-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: బాలకృష్ణ, ఊర్వసి రుటేల, శ్రద్దా శ్రీనాథ్, ప్రాగ్య జైస్వాల్
దర్శకత్వం:  బాబి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 12.01.2025



Songs List:



చిన్ని చిన్ని పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: అద్వితీయ
గానం: విశాల్ మిశ్రా 

చిన్ని చిన్ని నేనేలే నీకన్నీ
నిను మరిపిస్తానే మాయేదో పన్ని
కన్ని కన్ని నీ వేశాలింకెన్ని
అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని

ఓయ్ ఓయ్… ఓయ్ ఓయ్
రా రమ్మంది రంగుల హాయే
పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే
పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యై
నీ ముందుంటానే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

తెల్లారే దాగుడుమూత
సాయంత్రం కళ్ళకు గంత
నువ్వాడిస్తా ఉన్నా
నేనాపేమన్నానా?

ఏ రోజు ఏ అలకైనా
తీరుస్తా చిటికెల్లోనా
ఓయే ఓయే… ఓయే ఓయే
వేచున్నాదే వెన్నెల లోయే

నువు తే అంటే
నీ ముందు తారాతీరాలే
అమావాసైనా నీతో ఉంటే
దీపావళిగా మారాలే…

నా బంగారు కూన
నా చిన్నారి కూన
మరి నాకైనా ఎవరే నీకన్నా
నీ ప్రాణాలకు ప్రాణాన్నై ఉన్నా…

లలలల లల లాలా
లలలల లల లాలా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ, మ్ మ్ మ్….





డేగ డేగ పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: నకాష్ అజీజ్, భరత్ రాజ్ , రితేష్ జి. రావు ,కె. ప్రణతి 

డేగ డేగ డేగ... దేఖో దేఖో బేగా
ఏ గుర్రంపై నరసింహం
చేసే సవారీ ఇదేగా
చెడు చెడునిక పడగొట్టేలా
వేసాడు ఇక్కడ పాగా...

తన అడుగుల చప్పుడు వింటే
లోకాలకింకా దడేగా
గుక్కెడు నీళ్లకు పాటు పడే
నిరుపేదల బాధల గొంతుకగా
గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుధీనుడి చేతికి గొడ్డలిగా

భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రగతము ఉప్పెనగా
ఎగపడి ఉరుకుతు
తెగబడి నరుకుతు
బనాదియా రే... బంధూకు

(డాకు... డాకు
డాకు... డాకు)

(డాకు... డాకు
డాకు... డాకు)

బహాయియో యాడి
ఓ యాడి... వెరచి యాడి
ఈ కడుపులో పూసేటి రాసగుమ్మాడి
నీ గడపలో అడుగేసే ఏలైతాంది
ఏలేటోడు ఏడి?
అదిగో అచ్చిండే అందుకోవే
అత్తింటి కొత్త సాడీ...





దబిడి దిబిడి పాట సాహిత్యం

 
చిత్రం: డాకు మహారాజ్ (2025)
సంగీతం: థమన్
సాహిత్యం: కాసర్ల శ్యాం
గానం: థమన్, వాగ్దేవి

దబిడి దిబిడి

No comments

Most Recent

Default