Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shivaratri Song (2021)





పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ
దర్శకత్వం: దాము రెడ్డి
నిర్మాణం: నూతనపాటి రామకృష్ణ
విడుదల తేది: 07.03.2021


శివరాత్రి పాట సాహిత్యం

 
పాట: శివరాత్రి పాట (2021)
సంగీతం: మదీన్ ఎస్ కె
సాహిత్యం: గోరేటి వెంకన్న
గానం: మంగ్లీ జయశ్రీ

హరహర మహాదేవ శంకరా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ... సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా
అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో... పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా

ఓ  ఓ...గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా
శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ
రంగు లేని నాగమణిమెడలోన వెలుగుచుండ
ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ
వెన్నెలనే తలపై కొలువై చిందులాడ
ఎందుకురా బూడిద నీ నొసట
గిరిజనమే నీకు బంధువులైరిరా
సిరులున్నా మురువవు సిత్రమురా
కలిమి లేమి కష్టము సుఖము
ఓ ఓ... నీతూకములో అంతా ఒకటే

అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళపు సంద్రము నీవే
ఒహో...ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే
ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే

సాధు జంగమా ఆది దేవుడా
హరహర మహాదేవ శంకరా

ఓ ఓ...బిలువమాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల
తలపించేను కమనీయంగా శివుడా నీ లీల
సద్గురు వేదం శంభుని నాదం...
అందాల ఈ సుందర ధామం
నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము

ఈ దినమే గానం ప్రణవ నాదముగా
ఢమరుకమే ధిమిధిమి మోగెనురా
భువి నుంచి గంగ దివికే పొంగెనురా
నటరాజై శివుడే ఆడెనురా
నమః శివాయ సిద్ధనమాయ
ఓ ఓ...సిద్దనమాయ అభిశుద్ధ నమాయ

పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ
కైవల్యం కైలాసం నమః శివాయ
ఒహో అద్వైతం శివతత్వం సదాశివాయ
పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
సంచార జగతినావ తోవ నీవురా
ఆది అంతమేది నీకు లేదురా

అండము నీవే పిండము నీవే
ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే
అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే
అతలసుతల పాతాళం నీ కీర్తనమే
ఒహో...పగలు రేయి తీరాలకు వారధి నీవే
ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే

సాధు జంగమా ఆది దేవుడా
శంభో శంకర హర లింగ రూపుడా
హరహర మహాదేవ శంకరా

No comments

Most Recent

Default