Lakshmi (2006) Telugu Songs Lyrics
Music : Ramana Gogula
Director : V. V. Vinayak
Producer : Nallamalupu Bujji
Actor : Venkatesh
Actresses : Nayanthara , Charmy Kaur
Supporting Cast : Sharwanand
Release Date : 14 January 2006
Dhaga Dhaga Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Dhaga Dhaga' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Ramana Gogula and Ganga.
Taara Taluku Taara Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Taara Taluku Taara' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Raju and Sunitha Upadrashta.
Music : Ramana Gogula
Lyricist : Chandrabose
Singers : Raju, Sunitha Upadrashta
Hey Satyabhama Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Hey Satyabhama' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Shankar Mahadevan and Sudha Krishna.
Ammayi Andhra Mirchi Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ammayi Andhra Mirchi' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Tippu and Shreya Ghoshal.
Ne Puttindi Neekosame Song Lyrics in Telugu – Lakshmi (2006)
'Ne Puttindi Neekosame' song from Lakshmi (2006) movie. Music composed by Ramana Gogula and sung by Rajesh Krishnan and Ganga.
Lakshmi (2006)
చిత్రం: TOXIC (2026) సంగీతం: రవి బసృర్, విశాల్ మిశ్రా నటీనటులు: యాశ్, కైరా అద్వాని, నయనతార దర్శకత్వం: గీతు మోహన దాస్ నిర్మాతలు: వెంకట్ యన్. నారాయణ, యాశ్ విడుదల తేది: 04.06.2026
Songs List:
Toxic (2026)
Mana Shankara Vara Prasad Garu (2026) Telugu Songs Lyrics
Music : Bheems Ceciroleo
Director : Anil Ravipudi
Producers : Sahu Garapati, Sushmita Konidela
Actors : Chiranjeevi, Venkatesh
Actresses : Nayanthara, Catherine Tresa
Release Date : 12 January 2026
Hook Step Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Hook Step' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Baba Sehgal.
Sasirekha Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Sasirekha' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Madhu Priya.
Meesaala Pilla Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Meesaala Pilla' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Udit Narayan, Shweta Mohan.
Mega Victory Mass Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Mega Victory Mass Song' from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Srinivas, Vishal Dadlani.
Peddi Reddy Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Peddi Reddy' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Chiranjeevi.
Peddi Reddy (GVR'S Version) Song Lyrics in Telugu – Mana Shankara Vara Prasad Garu (2026)
'Peddi Reddy (GVR'S Version)' song from Mana Shankara Vara Prasad Garu (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Saketh Komanduri.
Mana Shankara Vara Prasad Garu (2026)
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నాయన తార, సత్యదేవ్ కంచరాన దర్శకత్వం: మోహన్ రాజా నిర్మాతలు: రాంచరణ్, ఆర్.బి.చౌదరి, యన్.వి.ప్రసాద్ విడుదల తేది: 05.10.2022
Songs List:
తార్ మార్ తక్కర్ మార్ పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రేయా ఘోషాల్ బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే హే, కొండలన్నీ పిండి చేసే కండల్ ఉన్నోడే ఏ, ఖండాలన్నీ దండం పెట్టే గుండె తమ్ముడే వీళ్ళిద్దరిట్టా వస్తే భూం దద్దరిల్లాలంతే ఏ, టాలీవుడ్ ని బాలీవుడ్ ని తారు మారేంగే తార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ (4) బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే జుంబరే జూంబరే తార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ మార్ అండర్ వరల్డ్ లోనే ఉంటారు అందరినిలా టెన్ టు ఫైవ్ కాస్తుంటారు చీకట్లోనే టెన్ టు ఫైవ్ ఉదయిస్తారు రేపట్నెలా శాషిస్తారు ఏ, తుపాకులు ధరించిన మహర్షులీల్లే హే నిఘాలకే నిఘా పెట్టే మహా ముదుర్లే హే, దిల్లే దిమాకులే హే, దిమాక్ కూడా దిల్లే హే, దిక్కరిస్తే దిక్కు దిక్కు తారు మారేంగే తార్ మార్ తక్కర్ మార్ తార్ మార్ తక్కర్ మార్ తక్కర తక్కర తక్కర తక్కర తక్కర మార్ (4) బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల్రే యాష్ కరే, యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్ కి పండగే జూంబరే జూంబరే తార్ మార్ తక్కరు మార్
నజబజ జజర పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: శ్రీకృష్ణ , పృద్వి చంద్ర నజబజ జజర నజబజ జజర గజ గజ వణికించే గజరాజదిగోరా నజబజ జజర నజబజ జజర భుజములు ఝులిపించే మొనగాడిదిగోర ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం గిర్రు గిర్రున తొండము తిప్పితే చిత్తడే మొత్తం ఘీం ఘీం ఘీంకరించిన ఐరావతం గిత్తల మీదికంతెత్తున దూకితే నెత్తురే మొత్తం గుద్దు గుద్దితే గుండెలపై గుజ్జు గుజ్జుగా అవుతావబ్బయి కుమ్ము కుమ్మితే రొమ్ములపై దిమ్ము దిమ్ముగా ఉంటాదబ్బాయ్ దుండగ దండుని మొండిగా చెండాడు గండర గాడుడుర నజబజ జజర నజబజ జజర గజ గజ వణికించే గజరాజదిగోరా కొండ దేవర కోన దేవర కోర చూపు కొడవలిరా అడవి తల్లికి అన్నయ్య వీడురా కలబడిటే కథకళిరా చొక్కా మడతపెట్టి వచ్చాడంటే టేకుదుంగ మీది గొడ్డలి వీడు మీసకట్టు గాని తిప్పాడంటే మద్దిచెక్క మీద రంపమవుతాడు నల్లవిరుగుడు చేవలాంటి జబ్బల అబ్బులుకే నడ్డి విరిచెడు చేవచూసి అబ్బలు గుర్తొస్తారొయ్ అడ్డు వచ్చినోన్ని అడ్డ దిడ్డముగా తొక్కేసి పోతాడురా నజబజ జజర నజబజ జజర గజ గజ వణికించే గజరాజదిగోరా నజబజ జజర నజబజ జజర భుజములు ఝులిపించే మొనగాడిదిగోర
గాడ్ ఫాదర్ పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనుదీప్ దేవ్, ఆదిత్య అయ్యంగార్, రఘురాం, సాయిచరణ్ భాస్కరుని, అర్జున్ విజయ్, రితేష్ జి.రావు, చైతు సత్సంగి, భరత్, అరుణ్ కౌండిన్య, శ్రీ కృష్ణ , అద్వితీయ, శ్రుతిక, ప్రణతి, ప్రత్యూష పల్లపోతు, రచిత, వైష్ణవి, హారికా నారాయణ్, శృతి రంజిని, సాహితి చాగంటి ఏకో రాజా విశ్వరూపధారి శాసించే చక్రధారి¹ అంతేలేని ఆధిపత్య శౌరి దండించే దండకారి శాంతి కోసం రక్తపాతం వీడు పలికే యుద్ధపాఠం నల్ల దందా నాగలోకం వీడు తొడిగే అంగుళీకం కర్మ భూమిలోన నిత్య ధర్మగామి వేటుకొక్క చెడును వేటలాడు సామి ఎక్కడుంటేనేమి మంచికితను హామీ ఒక్క మాటలోన సర్వాంతర్యామి గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ ఆకసం పట్టని నామధేయం నిర్భయం నిండిన వజ్రకాయం ఆపదే అంటని అగ్నిగేయం వీడో ధ్యేయం వీడి వెలుగు అద్వితీయం ఆటగా ఆడిన రాజకీయం అంతరంగం సదా మానవీయం సాయమే సంపద సంప్రదాయం వీడో ధైర్యం వీడి పలుకు పాంచజన్యం అందలాలు పొందలేని పట్టం వీడే అక్షరాలకందిరాని చట్టం వీడే లక్షలాది గుండె సడుల చుట్టం వీడే అనుబంధం అంటే అర్ధం వీడే మంచి చెడ్డ పోల్చలేని ధర్మం వీడే తప్పు ఒప్పు తేల్చలేని తర్కం వీడే పైకంటి చూపు చూడలేని మర్మం వీడే కరుణించే కర్త కర్మ వీడే
బ్లాస్ట్ బేబీ పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ధామిని భట్ల, బ్లేజ్ హో... హో... Alpachino Alpachino What You Want to Tell Me Know Dil Kaseeno… Dil Kaseeno Welcome అంది Don’t Say No లిప్పు మీనో హిప్పు మీనో గుచ్చి గుచ్చి Kiss Me Know తప్పు లేదు గిప్పు లేదు హగ్గు లిచ్చి Crush Me Know ధూమ్ ధమాకా ఫుల్ థడాకా Yehi Mouka Aajaare ఇంతదాకా వచ్చినాక Bun Ke Thoofa Cha Jaare Tere Jaisaa Aur Kohi Naahi Dhoojaare Boss Boss Boss Boss Boss Boss Boss Boss Ba Ba Ba BaBa BaBa BaBa Dil Pe Maaro Dishkiyaav Blast Baby… Blast Baby Blast Baby… Blast Baby Blast Baby… Blast Baby Blast Baby… Blast Baby Blast Baby… ఈ నైట్ నీకు Feast Baby… Feast Baby Alpachino Alpachino What You Want to Tell Me Know Dil Kaseeno… Dil Kaseeno Welcome అంది Don’t Say No (Rap) పటాస్ మాస్ యాక్షన్ హీరో మజిల్స్ తో విజిల్ ఎయ్యరో Kick Ass Moods… Darker Shades బయటికి తియ్యరో Is Raath Kaa.. Subahaa Nahee Thu Share Shaa Laa దూకరో నీ ఫైర్ లో పవరేమిటో స్టాంప్ వేసేయ్ రో... Boss Boss Boss Boss Boss Boss Boss Boss Ba Ba Ba BaBa BaBa BaBa Dil Pe Maaro… Dishkiyaav Blast Baby… Blast Baby Blast Baby… Blast Baby Blast Baby… Blast Baby Blast Baby Blast Baby Blast Baby… ఈ నైట్ నీకు Feast Baby… Feast Baby
పదరా సైనికా పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీరామచంద్ర అడవి చెట్లకు అన్నలం కొండా గుట్టల తమ్ములం బందూకులకు బంధువులం నిప్పు కనికలం మందుపాతర తొక్కిన అడుగులం గుండెలోతుల కన్నీటి మడుగులం ఆకుపచ్చని దారులకంటిన చిక్కటి నెత్తుటి మరకలం పోరగా పోరగా పోరగా పోరగా పూనకమైంది పోరు సెగ పోరగా పోరగా పోరగా పోరగా ముందడుగెయ్యరా సైన్యముగా పోరగా పోరగా పోరగా పోరగా చరితను రాసిన ఎర్ర సిరా ఎందరో వీరుల త్యాగమురా ఆ ఒరవడిలో ఉద్యమమై ఉమ్మడిగా అడుగేద్దాం తోవ పొడవునా అగ్ని మడుగులు ఎన్ని ఎదురై రాని గుండె తడబడు నింగి పిడుగులు దండుగా పడిపోని విశ్రమించని హోరుగా రగిలించరా కాలాన్ని మన నేటి చలనమే నేటి కధనమే భావితరమున స్వేచ్ఛా పవనమురా పద పదరా సైనికా పద పదరా సైనికా వెనుకడుగే లేదురా కదిలాక పోరగా పోరగా పోరగా పోరగా పూనకమైంది పోరు సెగ పోరగా పోరగా పోరగా పోరగా ముందడుగెయ్యరా సైన్యముగా పోరగా పోరగా పోరగా పోరగా రేపో మరునాడో నిజమవదా సమన్యాయం ఓర్పు సహనంగా సాగాలి సమయం పుటకతో కూర్చిన ఆశయంరా ఇది మరణమైనా సరే కిరణమై ఉంటది ఒకనాటి ఉదయము వేగు చుక్కగా వేల కళలకు వెలుగులు దిద్దునురా పద పదరా సైనికా పద పదరా సైనికా వెనుకడుగే లేదురా కదిలాక పోరగా పోరగా పోరగా పోరగా పూనకమైంది పోరు సెగ పోరగా పోరగా పోరగా పోరగా ముందడుగెయ్యరా సైన్యముగా పోరగా పోరగా పోరగా పోరగా
అన్నయ్య పాట సాహిత్యం
చిత్రం: గాడ్ ఫాదర్ (2022) సంగీతం: యస్. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: వైష్ణవి కొవ్వూరి నీరై కరిగిందా నీ యదలో నలుపు ఏరై కదిలిందా అనుభందం వైపు అన్నా అని అంటూ నువు పిలిచే ఆ పిలుపు రక్షా బంధముగా నీ తోడై నడుపు కౌరవులెందరు ఎదురైనామరి ఒకడే చాలడా గిరిదారి అదిగో అతడే అతడే హితుడు భాందవుడు అడుగున అడుగై తనతో వెళితే గెలుపే నీకిపుడు
God Father (2022)
Whistle (2019)
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019) సంగీతం: అమిత్ త్రివేది నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా దర్శకత్వం: సురేందర్ రెడ్డి నిర్మాత: రాంచరణ్ విడుదల తేది: 02.10.2019
Songs List:
హో సైరా... (పవిత్ర ధాత్రి భారతాంబ) పాట సాహిత్యం
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్ పల్లవి: పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా హో సైరా.., హో సైరా.., హో సైరా. ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.., హో సైరా.., హో సైరా యసస్సు నీకు రూపమాయెరా చరణం: 1 అహంకరించు ఆంగ్ల దొరలపైన హుంకరించగలుగు ధైర్యమా తలొంచి బతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవేరా... ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి సముద్రమళ్లే మార్చినావురా ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి పెటెల్లు మన్నది ప్రజాలి పోరిది కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది హో సైరా.. హో సైరా.. హో సైరా ఉసస్సు నీకు ఊపిరాయెరా హో సైరా.. హో సైరా.. హో సైరా యసస్సు నీకు రూపమాయెరా చరణం: 2 దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం అనిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని ఒదిలి సాగుదాం ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని ప్రతి పదం కదనరంగమంతా కొదమసింగమల్లె ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా అరివీర సంహారా... హో సైరా.. హో సైరా.. హో సైరా హో సైరా.. హో సైరా.. హో సైరా ఉసస్సు నీకు ఊపిరాయెరా
జాగో నరసింహా జాగోరే పాట సాహిత్యం
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: శంకర్ మహదేవన్, హరి చరణ్, అనురాగ్ కులకర్ణి జాగో నరసింహా జాగోరే జనమంతా చూసేరే రారే చేయ్యెత్తి జై కొట్టె హోరే తకథై అంటు సింధులు తొక్కాలే వజ్రాల వడగాళ్లే నవరత్నాలే సిరిజల్లై మా నవ్వుల్లో సుక్కలు కురవాలే ఓ సై రా జామాజం జంజారావంలో ధమాదం దుమ్ము దుమారంలో అమాంతం అందరి ఊపిరిలో ఘుమాగుమ్ చిందిన అత్తర్లో పది దిక్కులకీ అందింధీ సందేశమ్ సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం ఉవ్వెత్తునిల ఉప్పొంగిన ఈ ఉల్లాసం ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా ఊళ్ళన్నిటిని ఊగించేలా హే ఊళ్ళన్నిటిని ఊగించేలా ఎం జవాబు చెబుతాంరా పలానా పక్కోడెవడంటే ఈ మన్నేర ఇద్దరిని కన్నదని అనరా నిజమంటే నువ్వు బాగుంటే చాలంతే ఆ మాటింటే మరి నే కూడా సల్లంగ ఉన్నట్టే ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం మన కష్టసుఖాలను పంచుకునేందుకు సిద్ధం నువు నా కోసమ్ నేన్ నీ కోసం అనుకుందాం మన అందరిని ముడి వేసెనిల మనిషన్న పదం కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా ఊళ్ళన్నిటిని ఊగించేలా హే ఊళ్ళన్నిటిని ఊగించేలా హైస్ హైస్ హైస్ హైలెస్స (3) కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా కన్నావటయ్య మా దొర మా సంబరాన్ని కన్నార ఉయ్యాలనాటి ఈడుల ఊళ్ళన్నిటిని ఊగించేలా ఊళ్ళన్నిటిని ఊగించేలా ఊళ్ళన్నిటిని ఊగించేలా
అందం అంకితం పాట సాహిత్యం
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: విజయ్ ప్రకాష్ , షాషా తిరుపతి అందం అంకితం ప్రాణం అర్పితం బంధం శాశ్వతం మీరే జీవితం నువు పద్మానివై ఉంటె రవితేజం నేనౌతా కలువై నువు వెచుంటె నెలరాజై నెయ్ వస్త వరించుతా తరించుతా అందం అంకితం ప్రాణం అర్పితం ఓ చక్కోరయానం చేసి చేరా నిన్నెలా నాదే నాదే వెన్నెలా - హో ఒక్కోరహస్యం విరించి విరిసా పువ్వులా నీలో నిలిచె నవ్వులా సరస్సౌతాను నీకోసం ఇటురావే రాయంచ ఇహ నాదైన సంతోషం అది నీకే రాసుంచా ప్రియాయచా లయాయచా అందం అంకితం ప్రాణం అర్పితం బంధం శాశ్వతం మీరే జీవితం తకరిన తకథిన తకరిన దిన్న తదియన తదియన థిల్లాన పధములు కలిసెను మధువని లోన తగనిస పదమున దీజాన తకరిన తకథిన తకరిన దిన్న తదియన తదియన థిల్లాన హృదయము అదిరెను ముధురక్షణాన మధురము కురిసెను తందాన
శ్వాసలోన దేశమే పాట సాహిత్యం
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019) సంగీతం: అమిత్ త్రివేది సాహిత్యం: చంద్రబోస్ గానం: హరి చరణ్ శ్వాసలోన దేశమే కోరస్: శ్వాసలోన దేశమే గుండే గోషలోన దేశమే కోరస్: గోషలోన దేశమే ప్రాన నాడిలోన దేశమే ప్రణమంత తల్లి కోసమే మాటలోనే దేశమే కోరస్: మాటలోనే దేశమే కత్తి వేటులోన దేశమే కోరస్: వేటులోన దేశమే కాలి అడుగులొన దేశమే కాలి బూడిదైన తల్లి కోసమే దేశమే నువ్వురా సందేశమయ్యెరా కోరస్: దేశమే నువ్వురా దేశమే నువ్వురా సందేశమయ్యెరా కోరస్: సందేశమయ్యెరా చిన్నారి ప్రాయమందునా కన్నోళ్ళనొదిలినావురా కోరస్: కన్నోళ్ళనొదిలినావురా కన్నీటి పదును తేలేరా ఖడ్గమే... ప్రయాణమైన పోరులో కోరస్: ప్రయాణమైనా పోరులో ప్రేమింకా ఇంకిపోయారా కోరస్: ప్రెమింక ఇంకిపోయారా దోసిట్లో దాచినావురా సంద్రమే...ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలనొదులుతూ పతాకమల్లే ఎగిరినావురా దేశమే నువ్వురా సందేశమయ్యెరా కోరస్: దేశమే నువ్వురా దేశమే నువ్వురా సందేశమయ్యెరా కోరస్: సందేశమయ్యెరా (3)
Sye Raa Narasimha Reddy (2019)
చిత్రం: అంజలి సి.బి.ఐ (2019)
సంగీతం: హిప్ హప్ తమీజ్
సాహిత్యం: బండారు దానయ్య
గానం: జతిన్ రాజ్
నటీనటులు: అనురాగ్ కశ్యప్, నయనతార, రాశిఖన్నా
దర్శకత్వం: ఆర్. అజయ్
నిర్మాత: సి.జె.జయకుమార్
విడుదల తేది: 22.02.2019
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
కొత్త కొత్త ఫేసుల్ని ఫ్రెండని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు వాళ్ళు
కొత్త కొత్త ఫేసుల్ని ఫేసుల్ని చెప్పి
గుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
తను నేను ఉన్నప్పుడు లవ్ ట్రాక్ సూపరు
పిడుగులాగా వచ్చే తన ఫ్రెండ్ ఒక జోకరు
చెప్పినా నువ్వు మారకుంటే చస్తావుర శేఖరు
నువు మారావా లైఫ్ కొంచం
మిగులునురా ఖాదరు
కష్టాలుంటాయ్ తనకుతానే
వచ్చి ఫిగరు దొరుకుతుంది
ఖాయం ఖాయం దొరకడము ఖాయం
మస్తు ఉంది ఫిగరు అని
ఫ్రెండ్ ఫిగర్ కి లైన్ వేస్తే
నీ ఫిగర్ కన్ఫర్మ్ గా జంపగుట ఖాయం
ఏమి ఖర్మరా ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దే
ప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే
అందమైన పువ్వులిచ్చి చెప్పే ప్రేమని
ఇపుడు ఇంటర్నెట్లో టెండర్ పెట్టె తీరు రాంగమ్మ
సెల్ ఫోన్ వచ్చాక సొల్లు పెరిగెరా
నేడు ఫేసుబుక్ పబ్బులంటు ట్వీట్ మారెరా
ఏమి ఈ గతి భయమేస్తున్నది
వచ్చే వాళ్ళ పోయే వాళ్ళ ముద్దుపద్దులేమిటి
నీటుగా బ్రెయిన్ రా హార్ట్ లో కుదురుగా
అయ్యో అయ్యయ్యో ఎంత మాయ ప్రేమరా
ఏమి ఖర్మరా ఇది ఏమి ఖర్మ రా
ఫుల్ నైటంతా నిధురలేదు ఏమి ఖర్మరా
సూన్యమేనురా అంతా సూన్యమేనురా
నువు ప్రేమిస్తే లైఫంతా సూన్యమేనురా




