-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Srinivasa Mangapuram (2026) Telugu Songs Lyrics Album Cover

Srinivasa Mangapuram (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Srinivasa Mangapuram (2026)
Music : G. V. Prakash Kumar
Actors : Jaya Krishna
Actresses : Risha Thadani
Supporting Cast : Mohan Babu
Director : Ajay Bhupathi
Producers : C. Ashwini Dutt, Gemini Kiran
Release Date : 2026

Alelle Alelle Song Lyrics in Telugu – Srinivasa Mangapuram (2026)

'Alelle Alelle' song from Srinivasa Mangapuram (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by G. V. Prakash Kumar, Haripriya.

SONG INFORMATION
Movie : Srinivasa Mangapuram (2026)
Lyricist : Srimani
చిత్రం: శ్రీనివాస మంగాపురం (2026) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: శ్రీమణి గానం: జి.వి.ప్రకాష్ కుమార్ , హరిప్రియ ఈ హృదయం.. చూడదే.. చీకటిని.. నీ చెలిమి చేరదని.. నా ఊపిరి.. అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే.. అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే.. పీల్చే శ్వాసలాగా.. మార్చుకోరా నన్నిలా కాలం చివరి దాకా.. నడిచి రారా తోడులా ఆటంబాంబు తాకినా చెక్కుచెదరని హృదయం నాదంటా నాటు తూటాలా వాటమే తేనే ఊటలా మార్చసావంటా చచ్చిపుడుతున్నా ఇకపైన ప్రాణంగా అడుగైనా నీతోనే జీనా మర్నా.. అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే రాయిలో.. హాయికి.. రేయిలో.. రంగుకి.. ప్రాణమే.. నీ ప్రేమనే.. ఈ రాయిని మలిచేసావులే.. ఈ రేయిని వెలిగించావులే.. నీ రూపమే నా లోపలే నింపేసినావులే.. అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే.. కల్లలో నీరులే.. రాదుగా నిద్దురే ఓ క్షణం నిను వీడితే.. ఆ నీరుని కాల్చేస్తానులే.. నిదురని నరికేస్తానులే.. నీ జంటనే వీడే క్షణం నా ఊపిరాగులే.. అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే.. అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే..

Manga Manga Song Lyrics in Telugu – Srinivasa Mangapuram (2026)

'Manga Manga' song from Srinivasa Mangapuram (2026) movie is composed by G. V. Prakash Kumar and sung by L. V. Revanth.

SONG INFORMATION
Movie : Srinivasa Mangapuram (2026)
Lyricist : Kasarla Shyam
Singers : L. V. Revanth
చిత్రం: శ్రీనివాస మంగాపురం (2026) సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: ఎల్.వి.రేవంత్ ఏ మంగా హే మంగా దేవతవే కచ్చితంగా ఏ లోకం నుండి ఊడి పడ్డావే ఏ మంగా హే మంగా శీనునే కరుణించంగా ఈ ఏడు కొండలు చేరి ఉంటావే ముక్కే మూసేసుకొని బక్క చిక్కేలా నేను మొక్కులెన్నో మొక్కి ఉంటానే రెక్క కట్టేసుకొని చుక్క చక్కంగా వచ్చి చుట్టు వెలుగులిట్ట నింపావే గుంపులో గోవిందయ్యను కాదే గుండెలో నిన్నే నింపేసుకున్నానే నా కోసం నువ్వు పుట్టేసావే నువ్వే లేకుంటే ఒక్కన్నే సచ్చిపోనమ్మో ఏ మంగా చూసే కళ్ళే నావే మంగా నవ్వే పళ్ళే నావే మంగ మొత్తం ఒళ్ళే నాదే దాచేసుకుంటానే ఏ మంగ గుండె కొట్టిస్తానే పొర్లు దండాలు పెట్టేస్తానే మంగా నీకై పస్తుంటానే ప్రేమిస్తున్నానే ఏ నువ్వెల్లే ప్రతి దారి పిలుస్తోంది ఈ గాలుల్లో నీ ప్రతి శ్వాస తెలుస్తోందే మనసే ఉంటే నా మనసున గుణమే నీకు వినిపిస్తుందే ప్రేమే ఉంటే నీ చుట్టూ తిరిగేటి నా ప్రేమే నీకు కనిపిస్తుందే మంగా కళ్ళే నొక్కేస్తానే మంగా గొళ్ళే సవరిస్తానే మంగ ముద్దులు పెట్టేస్తానే నిమిషం కోసారే మంగ నన్ను తీసేయ్యద్దే మంగ నన్ను తోసెయ్యద్దే మంగా ఆశలు కోసెయ్యద్దే వస్తా ప్రతిసారే హే మంగా హే మంగా నీ చేత్తో కమ్మంగా ఆ గోరు ముద్దలు ఎప్పుడు పెడ్తావే హే మంగా హే మంగా నా ఒళ్ళో క్షేమంగా ఓ ముద్దు ముచ్చటలెప్పుడు చెప్తావే నువ్వే ఒప్పేసుకుంటే పెళ్ళే చేసేసుకుంటే ఏకంగా గుడి కట్టించేస్తానే పుట్టే పిల్లాడికేమో వెంకటేశులు పేరే పెట్టి గారబంగా పెంచేసుకుంటానే నువ్వే నేనని మనసే నీదని ఓ క్షణమే నువ్వు చెప్తే చాలమ్మో ఎవరేమైనా ఏదేమైనా ఉంటా నేనుంటా నీతోనే ఉంటానే చివారంటా ఏ మంగా చూసే కళ్ళే నావే మంగా నవ్వే పళ్ళే నావే మంగ మొత్తం ఒళ్ళే నాదే దాచేసుకుంటానే ఏ మంగ గుండె కొట్టిస్తానే పొర్లు దండాలు పెట్టేస్తానే మంగా నీకై పస్తుంటానే ప్రేమిస్తున్నానే

Palli Balakrishna Sunday, May 17, 2026



చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్ 
దర్శకత్వం: ధనుష్ 
నిర్మాతలు: ఆకాష్ భాస్కరన్, ధనుష్
విడుదల తేది: 01.10.2025



Songs List:



కొత్తగుందే పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: కృష్ణ తేజస్వి , శ్వేతా మోహన్ 

కొత్తగుందే 



ఎన్నాళ్ల కొచ్చాడే పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: ఆనంద్ సీరాజ్, హేమచంద్ర 

ఎన్నాళ్ల కొచ్చాడే



మాయియా దీవెనలు పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: కృష్ణ తేజస్వి

మాయియా దీవెనలు 



ఎందరో చెప్పిన మాటే కదా పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: కృష్ణ తేజస్వి 

ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా
కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

మట్టి వాసన గుర్తుంచుకో
నీ తండ్రి ఆశే దాగుందిగా
చిక్కి చితికిన విత్తనంలో
ఓ వంశ వృక్షమే దాగుందిగా

తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే
బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే
పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే
అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే

ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా
కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

వెక్కిరింతలు లెక్కచేయకు..
వెక్కిరింతలు లెక్కచేయకు
పళ్ళున్న చెట్టుకు అలవాటేగా
కలత చెందకు చందమామకే
ఏటేట చవితికి నిందలేగా

ఓటమన్నది గురువు కదరా ఓర్పుతో నువ్వు గెలవవా
రేపుకే దిస్క్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా
నీరు నేల ఆకాశం నీపై చూపెను పాశం
దారే తప్పిన పాదాలు గాడిన పడితె సంతోషం

తర తరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే
బాధ్యతగ కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే
పేగు బంధమె ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే
అడుగు పెడితే గడప నవ్వెను గర్భ గుడి స్వగ్రామమే

ఎందరో చెప్పిన మాటే కదా
కళ్ళ ముందరే ఉన్న దారే కదా
కొందరే ముందన్న తీరొద్దికా
కష్ట పడ్డోడికే దైవం తోడుండదా

మట్టి వాసన గుర్తుంచుకో
నీ తండ్రి ఆశే దాగుందిగా
చిక్కి చితికిన విత్తనంలో
ఓ వంశ వృక్షమే దాగుందిగా



కులదైవం తోడే నీది పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: సుధీష్ సాయికుమార్ 

కులదైవం తోడే నీది 



మై హార్ట్ స్పిన్నింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇడ్లి కొట్టు (2025)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: సామ్రాట్ నాయుడు 
గానం: యస్.పి. అభిషేక్ , సుబ్లాహషిని

మై హార్ట్ స్పిన్నింగ్ 

Palli Balakrishna



చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి సుశీల , పిఠాపురం నాగేశ్వరరావు, యస్ జానకి, పి.బి శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం
నటీనటులు: జె.వి.రమణమూర్తి,, దేవిక,  మీనాకుమారి, రాజనాల
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాత: టి.ఆర్.సుందరం
విడుదల తేది: 30.07.1960



Songs List:



పంట నీటి గుంట కాడ పాలపిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.బి.శ్రీనివాస్ బృందం

పంట నీటి గుంట కాడ పాలపిట్ట పరిగి పట్ట 



తీగమల్లె పూసెనురా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.బి.శ్రీనివాస్

తీగమల్లె పూసెనురా తోటమాలి చూసెనురా
ఆటబోతు దాటులేసి తోట దారి పట్టేనురా 
గంగిరెడ్ల గంగన్నా నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగమల్లె పూసెనురా 



బండి నడిపించి శాయమేకుండాలి పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్

బండి నడిపించి శాయమేకుండాలి 
బ్రతుకు నడిపించ నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి



కొక్కొరకో కో యేటంచు ఎలుగెత్తిన (పద్యం) సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పిఠాపురం

కొక్కొరకో కో యేటంచు ఎలుగెత్తిన (పద్యం)



మాటడవేలరా రాజ మోమాటమేలరా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.సుశీల

మాటడవేలరా రాజ మోమాటమేలరా మరులు మీరి నినుకోర



సనచీర కట్టింది సనజాజులు పెట్టింది పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.సుశీల, మాధవపెద్ది బృందం

సనచీర కట్టింది సనజాజులు పెట్టింది



దబ్బరసం బలే నార దబ్బరసం పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: ఎస్.జానకి, మాధవపెద్ది

దబ్బరసం బలే నార దబ్బరసం ఒకే దెబ్బతోనే జబ్బులన్ని 



కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: మాధవపెద్ది , పి. సుశీల

కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే కొట్టు



చిన్నిపాపా నన్ను కన్నపాప పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.సుశీల

చిన్నిపాపా నన్ను కన్నపాప అన్నమాట విన్నావా చక్కని పాపా 



ఇంతేనా బ్రతుకింతేనా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: పి.సుశీల 

ఇంతేనా బ్రతుకింతేనా అంతేకానని పెను చింతేనా




యిల్లాలి మెడలోని మాంగళ్యమందే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1960)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం: జి.కృష్ణమూర్తి
గానం: మాధవపెద్ది

యిల్లాలి మెడలోని మాంగళ్యమందే యిలలోని మగవాని (పద్యం) 

Palli Balakrishna Saturday, May 16, 2026



చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, లలితా సాగరి, నాగూర్ బాబు
నటీనటులు: శోభన్ బాబు, శరత్ బాబు,  రాధిక, జీవిత 
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి 
నిర్మాతలు: వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబు
విడుదల తేది: 02.09.1988



Songs List:



అందాల మరదలా ఆడపడుచు పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: పి. సుశీల, నాగూర్ బాబు, లలితా సాగరి, యస్.పి.బాలు 

అందాల మరదలా ఆడపడుచు



అందాలు ఆవురావురన్నాయి సందేకాడ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: పి. సుశీల,, యస్.పి.బాలు 

అందాలు ఆవురావురన్నాయి సందేకాడ



నిన్న పూలతోట నేడు గాలిపాట పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: నాగూర్ బాబు 

నిన్న పూలతోట నేడు గాలిపాట 




మరులే చిలికే మన్మధ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , యస్.జానకి 

మరులే చిలికే మన్మధ చిలకా

Palli Balakrishna



చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సీతారామశాస్త్రి, జాలాది, భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాసూరావు
నటీనటులు: ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
విడుదల తేది: 30.07.1993



Songs List:



ఏమని చెప్పనులే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: జాలాది 
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఏమని చెప్పనులే 



సందింట్లో సరిగమ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

సందింట్లో సరిగమ




ఆ నింగి పుట్టినరోజే... పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: ఎస్.పి.బాలు 

ఆ నింగి పుట్టినరోజే...




కనరండి కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

కనరండి కళ్యాణం



రా రంభోలా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, వాసూరావు

రా రంభోలా

Palli Balakrishna



చిత్రం: స్వప్న సుందరి (1950)
సంగీతం: సి. ఆర్. సుబ్బరామన్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి 
నిర్మాత, దర్శకత్వం: గంటసాల బలరామయ్య 
విడుదల తేది: 10.11.1950



Songs List:



Palli Balakrishna



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి.సుశీల, జిక్కీ, పి.బి.శ్రీనివాస్, నాగేంద్ర 
నటీనటులు: కాంతారావు, హరినాథ్, రాజశ్రీ 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జననీ భద్రకరాళ కాళి భగశా పద్యం సాహిత్యం

 

పద్యం: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల

మందారవల్లి:
జననీ భద్రకరాళ కాళి భగశా 
జ్వాలా ముఖీ భైరవీ
తిను నా భావన వాక్కు కర్మల సదా 
నేనమ్మి పూజించితీ
వినవా నా మొర దిక్కు నీవె 
దయతో వీక్షించి రక్షించవా
పెను ఆపత్తున మిత్రుతో బడిన 
నా ప్రాణేశు కాపాడవా



నా కోటి స్వప్నాలు పద్యం సాహిత్యం

 

పద్యం: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

మదనకమరాజు:
నా కోటి స్వప్నాలు నిజముగా చేయగా 
దివినుంచి భువికి ఏతెంచినావె 
వయ్యార మొలికించి వరమాల చూపించి
నారాక కోసమే నిలచినావె 
అరమోడ్పు నేత్రాల ఆనురాగ సుధ జార
నిలువు నిలువున పుల్కలు నింపినావె 
కదలికే లేని నీమధుర అధరాలతో 
మానముగ ఆహ్వాన ముపినావె
వలచి పిలచిన ముద్దార పలుక వేమె 
చెలిమి కోరిన నాపైన అలుక ఏమె 
జాలమాయను చాలనీ వలసినావె 
జాలి చూపించి రావె నన్నేలు కోవే



చిక్కును విప్పవె చినదానా పాట సాహిత్యం

 
పాట: 1

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ, నాగేంద్ర 

తిమ్మరాజు : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవ్ నామైనా

సుందరి : ముక్కు తెలియదూ, మొగం తెలియదూ
చిక్కెదనా చినవాడా

తిమ్మ : నడుం ఒంపుతో నడక సొంపుతో
గుండెలు గుబ గుబలాడా

సుందరి : ఎక్కడోడవో- టక్కరోడనీ
నక్క జిత్తులూ తెలినే

తిమ్మ :ఉండి పోయనే ఉంగరాల
నీ ముంగురు లందున మనిశే
సుందరి ఒల్లను నే

తిమ్మ : వెళ్ళను నే
సుందరి : ఒల్లనోయి పొమ్మన్నా

ఇద్దరు : హా! హు! హే! చ! 

తిమ్మ : చిక్కును విప్పవె చినదానా 
చిక్కితి వలపుల వలలో నా 
మొక్కుచు వున్నా ఒట్టు పెట్టినా 
మక్కువ చూపవె నామైనా 

సుందరి : ఒంటిదానితో కొంటి చూపులూ 
తుంటరి తనమూ తగదూ
తిమ్మ : ఒప్పుకుంటివా తప్పకుండ 
నీ కాళ్ళకు గజ్జెలు కడుదూ

సుందరి: కల్లకబురులూ కాని మాటలూ 
కన్నెపిల్ల ఎద టేలా!
తిమ్మ : వల్ల కొదనా-వీలు లేదనా- వల్లకాడె బ్రతుకెల్లా!
సుందరి : తగ్గాలి 
తిమ్మ : సిగ్గేలా 
సుందరి : తగ్గవోయి పోతున్నా!
తిమ్మ :చిక్కును విప్పవె చినదానా చిక్కితి వలపుల వలలో నా
వెక్కుచు వున్నా ఒట్టు పెట్టినా మక్కువ చూపవె నామైనా





ప్రేమతో సరియైనదీ పాట సాహిత్యం

 
పాట: 2

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరియైనదీ 
భూమిలో ఏమున్నదీ 
అనుభవించూ అనుభవించూ 
అమర సౌఖ్యమదీ 
పసిడి పొంగుల ప్రాయములో 
పులకరించే వయ్యారమూ 
తళుకు చూపుల భావములో 
తొలికి పోయే శృంగారమూ 
వలపులోని విలువకోరు 
వన్నెలాడిని—వరు డెవ్వరూ

నీవే! నీ వే! నీవే!

కుమిలి పోవుటే నరకమురా 
కులుకుటే సుఖ స్వర్గమ్మురా 
యినుప సంకెల యింకేలరో 
వలపు గొలుసుల బంధింతురా 
మేరులుమీరా-మనసు తీరా 
మేచ్చినానురా - నను చూడరా-





ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
పాట: 3

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 
హృదయము దోచి మది రగిలించీ దాగి పోతావా

ఓ ప్రియతమా!

పూవులు పూయా- కోయల కూయా 
నీవే మనసున మెరిసేవోయీ

కన్నులలోన- వెన్నెలలోనా 
కాంతి కళలు- నీవై కలచేవూ 
వేదన తీరే దారియె లేదా 
బ్రతుకే బరువాయే   

ఓ ప్రియతమా!

శత జన్మాల జత మనదోయీ 
మది మందిరమున నిలచేవోయీ 
నీపై వలపే నాతలపాయే 
తెలిపే రీతి తెలియగద దాయే 
వేయి కన్నులతో వెదకుచు నీ కై 
వేచి యున్నానోయ్-





నీలి మేఘమాలవో పాట సాహిత్యం

 
పాట: 4

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నీలి మేఘమాలవో 
నీలాల తారవో 
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

||నీలి మేఘమా!||

నీ మోములోన జాబిలీ దోబూచులాడెనే 
నీకురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే 
నిదురించు వలపు మేల్కొలి దాగిపోదువో

||నీలి మేఘమా!||

నీ కెంపు పెదవి తీయనీ కమనీయ కావ్యమే 
నీవలపు తనివి తీరని మధురాల రావమే. 

||నీలి మేఘమా!||

నిలచేవదేల సాపిలుపు ఆలకించవో 
రాదేల జాలి ఓ చెలీ యీమౌనమేలనే 
రాగాల తేలిపోదమే జాగేల చాలు నే
రావే యుగాల ప్రేయసీ సన్నాదరించవో

||నీలి మేఘమా!||




నీలి మేఘమాలవో - డ్యూయెట్ పాట సాహిత్యం

 
పాట: 5

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

మదన : నీలి మేఘమాలవో నీలాల తారవో 
నీసోయగాలతో మదినీ దోచి పోదువో
రత్నావళి : నీలి మేఘమాలనో నీలాల తారనో 
నా సోయగాలతో - మదినీ దోచి పోతినో

మదన: నీరాక కోసమే చెలి నేవేచియుంటినే
రత్నావళి : ఆరాటమేలనో ప్రియా నేచెంత నుంటినే
ఇద్దరు: ఆనంద మధుర గీతములా ఆలపింతమా

||నీలి మేఘ||

రత్నా రళి : చివురించు వలపు తీవెల- విరిపూలు పూయగా
మదన : చిరునవ్వు విరుపులోపల హరివిల్లు విరియగా
ఇద్దరు నెలవంక నావలోన మనమూ కలసి పోదమా

||నీలి మేఘ||

రత్నావళి : మనలోన కలత మాయమై మన ఆశ తీరెగా
మదన : అనురాగ రాగమే యిక మనరాగమాయెగా
ఇద్దరు : మనసార ప్రేమ మాధురులా సాగి పోదమా




తేలిపోదామా-యీహాయిలోనా పాట సాహిత్యం

 
పాట: 6

చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

డ్యూయెట్ సాంగ్ :

రత్నావళి : తేలిపోదామా-యీహాయిలోనా
మదన : గాలిలో పూవులై
ఇద్దరూ : తేలిపోదామా యీహాయిలోనా
మదన : కన్నులలోని కాటుక నై- నే
కరుగుచు నీలో కలిసెద నే
రత్నావళి : హృదయములోని కదలిక నై- నే ముదమలరించి మురిసేద నే
మదన : కామిత మీడేరే కొనుకగా మారే 
రత్నావళి : కలయె నిజమాయే

||తేలిపోదామా||

రత్నావళి : వెన్నెలలోని ''వెలుగే మీరూ
మదన : వెలుగున దాగే చలువే నీవూ
ఠత్నా : సుందరమా నా స్వప్నమె నీవూ
మదన : స్వప్నములోని స్వర్గమె నీవూ
రత్నా భూమిని మనసాటి
మదన : ప్రేమికులే లేరు
ఇద్దరూ : బ్రతుకే వలపాయే


Palli Balakrishna Monday, May 4, 2026



చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, దాశరథి, జి.కృష్ణమూర్తి 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, యస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి 
నటీనటులు: కాంతారావు, రాజనాల, యస్.వరలక్ష్మి, రాజశ్రీ, ఎల్.విజయలక్ష్మి, గీతాంజలి, బాలమణి 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: సుందర్ లాల్ నహత 
విడుదల తేది: 28.01.1965



Songs List:



అదుగో అదుగో పూదోట పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్. జానకి

అదుగో అదుగో పూదోట
ఎదురై ఆడెను సయ్యాట. 
రారేమె, రారేమె చెలులారా 
ఈరోజు ఆడాలి మనసారా

॥అదుగో అదుగో॥

కొమ్మ కొమ్మలో కోయిల గానం 
"కో"యని సాగినది.
రెమ్మ రెమ్మలో కమ్మని రాగం 
రిమ ఝిమ లాడినది

చిగురులు వేసి, సొగసుగ పూచీ 
జగమే నిగనగ లాడినది

॥అదుగో అదుగో॥

అల్లనసాగే అందెలు తామే ఘల్లున మ్రోగినవీ 
పిల్లగాలిలో ఉల్లము తానే జిల్లున రేగినది -

పరుగులు తీసి పందెము వేసి 
పరువము జలజల పారినది

॥అముగో అదుగో॥




గుర్రమెక్కి పోతున్న పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల 

గుర్రమెక్కి పోతున్న 
ఎర్రబుగ్గల చిన్నోడా
కుర్రదాని సంగతేమిరా 
దాని కోడెవయసు చూడవేమిరా!

మంచినీళ్ళ బావికాడ మాటాడాలనుకొంటి 
మామిళ్ళ తోటలో మనసియ్యా లనుకొంటి 
ముస్తాబై వుంటి - వస్తావనుకుంటి
చుక్కపొడిచేదాకా - చూస్తూనే కూసుంటి

జొన్నకండె లిస్తాను జుంటి తేనె లిస్తాను 
ఎన్నడు వాడిపోని కన్నెవలపు లిస్తాను 
తోడుగ వస్తాను - జోడుగ వస్తాను 
నీ నవ్వుకోసం నా ప్రాణమైన యిస్తాను




మరి మరి రాదూ మదుర క్షణమూ పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: యస్. జానకి 

మరి మరి రాదూ మదుర క్షణమూ 
ఉందోయి నీముందే ఆనందించుము

గాలివీవన నీకోసం పూలవాసన నీకోసం 
తార కులికే నీకోసం కోరవలపే నీకోసం 
దాచిందీ యీ లోకం రా _ దోచుకుందము

మీటవోయ్ వీణ మ్రోగుతందీ 
కోటి స్వరముల తూగుతుందీ 
మోటతనమే మానవోయీ 
పాట నడుమనే ఆగునోయీ 
రంగేళి నా రాజా రాగాల సాగుము 



కోటికి ఒక్కడులే నాబావా! పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి

కోటికి ఒక్కడులే నాబావా! 
చేతికి చిక్కెసులే నాబావా! 
తై తై లాడిస్తా - ఎంతో ఊరిస్తా 
ఏమేమో చేసేస్తా బలే బలే బలేగా

తీయని సన్నాయి పలుకును రేపే 
తీరని కోరిక తీరును రేపే 
మనసున మల్లెలు నవ్వును రేపే 
కిలకిలకిలమని కుషీ కుషీగా

ముక్కుకు తాడేసీ నాతో నడిపిస్తా 
టక్కరి బావను దారికి తెచ్చేస్తా 
చెబితే వినకుంటే చెళ్ళున వడ్డిస్తా
వలపులు చిలికిస్తా అలా అలా అలాగా



రమ్మన్నావని రాలేదు పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

రమ్మన్నావని రాలేదు 
పొమ్మన్నావని పోలేను 
కలలో ఎందుకు కనపడలేదని 
అడగాలనుకున్నాను

కత్తులు విసిరిన చేయి 
కండలు తిరిగిన చేయి 
మెత్తని పువ్వుల గుత్తులు నాపై 
మెల్ల మెల్లగా విసురుతువుంటే 
చూడాలనుకున్నాను

పచ్చిక పానుపుపైన 
విచ్చిన వెన్నెలలోన 
ముచ్చటలెన్నో మురిపాలెన్నో 
ముద్దు ముద్దుగా తెలుపుతువుంటే 
విందామనుకున్నాను



ఔననవు కాదనవు పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి  
గానం: పి. బి. శ్రీనివాస్

ఔననవు కాదనవు 
మౌనమేలనే చెలి 
ఏమను. ఏమనను 
ఎదుట నిలిచె జాబిలి

తొందర నడకలు చాలు 
కందును నీపాదాలు 
ఎదిగిన వలపులు 
ఎదలో కదలగ -ఏదో చక్కిలిగిలి

సిగ్గుల భరిణవు నీవు 
నాచేతికి అందకపోవు 
అందము నీ కనువిందుల 
సేయగ_ఎందుకులే కౌగిలి




పండగ చేతము రారమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: విజయ సింహా (1965)
సంగీతం: రాజన్ నాగేంద్ర 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి 

పండగ చేతము రారమ్మా 
మన చిట్టి పుట్టినరోజమ్మా 
రేపోమాపో కల్యాణం 
రాణీ కాగల శుభయోగం

నిన్న మొన్న దాక చిన్నారి రెమ్మ 
నేడు నిండైన బంగారు బొమ్మ 
వయసు, సొగసుగల చిలకమ్మా

వాలు చూపులతో బాణాలు వేయు 
కొంటినవ్వులతో ప్రాణాలుతీయు 
అవునే, అవునే, అది నిజమమ్మా

ఎంత వన్నెలాడి వే 
ఎంత చిలిపిదానివే 
నీదేలే, నీదేలే భాగ్యమూ

కనువిందైన అందాలరాజు 
నిను చేపట్టితే బిలేమోజు 
వారెవా, వారెవా, వారెవాహ్వ!

నీ చెలికాని మనసున మెలిగి 
నిమ్మపండంటి పిల్లలు కలిగి 
కలిసి, మెలిసీ, వర్ధిల్లమ్మా

మము మరచిపోదువో 
ఇక మురిసిపోదువో 
నీదెలే, నీదెలే భాగ్యము

Palli Balakrishna Sunday, May 3, 2026



చిత్రం: కెప్టెన్ మిల్లర్ (2024)
సంగీతం: జి. వి. ప్రకాష్
నటీనటులు:ధనుష్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంకా అరుళ్ మోహన్
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాత: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
విడుదల తేది: 12.01.2024

Palli Balakrishna Saturday, May 2, 2026



చిత్రం: మైఖేల్ (2023)
సంగీతం: సామ్ సి.ఎస్
నటీనటులు: సందీప్ కిషన్, వరుణ్ సందేశ్, దివ్యాంశ కౌశిక్
దర్శకత్వం: రంజిత్‌ జయకోడి
నిర్మాత: పుష్కర్ రామ్మోహన్ రావు, భరత్‌ చౌదరి
విడుదల తేది: 03.02.2023



Songs List:



నీవుంటే చాలు పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ (2023)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి
గానం:సిద్ శ్రీరామ్

నీవుంటే చాలు 



పమ్మరె పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ (2023)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మoగ్లి

పమ్మరె



పోరు పోరు పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ (2023)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: వంశీకృష్ణ,రంజిత్ జయకోడి 
గానం: శరత్ సంతోష్

పోరు పోరు 




గార్డియన్ ఏంజెల్ పాట సాహిత్యం

 
చిత్రం: మైఖేల్ (2023)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: శరణ్య గోపీనాథ్ 
గానం: శరణ్య గోపీనాథ్

గార్డియన్ ఏంజెల్

Palli Balakrishna



చిత్రం: పాంచ్ మినార్ (2025)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్
దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, ఎం.ఎస్.ఎం రెడ్డి
విడుదల తేది: 21.09.2025



Songs List:

Palli Balakrishna



చిత్రం: చిరంజీవ (2025)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు
దర్శకత్వం: అభినయ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్
విడుదల తేది: 07.09.2025

Palli Balakrishna



చిత్రం: భ‌లే ఉన్నాడే (2024)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి	
దర్శకత్వం: శివ సాయివర్ధన్
నిర్మాత: ఎన్.వి. కిరణ్ కుమార్
విడుదల తేది: 13.09.2024



Songs List:

Palli Balakrishna

Most Recent

Default