-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kalyan Keys"
Basinga Balaalu Song Lyrics

Basinga Balaalu Song Lyrics in Telugu and English

SONG DETAILS
Song : Basinga Balaalu
Category : Folk Song
Audio Label : Vedhas Music
Choreographer : Shekar Virus
Director : Shekar Virus
Producer : Sateesh Reddy Bandi
Presented By : A Vijaya Productions
Release Year : 2026

Basinga Balaalu Song Lyrics in Telugu and English

'Basinga Balaalu' is a Telugu Folk Song composed by Kalyan Keys and sung by Swamy Naresh Dubba and Srinidhi. Lyrics are written by Swamy Naresh Dubba.

SONG INFORMATION
Song : Basinga Balaalu
Category : Folk Song

Basinga Balaalu Song Lyrics in Telugu

బాసింగ బాసింగ బలాలే భలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే కలిసి ఉన్నాయే ఈ పోరని నిలువెత్తు ప్రాణాలే నను ఉన్నాయే శ్రావణ మాస బలాలే సై అన్నాయే ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉంచా పిల్లా అటో డజను ఇటో డజను గాజులు వేపిస్తా పిల్లా మెల్లగ మెల్లగ మెల్లగా తువాల కొంగు ముడేసుడే బాసింగ బాసింగ బలాలే భలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే కలిసి ఉన్నాయే ఈ పోరని నిలువెత్తు గుణాలే నను ఉన్నాయే శ్రావణ మాస బలాలే సై అన్నాయే ఎల్లిపాయ జడే సుడే ఎల్లిపాయ జడెన్ను పూస మీదే సుడే ఎన్ను పూసల మీద కాటుక పూసుడే కన్నుల కన్నెట్టి సుక్కవెట్టే సుడే సెంపల సెంపెట్టి నీ యాదిల ఎక్కిళ్ళు రావట్టే నా బుట్టబొమ్మ సేతుల మంచినీళ్ళు తేవాలే రెండు సేతుల మాణిక్యాలెత్తాలే నువ్వు అత్తా ఉంటే ఇంటికి కళ వచ్చి పడాలే ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉంచా పిల్లా అటో డజను ఇటో డజను గాజులు వేపిస్తా పిల్లా మెల్లగ మెల్లగ మెల్లగా తువాల కొంగు ముడేసుడే బాసింగ బాసింగ బలాలే భలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే కలిసి ఉన్నాయే ఈ పోరని నిలువెత్తు ప్రాణాలే నను ఉన్నాయే శ్రావణ మాస బలాలే సై అన్నాయే ఇక తగ్గేదే లేదే నువ్వు నేను వేరు కాదే ఇక్కడి నుండి ఉంటది వేరే నీదే నాదే ఒకే పేరే నువ్వు నేను ఒక్క తీరే కళ్ళ సైగల ఎగురుడే కాలు సిగ్గి కలుపుడే చీర మారుపు ఆడుడే మన ఇద్దరి మంగళారతి పట్టాలే కుడి కాలు పెట్టి ఇంట్లకు నువ్వు దుంకి రావాలే ఒక గూటి పచ్చులై ఉండాలే ఎదురు సూపులనే ఇద్దరి కడుపు నిండాలే ఉత్త సేతుల ఉత్త సేతుల ఉత్త సేతుల ఉండా పిల్లగా అటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంట మల్ల మెల్లగ మెల్లగ మెల్లగా తువాల కొంగు ముడేసుడే బాసింగ బాసింగ బలాలే భలు ఉన్నాయే సేతుల జిలకర బెల్లాలే కలిసి ఉన్నాయే ఈ పోరని నిలువెత్తు ప్రాణాలే నను ఉన్నాయే శ్రావణ మాస బలాలే సై అన్నాయే

Basinga Balaalu Song Lyrics in English (Transliteration)

Baasinga baasinga balaale bhalu unnaaye Sethula jilakara bellaale kalisi unnaaye Ee porani niluvetthu praanaale nanu unnaaye Shraavana maasa balaale sai annaaye Uttha sethula uttha sethula Uttha sethula uttha sethula unchaa pillaa Ato dajanụ ito dajanu gaazulu vepisthaa pillaa Mellaga mellaga mellagaa thuvaala kongu mudesude Baasinga baasinga balaale bhalu unnaaye Sethula jilakara bellaale kalisi unnaaye Ee porani niluvetthu praanaale nanu unnaaye Shraavana maasa balaale sai annaaye Ellipaaya jade sude Ellipaaya jadennu poosa meedhe sude Ennu poosala meedha kaatuka poosude Kannula kannetti sukkavette sude Sempala sempetti Nee yaadhila yekkillu raavatte naa buttabomma Sethula manchineellu thevaale Rendu sethula maanikyaletthaale Nuvvu atthaa unte intiki kala vacchi padaale Uttha sethula uttha sethula Uttha sethula uttha sethula unchaa pillaa Ato dajanụ ito dajanu gaazulu vepisthaa pillaa Mellaga mellaga mellagaa thuvaala kongu mudesude Baasinga baasinga balaale bhalu unnaaye Sethula jilakara bellaale kalisi unnaaye Ee porani niluvetthu praanaale nanu unnaaye Shraavana maasa balaale sai annaaye Ika thaggedhe ledhe nuvvu nenu veru kaadhe Ikkadi nundi untadhi vere needhe naadhe oke pere Nuvvu nenu okka theere kalla saigala yegurude Kaalu siggi kalupude cheera maarupu aadude Mana iddhari mangalaarathi patthaale Kudi kaalu petti intlaku nuvvu dhunki raavaale Oka gooti pacchulai undaale Yedhuru soopulane iddhari kadupu nindaale Uttha sethula uttha sethula Uttha sethula undaa pillagaa Ato dajanu ito dajanu gaazulu yesukunta malla Mellaga mellaga mellagaa thuvaala kongu mudesude Baasinga baasinga balaale bhalu unnaaye Sethula jilakara bellaale kalisi unnaaye Ee porani niluvetthu praanaale nanu unnaaye Shraavana maasa balaale sai annaaye

Palli Balakrishna Saturday, August 29, 2026






  
ఫోక్ సాంగ్ : నీ ఎన్నెల ఈడు జూసి జాను  (2024)
సంగీతం: కళ్యాణ్ కీస్ 
సాహిత్యం: రఘు నిమ్మల 
గానం: సుమన్ బదనకల్ , శ్రీనిధి 
నటీనటులు: DJ సాగర్ , యమునా తారక్ 
దర్శకత్వం: రాజ్ నరేంద్ర 
నిర్మాత: శివ వేలుపుల 
మ్యూజిక్ లేబుల్: సాగర్ ట్యూన్స్ 
విడుదల తేది: 17.07.2024


నీ ఎన్నెల ఈడు జూసి జాను పాట సాహిత్యం

 
ఫోక్ సాంగ్ : నీ ఎన్నెల ఈడు జూసి జాను  (2024)
సంగీతం: కళ్యాణ్ కీస్ 
సాహిత్యం: రఘు నిమ్మల 
గానం: సుమన్ బదనకల్ , శ్రీనిధి 


మనసుల మనసుంటలేదు వయసు మాట ఇంటలేదు
కడుపుల కూడుంటలేదు కనులకు కునుకైన రాదు
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను
నా రోకంతా నీమీదే జాను నువ్ లేకుంటే నేనేమైపోను

నీ ఎన్నెల ఈడును జూసి మందిలో సైగాలు జేస్తే
సందుల సాటుకు వచ్చి సీకటి సోకులుజేసే
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను
అందరిలాంటి దానను కాను నా జోలికొస్తే నేనూరుకోను

కన్నఒళ్ళే కాదనన్న కులపోళ్లే కావలన్న
తొడగొట్టి సెప్పుతున్న నీ నుదుట బొట్టు నైత
ఇగ అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు
అద్దంటే ఆగేదె లేదు అల్లుఅర్జునులా తగ్గేదె లేదు


మూడుపూట ముచ్చట్లు ఎన్నిజూస్త నేనేడు
వాడుకోని వదిలేసె నీలాంటి మగవాళ్లు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు
దమ్ముంటే మావోళ్లతో సారు అంత సీనుంటే మాట్లాడిజూడు

నువ్ లేని నా గుండె ఆగిపోతా అంటుందే
నిను పొందని నా జన్మే మల్ల పుట్టనంటుందే
చల్ ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను
ఎట్లయితే అట్లాయే జాను మీవోళ్లతోనే మాట్లాడుతాను

పిల్లగా సిగ్గులేక రమ్మంటే ఇంటికొస్తవా ఇంటి
ఎవలైనాజూసినంటే నెత్తినిండానువ్వంటే
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి
రామ దండాలు నీకు సామి రాసి పెట్టుంటే అయితదిలే పెళ్లి

ఒక్కసారి సోపతైతే సచ్చెదాక ఇడిసిపోను
నమ్మబుద్ది కాకపోతే గుండె కోసి ప్రేమజూడు
అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము
నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము

ములకున్న దాన్ని నన్ను ముగ్గులోకి దింపినావు
మందిలున్న మనసునంతా ముంచి ముద్దజేసినావు
ఇగనుండి నువ్వే నాషాను దుమ్ము దులిపేద్దాం రావోయ్ దునియాను
ఇగనుండి నువ్వే నాషాను ఏది ఏమైనా నీతోనే నేను…

Palli Balakrishna Saturday, April 11, 2026






  
పాట: రాను బొంబాయికి రాను (2025)
సంగీతం: కళ్యాణ్ కీస్ 
సాహిత్యం: రాము రాథోడ్ 
గాయకుడు: రాము రాథోడ్ – ప్రభ 
నటీనటులు: రాము రాథోడ్ – లిఖిత 
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ 
నిర్మాత: వాలి
విడుదల తేదీ: 23.01.2025


రాను బొంబాయికి రాను పాట సాహిత్యం

 
పాట: రాను బొంబాయికి రాను
సంగీతం: కళ్యాణ్ కీస్
సాహిత్యం: రాము రాథోడ్
గాయకుడు: రాము రాథోడ్

అద్దాల మేడలున్నాయే
మేడల్లా మంచి చిరాలున్నాయే
చీరంచు రైకలున్నాయే
కొనిపిస్తా నాతో బొంబాయి రాయే

రాను నే రాను
రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను

రాను బొంబాయికి రాను
రాను బొంబాయికి రాను

రాయే రాయే పిల్ల
రంగుల రాట్నం ఎక్కించి జతరంతా చూపిత్తా

రాను రాను పొలగా
రంగుల రాట్నం ఎక్కించి న్నన్ ఆగం చేస్తావంట

అందుకే రాను నే రాను
హ రాను గా జాతర రాను
రాను నేన్ ఆగం గాను

రాను గా జాతర నేను
రాను నేన్ ఆగం గాను

మల్లెపల్లిలా మల్లె తోటనే
నీ జడలా పూలు అల్లి పెడతనే
నల్లగొండలా నక్కిలీసులే
నీ మేడలా భలే మెరిసిపోతాయే

చాలు అయ్యా చాలు
చాలు నీ జూట మాటలు
చాలు నీ కుర్రకూతలు

చాలు నీ జూట మాటలు
చాలు నీ కుర్రకూతలు

రాయే రాయే పిల్ల
నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా

రాను రాను పొలగా
మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా

అందుకే రాను ఎహే రా నే రాను
హ రాను గా జాతర రాను
రాను నేన్ ఆగం గాను

రాను గా జాతర నేను
రాను నేన్ ఆగం గాను

పల్లెటూరి పడుచు పిల్లవే
పట్నమంతా నీ కంటగడతనే
మా పాలమూరి పంచ వన్నేవే
పైస కట్నం నేనోళ్ళనంటినే

అయినా రాను నే రాను
రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు

నే రాను గా హైదరాబాదు
నా పానమీడికెళ్లి యాడిపోదు

రాయే రాయే పిల్ల
రచ్చమాని చచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా

కానీ కానీ పోలగా
కంచేదించి ప్రేమవంచి అడుగైతా నీ అడుగుల్లా

సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ

సామీ నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ

Palli Balakrishna Tuesday, April 7, 2026






  
పాట: రామసక్కని సూపులోడే 
సాహిత్యం – మహేందర్ ముల్కల
సంగీతం – కళ్యాణ్ కీస్
గాయని – వాగ్దేవి 


రామసక్కని సూపులోడే పాట సాహిత్యం

 
పాట: రామసక్కని సూపులోడే 
సాహిత్యం – మహేందర్ ముల్కల
సంగీతం – కళ్యాణ్ కీస్
గాయని – వాగ్దేవి 

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వాని చక్కని సూపుల
చెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందే
గుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టిన
గంటలే మోగినట్టుందే
గాయి గాయి తిరుగుతుందే ప్రాణం
గంప కింద గమ్ముతాందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

నల్లని కన్నుల మన్మథుడే
నవ్వుల బాణాలు వేసినాడే
హద్దుల దాటని అల్లరోడే
ముద్దుల తోటకు పిలిచినాడే

వాని అత్తరు సెంటు సోకులకు
మత్తు మందుల ముంచినట్టుందే
ఎన్నడూ చూడని వింత లోకాలన్నీ
కొత్తగా చూసినట్టుందే
గాయి గాయి అంటావుండే ఈడు
దారి తప్పి పోతావుందే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

వెన్నెల దారుల్లా వన్నెగాడే
వేకువ జామున కలిసినాడే
గాబురాల ముద్దు పిల్లగాడే
గారడి మాయలు చేసినడే

వాని అడుగుల సప్పుడు
అర్దుమ రాత్రి నిదుర లేపినట్టుందే
పచ్చని పైరులా వెచ్చని గాలులు
పరువులా తాకినట్టుందే
గాయి గాయి మత్తుగుందే ఒళ్ళు
సోయ తప్పి పోతావుండే

రామసక్కని సూపులోడే
రవ్వల దుగ్గిలు తెచ్చినాడే
పున్నమి ఘడియల చందురుడే
పూవ్వుల వాసనకు వచ్చినాడే

బంగారు నవ్వుల చిన్నవాడే
బావంటూ బంధాలు కలిపినాడే
ఆ నీలి మబ్బుల అందగాడే
అందరి మనసులు గెలిచినాడే

వాని నవ్వుల తీరుకు
వాగులు వంకలు పొంగి పొర్లినట్టుగుండే
ఆ వాన చినుకులు అందాల మెరుపులు
కన్నులే గీటినట్టుందే
జోరు జోరు జారుతుందే కొంగు
జోడి ఏదని అడుగుతుందే

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

నచ్చిన ముద్దుల పిల్లగాడా
నీతోనే మనువాడుకుంటాను రా
గుండెల్లో నిండిన బావగాడా
గువ్వా గోరింకోలే తోడుంటారా

Palli Balakrishna Monday, March 24, 2025






  
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల 
సంగీతం: కళ్యాణ్ కీస్ 
రచన: మహేందర్ ములకాల 
గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి 
ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్ 
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్
ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్ 
రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK
విడుదల: 14.05.2024


సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ు పాట సాహిత్యం

 
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల 
సంగీతం: కళ్యాణ్ కీస్ 
రచన: మహేందర్ ములకాల 
గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి 


సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన
నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన

గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా
వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ

సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా
మాయా మాటలు పలుకకూ ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల

సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట

పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత
రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట


వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు
జోడెడ్ల బండి గట్టీ ఓ పిల్ల జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ

ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందార సిరిమల్లి
మరుగు మాటల వాడివే ఓ బావ మా వదినలొస్తున్నరు తోవల్ల

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా

బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా
పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా

కారెండ పడవీలో కస్తూరి రంగాయే వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే
నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే ఈ వేళ

నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే
కొంటే చూపుల వాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నరు తోవల్ల

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా

పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా

చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది
చిలుక గోరింకవోలే కూడుండి చితి మీద తోడొస్తనే ఓ పిల్ల

పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ
మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ

Palli Balakrishna



పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల
ఆర్టిస్ట్స్: Shekar Donuka, Ishwarya
కొరియోగ్రాఫర్: శ్రీకాంత్
రికార్డింగ్ లేబుల్: లలిత ఆడియో & వీడియోస్
విడుదల: 06.04.2018




రజితా (బంజారా ఫోక్ సాంగ్) పాట సాహిత్యం

 
పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా
నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా
రజితో.. నీ కళ్ళ కాటుకా రజితా
రజితో.. చూస్తానె నిన్ను సూటిగా రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు
నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు
రజితో.. నీ చెవుల కమ్మలూ రజితా
రజితో.. అదిరెనె కనుబొమ్మలు రజితా...

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా

నీ నడుము ఒంపులూ సూపవె నీ సొంపులు
నీ నడుము ఒంపులు జర సూపవె నీ సొంపులు
రజితో.. నీ నడుము ఒంపులూ రజిత..
రజితో.. జర సూపవె నీ సొంపులూ రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. కలవాలనున్నదే రజితా

నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును
నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును
రజితో.. నీ పట్టా గొలుసులూ రజితా
రజితో.. దోచెను నా మనసునూ రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నువ్ సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి
సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా


Palli Balakrishna Sunday, May 28, 2023



పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల
రికార్డింగ్ లేబుల్: లలిత ఆడియో & వీడియోస్
విడుదల: 06.04.2018




రజితా (బంజారా ఫోక్ సాంగ్) పాట సాహిత్యం

 
పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా
నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా
రజితో.. నీ కళ్ళ కాటుకా రజితా
రజితో.. చూస్తానె నిన్ను సూటిగా రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు
నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు
రజితో.. నీ చెవుల కమ్మలూ రజితా
రజితో.. అదిరెనె కనుబొమ్మలు రజితా...

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా

నీ నడుము ఒంపులూ సూపవె నీ సొంపులు
నీ నడుము ఒంపులు జర సూపవె నీ సొంపులు
రజితో.. నీ నడుము ఒంపులూ రజిత..
రజితో.. జర సూపవె నీ సొంపులూ రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. కలవాలనున్నదే రజితా

నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును
నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును
రజితో.. నీ పట్టా గొలుసులూ రజితా
రజితో.. దోచెను నా మనసునూ రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

నువ్ సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి
సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి
రజితో.. పిలవాలనున్నదే రజితా
రజితో.. అడగాలనున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా

కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన
రజితో.. పిలవాలానున్నదే రజితా
రజితో.. అడగాలానున్నదే రజితా


Palli Balakrishna



సాంగ్: సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్ 
సింగర్: రాము రాథోడ్ 
ప్రొడక్షన్: MS అడ్డా



సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! పాట సాహిత్యం

 
సాంగ్: సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌! (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: రాము రాథోడ్ 
సింగర్: రాము రాథోడ్ 
ప్రొడక్షన్: MS అడ్డా

కంటికి కునుకే క‌రువాయినే!
గుండెల బ‌రువే మొద‌ల‌యినే!

సొమ్మ‌సిల్లిపోతున్న‌వే ఓ సిన్నా రాముల‌మ్మ‌!
చెమ్మ‌గిల్లి ముద్దివ్వ‌వే చూపించ‌వే నాపై ప్రేమ‌!
న‌ల్ల న‌ల్లాని క‌ళ్ల‌తో నాజూకు న‌డుముతో! న‌న్నాగం జేసితివే!
గుండెలో గాలిలో తేలుతు ఆరాటాలాడుతూ..నీ ఒళ్లో నీవాలినే!
సుట్టు దిప్పూకున్నావే! ఓ చిన్నా రాముల‌మ్మ‌!
చెమ‌ట‌చుక్కొలే తీసెయ్య‌కే నీ చీర కొంగుకే ముడివెయ్య‌వే!

సాయం కాలం వేళ సందె పొద్దులాగ చెంత‌లోనే ఉండ‌వే!
చీక‌టేల మెరిసే సుక్క‌లాగ గుండెలోన దాగ‌వే!
నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీబొమ్మ‌లావున్న‌దే!
నీ చేతిన‌డ్డేసి క‌ల‌ల‌న్నీ చెరిపేసి కాలాన్ని మార్చ‌కే

ఎక్క‌డున్నా ఎదుర‌య్యే నీ స‌న్న‌జాజి న‌వ్వులే!
స‌క్క‌నైనా సొగ‌సులే నాకిచ్చి స్వ‌ర్గంలో బంధించ‌వే!

ఏటి గ‌ట్టి మీద ఎదురు చూపుల్లోన‌ క‌ళ్ళ‌ల్లో నిండిన‌వే!
గాలి వాన‌ల్లోన గొడుగ‌ల్లే ర‌మ్మ‌న‌వే వెచ్చ‌గ కౌగిలికే!
నీ ఊహ‌లే క‌న్న నీ ధ్యాస‌లో ఉన్న నా ద‌రికి ర‌మ్మంటినే!
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నునా..నా అడుగు నీ జాడ‌కే!

ముద్దుగున్నా నా చెలివే! ఓ చిన్నా రాముల‌మ్మా!
సుక్క చేరే రోజెన్న‌డే ప్రాణం అల్లాడే నీ కోస‌మే!

పారేటి సెల‌యేరు ప‌ల‌క‌రించ‌కున్న ప‌ర్వాలేద‌నుకుంటినే!
ప్రాణం క‌న్న నీవు ఎక్కువ అంటున్న ప‌ట్టించుకోవెందుకే!
పువ్వుల్లో దాగున్న ప‌రిమ‌ళాల‌న్ని నీ చెంత చేరిస్తినే!
పంచ‌బూత‌ల‌న్ని సాక్షులుగ చేసి మ‌నువాడు కుంటాలే!

జ‌న్మ‌జ‌న్మాల బంధానివే! ఓ సిన్నా రావుల‌మ్మా!
నా చీక‌టి బ్ర‌తుకులో వెలుగివ్వ‌వే!
నా ఇంటి దీపాన్ని వెలుగించ‌వే!

Palli Balakrishna Friday, December 16, 2022



సాంగ్: మా గల్లీలో ఒక్కడు పోరడు (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: జోగుల వెంకటేష్ 
సింగర్: మౌనిక యాదవ్ మామిండ్ల
డైరెక్టర్: హరీష్ వేల్పుల 
విడుదల తేది: 03.11.2022



మా గల్లీలో ఒక్కడు పోరడు పాట సాహిత్యం

 
సాంగ్: మా గల్లీలో ఒక్కడు పోరడు (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: జోగుల వెంకటేష్ 
సింగర్: మౌనిక యాదవ్ మామిండ్ల
డైరెక్టర్: హరీష్ వేల్పుల 
విడుదల తేది: 03.11.2022

మా గల్లీలో ఒక్కడు పోరడు
అందగాడడు నన్ను జూత్తడు
నన్ను జూసిన జూడనట్టుంటడు
నవ్వుతుంటడు కన్నుగొడతడు
సైగ జేత్తడు…

వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు
తెలివిగల్లోడు తెల్లగుంటడు
నన్ను సాటుకిలిసి ముచ్చటంటడు
ముద్దులంటడు సరసమంటడు
లొల్లి జేత్తడు…

యే.. పొద్దున్నే మా వాడ కత్తడు
కావలుంటడు అడ్డమొత్తడు
నన్ను కాలేజికే బోనీయడు
బండి దెత్తడు ఎక్క మంటడు
పోదామంటడు…

నాకు ఊరు వాడ జూపిత్తడు
జాతరంటడు తొల్కవోతడు
నేనడిగింది నాకు గొనిత్తడు
రాణివంటడు, రాజునంటడు
మురిసిపోతడు…

వాడు సక్కని మనసున్న పోరడు
ఊరినిడవడు ఊళ్ళో ఉంటాడు
ఈ ఊరంతా నా వోళ్లే అంటాడు
తోడుగుంటడు సాయమైతడు
సాగిపోతడు..

వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు
కాని లేనోడు అన్నట్టుంటడు
అందరితోని గలిసి మెలిసుంటాడు
బుద్ధిమంతుడు సదువుకున్నోడు
సక్కనైనోడు..

వాడు సుక్కల్లో మెరిసేటి సంద్రుడు
కలవ కళ్ళోడు కాంతి నవ్వోడు
పారాయి అమ్మాయిలని జూడడు
దారి ఇస్తడు పక్కకెలతడు
పారిపోతడు..

మరి నేనంటే పడి సచ్చిపోతడు
నన్ను ఇడవడు కలవరిత్తడు
వాడు పడుకున్నా నా పేరేనంతడు
మొండి గుణమోడు మాయజేశాడు
మనసు దోశాడు..

నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు..

నా మేనత్త ముద్దుల కొడుకాడూ
వరస అయినోడు మేన బావాడు
నా మెడలోన తాళిగట్టేటోడు
యేలువడతాడు ఏలుకుంటాడు
తోడుగుంటాడు..

Palli Balakrishna



సాంగ్: కొడుకా నా ముద్దు కొడుకో (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: దేవరకొండ బిక్షపతి 
సింగర్: మధు ప్రియ
నిర్మాత: దాగుడు వినోద్ కుమార్



కొడుకా నా ముద్దు కొడుకో పాట సాహిత్యం

 
సాంగ్: కొడుకా నా ముద్దు కొడుకో (2022)
సంగీతం: కళ్యాణ్ కీస్
రచన: దేవరకొండ బిక్షపతి 
సింగర్: మధు ప్రియ
నిర్మాత: దాగుడు వినోద్ కుమార్ 

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

కడుపారాగన్న నీ కన్నతల్లినిరా
కనులారా సూద్దామనీ నేను కలెలెన్నోగన్నరా
నల్లనీ కాకమ్మతో సల్లంగా కబురంపా
కనుపడ్డోళ్లనీ అడిగినా కానరావయే కొడుకా

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

ఇంటి ముందు చింతచెట్టు మీద
కాకమ్మ కావు కావుమంటే
నా కొడుకే వస్తాడనుకొని
పాలుదెచ్చి పాశం మొండుకుంటి
ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే
ఆ పాశమన్నం పాశిపాయే
పాలబాకీ ఇంకా తీరదాయే

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

యాడనన్న జాడదొరికితే
ఎములాడబోతనని మొక్కిన
వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని
యాటపోతు తెచ్చుకున్న
ఎన్నిరోజులని నేనూ
ఎదురుజూడను కొడుకా
ఆ యాటపోతు జెళ్లిపాయే
ఎములాడ జాతర ఎళ్లిపాయే

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

సాయనలుపు లుండేటోడు
నా సక్కని సిన్నికొడుకు
ఎక్కడా లేవంటే
నేను ఏమనుకోను కొడుకా
అన్నలా కొరకు కొడుకూ
అడవికి బోయిండేమో
వెన్నలాగన్న కొడుకుకు
వెన్ను దట్టి దారిచూపు

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా
ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

అన్నల్లో గలిసిపోయే కొడుకా
అదృష్టమందరికి రాదూ
అన్యాయాన్ని ఎదురించినట్టి
అమరుల్ల బాటల్లో నడువు
అమరుడు పెద్దన్నబందుకు
అందుకోని ముందుకురుకు
నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా

నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా
నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా

Palli Balakrishna

Most Recent

Default