-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Amardeep Chowdary"






  
ఫోక్ సాంగ్ : నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా (2023)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: కుమార్ కోట 
గానం: హనుమంత్ యాదవ్, అపర్ణ నందన్ 
నటీనటులు: అమరదీప్ చౌదరి, ప్రియాంక జైన్ 
దర్శకత్వం: రాజ్ నరేంద్ర 
నిర్మాత: నివ్రితి వైబ్స్
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల తేది: 27.10.2023


నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా పాట సాహిత్యం

 
ఫోక్ సాంగ్ : నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా (2023)
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: కుమార్ కోట 
గానం: హనుమంత్ యాదవ్, అపర్ణ నందన్ 


తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా

ఓ.. బుజ్జి నీ మనసే
ముద్దు మాటల మూట సద్ది
ఓ.. ఓ కన్నా నిన్ను జూత్తె
కరిగిపోయె వెన్నా
కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా
నింగి నేల సాక్షి నిప్పు నీరు సాక్షి
గాలిపటమోలే ఎగిరిపోదామా
 నువ్వు నేను గూడి గువ్వగోరింకాయి
ప్రకృతమ్మ ఒడిలో సేదదీరుదామా
నీ ముదుట పలికే కోయిలమ్మా
ప్రేమ కురిపించే చల్లని జాబిలమ్మా
నీ గుణము మచ్చ సల్లకుండా
నీ చెలిమి బంగారుకొండా

ఓ కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా

ఊడుగు సెట్టుకు ఉయ్యాల గట్టి
ఊపనా రత్తాల సారంగి
ఊపర ఉయ్యాల నను నిదురపుచ్చగ
రావయ్యా బంగారుసామి
నిండు పున్నమోలే నీ మోము
మెరువవట్టె ఎంత సక్కదనమూ
పండు వెన్నెల్ల తీరు నీ నవ్వు
అయ్యో వెలుగుతూందిరో ఈ జాము

కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా

ఇంద్రధనస్సు తెచ్చి నింగి నక్షత్రాల
రంగవల్లి సీర నీకు కట్టనా
చంద్రవంక తిలకం నీకు నుదుటవెట్టి
ఇంద్రలోకానికే రాజు సెయ్యనా
గా గలగల పారేటి గోదారి
మనకు సూపబట్టే మనువు రహదారి
గా కిలకిల పలికేటి పక్షులు
పాటబాడి వేస్తున్నాయి అక్షింతలు

ఓ కుక్కు కుక్కు కూనలమ్మా
కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా
దింతక్కు దిన్నా బుజ్జి కన్నా
భాగ్యమేముందిర అంతకన్నా

తెల తెల్లవారంగ తెల్లవారంగా
తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా
నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా
నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా

Palli Balakrishna Saturday, April 11, 2026






  
ఫోక్ సాంగ్: కు కు కుమారి
సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి 
సంగీతం: మదీన్ SK
గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ 
నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ 
కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు 
ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల 


కు కు కుమారి పాట సాహిత్యం

 
ఫోక్ సాంగ్: కు కు కుమారి
సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి 
సంగీతం: మదీన్ SK
గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ 
నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ 
కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు 
ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల 

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

లష్కర్ జాతర్లనా.. ఆర్మూరం గట్లనా
తిరుపతి తిరునాళ్ళనా… అమెరికా ఆగంట్లనా

కు కు కుమారి సీరలేడ కొన్నవే
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే

ఆ కంచివరముకు… గా గద్వాల్ సీరకు
ఉప్పాడ పట్టుకు… సిద్ధిపేట సీరకు

పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా
పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా
నేను కట్టుకొని… అన్నిటిని ఫేమస్ జేసినా

చిరుగాలికి సీరెగురుతుంటే… యెహె యెహె యెహెయ్
కు కు కుమారి… కెవ్వు కేక ఉన్నవే
బొట్టు పెట్టుకున్న… బుట్ట బొమ్మలెక్కగున్నవే
కు కు కుమారి సీరలేడ కొన్నవే..?
సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే

ఆ సందమామను… ఆ వెండి సుక్కను
గా మెరుపు తీగను… రంగుల హరివిల్లును
కు కు కుమారి… బువ్వ లెక్క తిన్నవా
నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే, హెయ్

చింతపండు పిసుకుతూ
నిమ్మకాయ పిండుతూ
ఇంగువాను సల్లుతూ
పులిహోర కలుపుతూ…

పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ
పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ
అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ

నీ కోపమెంత ముద్దుగుందే, యే యె ఉమ్మ
కు కు కుమారి సుర్రు సూపరున్నవే
సూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే…

నా కుకు నిన్న వొడ్డు వాక
అల్లి వాక లంబా లంబా
ఆకురంభ నియ్యా జీకే
వాహ చిప్ల టంబ టంబ…
గునుపు టుల్లు టుల్లు
జోనులు హులులు లు లు
సిక్కి వక్క…
కుకు కుకుకు కుకు…

ఏనుగెక్కి వస్తనే
ఎదురు కట్నమిస్తనే
ఏలు పట్టుకుంటనే
నిన్ను ఏలుకుంటనే

కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే
కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే, హే హేయ్

నీ మాయ మాటలు
నీ చిలిపి చేష్ఠలు
నీ కొంటె సూపులు
తెచ్చినాయి నవ్వులు

కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా
కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా

గట్లుంటదే మనతోని మరి
కుకు కుకు కుకు

కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
కు కు కుమారి మురళీకృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను

Palli Balakrishna Monday, March 24, 2025

Most Recent

Default