-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vanamali"
Fidaa (2017) Telugu Songs Lyrics Album Cover

Fidaa (2017) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Fidaa (2017)
Music : Shakthikanth Karthick
Actors : Varun Tej
Actress : Sai Pallavi
Director : Sekhar Kammula
Producer : Dil Raju, Shirish
Release Date : 21 July 2017

Vachinde Song Lyrics in Telugu – Fidaa (2017)

'Vachinde' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Madhu Priya and Ramky.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
Singers : Madhu Priya, Ramky
చిత్రం: ఫిదా (2017) సంగీతం:శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: మధు ప్రియ, రాంకీ వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేషిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేషిండే వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేషిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే హే పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే పిలగాడొచ్చిండే... మగవాళ్ళు మాస్త్ చాలు మగవాళ్ళు మాస్త్ చాలు మగవాళ్ళు మాస్త్ చాలు మస్కాలు గొడతా ఉంటారే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతి ఓ సారి సరే అంటూ ఓ సారి సారీ అంటూ మెయింటైన్ నువ్ జేస్తే లైఫంతా పడుంటాడే వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేషిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే అయ్యి బాబోయ్ ఎంత పొడుగో అయ్యి బాబోయ్ ఎంత పొడుగో అయ్యి బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే అయ్యి బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే తన ముందు నిచ్చనేని ఎక్కితే కాని అందడే పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నిక్స్ నాకున్నాయ్ లే పరేషానే నీకక్కర్లే... వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేషిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే హే పిల్ల రేణుకా పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేషిండే అరె ఓ పిల్ల ఇంక నువ్వు నేల నడిచే గాలి మోటార్ లో వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేషిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

Edo Jarugutondi Song Lyrics in Telugu – Fidaa (2017)

'Edo Jarugutondi' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Aravind Srinivas and Renuka.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
చిత్రం: ఫిదా (2017) సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అరవింద్ శ్రీనివాస్, రేణుక తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది తానే వెతుకుతోందే దొరికినట్టే ఉన్నది అయినా చెయ్యి చాసి అందుకోకున్నది రమ్మంటున్నా... పొమ్మంటున్నా... వస్తూ ఉన్నా... వచ్చేస్తున్నా... ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం ఉండనీదు ఊరికే ఏచోట ఈ నిమిషం వింటున్నావా... నా మౌనాన్ని... ఏమో ఏమో... చెబుతూ ఉంది... ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం కదలిపోను అన్నది కలలాంటి ఈ సత్యం నా లోకంలో - నా లోకంలో అన్నీ ఉన్నా - అన్నీ ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో ఆ పై దూరం ఏం లేకున్నా సందేహంలో ఉన్నానేమో ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి ఏదో జరుగుతోంది ఎదలో అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి

Hey Pillagaada Song Lyrics in Telugu – Fidaa (2017)

'Hey Pillagaada' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Sindhuri and Sinov Raj.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
Lyricist : Vanamali
Singers : Sindhuri, Sinov Raj
చిత్రం: ఫిదా (2017) సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: వనమాలి గానం: సిందూరి, సినోవ్ రాజ్ హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ గిర గిర గిల్లే నీలోన బిర బిర సుడులై తిరిగేన నిలవద నువ్వేం చేస్తున్న దొరకను అందా నీకైనా హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ కదిలె కదిలే చినుకే కదిలే ముసిరె ఒక ముసురై ఇలాకాల ఇక్కాకే ఉరికే ఉరికే జతగా ఉరికే మనసే నిన్ను మరిచి తనకాల ఇక్కాకే ఓ ఒ ఒ ఒ సోయిలేని హాయిలోన కమ్ముకుంది గాలివాన ఏమవుతుందో ఏమోలోన నీకు తెలిసేన నీలోని హైరానా నన్ను కూల్చేలా నాలోన జడివాన హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ హేయ్ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ గిర గిర గిల్లే నీలోన బిర బిర సుడులై తిరిగేన నిలవద నువ్వేం చేస్తున్న దొరకను అందా నీకైనా

Oosupodu Song Lyrics in Telugu – Fidaa (2017)

'Oosupodu' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Hemachandra.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
Singers : Hemachandra
చిత్రం: ఫిదా (2017) సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: చైతన్య పింగళి గానం: హేమచంద్ర ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింత పోదు నాకిలా ఏమిటో ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింత పోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను వల్ల కాదు పాలుపోదు ఆగనీదు సాగనీదు వెంట రాదు నాకిలా ఏమిటో వేళ కాదు వీలు లేదు ఊహకాదు ఓర్చుకోదు చంత లేదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరె ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిద్దురలోను ఆ మరుపున తెలియక నన్నే వెతికినాను నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదోనాడు నీతో చెప్పేయనా నీ పిలుపులులే కలలుగా నన్ను తరుముతాయే ఆ కలవరం మెళకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదోనాడు నీతో చెప్పేయనా నీ తలపులే వదలవే నీ తలపులే వదలవే ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో

Hey Mister Song Lyrics in Telugu – Fidaa (2017)

'Hey Mister' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Deepak.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
Lyricist : Vanamali
Singers : Deepak
చిత్రం: ఫిదా (2017) సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: వనమాలి గానం: దీపక్ గుడ్ మార్నింగ్ హలో USA చల్ వేగం నీ అడ్రస్ ఏ చించేదం ఈ జర్నీ -ఏ దిల్సే ఈ లైఫ్ ఏయ్ ఒక బోనస్ -ఏ రోజు ఇక బిందాస్ -ఏ డోన్ట్ మిస్ నీకొచ్చినా ఈ ఛాన్స్ -ఏ నీ కలలతో సెల్ఫీలే దిగు నిజం అవదా డౌట్ ఎందుకు ఈ జిందగీ చేయి అందుకో ఇక ఆగకోయ్ లెట్స్ గో గో గో హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్ చల్ వె చల్ నువ్వు చోయిసెస్ -ఏయ్ కాలం ఇస్ నాట్ ఫర్ సేల్ డైలీ తప్పదులే ఈ రేస్ -ఏయ్ వన్ బై వన్ నువ్వు ఈరోజే పీల్చేయి నీ ప్రతి ఆశే నీలో ఇక రాదా ఆ జోష్ -ఏయ్ నీ కంటికో నువ్వే నచ్చేయి నీ కోసమే రాదా మంచి నువ్వు స్పీకరో ఆ చూపులతో మస్తీ వాలో యా గో య గో హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్

Fidaa Song Lyrics in Telugu – Fidaa (2017)

'Fidaa' song from Fidaa (2017) movie is composed by Shakthikanth Karthick and sung by Hemachandra and Malavika.

SONG INFORMATION
Movie : Fidaa (2017)
చిత్రం: ఫిదా (2017) సంగీతం: శక్తికాంత్ కార్తీక్ సాహిత్యం: చైతన్య పింగళి గానం: హేమచంద్ర, మాళవిక ఓ ఫిదా... ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్కసారి తొంగిచూడవా ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద ఒక్కసారి తొంగిచూడవా మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే ఒక నింగేలే మనకున్నది నా కలల తోటలో మారని ఋతువులున్నవే నువు వచ్చుండే చోటున్నదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రొదే మాటే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే... ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్కసారి తొంగిచూడవా ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా మేఘాలు హద్దుల్లో ఉండేవేనా గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పల్లోన ఆమాత్రం నేనేంటో అర్ధంకానా నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని ఒక జంజాటం చంపేస్తోందే గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెదకకు మాటే తేలేలోన ఆపేస్తానా బాదే దీనితోనే చెప్పేసేయన నవ్వే దీని నుండి దాచేస్తాన దాచేస్తాన మనసేయే మౌనంగా ఏడుస్తున్నా నీ జడల పాయలో గుండె చిక్కుకుందే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపొమ్మని ఒక జంజాటం చంపేస్తోందే ఎంత దూరమో ఇలా అంత చేరువే కదా ఒక్కసారి తొంగిచూడవా ఎన్ని దారులో అలా వాకిలాయేగ ఎద ఒక్కసారి తొంగిచూడవా మా వైపు వెన్నెలే మీకు వేకువౌనులే ఒక నింగేలే మనకున్నది నా కలల తోటలో మారని ఋతువులున్నవే నువు వచ్చుండే చోటున్నదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రొదే మాటే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే... ఓ ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే నీకే పదే పదే ఒకే రొదే మాటే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే...

Palli Balakrishna Sunday, June 21, 2026
Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics Album Cover

Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Siddu From Srikakulam (2008)
Director : Eashwar
Actors : Allari Naresh
Release Date : 14 August 2008

Na Nababa Nanana Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Na Nababa Nanana' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by K. M. Radha Krishnan and Swetha.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Bhoopal
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: భోపాల్ గానం: కె. ఎం. రాధాకృష్ణన్, శ్వేత నా నాబాబా నా నానా

Jampandu Lanti Pilla Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Jampandu Lanti Pilla' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Ranjith.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Vanamali
Singers : Ranjith
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వనమాలి గానం: రంజిత్ జాంపండు లాంటి పిల్ల

O Kshanamainaa Chaalu Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'O Kshanamainaa Chaalu' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Hemachandra and Sahithi.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Veturi
Singers : Hemachandra, Sahithi
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: వేటూరి గానం:హేమచంద్ర, సాహితి ఓ క్షణమైనా చాలు

Thellariponiku Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Thellariponiku' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Gayathri.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Peddada Murthy
Singers : Gayathri
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: గాయత్రి పల్లవి: తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 1 ఆ నింగి జాబిలమ్మ తొడుగానే ఉందిగా చుక్కే నీదంటు పక్కే రమ్మంటే చూస్తావే అలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని చరణం: 2 ఏమంత లేనిదాన్ని కానిదాన్ని కానుగా ఇలా చీ పో లు పై పై కోపాలు నాపై నీకిలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని మనసు కనక మనవి వినక చలికి మరి దూరాన ఉంటే ఎలా తెల్లరిపోనీకు ఈ రేయిని చేజారిపోనీకు ఈ హాయిని

Sarasangi Rathanangi Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)

'Sarasangi Rathanangi' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by N. C. Karunya.

SONG INFORMATION
Movie : Siddu From Srikakulam (2008)
Lyricist : Sai Sriharsha
Singers : N. C. Karunya
చిత్రం: సిద్దు ఫ్రమ్ సికాకుళం (2008) సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ సాహిత్యం: శ్రీ సాయి హర్ష గానం: ఎన్.సి. కారుణ్య సరసాంగి రతనాంగి మదనాంగి ఐ లవ్ యు రా

Palli Balakrishna Friday, February 15, 2019
Arya 2 (2009) Telugu Songs Lyrics Album Cover

Arya 2 (2009) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Arya 2 (2009)
Director : Sukumar
Release Date : 27 November 2009

Mr. Perfect Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Mr. Perfect' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Baba Sehgal, Devi Sri Prasad and Rita.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Kedarnath Parimi
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: కేదారినాథ్ పరిమి గానం: బాబా షెహగల్, దేవి శ్రీ ప్రసాద్, రీటా హే టిప్పుటాపు దొర కదిలిండో ఎవరికి వీడు దొరకడు లెండో ముదురండో గడుసండో తొడిగిన ముసుగండో ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో వీడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు కమాన్ కమాన్ మస్తు టైమింగు కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో కమాన్ కమాన్ కోతలల కింగు కమాన్ కమాన్ మార్చె తన రంగు కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా కందిపోయింది కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా తప్పకుండా వీడి తాటతీస్తా సారీ నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకొంటున్నాను అందుకే అందరిముందు కాల్చను హిప్పులూపుతున్న క్యాటు వాకులండో క్రోకడైల్ వీడు కాలు జారకండో బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో మేడి పండులాంటి మ్యాన్ వీడండో మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో చీటండో చీపండో గజిబిజి పజిలండో కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్ కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్ కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్ కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్ కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ (2) కమాన్ కమాన్ ఓరి గోవిందో కమాన్ కమాన్ వీడు గురివిందో కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో కమాన్ కమాన్ హరియవో సాంబో కమాన్ కమాన్ రేగింది పంబో కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్

Uppenantha Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Uppenantha' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by K. K.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Balaji
Singers : K. K.
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: బాలాజి గానం: కెకె ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో తీయనైన ఈ బాధకీ ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో కనులలోకొస్తావు కలలు నరికేస్తావు సెకనుకోసారైనా చంపేస్తావూ మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంటపడి నా మనసు మసి చేస్తావూ తీసుకుంటె నువ్వు ఊపిరీ పోసుకుంట ఆయువే చెలీ గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరీ ! I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి కాల్చెయ్యనా చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతెయ్యనా నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే ! I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా I Love You... నా ఊపిరి ఆగిపోయినా I Love You... నా ప్రాణం పోయినా ఉప్పెనంత ఈ ప్రేమకీ గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో

Baby He Loves You Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Baby He Loves You' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Chandrabose
Singers : Devi Sri Prasad
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవి శ్రీ ప్రసాద్ ఛ… వాడికి నా మీద ప్రేమే లేదు హి డసంట్ లవ్ మి యు నో నో హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ అవునా ఎంత? ఊ... ఎంతంటే ఆ మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత మొదటి సారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంత ఓ... ఇంకా... హో తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత హో చల్ల బువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ హే అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత చల్లనైన నీ శ్వాసలోన తోణికే గాలికున్న గతమంతా చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ హాయ్ పంటచేలలోని జీవమంత ఘంటసాల పాట భావమంత పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత కుంభకర్ణుడి నిద్దరంత ఆంజనేయుడి ఆయువంత కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ పచ్చి వేప పుల్ల చేదు అంత రచ్చబండ పైన వాధనంత అర్ధమైన కాకపోయినా భక్తికొద్ది విన్న వేదమంత ఏటి నీటిలోని జాబిలంత ఏట ఏట వచ్చే జాతరంత ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత హో బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబి బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు టూ మచ్ ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్

Ringa Ringa Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Ringa Ringa' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Priya Himesh.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Chandrabose
Singers : Priya Himesh
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ప్రియ హిమేష్ ఓ రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2) పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2) రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేసాను హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే (2) ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి ఎర్రకోట చేరినాను చేరినాక ఎదురు చూసినా ఎవరి కోసం! బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి కోరమీస కుర్రగాళ్ళ ఆరా పట్టి బెంగుళూరు కెల్లినాను మంగళూరు కెల్లినాను బీహారు కెల్లినాను జైపూరు కెల్లినాను రాయలోరి సీమకొచ్చి సెట్ అయ్యాను ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేశారు? కడపబాంబు కన్నులతో యేసి కన్నెకొంప పేల్చేసారు అమ్మనీ హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే వేట కత్తి ఒంట్లోన దూసి సిగ్గుగుత్తి తెంచేశారు హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే వాయించెహె హే రింగ రింగా రింగా రింగ రింగా రింగా (2) ఇదిగో తెల్లపిల్ల అదంతా సరేగాని అసలు ఈ రింగ రింగ గోలేంటి? అసలుకేమో నా సొంత పేరు యాండ్రియానా స్పైసో రింగా హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే పలకలేక ఈల్లెట్టినారు ముద్దుపేరు రింగా రింగా హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే జీన్స్ తీసి కట్టినారు ఓణీ లంగా పాపినారు పెట్టినారు సవరం బాగా రాయిలాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా! ఇంటి యెనకకొచ్చినారు యమకారంగా ఒంటిలోని వాటరంతా చెమటలాగ పిండినారు ఒంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు ఒంపి ఒంపి సొంపులన్నీ తాగేశారు అయిబాబోయ్ తాగేశారా? ఇంకేం చేశారు? పుట్టుమచ్చలు లేక్కేట్టేశారు లేని మచ్చలు పుట్టించారు హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఆఁ ఉన్న కొలతలు మార్చేసినారు రాని మడతలు రప్పించారు హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ఇదిగో ఫారిన్ అమ్మాయి ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్? హా పంచకట్టు కుర్రాల్లలోని పంచ్ నాకు తెలిసొచ్చింది హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే ముంతకల్లు లాగించేటోల్ల స్ట్రెంగ్త్ నాకు తెగ నచ్చింది హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే నీటి బెడ్ సరసమంటే గర్రు గర్రు నులకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెండ్స్ తోటి చెప్పినా చెప్పెసావేటి? ఫైవ్ స్టార్ హోటల్ అంటే కచ్చా బిచ్చా పంపు సెట్టు మేటర్ ఐతే రచ్చో రచ్చా అన్నమాట చెప్పగానే ఐర్లండు గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు థాయ్ లాండు ఫిన్ లాండు అన్ని లాండుల పాపలీడ ల్యాండ్ అయ్యారు లాండయ్యరా! మరి మేమేం చెయ్యాలి? హాండు మీద హాన్డేసేయ్యండీ లాండు కబ్జా చేసేయ్యండీ హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హాండు మీద హాన్డేసేస్తామే లాండు కబ్జా చేసేస్తామే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే హే రింగ రింగ రింగ రింగ రింగ రింగ రింగా రింగారే

Karige Loga Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Karige Loga' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Kunal Ganjawala and Megha.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Vanamali
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వనమాలి గానం: కునల్ గంజువాలా, మేఘా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ... పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ నేడీ బంధానికి పేరుందా ఓ ఉంటే విడదీసే వీలుందా ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరునిముషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచవా నీ కన్నీటిని చల్లి సాగే మీ జంటని చూస్తుంటే ఓ నా బాధంతటి అందంగా ఉందే ఓ ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...

My Love Is Gone Song Lyrics in Telugu – Arya 2 (2009)

'My Love Is Gone' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by K. G. Ranjith.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Chandrabose
Singers : K. G. Ranjith
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె. జి. రంజిత్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ ఏ గలాసు వదిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే సరస్సు నిండిపోతుందే సోగస్సు కరిగిపోతుందే మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే... మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ హానెస్టుగుండే పనిలేదే ది బెస్టుగుండే పనిలేదే హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే కెరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్తో పనిలేదే ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళల్లోనా మిగులుతారే లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు హిస్టరీలోన వెలుగుతాడే... మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్

Karige Loga (D-Plugged) Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Karige Loga (D-Plugged)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Vanamali
Singers : Sagar
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వనమాలి గానం: సాగర్ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ... పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ నేడీ బంధానికి పేరుందా ఓ ఉంటే విడదీసే వీలుందా ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ...

Mr. Perfect (DSP Mix) Song Lyrics in Telugu – Arya 2 (2009)

'Mr. Perfect (DSP Mix)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Arya 2 (2009)
Lyricist : Kedarnath Parimi
Singers : Devi Sri Prasad
చిత్రం: ఆర్య-2 (2009) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: కేదారినాథ్ పరిమి గానం: దేవి శ్రీ ప్రసాద్ Yo Everybody such a feet on the floor this DSP and Aarya once more మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ హే టిప్పుటాపు దొర కదిలిండో ఎవరికి వీడు దొరకడు లెండో హే టిప్పుటాపు దొర కదిలిండో ఎవరికి వీడు దొరకడు లెండో ముదురండో గడుసండో తొడిగెను ముసుగండో ఉప్పుకప్పు రంబు నొక్క లుక్కునుండో వీడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు కమాన్ కమాన్ మస్తు టైమింగు కమాన్ కమాన్ రైటులలొరాంగు ఏ యాయి యయ్యో కమాన్ కమాన్ కోతలల కింగు కమాన్ కమాన్ మార్చె తన రంగు కమాన్ కమాన్ పక్కా ప్లానింగు ఏ యాయి యయ్యో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ హో వీడో పెద్ద వెదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు వీడి గురించి చెప్పి చెప్పి నాలికంతా ఎండిపోయింది కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో ఇలాంటోళ్ళకు డిమాండ్ కొంచెం ఎక్కువ అయినా ఇంకోసారి ట్రై చేస్తా తప్పకుండా వీడి తాటతీస్తా హిప్పులూపుతున్న క్యాటు వాకులండో క్రోకడైల్ వీడు కాలు జారకండో బ్రూటండో బ్రైటండో లైఫే చూస్తుండో మేడి పండులాంటి మ్యాన్ వీడండో మ్యాన్ హోల్ లాంటి మైండు వీడిదండో చీటండో చీపండో గజిబిజి పజిలండో కమాన్ కమాన్ హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్ కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్ కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే కమాన్ కమాన్ హీస్ ద జ్యాదుగర్ కమాన్ కమాన్ హి గీవ్స్ యు ఫీవర్ కమాన్ కమాన్ హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే హే మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ కమాన్ కమాన్ ఓరి గోవిందో కమాన్ కమాన్ వీడు గురివిందో కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యో కమాన్ కమాన్ హరియవో సాంబో కమాన్ కమాన్ రేగింది పంబో కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్ Yo Everybody such a feet on the floor DSP will sing song more Comon Everybody lets burn the floor DSP and Aarya once more

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default