చిత్రం: శంకర వరప్రసాద్ (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ త్రెసా దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విడుదల తేది: 15.01.2026
Songs List:
హే మీసాల పిల్ల.. పాట సాహిత్యం
చిత్రం: శంకర వరప్రసాద్ (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: భాస్కరభట్ల గానం: ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. పొద్దున్ లేచిన్ దెగ్గర నుంచి డైలీ యుద్ధాల మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా… ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా.. ఓ బాబు నువ్వే ఇంతేనా.. మగజాతి మొత్తం ఇంతేనా.. గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా.. మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. మీసాల పిల్ల…. ఆ ఎదురింటి యెంకట్రావ్ కులుకు సచ్చుంటాడు పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు ఈడు మట్టే కొట్టుకు పోను వాడు యేట్లో కొట్టుకు పోను… ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు కనుకే నీతో కట్ అయ్యాను చాల హ్యాపీ గుంటున్నాను.. నువ్వింత హార్ష్ గా మాటడాలా హార్ట్ హాట్ అయిపోయేలా… ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల.. నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా.. హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..
శశిరేఖా… పాట సాహిత్యం
చిత్రం: శంకర వరప్రసాద్ (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ శశిరేఖా… ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక… ఓ ప్రసాదూ.. మోమాటాలేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ…. ఓ శశిరేఖ… నీ చుట్టూ బిలియన్సు నావన్ని EMI-సు… ఓ ప్రసాదు… పైసాల్లో ఏముందోయ్ నీకుంది మంచి మనసు… మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు ఏ ఇల్లోనా కాదోయ్.. ప్రేమ పంచె గుండెల్లోనా ప్లేస్ చాలు నాకు ఏయ్ యురేకా నువ్వు కేక .. భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే.. భయంగా ఉంది ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఏ టెన్షనోద్దు ఎవ్రిథింగ్ చూసుకుంటా.. పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు…… హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా, సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా.. జెంగిలెల్లి జాగువారు తేవాలా.. కానుకలోదోయ్ శ్రీవారు, లొంగదు వాటికి నా ప్యారు చెప్పినట్టు టైముకొస్తే చాలంటా.. అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా.. పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ అటుఇటు ఇటుఅటు, ఇటు అటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో.. నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో.. హేయ్ యురేకా నువ్వు కేక.. భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదాకా.. ఛలో పోదాము ఇంకా ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఎహే మాటలొద్దు ఇలా ఈ లైఫ్ లాంగ్ .. ఇదేలా లైక్ కొట్టు…… ఓ శశిరేఖ… ఓ ప్రసాదు…

No comments
Post a Comment