చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019) సంగీతం: వినోద్ యాజమాన్య నటీనటులు: ఆలి, భవ్య శ్రీ దర్శకత్వం: దిలీప్ రాజా నిర్మాత: గుదిబండి. వెంకట సాంబిరెడ్డి విడుదల తేది: 21.09.2019
చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019) సంగీతం: వినోద్ యాజమాన్య సాహిత్యం: రాంబాబు గోశాల గానం: వినోద్ యాజమాన్య, శ్రేయా ఘోషల్ సాకీ: నిన్నే తలచి తలచి నా గుండె కొట్టుకుంటుందే పల్లవి: నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని నువు అవునన్నా కాదన్నా నీలోనే సగమవన నువ్వే ప్రాణమే అని మరువనులే కలనైనా విడువనులే ఏమైనా జతగుంటా చితినైనా మనదొక జగమవనీ పెదవుల దాటిన మౌనము ఈ క్షణమే మరి మరి ప్రేమగ పిలిచెనులే నిను కోరి కోరి కోరి చేరుకున్నా... ప్రియా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 1 ఇది ప్రేమ అని తెలుసు ఇక ఆగదే మనసు నన్ను నన్నుగా ఉండనీయదే మాట విననంటుందా మాయలో పడుతున్నా లోకమే నేనందా నమ్మవన్నదా మన కలయే నిజము అని మన కదయే ఋజువివని ఊహాలకే ఉపిరిలా నీ నవ్వే వరమాయే ఇన్నాళ్ళుగా మనమిద్దరం ఇపుడవ్వుదాము ఒకరికొకరులా నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని చరణం: 2 కలలాంటి నన్ను ఇలా కడలల్లే దోచేవా ప్రాణబంధమై నన్ను అల్లవా కంటి రెప్పైనిన్ను కాచుకుంటా నేను గుండె చప్పుడల్లే ఉండిపోనా గడియైనా విడిపోనీ పయణమిలా మొదలవని నేనుందే నీకోసం అణువణువు నీ సొంతం నీతో ఇలా నడిపించిన మన ప్రేమ అమరమఖిలమేనులే నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నీ తోడు కావాలి నువు అవునన్నా కాదన్నా నీతోనే నేనున్నా నువ్వే కావాలని
చిత్రం: పండుగాడి ఫోటో స్టూడియో (2019) సంగీతం: వినోద్ యాజమాన్య సాహిత్యం: రాంబాబు గోశాల గానం: వినోద్ యాజమాన్య, పల్లవి ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి నీ ప్రేమనే నా గుండెల్లోన దాచి నా ప్రాణమే ఇన్నాళ్లు ఉంది వేచి మనసు మనసు మరి మురిసేనా కనులు కనులు ఇక కలిసేనా కలల వాన జడి కురిసేనా యదన లయల సడి ఎగసేనా మాయ నేదేనా ఈ మాయ నీదేనా హాయి నీదేనా ఈ హాయి నీదేనా ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి చరణం: 1 ఎన్నెన్నో వర్ణాల హరివిల్లై నా సొగసే మీకోసం ఈ క్షణమే విరబూసే నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని పలుకులే నా చిట్టి చిట్టి మనసుని తాకగా తొలి తొలి తొలి తొలి ప్రేమలే ఈ చలి గిలి అలజడి రేపగా అడుగు అడుగు పడు పయనాన అడగలేనులే మౌనాన మొదటి సారి ఈ ధింతననా మురలైంది నీ వలనేనా మాయ నేదేనా ఈ మాయ నీదేనా హాయి నీదేనా ఈ హాయి నీదేనా ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి చరణం: 2 నిన్నే చూడకుంటేనే ఊపిరాగేలావుంది నువ్వెదురే వస్తుంటే బాగుందే నా మది నది పరుగులు తీసెలే నీ జతకది సులువుగా చేరెలే పరువపు పదనిస మోగెలే నా తలపులు ఊగిసలాడెలే ఆశ ఆశ పడి పిలిచేను నిన్ను చూసి తపియించేను ఎంతో ఇష్టపడు తున్నాను ఇపుడే నాకు ఇది తెలిసేను మాయ నేదేనా ఈ మాయ నీదేనా హాయి నీదేనా ఈ హాయి నీదేనా ఓయ్ పండూ నువ్వెంతో బాగా నచ్చి ఓయ్ పండూ నేనైపోయాను పిచ్చి

No comments
Post a Comment