Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Thalli Prema (1968)






చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి 
దర్శకత్వం: శ్రీకాంత్ 
నిర్మాత: యమ్.అజీమ్
విడుదల తేది: 09.03.1968



Songs List:



కొమ్మ మీది కోయలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల 

కొమ్మమీది కోయిలమ్మ పిలిచిందిలే
మనసులోన వలపు తలపు మొలిచిందిలే
ఊగిందిలే .... ఆడిందిలే
సన్నాయి పాడిందిలే .... ॥కొమ్మ॥

ఇన్నాళ్ల తెరలన్నీ తొలిగెనులే
చెలికాని ఒడిలోన ఒరిగెనులే
కలలన్నీ ఒకటొక నిజమౌనులే
నా ఆశలూ, తీరెనులే ....
ఈ జగమే మా రేనులే ॥కొమ్మ॥

చెలికాడు నా చెంత చేరేనటా
ఎన్నెన్నో కోరికలూ ఊరేనటా
బుగ్గమీద సిగ్గు మొగ్గ వేసేనట
నా నోములు పండేనట
స్వర్గాలే అందేనట ॥కొమ్మ॥





లేదా లేదా పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల , పి.బి. శ్రీనివాస్

లేదా లేదా.... వెచ్చని వలపే లేదా?
వెళుతావేం మరియాదా
లేదూ లేదూ - వెళిపోవాలని లేదు వలపు లేకపోలేదూ-
ఒంటిగ నువు పొతూవుంటే కొంటె ఊహలేమంటాయో?
జంటగూడి నే రాకుంటే చల్లగాలులు ఏం జేస్తాయో…?

పిల్ల వలపు వేడిగా వుంటే
చల్ల గాలులు ఏంజేసాయీ ?
నీ తోడుగ నే లేకుంటే
నిన్నే చూసి కవ్విస్తాయీ

కొంగును వడివేస్తున్నావు
పొంగులేవో దాస్తున్నావు....
ఓరఓరచూపులతోనే
గారడీలు చేస్తున్నావు....

నా కనుల దీపం నీవు నా కలల రూపం నీవు
నా యెదలో నాడూ నేడూ నీవే నీవే దాగున్నావు.
లేదులేదు వెళ్లిపోవాలని లేదు 
వలపు నిలుపగా రాదు....



నిన్న మొన్న పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల , పి.బి. శ్రీనివాస్

నిన్నా మొన్నా లేని బిడియం నేడే కలిగిందిలే
నిన్నా మొన్నా బాగున్న పరువం  నేడే విరిసిందిలే

ఒక నవ్వు నవ్వి, ఒక చూపు రువ్వి 
వికసించు విరజాజి నీవు
ఆ పువ్వులోని అందాలు అనీ ఆడేటి చిరుగాలి నీవు, సయ్యాట
మనసైన ప్రియుని - మునివేళ్లలోన. పలికింది పరువాల వీణ
ఆ వీణ పలికీ అనురాగమొలికి కురిసింది సన్నీటి వాన నాలోన



కలలో ఇలలో పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల , లీల 

కలలో ఇలలో నీదేరా సొగసు
అందరి మురిపించు సొగసు 

ఇద్దరు తల్లుల ముద్దులపాపా
జాబిలికంటే చక్కని పాపా
నీవుండే మా యిల్లే 
కోవెలయె నిలుచునురా 
మా హృదయాలే ఉయ్యాల, నీ ఉయ్యాల

నిన్నే కన్నా తల్లిదె భాగ్యం
నిన్ను పెంచే తల్లిదే పుణ్యం
మా యెదుటా నీవుంటే... మాకే స్వర్గాలూ
నీతో వంశము పెరుగునురా, వెలుగునురా




హల్లో హల్లో దొరగారు పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, L.R. ఈశ్వరి

హల్లో హల్లో దొరగారు - భలే హుషారుగా వున్నారు.
ఇప్పుడెందుకీ గడ్డాలు, పిల్లిగడ్డాలు
ఇప్పుడెందుకీ గడ్డాలు, లేవు లేవు మనకడ్డాలూ

హల్లో హల్లో మైలేడీ – వినవే వినవే నాజోడీ....
గడ్డం నీకు అడ్డం అయితే రిమూవ్ చేయుటకు రడీ రడి

పొట్టివాడవనుకున్నాలే.…
పుట్టెడు జిత్తులు వున్నవిలే - ఆహా....
గట్టివాడవోయి మొనగాడా
నిను వొదిలిపెట్టడం ఏలాగోయ్

కళ్లతోటి నను కట్టేశావ్ 
తళుకు బెళుకుతో పట్టేశావ్

నిన్ను వదలి నే పోతానా-యీ వేషం అందుకే నెరజాణా
నీకన్నా మొనగాడయ్యా - గజ కిలాడి మేజరు మామయ్యా 
నీ వేషం పసిగట్టాడా—వీపున, చాకిరేవు పెడతాడయ్యా...

అబ్బా నువ్ సైఁ యన్నావా - నాదెబ్బకు మేజరు డుండుక్కు
అయ్యొ....
మన ప్రేమకు ఇది బలే టానిక్కు-తిరుగులేనిదీ మాజిక్కు




వీధి నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, L.R. ఈశ్వరి

రావణ : ఓరీ ద్రోహీ....
మండోదరి: ఏమిటీ ఆవేశం
రావణ : తమ్ముడని యీ విభీషణు-నమ్మితి, యీతండు లంక నాశనమునకై
అమ్మనుజాథము రామునకు
ఇమ్మెయి మనగుట్టు సర్వము ఎరిగించెనంటా....
యీ వీటిలో వీడుంట తంటా - జ్ఞాతి యెప్పుడు చావుగోరుట
సహజమని శాస్త్రములు చెప్పుట – సత్యమై తోచినది ఇంక
వీడుంట తంటా నాసోదరుడు ఎవడున్నా తంటా
వేరుగ మనము వుందామె అంటా....

నాథా....
ఏమి నీ బాధ ?
అబ్బబ్బబ్బా వద్దులే
వేరుగ వుంటం వద్దులే
అందరమూ కలిసున్నామంటే,
ఎంతో ఎంతో హాయిలే--
అయ్యయ్యయ్యో వద్దులే -
ఒకటిగా ఉంటే రద్ధీలే
కూడావుంటే పోరులే,
వేరు జోరులే

ఇల్లువిడిచి నువ్ పొయ్యావనుకో
ఎక్కడనైనా వున్నావనుకో ఏకాకిగ ఎట్లుండేది,
నేనేకాకిగ ఎట్లుండేది, ఎవరిని నమ్మి వుండేది....
తోడికోడళ్ళు వుంటేను - ఎప్పుడూ కొంపలు మండేను
నిత్యము వాళ్ళు నీ ప్రాణానికి ముప్పుతెచ్చెదరు నిజమేను
ఎరువులసొమ్ములు బరువేను ఇతరులు నీవాళ్ళెటులను
చావునకై నా బ్రతుకునకై నా మనవాళ్లవసరమయ్యేనూ
నీవు చెప్పినది నిజమేలే — కలిసివున్నచో సుఖమేలే
ఈ తప్పునకు క్షమించెదను సోదరుణించెదనూ
అబ్బబ్బబ్బా.... ఒద్దులే - పేరుగవుంటం వద్దులే 
అందరమూ కలిసున్నామంటే ఎంతో ఎంతో హాయిలే....





తల్లీ నిన్ను తలచి పాట సాహిత్యం

 
చిత్రం: తల్లి ప్రేమ  (1968)
సంగీతం: ఆర్.సుదర్శనం 
సాహిత్యం: పి.త్యాగరాజు
గానం: పి.బి. శ్రీనివాస్

శా॥
తల్లీ, నిన్నుదలంచి పేపరును చేతన్ బూనితిన్, నీవు నా
యుల్లంబందున నిల్చి ఆన్సరుల నెంతో సూటిగా, నేర్పు శో

భిల్లన్ వ్రాయగజేసి ‘క్లాసు' నిడి సంప్రీతిన్ దయన్ చూడుమా
పులాద్రాక్షి గుణాలయాః భగవతీః పుణ్యంబు నీదే సుమా

No comments

Most Recent

Default