Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Superman (1980)




చిత్రం: సూపర్ మ్యాన్ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: యన్.టి.రామారావు, జయప్రద
మాటలు: ఆచార్య ఆత్రేయ 
దర్శకత్వం: వి.మధుసూదనరావు 
నిర్మాత: ఆర్.గోపాల్ 
విడుదల తేది: 10.07.1980



Songs List:



మబ్బుల్లో చంద్రమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

హేహేహే ...
సూపర్ మాన్ మేన్ మేన్.. లాలలలా.... లలలలా....
వన్ మేన్.... సూపర్ మేన్
మెన్ మెన్ మెన్ ....
సూపర్ మాన్ మేన్ మేన్ సూపర్ మేన్

పల్లవి: 
చికు చికు భం భం చికిజా ఒంభం
మబ్బుల్లో చంద్రమ్మా చంద్రమ్మా చంద్రమ్మా
చంద్రమ్మా చంద్రమ్మా

కోరస్: లలలలా.... మెలికలు తిరిగే మెరుపమ్మా
మెరుపమ్మా మెరుపమ్మా 

మెరుపుకు వురుముకు పెళ్లమ్మా
బుల్లెమ్మా బుడతమ్మా బుజ్మ ... బుల్ల్మె....

మబ్బుల్లో చంద్రయ్యా చంద్రయ్యా చంద్రయ్యా-
కోరస్: లలలా లలలా ....
మగరాయడివి నువ్వయ్యా నువ్వయ్యా -
మెరుపుతో వురుముకు పెళ్ళయితే
వానయ్యా, వరదయ్యా వరదయ్యా, వానయ్యా 

చరణం: 
హె హె హె .... హె హె హే
లాగు పై కిలాగు.... నేను నీలో ఒదిగే లాగు ....
ల ల ల లా .....
పాకు పైకిపాకు.... నరనరాల్లో ఇమిడేలాగు....
లలలలా....

ఆగు కాస్త ఆగు జోరు చూస్తే
గుండెలు జారు.... లలలలా...
అలా జారు.... జారడంలో
వుంది జోరూ... లలలలా...
వయసే వయసును లాగేది మనసే పిదపే జారేది
నేను నీకు వయసంట నువ్వే నాకు మనసంట
ఇకలేదంట మనసరి జంట మనమే మనమంటా

కాస్త ముద్దు చేస్తా ఇంకా కాస్తని
మారాం చేస్తా....లాలలలా
ఇస్తా కొసరు ఇస్తా 
ఆగు కాస్తని ఆటాడిస్తా ల ల ల లా....
వస్తా ఎదురు వస్తా.... 
వచ్చి వచ్చి దూసుకుపోతా ల ల ల లా.......
చూస్తా.... అదీ చూస్తా.... 
చూసి చూసీ హతుకుపోతా లలలలా ...
చొచ్చుకుపోయే వయసుంది  
దూసుకుపోయె దుడుకుంది 
పచ్చిగ చెప్పాలనుకుంది.. పక్కకు రమ్మని పిలిచింది.
పక్కకువస్తే ఏదీ పక్కని ఫక్కున నవ్వింది



అట్టా సూడమాక పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి: 
అది గదిగదిగగ్దో అట్టా సూడమాక 
నన్ను సంపమాక
అట్ట చూడమాకా నన్ను సంపమాక
చూపుల్తో చుట్టేసి చుట్టానివై పోయి
నా దుంప తెంపమాక 

చరణం: 1 
నీ చూపు తగులుతుంటే 
నా చురుకు పెరుగుతుంటే
నీ తీపి తగులుతుంటే నా చేను చెరుకు పంటే.
నీ కొంగు తగల నీక - నా కొంప మునగ నీక
నా గొప్ప ఏముంది పిల్ల మగడా....
యీడొచ్చి చేసింది యింత రగడా....
చాకులాంటి చిన్నవాడు కత్తిలాంటి కన్నేసి -
కాజేసి వెన్న మీగడా

నీ చిలిపి కధలు వింటే నీ వలపు కలలు కంటే
నీ పడుచు వురుము వింటే నా నిదరె చెదురుతుంటే
నీ ముద్దు ముదరనీక - నా పొద్దు పొడవనీక

నా తప్పుయేముంది అమ్మకూతురా
తొలి సూపు రేపింది యింతతొందరా
వెన్నెలాంటి కన్నెపిల్ల మల్లెపూలు మాటేసి
చేసింది  జంట జాతర 




చినుకు చిటికేసింది పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి:
చినుకు చిటుకేసిందీ - చూపు చురకేసిందీ ....
పైట ఎగరేసిందీ పడుచుగొడుగేసిందీ....
వానొస్తే హోయ్ హోయ్ వయసులో
వాటేస్తే హోయ్ హోయ్ అల్లోమలో

ఆ చినుకూ నీ ఒణుకు కసి కసిగా కవ్విస్తుంటే
నా కన్నూ నీచూపు చలి చలిగా కల గంటుంటే
మునుపెన్నడూ లేని ముసురేదో పడుతుంటే
అసలే మతి పోతుంటే అందులో జతపడుతుంటే
చిలికి చిలికి గాలివానసందడిలో
వలపు తడిసి మోపెడైన అలజడిలో

ఆ తడుపూ నీ పిలుపూ తడిపొడిగా ఒకటవుతుంటే
నా పెదవి నీముద్దు తడబడుతూ ముడి పడుతుంటే
నిరుడెన్నడూ లేని మరులేవో పుడుతుంటే
మనసే నస పెడుతుంటే అందమే బుసగొడుతుంటే
ఒదిగి ఒరిగి ఒక్కరైన యిద్దరిలో
ఆణిగి మణిగి వుండలేని అల్లరిలో





కోటలో పాగా వేసుకో బాగా పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి: 
శ్ల మశ్లమ దత్తాంక మలేషియా కాము సుంగో చంతే
కోటలో పాగా వేసుకోబాగా 
మనసులో జాగా వుందిలే రోజా

చరణం:
ఆడేపాడే వయసల్లాడే నినుచూచిన మరునాడే
డీడీ డిక్కని యీడూ జోడూ కలిసింది యీనాడే
తాడో పేడో తేల్చుకుంటా నీతో ఇక్కడేనే..
పడుచుతనంలో పడుగూ పేకా అల్లేస్తా నీతోనే

హంగ్ కాంగ్ లో హాయి హాయిగా 
సింగపూర్ పగలు రేయిగా
నీతో వస్తా కులాసాలెన్నో చేస్తా
నిన్నే చూస్తా విలాసాలెన్నో చూస్తా
యీ వింతేమిటో నీ అంతేమిటో....

చూస్తా చూస్తా చూపులోనే ....
వన్నె చిన్నె లన్నీ దోసా……

కోటలో పాగా వేసుకో బాగా
మనసులో జాగా వుందిలే రాజా
ఆపు మచ్చం బడాం కో సాయంగ్....

చరణం : 
మల్లెలు పూసే మనసిస్తావా మలేషియా చినదానా
హిందుస్థానీ రాగాలెన్నో పలికిస్తా నీ మేన
వలపు తేనెలు చిలికే మాటిస్తావా తెలుగువారి
చినవాడా
నిటారుగా యీ హవాయ్ గిటార్ని మీటిచూడు
యీ వేళ.
వలపు తీసుకో తీయ తీయగా
కలిపి చేసుకో పాట నీరుగా
పాలే చాలు నీ మురిపాలేచాలు
పాలే చాలు నీ మురిపాలే చాలు
చూస్తా చూస్తా చూపుల్లోనే.....
ఆ గోలేమిటో నీ గొడవేమిటో
వాపూ తీపూ నెలాగేస్తా....



కన్ను కొట్టెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి: 
కన్ను కొట్టెయ్యనా.... నిన్ను కట్టెయ్యనా ....
ప్రేమ పుట్టిందని.... పెద్ద ఒట్టేయ్యనా....
కన్ను కొట్టెయ్యవా

చరణం: 
నన్ను కలిసేందుకే.... నువు పుట్టావులే
నిన్ను వలచెందుకే.... నేను పెరిగాను
నీ అందాలనే తాగేసానులే
నీ అంతేమిటో తాగేసానులే....
మల్లెపూలేసి.... మంటరాజేసి మనసు రాబట్టనా
మంత్ర మేవేసి మాయచేసేసి మతిని పొగొట్టవా

ఒడ్డు పొడుగున్నది అగ్గి పిడుగన్నది 
నీ ఒడుపుల్లో పడలేని గొడవున్నది
మేడి పండంటిది ఓ మెరుపున్నది 
నీ వలపులో కనరాని వలపున్నది
ప్రేమ శృతి మించి తేనెలో ముంచి
నిన్ను బులిపించనా....
ఆటకట్టించి అటక ఎక్కించి
కన్ను తెరిపించనా




మెత్తని కౌగిట పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పలవి: 
హలో....
హలో....
మెత్తని కౌగిట హత్తుకుపోయే ఎదలో వింతచప్పుడు
వెచ్చని ఒడిలో విచ్చలవిడిగా ఏదో కొత్త చప్పుడు
ఎందుకో చప్పుడు చెప్పనా ఇప్పుడు
గుట్టుగా వుంచుకో గుండెలో చప్పుడు

చరణం: 
మాటలు చేసే చప్పుడు వెనక మనసుంటుంది
మౌనంగా అది చేసే చప్పుడు గానమవుతుంది
ఆ గానంలో లీనమై ఆ రాగంలో అనురాగమై
నువ్వే నా లోకమై ....
నీతో నేనేకమై
ఒకటే చప్పుడు ఒకటే చప్పుడు
ఒకటే చప్పుడు ఒకటే చప్పుడు

చరణం: 
పెదవులు చేసే చప్పుడు వెనక ముద్దు వుంటుంది
ముద్దరపడితే పుట్టుమచ్చలా మాయనంటుంది
ఈ అందాలే బంధమై వాడని మల్లెల గంధమై....
నేనే నీ సొంతమె....
వుండమనీ వుండి పొమ్మనీ - ఎప్పుడూ ఒకటే చప్పుడు
నువ్వే నా వసంత మై వుండమనీ వుండిపొమ్మనీ ఎప్పుడూ ఒకటే చప్పుడు
ఒకటే చప్పుడు ఒకటే చప్పుడు ఒక టే చప్పుడు
ఒక టే చప్పుడు




శ్రీ ఆంజనేయ పాట సాహిత్యం

 
చిత్రం: సూపర్ మాన్ (1980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

పల్లవి:
శ్రీ ఆంజనేయా - ప్రసన్నాంజనేయా
శ్రీరామ పదపద్మ సేవా ప్రమేయా
మాం పాహి పాహి - మాం పాహి పాహి
తతో రావణ సీతాయా స్సీతాయా శతృకర్శనః
ఇయేష పదమన్వేష్టుం - చారణా చరితే పది

చరణం:1
సుందరమైనది - సుందరకాండ
సుందర కాండకు నీవే అండ
వారధి దాటి సీతను చూచి
అంగుళినొసగి లంకను కాల్చిన
నీ కథ వింటే మాకు కొండంత బలమంట

శ్లోకం : 
తత స్తం ప్రస్థితం సీతా వీక్షమాణాపునఃపునః
భర్తృ స్నేహిన్వితం వాక్యం హనును సమభాషత

చరణం: 2
శ్రీ రఘురాముని ఓదార్చినావు .
వానర సైన్యాన్ని సమకూర్చినావు
నీ సాయముంటే నిరపాయమేనని
మ్మిన నన్ను ఏదరి చేర్చేవు-నానమ్మికవమ్మైతే
నాగతి ఏమౌనో

చరణం: 3
దుష్టశిక్షకా శిష్టరక్షకా -
ధర్మపాలక - ధైర్య దీపికా
జాన కారకా విజయదాయకా -
నిన్ను కానకా నేను లేనిక
జయకర - శుభకర వానర ధీవరా
యినకుల భూవర కింకరా
రిపు జన నిత్య భయంకరా
రావేరా దరిశన మీవేరా 
రావేరా - దరిశన మీవేరా


No comments

Most Recent

Default