Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Galli Rowdy (2021)




చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సందీప్ కిషన్, నేహా శెట్టి, బాబీసింహా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: యమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది:17.09. 2021



Songs List:



పుట్టెనే ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: రామ్ మిరియాల

పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా...
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు కొంచం ఒట్టేసుకుంట
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట
సెల్లు నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట
మంచి డేటుంటే చెప్పు పెళ్లి చేసేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా

కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగ మెరిసావే ఓ...
మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడవాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంట
నీ టేస్ట్ ఏంటో చెప్పు నేను వంట నేర్చేసుకుంట
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంట
నాన్నకప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంట

పుట్టెనే.... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టేనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా

దోమ తెరలాగా ఉస్సూరని ఉండే నా లైఫు
వెండితెరచేసావే ఓ...
ఒక్క నవ్వుతోనే కుండీ లాంటి బుజ్జి గుండెలోన
ప్రేమవిత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు జెప్పు లిస్టు రాసేసుకుంట
నీ కష్టాలు జెప్పు నెత్తిమీదేసుకుంట
ఏమి కావాలో జెప్పు గిఫ్టు ఇచ్చేసుకుంట
నువ్వు కాదంటే జెప్పు నేను ఉరేసుకుంట

పుట్టెనే... పుట్టెనే...
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నానమ్మా





చాంగురే ఐటెం సాంగురే పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: మంగ్లీ, సాయి కార్తీక్ , దత్తు 

లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లబ్బ లల్లాయిలే
లాయ్ లబ్బ లల్లాయిలే, లాయ్
లాయ్ లాయ్ లబ్బ లల్లాయిలే

ఏ, చాంగురే చాంగురే ఐటమ్ సాంగురే
రాతిరంత పాడుకుంటే రాదు నిద్దరే
(నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే నిద్దరే)

ఏ, ఎప్పుడంటె అప్పుడే… ఎక్కడంటె అక్కడే
నన్ను చూస్తే ఎవ్వడైనా పూలరంగడే
(రంగడే రంగడే రంగడే రంగడే రంగడే రంగడే)
హబబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
హబబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది

ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దూకుతుంటరే
పిఠాపురం పీటసెక్క లాగ
నేను మహాదిట్టం అంటూ ఉంటరే

రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్తాండకేయ
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదీద్దాం ఆయుధ పూజ

కత్తులకైనా అధరవులేరా… ఒంపులకైనా బెదరవులేరా
తాతకి తగ్గా మనవడివేరా… రా రాజా రాజా

నా నడుం మడతలిస్తిరి చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధురవాడ దాకా
నీ పేరు చెప్పగానే కెవ్వు కేక

ఏం చెప్పావే గ్రీకు సుందరీ
స్వర్గంలో వేస్కో మల్లె పందిరి
ఏ, అందరికన్నా పెద్ద కంతిరీ
తీర్చేస్తా నీ తిమ్మిరీ

హబబ్బా నీ ఘనకార్యం సూడాలని ఉందే
నీతో కొత్త యవహారం నడపాలని ఉందే
సీకాకుళం అడ్డరోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తనే
భీమునిపట్నం బీచ్ కాడ
సిత్తరాల సోకుల పొట్లం చేతికిస్తనే




విశాఖపట్నంలో రౌడీ గాడు పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

పిల్ల పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేషం
ఇంతలోనే ఎంత అట్టహాసం
కదిలేను కదా… వీడి ప్రేమ కథ

చెయ్యలేదు వీడు ఒక్క యుద్ధం
చూడ లేడు వీడు కోడి రక్తం
రాడు పట్టినాడు ప్రేమ కోసం
ముదిరెను కదా వీడి ప్రేమ కథ
వీడేమో పడుచోడు… వీడెనక ముసలోల్లు
ఓఎల్ఎక్స్ పీసులతోటి ఏం సాధిస్తాడు

ముందెనకా చూడకుండా… ఫైటింగ్ కే దిగినాడు
ఈ కత్తుల కొట్లాటల్లో ఏమైపోతాడు

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ

టిప్పు టాపుగా ఉండేటోడు… ఎంత రఫ్ గా అయిపోయాడు
రచ్చబండ మీద పంచాయితీ చేస్తున్నాడు
కీ బోర్డు మీదా మనసైనోడు… కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి… ధూకేశాడు

సెంటు కొట్టుకునే డీసెంటు పిల్లగాడే
బెల్టు పట్టుకొని సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే వీడు గేర్ మార్చినాడే
అమ్మో అమ్మో ఆగడే..!!

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు… ఓ మై గాడూ, ఓ మై గాడూ





అడ్డంగా బుక్కైపోయా పాట సాహిత్యం

 
చిత్రం: గల్లీ రౌడీ (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరా భట్ల
గానం: సాయిమాధవ్

బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఘోరంగా ఎలకల నోటికి
దొరికిన పుస్తకమైపోయా
హే, హరహర మహాదేవ దేవా
విడుదల ఇక లేదా లేదా
మలమల మల ఎండల్లోన
పులుసే కారి పోతోందయ్యా

ఏంటో నా రాత రాత
ఈ మలుపున మోత మోత
వీడేమో యముడికి దూత
వదిలేస్తే నేనింటికి పోతా
పులిహోరే పులిహోరే

అడ్డంగా బుక్కైపోయా
విరిగిన అప్పడమైపోయా
ఏ, అచ్చంగా బ్లేడుకి దొరికిన
పెన్సిలు ముక్కను అయిపోయా

ఏ సరదా లేక లేకా… నిదరేమో రాక రాకా
పెడుతున్నా నే పొలికేక
బతికేస్తున్నా రేపటి దాకా
పెంచాలట బాడీ బాడీ
అవ్వాలట రౌడీ రౌడీ
ప్రాణాలే తోడి తోడి
ఆడేస్తున్నరు కబడ్డీ కబడ్డీ
పులిహోరే పులిహోరే
బట్ రైట్ నౌ… ఐ జస్ట్ వన బి ఫ్రీ
ఐ వన బి ఆల్ ఐ కెన్ బి




తల్లడిల్లిపోద పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default