Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Zombie Reddy (2021)
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
నటీనటులు: తేజ సజ్జా, ఆనంది, దక్ష నగర్కార్
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర్ వర్మ
విడుదల తేది: 05.02.2021Songs List:గో కరోనా పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: అనుదీప్, శ్రీ కృష్ణ, నమ సింగ్

ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా
రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటమా
ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా
మా వీపు పగిలే వరకు మానుకుంటమా
హే వడియాలు ఆరబెట్టి వాడలంత ఉంటాం
మా బ్రాండు ఉప్పు కోసం ఊర్లు తిరుగుతుంటాం
మా చింత చెట్టు కింద పేకలాడుకుంటాం
ఇవన్ని చేసి కూడా పాట పాడుకుంటాం

గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో (2)

ఏ రోగం అయితే ఎందీ
మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్
ఈ వైరస్ పీకేదేంది
మా జేబు నిండ పారాసిట్మల్
మా రాష్ట్ర బడ్జెట్ అంతా వైన్ షాపులుంది
కాబట్టే మందు కొరకు రోడ్డు నిండ మంది
ఏది ఏమైనా కాని మత్తు వదలమంది
లాక్ డౌన్ పెడితే ఏది ఉచ్చ ఆగదండి

ఆన్ లైన్ లో పాటాలంటాం
బ్యాక్ గ్రౌండ్ లో పాటలు వింటాం
సిక్సు ప్యాకు కలలే కంటు
ఏప్పుడు చూసినా తింటాం పంటాం

సరికొత్త వంటలు చూస్తాం
మంటెట్టి పెంటే చేస్తాం
ఇన్స్టాంటు నూడుల్ చేసి
ఇన్స్టాలోన బిల్డప్ ఇస్తాం
మ్యాచింగు మాస్కులు వేస్తాం
మరు నిమిషం జేబులో దాస్తాం
దగ్గొచ్చినా తుమ్మే వచ్చినా
పూలతో డాక్టర్ పూజలు చేస్తాం

సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం
సానిటైజర్ స్నానం చేస్తాం
సీక్రెటుగా పార్టీ పెట్టి 
హత్తుకు పోతాం హత్తుకు పోతాం

ఎత్తుకు పోతాం ఎత్తుకు పోతాం (3)


హే చప్పట్లు కొట్టామంటే పీఎం
హే పళ్ళెంతో చావు డబ్బులేద్దాం
హే చీకట్ల పెట్టామంటే దీపం
హే అడ్వాన్స్ దీపావళి చేద్దాం

ఇల్లే హెల్ అయిపాయే... ఐపాయ్
ఒల్లే గుల్లైపాయే... ఐపాయ్
పెళ్ళే లొల్లై పాయే... ఐపాయ్,
పిల్లే తల్లై పాయే


గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో
గో కరోనా గో కరోనా గోగో (4)
Zombie Reddy Theme పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: అనుదీప్ దేవ్, పి. వి. యన్. ఎస్. రోహిత్, రఘురాం ద్రోణవజ్జల , మార్క్ కె.రాబిన్

కళ్ళు ఎర్రగా గోళ్ళు నల్లగా
వళ్ళు చల్లగా చావు మెల్లగా
ఆకలాగక ఊగే నాలుక
తనివి తీరగా నిన్ను కొరుకుతా

కొరుకు కొరుకు కొరుకు కొరుకు
నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికే వరకు ఉరుకుతా (2)

మనిషి కరిచెనే  మెదడు దొబ్బెనే
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
దొరికే దేహమే రక్త దాహమే
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
వావి వరుస లేనే లేదు
వాసనొస్తే వల్లకాడు
రాత్రి పగలు తేడా లేదు
ఊరు వాడ వల్లకాడు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

నన్ను పొడిచినా నొప్పి లేదులే
కాలు నరికినా అడుగు ఆగదే
పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా
నరుల జాతినే రూపు మాపుతా

కొరుకు కొరుకు కొరుకు కొరుకు
కొరుకు కొరుకు కొరుకు కొరుకు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

తొడలు కొట్టే వీరులైన 
మెదడు కొరుకుతాను నేను
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి
కలికాలమందు యముడు నేను
కాలయముడు మొగుడు నేను
జాంబీ రెడ్డి జాంబీ రెడ్డిబర్న్ డౌన్ పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: హారికా నారాయణ్ 
గానం: హారికా నారాయణ్ 

బర్న్ డౌన్
గేమ్ అఫ్ లైఫ్ పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: మామ సింగ్
గానం: తరుణ్ జైన్ , మన్మోహన్ రాజ్, మార్క్ కె. రాబిన్ 

గేమ్ అఫ్ లైఫ్ నాటుకోడి పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: నాగేంద్ర
గానం: మార్క్ కె రాబిన్

పెద్దాపులి
బోనులోకి
నాటుకోడి
దుమికే చూడు హా
పులి ఆకలికి 
అది ఏటే ఐతదా
లెక్కే తప్పి 
కోడి కోటే దాటేనా

ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్... 
ఆయ్యో... ఆయ్యో...
కోడి దాటేను 
కోడి దాటేను 
కోడి దాటే...
దాటే... దాటే...
ఓం త్రయంబకం పాట సాహిత్యం

 
చిత్రం: జాంబీ రెడ్డి (2021)
సంగీతం: మార్క్ కె.రాబిన్
సాహిత్యం: శివ శక్తి దత్తా
గానం: కాలభైరవ

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ

పురంధర 
హరోం హర హర హర హర హర హర
హరోం హర హర 
హరోం హర హర హర హర హర హర
పురంధర
హరోం హర హర 
హరోం హర హర హర హర హర హర
హరోం హర హర 

ప్రళయ భయంకర, విష విలయంకర
విధి వికృత విన్యాసం
మారణహోమ విషానల కీలల
మరణమృదంగ ధ్వానం
ఒక మహమ్మారి లయ తాండవం
కాలాగ్ని దగ్గ జన కాండవం
ఆయంభయంకర సంతుల
విధ్వంసంకర సంకట సమయం
సంఘమరణవినివారణ తరుణం
శంకరా త్వమేవ శరణ్
అభయంకరా త్వమేవ శరణ్

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ

సహస్ర, సహస్ర సంఖ్యా నియమం
తంత్ర పిశాచ సమూహం
త్రినేత్ర జగత్రయేశ్వర సహయుస్వీయంత్రాహం
దుష్ట సమూహం ప్రతిఘటన
శక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ
ప్రజా ప్రాణ రక్షణ దక్ష
యుక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ

త్రిపురంజయ సమరంజయ
అసురంజయ మృత్యుంజయ
త్రిపురంజయ సమరంజయ
అసురంజయ మృత్యుంజయ
పురంజయ

జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ త్రికుంజయ


No comments

Most Recent

Default