Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tiger (1979)




చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: యన్.టి.రామారావు, రజినీకాంత్, రాధ, సుభాషిని
దర్శకత్వం: యన్.రమేష్
నిర్మాత: పర్వతనేని నారాయణరావు
విడుదల తేది: 05.09.1979



Songs List:



అహ అహ అందం చూశాను ు పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.ప.బాలు, పి.సుశీల 

పల్లవి:
అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 

అహా..అహా..అంతా చూసాను..ఊఊఊ
ఎహే..ఎహే..ఎంతో చూసాను

చారెడు చారెడు కళ్ళల్లోన
బారెడు బారెడు కోరికలెన్నో

అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 

చరణం: 1 
అహా..ఓహో..నున్న నున్నని దానా
వన్నె నడకాలదాన
నున్న నున్నని దానా
వన్నె నడకాలదాన
నీ సొగసే చూడాలి... 
ఈ చుక్కల చీరలోన
నీ సొగసే చూడాలి... 
ఈ చుక్కల చీరలోన

ముద్దూ ముద్దుగ చీరకడతా..
అ ఆ హహ..హహ..
ముద్దూ ముద్దుగ చీరకడతా..
ముచ్చటగా కుచ్చెళ్ళు పెడతా 

అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 
మెత్తామెత్తని మాటలతోనే... 
మత్తెకించే ఎత్తులెన్నో

అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 

చరణం: 2 
అహా..విసురున్నా వేటగాడా 
అసలైన ఆటగాడా 
ఆ..అహా..విసురున్నా వేటగాడా 
అసలైన ఆటగాడా 
రోజు రోజు పెరుగుతుంది 
నీ జోరు సోకుమాడ 
రోజు రోజు పెరుగుతుంది 
నీ జోరు సోకుమాడ 

నువ్వనుకున్నది చెవిలో చెప్పు..మ్మ్..
నువ్వనుకున్నది చెవిలో చెప్పు... 
ఇవ్వకపోతే  నామీదొట్టు  

అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 

మెత్తా మెత్తని మాటలతోనే... 
మత్తెకించే గుత్తులెన్నో
అహా..అహా..అంతా చూసాను 
ఎహే..ఎహే..ఎంతో చూసాను 
ఊ..ఊ..ఊ..హా




చేసుకున్నవాళ్ళకు పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.ప.బాలు

పల్లవి:
చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా కాదంటావా 
కొవ్వుముదిరినోళ్ళ కొమ్ములిరగ్గొడతాను గురుదేవా ఔనంటావా 
అరె బచ్చా అరెకచ్చా ఆరెలుచ్చా అరె కుచ్చా 

చరణం: 1
తేలును చంపాలంటే చెప్పే చాలు 
పామును చంపాలంటే కర్రే చాలు 
నిలువెల్ల విషమున్న మీలాంటి నీచులను 
మనుషుల్లా కనిపించే మీలాంటి బూచులను 
కొట్టాలంటే చాలు చిట్టి చిటికెన వేలు 
అరె బచ్చా అరెకచ్చా ఆరెలుచ్చా అరె కుచ్చా 

చరణం: 2
అసలైన పెళ్ళికొడుకు వచ్చాడురా 
అడుగులకు మడుగులొత్తి సేవ చెయ్యరా
ఊదరా బాకాలు... కోట్టరా బాజాలు
పట్టరా హారతులు.. వెయ్యరా తలంబ్రాలు
జరిగింది కల్యాణం ముందుంది వైభోగం 




ఏం దెబ్బ తీశావు పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.ప.బాలు, పి.సుశీల 

పల్లవి:
హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..
ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  

అహా..ఏం బాగా అన్నావు ..
ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ....
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది  

చరణం: 1
ఓ..ఉరికేటి ఓ కొండవాగు..
ఒక కొంతసేపైన ఆగు
ఆ ఊపు తగ్గించుకొంటే....
నీ ఒంటికి బాగు బాగు

నాదేమో నునుపైన సొగసు... 
నీదేమో కరుకరుకున్న వయసు
నీతోటి సరితూగకుంటే... 
నీరౌను నా బేలమనసు

అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..
ఏం ముద్దుగున్నావు... 
ఏం చూపుతున్నావమ్మీ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది 

చరణం: 2 
నీకుంది పదునైన పొగరు... 
లేదెవరు నీకింక ఎదురు
నిను తలచుకుంటేనే చాలు... 
గుండెల్లో ఒక తీపి అదురు 

అరే..పడబోకు నావెంట వెంటా... 
ఉడికించకు ఓరకంటా..
పైటల్లె నను చూసుకుంటే... 
పదిలంగ నీతోనే ఉంటా..

హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..
ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  

అహా..ఏం బాగా అన్నావు ..
ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..అహా
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది






క్షణం క్షణం పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.ప.బాలు, యస్.జానకి 

పల్లవి:
క్షణం క్షణం ....నిరీక్షణం...
నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...
నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...

క్షణం క్షణం ....నిరీక్షణం..
నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...
నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...

చరణం: 1 
ఏ కిరణం సోకినా… ఏ పవనం తాకినా...
ఏ మేఘం సాగినా.... ఏ రాగం మ్రోగినా...
నిన్నే తలచి… నన్నే మరచి… నీకై వేచాను....
ఊ..ఊం...ఊం....ఊం...ఊం.....

క్షణం క్షణం ....నిరీక్షణం...
నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...
నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...

చరణం: 2 
నీ రూపే దీపమై...నీ చూపే ధూపమై...
నీ పిలుపే వేణువై...నీ వలపే ధ్యానమై...
వేకువలోనా...వెన్నెలలోనా...నీకై నిలిచాను...
ఊమ్మ్....ఉమ్మ్...ఊమ్మ్......ఊమ్మ్....

క్షణం క్షణం ....నిరీక్షణం...
నీ అల్లికలోనే పల్లవి పాడే నా యవ్వనం...
ఓ..ఓ..నీ పల్లవితోనే చల్లగ విరిసే నా జీవనం...

క్షణం క్షణం ....నిరీక్షణం...
క్షణం క్షణం ....నిరీక్షణం...
నిరీక్షణం...క్షణం క్షణం
నిరీక్షణం...క్షణం క్షణం




మారింది కాలం పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.ప.బాలు, పి.సుశీల 

పల్లవి:
హ్హా..హ్హా..హే..ఆ..ఆ
అ అ అ అ అ ఆ ఆ ఆ అ అ... హేయ్
మారింది మారింది కాలం
మారింది మారింది లోకం 
ఎక్కడమారిందమ్మా... 
ఇంకాదిగజారిందమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..

మారింది మారింది కాలం
మారింది మారింది లోకం..
ఎక్కడమారిందమ్మా....
ఇంకాదిగజారిందమ్మా..హ్హా
ఇక ఏమని చెప్పేదమ్మా.. 

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 

చరణం: 1 
మనిషిని మనిషి దగా చేసే..
మామూలు రోజులు  కావమ్మా 
ధనికులు పేదల అణి చేసే... 
మునుపటిరోజులు..కావమ్మా

దేవుడి నగలను నిలువున దోచే...
నాగన్నలున్నారమ్మా... 
నామాట నిజమేనమ్మా  కాదంటే... 
అప్పన్ననడగాలమ్మాసింహాద్రి... 
అప్పన్ననడగాలమ్మా  

మారింది మారింది..
కాలంమారింది మారింది..లోకం..  
ఎక్కడమారిందమ్మా... 
ఇంకాదిగజారిందమ్మా... 
అమ్మాఇక ఏమని చెప్పేదమ్మా.. 

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 

చరణం: 2 
హ్హ..హ్హా..హ్హ..హ్హా హ్హ..హ్హా..హ్హ..హ్హా 
నిరుపేదల పూరిళ్ళకు నిప్పంటించని రోజుందా  
నలుగురిలో నడివీధిలో తలలు నరికితే దిక్కుందా

ఆ రామరాజ్యం.... ఆ సామ్యవాదం
ప్రభవెలిగి పోతుందమ్మా..ఆ... హ్హా..బ్రతుకంటే మాదేనమ్మా 
ఈ శుభవార్త... గాంధీజీ చెప్పాలమ్మా
ఆ..పైనున్న... గాంధీజీ చెప్పాలమ్మా

మారింది మారింది కాలం
మారింది మారింది లోకం..ఆ 
ఎక్కడమారిందమ్మా...
ఇంకాదిగజారిందమ్మా..అమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు





ఒకటి రెండు మూడు పాట సాహిత్యం

 
ఒకటా రెండా, మూడా ఓరి దేముడో
నా వల్ల కాదు కాదురో ఓరి నాయనో 
కళ్ళు తిరిగిపోతున్నయ్ కాళ్ళు ఒణికిపోతున్నయ్ 
తియ్యలేను గుంజీలు తిప్పలు పెట్టకురో ..... 

ఒకటి రెండూ మూడూ తియ్యు గుంజీలు 
వల్లకాదు కాదంటే చెల్లదమ్మడూ
కళ్ళు తిరిగిపోతున్నా కాళ్ళు వణికిపోతున్నా 
తియ్యాలి గుంజీలు తిమ్మిరి అణిగేదాకా- 

మబ్బులేని మెరుపల్లె ఎవ్వడు రమ్మన్నాడు 
మల్లెపూల జల్లులో తడిపేసి పొమ్మన్నాడు 
అందుకే వేస్తున్న అందమైన శిక్ష
తీర్చుకుంటున్నా తియ్య తియ్యగా కక్ష
ఏమిటీ పరీక్షా...

చలిగాలి వడదెబ్బ ఎవ్వరు తియ్యమన్నారు 
సూది మెరుపంటి చూపుల్తో చురకేసి పొమ్మన్నాడు 
వయసొచ్చి చేసింది వలపన్న నేరం
కౌగిట్లో ఖైది చేశెయ్ నను జీవితాంతం
అయ్యో పాపం...




ఏ తల్లీ కన్నదిర పాట సాహిత్యం

 
చిత్రం: టైగర్ (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి 
గానం:  పి.సుశీల 

పల్లవి:
ఏ తల్లి కన్నదిరో నీటుగాడా
ఏ పిల్లకున్నదిరో నీతో జోడా
నీ నీడవుంటే..హా..మేడకడతా
నువు తోడు ఉంటే..హా..జోడుగుంటా 

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా
ఏ పిల్లకున్నదిరో నీతో జోడా
నీ నీడవుంటే... మేడకడతా
నువు తోడు ఉంటే... జోడుగుంటా 

అహా..అహహా..ఒహోహో..
అహువా..అహువా
వహవహ అహవహవహా..ఆ 

చరణం: 1 
ఒంటిగుంటే ఒంటిగుంట...  
కొడుతుందయ్యో
అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..
రయ్యో..హ్హా
ఒంటిగుంటే ఒంటిగుంట... 
కొడుతుందయ్యో
అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..
రయ్యో 
నా యీడు చూశా... నీతోడు చూశా
నా యీడు చూశా..ఆ..
నీతోడు చూశా..అహా
మల్లెపూల మంచమేసి..
ఎన్నెలంతా పక్కేశా
ఏలా..ఏలా..ఏలకుంటే..
నీకూ నాకూ ఇంతేరోయ్..ఓలబ్బో

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా
ఏ పిల్లకున్నదిరో నీతో జోడా
నీ నీడవుంటే... హా హా హా..మేడకడతా
నువు తోడు ఉంటే... జోడుగుంటా  

అహా..అహహా..ఒహోహో..
అహువా..అహువా
వహవహ అహవహవహా..ఆ

చరణం: 2 
నీ ఫోజు చూస్తే 
మోజు నాలో పెరుగుతున్నాది
నువ్వు సైగచేస్తే 
సన్నజాజి తెల్లబోయిందీ
నీ ఫోజు చూస్తే... 
మోజు నాలో పెరుగుతున్నాది
నువ్వు సైగచేస్తే... 
సన్నజాజి తెల్లబోయిందీ  

రాతిరంత చూసా... నా దారి చూశా
రాతిరంత చూసా..ఆ..
నా దారి చూశా..ఆహోయ్
అందమంతా పందిరేసి..
అందకుండ వచ్చేసా
ఏలా..ఏలా..ఏలకుంటే..
నీకూ నాకూ ఇంతేరోయ్

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా
ఏ పిల్లకున్నదిరో నీతో జోడా
నీ నీడవుంటే... హా..మేడకడతా
నువు తోడు ఉంటే... జోడుగుంటా..ఆ 

అహా..అహహా..ఒహోహో..
అహువా..అహువా
వహవహ అహవహవహా..ఆ


No comments

Most Recent

Default