-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "G. Ashok"


చిత్రం: ఆకాశ రామన్న  (2010)
సంగీతం: చక్రి
నటీనటులు: అల్లరి నరేష్ , శివాజీ, రాజీవ్ కనకాల, మీరా జాస్మిన్, గౌరీ పండిట్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత: మన్యం రమేష్
విడుదల తేది: 12.03.2010


Palli Balakrishna Friday, February 15, 2019

చిత్రం: భాగమతి (2018)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: శ్రీజో
గానం: శ్రేయ ఘోషల్
నటీనటులు: అనుష్క , జయరాం
దర్శకత్వం: జి. అశోక్
బ్యానర్: U.V. క్రియేషన్స్
నిర్మాత: వి.వంశీకృష్ణారెడ్డి
విడుదల తేది: 26.01.2018

మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నా కళ్లారా
సరికొత్త స్నేహం దారిచేరా
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బదులో
ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగ ఎగిరే ఎదలో
తెలియని భావం
తెలిసే కథ మారేనా

ఒహ్హ్…
నీ వెంట  అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తూ
నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా

మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా
సుందరా.. రా..రా..
మందార.. రా..రా..
కళ్లారా.. రా..రా..
సుందరా.. రా..రా..

మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమరికా
కడలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే

మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా

కళ్లారా కళ్లారా
చూస్తున్నావా కళ్లారా
ఈ సరికొత్త స్నేహం దారిచేరా

మందార  మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా

Palli Balakrishna Friday, February 1, 2019



చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
నటీనటులు: నాని, అవసరాల శ్రీనివాస్, హరిప్రియ, బిందుమాధవి
దర్శకత్వం: జి. అశోక్ 
నిర్మాత: డి. యస్. రావ్
విడుదల తేది: 29.09.2011



Songs List:



తలబడి కలబడి పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: శంకర్ మహదేవన్

తలబడి కలబడి నిలబడు 
పొరాడె యోదుడు జడవడు 
తలబడి కలబడి నిలబడు 
పొరాడె యోదుడు జడవడు 
సంకల్పం నీకుంటె ఓటమికైనా ఒనుకేరా 
బుడి బుడి అడుగులు తడబడి 
అడుగడుగున నీవె నిలబడి 
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటు పడి 
వెలుగంటు రాదు అంటె సూరీడైనా లోకువరా 
నిసి రాతిరి కమ్ముకుంటె వెన్నెల చిన్న బోయెనురా 
నీ శక్తె తెలిసిందంటె నీకింక ఎదురేది 

ప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలి 

ప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలి 

పిడికిలినేబిగించి చూడు 
అవకాశం నీకున్న తోడు 
అసాద్యమే తలంచుకుంటు క్షమించు అనేలా 
రేపుందన్ని లోకాన్ని నమ్మి 
అలసటతో ఆగదు భూమి 
గిరా గిరా తిరిగేస్తుంది క్రమంగా మహ స్తిరంగా 
ప్రతీ కల నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే 
ప్రతీకవే నువు అవుతాఉ ప్రవర్తనే ఉంటే 

ప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలి 

ప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలి 

జీవితమే ఓ చిన్న మగిలీ 
వెల్లిపోమా లోకన్ని వదిలీ 
మల్లి మల్లి మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ 
గమ్యం నీ ఊహల జననం 
సోదనలో సాగేది గమనం 
ప్రయానమే ప్రాణమ కాద గెలుపుకీ ప్రతి మలుపుకీ 
ప్రతీ రోజు ఉగాది కాద ఉషస్సు నీవైతే 
ప్రబంజనమే చూపిస్తావు 

పతిప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలిభే చూపిస్తే 

ప్రాకాశంలో సూరిడల్లె 
ప్రశాంతంగ చంద్రుడిమల్లె 
వికాసంలొ విధ్యార్దల్లె 
అల అలా ఎదగాలి 





చుట్టూ చుట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సైంధవి,  ప్రసన్న

చుట్టూ చుట్టూ



ఊపిరి ఆడదు పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: కార్తిక్, చిన్మయి

ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొన ఊపిరితో ఉన్నా ప్రాణం పొయ్యవే
ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే
కొన ఊపిరితో  ఉన్నా ప్రాణం పొయ్యవే

నా నా మనసే మనసే నన్నే నన్నే 
వదిలి వెళుతుందే నీతో ఎటువైపో
ఈ క్షణం అయోమయం ఇంతగా 
నన్నే కలవర పెడుతుందే
తడబడి తడబడి రా తేనె పలుకై రా
కనపడి కలబడిన ప్రేమే ముడిపడునా
మధురం మధురం మధురం ఈ పరువం మధురం

ఊపిరి ఆడద నీకు - ఎదురు నువ్వైతే
నేనేం చేశా నేరం - ప్రాణం తీయకే
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే 

నీ కోసమా...
మధురం మధురం  పరువం

నా మనసే నన్నే వదిలి
నీతో వెళుతుందే ఎటువైపో ఎటువైపో
నా ఎద సరాసరి కనదే మరి నా మనసెందుకో

గడసరి మగసిరి నిన్ను కోరింది
సొగసిరి ఎదమరి తీరే మారింది
గుప్పెడు మనసే అలా ఎలా కొట్టేశావే
కనికట్టేదో కథాకలి కట్టిస్తుందే
మరువం మరువం పరువం చేసే గాయాలే

ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా
కొన ఊపిరితో ఉన్నా -  ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే 
నా కోసమే...
మధురం మధురం  పరువం

చినుకునై చిలిపిగా నిన్ను తడిమేయ్నా
గొడుగునై సొగసుపై నిన్ను ఆపేయ్నా
వయసొక నరకం వాంఛలే వేధిస్తుంటే
తియ్యని తమకం అమ్మో భయం ఏం చేస్తుందో...
మరువం మరువం పరువం చేసే గాయాలే

ఊపిరి ఆడదు నాకు - ఎదురు నే రానా
కొన ఊపిరితో ఉన్నా  -  ప్రాణం నేనవనా
ప్రణయం పదిలం అంటూ నా ప్రాణం కుదిపేశావే
అలకల కులుకే అందం ఓ కిలకిల చిలుకా రావే రావే 
నా కోసం
నీ కోసమే...
మధురం మధురం  పరువం




రంగు రంగు పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: ముకేష్ , ప్రియా హిమేష్

రంగు రంగు



పిల్ల జమీందార్ (Club Mix) పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: రంజిత్ , ప్రియా హిమేష్

పిల్ల జమీందార్  (Club Mix)



హాయ్యయో పాట సాహిత్యం

 
చిత్రం: పిల్ల జమీందార్ (2011)
సంగీతం: వి.సెల్వ గణేష్
సాహిత్యం: శ్రీమణి
గానం: సోలార్ సాయి

హాయ్యయో


Palli Balakrishna Wednesday, November 8, 2017



చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, నిషా అగర్వాల్
దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత: కె.వేణుగోపాల్
విడుదల తేది: 10.05.2013



Songs List:



తొంగి తొంగి (Club Mix) పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: విజయ్ ప్రకాష్ 

తొంగి తొంగి (Club Mix)



మనసున వెయ్యి కన్నులతో పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: విజయ్ ప్రకాష్ 

మనసున వెయ్యి కన్నులతో 
కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే 
కానరాదంట ప్రేమ
ఇద్దరి మధ్యన ఒద్దికగా 
ఇమిడిపోతుంది ప్రేమ
ఒంటరిగానే ఎందరినో 
ఏడిపిస్తుంది ప్రేమ

ఏ బాధ తానో ఏ వేదనో
ఎండలే మసి చేసే ఆ గుణం
నూరేళ్ళ ఆశే మూన్నాళ్ళ చేసి
కన్నీట ముంచేయదా ఆఆ

మనసున వెయ్యి కన్నులతో 
కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే 
కానరాదంట ప్రేమ

కలలకు తీపి గురుతులనే 
కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు 
నిలిచిపోతుంది ప్రేమ
ఒక్కరి గుండెను ఇద్దరికి 
పంచి పెడుతుంది ప్రేమ
ఇరువురి లోన బంధమనే 
పెంచి పెడుతుంది ప్రేమ
ఏ బాధనైనా మరిపించదా
యెదలో తాను ఉంటె ప్రతిక్షణం
ఏ జన్మకైనా నే కోరుకొనే
నా తోడు ఈ ప్రేమనే 
నా తోడు ఈ ప్రేమనే
కలలకు తీపి గురుతులనే 
కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు 
నిలిచిపోతుంది ప్రేమ



సుకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: రాజా హాసన్, రాజేష్ , ధనుంజయ, మంజు, రమ్యా, ప్రదీప్తి 

సుకుమారుడు




మనసున నువ్వేలే పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రాంభట్ల
గానం: అంజనా సౌమ్యా 

మనసున నువ్వేలే 



తొంగి తొంగి సూడమాకు సందమామ పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ 
గానం: రాంకీ, సుచిత్ర

తొంగి తొంగి తొంగి తొంగి
అరె తొంగి తొంగి సూడమాకు సందమామ
నా అందమంతా నీదే సందమామ
హే అందమంతా నాదైతే సందమామ
సోకులెట్టా దాచుడేంది సందమామ
తిరునాళ్ళు తీసుకెళ్లి సందమామ
నాకు రబ్బర్ గాజులెయ్యి సందమామ
వయ్యారి నడుము చుట్టూ సందమామ
నీకు వడ్డాణము వేయిస్తా సందమామా చల్
ఓయ్ ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు చందమామ చందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు చందమామా

హే కంచ్చి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు
ఓ మల్లె తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు
మసక మాపటేల వచ్చి నిన్ను చేరుతాలే
హే రంగు రిబ్బన్లన్నీ సంతకెళ్లి తెచ్చి పెట్టు
చిన్ని ముక్కుకేమో ముక్కెరేట్టు నచ్చినట్టు
సోకు చేసుకొని నీకు ముద్దులెట్టు థాలే ఉమ్మా
అరె ఇంకేమి కావాలె చందమామ ఇట్టాగే తెచ్చిస్తా సందమామ
సక్కని జాల్లోకి చందమామ సామంతి పూలు తెర అందమంతా
హే పూవు లేంటి సీరలేంటి సందమామ
నీకు చుక్కలని కోసిస్తా సందమామా
అరె ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు సందమామ సందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు సందమామా

హే లేత బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టిపించు
తేనె పెదవి పైన లిప్స్టిక్ అద్దీపించు
ఘాటు కౌగిలించి స్వర్గమేంటో చూపుతాలే
హే మోటు సరసమాడి గిల్లుతావే సక్కనోడా
ముద్దు ముచ్చటంత తీరినాక కానరావు
నువ్వు మాట కూడా చెప్పకుండా జారుతావే
హే ఇంకేమి చెయ్యాలె సందమామ
చెప్పెయ్యి చేసేస్తా సందమామ
మూడు ముళ్ళు వెయ్యాలి సందమామ
నీ ఇంటి దాన్ని చెయ్యాలి సందమామ

హే మూడు ముళ్ళు ఎందుకంటా సందమామ
నా గుండె నీకే రాసి ఇస్తా సందమామ
చల్ అరె ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు సందమామ సందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు సందమామా




ఓ... నీలాకాశంలో మెరిసే చంద్రుడివే పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయ ఘోషల్

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

ఓహోహో పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

ఓ ఓ ఓ అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

హే సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంటా నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

హో నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ

ఓఓఓ రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ

నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ




ఓ బేబీ నా లోకం పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనూప్ రూబెన్స్ & కోరస్ 

ఓ బేబీ నా లోకం 

Palli Balakrishna Tuesday, August 1, 2017

Most Recent

Default