Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

God Father (2022)

a:hover { color: red; } pre { white-space: pre-wrap; white-space: -moz-pre-wrap; white-space: -pre-wrap; white-space: -o-pre-wrap; word-wrap: break-word; }చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నాయన తార, సత్యదేవ్ కంచరాన
దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: రాంచరణ్, ఆర్.బి.చౌదరి, యన్.వి.ప్రసాద్ 
విడుదల తేది: 05.10.2022Songs List:తార్ మార్ తక్కర్ మార్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా ఘోషాల్

బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే

హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే
ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే
వీళ్ళిద్దరిట్టా వస్తే భూం దద్దరిల్లాలంతే
ఏ, టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే

తార్ మార్ మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్ మార్
మార్ మార్ మార్

అండర్ వరల్డ్ లోనే ఉంటారు
అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు
చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు
రేపట్నెలా శాషిస్తారు

ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే
హే నిఘాలకే నిఘా పెట్టే మహా ముదుర్లే
హే, దిల్లే దిమాకులే హే, దిమాక్ కూడా దిల్లే
హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
తక్కర తక్కర తక్కర
తక్కర తక్కర మార్ (4)

బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే
బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే
డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే
ఫ్యాన్స్ కి పండగే జూంబరే జూంబరే

తార్ మార్ తక్కరు మార్నజబజ జజర పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , పృద్వి చంద్ర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం

ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం
గిత్తల మీదికంతెత్తున దూకితే నెత్తురే మొత్తం 

గుద్దు గుద్దితే గుండెలపై
గుజ్జు గుజ్జుగా అవుతావబ్బయి
కుమ్ము కుమ్మితే రొమ్ములపై
దిమ్ము దిమ్ముగా ఉంటాదబ్బాయ్
దుండగ దండుని మొండిగా
చెండాడు గండర గాడుడుర 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 

కొండ దేవర కోన దేవర 
కోర చూపు కొడవలిరా
అడవి తల్లికి అన్నయ్య వీడురా
కలబడిటే కథకళిరా 

చొక్కా మడతపెట్టి వచ్చాడంటే
టేకుదుంగ మీది గొడ్డలి వీడు
మీసకట్టు గాని తిప్పాడంటే
మద్దిచెక్క మీద రంపమవుతాడు

నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే 
నడ్డి విరిచెడు చేవచూసి అబ్బలు గుర్తొస్తారొయ్ 
అడ్డు వచ్చినోన్ని అడ్డ దిడ్డముగా 
తొక్కేసి పోతాడురా 

నజబజ జజర నజబజ జజర
గజ గజ వణికించే గజరాజదిగోరా 
నజబజ జజర నజబజ జజర
భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
గాడ్ ఫాదర్ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయిచరణ్ భాస్కరుని, అర్జున్ విజయ్, రితేష్ జి.రావు, చైతు సత్సంగి, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీ కృష్ణ , అద్వితీయ, శ్రుతిక, ప్రణతి, ప్రత్యూష పల్లపోతు, రచిత, వైష్ణవి, హారికా నారాయణ్, శృతి రంజిని, సాహితి చాగంటి 

ఏకో రాజా విశ్వరూపధారి
శాసించే చక్రధారి¹
అంతేలేని ఆధిపత్య శౌరి
దండించే దండకారి

శాంతి కోసం రక్తపాతం
వీడు పలికే యుద్ధపాఠం
నల్ల దందా నాగలోకం
వీడు తొడిగే అంగుళీకం

కర్మ భూమిలోన నిత్య ధర్మగామి
వేటుకొక్క చెడును వేటలాడు సామి

ఎక్కడుంటేనేమి
మంచికితను హామీ
ఒక్క మాటలోన
సర్వాంతర్యామి

గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్

ఆకసం పట్టని నామధేయం
నిర్భయం నిండిన వజ్రకాయం
ఆపదే అంటని అగ్నిగేయం

వీడో ధ్యేయం
వీడి వెలుగు అద్వితీయం
ఆటగా ఆడిన రాజకీయం
అంతరంగం సదా మానవీయం
సాయమే సంపద సంప్రదాయం
వీడో ధైర్యం
వీడి పలుకు పాంచజన్యం

అందలాలు పొందలేని పట్టం వీడే
అక్షరాలకందిరాని చట్టం వీడే
లక్షలాది గుండె సడుల
చుట్టం వీడే
అనుబంధం అంటే అర్ధం వీడే

మంచి చెడ్డ పోల్చలేని
ధర్మం వీడే
తప్పు ఒప్పు తేల్చలేని
తర్కం వీడే
పైకంటి చూపు చూడలేని
మర్మం వీడే
కరుణించే కర్త కర్మ వీడే
బ్లాస్ట్ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధామిని భట్ల, బ్లేజ్

హో... హో...
Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది Don’t Say No

లిప్పు మీనో హిప్పు మీనో
గుచ్చి గుచ్చి Kiss Me Know
తప్పు లేదు గిప్పు లేదు
హగ్గు లిచ్చి Crush Me Know

ధూమ్ ధమాకా ఫుల్ థడాకా 
Yehi Mouka Aajaare
ఇంతదాకా వచ్చినాక
Bun Ke Thoofa Cha Jaare
Tere Jaisaa Aur Kohi
Naahi Dhoojaare

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby… Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు 
Feast Baby… Feast Baby

Alpachino Alpachino
What You Want to Tell Me Know
Dil Kaseeno… Dil Kaseeno
Welcome అంది Don’t Say No

(Rap)

పటాస్ మాస్ యాక్షన్ హీరో
మజిల్స్ తో విజిల్ ఎయ్యరో 
Kick Ass Moods… Darker Shades
బయటికి తియ్యరో 

Is Raath Kaa.. Subahaa Nahee
Thu Share Shaa Laa దూకరో
నీ ఫైర్ లో పవరేమిటో స్టాంప్ వేసేయ్ రో...

Boss Boss Boss Boss
Boss Boss Boss Boss 
Ba Ba Ba BaBa BaBa BaBa
Dil Pe Maaro… Dishkiyaav

Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby
Blast Baby… Blast Baby

Blast Baby Blast Baby
Blast Baby… ఈ నైట్ నీకు
Feast Baby… Feast Babyపదరా సైనికా పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరామచంద్ర

అడవి చెట్లకు అన్నలం
కొండా గుట్టల తమ్ములం
బందూకులకు బంధువులం
నిప్పు కనికలం

మందుపాతర తొక్కిన అడుగులం
గుండెలోతుల కన్నీటి మడుగులం
ఆకుపచ్చని దారులకంటిన
చిక్కటి నెత్తుటి మరకలం

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

చరితను రాసిన ఎర్ర సిరా
ఎందరో వీరుల త్యాగమురా
ఆ ఒరవడిలో ఉద్యమమై
ఉమ్మడిగా అడుగేద్దాం

తోవ పొడవునా అగ్ని మడుగులు
ఎన్ని ఎదురై రాని
గుండె తడబడు నింగి పిడుగులు
దండుగా పడిపోని
విశ్రమించని హోరుగా
రగిలించరా కాలాన్ని

మన నేటి చలనమే
నేటి కధనమే భావితరమున
స్వేచ్ఛా పవనమురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగా

రేపో మరునాడో
నిజమవదా సమన్యాయం
ఓర్పు సహనంగా
సాగాలి సమయం

పుటకతో కూర్చిన ఆశయంరా ఇది
మరణమైనా సరే కిరణమై ఉంటది
ఒకనాటి ఉదయము వేగు చుక్కగా
వేల కళలకు వెలుగులు దిద్దునురా

పద పదరా సైనికా
పద పదరా సైనికా
వెనుకడుగే లేదురా
కదిలాక

పోరగా పోరగా పోరగా పోరగా
పూనకమైంది పోరు సెగ
పోరగా పోరగా పోరగా పోరగా
ముందడుగెయ్యరా సైన్యముగా
పోరగా పోరగా పోరగా పోరగాఅన్నయ్య పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (2022)
సంగీతం: యస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వైష్ణవి కొవ్వూరి

నీరై కరిగిందా నీ యదలో నలుపు
ఏరై కదిలిందా అనుభందం వైపు
అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు
రక్షా బంధముగా నీ తోడై నడుపు
కౌరవులెందరు ఎదురైనామరి 
ఒకడే చాలడా గిరిదారి
అదిగో అతడే అతడే హితుడు భాందవుడు
అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకిపుడు 
 

No comments

Most Recent

Default