చిత్రం: కళ్యాణ తిలకం (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: మోహన్ బాబు, జయసుధ
దర్శకత్వం: బి.భాస్కరరావు
నిర్మాత: ఆర్.కేతినేని
బ్యానర్: కేతినేని పిక్చర్స్
విడుదల తేది: 1985
గమనిక: సాహిత్యం మారియు నేపద్యాగానం ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు.
పల్లవి:
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా
నువ్వు నేనూ ఒకటంట
చరణం: 1
చిన్ననాటి పచ్చబొట్టివేళ ముచ్చటైన పెళ్లిబొట్టు కాగా
కుర్రదాని చెయ్యి పట్టగానే గుండెనిండ వెన్నెలాయే కాదా
నీతో నడిచే వరమే ఛాలు
వలచే వడిలో క్షణమే చాలు
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా
నువ్వు నేనూ ఒకటంట
చరణం: 2
చందమామ అందమంత దాచి ఏరికోరి చేరుకుంది నన్నే
కోరుకున్న కొమ్మ నీడలోనే కోయాలమ్మ పాడుతుంది గీతం
నీలో నాలో ఒకటే రాగం
నువ్వే నన్ను నడిపే దీపం
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా
నువ్వు నేనూ ఒకటంట ఎడబాటన్నది రాదంట
స్వర్గం వద్దే వద్దంట కమ్మని కౌగలి ఇమ్మంటా
నువ్వు నేనూ ఒకటంట
No comments
Post a Comment