-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Amala Paul"


చిత్రం: మేము (2016)
సంగీతం: అరోల్ కొరెల్లి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఆనంద్
నటీనటులు:  సూర్య, అమలా పాల్, బిందుమాధవి
దర్శకత్వం: పాండిరాజ్
నిర్మాత: జలకంటి మధుసూదన్ రెడ్డి
విడుదల తేది: 08.07.2016

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

కష్టాలు లేని ఏ పిల్లలు లేరులే
బొమ్మల్లే బతికే వారు పిల్లలు కారులే
దిగులింక ఏలా మనమల్లరి పిల్లలై
మేఘాలు దాటి ఎగిరేము గువ్వలై

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

తల్లి కడుపులో ఉన్నాం
కాళ్ళు చేతులాడించాం
ఈ నేలపైకొచ్చీ
మౌనంగా ఎందుకున్నాం
తోడుంది నీకు ఈకాలమే
నువ్వు సాగిముందుకే పో
ఆ మబ్బుల్ని నీవడిగావుగా
నీ రెక్కల్లే నే వస్తానురా నీకై

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

ఆగాజుపెట్టెలలో
జీవించు చేపలకు
కడలినీదు అనుభవమే
నేర్పించ మరచాము
ఆకాశమే నీదైనదో
హద్దేది లేదు నువ్వుపో
నువ్వు అరవిచ్చు పువ్వేనురా
నువ్వు పాపైతే నే రెప్పేనురా ఇక

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

Palli Balakrishna Saturday, February 2, 2019



చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
నటీనటులు: నాగచైతన్య , అమలా పాల్
కథ: రాంగోపాల్ వర్మ
దర్శకత్వం: వివేక్ కృష్ణ
నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్
బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్
విడుదల తేది: 01.12.2011



Songs List:



దుర్గమ్మ కృష్ణమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: విక్రమ్ నేగి 
సాహిత్యం: రెహ్మాన్
గానం: జోజో నతానియల్ 

దుర్గమ్మ కృష్ణమ్మ 




అడగకు నన్నేమి పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: బాపి తుతుల్ 
సాహిత్యం: కలువ సాయి 
గానం: జావేద్ ఆలీ, చంద్రీయ భట్టాచార్య

అడగకు నన్నేమి 



నిన్ను చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: కలువ సాయి
గానం: జావేద్ ఆలీ, శ్వేతా పండిట్ 

నిన్ను చూసిన 




కొంటె చూపులాపి పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: రెహ్మాన్
గానం: హేమచంద్ర , గీతామాధురి

చుక్కలన్ని ఒక్కచోట  చేరుతుంటే
చందమామ చంతకొచ్చి ఆడుతుంటే
కొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవే
కన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులే
మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా
మగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)

అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే
అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే
తీగనడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే
సరదాలు సరసాలు మా హక్కు అంటారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)

చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఏమంది
తనువు లోతే తపన నీదే మనసు
ఊగిందీ హేయ్ తెలుసుకోమంది
సిగ్గుతోటి ముగ్గులేసి ముగ్గులోకి దించుతారే
ముందుకళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరి ఆపేస్తారే 
జగడాలు ఆడాళ్ళు అని నిందలే వేస్తారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)




రమ్ము జిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రదీప్ కోనేరు 
సాహిత్యం: ప్రదీప్ కోనేరు 
గానం: దీప్తి చారి 

రమ్ము జిన్ను 



అయిగిరి నందిని పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రదీప్ కోనేరు 
సాహిత్యం: శ్రీ ఆది శంకరాచార్యుల 
గానం: రవిశంకర్ 

అయిగిరి నందిని 




బెజ బెజ పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: జోజో నతానియల్ 

బెజ బెజ



లే లెగరా పాట సాహిత్యం

 
చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: ప్రేమ్ 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శ్రీకాంత్ 

లే లెగరా 

Palli Balakrishna Thursday, February 22, 2018

చిత్రం: దొంగోడొచ్చాడు  (2017)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: బాబీ సింహా, అమలా పాల్, ప్రసన్న
దర్శకత్వం: సుసి. గణేశన్
నిర్మాతలు: కల్పాతి ఎస్.అఘోరన్, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
విడుదల తేది: 2017

నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
నీ తలపే వలపై ఎదలో మలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ...

నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా

యుగం క్షణం అనుక్షణం
జగం మనం నీ జతలో చెలియా
క్షణం యుగం అదే జగం
చెరో సగం నువులేక సఖియా
సిరివెన్నెల ఎండాయే
నా  నీడే  రెండాయే
కుదురన్నది లేదాయే కునుకన్నది రాదాయే
తడబడిపోతున్నా ఓ చెలి

నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా

నా పల్లవే ఓ  మల్లికై మెరిసిందీ చెలియా
ఆ పల్లవే ఓ వెల్లువై నా కళ్ళలో కురిసిందీ సఖియా
ఇదివరకు ఎరగంది ఈనాడే జరిగింది
నడి రాతిరి పగలైంది ఓ తీయని దిగులైంది
తడబడి పోతున్నా ఓ చెలి

నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హా
నీరూపే నిండే గుండెల్లో ఆహా హా
నీ తలపే వలపై ఎదలో మలిచింది
నీ నవ్వే ముల్లై నన్నే తొలిచింది
తడబడిపోతున్నా ఓ చెలీ...

Palli Balakrishna Sunday, November 12, 2017


చిత్రం: లవ్ ఫెయిల్యూర్  (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ధార్థ్
నటీనటులు: సిద్దార్ధ్, అమలా పాల్, అర్జున్
దర్శకత్వం: బాలాజీ మోహన్
నిర్మాతలు: శశికాంత్ శివాజీ, సిద్దార్ధ్, నిర్వా షా
విడుదల తేది: 17.02.2012

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...

లోవ్వు  లో  ఫైల్యురే నేను  లవ్  ఫైల్యురే
హే  ప్రేమ  పాత  నవ్వులాట  ఒక్కటేరా
హే  ఓడిపోయే  ఆటాడి  ఆడకురా
ప్రేమనే  కర్రెంటు వైరు పట్టుకోకు
కర్రెంటు  షాకు కొట్టి  నట్టు  కొట్టుకోకు
ప్రేమ  మెమరీ  ఫోను  మెమరీ  ఒక్కటేరా
కుపలారి  వుడ్చినట్టే
Its over its over నిజంగా   its over
నేను  లవ్  లో  ఫైలు  ఆయానే
పార్వతి  పార్వతి  ఇంటర్వల్  లో  వదిలి  వేల్లావే
పార్వతి  పార్వతి  బెల్టు  తోటి  మంట  పెట్టావే ..
పార్వతి  పార్వతి  గుండె  పిండి  గుండు  కొట్టావీ
పార్వతి  పార్వతి  రివేర్సు గేరు వేసి  పొయావే ..
మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
నేను  లవ్  ఫైలురే

హే  పార్వతి  why did u go away
హే  అమెరికాని  కనుక్కుంది  కలంబుస్సు
ఈ  ప్రేమకేవారు  చెప్పలేదే  సిలబస్సు
కౌనురే  కౌనురే  చెప్పు  మామ
గొయ్యి  తీసి  వాడ్ని  పూడ్చి  పెట్టు  మామా
కోటి కోక్కడైన  ప్రేమ  గెలిచినట్టు
మంచికైన  అచ్చు  లేదే
its over its over నిజంగా  its over
నిజంగా  its over
పార్వతి  పార్వతి  నేను  సింగ్లె  ఐపోయానే
పార్వతి  పార్వతి  రిలీజ్   కి  ముందే  ఫ్లాపు  అయ్యానే
పార్వతి  పార్వతి  నాకు  నేనే  మిగిలి  పోయానే
పార్వతి  పార్వతి  దేవదాసు  ఐపోయానే

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...
మేము  love failure మేము  love failure
మేము  love failure మేము  love failure


********   *********   ********


చిత్రం: లవ్ ఫెయిల్యూర్  (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ధార్థ్

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్
రైట్  సైడ్  కూడా  హార్ట్  బీట్  ఉంటె  లవ్  లవ్
దేర్మమేటర్  బ్లాస్ట్  ఐపోతే  లవ్  లవ్
ICU లో  పడుకున్న ....I LOVE YOU నే  అంటుంటే
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్

గుండెల్లో  గూగ్లీ  పడితే  లవ్  లవ్
బాడీ  లో  బౌన్సుర్  పుడితే  లవ్  లవ్
నే  వలపు  బాటింగ్ కి  తనయాలు  స్పినేస్తే
ని వికెట్  డౌన్  ఐపోతే  లవ్  లవ్
లైఫ్  ఈ  క్లీన్  బ్లో  ఐపోతే  లవ్  లవ్

ప్లస్సు  మైనస్  మిక్షింగ్ చేస్తే  లవ్  లవ్
నీతో  నువ్వే  బాక్షింగ్ చేస్తే  లవ్  లవ్
ఆక్షిజెన్ ని  వదిలేసి  ఆలోచనలే  పీలుస్తే
ఉహల్లో ఉరేగుతుంటే  లవ్ ..లవ్
ఉపిరితో  పనిలేదు  అంటే  లవ్  లవ్

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్


********   *********   ********


చిత్రం: లవ్ ఫెయిల్యూర్  (2012)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్.ఎస్.థమన్

హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే
హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె
మేలుకోర  మేలుకోర  చెరిగిపోయే  మంచుతెర
వలుకుతుంది  ప్రేమ  సిరా
ఆ  చరితే  రాయు  కావ్యం  నిదిర
అదే  అదే  కాలానికి  తానే  అమ్మ  అయిందే ...
పదే పదే  తొలి  మనిషికి  తోడు  నీదయ్యింది
అదే  అదే  ఈ  పయనాలని  ముగిసే  గమ్యం
గంయలన్ని  కలిసే  తీరం
తెరలన్ని  మెరిసే  లోకం ...ఓఒ ....ఓఒ


హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే

హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె
నమ్మర  నరవరా  ప్రేమకి  తూరుపు  తప్ప  తెలియదు  పడమర
సూర్యుని  పువ్వుల  లోకమే  ప్రేమని  బాణుడి చూపుకి  బానిసరా
హే  దూరం  పెంచి  బారం  కాదా
ఆ  భారం  తీర్చే  వరమై  పోదా
ఏ  ప్రేమలేఖ తగువుంతుందా
తగువులోని  తీపున్నంత  చకరకేలి  తిన్న  ఉందా

Palli Balakrishna Saturday, August 19, 2017



చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: అల్లు అర్జున్, అమలా పాల్ , కేథరిన్ తెరీసా
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 31.05.2013



Songs List:



Run run పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అపాచి ఇండియన్, షర్మిల

సీతా గీతా షీలా మాలా
పేరే ఏదైనా అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే
అస్సలు లేకుంటే కన్నా... లైఫే సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనా
ఐఫీస్టనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయ్‌నా
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతె డూం డూం డూం డూం
లోకానికే ఆక్సిజిన్ అందం అందం... సో...
Run run run run run
Put your hands up n say
let's have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman

మాటల్లోన కాక్టెయిల్ మత్తుంటాది
ఊపిర్లోన పెర్ఫ్యూమ్ ఘుమ్మంటాది

టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో
మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న సాప్టుగున్న హార్టుంటాది
సూదికన్న షార్పుగున్న చూపుంటాది
అర్థంకాని చిట్టిబుర్రలో
గజిబిజి సుడోకు పజిలుంటాది
బూం బూం బూం బూం బూం
బూం బూబూం
ఎహె ఎన్ని గొప్ప లెక్కలున్నా
ఏంటీ లాభం
ఎళ్లి ఆడికో ఈడికో పడ్డం ఖాయం సో...
Run run run run run
Put your hands up n say
let's have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman

క్లోరోఫాం అద్దుకున్న కర్చీఫ్‌లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫోం మేట్రెస్‌లాగా
కొందరిది ఎడ్జష్టయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతీ అమ్మాయ్
ఫాస్టుగానే ఉండాలని రూలే లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్ స్లోగానే
ఉంటుందన్న గ్యారెంటీ లేదు
బూం బూం బూం బూం బూంబ బూం బూబూం
వీళ్లనెస్టిమేట్ చెయ్యడం చాలా కష్టం

ఈ లైఫ్‌టైం చాలదీ సబ్జెక్ట్ కోసం రన్ రన్ రన్...
Run run run run run
Put your hands up n say
let's have some fun
Run run run run run
Gotta win the heart of
every sexy woman





శంకరాభరణంతో పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: మనో, సుచిత్ సురేషణ్, రనైన రెడ్డి 

శంకరాభరణంతో 



వయోలిన్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: విశ్వా, డేవిడ్ సిమోన్ 
గానం: డేవిడ్, అనిత 

వయోలిన్ సాంగ్





గణపతి బప్ప మోరియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సూరజ్ జగన్ 

గణపతి బప్ప మోరియా




టాపు లేసిపోద్ది... పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్ , గీతా మాధురి

అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..
మంచి బీటొస్తాది పిచ్చ పాటొస్తాది
అబ్బాయ్ మనసునే అమ్మాయ్ లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది..
మస్త్ మాసొస్తాది బెస్ట్ ఊపొస్తాది...

రాయే రాయే నా రాకాసీ...
నువ్వే పైటేసీ అట్టా దోపేస్తే
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో...

టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో...
రారో రారో నా శివకాశి...
అగ్గిరాజేసీ... సిగ్గుపేల్చేస్తే...
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో... 

టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో...
చెట్టు మీద మ్యాంగోలా... నువ్వెంత సక్కగున్నావే
చాకులాంటి పిల్లాడే... ఎంతషార్ప్‌గున్నాడే
చాకొచ్చీ మ్యాంగో కోస్తే...
టాపు లేసిపోద్ది... కన్నే కొట్టావంటే

టాపు లేసిపోద్ది... ముద్దే పెట్టావంటే
టాపు లేసిపోద్ది... చెయ్యే పట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో...

అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..
మంచి బీటొస్తాది పిచ్చ పాటొస్తాది

ఏయ్... సమ్మర్లోనా లస్సీలా వింటర్లోనా కాఫీలా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే
పిల్లా పొంగేపొంగే పూరీలా
రాంబోకేమో తమ్ముళ్లా... జాకీచాన్ అల్లుళ్లా
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అబ్బో బ్రేకుల్లేని లారీలా
రాయే రాయే నా రాకాసీ...
అట్టా నవ్వేసీ గుండె తవ్వేస్తే
రారో రారో నువ్ చిటికేసి
షర్టు మడతేసీ కాలరెగరేస్తే
టాపు లేసిపోద్ది... ఓణీ కట్టావంటే
టాపు లేసిపోద్ది... పూలే పెట్టావంటే
టాపు లేసిపోద్ది... ఈలే కొట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో...

ఏయ్... కోతికేమో కొబ్బర్లా... పిల్లాడికి బర్గర్లా...
నచ్చేస్తున్నావే.. కల్లోకొచ్చేస్తున్నావే...

అరె కొత్త ఫిలిమ్ ట్రైలర్లా
పోలీసుకీ రౌడీలా... ఆడోళ్లకీ చాడీలా
బుక్కైపోయావే నాకు సెట్టైపోయావే
సోడాబుడ్డిలోని గోళీలా
రాయే రాయే నా రాకాసి...
గోళ్లుకొరికేసీ ఒళ్లు విరిచేస్తే
రారో రారో నువ్ ఇటుకేసి
ప్యాంటు మార్చేసి లుంగీ కట్టేస్తే
టాపు లేసిపోద్ది... కాటుకెట్టావంటే
టాపు లేసిపోద్ది... గాజులేశావంటే
టాపు లేసిపోద్ది... గోడే దూకావంటే
టాపు లేసిపోద్ది... డోరే కొట్టావంటే
టాపు లేసిపోద్ది... టాపు లేసిపోద్ది...
టాపు టాపు టాపు... టాపు లేసిపోద్ది...




Run Run (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అపాచి ఇండియన్, షర్మిల, దేవి శ్రీ ప్రసాద్

Run Run (Remix)


Palli Balakrishna Monday, July 24, 2017



చిత్రం: వి.ఐ. పి 2 (2017)
సంగీతం: సీన్ రోల్డన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్, అనణ్య తిరుమలై
నటీనటులు: ధనుష్ , కాజోల్, అమలా పాల్, రీతూ వర్మ
దర్శకత్వం: సౌందర్య రజినీకాంత్
నిర్మాతలు: కళైపులి యస్. థాను, ధనుష్
విడుదల తేది: 28.07.2017

Bring it on.. Game on..

దూరం నువ్వె ఉండాలోయ్
పులి వేగం నేనై వచ్చానోయ్
ఆటే నాతో ఆడావో
గుణ పాఠం నువే వింటావోయ్

కలబడె తలబడే కండ ఉంది
కరునతొ నిలబడే గుండె ఉంది
పరువకై పరుగిదె ప్రాణం ఉందిలే

మనసుకె వినపడె మాట ఉంది
మంచికే కనపడె చోటు ఉంది
బాదలె కలిగితె నవ్వు ఉందిలే

నా గెలుపుకి చెమటని నేను
నా వెలుగకి చమురుని నేను
న్యాయంగా ఉంటాను
సాయంగా వెళతాను
నా నింగి కి జాబిలిని నేను
నా రంగుల దోసిలి నేను
మగవాడ్నె వద్దంటు
మహ రాణై ఉంటాను
పులి తోకలా ఉండె కంటె
పిల్లికి తలలాగ ఉంటానులే
నా శ్వాసలో తూఫానులే
పువ్వంటి పాదాల్లో బూకంపమే

మగవాడిలో – పొగరిని అనచగ
వగలాడిలో – తెగువను తెలుపగా



*******   ********   ********


చిత్రం: వి.ఐ. పి 2 (2017)
సంగీతం: సీన్ రోల్డన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సీన్ రోల్డన్, యమ్. యమ్. మానసి

ఇరువురం కాదు ఒకరిమే
తెలిసెనీనాడు వివరమే
ఇరువురం కాదు ఒకరిమే
తెలిసెనీనాడు వివరమే

కలతలో కార్చుకున్నదేవివే
నిజమగా నిన్ను విడవనీ
కనులలొ ఉన్న తేనె చినుకులె
అనుక్షణం చల్లె చనువునీ

మనసా మనసా నువు చెపితే
వెన్నెలే కుమ్మరించనా
కన్నయా కన్నయా నన్ను కోరితే
స్వర్గమే నేల దించనా

గుండెల్లోన ఎన్నెన్నో వెలుగులే
ప్రాణంలోన ఏవో పాటలె
ఊహల్లోన అందాల మెరుపులే
పట్టిందల్ల పువ్వై పూసెనే

తల్లి లాగ నీ మది
నాకు తోడై ఉన్నది
ముద్దులివ్వు ముద్దులివ్వు
మొత్తమంత ఇవ్వనివ్వు
కాలమె నాదైనదే

ఇరువురం కాదు ఒకరిమే

ఇరువురం కాదు ఒకరిమే
తెలిసెనీనాడు వివరమే
ఇరువురం కాదు ఒకరిమే
తెలిసెనీనాడు వివరమే

కలతలో కార్చుకున్నదేవివే
నిజమగా నిన్ను విడవనీ
కనులలొ ఉన్న తేనె చినుకులె
అనుక్షణం చల్లె చనువునీ

మనసా మనసా నువు చెపితే
వెన్నెలే కుమ్మరించనా
కన్నయా కన్నయా నన్ను కోరితే
స్వర్గమే నేల దించనా



*******   ********   ********


చిత్రం: వి.ఐ. పి 2 (2017)
సంగీతం: సీన్ రోల్డన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రాహుల్ నంబియర్, యోగి.బి

Watch out Amul babies
it’s Raghuvaran back again
in a no afraid of pain hit it

బుడ్డి కల్లజోడే
జుట్టేమొ చిక్కుపడె
వాడంత తోడె
యు కెన్ సి నో బడీ
సీ  నువ్వు చూడు వాడికి
స్టార్ షైన్ ప్రైడ్ వచ్చింది వాల్లకి
కొత్త వెన్న సమాజానికి సవ్య సాచి
పొరాడి నెగ్గే
VIP VIP V I P

నడరా రాజా
బయట పడరా రాజా
అదిరా రాజా
ఇది సుడిరా రాజా
అరె కోటి ఏనుగుల భలం
అడుగేస్తె అదిరె కింద స్థలం

చెల రేగు ఇది పోరుగళం
మనం పోరాడు మనుషులం
పులిని రా
వెనక్కె చూస్తె నేరం
తెగువు రా
తెగించ మంది వైరం
రఘువరా
పేరులో పోరాటం
పోరాటం అంటె నేను రా
ప్రతిభ నీకు హారం
పొగరుగా కదలకుంటె నేరం
పని లేని పాట లేని
పట్టదారి రా…

మరల పుడదాం రా
పనిలో పడదాం రా
భవితే మన బాట
గతము నీ ఇల్లు రా

భువినే చుడదాం రా
దివినే కడదాం రా
గెలుపే కొడదాం రా
అలుపు నీకొద్దు రా

ఎదగరా... వెలగరా...
మునగరా...తెగించి పోరాడరా

ఎదగరా...
నిండు హ్రుదయం మనదే
వెలగరా...
ఆ వెలుగు మనదే
మునగరా...
వెండి కడలి మనదే
తెగించి పోరాడరా

V I P

*******   ********   ********


చిత్రం: వి.ఐ. పి 2 (2017)
సంగీతం: సీన్ రోల్డన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: బి.రవి

పెళ్లన్నదే భలె భలె భారం
తెలిసుండి చేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం
అది అల అల ఐపోతుంది ఐస్ క్రీమ్ లో కారం

అరె పోతుందిరా ప్రాణం
అరె వస్తుందిరా జ్ఞానం
అరె పిల్ల మెడలో నువె కట్టె పచ్చ పచ్చని దారం
ఆ దారం ఆదారంగ నీతో ఆడేస్తుంది గ్యాలం

మేరేజి అంటె డేంజర్ రా రామ
మైలేజి లేని ఇంజిన్ రా మామ
పులిహోర కోసం పులి తోటి స్నేహమా
పూ మాల కోసం తోట కి దాసోహమా

గుండెల్లోనా దాచానురా
పువ్వల్లోన పెట్టి చుశానురా
ఎన్నో ఎన్నో చేశానురా
ఏమిచ్చిన తనకి చాల్లేదురా

అంతే రా పెళ్ళాం అంతే రా
పంచ ప్రాణాల్లె  స్ట్రా వేసి పీల్చేనురా
ఇంతేరా మొగుడు ఇంతేరా
పంచు పడ్డాక ఎక్కెక్కి ఏడ్చేనురా

ప్రేమ మైకంలో తన పేరే ధైవం
పెళ్లంటూ ఐపోతె తానే ఒక దెయ్యం

ప్రేమా - పీడ కలలే
పెళ్లి - పీడ కలలే
పీడ కలలే   పీడ కలలే  పీడ కలలే  పీడ కలలే

పెళ్లన్నదే భలె భలె భారం
తెలిసుండి చేసే నేరం
పెళ్లాడితే ఆనందమే దూరం
అది అల అల ఐపోతుంది ఐస్ క్రీమ్ లో కారం

అరె పోతుందిరా ప్రాణం
అరె వస్తుందిరా జ్ఞానం
అరె పిల్ల మెడలో నువె కట్టె పచ్చ పచ్చని దారం
ఆ దారం ఆదారంగ నీతో ఆడేస్తుంది గ్యాలం

మేరేజి అంటె డేంజర్ రా రామ
మైలేజి లేని ఇంజిన్ రా మామ
పులిహోర కోసం పులి తోటి స్నేహమా
పూ మాల కోసం తోట కి దాసోహమా

మిస్సెస్ తీరే లేడి ఒసామ
మిస్టర్ ల స్టోరి చిరిగిన పైజమా

Palli Balakrishna Saturday, July 15, 2017




చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: రామ్ చరణ్ తేజ్, అమలాపాల్, కాజల్ అగర్వాల్; ఛార్మి కౌర్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 09.01.2013



Songs List:



లైలా ఓ లైలా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ నంబియార్, రంజిత్, నవీన్ 

లైలా ఓ లైలా 



కత్తిలాంటి పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్. ఎస్. థమన్, శఫారి అల్వారిస్


కత్తిలాంటి పిల్లా



శుభలేఖ  రాసుకున్నా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, శ్రేయగోషల్

(ఈ పాట చిరంజీవి  నటించిన కొండవీటి దొంగ (1990) సినిమా నుండి తీసుకొని  రీమిక్స్ చేశారు. పాడినవారు: బాలు, చిత్ర.  సంగీతం: ఇళయరాజా )

శుభలేఖ  రాసుకున్నా ఎదలో  ఎపుడో
అది నీకు  పంపుకున్న  అపుడే  కలలో
పుష్యమి పువ్వుల పూజ  చేస్తా బుగ్గన  చుక్కలతో
ఒత్తిడి  వలపుల  గంధమిస్తా పక్కలలో

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే  ఎపుడో
శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో
శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో

చరణం: 1
చైత్రమాసమొచ్చెనేమో  చిత్రమైన  ప్రేమకి
కోయిలమ్మ  కూసెనేమో  గొంతునిచ్చి  కొమ్మకి
మత్తుగాలి  వీచెనేమో  మాయదారి  చూపుకి
మల్లెమబ్బు  లాడెనేమో  బాలనీలవేణికి
మెచ్చి  మెచ్చి  చూడసాగే  గుచ్చే  కన్నులు
గుచ్చి  గుచ్చి  కౌగిలించే  నచ్చే  వన్నెలు
అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
తొలిముద్దు జాబు రాశా  చెలికే  ఎప్పుడో
పుష్యమి  పువ్వుల  పూజ  చేస్తా  బుగ్గన  చుక్కలతో
ఒత్తిడి వలపుల  గంధమిస్తా పక్కలలో

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో

చరణం: 2
హంసలేఖ  పంపలేక  హింస  పడ్డ  ప్రేమకి
ప్రేమలేఖ  రాసుకున్నా  పెదవి  రాని  మాటతో
రాధలాగ  మూగబోయా  పొన్న చెట్టు నీడలో
వేసవల్లె  వేచివున్నా  వేణుపూల  తోటలో
వాలుచూపు  మోసుకొచ్చే  ఎన్నో  వార్తలు
ఒళ్ళో  దాటి  వెళ్ళ  సాగే ఎన్నో  వాంఛలు
అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
అది  మీకు  పంపుకున్న  అపుడే  కలలో
శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో
శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో



ఒక చూపుకే పడిపోయా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: విజయ్ ప్రకాష్, బిందు మహిమ 


ఒక చూపుకే పడిపోయా 



నెల్లూరే పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: జస్ప్రీత్ జస్జ్, సుచిత్ర 


నెల్లూరే



హే నాయక్ పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయ ఘోషల్, నవీన్ మాధవ్ 


హే నాయక్

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default