Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kuberaa (2025)




చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: ‘కింగ్’ నాగార్జున అక్కినేని , ధనుష్ , రష్మిక మందన్న 
దర్శకత్వం:  శేఖర్ కమ్ముల 
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు 



Songs List:



నా కొడుకా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
గానం: సిందూరి విశాల్ 
సాహిత్యం: నంద కిషోర్ 

పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా..

కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా..

పదిలంగా నువ్వు నడవలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకా..

ఆకలితో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా..

నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా..

మనుషికీ మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా..

తిడితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా..

రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకా..

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా..

పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగారా నా కొడుకా..

ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఏదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దివేనిది నా కొడుకా..

ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దివేనిది నా కొడుకా..

ఏ పిడుగుల చప్పుడు వినపడినా
ఏ బూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా
అమ్మ దివేనిది నా కొడుకా..
అమ్మ దివేనిది నా కొడుకా.



అనగనగా కథ.. పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: హైడే కార్తీ , కరిముల్లా 

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

నమ్మే వాడిని అమ్మేయడం….
మొక్కేవాడిని తొక్కేయడం..
దొరికేవాడిని దోచేయడం..
తల వంచేవాడిని ముంచేయడం..

యుగాల నుండీ..
జరుగుతున్న కథ..
యుగాంతమైనా మారిపోని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

వంతెన కట్టేదొకడు..
దాన్ని దాటే వాడింకొకడు..
నిచ్చెన వేసేదొకడు…
పైపెకెక్కే వాడింకొకడు..
ముందుకు తీసుకు వెళ్ళేవాడిని అక్కడితోనే ఆపడం..
ఎత్తుకు మోసుకు వెళ్ళేవాడిని లోతులలోనే ఉంచడం..

పేదల నెత్తుటి మరకలు అంటని పెద్దల సిరి ఉందా!??
బీదల కన్నుల నీటిని తుడవని కథలకు అర్ధం ఉందా..?!?

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

లేని వాడికి నోటి ఆకలి..
ఉన్నవాడికి నోట్ల ఆకలి..
నోటికి తెలుసును వద్దు వద్దు..
నోట్లకు తెలియదు హద్దు పద్దు..

బలహీనుడికి ఆశే ఉంటది..
బలవంతుడికి అత్యాశుంటది..

ఓ.. ఆశకు బ్రతుకే సరిపోద్ది..
ఒక బ్రతుకే సరిపోద్ది..
అత్యాశే అందరి బ్రతుకులతో ఆట ఆడుకుంటది..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..

అనగనగా కథ..
అనగనగనగా కథ..
అందరికీ తెలిసిన కథ..
కానీ అంతే తెలియని కథ..



పోయిరా మావా పాట సాహిత్యం

 
చిత్రం: కుబేర (2025)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: ధనుష్ 

ఏయ్ వన్ డే హీరో నువ్వే ఫ్రెండ్
నీ కోసమే డప్పుల సౌండు
అస్సలు తగ్గక అట్నేఉండు
మొక్కుతారు కాళ్ళు రెండు
నిన్నే చూస్తున్నది చూడు
ఊరు మొత్తం దేవుడి లాగ
వన్ వే లోన నువ్ వెళ్లిన ఆఫర్ నిన్నను అందరిలాగా
రధం మీద నువ్వే అలాగ
దూసుకువెళ్తా ఉంటె అబ్బో యమగా
సీఎం పీఎం ఎదురే వచ్చిన
నువ్వు సలాం కొట్టే పనే లేదుగా
ముందరిలాగా అంత ఈజీ గా
నిన్నే కలుసుకోలేరుగా
నీతో ఫోటో దిగాలన్న
చచ్చేతంత పనౌతుందిగా
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

చూస్తూ చూస్తూనే మారింది
నీ రేంజ్ ఈరోజున
నిన్నే అందుకోవాలి అనుకుంటే
సరిపోదే ఏ నిచ్చెన
సొమ్ములైన సోకులైన తలొంచావా నీ ముందర
నిన్నే కొనే ఐస పైసా ఈ లోకం లో యాడుందిరా
నిన్నే తిట్టి గళ్ళ పెట్టి సతాయించే సారె లేదు రా
ఓఓఓ ఓఓఓ…..
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా

నీతోటో మాట్లాడి గెల్చేటి దమ్మే ఈడ లేడేవాడికి
స్వర్గం అరేయ్ నీ జేబులో ఉంది బాధే లేదు ఏనాటికి
ఏరోప్లేనే రాకెట్టు నీ కాళ్ళ కిందే ఎగరాల్సింది
ఎంతోడైన తలే ఎత్తి ఆలా నిన్ను చూడాల్సిందే
తల రతన్ చెరిపి మల్ల రాసేసుకో నీకే నచ్చింది
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా
పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా
అరేయ్ రాజా లాగా దర్జాగా పోయిరా మావా


Palli Balakrishna Wednesday, December 10, 2025
Coolie (2025)




చిత్రం: కూలీ (2025)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సుభాషిణి , అనిరుధ్ రవిచందర్ 
నటీనటులు: సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, శృతి హసన్ 
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ 



Songs List:



మోనికా... పాట సాహిత్యం

 
చిత్రం: కూలీ (2025)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సుభాషిణి , అనిరుధ్ రవిచందర్ 

బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ ఎనర్జీ
అదిరే అందాలున్న తుఫాను లే అమ్మాడీ

టక్కున చూసిందో హై పల్సే బాడీ
హోయలే చేపలకే నేర్పించులే
కలకే కలరేసే జిలేబీ లేడీ
సాల్ట్ టచ్ చేస్తే స్వీట్ అవ్వునే

మోనికా…
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్..తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్..తాకు
జుమ్మడా జుమ్మా జుమ్
వచ్చి ఆడుకో

నజరానా పట్టుకోవా నాయగారం వేతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా

పోయే టైమ్‌ వస్తే ఎడ్చి అరవద్దే
పూజ ఆటల్లో ఇన్నొసెంట్ కానే వద్దు
సగమే కోకుంటే నిజము మాటొద్దే
పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదోయ్

మూనే ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాష చేయి పడితే మారేనిలా

మోనికా…
మై డియర్ మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
లవ్ యూ మోనికా
బేబీమా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా

హే జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు
హే జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్మా..
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు
వచ్చి ఆడుకోరా

జుమ్ జుమ్ జుమ్
ఇక్కడికి రా మోనికా

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్ముడు జుమ్ముడు జుమ్..తాకు

మోనికా… మై డియర్
లక లక లక లక లక లక లక
జుమ్మా జుమ్మా జుమ్మా జుమ్..తాకు

Palli Balakrishna
Mirai (2025)





చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: చంద్రబోస్ 
గాయకుడు: శంకర్ మహదేవన్ 
నటీనటులు: తేజ సజ్జ , మంచు మనోజ్
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్  &  కృతి ప్రసాద్ 



Songs List:



రుధిర మగధ పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: కార్తీక్ ఘట్టమనేని   
గాయకుడు: శ్రీచరణ్  భాస్కరుని, చైతు  సత్సంగ్, హర్షవర్ధన్ చావాలి 

రుధిర మగధ 



వైబ్ ఉంది బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: కృష్ణ కాంత్  
గాయకుడు: అర్మాన్ మాలిక్ 

ఓ పొరి దిల్‌దారు వయ్యారివే
నీ చూపు తల్వారుతో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే…

వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే

వెరే ప్లానెట్టా
ఇంత అందం యెట్ట
నాకెట్టా పడ్డావులే..

కళ్లో డ్యూయెట్టా
స్వీటీ చోక్లట్టా
నా ఫేట్‌ మారిందిలే..

స్టెప్పులు వేసిందే
దినక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే
దినకు దిన
పక్కాన నువ్వుంటే

నీ పేరు టాటూ లా రాయించనా?
మన పెయరే హిట్ పెయరే చేసేయానా?…ఆ

వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉంది బేబీ

వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నుపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉందిలే



జైత్ర యాత్ర పాట సాహిత్యం

 
చిత్రం: మిరాయ్ (2025)
సంగీతం: గౌర హరి
సాహిత్యం: చంద్రబోస్ 
గాయకుడు: శంకర్ మహదేవన్

జైత్రాయ
ధైర్యం జైత్రాయ
సర్వం జైత్రాయ

కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా

మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా

ధర్మం జైత్రాయ..
ధైర్యం జైత్రాయ..
సర్వం జైత్రాయ..

కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా

మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా

అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా
మేఘాల జ్యోతులే దీవించి పంపగా

నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా
నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా

ప్రతి కణం నీ మాతృ భిక్ష
ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష

జ్వలించగా నీ జీవితేచ్ఛ
ఫలించదా నీ దీక్ష….


Palli Balakrishna Monday, December 8, 2025
Peddi (2025)




చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
నటీనటులు: రాంచరణ్, జాహ్నవి కపూర్ 
దర్శకత్వం: బుచ్చిబాబు
నిర్మాత: వెంకట సతీష్ కిలారు , ఇషాన్ సక్షేన 
విడుదల తేది: 27.03.2026



Songs List:



చికిరి చికిరి పాట సాహిత్యం

 
చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: బాలాజి
గానం: మోహిత్ చౌహాన్ 

ఓ హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..

ఓ హో..హో.. ల లా లా లాల..
ల ల లా లా లా ..

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…

ఆ ముక్కు పై.. పెట్టి కోపం
తొక్కేసావే.. ముక్కెరందం
చింతాకులా.. ఉందే పాదం
చిర్రాకులే.. నడిచే వాటం..
ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు,
నీ మత్తే తాగిందా తాటికల్లు.

కూసింతే చూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా.

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క,
దీనేషాలో తిక్క,
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా తర్ రంధనానా..

తందనాననా తర్ రంధనాననా
తర్ రంధనాననా నా నా నా నా…

నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో.. కాయ దుంపా
నీ యవ్వారం.. జరదా ముంపా
నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..

నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే
గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే…

చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…

హో చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కిరి..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

Palli Balakrishna
Andhra King Taluka (2025)




చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
నటీనటులు: రామ్ పోతినేని,  ఉపేంద్ర , భాగ్యశ్రీ బోర్స్ 
సంగీతం: వివేక్  & మెర్విన్ 
గాయకుడు: రామ్ పోతినేని 
సాహిత్యం: భాస్కరభట్ల 
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ 
విడుదల తేది: 27.11.2025



Songs List:



Unlotld Emotions పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్వరాగ్ కీర్తన్

Unlotld Emotions



First Day First Show పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: దినేష్ కక్కేర్ల 
గానం: ఆంధ్ర కింగ్ తాలూకా ఫాన్స్ 

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల సిల సిల సిల
హే గల గల గల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు

మన ఆంధ్రాకే కింగు

హే అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు కింగూ

మన ఆంధ్రాకే కింగు
మన మన మన మన మన మన
మన ఆంధ్రాకే కింగు

అదే అదే అదే అదే అదే

అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు
అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు
వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు
మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు
ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు



Puppy Shame పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: రామ్ పోతినేని 

వీడు మొహం ఏంట్రా మా డిపోయింది
మావ నువ్వు అందుకోరా

పోతదన్నావ్ ఇప్పుడేంటన్నా
ఏ.. హిట్ కొట్టాం
సొండ్ ఏదన్నా (లేదన్నా)

తొందరేంటి అరే ఉండన్నా
బెట్టు కట్టి జరుపోతుంటే ఊరుకుంటానా
ఈ బక్కోడి చెండె తియ్యనా
ఆ బండొడి గుండె గియ్యనా
మీదకేక్కేసి తొక్కేసి కుమ్మనా
నువ్వు ఉండన్నా..

ఈ అన్నకి బొట్టే పెట్టారా
ఆ అన్నకి దండే వెయ్యరా
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా మర్యాదలే చేయాండ్ర

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

రేయ్ రేయ్ రేయ్ మనిషి అన్నాక
భయం, భక్తి, బలం, బలుపు, ఉండాలి
అలాగే ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి
తెలుసుకుంటే బాగుపడతావ్ లేకపోతే పైకి పోతావ్

దండమెత్తి పాలు పొయ్యన్నా
టెంకాయే తీసి కొట్టన్నా (కొట్టన్నా)
హారతిచ్చి కాళ్ళు మొక్కన్నా
ఫోటో దించుత ఫోజు ఇవ్వన్నా
హు నవ్వన్నా

ఏ బిత్తర చూపులు ఏంటన్నా
అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న
ఎహే మీలాగే సప్పగా ఉందన్నా పసలేదన్న

ఏ ఫుల్లుగా సౌండే పెట్టారా
రయ్ రాయంటూ రచ్చే లేపరా
ఆ హంగు బొంగు పోయేదాకా
ఎడా పేడ దరువేయ్ రా

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే




నువ్వుంటే చాలే... పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: రామ్ పోతినేని
గానం: అనిరుధ్ రవిచందర్ 

ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవరో నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…

పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..

నువ్వుంటే చాలే…

నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..

దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది

నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే…

నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…

నువ్వుంటే చాలే…



చిన్ని గుండెలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: సత్యయామిని, మెర్విన్ 

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

మంచు వాన నన్ను ముంచేనంట
వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట
ఈ లోకమంతా నిన్ను చూసేనంట
ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
ఆ పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

ఎంత అందమో నీ లోకమే
ఎంతైనా ఈ హాయి కలనే కదా
నీ రాకనే నాకో కల
కలలేవో నిజమేదో తేల్చేదెలా

ఏ హద్దులు ఆపనే లేని
ప్రేమంటే నీదే కదా
ఓ గుండెలో దాచలేని
ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా

చిన్ని గుండెలో ఇన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

Palli Balakrishna
Mana Shankara Vara Prasad Garu (2025)




చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ త్రెసా 
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: 	సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
విడుదల తేది: 15.01.2026



Songs List:



హే మీసాల పిల్ల.. పాట సాహిత్యం

 
చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం: 	భాస్కరభట్ల
గానం: 	ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్

హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
పొద్దున్ లేచిన్ దెగ్గర నుంచి డైలీ యుద్ధాల
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ

అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…
ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా..

నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..
మగజాతి మొత్తం ఇంతేనా..
గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..

మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
మీసాల పిల్ల….

ఆ ఎదురింటి యెంకట్రావ్ కులుకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు
ఈడు మట్టే కొట్టుకు పోను
వాడు యేట్లో కొట్టుకు పోను…

ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు
కనుకే నీతో కట్ అయ్యాను
చాల హ్యాపీ గుంటున్నాను..

నువ్వింత హార్ష్ గా మాటడాలా
హార్ట్ హాట్ అయిపోయేలా…
ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా

నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా

హే మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా
నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల
అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా

హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా..
హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..




శశిరేఖా… పాట సాహిత్యం

 
చిత్రం: శంకర వరప్రసాద్ (2026)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ

శశిరేఖా… ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక…
ఓ ప్రసాదూ.. మోమాటాలేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ….

ఓ శశిరేఖ… నీ చుట్టూ బిలియన్సు
నావన్ని EMI-సు…
ఓ ప్రసాదు… పైసాల్లో ఏముందోయ్
నీకుంది మంచి మనసు…

మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు
ఏ ఇల్లోనా కాదోయ్.. ప్రేమ పంచె గుండెల్లోనా ప్లేస్ చాలు నాకు

ఏయ్ యురేకా నువ్వు కేక .. భలే బాగుంది రేఖ
రియాలిటీ చూస్తూ ఉంటే.. భయంగా ఉంది ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఏ టెన్షనోద్దు
ఎవ్రిథింగ్ చూసుకుంటా.. పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు……

హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా, సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా
కొండ మీది కోహినూరు కావాలా..
జెంగిలెల్లి జాగువారు తేవాలా..

కానుకలోదోయ్ శ్రీవారు, లొంగదు వాటికి నా ప్యారు
చెప్పినట్టు టైముకొస్తే చాలంటా..
అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా..

పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ
అటుఇటు ఇటుఅటు, ఇటు అటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో..
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో..

హేయ్ యురేకా నువ్వు కేక.. భలేగా ఉంది రేఖ
మిరాకిల్ అంచుదాకా.. ఛలో పోదాము ఇంకా
ప్రసాదు ఓ ప్రసాదు.. కామోన్ ఎహే మాటలొద్దు
ఇలా ఈ లైఫ్ లాంగ్ .. ఇదేలా లైక్ కొట్టు……

ఓ శశిరేఖ… ఓ ప్రసాదు…

Palli Balakrishna
Court (2025)




చిత్రం: కోర్ట్ (2025)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
నటీనటులు: ప్రియదర్శి పులికొండ, హర్ష రోషన్, శ్రీదేవి 
దర్శకత్వం: రామ్ జగదీష్ 
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
విడుదల తేది: 14.03.2025



Songs List:

Palli Balakrishna Monday, March 24, 2025
Album: Ku Ku Kumari







  
ఫోక్ సాంగ్: కు కు కుమారి
సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి 
సంగీతం: మదీన్ SK
గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ 
నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ 
కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు 
ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల 


కు కు కుమారి పాట సాహిత్యం

 
ఫోక్ సాంగ్: కు కు కుమారి
సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి 
సంగీతం: మదీన్ SK
గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ 
నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ 
కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు 
ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల 

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

లష్కర్ జాతర్లనా.. ఆర్మూరం గట్లనా
తిరుపతి తిరునాళ్ళనా… అమెరికా ఆగంట్లనా

కు కు కుమారి సీరలేడ కొన్నవే
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే

ఆ కంచివరముకు… గా గద్వాల్ సీరకు
ఉప్పాడ పట్టుకు… సిద్ధిపేట సీరకు

పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా
పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని… అన్నిటిని ఫేమస్ జేసినా

చిరుగాలికి సీరెగురుతుంటే… యెహె యెహె యెహెయ్
కు కు కుమారి… కెవ్వు కేక ఉన్నవే
బొట్టు పెట్టుకున్న… బుట్ట బొమ్మలెక్కగున్నవే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే

ఆ సందమామను… ఆ వెండి సుక్కను
గా మెరుపు తీగను… రంగుల హరివిల్లును
కు కు కుమారి… బువ్వ లెక్క తిన్నవా
నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే, హెయ్

చింతపండు పిసుకుతూ
నిమ్మకాయ పిండుతూ
ఇంగువాను సల్లుతూ
పులిహోర కలుపుతూ…

పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ
పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ

నీ కోపమెంత ముద్దుగుందే, యే యె ఉమ్మ
కు కు కుమారి సుర్రు సూపరున్నవే
సూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే…

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

ఏనుగెక్కి వస్తనే
ఎదురు కట్నమిస్తనే
ఏలు పట్టుకుంటనే
నిన్ను ఏలుకుంటనే

కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే
కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే, హే హేయ్

నీ మాయ మాటలు
నీ చిలిపి చేష్ఠలు
నీ కొంటె సూపులు
తెచ్చినాయి నవ్వులు

కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా
కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా

గట్లుంటదే మనతోని మరి
కుకు కుకు కుకు

కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను

Palli Balakrishna
Album: Ramasakkani Supulode







  
పాట: రామసక్కని సూపులోడే 
సాహిత్యం – మహేందర్ ముల్కల
సంగీతం – కళ్యాణ్ కీస్
గాయని – వాగ్దేవి 


రామసక్కని సూపులోడే పాట సాహిత్యం

 
పాట: రామసక్కని సూపులోడే 
సాహిత్యం – మహేందర్ ముల్కల
సంగీతం – కళ్యాణ్ కీస్
గాయని – వాగ్దేవి 

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వాని చక్కని సూపుల
చెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందే
గుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టిన
గంటలే మోగినట్టుందే
గాయి గాయి తిరుగుతుందే ప్రాణం
గంప కింద గమ్ముతాందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

నల్లని కన్నుల మన్మథుడే
నవ్వుల బాణాలు వేసినాడే
హద్దుల దాటని అల్లరోడే
ముద్దుల తోటకు పిలిచినాడే

వాని అత్తరు సెంటు సోకులకు
మత్తు మందుల ముంచినట్టుందే
ఎన్నడూ చూడని వింత లోకాలన్నీ
కొత్తగా చూసినట్టుందే
గాయి గాయి అంటావుండే ఈడు
దారి తప్పి పోతావుందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వెన్నెల దారుల్లా వన్నెగాడే
వేకువ జామున కలిసినాడే
గాబురాల ముద్దు పిల్లగాడే
గారడి మాయలు చేసినడే

వాని అడుగుల సప్పుడు
అర్దుమ రాత్రి నిదుర లేపినట్టుందే
పచ్చని పైరులా వెచ్చని గాలులు
పరువులా తాకినట్టుందే
గాయి గాయి మత్తుగుందే ఒళ్ళు
సోయ తప్పి పోతావుండే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

బంగారు నవ్వుల చిన్నవాడే
బావంటూ బంధాలు కలిపినాడే
ఆ నీలి మబ్బుల అందగాడే
అందరి మనసులు గెలిచినాడే

వాని నవ్వుల తీరుకు
వాగులు వంకలు పొంగి పొర్లినట్టుగుండే
ఆ వాన చినుకులు అందాల మెరుపులు
కన్నులే గీటినట్టుందే
జోరు జోరు జారుతుందే కొంగు
జోడి ఏదని అడుగుతుందే

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

Palli Balakrishna
Album: Selayeru Paduthunte (2024)







  
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల 
సంగీతం: కళ్యాణ్ కీస్ 
రచన: మహేందర్ ములకాల 
గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి 
ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్ 
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్ 
రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK
విడుదల: 14.05.2024


సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ు పాట సాహిత్యం

 
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల 
సంగీతం: కళ్యాణ్ కీస్ 
రచన: మహేందర్ ములకాల 
గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి 


సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన
నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన

గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా
వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ

సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా
మాయా మాటలు పలుకకూ ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట


వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు
జోడెడ్ల బండి గట్టీ ఓ పిల్ల జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ

ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందార సిరిమల్లి
మరుగు మాటల వాడివే ఓ బావ మా వదినలొస్తున్నరు తోవల్ల

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా

కారెండ పడవీలో కస్తూరి రంగాయే వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే
నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే ఈ వేళ

నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే
కొంటే చూపుల వాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నరు తోవల్ల

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా

చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది
చిలుక గోరింకవోలే కూడుండి చితి మీద తోడొస్తనే ఓ పిల్ల

పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ

Palli Balakrishna
Thandel (2025)




చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి
దర్శకత్వం:  చందు మొండేటి 
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 07.02.2025



Songs List:



బుజ్జితల్లీ… పాట సాహిత్యం

 
చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలి 

గాలిలో ఊగిసలాడే దీపంలా…
ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం,
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా…
చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం

సుడిగాలిలో పడిపడి లేచే
పడవల్లే తడబడుతున్నా, ఆ ఆ ఆ…

నీకోసం… వేచుందే నా ప్రాణం...
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…

నీరు లేని చేపల్లే
తార లేని నింగల్లే
జీవమేది నాలోనా…?
నువ్వు మాటలాడందే
మళ్లీ యాలకొస్తానే
కాళ్లయేళ్ల పడతానే
లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను యిడిపోనే…

ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టోన్నే…
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే…

నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…

ఇన్నినాళ్ల మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగా మారిందే
అందిరాక నీ గారం…

దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా
లంచమేటి కావాలే..?

గాలివాన జాడే లేదే
రవ్వంతైనా నా చుట్టూ…
అయినా మునిగిపోతున్నానే
దారే చూపెట్టు…

నీకోసం… వేచుందే నా ప్రాణం…
ఓ బుజ్జితల్లీ…
నా కోసం… ఓ మాటైనా మాటాడే…
నా బుజ్జితల్లీ…



నమో నమః శివాయ పాట సాహిత్యం

 
చిత్రం: తండేల్ (2025)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: అనురాగ్ కులకర్ణి , హరిప్రియ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ…!

నమో నమః… నమో నమః
నమో నమః శివాయ
నమో నమః… నమో నమః
నమో నమః శివాయా


హే, ఢమ ఢమ ఢం అదరగొట్టు
ఢమరుకాన్ని దంచికొట్టు
అష్టదిక్కులదిరేటట్టు తాండవేశ్వరా..

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ 

భం భం భం మొదలుపెట్టు
అమృతాన్ని పంచిపెట్టు
గుండె వెండికొండయేట్టు
కుండలేశ్వరా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ 

జై శంకర… జై జై జై శంకర
నిప్పు కన్ను ఇప్పి
జనం తప్పును కాల్చేయ్యరా

జై శంకర… శివ శివ శివ శంకర
త్రిశూలం తిప్పి సూపి
మంచి దారి నడపరా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

మ్, తప్పు చేస్తే
బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటె విషాన్నైనా మింగినావురా

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా
సృష్టిలోన మొదటి ప్రేమ కధే నీదిరా

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

రారా శివరాత్రి సుందర…
మా రాత మార్చి ఉద్దరించరా
అనంతమైన నీ ప్రేమలో
రవ్వంత మాకు ఇస్తే
భూమి స్వర్గమౌనురా…

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

ఆది ప్రేమిక… నీకు పోలిక
లేదు లేదిక జగాన
భక్త కోటికి… ఉన్న కోరిక
తీర్చుతావయా స్వయానా

ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు పరమేశ్వరుడా…
ఏ లోటూ రానీవు… ఎపుడు తోడుంటావు
మగడంటే నువ్వే మహేశ్వరుడా

ఆది నువ్వే… అంతం నువ్వే
కాపాడే ఆపద్భాంధవుడా……

కోరస్:
నమో నమః
నమో నమః
నమో నమః శివాయ (4)

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయ

శివ శివ శివ
శివ శివ శివ
శివ శివ శివ

నమో నమః
నమో నమః
నమో నమః శివాయా

Palli Balakrishna Tuesday, January 14, 2025
Bachchala Malli (2024)




చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం:  విశాల్ చంద్రశేఖర్
నటీనటులు: అల్లరి నరేష్, అమ్రిత అయ్యర్ 
దర్శకత్వం:  సుబ్బు మంగాదేవి
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుట్టా
విడుదల తేది: 20.12.2024



Songs List:



మా ఊరి జాతరలో పాట సాహిత్యం

 
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం:  విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: శ్రీమణి
గానం: గౌర హరి , సిందూరి విశాల్ 

మా ఊరి జాతరలో 




అదే నేను, అసలు లేను పాట సాహిత్యం

 
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం:  విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: ఎస్ పి చరణ్ , రమ్య బెహరా

నిలబడే నిద్ర పడుతుందని
మత్తు ఒకటుందాని తెలిసే…
తెలియదే అన్నీ వ్యసనాలని
మించే వ్యసనం పేరే ప్రేమనీ

తన నీడ నన్నే తాకుతుంటే
మనసు మరిగిన మురికి వదిలెన?

అదే నేను, అసలు లేను
తిరిగి జరిగిన జననమా..!
ఎలా నిన్ను విడిచిపోను
వెలుగు వెనకన నడవన?

గడ్డి పువ్వంటి నా కోసం
గుడి తలుపు తీసావే
ఒక మలుపు తీసె విధిని రాసి
దారేదో చూపించావే… చెరపమాకే

ఇదేనేమో మొదటి ప్రేమ
కలిగె అలజడి సహజమా
తుదే లేక కదిలిపోగా
ఇపుడే మొదలయే పయనమా

చెలియవే కలువవే
బురదకి నువ్ వరానివే

తలను నిమిరే
చెలిమి కొరకే
తిరిగి చూసాలే

కలవర కలలు
నిండిన కనులు
హాయి నిదురే చూసెనే

కలతిక పడకు
ఎందుకు దిగులు
తోడు నీకవనా…

సహనాలు పెరిగే
వీలు దొరికే
నడిపే వేలే నీదిలే…

తెలిసాకే కదిలా
నిన్ను చదివా
గొప్ప నాదేం లేదులే

మొరటతనమే
విడిచి పెడతా
ఉంటే నువ్వే ఇలా…

ఇదేనేమో మొదటి ప్రేమ
కలిగె అలజడి సహజమా
తుదే లేక కదిలిపోగా
ఇపుడే మొదలయే పయనమా…




మరీ అంత కోపం పాట సాహిత్యం

 
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం:  విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: పూర్ణాచారి
గానం: సాయి విగ్నేష్

మరీ అంత కోపం 

Palli Balakrishna
Sankranthiki Vasthunam (2025)




చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి 
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 14.01.2025



Songs List:



గోదారి గట్టు మీద పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: రమణ గోగుల ,  మధుప్రియ 

తరరిరరారే రరరా
తరరిరరారే రరరా

గోదారి గట్టు మీద
రామ సిలకవే…
ఓ ఓ, గోరింటా కెట్టుకున్న
సందమామవే…

గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న
సందమామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని
నిద్దరపోయిందే…
ఆరాటాలన్నీ తీరకపోతే
ఏం బాగుంటుందే../
నాకంటూ ఉన్నా ఒకే ఒక్క
ఆడ దిక్కువే…
నీతోటీ కాకుండా
నా బాధలు ఎవరికి
చెప్పుకుంటానే..!

గోదారి గట్టు మీద
రామసిలకనే…
ఆ ఆ, గీ పెట్టి గింజుకున్నా
నీకు దొరకనే…

హేయ్, విస్తరి ముందేసి
పస్తులు పెట్టావే…
తీపి వస్తువు చుట్టూ తిరిగే
ఈగను చేసావే…

ఛీ ఛీ ఛీ సిగ్గే లేని
మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ
మీదికి రాకొండోయ్..!

ఒయ్ ఒయ్
గంపెడు పిల్లల్తో
ఇంటిని నింపావే
సాప దిండు సంసారాన్ని
మేడెక్కించావే…

హుఁ, ఇరుగు పొరుగు ముందు
సరసాలొద్దండోయ్…!

గురకెట్టి పడుకోరే
గూర్కాల్లాగా మీ వాళ్ళు
ఏం చేస్తాం ఎక్కేస్తాం
ఇట్టాగే డాబాలు…

పెళ్ళైయి సాన్నాల్లే
అయినా కానీ మాస్టారు
తగ్గేదే… లేదంటూ
నా కొంగెనకే పడుతుంటారు.

హేయ్, గోదారి గట్టు మీద
రామ సిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే

హేయ్ హేయ్
హుఁ హుఁ
లలలాల లాల
హుఁ హుఁ
హె హె హేయ్
హో హో హోయ్
లలలాల లాల
హుఁ హుఁ
మ్ మ్……….

కొత్త కోకేమో… కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని
చెవిలో చెప్పిందే…

ఈ మాత్రం హింటే ఇస్తే
సెంటే కొట్టెయ్‍నా
ఓ రెండు మూరల మల్లెలు
చేతికి చుట్టెయ్‍నా

ఈ అల్లరి గాలేమో
అల్లుకుపొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం
మానెయ్ మంటుందే

అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ
అంటూ కూతకు వచ్చెయ్‍నా?

ఏవండోయ్ శ్రీవారు
మళ్లీ ఎపుడో అవకాశం
ఎంచక్కా బాగుంది
చుక్కల ఆకాశం

హెయ్, ఓసోసి ఇల్లాలా
బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం
నీకు నాకు మధ్యన దూరం

గోదారి గట్టు మీద
రామసిలకనే
హుఁ, లలలా
హా, నీ జంట కట్టుకున్న
సందమామనే…
హుఁ, లలలా

తరరిరరారే రరరరా
తరరిరరారే రరరా



మీను పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: భీమ్స్ సిసిరోలియో , ప్రణవి

ఊ ఊ ఊ ఊ ఊ ఊ…

ఏయ్, నా లైఫులోనున్న
ఆ ప్రేమ పేజీ తియ్‍నా, (తియ్‍నా)
పేజీలో రాసున్న అందాల
ఆ పేరు మీనా, (మీనా)

ట్రైనర్ గా నేనుంటే, ట్రైనీగా వచ్చిందా కునా
వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోన
చిత్రంగా ఆ రూపం... చూపుల్లో చిక్కిందే
మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే

ఓ యే ఓ... (ఓ యే ఓ)
ఓ యే ఓ... (ఓ యే ఓ)

కాకిలా తోటల్లో… కోకిల్లే కూసాయే
లాఠీలా రెమ్మల్లో... రోజాలే పూసాయే

మీను... డింగ డింగ డింగ డింగ్
మీను... డింగ డింగ డింగ డింగ్
మీను రింగ డింగ డింగ డింగ్
ఓలే ఓలే...

ఫోన్‍లో... టాకింగ్ టాకింగ్
లాన్‍లో... వాకింగ్ వాకింగ్
బ్రెయిన్‍లో… స్టార్ట్ అయిందే
నా మీద లైకింగ్...

శనివారాలైతే... (శనివారాలైతే)
సినిమా హాల్లోనా... (సినిమా హాల్లోనా)
సెలవేదైనా వచ్చిందంటే
షాపింగ్ మాల్‍లోన...

సాయంత్రం అయితే
గప్‍చుప్ స్టాల్‍లోన
తెల తెలవారే గుడ్ మార్నింగ్‍కై
వెయిటింగ్ తప్పేనా?

కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో
కలిపిన మాటలు ఇంకెన్నో
మాటలు కలిపే తొందరలోనే
ప్రేమలు ముదిరాయే...

బేబీ... టింగ రింగ రింగ రింగ్
బేబీ... టింగ రింగ రింగ రింగ్
బేబీ... రింగ డింగ డింగ డింగ్
ఓ ఓ ఓ...

డైలీ... స్మైలింగ్ స్మైలింగ్
గాల్లో... తేలింగ్ తేలింగ్
మీటింగ్ కాలేదంటే
మిస్ అయిన ఫీలింగ్...

[బా...?
ఊ..!
ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయ్ కదా, అలాంటివేమన్నా..??
ఎందుకుండవే భాగ్యం..! ఆ రోజు ఫెబ్రవరీ….
14th ఫోర్టీన్థ్...
అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము, కూసింత గుట్టుగా కలుసుకున్నామెహే..
ఇప్పటికీ ఆ మూమెంట్ తలచుకుంటే వణుకొచ్చేత్తాంది.]

చిరు చిరు జల్లుల్లో
పెదవులు తడిసాయే
తడిసిన ఇద్దరి పెదవుల పైన
మెరుపులు మెరిసాయే...

ఉరుముల చప్పుడులో
ఉరకలు మొదలాయే
ఉరుకుతు ఉండే
తలపులనేమో బిడియములాపాయే

అడుగు అడుగు ముందుకు జరుపుకొని
ఒకరికి ఒకరము చేరువై...
ఊపిరి తగిలేటంతగా
ముఖములు ఎదురుగా ఉంచామే…

[ ముద్దు పెట్టేశావా బా...?
లేదే భాగ్యం... తొలిముద్దు భాగ్యం నీకే దక్కింది.
చాల్ చాల్లే...]

బావ టింగ డింగ డింగ డింగ్
బావ టింగ డింగ డింగ డింగ్
బావ టింగ డింగ డింగ డింగ్
హా ఆ ఆ...

బావ... నీదాన్నే నేను
బావ… నిన్నొదిలి పోను
బావ… నీ లవ్ స్టోరీకి
పెద్ద ఫ్యానయ్యాను...

ఓ ఆకాశమై... నే వేచుండగా
ఓ జాబిల్లిలా... తానొచ్చిందిగా
గుండెలో, ఓ ఓ నిలిచే
జ్ఞాపకం మీనా...




బ్లాక్‌బస్టరు పొంగలూ.. పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: వెంకటేష్,  భీమ్స్ సిసిరోలియో , ప్రణవి

ఏ.. కొక్కొరొకో కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకీ..
ఎంతలేసి వణికిందో.. ఏ మూలా పండుకుందో..
రథం ముగ్గు ఏసుకుంట.. ఏటుకూరి నాగలచ్చిమి..
ఎంత దూరమెళ్లిందో.. ఎటు పోయిందో..

హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో..
పండగొచ్చె గొబ్బియల్లో..
ఎవ్రీబాడీ గొబ్బియల్లో
సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో..
పెద్ద పండగండీ గొబ్బియల్లో..
లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో.. కమాన్..

బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ..
బేసికల్లీ.. టెక్నికల్లీ.. లాజికల్లీ.. ప్రాక్టికల్లీ..
అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ..
ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ..

గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్.. నో దంగల్.. సెలబ్రేట్ ద పొంగల్..

హే.. గొబ్బియల్లో.. గొబ్బియల్లో..
పండగొచ్చె గొబ్బియల్లో..
ఎవ్రీ ఇయరూ గొబ్బియల్లో..
కమ్ టు పల్లెటూరు గొబ్బియల్లో..
కలిసి మెలిసి గొబ్బియల్లో..
లెట్స్ హావ్ ఫన్నూ గొబ్బియల్లో..

యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ..
యాక్చువల్లీ.. యానువల్లీ.. కలరుఫుల్లీ.. హౌజ్‌ఫుల్లీ..
అండ్ ఫైనల్లీ.. ఇట్స్ యాన్ యాటిట్యూడు పొంగలూ..
ఇట్స్ ఎ బ్లాక్‌బస్టరు పొంగలూ..



Palli Balakrishna Monday, January 13, 2025
Daaku Maharaaj (2025)




చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: బాలకృష్ణ, ఊర్వసి రుటేల, శ్రద్దా శ్రీనాథ్, ప్రాగ్య జైస్వాల్
దర్శకత్వం:  బాబి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 12.01.2025



Songs List:



చిన్ని చిన్ని పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: అద్వితీయ
గానం: విశాల్ మిశ్రా 

చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్ని కన్ని నీ వేశాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని

ఓయ్ ఓయ్… ఓయ్ ఓయ్
రా రమ్మంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే
పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యై
నీ ముందుంటానే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్వాడిస్తా ఉన్నా
నేనాపేమన్నానా?

ఏ రోజు ఏ అలకైనా
తీరుస్తా చిటికెల్లోనా
ఓయే ఓయే… ఓయే ఓయే
వేచున్నాదే వెన్నెల లోయే

నువు తే అంటే
నీ ముందు తారాతీరాలే
అమావాసైనా నీతో ఉంటే
దీపావళిగా మారాలే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

లలలల లల లాలా
లలలల లల లాలా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ, మ్ మ్ మ్….





డేగ డేగ పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: నకాష్ అజీజ్, భరత్ రాజ్ , రితేష్ జి. రావు ,కె. ప్రణతి 

డేగ డేగ డేగ... దేఖో దేఖో బేగా
ఏ గుర్రంపై నరసింహం
చేసే సవారీ ఇదేగా
చెడు చెడునిక పడగొట్టేలా
వేసాడు ఇక్కడ పాగా...

తన అడుగుల చప్పుడు వింటే
లోకాలకింకా దడేగా
గుక్కెడు నీళ్లకు పాటు పడే
నిరుపేదల బాధల గొంతుకగా
గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుధీనుడి చేతికి గొడ్డలిగా

భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రగతము ఉప్పెనగా
ఎగపడి ఉరుకుతు
తెగబడి నరుకుతు
బనాదియా రే... బంధూకు

(డాకు... డాకు
డాకు... డాకు)

(డాకు... డాకు
డాకు... డాకు)

బహాయియో యాడి
ఓ యాడి... వెరచి యాడి
ఈ కడుపులో పూసేటి రాసగుమ్మాడి
నీ గడపలో అడుగేసే ఏలైతాంది
ఏలేటోడు ఏడి?
అదిగో అచ్చిండే అందుకోవే
అత్తింటి కొత్త సాడీ...





దబిడి దిబిడి పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: థమన్
సాహిత్యం: కాసర్ల శ్యాం
గానం: థమన్, వాగ్దేవి

దబిడి దిబిడి

Palli Balakrishna
Love Reddy (2024)




చిత్రం: లవ్ రెడ్డి (2024)
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కైలాష్ ఖేర్
నటీనటులు: అంజన్ రామచేంద్ర, శ్రావణి కృష్ణవేణి
రచయిత & దర్శకుడు: స్మరణ్ రెడ్డి



Songs List:



ప్రాణం కన్నా పాట సాహిత్యం

 

చిత్రం: లవ్ రెడ్డి (2024)
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కైలాష్ ఖేర్

ప్రాణం కన్నా ప్రేమించిన
ఆ ప్రేమనే తెంచావుగా
మేఘాలు ధాటినాక
దూరాలు సాగినాక
నన్నింకా వీడమంటూ పోమందిగా

ఆ బంధం అబద్దమా
ఆ స్నేహం అబద్దమా
నీ తోనే నా ఊహలే అబద్దమా
ఆ కాలం అబద్దమా
ఆనందం అబద్దమా
నడిచేటి ఆ దారులే అబద్దమా

నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా

నువ్వుంటే చాలంది ప్రాణం
ఉంటావా నా తోడుగా
చేశాలే ప్రయత్నమంతా
మౌనాలు విడవా

ఎంత సంతోషమో
కొంత బాధుందిగా
ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా

ఆ బంధం అబద్దమా
ఆ స్నేహం అబద్దమా
నీ తోనే నా ఊహలే అబద్దమా
ఆ కాలం అబద్దమా
ఆనందం అబద్దమా
నడిచేటి ఆ దారులే అబద్దమా 

కన్నులో తడేదో చూశా
కాదన్నా క్షణాలలో
ఏముందో మనసులోన
తెలిసేది నాకెలా
తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా
గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే
ఈ వేదనా

ఆ బంధం అబద్దమా
ఆ స్నేహం అబద్దమా
నీ తోనే నా ఊహలే అబద్దమా
ఆ కాలం అబద్దమా
ఆనందం అబద్దమా
నడిచేటి ఆ దారులే అబద్దమా



ప్రాణం కన్నా ప్రేమించిన పాట సాహిత్యం

 
చిత్రం: లవ్ రెడ్డి (2024)
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సాహిత్యం: రఘురాం 
గానం: అదితి భావరాజు 

ప్రాణం కన్నా ప్రేమించినా
ఆ ప్రేమనే చెప్పేదెలా
దూరాన్ని చెరపలేక
కంచెల్ని తెంచలేక
మౌనంగా మిగిలిపోయా కనీరుగా 

నీపై నా ప్రేమే నిజం
నీతో ఆ స్నేహం నిజం
నా ఊపిరి ఆగేంతలా
ఈ బాధే నిజం
నీతోడే లేని ఈ క్షణం
తరిమిందే నన్నే గతం
ఎదపై నీ పేరే కదా శిలాక్షరం

నీతో ఈ ప్రయాణమంతా
కల లాగా మారిందిగా
మిగిలా ఓ ప్రశ్ననై ఇలాగా
బదులే తోచకా

నీతో ఈ ప్రయాణమంతా
కల లాగా మారిందిగా
మిగిలా ఓ ప్రశ్ననై ఇలాగా
బదులే తోచకా

ఎంత ప్రేమించినా అంత ఆవేదన
చీకటే నన్ను కమ్ముకున్నాక
ఏం చెయ్యను 

నీపై నా ప్రేమే నిజం
నీతో ఆ స్నేహం నిజం
నా ఊపిరి ఆగేంతలా
ఈ బాధే నిజం
నీతోడే లేని ఈ క్షణం
తరిమిందే నన్నే గతం
ఎదపై నీ పేరే కదా శిలాక్షరం

Palli Balakrishna

Most Recent

Default