Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. S. Rajamouli"
Varanasi (2027)



చిత్రం: వారణాసి (2027)
సంగీతం: యం.యం.కీరవాణి 
నటీనటులు: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్  
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి 
నిర్మాత: కె.ఎల్,నారాయణ , ఎస్.ఎస్.కార్తికేయ 
విడుదల తేది: 07.04.2027



Songs List:



GlobeTrotter పాట సాహిత్యం

 
చిత్రం: వారణాసి (2027)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం:  శ్రుతి హసన్ , కాలభైరవ 

కాలన్నే శాసిస్తూ
ప్రతి రోజు పరుగేలే
వేగాన్నే శ్వాసిస్తూ
పెనుగులై తిరిగేలే
ఖండాలే దాటేస్తూ
కగరజై వాలే

రారా రారా
ధీర ధ్రువతారా
రారా స్వైర సంచరా

Let In Bang
GlobeTrotter
GlobeTrotter

సంచారి సంచారి
నినదించే రణభేరి
సంహారి సంహారి
మృత్యువుపై తన స్వారీ

సంచారి సంచారి
సహసమే తన దారి
సంహారి సంహారి
అసురలపై అసిధారి

కాలన్నే శాసిస్తూ

GLOBE Trotter GLOBE Trotter
GLOBE Trotter GLOBE Trotter Trotter
GLOBE Trotter GLOBE Trotter
GLOBE Trotter GLOBE Trotter Trotter

సంహారి సంహారి
మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి
సహసమే తన దారి

సంహారి సంహారి
అసురలపై
సహసమే తన దారి
అసురలపై





రణ కుంభ పాట సాహిత్యం

 
చిత్రం: వారణాసి (2027)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం:  ఆదిత్య అయంగర్ 

ప్రళయం ప్రళయం దుష్కృత వలయం
ప్రబలం ప్రచలం దుర్దమ నిలయమ్
అశని పాత అజస్ర ప్రాకారం
తిమిర లోక సమవాకారం

గర్జించే పర్జన్యం
ఘోరాతి ఘోర దౌర్జన్యం
అనవరతం ఆతని వేట
ప్రమాదాలతో సయ్యాట

భీభత్సం అథాని ప్రతాపం
భీతావహ సమర పాతకం
ఆగ్నీయం ఆగ్రహ నేత్రం
అంగాంగం సంగర క్షేత్రం

అసురం చలత్ భీకరమ్
సకల జగన్నాశకం సంక్షోభమ్

రణ కుంభ రణ కుంభ
రణ కుంభ రణ కుంభ
రణ కుంభ రణ కుంభ




The Arrival పాట సాహిత్యం

 
చిత్రం: వారణాసి (2027)
సంగీతం: యం.యం.కీరవాణి 
సాహిత్యం: 
గానం: యం.యం.కీరవాణి 

The Arrival


Palli Balakrishna Monday, April 6, 2026
RRR (2022)



చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
నటీనటులు: రాంచరణ్, తారక రామారావు, అలియా భట్, ఒలివియా మారిస్ 
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: డి.వి.వి.దానయ్య 
విడుదల తేది: 07.01.2022



Songs List:



దోస్తీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, యం.యం.కీరవాణి

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి 
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె

అనుకోని గాలి దుమారం 
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై
నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే 
ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులేవో హో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

ఒక చెయ్యి రక్షణ కోసం
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర
ఒకరేమొ దారుణ శస్త్రం
ఒకరేమొ మారణ శాస్త్రం
తెరతొలగిపోతే ప్రచండ యుద్దమే జరగదా
తప్పని సరియని తరునమొస్తే జరిగే జగడంలో
వాటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ




నాటు నాటు పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడూ నా పాట సూడూ నా పాట సూడూ
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  వీర నాటు 
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా వంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో




జననీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: యం.యం.కీరవాణి & కోరస్

జననీ ప్రియ భారత జనని
జననీ 
మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం.

నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని

జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈ



కొమరం భీముడో పాట సాహిత్యం

 

చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కాలభైరవ

భీమా నిను గన్న నేలతల్లి 
ఊపిరిపోసిన చెట్టుసేమా 
పెరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతోందా

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో
కొమరం భీముడో కొమరం భీముడో
రగరార సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో

కాల్ మొక్కుతా బాంచన్ నని వంగీ తూగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను వంచి తోగాల
జుడుము తల్లీ పేగుకు పెరగానట్టేరో
పెరగానట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

చర్మామొలిసే దెబ్బకు అప్పంటోగాలా
చినికే రక్తం చూసి చెదిరి తోగాలా
గుబులేసి కన్నీరు వలికి తోగాలా
భూతల్లి చనుబాలు తాగనట్టేరో
తాగనట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

కాలువై పారే నీ గుండె నెత్తూరు
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మా కాళ్ళ పారాణౌతుంది చూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు
పుడమితల్లికి జనమ మరణమిస్తివిరో కొమరం భీముడో




రామం రాఘవం పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: విజయప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహ ధవళీశతం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
నటరాజం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం




ఎత్తరా జెండా పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విశాల్ మిశ్రా, పృద్వి చంద్ర , యం.యం.కీరవాణి, సాహితి  చాగంటి, హారికా నారాయణ్ 

పరాయి పాలనపై కాలు దువ్వి 
కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ...

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
ఉజగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే

(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

పంతమున్న కోడే పంజాబి కోడే
దద్దెనన కోడే దంతూరి కోడే
పౌరుషాల కోడే బల్లాసి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

Palli Balakrishna Monday, March 14, 2022
Maryada Ramanna (2010)



చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: సునీల్ , సలోని
దర్శకత్వం: యస్.యస్. రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 23.07.2010



Songs List:



అమ్మాయి కిటికీ పక్కన పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్  శ్రీరామ్
గానం: కారుణ్య, చిత్ర

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది


ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది




ఉద్యోగం ఊడిపోయింది.. పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

ఉద్యోగం ఊడిపోయింది..
పోయిందా...పొ పొ పొ పోయిందా..
సద్యోగం సంతకెళ్ళింది
గోవిందా.. గొ గొ గొ గోవిందా..
గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..
ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..?
కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..?
ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..!
ఛీ అంది.. చేతిలో గీత
నలిగింది.. నుదిటిపై రాత..
టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..
పెదవి ఎండిపోయింది..

పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను..
పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..
ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..
భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను)
జేబు కత్తెర..! (వెయ్యనే లేను)
చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను...
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..
తిక్క తీరిపోయింది
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.




తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యమ్. యమ్. కీరవాణి, గీతా మాధురి

రాయలసీమ మురిసిపడేలా...
రాగలవాడి జన్మ తరించేలా...
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి

పలికే పలుకుల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే....

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి

గీతలే అని చిన్న చూపెందుకు

వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి




రాయే రాయే పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రఘుకుంచే, గీతామాధురి

రాయే రాయే రాయే రాయే రాయే సలోని 



ఉరకలువేయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 

ఉరకలువేయ్ చర చర చర చర చర చర చర చర 
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర

దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై 
వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై 
ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై

పరుగులుతీయ్ ఉరకలువేయ్ 
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర
బిరబిర బిరబిర బిరబిర బిరబిర 
చరచర చరచర చరచర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర 

గుత్తుకకోసే కత్తికొనలు  కత్తికొనలు

గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్ 
మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్

పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర

ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్ 
నిస్సత్తువతో నిలబడనీయ్యక 
ఒక్కోఅడుగు ముందుకువేయ్ 
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై 
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై

పరుగులుతీయ్ పరుగులుతీయ్
ఉరకలువేయ్ ఉరకలువేయ్ 
పరుగులు పరుగులు పరుగులుతీయ్
ఉరకలు ఉరకలు ఉరకలువేయ్
బిరబిర చరచర బిరబిర చరచర 
బిరబిర చరచర బిరబిర చరచర 

హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర

Palli Balakrishna Thursday, August 17, 2017
Vikramarkudu (2006)



చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: రవితేజ, అనుష్క
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: యమ్.ఎల్.కుమార్ చౌదరి
విడుదల తేది: 23.06.2006



Songs List:



డమ్మారే డమ్మా... డమ్మా... పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: ఎమ్.ఎమ్.కీరవాణి
గానం: టిప్పు, చిత్ర

డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే

నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం
మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే

అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు
అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు

నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం
చీకట్లొ నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే
డమ్మారే డమ్మారే డమా డమా డమ్మారే

అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు
అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు

చరణం: 1
చూ చూ చూ చూడడం
మా మా మా మాటాడడం
చయ్ చయ్ చయ్ చెయ్యి వెయ్యడం
చెల చెల చెల చెలరేగడం
చూటెమ్మ గాటొచ్చి వెయ్య వచ్చిన వేళలో ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం

డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం

నీ కంట్లో  పడ్డానంటే డమా డమా ఢం ఢం
మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే

అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు
అత్తిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు

చరణం: 2
సామి బంధానమ్మా  దేవ బంధాయనో
సామి బంధానమ్మా దేవ బంధాయనో
అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా
అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా
దేవర దేవశిఖామాడే బంధానమ్మా
సామి బంధానమ్మా దేవ బంధాయనో

లే లే లే లేవడం
దు దు దు దువ్వేయ్యడం
దులి దులి దులి దులిపేయ్యడం 
జల జల జల జలకివ్వడం
లేవడం దువ్వెయ్యడం దులిపెయ్యడం జలకివ్వడం
ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండీ అడ్డం

డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం
డమ్మారే డమ్మా... డమ్మా... డమ్మా... డమ్మా... ఢం ఢం

నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే డమ్మా డమ్మా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే




జుం జుం మాయ పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాధ శ్రీరాం

జుం  జుం మాయ



కాలేజి పాపల బస్సు.. పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్సి గిఫ్ట్, చిత్ర

కాలేజి పాపల బస్సు.. ఏ సీను చూసినా ఫ్రెష్షు 
కాలేజి పాపల బస్సు.. ఏ సీను చూసినా ఫ్రెష్షు 
బ్రేకేస్తే పెద్ద ఇష్యూ.. మన్మధుడి డిష్యుం డిష్యుం .. ఏస్కో 
జింతాత చిత చిత జింతాతతా .. అదీ 
జింతాత చిత చిత జింతాతతా 
పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు 
పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు 
ఒళ్ళు ఎలా ఉంది చెప్పు.. తెగుతాది ఇంక చెప్పు 
అమ్మమ్మా..... 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 

చరణం: 1
టెన్నిస్సు అమ్మడు.. కోర్టంతా దున్నుడు 
వంగి షాటు కొట్టింది.. గ్రౌండ్ అదర గొట్టింది 
అబ్బో అబ్బో.. అబ్బో అబ్బో.. అబ్బబ్బబ్బా.. బబ్బబ్బబ్బా.. 
దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా.. 
ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా 
ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా 
అది అత్తిలి తోటల కాపా.. నీ గుత్తుల సోకుల పీపా.. ఓయ్ 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
నువ్వెత్తి చూపే.. నువ్వెత్తి చూపే.. 
నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు 
నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు 
నువ్ వింబుల్డన్ లేడీ.. నే అంబరు పేట కేడీ 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 

చరణం: 2
36..24.. 36..సు.. ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహో లుక్సు 
ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు 
ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు 
ముసలాడు వేసి జీన్సు.. అడిగాడు ఒక్క చాన్సు 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా.. తా..తా..తా.. 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు 
నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు 
ప్యాంటూడదియ్యమంది.. ప్యాంటూడదియ్యమంది 
పొడిచింది పెద్ద సూదీ.. 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
ఆ..ఆ..ఆ.. అహహా.. 
పెళ్ళి కుమార వినరా.. శ్రీమతి దేవతరా..ఆ.. 
పెళ్ళి కుమార వినరా.. శ్రీమతి దేవతరా 
తరగని ప్రేమై ప్రేమే తానై.. తానే జీవితమై 
దీపములో రూపములా.. స్నేహముగా సాగవయ్యా 
తేడాగా చూశావో.. వేషాలే వేశావో 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా 
జింతాత చిత చిత జింతాతతా





వస్తవా వస్తవా పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనురాధ శ్రీరాం

దండాన చీరలు దండిగా ఉన్నవోయ్ 
నాను కట్టలేక ఒకరికి పెట్టలేదు రామోయ్ 
చేయెత్తి ధానమలా చేయలేని నేనేంత చండాలినే రామో

వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
వస్తవా వస్తవా వాటమైనదిస్తవా
తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ
చలి చలి చలి చలి మంట రేపి పోతవా
ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా

వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
ఓయ్ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా
తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ
చలి చలి చలి చలి మంట రేపి పోతవా
ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా

వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా

ముంబై సే ఆయ మేరా దోస్త్ దోస్త్ కో సలామ్ కరో
రాత్ కో గావో పీయో ధిన్ కో ఆరామ్ కరో 

బుర బుర పొంగుతున్న బుగ్గ కొరికి పెడతావా
సర సర పాకుతున్న సోకు పైన పడతవా
చిట చిట మన్న చిన్న నడుము మడత ముడతవా
కిట కిట లాడుతున్న తలుపు తలపు తడతవా
కిందికి వస్తవా కాలి గజ్జి కడతవా ముందుకి వస్తవా ముద్దు దెబ్బ కొడతవా
ఎర్రని తేలులాగా ఎక్కడో కుడతవా

వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
ఆఁ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా

భగ భగ నిప్పులోన నీళ్ళు నువ్వు పోస్తవా
బంగరు చెంబులోన పాలు నువ్వు తీస్తవా

పరువపు డప్పుమీద దరువు నువ్వు వేస్తవా
పట్టిన తుప్పు వదిలిపోయేలాగా చేస్తవా
రైకకు చెప్పకా కోక చేను మేస్తవా కోకకు చెప్పక రైక పంటకోస్తవా
అయ్యకు తెలియకుండా అమ్మా అనిపిస్తావా

వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా
ఏ వస్తవా వస్తవా వాటమైనదిస్తవా
తొలి తొలి తొలి తొలి కోడి కూతకొస్తావ
చలి చలి చలి చలి మంట రేపి పోతవా
ఎనకా ఎనక పడి వెంట తీసుకెళ్తవా
వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా




దూరంగా పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: బండారు దానయ్య, యమ్.యమ్.కీరవాణి
గానం: యమ్.యమ్.కీరవాణి, గంగ

దూరంగా




జోలాలి పాట సాహిత్యం

 
చిత్రం: విక్రమార్కుడు (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: మాళవిక

జోలాలి

Palli Balakrishna Tuesday, August 1, 2017
Eega (2012)



చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాని, సమంత, సుదీప్
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 06.07.2012



Songs List:



నేనే నాని నే పాట సాహిత్యం

 
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: దీపు, జి.సాహితి

నేనే నాని నే, నే నీ నాని నే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
కళ్ళకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
కలలకు రెక్కలు తొడిగించి
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ
మాటల్లొ ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తైనా ఉలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ

నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా

కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె, కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ
అరె అరె అరె అరె ఓ




ఈగ ఈగ ఈగ పాట సాహిత్యం

 
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం:  చిత్ర, దీపు, శ్రావణ భార్గవి

దేఖ్‌లోరే సాలా ఏ రాత్ ఛా గయీ
తేరే ద్వార్ పే తేరీ మాత్  ఆగయీ
గయీగయీగయీగయీగయీగయీగ
మై నేమ్ ఇజ్ నాని నేనీగనెతై కానీ
నీ గుండెల్లో పేలనున్న
న్యూక్లియర్ మిసైల్‌ని


నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డమ్‌నే కూల్చకుంటే
కానురా మగాణ్ని
ఈగ ఈగ ఈగ యుముడి మెరుపుతీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరీ జాన్ లేగా

చరణం: 1
అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైన కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే ఐనా చినుకు బొట్టులోన
పుడమినైన ముంచే పెనుముప్పు పొంచి లేదా
Isn't the universe an atom
before the big bang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమా కేర్ ఫ్రీగా నువ్వు ఆవులించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్‌లాగ

యమ అర్జెంటుగా పూర్తిచేయవలసిన
పనులున్నాయ్ పదే పది పదే పది
వన్ నిన్ను చంపడం
టూ నిన్ను చంపడం
త్రీ నిన్ను చంపడం
ఫోర్ నిన్ను చంపడం
ఫైవ్ నిన్ను చంపడం
సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం
ఎయిట్ నిన్ను చంపడం
నైన్ నిన్ను చంపడం
టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం

చరణం: 2
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవుల్లోన మరణరాగా వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్నై నీ పైకి దూసుకొస్తా
బై హుక్ ఆర్ క్రుక్
నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగలబెట్టి ఎగిరిపోనా తారాజువ్వులాగా




కొంచెము అర్థమైనా పాట సాహిత్యం

 
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం:  విజయ్ ప్రకాశ్

కొంచెము అర్థమైనా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచె ము కొంచెము గుట్టువిప్పినా
కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా... ఓ...
నీ గుండెలోతున భూతద్దం వేయనా
ఏదో మూలనా నన్నే చూడనా
నీ గుండెలోతున భూతద్దం వేయనా
ఏదో మూలనా నన్నే చూడనా

చరణం: 1
కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా పిచ్చోడినౌతున్నా
జాలి పడవుగా... ఓ...
పిసినారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా

నొ నొ నో వాట్ సో... (2)

చరణం: 2
కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా...
వాట్ డిడ్ యూ సే?
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా...





లావా లావా లావా పాట సాహిత్యం

 
చిత్రం: ఈగ (2012)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం:  యమ్.యమ్.కీరవాణి, అనుజ్ గురువా, శివాని

లావా లావా లావా

Palli Balakrishna Friday, July 28, 2017
Sye (2004)



చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నితిన్ , జనీలియ
దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాత: ఏ. భారతి
విడుదల తేది: 23.09.2004



Songs List:



అప్పుడప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: లక్కీ అలీ , సుమంగళి

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా 
ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ
అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా 
ఇదేనేమో.. ఇదేనేమో 
అదంటె అనలేని ఓ.... భావము 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ 

అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు 
ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు 

కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై 
కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై 
కాసేపు తాపం ...కాసేపు విరహం 
కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు 
తెగతిట్టుకుంటూ కూడానే ఉంటూ 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా
అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు 

I HATE U SO MUCH న న న నై నై 
I HATE U TOO MUCH య య యా య 
I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే 
నీదారి నీదే నా తీరు నాదే 
నామాటకేమో అర్దాలు వేరే 
ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా
అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు





చంటైనా బుజ్జైనా పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కళ్యాణి మాలిక్, స్మిత 

మనకు తగు మనిషోకడుండి వాడిలోన వేడివుంటే య్యా... య్యా...య్యా...
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా... య్యా...య్యా....

పల్లవి: 
చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా బోయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా...సై
స...స...స్స...సై...
నువు సై అన్న అనకున్న సై...

చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్థైనా
జానైనా శీనైనా బోయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా...సై
స...స...స్స...సై...
నువు సై అన్న అనకున్న సై...

ఫేసుకి మాస్కున్న చల్ తా హై  మనసుకి వేస్కోకురా
పరిచయమవకున్న పరవానై ఫిగరుని మిస్ కాకురా
ఉన్నది మాలో వేకెన్సీ టేక్ ఏ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఏ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలోల్లెక్కన అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కన ఒన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేసేందుకు సై
స...స...స్స...సై...
నీ కుడి నాకు ఎడమైంది సై...
ఆర్ట్స్ఐనా సైన్స్ఐనా ఆమాటకొస్తే ఏ గ్రూపైనా...
హాస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏ కోర్ని కిస్కైనా సై...
స...స...స్స...సై...
ఈ సమయాన ఎవడైనా సససస్స సై

ఫిఫ్టీ పర్సెంటు డ్రస్సుల్లో పిలుపే తెలిసిందిలే...
హండ్రెడ్ పర్సెంట్ అందంలో ఆటకు తయ్యారేలే...
మొదలెట్టాలొక వన్ డే మ్యాచ్ కమాన్ బేబీ కమాన్...
మనకింకెందుకు నెట్ ప్రాక్టీస్ గెటాన్ బేబీ గెటాన్...
నీ బాడీ ప్లే గ్రౌండ్ గా...నో బడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోరుబోర్డుగా... య్యా...య్యా...య్యా...
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఆపెయ్యేందుకు సై...
స...స...స్స...సై... 
మీరేమన్న అనుకున్న సై...




గంగా ఏసీ పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వసుంధర దాస్
గానం: గంగా, కల్యాణి మాలిక్

గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ 
దోమల్ గూడ చింతల కుంటా ఏపీ 7812 
గంగా ఏసీ మ్యాట్నీ షో తో డైలీ త్రీ షోసు ప్రేమ
దోమల్ గూడ చింతల కుంటా ఏపీ 7812
అయ్యప్ప కట్పీసెస్ డిస్కౌంటు 10 పర్సంట్ 
చలో జింఖానా గ్రౌండ్స్ గగన ట్రావెల్స్ అండ్ టూర్స్ 
ఆచంట  కాకినాడ పుంగనూరు ఏసీ వీడియో కోచ్ బస్సులు కలవు ప్రతి రోజూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

తొందర పడకు సుందర వదన ఆగీ నెమ్మదిగా వెళ్ళు 
ఇంటికొ చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాశీ సిమెంటు 
మీఠాలాలె కూర్మన్ చైన్ మనీ లెండర్స్ పాన్ బ్రోకర్స్ 
STD ISD లోకల్ కాల్ టూ రూపీస్ 
వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ బాటా బాటా బాటా బాటా టాటా... 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 

ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ

మా పార్టీ నాయకుడ్నే గెలిపించండీ.. మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును 
జనశక్తి ప్లాట్లు సొంతం చేసుకోండి.. విరిగిన ఎముకలకు కట్లు కట్ట బడును 
బరువు తగ్గాలనుకుంటున్నారా... నెల్లూరు మెస్ మీల్స్ రడీ.. 
వాణీ నవశక్తీ బీడీ తాగండి.. ఆంధ్రా భ్యాంక్ వారి సౌజన్యంతో.. 
పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా జ్యోతిష్యం చెప్ప బడును 
చెయ్యి చూసి రంగు రాళ్ళు ఉంగ రాలు ఇవ్వ బడునూ... 
ఊరూరఊరూరర ఊరరూరరూ ఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూ ఊరూరఊరూరర ఊరరూరరూ 

కుక్కలు ఉన్నాయ్ జాగ్రత్త సుమన కొచ్చర్ల కోట 
కొబ్బరి బోండాం రు ఆరూ సింహాద్రి నీరూ మీరూ.. 

మీ చర్మ సంరక్షణకీ సౌందర్యానికి ఫ్రెండ్స్ ఫినాయుల్ నే వాడండీ 
మీ పిల్లల బంగరు బవితవ్యానికి అమ్మొనియా ఫ్యాక్టంఫాస్ నే వెయ్యండి 
ఎన్‍కౌంటర్లన్నీ బూటకాలు సువార్త ఉజ్జీవ కూటములు 
నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు నేననాలనుకున్నదంటుందెవరూ.. 
నన్నే కాపీ చేస్తున్నారు నా వెనుకే ఫలో అవుతూ నడిచేదెవరు 
వచ్చేదెవరు తిరిగేదెవరూ ఎవరు వారెవరు 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ 
ఊరూరఊరూరర ఊరరూరరూఊరూరఊరూరర ఊరరూరరూ





గూట్లో వుంది బెల్లం ముక్క పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మాలతి లక్ష్మణ్ , టిప్పు

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

హే గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ... అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకు దండం పెడతా దయ చుడమంటా
హే రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా
రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
అత్తనడిగితే నవ్వేసింది మరదలింటికే పో పొమ్మంది
కొబ్బరి పెడతావో  అరచి బొబ్బలు పెడతావో
నీకు సాయంగుంటా లవ్ చేద్దమంటా

చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా
వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా
నీ అందం కాశ్మీరీ పూలగంధం వేసిందీ ప్రేమబంధం ఓ నెరజాణా
కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతామా
తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతామా
అరె పందెం ... నీ బుర్ర కాస్త  మందం కవి తిక్కన రాసిన కందం... జాజారే జానా!
నేనొప్పను అంటే-మౌనంగుంటా
నే రానంటే-నేనే  వస్తా
కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో
నిన్ను వేడుకుంటా దయ చూడమంటా హా...హా... హా...

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా

అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే
బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే
ఓరయ్యో కొరికేలా చూడకయ్యో
కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో
రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమ్మున వుంటావా
చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా
సిరికొండా పూనా దానిమ్మపండా పుత్తూరి కలకండా ఉంటాలే  అండా...! హే...
నేతిప్పలు పెడితే-కల్లో కొస్తా
ఓయస్సంటే-ఒళ్ళో కొస్తా
ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో నేను నీ వెంటుంటా...
నీ  బాంచనంటా...

గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా
అమ్మనడిగితే ఊహూ... అంది
అల్లుండింటికే పో పో అంది
బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో
నీకో దండం పెడతా దయ చుడమంటా హా...హా... హా...

హే గిల గిల గిల గిల గిల గిల గిల గిల రారా నువు రారా బంగారా
రారా నువు రారా నే రారా
రారా నువు రారా నీ సై... రా...




నల్లా నల్లాని కళ్ళ పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!

చరణం: 1
ఎర్రంగా బొద్దుగా వుంటే చాలా
ఒళ్ళో పెట్టుకు లాలిపాడి జో కొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తేవాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయారి భామా ముద్దులగుమ్మ చెప్పవెబొమ్మ...
ఒప్పులకుప్పకి వయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ ... నేనా... నీతో... సరిపోతానా?
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!

చరణం: 2
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా...
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా...
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జా కంకాళమ్మా ఎవరో యమ్మా ఖజురహొ బొమ్మ...!
ఇంకెందుకులే దాపరికమ్మా నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
చీ ... నేనా...? నీతో... సరిపోతానా...
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్లాడేవాణ్ణిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారే సరికల్లా మనమోల్లాగోలాగ మొగుడూ పెళ్లాలైపోయే దారి కాస్త చూపించెయ్యమ్మా...




పంతం పంతం పాట సాహిత్యం

 
చిత్రం: సై (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎమ్.ఎమ్.కీరవాణి , టిప్పు , దేవి శ్రీ ప్రసాద్, కళ్యాణి మాలిక్ , స్మిత

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ...
భగ భగ భగ తెగమరిగిన రక్తం మాదే మాదే హెయ్
తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదె హెయ్....
వేద్దాం సై.... చూద్దాంసై....
కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం
సై .... సిద్దం సై....సై...సై...సై....

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ....

కోసేస్తాం గడ్డి కొట్టేస్తాం బండ ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త
నరికేస్తాం కొమ్మ ఏరేస్తాం ముళ్ళు
తవ్వేస్తాం మట్టిన్నాకొడక.. మట్టిరా
నలిపేస్తాం పాత డబ్బా డబ్బాన్నాకొ....
నింపేస్తాం నీటి తొట్టి తొట్టన్నాకొ...
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా సాలా...
హొల్డ్ యువర్ టంగ్ హే హే
మైండ్ యువర్ వర్డ్స్ హే హే
క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ

క్యాబే జీ
నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్

హేయ్ గుప్పిస్తాం రంగు
గీసేస్తాం హద్దు
గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్...కట్....కట్.....
ఒరేయ్ లేపేస్తాం బంతి...చూపిస్తాం సత్తా
పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్ ఫట్....
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత....
దింపేస్తాం పొగరును కాస్త....
దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా
తోక ముడుచుకుని జా...జా...
ఎక్కడికో జా...కొజ్జా
ముయ్ రా ముయ్
హే హే...
డూ ఆర్ డై
హే హే
నచ్చేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ....
యా వెయిట్ అండ్ సీ


Palli Balakrishna Wednesday, July 26, 2017
Simhadri (2003)



చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, భూమిక, అంకిత
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: వి.విజయ్ కుమార్ వర్మ
విడుదల: 09.07.2003



Songs List:



సింగమలై పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ ( మలయాళం లిరిక్స్  వాలి)
గానం: కళ్యాణి మాలిక్ 

సింగమలై




చీమ చీమ చీమ చీమ పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బి.చరణ్, గంగ, బ్రహ్మానందం

కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పాంగు చిత్రాల చిందేసి సింగు సాంగూ

జింగల్లో జింగ దొరికింది దొంగ 
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ 
కసు బుస్సె ఎస్సై పోవంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా

జింగల్లో జింగా టింగుల్లో రంగ 
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ 
హైలెస్సా తస్సాదియ్యంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోరా మామా
హోయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా

చరణం: 1
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
వయసంతా హరతి ఇస్తే వయ్యారి గుళ్ళోకొస్తా
ఓలమ్మీ ఈడే కోడై కొక్కొరక్కో అంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారే చెడుగుడు గుళ్ళో
చెమటలు పోసే ఒడిదుడుకుల్లో
చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవే భామా
జింగల్లో జింగా టింగుల్లో రంగ 
అనిపిస్తా ఉంగ తీరుస్తా బెంగ 
హైలెస్సా తస్సాదియ్యంగా...
హెయ్ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా

చరణం: 2
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
కుర్రాడు కన్నే కొట్టే కుర్రీడు నన్నే కుట్టే
చిర్రెత్తి చీరే తిడ్తే సిగ్గే పుడుతుంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
ఎద కంటికి కధ కంచికి పొదరింటకే పదా
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పని కంపటి లేవమ్మో

చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా
జింగల్లో జింగ దొరికింది దొంగ 
ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ 
కసు బుస్సె ఎస్సై పోవంగా...
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ గారి విలునామా ప్రేమా రెచ్చిపోర మామా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామా ప్రేమా తెలుసుకోవె భామా




అమ్మైన నాన్నైన పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కళ్యాణి మాలిక్ 

అమ్మైన నాన్నైన





చిరాకు అనుకో పరాకు అనుకో పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి.బి.చరణ్, చిత్ర

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చరణం: 1
గులాబి రేకో చలాకి బైకో 
అడల్ట్ జోకో కరెంటు షాకో 
మజాల కేకో మగాడి లాకో 
కుమారి షోకనుకో 

స్వరాల సింకో నరాల లింకో 
వరాల ట్రంకో రసాల డ్రింకో 
కులాస డుంకో పలాస డంకో 
నువ్వంటే లైకనుకో

జవాని కోకో ఇవ్వాళ దేఖో... 
జువాన మస్కో నాతోటి చేస్కో
ఊ అంటే ఉస్కో రా అంటే రాస్కో
నా ఇంట జాయింట తలంటు పోస్కో 

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో

చరణం: 2
ముడేసి ముట్కో పడేసి పట్కో
ఒళ్ళంతా చుట్కో కేరింత కొట్కో
బలంగా అల్కో భలేగా గిల్కో 
అదేదో గెల్కెస్కో

అలాగే చెప్కో చులాగ్గా ఒప్కో 
కుచ్చీళ్ళు విప్కో కౌగిళ్ళు కప్కో 
కోరింది ఇచ్కో కొండంత పుచ్కో
ఆపైన కిచ్ కిచ్ కో 

నీ డోరు తీస్కో
నా నోరు మూస్కో 
హే వచ్చాడు చూస్కో
డిగామ వాస్కో 
వయ్యారి పైనే సవారి వేస్కో 
సకాల సుఖాల షికారు చేస్కో

సవాలు అనుకో శివాలు అనుకో 
మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా 
తెగించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో 
మరేమిటైనా అనుకో 
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా 
మధించ బుద్దేస్తుందనుకో




నన్నేదో సెయ్యమాకు పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, సునీత

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా
ఏదేదో సెయ్యమాకు ఏటికాడ  ఏయ్...హా...
ముద్దులెట్టి ముగ్గులో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింకా చిన్నదాన్నిరో... ఓ... ఓ... ఓ...
సాకేదో సెప్పమాకు సందెకాడ  ఏయ్... ఓయ్...
సొకంతా దాచుకోకు ఆడా ఈడ  ఆ... ఏయ్...
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు...
అడ్డుగోడ పెట్టి నన్ను ఆపమాకు...
అలవాటు చేసుకోవమ్మో... ఓ... ఓ... ఓ...

నన్నేదో సెయ్యమాకు నడుముకాడ మ్మ్... హా...

చరణం: 1
కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నను కుడితే
కందిచేనుకి షికాఋ కెళితే కందిరీగే నిను కుడితే
మంట నాలో మొదలవుతుంటే
మందు నేనే ఇస్తుంటే
పెదవి ఎంగిలి పై పైన పూస్తే
బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే
ఏదేదో సెయ్యమాకు ఆడ ఈడ హేయ్... హా...
నన్నేదో సెయ్యమాకు అందగాడా ఏయ్... హా...
అంతకంటే హయి ఉంది వదులుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో ... ఓ... ఓ... ఓ...

చరణం: 2
చింతపల్లి సంతకు వెళితే  ఓ చింతపూల చీర కొంటే
ఉఁ చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే
ఊఁ కట్టు నీకు కుదరకపోతే
నువ్వు సాయం చేస్తుంటే
చెంగు బొడ్లో దోపుతువుంటే
చెంగుమని నువ్వు ఉలిక్కి పడగా నాలో ఉడుకే పుడితే
సాకేదో చెప్పమాకు సందెకాడ  ఏయ్... హా...
షోకంతా దాచుకోకు కోక నీడ ఏయ్... ఏయ్...
పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యో... ఓ... ఓ... ఓ...
నన్నేదో సెయ్యమాకు నడుముకాడ ఏయ్... హా...
ఏయ్... హూఁ




చిన్నదమ్మే చీకులు కావాలా పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, శ్రేయగోషల్

చిన్నదమ్మే చీకులు కావాలా 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా
హే చిన్నదమ్మే చీకులు కావాలా 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా
గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిల్లా 
చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా

చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ
హే చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలీ

చరణం: 1
ఆకులు కావాలా పోకలు కావాలా 
సోకులు కావాలా పూతరేకులు కావాలా
ఆకులు పోకలు పోకలు సోకులు అన్నీ కావాలా 
జున్నే కావాలా అన్నీ కావాలా లేత జున్నేకావాలా
లస్కు టపా లబ్జులు కావాలా దానిమ్మలిచ్చే 
ఉస్కులపా ఊపులు కావాలా

హే లస్కు టపా లబ్జులు కావాలా 
దానిమ్మలిచ్చే ఉస్కులపా ఊపులు కావాలా
శింగరాయ కొండ నా చికాకోలు దండ 
విస్తా కలకండ కాయిస్తా చలి ఎండ

లస్కు టపా లబ్జులు కావాలి 
ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి
హే లస్కు టపా లబ్జులు కావాలి 
ఈ గుమ్మతెచ్చే ఉస్కులపా ఊపులు కావాలి

చరణం: 2
షాకులు కావాలా షేకులు కావాలా 
షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా
షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాలా 
మొకే కావాలా మోజే కావాలా ప్రతిరోజు కావాలా

తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ 
లబ్జనక రాపిడి కావాలా
హే తద్దినక తాకిడి కావాలా ఓ లంగరు లచ్చీ 
లబ్జనక రాపిడి కావాలా

ఓసి అందగాడా అబ్బోసి షోకుమాడా 
దూకుడంత చూడ అదిరింది కుర్రదూడ
తద్దినక తాకిడి కావాలి  ఈ లంగరు లచ్చికి 
లబ్జనక రాపిడి కావాలీ
తక తక తక తద్దినక తాకిడి కావాలి ఈ 
లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలీ

హే గుమ్మలురి పిల్ల నా సమ్మలోరికిల్లా 
చెక్కేస్తా ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్లా
చిన్నదమ్మే చీకులు కావాలి 
నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే
అరె చిన్నదమ్మే చీకులు కావాలి నా సామిరంగా 
చీకులమ్మే చిన్నది కావాలి హే హే హే

లబ్జనక రాపిడి కావాలి  లబ్జనక రాపిడి కావాలి  
లబ్జనక రాపిడి కావాలి
ఏహే... ఏహే...





నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి పాట సాహిత్యం

 
చిత్రం: సింహాద్రి (2003)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, చిత్ర

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటె అలజడి రేగి 
జారుతుంది మిడ్డి 
నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డీ

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి

కన్నెబాడి కాదమ్మొ అది జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పె పడుచు రైలు గాడి.
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడి
ఎప్పుడప్పులవుతాడయ్యొ నిన్ను కన్న డాడి
వేస్తా బేడి చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడి దాదా కేడి రాత్రికి చూసై త్రిడి 
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి 

ని అధరామృతం పుల్లారెడ్డి - డి డి.
ని అధరామృతం పుల్లారెడ్డి... 
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి - డి డి

కోక బాంకు లాకర్లోన దాచుకోకు వేడి
చెక్కులిస్తె చిక్కొస్తుందే ఇచ్చుకోవె డీడీ
నువ్వు తాకకుంటె పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగ సుకపడిపోర దాన్ని నువ్వు వాడి
అరె పుంజు కొడి పంటకు పాడి.
నువ్వు నేనొక జొడి
చింతల్ ఫూడి చిలకల్ పూడి పోదామ జతకూడి
ఓరయ్యొ నీది చెయ్యేకాదు - ఒయ్ 
ఓరయ్యొ నీది చెయ్యేకాదువిశాఖ ఉక్కు కడ్డి 

నువ్వు విజిలేస్తె ఆంధ్ర సోడా బుడ్డి
అది వినబడుతుంటె అలజడి రేగి 
జారుతుంది మిడ్డి 
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తె కడతా వడ్డి మీద వడ్డి...

వేస్కొ వేస్కొ  విజిలేస్కొ


Palli Balakrishna Friday, July 21, 2017

Most Recent

Default