Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Andhra King Taluka (2025)




చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
నటీనటులు: రామ్ పోతినేని,  ఉపేంద్ర , భాగ్యశ్రీ బోర్స్ 
సంగీతం: వివేక్  & మెర్విన్ 
గాయకుడు: రామ్ పోతినేని 
సాహిత్యం: భాస్కరభట్ల 
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ 
విడుదల తేది: 27.11.2025



Songs List:



Unlotld Emotions పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్వరాగ్ కీర్తన్

Unlotld Emotions



First Day First Show పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: దినేష్ కక్కేర్ల 
గానం: ఆంధ్ర కింగ్ తాలూకా ఫాన్స్ 

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల సిల సిల సిల
హే గల గల గల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

హే సిల సిల సిల సిల
హే గల గల గల గల
హే సిల గల

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు

మన ఆంధ్రాకే కింగు

హే అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు కింగూ

మన ఆంధ్రాకే కింగు
మన మన మన మన మన మన
మన ఆంధ్రాకే కింగు

అదే అదే అదే అదే అదే

అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు
అన్నకు మేమే ఫ్యాన్సు
ఇప్పుడేస్తాంరా డాన్సు

వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు
వచ్చిందిరా పిలుపు
అన్నదేరా గెలుపు

మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు
మావోడి గ్లామరు
పాపలకే ఫీవరు

ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు
ఆల్ ఆఫ్ యూ సింగు
ఆంధ్రాకే కింగు



Puppy Shame పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: రామ్ పోతినేని 

వీడు మొహం ఏంట్రా మా డిపోయింది
మావ నువ్వు అందుకోరా

పోతదన్నావ్ ఇప్పుడేంటన్నా
ఏ.. హిట్ కొట్టాం
సొండ్ ఏదన్నా (లేదన్నా)

తొందరేంటి అరే ఉండన్నా
బెట్టు కట్టి జరుపోతుంటే ఊరుకుంటానా
ఈ బక్కోడి చెండె తియ్యనా
ఆ బండొడి గుండె గియ్యనా
మీదకేక్కేసి తొక్కేసి కుమ్మనా
నువ్వు ఉండన్నా..

ఈ అన్నకి బొట్టే పెట్టారా
ఆ అన్నకి దండే వెయ్యరా
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా మర్యాదలే చేయాండ్ర

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

రేయ్ రేయ్ రేయ్ మనిషి అన్నాక
భయం, భక్తి, బలం, బలుపు, ఉండాలి
అలాగే ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి
తెలుసుకుంటే బాగుపడతావ్ లేకపోతే పైకి పోతావ్

దండమెత్తి పాలు పొయ్యన్నా
టెంకాయే తీసి కొట్టన్నా (కొట్టన్నా)
హారతిచ్చి కాళ్ళు మొక్కన్నా
ఫోటో దించుత ఫోజు ఇవ్వన్నా
హు నవ్వన్నా

ఏ బిత్తర చూపులు ఏంటన్నా
అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న
ఎహే మీలాగే సప్పగా ఉందన్నా పసలేదన్న

ఏ ఫుల్లుగా సౌండే పెట్టారా
రయ్ రాయంటూ రచ్చే లేపరా
ఆ హంగు బొంగు పోయేదాకా
ఎడా పేడ దరువేయ్ రా

అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా

అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే




నువ్వుంటే చాలే... పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: రామ్ పోతినేని
గానం: అనిరుధ్ రవిచందర్ 

ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవరో నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…

పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసాంగా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..

నువ్వుంటే చాలే…

నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..

దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది

నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే…

నువ్వుంటే చాలే…

మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వుంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…

నువ్వుంటే చాలే…



చిన్ని గుండెలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్ర కింగ్ తాలూకా (2025)
సంగీతం: వివేక్  & మెర్విన్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: సత్యయామిని, మెర్విన్ 

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

మంచు వాన నన్ను ముంచేనంట
వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట
ఈ లోకమంతా నిన్ను చూసేనంట
ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా

రంగు రంగు తారలన్నీ
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా
ఆ పైన లేని వెన్నెలంతా
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

ఎంత అందమో నీ లోకమే
ఎంతైనా ఈ హాయి కలనే కదా
నీ రాకనే నాకో కల
కలలేవో నిజమేదో తేల్చేదెలా

ఏ హద్దులు ఆపనే లేని
ప్రేమంటే నీదే కదా
ఓ గుండెలో దాచలేని
ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా

చిన్ని గుండెలో ఇన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా

చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

No comments

Most Recent

Default