Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

RRR (2022)
చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
నటీనటులు: రాంచరణ్, తారక రామారావు, అలియా భట్, ఒలివియా మారిస్ 
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: డి.వి.వి.దానయ్య 
విడుదల తేది: 07.01.2022Songs List:దోస్తీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, యం.యం.కీరవాణి

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి 
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె

అనుకోని గాలి దుమారం 
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై
నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే 
ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులేవో హో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

ఒక చెయ్యి రక్షణ కోసం
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర
ఒకరేమొ దారుణ శస్త్రం
ఒకరేమొ మారణ శాస్త్రం
తెరతొలగిపోతే ప్రచండ యుద్దమే జరగదా
తప్పని సరియని తరునమొస్తే జరిగే జగడంలో
వాటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ
నాటు నాటు పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడూ నా పాట సూడూ నా పాట సూడూ
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  వీర నాటు 
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా వంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో
జననీ పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: యం.యం.కీరవాణి & కోరస్

జననీ ప్రియ భారత జనని
జననీ 
మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం.

నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని

జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈకొమరం భీముడో పాట సాహిత్యం

 

చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కాలభైరవ

భీమా నిను గన్న నేలతల్లి 
ఊపిరిపోసిన చెట్టుసేమా 
పెరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతోందా

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో
కొమరం భీముడో కొమరం భీముడో
రగరార సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో

కాల్ మొక్కుతా బాంచన్ నని వంగీ తూగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను వంచి తోగాల
జుడుము తల్లీ పేగుకు పెరగానట్టేరో
పెరగానట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

చర్మామొలిసే దెబ్బకు అప్పంటోగాలా
చినికే రక్తం చూసి చెదిరి తోగాలా
గుబులేసి కన్నీరు వలికి తోగాలా
భూతల్లి చనుబాలు తాగనట్టేరో
తాగనట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

కాలువై పారే నీ గుండె నెత్తూరు
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మా కాళ్ళ పారాణౌతుంది చూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు
పుడమితల్లికి జనమ మరణమిస్తివిరో కొమరం భీముడో
రామం రాఘవం పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: విజయప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహ ధవళీశతం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
నటరాజం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం
ఎత్తరా జెండా పాట సాహిత్యం

 
చిత్రం: RRR (2021)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విశాల్ మిశ్రా, పృద్వి చంద్ర , యం.యం.కీరవాణి, సాహితి  చాగంటి, హారికా నారాయణ్ 

పరాయి పాలనపై కాలు దువ్వి 
కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ...

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
ఉజగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే

(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

పంతమున్న కోడే పంజాబి కోడే
దద్దెనన కోడే దంతూరి కోడే
పౌరుషాల కోడే బల్లాసి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

No comments

Most Recent

Default