-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Veerabhadram Chowdary"



చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
నటీనటులు: అల్లరి నరేష్ , రీతూ బర్మచా, అనిత
దర్శకత్వం: వీరభద్రమ్
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర
విడుదల తేది: 02.03.2011



Songs List:



సుబ్రహ్మణ్యం పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె

సుబ్రహ్మణ్యం 





నువ్వే నచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: చిత్ర 

నువ్వే నచ్చావు 




లెఫ్ట్ చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు, సింహ, భార్గవి పిళ్ళై

లెఫ్ట్ చూస్తే




వెన్నెల దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం:  సిరా శ్రీ 
గానం: రఘు కుంచె

వెన్నెల దీపం 




చినుకులా రాలి పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: వేటూరి
గానం: రఘు కుంచె, అంజనా సౌమ్య

(ఈ పాట నరేష్, పూర్ణిమ నటించిన నాలుగు స్థంభాలాట (1982) చిత్రం లోనిది, దీనికి సంగీతం: రాజన్ - నరేంద్ర, సాహిత్యం: వేటూరి, గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఈ సినిమాలో రీమిక్స్ చేశారు)

చినుకులా రాలి
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
నదివి నీవు కడలి నేను 
మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా 

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగాపొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 

ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే 
కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే 
ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే 
జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే 
ఆ చల్లనీ గాలులే...

హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి 
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ 
శిశిరమైన  సిధిలమైన
విడిచిపోబోకుమా విరహమై పోకుమా

తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే  
పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే 
నింగికినేల అంటిసలాడె  ఆ పొద్దురావాలిలే 
నిన్నలు నేడై  రేపటి నీడై నాముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే...

మౌనమై మెరిసి గానమై పిలిచి
అలలతో అలిసి  గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ 
భువనమైనా  గగనమైనా
ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా...




సాటర్ డే ఈవెనింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: అహ నా పెళ్ళంటా (2011)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి 
గానం: పృద్వీ చంద్ర, అనుదీప్ దేవ్ , నోయెల్ (RAP)

సాటర్ డే ఈవెనింగ్ 

Palli Balakrishna Friday, November 10, 2017

చిత్రం: చుట్టాలబ్బాయి (2016)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామజోగయ్య శాస్త్రి , శ్రీకృష్ణ , గీతామధురి
నటీనటులు: ఆది, నమితా ప్రమోద్, ప్రణీత
దర్శకత్వం: వీరభద్రం చౌదరి
నిర్మాతలు: తళ్లూరి రాము, తలారి వెంకట్
విడుదల తేది: 19.08.2016

పల్లవి:
పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి
పట్టుచీరలన్ని ముస్తాబైపోయాయి
అందాల కనువిందుగ
పంచికట్టు లాల్చీ ప్యాంటు షర్టులన్నీ
జిగేలుమన్నాయి ఉల్లాసంగా
పందిళ్లు తోరణాలు వేసివున్నాయి
అక్షింతలు దీవెనలు ఆ గట్టిమేళం
ఎప్పుడంటు గోల పెట్టెస్తున్నాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి

చరణం: 1
కుందనాల బొమ్మండి
చందనాల కొమ్మండి
భూమ్మిద సీతమ్మె మా సుందరి
అంత మంచి రత్నాన్ని
ఎంచుకుంది ఎవరండి
మాయింటి రామయ్యే కాడా మరి
అందానికే అందం చెలి
అబ్బా మీ పెళ్లికొడుకు పంట పండింది
అదృష్టమంటే మీ పిల్లదేనండి
అందుచేత మా కుర్రాడి కంట పడింది
మాటల్లో పొద్దుపోతే లాభమేముంది
జీరాబెల్లాలు పెట్టి తాళిబొట్టు
కట్టకుంటే మూర్తమెల్లిపోతుంది

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

చరణం: 2
అడ్డుగోడై తెరసెల్లా
ఆడుకుంటోందేంటిళ్ల
పిల్లాడి ఆత్రాన్ని ఆపేంతలా
సిగ్గుబరువై నిలువెళ్ల
తలవంచుకుందే పూబాల
అందాల వెన్నెల్ని దాచేంతల
ఇన్నాళ్లుగా వేచారుగా
ఇందాక వచ్చికూడా ఇన్నికష్టాల
కన్నెర్రగా కందేంతగా
దోబూచులాటలో అల్లాడిపోవాలా
బుగ్గల్లో చుక్కలు రెండు తొందరన్నాయి
మాంగల్యం తంతునా వియ్యాలు కలిపే
అయ్యవారి మంత్రమేగ తరువాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి


Palli Balakrishna Wednesday, November 8, 2017

Most Recent

Default