివరకు నీతోనే
ఈ మాట మాలో మోగెనే హే హే
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే  హొ హో
చిరు చిరు  ఊహలు ఎదలో ఊగెనే...




********    *******   *********




చిత్రం: మనం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్
గానం: అనూప్ రూబెన్స్, జస్ప్రీత్ జస్జ్

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట ఎవ్రీబడీ...
టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట...

బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన
గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన
ఫుల్లు నింపు... ధీంతన ధీంతన
కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా

కిక్కు వస్తది... ధీంతన ధీంతన
మస్తి చేస్కో...ధీంతన ధీంతన
నైటు మొత్తం...ధీంతన ధీంతన
కింగు నువ్వే... ధీంతన ధీంతన

సుక్కేసి చూసెయ్ రో ఆ సుక్కల్ని తాకెయ్ రో
బాధల్ని దించెయ్ రో లైఫు ని నవ్వుల్తొ నింపెయ్ రో
ఆ డ్రింకు డ్రింకు హెయ్...
ఆ ఫుల్లుగ డ్రింకు హెయ్...
ఏ రోజైనా ఏ టైం అయినా ఇది తాగుట నువ్వే కింగే రో

పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే  అ ఫుల్ టూ

నేను పుట్టాను...

ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను...

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకం తో పని ఏముందీ
డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్...

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా  టాటా టట్టట్టట్ట

హేయ్ బాటిల్ ఖోలో... ధీంతన ధీంతన
గ్లాసు తీసుకో... ధీంతన ధీంతన
ఫుల్లు నింపు...ధీంతన ధీంతన
హే కొట్టు డ్రింకు... ధీంతన ధీంతన

పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను...

ఆ పీయో పీయో రే అరె ఫుల్ టూ పీయో రే
అరె పీయో పీయో రే అ ఫుల్ టూ

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకం తో పని ఏముందీ
డోంట్ కేర్... కేర్ కేర్ కేర్ కేర్...

టాటా టట్టట్టట్ట టట్టాట టట్టట్టా టాటా టట్టట్టట్ట
టాటా టట్టట్టట్ట








Palli Balakrishna Sunday, July 16, 2017
Malli Malli Idi Rani Roju (2015)



చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
నటీనటులు: శర్వానంద్, నిత్యామీనన్
దర్శకత్వం: క్రాంతి మాధవ్
నిర్మాతలు: కె.ఎ.వల్లభ
విడుదల తేది: 06.02.2015



Songs List:



ఎన్నో ఎన్నో వర్ణాల పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్, చిన్మయి

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వీచే చలి చలి
ప్రేమ రాగాల ప్రళయ కలహాలు నాకు నీవే నీవే
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే

నీకోసమే ఎదనే గుడిలా ఇలా మాలిచే నా మనసే
నీ కానుకై నిలిచే తనువే...
నవరసమే నీవంట పరవశమై జన్మంత
పరిచయమే పండాలంటా ప్రేమ ఇంకా ఇంకా
మరి మరి నీ కవ్వింత విరియగ నా ఒళ్ళంతా
కలిగెనులే ఓ పులకింతా ఎంతో వింత
నువ్వూగిన జగమున నిలుతునా ప్రియతమా
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే

ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై మెరిసెలే
మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వీచే చలి ప్రేమ
రాగాల ప్రళయ కలహాలు నాకు నీవే నీవే
వేవేళ ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోను
పూచేటి పూలన్ని నీ హొయలే




మరహబ పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: చిత్ర, ఐశ్వర్య

మరహబ మా మరహబా ఆఆ మరహబా

వన్డే వందనమయ్యా దేవా
వాతాపి విజ్ఞ దేవా
సౌందర్య దివ్య భావ
మా పూజలందుకోవా
కైలాస దేవా దేవా
కరుణించు మహాదేవ
ప్రేమించా మమ్ము రావా
శరణంటిమయ్యా
విజ్ఞ వినాయక శ్రీ శుభదాయక

భారతీయ ప్రణవ నాదమిది
ఏ భక్తి పరులు ముదమున పలికిన
మానవతకు ప్రధమ పంక్తి ఇది
ఏ మౌనివరులు జగతికి తెలిపిన

ప్రేమే అందాల సృష్టి చిత్రం
అరుదైన దేవా శిల్పం
మందార దూప దీపం
మహనీయ మంత్ర పుష్పం
ఓ అన్నమయ్య గీతం
ఆ త్యాగరాజు తత్వం
శ్రీరామదాసు చరిత్రం
మన తెలుగు మర్యాదమ
స్వగము యోగ విచారము

ప్రతి గొంతును పల్లవించు
స్వరము వారమే
బ్రతుక ఎదలయలోన
రవళించు శ్రుతులు ఒకటే

ఏకమైనా మమతల
మధురిమలు జ్ఞానమే
వేదమే కాదా

సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్ప గుంచం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకార్థం
నీ మనసు నాకర్ధం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలియును నీ మది

సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్ప గుంచం
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్ఛం
నిజమైన ప్రేమకార్థం
నీ మనసు నాకర్ధం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలియునే నీ మది

జిందగీ అది ఒక గజి బిజీ
అర్థమే కాదు ఎవరికీ
కనులకే పైన కల నువు
న న కాదు అంటుంది కభీ కభీ
ఎదను ఎదురజేయు పదానిసలతో
పదములు కలిసిలో కరో సిల్సిలా
శిలను కరుగాదీయు సరిగామాలతో
ఈ మేర దిల్ జల

భారతీయ ప్రణవనాదమిది
ఏ పరమ గురులు ముదమున పలికిన
జాతి నడుపు జీవ నాడి ఇది
ఈ జ్ఞాన ధ్వనులు జగతికి తెలిపిన

ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు
ముద్దు గారె యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాణి మహిమల దేవకీ సుతుడు




చోటి జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: హిరన్మయి
గానం: రామజోగయ్య శాస్త్రి

చోటి జిందగీ
కానే కాదిది
కోట్ల సెకనుల
కానివ్వలిది

ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ

చోటి జిందగీ
కానే కాదిది
కోట్ల సెకనుల
కానివ్వలిది

ఊఊ ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ

ఈ రోజుకే నేరుగా
మరొకరోజు వేరుగా
ఏ రోజుకైనా తోడుగా
ఆనందముంటే చాలుగా
ప్రపంచానికొస్తూనే తెమ్మంటూ
ఇచ్చింది అలానే ఉందిగా

చాలు చాలిగా
అదేం వేడుక
నా దారి కాటు ఇటు
పారిపోని వసంతాలు

ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ

చోటి జిందగీ
కానే కాదిది
కోట్ల సెకనుల
కనివ్వనిది

తుంచేస్తే పోయే బరువును
ఉంచేసుకుని మోయన
నెమ్మది కోరే మనసును
నీకళ్ళలోకి తోయన
నటించేటి లోకంలో
నమ్మించే మాటల్లో
జనమంతా జంజాటమై
అల్లాడన నేనేం
చిన్న పిల్లనా
సంకెళ్ళ చెర
సంబరాల కల చూపిస్తుందా

ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ

చోటి జిందగీ
కానే కాదిది
కోట్ల సెకనుల
కానివ్వలిది

ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ
ఏముందేముందని
మరి ఎం లేకుంటే లేదని
చిరునవ్వే ఆస్తిగా
ఆలా ఆలా వెళ్ళిపోని జానీ





గతమా గతమా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ప్రియ హమేష్

గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఉసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా
కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా

గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను

ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలపులే ఓదార్పుగా
నిషిలో నిషినై నిలిచా కాలమే జవాబుగా

గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఉసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా
కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా




వరించే ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (2015)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సాహితి
గానం: హరిచరణ్

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నీరీక్షణే నీకై
చేసినానే క్షణమొక యుగమై

నీవు లేని నా ప్రయాణమే
నిదుర లేని ఓ నయనమే
నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సోలిసే
నిన్ను తలిచే ఏ రోజున
నిలుప లేక ఆ వేదన
జరిపినానే ఆరాధన తెలిసే తెలిసే

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

వరంగా నాకో నాడే
నువ్వు కనిపించంగా
ప్రియంగా మాటాడనే నెం నును వెచ్చగా
ఓహో నా మనసుకి చెలిమైనది నీ హస్తమే
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే

నీ చూపులు నా ఎదచొరబడనే
నీ పలుకులు మరి మరి వినపడనే
నీ గురుతులు చెదరక నిలపడనే
ఒక తీపి గతమల్లె

నిండు జగతికి ఓహ్ జ్ఞాపకం
నాకు మాత్రం అది జీవితం
ప్రేమ దాచిన నిష్టురం మదిని తొలిచే
అన్ని ఉన్న నా జీవితం
నీవు లేని బృందావనం
నోచుకోదు లే ఏ సుకం తెలిసే తెలిసే

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

నజీరలే నీ లోకం ఓహ్ పెను చీకటే
శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే
ఓహో తాను శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే
ఓహో తన ధ్యాసలో స్పృహతప్పేనే నా హృదయమే

తన రాతకు నేనొక ఆమణిగా
ఒక సీతను నమ్మినరామునిగా
వనవాసము చేసెడి వేమనగా వేచ్ఛేను ఇన్నాళ్లు

తరవ ప్రళయ ధారావా దూరమై దరికి చేరవ
మధురై ఎదను మీటావా మనసే మనసే
ప్రేమనై పొంగే వెల్లువ తేనెలే చిలికి చల్లగా
తీగల నన్ను అల్లవ తెలిసే తెలిసే

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తాం చేశా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నీరీక్షణే నీకై
చేసిననే క్షణమొక యుగమై

నీవు లేని నా ప్రయాణమే
నిదుర లేని ఓ నేనని
నిన్నే వెతికేనే నా హృదయమే అలిసే సోలిసే
నిన్ను తలిచే ఏ రోజున
నిలుప లేక ఆ వేదన
జరిపిననే ఆరాధన తెలిసే తెలిసే

Palli Balakrishna Wednesday, July 5, 2017
Lovers (2014)







చిత్రం: లవర్స్ (2014)
సంగీతం: జె.బి. (జీవన్ బాబు)
సాహిత్యం: ఓరుగంటి
గానం: దివ్యా దివాకర్, సాయి చరణ్ భాస్కరుని
నటీనటులు: అశ్విన్ సుమంత్, నందిత, తేజస్వి
దర్శకత్వం: హరినాథ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబు
విడుదల తేది: 15.08.2014

ప్రియతమా నా మనసే 
పువ్వాల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ…

తెలిసిన నా వయసే 
జుంమ్మని తుమ్మదల్లే ఎగిరెనే
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..

ఏదురుగా ఎన్నళ్లాని నిలవను
వినపడి నీ గుండెల సవ్వడిని
ఓ ఓ ఓ ఓ

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
తెలుసున వరసే ఓ ఓ ఓ ఓ

ఏవేవో ఊహలు ఊయలులూగె
నా ఊహ కోరిన ఊపిరి నీవు మరి
ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే
నా చూపు సోకిన తారక నీవె

కాలాలు తెలియని హాయిలో
నీ ప్రేమకు జత పడనా
తీరాలు కలిసిన దారిలో
ఇలా ఆలై ఎగసి పడనా

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
కరగనీ ఈ క్షణమే ఓ ఓ

మేఘాన్ని తాకిన గాలివి నీవె
లోలోనా దాచిన వానకు నీవు సరి
మేఘాలు దాటిన వేణువులూది 
రాగాలు తీసిన వేడుక నాదే
లోకాలు మరచీన ప్రాణమై నీతో ముడిపడిన
మౌనాన్ని విడిచిన గానమై
అలా అలా ఎదురు పడనా

ప్రియతమా నా మనసే 
పువల్లే పూసి నవ్వే చిలిపిగా
కరగనీ ఈ క్షణమే ఓ ఓ..



Palli Balakrishna

Most Recent

Default