-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aarti Agarwal"
Chatrapathi (2005) Telugu Songs Lyrics Album Cover

Chatrapathi (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Chatrapathi (2005)
Director : S. S. Rajamouli
Release Date : 29 September 2005

A Vachhi B Pai Valli Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'A Vachhi B Pai Valli' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani and Mathangi Jagdish.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి, మాతంగి A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే A B C అంటే నాలో అందం వన్ టూ త్రీ అంటే నీలో వేగం వేగంతో అందాన్నే గుణకారం చెయ్యాలే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 1 నీ సెల్లు నంబర్ కనిపెట్టా నీ ఇల్లు నంబర్ కనిపెట్టా నీ ఒళ్లు నంబర్ కనిపెట్టానే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ గ్రీన్ సింబల్ కనిపెట్టా ఆటీన్ సింబల్ కనిపెట్టా ప్రోటీన్ సింబల్ కనిపెట్టాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నీ నంబరు నా సింబలు ఓ కుంభకోణంగా నవంబరు డిసెంబరు ఆరంభ కాలంగా ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు చరణం : 2 మా నాన్ననడిగి యస్సంటా పెదనాన్ననడిగి యస్సంటా మా ఫ్యాన్స్‌ నడిగి యస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు మా బామ్మనడిగి కిస్సంటా తాతమ్మనడిగి కిస్సంటా జేజమ్మనడిగి కిస్సంటాలే ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు నా యస్సుని నీ కిస్సుతో సరికూడుకున్నాక వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాక ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే వన్నొచ్చి టూపై వాలె టూవచ్చి త్రీ పై వాలె త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

Agni Skalana Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Agni Skalana' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani, Mathangi Jagdish and Mangari.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: ఎం. ఎం. కీరవాణి, మాతాంగి అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్ కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తజ్జంతజణు తద్ధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి ఉర్వీవలయ సంభావ్యవర స్వచ్ఛందనుమతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి కుంభీనికర కుంభస్థగురు కుంభీ వలయపతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండప్రబల దుర్దండజిత దుర్జండ భట పతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జునప్రతి ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి సంఘస్వజన విద్రోహిగణ విధ్వంసవ్రతమతి ఛత్రపతి ఆర్తత్రాణ ధృష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధీధితి భీమక్ష్మాపతి శిక్షాస్మృతి స్తపతి

Summa Masuriyaa Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Summa Masuriyaa' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta, Smita, Kalyani Malik and Niraj Pandit.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కళ్యాణి మాలిక్, సునీత ఉపద్రష్ట, స్మిత సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా సూదంటూ రాయిలా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీ ఎంట నేనయా నీకు నాకు మధ్యన రగసమేది లేదయా రగసమేది లేదయా రగసమేది లేదయా ఇద్దరికి తెలిసిన ఇషయమొకటి ఉందయ్యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా కధలో మలుపే కసిగా తిరిగెనయ్యా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సుమ సుమ సుమ సుమ సుమ సుమ సుమ్మా మాసూరియా సుమ్మా మాసూరియా మాటలతో పెంచనా మందులేని ఫోబియా మందులేని ఫోబియా సుమ్మా మాసూరియా ముదురుతుంటే చూపనా మధ్య రాత్రి మానియా మధ్య రాత్రి మానియా సుమ్మా మాసూరియా తగ్గడానికుందిగా అందమైన ఐడియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా రెడియా స్టడియా జరుగును దోపిడియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా యా యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా సొగసరి సన్యాసం మంట గలిసేలేవయ్యా మగసిరి విన్యాసం కంట పడినయా వెనకటి వేదాంతం బూడిదాయే చూడయ్యా సూక్ష్మంలో మోక్షం భోదపడెనయ్యా జగమే ఒక మాయ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మా మసూరియా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా యా యా యా యా ఐ లైక్ దిస్ యా యా యా యా యా ఐ వాంట్ దిస్ యా వ్రతమే చెడినా ఫలమే దొరికెనయా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా రామయ్యా వస్తావయ్యా సుమ్మా మాసూరియా

Nallanivanni Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Nallanivanni' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Veturi
Singers : K. S. Chithra
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: కె. ఎస్. చిత్ర నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కథ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 1 వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతులేని కడలి లోతును నేను చూస్తున్నా కడుపులో నిను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా చరణం: 2 తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడుతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇకపైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

Mannela Tintivira Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Mannela Tintivira' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Tippu, Smita and Karate Kalyani.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శివశక్తి దత్తా గానం: టిప్పు , స్మిత, కళ్యాణి మాలిక్ శ్రీ కనక మహాలక్ష్మి కి జై శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై శ్రీ అన్నారం సత్యన్నారాయణ స్వామికి జై శ్రీ రాజ రాజేశ్వరి వరప్రసాద మహారాజ శ్రీ పసలపూడి పంకజం గారికి పర్వ కళ నాట్యమండలికి జై అందుచేత ఆడియన్స్ లారా రసిక సిఖామణులారా వాసికెక్కిన వైజగు వాసులరా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోధమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బాబు గారు చూస్తున్నారు కన్నయ్య బాలురు గొల్లులు చెప్పిరిగాని ఏ పాపమెరుగునే తల్లి ఎలెస్ ఏటిరా ఈ ఎదవ గోల నేను మన్నసలే తినలేదే తల్లి ఏయ్ అబద్ధాలడతావు మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా నీకు వెన్నల్లేవా జున్నులేవా అరిసెల్లేవా పోని అటుకుల్లేవా నీకు నీకు... ఎంటవుతుందిరా..? నీకు పంచదార పూరీలు లేవా నీకు మిరపకాయ బజ్జీలు లేవా నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా పొద్దుకాల తడిపిదూడా పొదుగుపాలు తాగబోతే ఆ తాగబోతే లాగిపెట్టి తన్నిందే మట ్టిమూతి కంటిందే అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా అప్పలెనకా పప్పులు లేవా కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా నీకు కాకినాడా కాజాలు లేవా నీకు మైసూరు బొండాలు లేవా నును బందారు లడ్డూలు లేవా ఆహ ఆత్రిపురం పూతరేకులు లేవా రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా మన్నేల తింటివిరా కృష్ణా ఏటిగట్టు తోటలోనా మొక్కనాటి నీరు పెట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి చెక్కరకేలి గెలలు లేవా పంపర పనస తొనలు లేవా పూరిల్లేవా బూరెల్లేవా తేనెల్లో ముంచిన గారెల్లేవా నీకు కాశ్మీరు యాపిల్సు లేవా అరెరే పాలకొల్లు బత్తాయి లేదా ఇటు వడ్లమూడి నారింజ లేదా అయ్యో కాబోలి దానిమ్మలు లేవా పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి మన్నేల తింటివిరా కృష్ణా నువు మన్నేల తింటివిరా కృష్ణా

Gundusoodi Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Gundusoodi' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta and M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా ఊది ఊది చరణం: 1 తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి హే పడక వేళల ప్రతిసారి పగటి వేళల ఒకసారి ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి నీ గోరు వంకల్లోన చేరేవేళ నేనే అయిపోనా భామచారి అమ్మమ్మ అబ్బబ్బబ్బా హయ్యయ్యయ్యో అంతా వినక అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిగ్గులకే సెలవిచ్చో వచ్చేయి వెనక చూపాలయ్యో ఊపు నీది నాకు చెప్పాలయ్యో తీపి సోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది చరణం: 2 నీకు బోలెడు అది ఉంది నాకు బుట్టెడు ఇది ఉంది ఉఁ ఎత్తిపోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తేనెల్లో ఈది ఈది చాటుల్లో మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది ఇంకింకా ఇంకా ఇంకా కావాలింకా అహా చురక స్త్రీలంక చూడాలింకా నాతోనే కూడింక ఛీపో అనక నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మ ఖైదీ గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది హాయి తెప్పించనా ఊది ఊది

Gala Gala Gala Song Lyrics in Telugu – Chatrapathi (2005)

'Gala Gala Gala' song from Chatrapathi (2005) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra, Jassie Gift and Neeripaal.

SONG INFORMATION
Movie : Chatrapathi (2005)
Lyricist : Chandrabose
చిత్రం: ఛత్రపతి (2005) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: జస్సి గిఫ్ట్, కె. ఎస్. చిత్ర గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనస్సులో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి పండు కోయగలవా దాని తొక్క తియ్యగలవా తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా పండు పిండగలనే దాని తొక్క మొక్కగలనే పక్కలో మగ దిక్కునై రసమొక్కు తీర్చగలనే వలుచుకో వాటేసి వయసు వరహ అదరహొ అందాల ఆడతరహా తమాయించుకోరా దరువేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి పట్టి చూడగలవా ఎద గట్టు డాటగలవా గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే గుట్టుగా ఊరొచ్చిన చిరు చట్టి పట్టుగలనే అందుకెవరున్నారు నేను మినహ అందుకే విన్నాను లేడి సలహ తమాయించుకోరా తలుపేసి గల గల గల గల గజ్జెలు తొడిగిన గ్రంథసాంగి నీ కోసమే నేనేస్కొనొచ్చా గలా గళ్లలుంగి కుర్ కుర్ కుర్ర కుర్ర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసు లో ఏం దాగి వుందో చూస్కో తొంగి తొంగి చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసి చల్లంగ వేడెక్కజేసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

Palli Balakrishna Tuesday, July 7, 2026
Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Banner : Suresh Productions
Music : R. P. Patnaik
Director : Y. Kasi Viswanath
Producer : D. Suresh Babu
Actors : Tarun
Actresses : Aarthi Agarwal, Laya
Supporting Cast : Sarath Babu, Chandra Mohan
Release Date : 14 January 2002

Edo Edo Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Edo Edo' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వై. కాశీ విశ్వనాథ్ గానం: ఉష ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది

Ela Ela Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Ela Ela' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉష ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారమంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Nindu Godari Kada Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nindu Godari Kada' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Kousalya.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Kousalya
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్. పి. పట్నాయక్, కౌసల్య నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ

Nuvvante Naakistam Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nuvvante Naakistam' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్ నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపన ఆగేనా ఆపిన ఎదలో లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం చరణం: 1 చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం చరణం: 2 ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విష్టం ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం... నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....

Chinni Chinni Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chinni Chinni' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Chi Chi Chi Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chi Chi Chi' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik, Lenina Chowdary and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik, Lenina Chowdary, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్, లేనీనా చౌదరి, ఉష పల్లవి: చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి బుల్లోడ చి చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చరణం: 1 ఉంటే జానకిలా రాముని వలచీ వచ్చే శూర్పణక వరసలుమార్చీ సిగ్గేలేని చెలీ తగ్గుమరి చీ చి చి చి బుద్దేలేని ప్రియ పట్టెనట కొత్తపిచ్చి నాతో బడాయిలా లడాయిలా చీ చి చి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చి పో చి బుల్లోడ చి పిల్లోడ చి చరణం : 2 మెచ్చా మేనకనే మెత్తగ వలచి ఇచ్చా నామనసే మల్లెలు తెచ్చి పైపై మెరుగులకే పోయెమతి చి చి చి చి భౌ భౌమనకె చెలీ భానుమతి చి చి చి చి ఐతే జులాయికే జిలాయిలే చి చి చి చి చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ

Palli Balakrishna Thursday, June 18, 2026


చిత్రం: గోరింటాకు (2008)
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 2008

Palli Balakrishna Saturday, March 16, 2019




చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, 
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: ఆర్. బి.చౌదరి
విడుదల తేది: 18.02.2005



Songs List:



ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, సదన సర్గం 

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన 





అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: హరిహరన్, శ్రేయా ఘోషల్

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

చిరుగాలికి ఏదో పాపం సందేహం
మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది
ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం
నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది
వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం
నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం
హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం
శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం
విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమైనా మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా
జాబిలికే వెలుగు సూర్యుడే
నువు లేని బ్రతుకు శూన్యమే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు




అడే పాడే పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కార్తీక్, చిత్ర 


అడే పాడే 



ఆశ ఆశగా పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 


ఆశ ఆశగా 



చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శంకర్ మహదేవన్ , సుజాత

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం - హేయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం 

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు 
చెమ్మచెక్క ఆటాడిస్తాలే 
మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు 
వేటగాడి ఊపే చూస్తాలే 
దేదె చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే 
రా రా రాజా నేనే నీ రోజా ఉ అంటే వొళ్ళోకోస్తాలే... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్ 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

హే ప ప ప పాలపిట్టా పైటే పట్టు వద్దంటే నీమీదోట్టు
వరసంగా పిండే ఇస్తాలే లే లే
గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు 
జజ్జన్నక జమ ఇస్తాలే 
హె.హె తయ్య రయ్య అరే తస్సదియ్య 
వాటంగా ఒళ్ళొకోస్తాలే... 
హే... రావే పిల్ల నా తుగో జిల్లా 
వయ్యారం తాళం తీస్తాలే 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం




డోలి డోలి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: శంకర్ మహదేవన్, ఎస్.ఎ. రాజ్ కుమార్, చిత్ర, కల్పన 

డోలి డోలి



(పెళ్లి పాట - I) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

పెళ్లి పాట - I




చక్కని మా అన్నయ్యకు (పెళ్లి పాట - II) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ 
వచ్చింది ఇంటికి తన జంట గూటికి 
చిరినవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ 
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక 
సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా 
నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా 
పొంగే ఆనందం తెచ్చే సంతోషం 
మాలోగిలి నిండెనే 
వధువే బంగారం వరుడే తనసర్వం 
ఇది నూరేళ్ళ బంధమే

Palli Balakrishna Monday, March 19, 2018


చిత్రం: సోగ్గాడు (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు , కౌశల్య
నటీనటులు: తరుణ్ కుమార్ , ఆర్తి అగర్వాల్, శ్రేయా శరన్
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 31.03.2005

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

Palli Balakrishna Wednesday, December 6, 2017


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష
నటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 01.11.2002

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం

ఓ హాని - ఐ లవ్ యు

నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపే నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటిరాదే కలలో ఆశ
పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
నిన్నే చూసే కల కోసం
సర్లేకాని చీకట్లోనే చేరుకోని
నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది యదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడ్లేని ప్రేమ రోగం
తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం


********    ********   ********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంటపడకుంటే
తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలజడి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి


*********   *********    *********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ... ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గసగా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా
రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
ఆ...రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ...ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా

చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ , రాజేశ్

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి




*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

 (సోలో సాంగ్)

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం!
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా!

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా
అందాల ఆకాశమా

Palli Balakrishna Thursday, November 16, 2017



చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణ
విడుదల తేది: 05.06.2003



Songs List:



గుండమ్మో గుండమ్మో పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు, కల్పన

గుండమ్మో గుండమ్మో 




బృందావనంలో గోపెమ్మల్లే పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కల్పన , మల్లికార్జున

పల్లవి:
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే

భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక

చరణం: 1
వెన్నాముద్దలతో కన్నె ముద్దులని కలేసి కొట్టేసేయ్
గండు తుమ్మెదలా దొండాపండంటి నా పెదాలు పట్టేసేయ్
గురువా తేనల్లే జుర్రేసెయ్
కొంగు జాడింపులో కొంటె ఊరింపులు కులాష ఎంతున్నా
బేబీ వేధింపులో తాపం  తాలింపులో తమాషా లేదమ్మా
నా భూలోక రంభమ్మ
బలిరా నరసింహ బరిలో దిద్దుకో 
తనువిస్తా నినుగాని సిరులే పంచుకో

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక

చరణం: 2
పచ్చా పచ్చని వంపు వెచ్చా వెచ్చంగ కన్ను కొట్టేసి రమ్మంటే
ఎర్రా బుగ్గలదాన ఈడు మత్తెక్కిపోయి పిచ్చోడి నవుతున్నా
నీ ఒళ్ళో పిల్లాడి నవుతున్నా
ఏదో తలచుకొని ఎన్నో కలలు కని వెర్రెక్కి పోతున్నా
నీలో మత్తెక్కె సెగ సలాము చేస్తున్నా 
నీ గులాము నౌతున్నా
సాహా జవరాల సరదా తీర్చుకో
ప్రతి పగలు ప్రతి రాత్రి నన్నే దాచుకో

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే

భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక




బందరులో పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: శంకర్ మహదేవన్ చిత్ర 

బందరులో 




ఓసోసి పూలతీగా పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ఓసోసి పూలతీగా 
 



పలకా బలపం పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, షాలిని సింగ్ 

పలకా బలపం 
 



సరసాల సుందరయ్య పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్ , రాధిక, పూర్ణిమ 

సరసాల సుందరయ్య 

Palli Balakrishna Thursday, November 2, 2017

Most Recent

Default