పాట: యోగితత్వం సంగీతం: SK బాజీ సాహిత్యం: శ్రీ మల్కిదాస్ గారు గానం: మంగ్లీ దర్శకత్వం: దాము రెడ్డి
నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే సాహిత్యం
సంగీతం: SK బాజీ సాహిత్యం: శ్రీ మల్కిదాస్ గారు గానం: మంగ్లీ పల్లవి: నా గురుడు నన్నింక యోగి గమ్మనెనే....(2) నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే.... నా గురుడు నన్నింక త్యాగి గమ్మనెనే.... త్యాగి గమ్మనెనే....జ్ఞాని గమ్మనెనే.. చరణం: 1 మొట్టమొదటా నీవు పుట్టాలేదనెనే... మొట్టమొదటా నీవు పుట్టాలేదనెనే... పుట్టుగిట్టులులేని బట్టబయలయెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా యోగి గమ్మనెనే.....భోగి గమ్మనెనే... చరణం 2: మూలామించుక లేని కీలెరుగుమనెనే... మూలామించుక లేని కీలెరుగుమనెనే... కాలకాలములెల్ల కల్లా జగమనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె యోగి గమ్మనెనే....త్యాగి గమ్మనెనే... చరణం 3: మాయా లేని చొటు మరుగెరుగుమనెనే.... మాయా లేని చోటు మరుగెరుగుమనెనే.... మరుగు నెరుగితే నీవు తిరిగిరావనెనే.. నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా..... యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే... చరణం 1: ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే.. ఉన్న విన్నదిగన్నది సున్నా జేయుమనెనే.. సున్నా జేసియు దాని యెన్నాగవలెననే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా...... యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే... చరణం 5: మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే... మాట లయమయ్యేటి చోటెరుగుమనెనే... మాట మహదేవుపేట మలికి దాసనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె యోగి గమ్మనెనే....భోగి గమ్మనెనే... నా గురుడు నన్నింక యోగి గమ్మనె రాజా... త్యాగి గమ్మనెనే....జ్ఞాని గమ్మనెనే

No comments
Post a Comment