-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chiranjeevi"
Mana Shankara Vara Prasad Garu (2026) Telugu Songs Lyrics Album Cover

Mana Shankara Vara Prasad Garu (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Music : Bheems Ceciroleo
Director : Anil Ravipudi
Producers : Sahu Garapati, Sushmita Konidela
Actors : Chiranjeevi, Venkatesh
Actresses : Nayanthara, Catherine Tresa
Release Date : 12 January 2026

Hook Step Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Hook Step' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Baba Sehgal.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Singers : Baba Sehgal
చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కైలాష్ కెహర్ హే పార్టీకొచ్చి అయ్యో పర్లేదంటు నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్‌లాగా అంటీ ముట్టనంటే ఎంత పాపం హే ఎట్టా కుదురుతాది మనిషన్నాక కాస్త కళాపోషణంటు లేకుంటే అడపాదడపా ఈ ఫన్నే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంటే వాట్ ఈజ్ దిస్ బ్రేక్ లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హే ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు మింగిల్ అవుదామని పార్టీకొచ్చి అట్టా సింగిల్‌‍గానే నువ్వు ఉండిపోకు హే కూచిపూడి భలే భలే భాంగ్రాను వచ్చి ఉండాల్సిన పని లేదోయ్ తోచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసెయ్ వాట్ ఈజ్ దిస్ పాజ్ లెట్స్ ట్రై ద ఊర మాస్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

Sasirekha Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Sasirekha' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Madhu Priya.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Lyricist : Anantha Sriram
చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ శశిరేఖా… ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక… ఓ ప్రసాదూ.. మోమాటాలేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ…. ఓ శశిరేఖ… నీ చుట్టూ బిలియన్సు నావన్ని EMI-సు… ఓ ప్రసాదు… పైసాల్లో ఏముందోయ్ నీకుంది మంచి మనసు… మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు ఏ ఇల్లోనా కాదోయ్.. ప్రేమ పంచె గుండెల్లోనా ప్లేస్ చాలు నాకు ఏయ్ యురేకా నువ్వు కేక .. భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే.. భయంగా ఉంది ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఏ టెన్షనోద్దు ఎవ్రిథింగ్ చూసుకుంటా.. పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు…… హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా, సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా.. జెంగిలెల్లి జాగువారు తేవాలా.. కానుకలోదోయ్ శ్రీవారు, లొంగదు వాటికి నా ప్యారు చెప్పినట్టు టైముకొస్తే చాలంటా.. అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా.. పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ అటుఇటు ఇటుఅటు, ఇటు అటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో.. నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో.. హేయ్ యురేకా నువ్వు కేక.. భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదాకా.. ఛలో పోదాము ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఎహే మాటలొద్దు ఇలా ఈ లైఫ్ లాంగ్ .. ఇదేలా లైక్ కొట్టు…… ఓ శశిరేఖ… ఓ ప్రసాదు…

Meesaala Pilla Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Meesaala Pilla' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Udit Narayan, Shweta Mohan.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Lyricist : Bhaskarabhatla
చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: భాస్కరభట్ల గానం: ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. పొద్దున్ లేచిన్ దెగ్గర నుంచి డైలీ యుద్ధాల మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా… ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా.. ఓ బాబు నువ్వే ఇంతేనా.. మగజాతి మొత్తం ఇంతేనా.. గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా.. మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. మీసాల పిల్ల…. ఆ ఎదురింటి యెంకట్రావ్ కులుకు సచ్చుంటాడు పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు ఈడు మట్టే కొట్టుకు పోను వాడు యేట్లో కొట్టుకు పోను… ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు కనుకే నీతో కట్ అయ్యాను చాల హ్యాపీ గుంటున్నాను.. నువ్వింత హార్ష్ గా మాటడాలా హార్ట్ హాట్ అయిపోయేలా… ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా.. హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..

Mega Victory Mass Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Mega Victory Mass Song' from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Srinivas, Vishal Dadlani.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Lyricist : Kasarla Shyam
చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: శ్రీనివాస్, విశాల్ దద్లాని అర్ యు రెడీ టర్న్ అప్ ది మ్యూజిక్ అండ్ పాప్ అప్ ది సౌండ్ హే మార్నింగే గ్రీన్ టీ నైట్ఐతే నైన్ టి ఎవడు అయితే ఏంటి కుమ్మేద్ధాం చంటి హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ హే స్పీడ్ఎమో 5g స్టైల్ఇమో జెన్ z వారెవ్వా సర్జీ వీ అర్ సో క్రేజీ హే బోసు పెంచే బాస్యు అన్నా నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు ఉత్తమ స్థాయి నువ్వు నేను వేరే స్థాయి ఇద్దరి కాంబో పీక్స్ లెవల్ ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి హే తమిళంలో రంభ కన్నడలో తుంభ రాస్కోర సాంబ రేగుద్ధి పంబ హే వెంకీ ఇచ్చెయ్ ధమ్కీ టు త్రి జార్ సిక్సు డీజే రీమిక్సు టు ఫోర్ జార్ ఎయిట్ చిల్ మారో నైట్యు హే బోసు పెంచే బాస్యు భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్ యు అండ్ మీ వేరే లెవెల్ ఇద్దరమొస్తే పీక్స్ లెవెల్ ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరేయ్ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి హే ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఓ ఏంది వెంకీ సంగతి ఇరగదీద్దాం సంక్రాంతి అర్ యు రెడీ

Peddi Reddy Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Peddi Reddy' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Chiranjeevi.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Lyricist : Raghuram
Singers : Chiranjeevi
చిత్రం: మన శంకర వరప్రసాద్ గారు (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: రఘురాం గానం: మెగాస్టార్ చిరంజీవి Additional Vocals - Saketh Komanduri, Rohini Soratt ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు ఆ సిన్న బాబు వీధి చివర చిన్న వదిన గారు పెద్ద వదిన ఈల వేసే సిన్న వదిన సింధు వేసి పగలని రెండవేసి చేయండి ఎందుకని ఏ ఆగండయ్య ఇక్కడి నుంచి నేను పాడుతాను అందుకోండి బాస్ థాంక్యూ ఏ పొగరెక్కిన పోటుగాడు కంచె దాటినాడే ఏ మదమెక్కిన అయ్యగారి మెడలు వంచుతాడే ముప్పు తిప్పలెన్నో పెట్టి మళ్లీ ఒక్కటవ తాడే

Peddi Reddy (GVR'S Version) Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)

'Peddi Reddy (GVR'S Version)' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Saketh Komanduri.

SONG INFORMATION
Movie : Mana Shankara Vara Prasad Garu (2026)
Lyricist : Raghuram
ఆ పెద్దిరెడ్డి వీధి మొదలు పెద్ద వదిన గారు ఆ సిన్న బాబు వీధి చివర చిన్న వదిన గారు ఆ పెద్ద వదిన బొట్టు పెట్టే చిన్న వదిన హారతిచ్చే మొనగాడని దండవేసి చెయ్యెత్తి జై కొట్టే ఎందుకనీ ఏ పొగరెక్కిన పోటుగాడి మెడలు వంచినానే అరె పులుపు తాడు కట్టి వాడి బలుపు దించినానే తోకముడిచి కంచి వెనక తలవంచినాడే హే ననన నాన నాన నాన హ.. హ

Palli Balakrishna Monday, December 8, 2025



చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, శుశాంత్
దర్శకత్వం: మెహర్ రమేష్ 
నిర్మాత: సుంకర రామబ్రహం 
విడుదల తేది: 11.08.2023



Songs List:



భోళా శంకర్ మేనియా పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: ఎల్.వి.రేవంత్, మహతి స్వర సాగర్ 

ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా

ఎయ్ భోళా మానియా
భోళా భోళా భోళా
భోళా మానియా
భోళా భోళా భోళా

యెహ ఎగస్ట్రాలొదయ్య
కొలెస్ట్రాలొదయ్య
ఎవ్వడైన గూబ గుయ్యా

ఎయ్ భోళా మానియా
భోళా భోళా భోళా
భోళా మానియా
భోళా భోళా భోళా

యే గరము గరము ఇరానీ చాయ్
గుటక దిగితే ఎనర్జీ
ఉస్మానియా బిస్కెట్ చాలు
ఉడుకులేసుద్ధి

ధడకు ధడకు గుండె సరకు
ఫైరు బ్రాండ్ ఎమోజి
టచ్ చేస్తే తాట రేగుద్ది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
హమర ఎంట్రీ భీభత్స మేళా

భోళా శంకర్
జై బోలో భోళా శంకర్

ఏ ఎంచుకున్న ఏ పనైనా
ఎక్సలెంట్ గా సెయ్యాలా
ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాలా

ఎయ్ ధనాధన్ పటాసే
మన ఫైరింగు
హే ఘనాఘన్ తూటార
మన వార్నింగు
ఎయ్ ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు

ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా
ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా
భోళా మానియా భోళా భోళా భోళా

లగాయించి ఎస్కో
ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమాయించమందీ
చాంగ్ జపనీ మసాలా

నీకు నాకు నడి మధ్య
లేదే ఏల పాల
తగేడి రాజాల
ఆజా మేరా భోళా
భోళా భోళా భోళా భోళా

ఏ మరణమాసు తిరనాల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గత్తరా గల్లాటేగా
మన ఇస్టైల్లో స్టెప్పేస్తే

బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ
కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది

వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్ భోళా భోళా భోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
హమర ఎంట్రీ భీభత్స మేళా

జై బోలో భోళా శంకర్
భోళా శంకర్
జై బోలో భోళా శంకర్



జామ్ జామ్ జజ్జనక పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ

అరె డప్పేస్కో దరువేస్కో
వవ్వారే అదిరే పాటేస్కో
అరె ఈలేస్కో ఇగ జూస్కో
ఇయ్యాళ డాన్సు ఇరగేస్కో

ధనా ధనా గంతేసుకో
సయ్యారే సయ్యంటూ చిందేసుకో
గణా గణా ఊపేసుకో
నీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో

ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క

ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్కా
జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

తమ్ముళ్ళు
మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ
దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కోండి

ఓయ్ నరసపెల్లే నరసపెల్లే
నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి

నరసపెల్లే గండిలోన గంగధారి
నాటు పిల్లే కలిసినాది గంగధారి
కలిసినాది గంగధారి కలిసినాది గంగధారి

నాటు పిల్లా మాటలకు గంగధారి
పోటుగాడు రెచ్చిపోయే గంగధారి

నరసపెల్లె గండిలోని గంగధారి
మాసు మాసు నచ్చినాడు గంగధారి
మాసు మాసు నచ్చినాక పిల్లదారి
మనసు నేనే ఇచ్చినాను గంగధారి

ఖోలోరే ఖోలోరే దిల్లు
నువు నాచోరే నాచోరే ఫుల్లు
నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా నువ్ జల్లూ

ఇది నశాల నిశాల త్రిళ్ళు
ఎక్కు పెట్టెయ్యి కుషీలా విల్లు
చల్ నీ సౌండు రీ సౌండు వచ్చేంతలా తుళ్లు

ఓ ఏ ఏ ఏ కొ కొ కొ ఆడేసుకో
వేలాది వేడుకల్ని చేస్కో
అరె కొ కొ కొ వాడేసుకో
ఈ టైము పోతే రాదు దా దా దా

జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క హెయ్

హోయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్కా
అరె అరె అరె జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తెల్లార్లు ఆడుదాం తైతక్క



మిల్కీ బ్యూటీ పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజన కల్మాంజి, విజయ్ ప్రకాష్ 

అచ్చ తెలుగు పచ్చి మిర్చి
మొగాడు వీడు
భోంబాటు గాటు హాటుగున్నాడే
కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో
సూది గుచ్చి పిల్లా
నీ ముచ్చటేంది అన్నాడే

పంచదార చిలకలాంటి
ప్యారీ సుకుమారి
నీ చమకు చూసి దుముకుతున్న
చిలిపిగ నోరూరి

వారెవ్వా అల్లరి విజిలేసి
యురేకా అన్నా నిన్ను చూసీ
అంతలేసి గ్లామరేందే
అందాల రాశి

అలా నా హార్టుని తిరగేసి
నీ బొమ్మని టాటుగా వేసీ
మైండు మొత్తం మార్చినావే
మ్యాజిక్ చేసేసి

ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ

ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ

ఆ, మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే
సొగసు జారే హరికేన్లే తీసుకొచ్చావే

ఓ ఓ, కలర్ఫుల్లు కలలెన్నో మోసుకొచ్చావే
నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే

నీ ఊపిరి సెగలే చాల్లే
యమహాగా ఉందే ఫీలే
ఆ వేడికి మెల్టౌతాయే
ఐరోపా హిమశిఖరాలే

చిరు చిటికేసావో చాల్లే
పరువాలకు భూకంపాలే
సీతచిలుకల్లా వాలె
నీ చూపుల బాణాలే

ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ

ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ




కొట్టర కొట్టు తీనుమారో పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

జోషు నింపు బేటా
నువ్ ఉన్న ప్రతీ చోటా
ఖుషీ ఉండాలంటా
నువ్వు చెప్పేలోగా టాటా

కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

బ్లాకండు వైటులోన
నీ రెండు కళ్ళే ఉన్నా
రంగు రంగుల్లోన
నువు కలలు కనర కన్నా

కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

లైఫంటే లయను సఫారి
అందులో నువ్వే షికారి
సూటిగా దూసుకెళ్లి చెయ్ స్వారీ

నువ్వు సాగేటి నీ దారి
స్పీడు బ్రేకర్ల సవారి
నవ్వు నిన్ను మోసుకెళ్ళే ఫెర్రారీ

అరె సంతోషాల డోలీ
(అరె సంతోషాల డోలీ)
ఎక్కి సుట్టూ ఊరేగాలి
(ఎక్కి సుట్టూ ఊరేగాలి)

బతుకంటే రంగుల హోళీ
ప్రతిక్షణం ఓ దివాళి
నిలువెల్లా ఫైరే
నీలో నిండి ఉండాలి

కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే
జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే



Rage Of Bhola పాట సాహిత్యం

 
చిత్రం: భోళాశంకర్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: ఫిరోజ్ఇజ్రాయిల్, మెహర్ రమేష్ 
గానం: అసుర, ఫిరోజ్ఇజ్రాయిల్

హే, ఒకటి రెండు మూడు
వచ్చాడు అన్న సూడు, హుయ్ హుయ్
స్టేటంత ఎతికి సూడు
ఎదురొచ్చెటోడే లేడు

హే, మెగా మాసు మావోడే
భగ భగ భగ భోళా
దడ దడ దడ ధడా ధడా
దెబ్బ అదిరిపోలా
లక్కిగోడ లాంటోడే
భగ భగ భగ భోళా
గడ గడ గడ గడగడా
గుండెలదిరిపోలా

భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా
భగ భగ భగ భోళా

సలాం కొట్టి సైడైతే బతికిపోతరు
సరాసరి ఎదురైతే సితికిపోతరు
హే, తనామనా సూసాడో మిగిలిపోతరు
ఘరానాగ దూకారో నలిగిపోతరు

ఏ, అన్నతోనే పెట్టుకుంటే ఆగమౌతరు
లొల్లిగిల్లి చేశిర్రో హాఫు మర్డరు

ఏయ్, సైకైతే సావేజ్
భగ భగ భగ భోళా
ఫైటైతే రాంపేజ్
భగ భగ భగ భోళా
హే, ఎత్తుకుంటే వోల్టాజ్
భగ భగ భగ భోళా
అరె ఎవ్వడైనా డామేజే, హే

ఏయ్, సైకైతే సావేజ్
భగ భగ భగ భోళా
ఫైటైతే రాంపేజ్
భగ భగ భగ భోళా
హే, ఎత్తుకుంటే వోల్టాజ్
భగ భగ భగ భోళా
అరె ఎవ్వడైనా డామేజే, హే

Palli Balakrishna Saturday, July 22, 2023



చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, రవితేజా, శృతి హసన్
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబ్జీ)
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి 
విడుదల తేది: 13.01.2023



Songs List:



బాస్ పార్టీ పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: నకాష్ అజీజ్, DSP, హరిప్రియ

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ

నువ్వు లుంగీ ఎత్తుకో, హెయ్
నువ్వు షర్టు ముడేస్కో, హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

నువ్వు లైట్లేస్కో, హెయ్
నువ్వు కలర్ మార్చుకో, హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

డీజే వీరయ్య

హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే

షరా షరా మామూలే

హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే

కొత్తగ ఉండదు ఏ మూలే

బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే

రీచ్ పెద్దగ ఉండదులే

క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే

మాస్ పెద్దగ పండదులే

అరె, వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు  పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ

డీజే వీరయ్య

నువ్వు బాటిల్ అందుకో, హెయ్
నువ్వు గ్లాసందుకో, హెయ్
నువ్వు సుక్కేస్కో, హెయ్
బాసొచ్చిండు… కిక్కిచ్చిండు

హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే

హీటే ఉండదు ఎందుకులే

గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే

సిల్లీ సిల్లీగుంటదిలే

టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే

రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ

డీజే వీరయ్య

నువ్వు డప్పందుకో, హెయ్
నువ్ డోలందుకో, హెయ్
నువ్ బూరందుకో, హెయ్
ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, ఓయ్

డీజే వీరయ్య, హా హా హా
అదిరిపోనాది పార్టీ, పార్టీ పార్టీ



శ్రీదేవి చీరంజీవి పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: జస్ప్రీత్ జస్జ్, సమీరా భరద్వాజ్

నువ్వు సీతవైతే
నేను రాముడినంటా
నువ్వు రాధవైతే
నేను కృష్ణుడినంటా
నువ్వు లైలావైతే
నేను మజ్ను నంటా
నువ్వు జూలియట్ వయితే
నేనే రోమియోనంటా
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు

నువ్వు పాటవైతే
నేను రాగం అంటా
నువ్వు మాటవైతే
నేను భావం అంటా
నువ్వు వానవైతే
నేను మేఘం అంటా
నువ్వు వీనవైతే
నేనే తీగను అంటా
రారా రారా రారా
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు

నువ్వు గువ్వవైతే
నేను గోరింకంట
నువ్వు రాణివైతే
మై నేమ్ ఇస్ రాజు అంటా
నువ్వు హీరోయిన్ అయితే
నేనే హీరోనంటా
నువ్వు శ్రీదేవైతే
హా అయితే
నేనే చీరంజీవి అంటా
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు



వీరయ్య వీరయ్య పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాగ్ కులకర్ణి , పవిత్ర చారి 

భగ భగ భగ భగ
మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగ జగ చెడు
జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ
జ్వలించు సూరీడే
అగాధ గాధల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశ కారుల స్మశానమవుతాడే
తుఫాను అంచున
తపస్సు చేసే వసిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే హే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య

మృగ మృగ మృగ
మృగాన్ని వేటాడే
పగ పగ పగ పగ
ప్రతిధ్వనించే శాతాగ్ని రా వీడే
భుగ భుగ భుగ భుగ
విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగ
తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఏక ఏక ఎకి
యముండు రాసే కవిత్వమంటే
అది వీడే
నవ శకాన్ని ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని
యుగాలు చూడని
సముద్ర శిఖరం అది వీడే
తనొక్క తానే తలెత్తి చుస్తాడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య

డం డం ఢమ ఢమ
అగ్ని వర్షమై అడుగులేసిన అసాద్యుడే
భం భం బడ బడ
మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ
శౌర్య సంద్రమై ఆక్రమించిన అమత్యుడే
ధం ధం దబ దబ
యుద్ధ శకటమై ఎగిరి దూకిన అబేద్యుడే
తం తం తక తక
తిమిన నేత్రమై ఆవహించిన త్రినేత్రుడే
గం గం గడ గడ
మరణ శంకమై మారు మోగిన ప్రశాంతుడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య



పూనకాలు లోడింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రోల్ రైడ
గానం: రోల్ రైడ, రామ్ మిరియాల, రాహుల్

యో దిస్ ఈజ్ నాట్ ఎ మాస్ సాంగ్
దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్

అరె అలయ్ బలయ్
మలయ్ పులయ్
దిల్లు మొత్తం ఖోలో
అరె మామ చిచ్చా చేసెయ్
రచ్చ ఎంజాయ్మెంట్ యోలో

మన బాసు ఇట్టా వచ్చాడంటే
ఏసుకుంటు స్టెప్పు
అరె కచ్చితంగా ఎగిరిపోద్ది
ఇంటిపైన కప్పు

ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్

ఎయ్ చెటాక్ పటాక్ లటాక్ బటాక్
మస్తుగుంది జోడు
ఏయ్ గిరా గిరా లేపికొట్టు
మోగిపోద్ది టౌను

ఎయ్ సలామ్ కొట్టు జిలం కొట్టు
మనదేరా ప్లేసు
ఎయ్ తీనుమారు ఈలకొట్టి
పెంచు జరా డోసు

ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
అబ్బ పూనకాలు లోడింగు

అబ్బ అన్నయ్య పాములా మెలికెలు తిరిగిపోతున్నాడే
ఏదో మీ అభిమానమక్కాయ్

ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్

ఎయ్ రాజా ఆజా
ఎయ్ రాజా ఆజా ఆజా ఆజా ఆజా
వన్ మోర్ టైమ్ ప్లీజ్

ఆజా రాజా మజా చేద్దాం
కిర్రాకుంది ట్యూను
ఏ ఆడా ఈడా ఏడా విన్నా
ఇదే రింగు టోను

ఏ గిప్పి గిప్పి గప్ప గప్పా రాక్న్ రోల్
ఈ పాటతోని పేటంతా అండర్ కంట్రోలు

ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్
బీటు గీటు లపేట్ లపేట్

ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్

ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్
పూనకాలు లోడింగ్




నీకేమో అందం ఎక్కువ పాట సాహిత్యం

 
చిత్రం: వాల్తేరు వీరయ్య (2023)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మికా సింగ్, గీతామాధురి, డి.వేల్ మురగన్

వయ్యారంగా నడుసుకోచ్చేతాందే… యా
గుండెల్లోనా వణుకు పుట్టేతాందే… యూ ఆర్ రైట్
చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే… అరెరే
హలో పిల్ల హలో హలొ పిల్ల
అంత ఇష్టయులుగా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి
లేనిపోని ఐడియాలు ఇవ్వమాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
హలో పిల్ల హలో హలొ పిల్ల
మహా ముస్తాబుగా ఇటు రామాకే
మనసు లోపల ముతాబులా దూరి
లేనిపోని మంటలు వెయ్యమాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ

హలో పిల్లోడా హలో పిల్లోడా
హీ మాన్ లా ఇటు రామాకే
ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే
గుద్దేసి పోమాకే
నీక్కూడా అందం ఎక్కువె
నాక్కూడా తొందరెక్కువే
వయ్యారంగా నడుసుకోచ్చేతాందే… అవును
గుండెల్లోనా వణుకు పుట్టేతాందే… యూ ఆర్ రైట్
చూస్తూ ఉంటె కంట్రోల్ పోతాందే… నిజం
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే… అబ్బబ్బ

పచ్చ రంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే
సిగ్నల్ ఇచ్చి నన్ను ఆకట్టుకోకే
ఆ రేస్ కార్ నిన్ను చూసి రెచ్చిపొద్దే ఇటు రామాకే
నువ్వు నల్ల రంగు కళ్ళజోడు పెట్టుకోకే
చూసి చూడనట్టు సైట్ కొట్టుకొకే
నా గ్లామర్ అంత గట్టు దాటి పొంగి పొద్దే ఇటు రామాకే
అబ్బబ్బ వొంట్లో కరెంటే వియోలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామాకే
నా సాఫ్ట్ హార్ట్ మెల్టింగ్ అయ్యేలా
అసలిటు రామాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందం ఎక్కువె
నాక్కూడా తొందరెక్కువే

హే జేమ్స్ బాండ్ పోజ్ నువ్వు పెట్టమాకే
పూల గన్ను నాకు గురి పెట్టామకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజర్ ఉందే రామాకే
హే లిప్ మీద లిప్ పెట్టి తిప్పమాకే
హిప్పులోని గ్యాప్ చూపెట్టమాకే
నా లవ్ నాది గివ్వు మంటే
తప్పు నీదే ఇటు రామాకే
హే షర్ట్ బటన్స్ విప్పేసి
మ్యాన్లీ మాగ్నెట్ లా ఇటు రామాకే
ప్లస్ మైనస్ షార్టుసర్క్యూయిటే అసలైటు రామాకే
నీకేమో అందం ఎక్కువ
నాకేమో తొందరెక్కువ
వయ్యారంగా నడుసుకోచ్చేతాందే
నీక్కూడా అందం ఎక్కువె యా
నాక్కూడా తొందరెక్కువే
యాడనుంచి స్టార్ట్ చెయ్యాలో
తెలీక కన్ఫ్యూస్ అయితాందే.

Palli Balakrishna Friday, November 25, 2022
a:hover { color: red; } pre { white-space: pre-wrap; white-space: -moz-pre-wrap; white-space: -pre-wrap; white-space: -o-pre-wrap; word-wrap: break-word; }



చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నాయన తార, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: రాంచరణ్, ఆర్.బి.చౌదరి, యన్.వి.ప్రసాద్ 
విడుదల తేది: 05.10.2022



Songs List:



తార్ మార్ తక్కర్ మార్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా ఘోషాల్

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే
ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే
వీళ్ళిద్దరిట్టా వస్తే  భూం దద్దరిల్లాలంతే
ఏ, టాలీవుడ్ ని  బాలీవుడ్ ని తారు మారేంగే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జుంబరే జూంబరే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు
చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు
రేపట్నెలా శాషిస్తారు

ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే
హే నిఘాలకే నిఘా పెట్టే  మహా ముదుర్లే
హే, దిల్లే దిమాకులే హే, దిమాక్ కూడా దిల్లే
హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే  బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే  యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే  డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే  జూంబరే జూంబరే

తార్ మార్ తక్కరు మార్



నజబజ జజర పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , పృద్వి చంద్ర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం

ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తల మీదికంతెత్తున దూకితే నెత్తురే మొత్తం 

గుద్దు గుద్దితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బయి
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాదబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెండాడు గండర గాడుడుర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 

కొండ దేవర కోన దేవర 
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడిటే కథకళిరా 

చొక్కా మడతపెట్టి వచ్చాడంటే
టేకుదుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పాడంటే
మద్దిచెక్క మీద రంపమవుతాడు

నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే 
నడ్డి విరిచెడు చేవచూసి అబ్బలు గుర్తొస్తారొయ్ 
అడ్డు వచ్చినోన్ని అడ్డ దిడ్డముగా 
తొక్కేసి పోతాడురా 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర




గాడ్ ఫాదర్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయిచరణ్ భాస్కరుని, అర్జున్ విజయ్, రితేష్ జి.రావు, చైతు సత్సంగి, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీ కృష్ణ , అద్వితీయ, శ్రుతిక, ప్రణతి, ప్రత్యూష పల్లపోతు, రచిత, వైష్ణవి, హారికా నారాయణ్, శృతి రంజిని, సాహితి చాగంటి 

ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి¹
అంతేలేని ఆధిపత్య శౌరి
దండించే దండకారి

శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం

కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క  చెడును వేటలాడు సామి

ఎక్కడుంటేనేమి
మంచికితను హామీ
ఒక్క మాటలోన
సర్వాంతర్యామి

గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్

ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం

వీడో  ధ్యేయం
వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం

అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల
చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే

మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని
తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని
మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే




బ్లాస్ట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధామిని భట్ల, బ్లేజ్

హో...  హో...
Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది Don’t Say No

లిప్పు మీనో హిప్పు మీనో
గుచ్చి గుచ్చి Kiss Me Know
తప్పు లేదు గిప్పు లేదు
హగ్గు లిచ్చి Crush Me Know

ధూమ్ ధమాకా ఫుల్ థడాకా 
Yehi Mouka Aajaare
ఇంతదాకా వచ్చినాక
Bun Ke Thoofa Cha Jaare
Tere Jaisaa Aur Kohi
Naahi Dhoojaare

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby… Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు 
Feast Baby… Feast Baby

Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది  Don’t Say No

(Rap)

పటాస్ మాస్ యాక్షన్ హీరో
మజిల్స్ తో విజిల్ ఎయ్యరో 
Kick Ass Moods… Darker Shades
బయటికి తియ్యరో 

Is Raath Kaa.. Subahaa Nahee
Thu Share Shaa Laa దూకరో
నీ ఫైర్ లో పవరేమిటో స్టాంప్ వేసేయ్ రో...

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro… Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు
Feast Baby… Feast Baby



పదరా సైనికా పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరామచంద్ర

అడవి చెట్లకు అన్నలం
కొండా గుట్టల తమ్ములం
బందూకులకు బంధువులం
నిప్పు కనికలం

మందుపాతర తొక్కిన అడుగులం
గుండెలోతుల కన్నీటి మడుగులం
ఆకుపచ్చని దారులకంటిన
చిక్కటి నెత్తుటి మరకలం

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

చరితను రాసిన ఎర్ర సిరా
ఎందరో వీరుల త్యాగమురా
ఆ ఒరవడిలో ఉద్యమమై
ఉమ్మడిగా అడుగేద్దాం

తోవ పొడవునా అగ్ని మడుగులు
ఎన్ని ఎదురై  రాని
గుండె తడబడు నింగి పిడుగులు
దండుగా పడిపోని
విశ్రమించని హోరుగా
రగిలించరా కాలాన్ని

మన నేటి చలనమే
నేటి కధనమే భావితరమున
స్వేచ్ఛా పవనమురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

రేపో మరునాడో
నిజమవదా సమన్యాయం
ఓర్పు సహనంగా
సాగాలి సమయం

పుటకతో కూర్చిన ఆశయంరా ఇది
మరణమైనా సరే కిరణమై ఉంటది
ఒకనాటి ఉదయము వేగు చుక్కగా
వేల కళలకు వెలుగులు దిద్దునురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా



అన్నయ్య పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వైష్ణవి కొవ్వూరి

నీరై కరిగిందా నీ యదలో నలుపు
ఏరై కదిలిందా అనుభందం వైపు
అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు
రక్షా బంధముగా నీ తోడై నడుపు
కౌరవులెందరు ఎదురైనామరి 
ఒకడే చాలడా గిరిదారి
అదిగో అతడే అతడే హితుడు భాందవుడు
అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకిపుడు 
 





Palli Balakrishna Thursday, October 13, 2022


చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 14.02.2022



Songs List:



లాహే లాహే పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిత నారాయణ్, సాహితి చాగంటి

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ
కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా
మంచు కొండల సామిని తలసిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి యిబూది జలజల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విలవిల నలిగిండే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటి కురికి 
అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులే ఇట్టాంటి నియమాలు

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళో గంటలు మొదలాయే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం



నీలాంబరీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహ్రా

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ (నీలాంబరీ)

వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరీ నీలాంబరీ

మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇపుడే ప్రహరీ… నిన్నే కోరి
గాలాలేయకోయ్… మాటలా జాలరి
ఒళ్ళో వాలదా నాలో సిరి టెన్ టు ఫైవ్
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస

మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధార ఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి



శాన కష్టం పాట సాహిత్యం

 

చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: రేవంత్, గీత మాధురి

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం

నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగలా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా

శాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ

నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే

ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే... ఒంపు సొంపుల్తో

శాన కష్టం, పాపం... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని

ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో

హే, నా పైట పిన్నీసుని
అదేంటో విలన్లా చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే

డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో

శాన కష్టం, అరెరే... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తుని



భలే భలే బంజారా పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్

హే సింబా రింబా సింబా రింబా 
చిరత పులుల చిందాట
హే సింబా రింబా సింబా రింబా 
సరదా బురద సయ్యాట

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

కాకులు దూరని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నేల వంతపాడింది

సీకటంతా సిల్లుపడి
యెన్నెలయ్యిందియాల
అందినంత దండుకుందాం
పద దలో చెయ్యారా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

హే కొక్కొరోకో కోడె కూత
ఈ పక్క రావద్దే
అయితలెక్క ఆడేపాడే
మాలెక్క నాపొద్దే

తద్దిన దిన సుక్కల దాక లెగిసి ఆడాల
అద్దిర బన్నా ఆకాశ కప్పు అదిరి పడాల

అరిచేయి గీతకు చిక్కింది
భూగోళమ్మీయాల
పిల్లోల్ల మల్లే దాన్నట్టా
బొంగర మెయ్యాలా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాంరా (2)

నేస్తమేగా చుట్టూ ఉన్న 
చెట్టైన పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుట్టహా మిట్టైన

అమ్మకుమల్లే నిన్నూ నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీ బిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖం
రెండిటికీ మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

Palli Balakrishna Monday, April 18, 2022



చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 02.10.2019



Songs List:



హో సైరా... (పవిత్ర ధాత్రి భారతాంబ) పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్

పల్లవి:
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా
రేనాటిసీమ కన్న సూర్యుడా

మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా

హో  సైరా.., హో సైరా.., హో సైరా.
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో  సైరా.., హో సైరా.., హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 1
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా...
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమళ్లే మార్చినావురా
ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి
పెటెల్లు మన్నది ప్రజాలి పోరిది
కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
హో సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 2
దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది
నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని
ఒదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని
ప్రతి పదం
కదనరంగమంతా కొదమసింగమల్లె
ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా
అరివీర సంహారా...
హో  సైరా.. హో సైరా.. హో సైరా
హో  సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా





జాగో నరసింహా జాగోరే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, హరి చరణ్, అనురాగ్ కులకర్ణి

జాగో నరసింహా జాగోరే
జనమంతా చూసేరే రారే
చేయ్యెత్తి జై కొట్టె హోరే
తకథై అంటు సింధులు తొక్కాలే

వజ్రాల వడగాళ్లే నవరత్నాలే సిరిజల్లై
మా నవ్వుల్లో సుక్కలు కురవాలే

ఓ  సై రా

జామాజం  జంజారావంలో
ధమాదం దుమ్ము దుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుమ్ చిందిన అత్తర్లో

పది దిక్కులకీ అందింధీ సందేశమ్
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిల ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఎం జవాబు చెబుతాంరా
పలానా పక్కోడెవడంటే
ఈ మన్నేర ఇద్దరిని కన్నదని
అనరా నిజమంటే

నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగ ఉన్నట్టే

ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం
మన కష్టసుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువు నా కోసమ్ నేన్ నీ కోసం అనుకుందాం
మన అందరిని ముడి వేసెనిల మనిషన్న పదం

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

హైస్ హైస్ హైస్ హైలెస్స (3)

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా




అందం అంకితం పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్ , షాషా తిరుపతి

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

నువు పద్మానివై ఉంటె
రవితేజం నేనౌతా
కలువై నువు వెచుంటె
నెలరాజై నెయ్ వస్త
వరించుతా తరించుతా

అందం అంకితం
ప్రాణం అర్పితం

ఓ చక్కోరయానం చేసి
చేరా నిన్నెలా
నాదే నాదే వెన్నెలా - హో 
ఒక్కోరహస్యం విరించి
విరిసా పువ్వులా
నీలో నిలిచె నవ్వులా

సరస్సౌతాను నీకోసం
ఇటురావే రాయంచ
ఇహ నాదైన సంతోషం
అది నీకే రాసుంచా
ప్రియాయచా లయాయచా

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
పధములు కలిసెను మధువని లోన
తగనిస పదమున దీజాన
తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
హృదయము అదిరెను ముధురక్షణాన
మధురము కురిసెను తందాన




శ్వాసలోన దేశమే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్

శ్వాసలోన దేశమే
కోరస్: శ్వాసలోన దేశమే
గుండే గోషలోన దేశమే
కోరస్: గోషలోన దేశమే
ప్రాన నాడిలోన దేశమే
ప్రణమంత తల్లి కోసమే

మాటలోనే దేశమే
కోరస్: మాటలోనే దేశమే
కత్తి వేటులోన దేశమే
కోరస్: వేటులోన దేశమే
కాలి అడుగులొన దేశమే
కాలి బూడిదైన తల్లి కోసమే

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా

చిన్నారి ప్రాయమందునా
కన్నోళ్ళనొదిలినావురా
కోరస్: కన్నోళ్ళనొదిలినావురా 

కన్నీటి పదును తేలేరా
ఖడ్గమే... ప్రయాణమైన పోరులో
కోరస్: ప్రయాణమైనా పోరులో 
ప్రేమింకా ఇంకిపోయారా
కోరస్: ప్రెమింక ఇంకిపోయారా 
దోసిట్లో దాచినావురా
సంద్రమే...ప్రజల స్వేచ్ఛకై
ప్రాణాలనొదులుతూ
పతాకమల్లే ఎగిరినావురా

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా (3)

Palli Balakrishna Tuesday, October 8, 2019

చిత్రం: హ్యాండ్సప్ (2000)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం:
గానం:
నటీనటులు: నాగేంద్ర బాబు, జయసుధ, బ్రహ్మానందం,  సోను సూద్, రాఘవ లారెన్స్, నగ్మా, దీప్తి భట్నాగర్, ప్రత్యేక పాత్రలో చిరంజీవి, మాస్టర్ వరుణ్ తేజ్
దర్శకత్వం: శివనాగేశ్వర రావు
నిర్మాత: నితిన్ కపూర్
విడుదల తేది: 10.02.2000


Palli Balakrishna Tuesday, April 30, 2019

Most Recent

Default