Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nuveksha"
Naa Praanama (2025)



చిత్రం: నా ప్రాణమా (2025)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నువేక్ష 
దర్శకత్వం: వినయ్ షణ్ముఖ్ 
నిర్మాత: 
విడుదల తేది:  09.08.2025



Songs List:



నా ప్రాణమా పాట సాహిత్యం

 
చిత్రం: నా ప్రాణమా (2025)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఆనంద్ గుర్రం , రామ్ మిరియాల
గానం: రామ్ మిరియాల

ఇక్కడే ఉండమని వెళ్ళవే
ఇప్పుడే వస్తానన్నావే
నీదారి వైపే చూస్తున్నానే
ఏ దారి లేక నిలుచున్నానే
కోపమనుకొన శాపమనుకొన
కలలోనైనా గుర్తుకేరానా
నిన్ను ప్రేమించి తప్పే చేశానా..!

నా ప్రాణమా….నా ప్రాణమా….
నీకోసమే……నేనున్నానమ్మా.. ఆఆ
నువ్వోస్తావాని ఆశతోనే…..
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా…..

నేనే నీ లోకం అన్నావే
నీ లోనే నన్ను చూసుకున్నవే
కౌగిట్లో కరిగి పోదాం అన్నావే
కవ్వించి కను మరు గయ్యావే
నీ ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా
నీ పిచ్చి ఊహల్లో తిరుగున్నాన
చేసావే నాతో కాల యాపన..!

నా ప్రాణమా….నా ప్రాణమా….
నీకోసమే……నేనున్నానమ్మా.. ఆఆ
నువ్వోస్తావాని ఆశతోనే…..
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా…..

Palli Balakrishna Tuesday, April 7, 2026
Sebastian P.C. 524 (2022)



చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , నువేక్ష, కోమలి ప్రసాద్ 
దర్శకత్వం: బాలాజీ సయ్యపు రెడ్డి 
నిర్మాతలు: బి.సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ 
విడుదల తేది: 04.03.2022



Songs List:



నా ప్రపంచం హేలి పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: కపిల్ కపిలన్ 

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే

నా ప్రపంచం హేలి అనే నాకు
అసలేమౌతోందో చుట్టూ తెలియదుగా
నా చిరాకే ఉంది పరారీలో
తెగ సంబరపడుతూ ఉంటా
నువ్వే కనబడగా కదలనుగా
మెదలనుగా వదలనుగా

ఎక్కడిదే ఈ వెలుగంతా నా కళ్ళలో
నీలాలలా మెరిసే నీ నవ్వులందే
ఎప్పటికీ నను బతికించే ఊపిరివే
గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే

నువ్వొచ్చాకనే కదా జీవితం అంటే తెలిసింది
అవస్థ ఉన్నా సరే నా పనికి బాధ్యత పెరిగింది
నువ్వు లేవా… నేనసలు ఏమైపోతానో జీవితము ఏమౌనో
ఎపుడైతే నీతో ఉంటానో సందడిగా ఉంటానే

నిజము తెలుపనా లేదుగా
మనసు మనసులా
జతపడు అడుగు అడుగునా
కుదురుగా మనసు నిలవదా

విడివిడినే మడగడదాం
వడివడిగా ముడిపడదాం
హా, ముడిపడదాం
విడివిడినే మడగడదాం

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు





కంటిలోని చీకటిని పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: పద్మలత 

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం

నిరాశ ఒడిలోన పారాడక
తీరానికి దారి చూపు
ఆశ మీద దూసుకుపో పారిపోక

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం

దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ




నీ కనులలో దాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్

హ్మ్ మ్ మ్ మ్
నీ కనులలో దాగుందా మాయాజాలం
ఏ కదలికా లేకుండా లేదా కాలం

మనసారా మన మాటల్లో మునకేసింది
తనువారా మహదానందం చవిచూసింది
మనపై పనిలో పనిగా కధ రాసింది
మరలా మరల చదివి తెగ మురిసింది

ఎంత ప్రేమగా బిగిసింది
జంట మధ్యలో జారుముడీ

నీ కనులలో దాగుందా
మాయాజాలం
ఏ కదలికా లేకుండా
లేదా కాలం




న్యాయాన్ని కాపాడే పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్ , సాహితి గాలిదేవర 

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది

అన్యాయం వైపుండే
బంధాలే ఉన్నా కాని
సంకెళ్ళు వద్దంటే
నేరం అవుతుంది

లోకం చూడని లోపం బాధిది
లోనుండే ఇజాన్ని మోయకు
ఫ్రెండేరాయని ప్రశ్నే వేయక
సాగించే ప్రయాణమే దులుపు

మేయగా చిమ్మ చీకటి మారదే
నిజాన్ని ఓ కాంతిరేఖలా నీ చూపు
ఏమైనా కాని ధైర్యాన్ని పూని
సత్యాన్ని గెలిపించెయ్ నేడు

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది




The Rage Of Seba పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: గీబ్రాన్
గానం:  దీప్తి సురేష్ 

The Rage Of Seba

Palli Balakrishna Monday, March 21, 2022
Atithi Devo Bhava (2022)



చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటినటులు: ఆది సాయికుమార్, నువేక్ష 
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్
నిర్మాతలు: రాజబాబు మిరియాల, అశోక్ రెడ్డి మిరియాల 
విడుదల తేది: 07.01.2022



Songs List:



బాగుంటుంది పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సిద్ శ్రీరా,ం నూతన మోహన్ 

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే

బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న
కాటుకంతా ఒంటికంటితే

అహహహా బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస

అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని

కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా టెన్ టూ ఫైవ్

అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా, (తెలుసు కదా)
అయినా బయటపడవు కదా, (పడవు కదా)
పదపదా ఎంతసేపిలా

వెలివేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని

నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మోసావు అన్ని దారులు

కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారి లేక నేనిలా
బంధించానే అన్ని వైపులా

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే



నిన్ను చూడగానే పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

నిన్ను చూడగానే నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే

ఒక నవ్వే కదా… ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా

నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది
నాదో చిన్న ఆశ

నీలో నన్ను చూశా
నాలో నిన్ను మోశా
అవునన్నా నువ్వు కాదన్నా
నా మనసే నీకిచ్చేశా

పూట పూట గుర్తొస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే

ఈ జన్మ నీతోనే
మరుజన్మ నీతోనే
వచ్చి వచ్చి గుండెల్లోన
వాలిపోవే గువ్వలా

నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటేనే సంతోషాన్ని
వెయ్యలేను కాటా

నువ్వే ఉన్న చోట
కాదా పూల తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా
నాకేం వద్దు వాటా




గాజు బొమ్మ తీరునా పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హృతికా ఆనంది, రితేష్ జి రావు

గాజు బొమ్మ తీరునా



చిన్న గుండె పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: గీతా కృష్ణ
గానం: శ్రీ కావ్య చందన, రితేష్ జి రావు

చిన్న గుండె

Palli Balakrishna Friday, October 29, 2021

Most Recent

Default