తెల్లారేలోపు లైఫె మారిందేమో గేటప్ బీ రెడీ
తెల్లారేలోపు లైఫె మారిందేమో గేటప్ బీ రెడీ
-->
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ నటీనటులు: అభినవ్ చుంచు, తేజ్ కూరపాటి, తేజుస్ కంచర్ల, దినేష్ తేజ్, ప్రియ వడ్లమని, రమ్య పసుపులేటి, దక్ష నగర్కర్, హెంల ఇంగ్లే దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, ఏ. రియాజ్ విడుదల తేది: 14.12.2018
Songs List:
న న న పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: బోబో శశి న న న
ఉండిపోరాదే పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ గానం: సిద్ శ్రీరామ్ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిలా నిన్నే చూశాకా మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే చీకట్లో కూడా నీడలా నీవెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిముషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే
ఫ్రెండ్షిప్ పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: సున్నీ MR సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: తుషార్ జోషి ఫ్రెండ్షిప్
పిచాక్ పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: వరికుప్పల యాదగిరి సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: వరికుప్పల యాదగిరి పిచాక్
నాటు నాటు పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: రాహుల్ సిప్లిగంజ్, ప్రియ హిమేష్ నాటు నాటు
నువ్వే నువ్వే పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: సున్నీ MR సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అర్జిత్ సింగ్ నువ్వే నువ్వే
ఓ పిల్లా కాబూమ పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: వరికుప్పల యాదగిరి సాహిత్యం: కళానిధి మాస్టర్ జి గానం: రాహుల్ రామకృష్ణ ఓ పిల్లా కాబూమ
ఉండిపోరాదే (Sad Song) పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ గానం: సిద్ శ్రీరామ్ ఉండిపోరాదే గుండె నీదేలే (Sad Song)
కాబూమ్ పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: సున్నీ MR సాహిత్యం: రోల్ రైడ గానం: రోల్ రైడ కాబూమ్
ఉండిపోతారా (Female Version) పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: రధన్ సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ గానం: స్పూర్తి యాదగిరి ఉండిపోతారా, గుండె నీదేరా హత్తుకుంటారా, నిన్ను మనసారా కలతై కనులే వెతికేరా నీకే ఒదిగే తనువే జతలేక తోడై చుట్టూ నావెంటే ఎంతో మంది ఉన్నా నా నువ్వే లేవని యాతన కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారవు శ్వాసగా మది నిను మరువనని మాటే ఇచ్చెనులే మరువక కడదాకా ఉండరా మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం నన్నేమన్నా ఏమనుకున్నా నుఫ్లేకుంటే చీకటే ఉండిపోతారా, గుండె నీదేరా హత్తుకుంటారా, నిన్ను మనసారా
బ్యాడ్ బాయ్స్ పాట సాహిత్యం
చిత్రం: హుషారు (2018) సంగీతం: సున్నీ MR సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సున్నీ MR, రోల్ రైడ బ్యాడ్ బాయ్స్
'Nee Kannu Neeli Samudram' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Javed Ali and Sreekanth Chandra.
'Dhak Dhak Dhak' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sarath Santhosh and Hari Priya.
'Ranguladdhukunna' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Yazin Nizar and Hari Priya.
'Jala Jala Jalapaatham Nuvvu' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Shreya Ghoshal and Jaspreet Jasz.
'Eswara' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
'Sandram Lone Neerantha' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sean Roldan.
'Ninne Naa Ninne' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sameera Bharadwaj.
'Silaka Silaka' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Kailash Kher.

చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత నటీనటులు: శర్వానంద్, సమంత దర్శకత్వం: సి. ప్రవీణ్ కుమార్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 07.02.2020
Songs List:
The Life of Ram పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ప్రదీప్ కుమార్ ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలవే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ పశ్నై ఉంటానంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన రుసరుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ... ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనగా అనగనగా... అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక తుధి లేని కథ నేనుగా గాలి వాటం లాగ.. ఆగే అలవాటే లేక కాలం నిలవదు ఏ చోట నిలకడగా యే చిరునామాలేక యే బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక.. మౌనంగా నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు నా ఊపిరిని ఇన్నాళ్లుగా తనవెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమ ఘుమ లెవిరివీ లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా విన్నారా నేనూ నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా అమ్మ వడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉందీ జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఉయాలలూపింది జొలాలి
ప్రాణం నా ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గౌతం భరద్వాజ్ ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా ప్రాణం నా ప్రాణం - నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ మన బాల్యమే ఒక పౌర్ణమి ఒకే కథై అలా మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా మళ్ళి మళ్ళి జాబిలి వేళ వెన్నెల జల్లిందిలా నీ జంటగా మారేలోపే ఈ నిమిషం కలలా దాచేయాలి గుండెలో గురుతుల తారా తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా
ఊహలే ఊహలే పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గోవింద్ వసంత పియా బాలము మోరా పియా మోరా బాలము పియా ఘర్ ఆవో ఘర్ ఆ పియా ఘర్ ఆ ఆ జీ బాలమ మోరా బాలము మోరా పియా పియా హ బాలము మోరా మోరా ఆ ఆ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో కంట నీరు లేని రోజు కలిసెనే ప్రాణములో ప్రాణ సడే ఊహలే ఊహలే నిను విడవవులే గుండెకే ప్రాణమై పూసే పూసే ఊహలే ఊహలే నిను మరిచిన వేళ ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ
నా కలే కలై పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: బ్రింద నా కలే కలై నన్నే వదిలే నే నిలా ఎలా ఎలా నమ్మనీ నిజమే.. కుదురు చెదిరింది లే కలత తొలిసారిలా నాలోపలే అయ్యానులే శిలై ఎదురుపడవే నువ్వే మదికి వివరించవే నిజం ఇదేనని బదులే నువ్వే నా జతగా నువ్వే లేక తరగతి గది గతై మారేనే ఇలా నీ మరుపే గురుతే రాక మది పదే పదే నిన్నే వెతికెనే వలలా అసలు ఇది ఎవరి నేరమా ఎలా అడగను కనుల నది దాటు నీరునే ఎలా నిలుపను మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను సెలవికనే ఎంత సులువుగా ఎలా నమ్మను
ఇంతేనా ఇంతేనా పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి ఇంతేనా ఇంతేనా ఒక మాటైనా మాటాడవేదైనా ఇంతేనా ఇక ఇంతేనా ఎన్ని ఆశలతో ఆలా నువ్వు నీ చెంతనా కాలమే మారెనా దూరమే చేరినా వసంతమెగిరే ఎడారి ఎదురైనా ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే ఈరోజు కుడా గెలిచిందిలే నీ మౌనమే సూటిగా చూపదే నీ గుండె చాటు భావాల బాధనే నువ్వే ఎలా చెప్పాలి? ఎలా అడగాలి? నాతోటి ఆటలాడేటి రాతల నువ్వే పాఠాలు చదివిన కాలం నువ్వే పాఠాలు నేర్పిన కాలం నువ్వే అర్ధం అవ్వనీ పాఠమల్లే ప్రతి క్షణం నా నువ్వే సంద్రాలు దాటెను నా రెక్కలే తీరాలు తాకేను నా పరుగులే మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగెనే.. రేపటి ఊహలు నిన్నటి ఆశలే కన్నీటి పాటల నిన్ను దాటనులే ఈరోజు కోసం వీచింది నా ప్రాణమే ఈరోజు కూడా నిన్ను అనే పోనివ్వనే
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: చిన్మయి, గోవింద్ వసంత కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పువ్వు కంట నీరే కురిసే అమ్మ ఒడి వీడే పసిపాపలా వెక్కి వెక్కి మనసే తడిసే చదివే బడికే వేసవి సెలవులా తిరిగి గుడికే రావాలి నువ్విలా ఒక్కపూట నిజమై మన కలలు ఇలా... ముందరున్న కాలం గడిచేది ఎలా బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా కన్ను వీడి చూపే వెళుతోందిలే కంట నీరు తుడిచేదెవరే చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే నిను విడువని ఏ నన్నో వెతికేనులే చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే మన ఊసులే జతలేక ఎడబాసెలే నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే మనం మనం చెరో సగం చెరో దిశల్లే మారినా ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా నువున్న వైపు తప్ప చూపు తప్పు దిశను చూపునా అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచెనా మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు కవితలే రాసే నీకై మల్లీ రా
అనంతమే పాట సాహిత్యం
చిత్రం: జాను (2020) సంగీతం: గోవింద్ వసంత సాహిత్యం: శ్రీమణి గానం: గోవింద్ వసంత, చిన్మయి శ్రీపద కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటే ఏమో కదా యుగాల ప్రేమ జాగాలనేలుతోంది రాజు లాగ శపించు వరమా పూసే పువ్వోటి చాలే లోకాన్ని గెలిచి చూపుతోందే తీపి కన్నీరు దాగుండే సాగరం ఇదే ఈ ప్రేమ కావ్యం రాసిందే ఎవ్వరంటే ఏమో ఈ ప్రేమ గాయం చేసేది ఎవ్వరంటే వివరమేది లేదంది కాలం కాదన్న ప్రేమ - నీడలాగా వస్తుందే అవునన్న ప్రేమ - చేతికంది రాదే ప్రేమల్లో పడితే - మాయలాగా ఉంటుందే ప్రేమల్లో చెడితే ప్రాణమే నిశి ఆగనంటూనే సాగదే సాగనంటూనే ఆగదే అన్ని అంటూనే మూగదే ప్రేమకేది సాటిరాదే ప్రాణమెంతున్న చాలదే జన్మలెన్నున్న మారదే విశ్వమంతున్న ప్రేమదే గుప్పెడంత గుండే ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే ఓ ఓ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం ఊసు కలపదే ప్రేమలకే.. ఊపిరిదే ఊహలే ఊహలే నిను విడవవులే గుండెకే ప్రాణమై పూసే పూసే ఊహలే ఊహలే నిను మరిచిన వేళ ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ... ఓ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లే… ఓ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే… ఓ..ఓహో శ్రీకారమే ఆకారం ఓంకారం ప్రేమే ఓ..ఓహో అనంతమే అనంతమే ఇదంత ప్రేమే చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెబుతుంది ప్రేమ! ప్రేమ ఒక రోజు నిన్నూ పలకరిస్తుంది, దాన్ని కౌగిలించు, కంటిరెప్పల్లో దాచు. ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. ప్రేమ కవ్విస్తుంది, కవిత్వం రాస్తుంది. ప్రేమ ఏడుస్తుంది. ప్రేమ కల్లోలంలో పడేస్తుంది. ప్రేమ కాస్తంత అర్థం అవుతుంది. ప్రేమ విరహాన్ని పెంచుతుంది. ప్రేమ విడిపోతుంది వెళ్లి రమ్మని ప్రేమకి తలుపు మూసినా చప్పుడవ్వని వీడుకోలు లేచి ఇవ్వు ఒకవేళ ప్రేమ మల్లి వస్తే, దూరంగా ఆగి చూస్తే దగ్గరగా వెళ్ళు, ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు. ప్రేమ నీ సొంతం. నీ హృదయం ప్రేమ సొంతం. మార్పులే ప్రశ్న మార్పులే సమాధానం - ప్రేమ
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృత ఆయ్యర్ దర్శకత్వం: మున్నా ధూళి పూడి నిర్మాత: ఎస్. వి. బాబు విడుదల తేది: 29.01.2021
Songs List:
నీలి నీలి ఆకాశం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సిద్ శ్రీరామ్, సునీత అమ్మాయిగారు ఎక్కడికెలిపోతున్నరూ కాసేపుండొచ్చు కదా ఆహ కాసేపాగితే అబ్బయిగారేమిత్తారేంటి పల్లవి: నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా చరణం: 1 ఓ వానవిల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా చరణం: 2 ఓహొ అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
ఇదేరా స్నేహం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అర్మాన్ మాలిక్ ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగినీ నేలనీ వానచినుకై కలిపెను స్నేహం తూర్పుకీ పడమరకీ కాంతి తోరణం అయ్యిందీ స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2) కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం హో.. నీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను నీ స్వచ్చతతో కడగాలంది జాబిల్లి నీ భారం మోసేటందుకే పుట్టానంది ఈ పుడమి ఆశలు ఆకర్షణలు లేనిది నీ ఆడ మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2) ఓ తన చూపులు నువు చూస్తుంటే నీ కళలను తాను కంటోంది తను మాటలు నువ్వుంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చేయని పనులే నీలా తానే చేసేను జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం (2)
మీకో దండం పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ధనుంజయ్, మోహన్ భోగరాజ్ మీకో దండం
అమ్మ నన్ను మళ్ళి పెంచవ పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: అనూప్ రూబెన్స్, రిషాన్ రూబెన్స్ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా పది నెలలు ప్రతీక్షణము కడుపున పెంచావె పది నెలలు ప్రతి నిముషం ఒడిలో పెంచావే భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాల పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి ఎదిగే వరకు ఎదురవదా ఎదలో పసితనము ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము చేతిలో ప్రతీ ముద్దని చెంపపై ప్రతీ ముద్దుని ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ అమ్మ అమ్మ నన్ను మళ్ళి పెంచవ అమ్మ అమ్మ మరల లాలించవా లాలి పాడవా మరోసారి లాల పోయావా మరోసారి ఉయలుపవా మరోసారి
వాచ్ వహ్ వహ్ మేరె బావా పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనూప్ రూబెన్స్, ప్రదీప్ మాచరాజు గానం: రాహుల్ సిప్లిగంజ్ వాచ్ వహ్ వహ్ మేరె బావా
క్యాట్ బాడీ లోకి పాట సాహిత్యం
చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? (2021) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మధుప్రియ క్యాట్ బాడీ లోకి ఆ ర్యాట్ చేరిందంటే ర్యాట్ బాడీ లోకి ఈ క్యాట్ దూరిందంటే ఏమౌతుందే బాబు ఏమౌతుందే, అరె ఏమౌతుందే సెప్పు ఏమౌతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే... మైండు బ్లాక్ అవుతుందే, లెఫ్ట్ రైటై... రైటే రాంగై బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే సిక్స్ ప్యాక్ తో తులసీ కోటను చుట్టేస్తుంటే సాంబ్రాణి ధూపం సిగరెట్ స్మోకే అవుతుంటే, పువ్వంటి పిల్లకు గడ్డం ముళ్ళే మొలిచేస్తే పదునైన కత్తే మొత్తం మెత్తగా అవుతుంటే తన బాధకు మూలం నువ్వని హ్యాపీగా అనిపిస్తే, ఈ ఫీలింగ్ తనకూ ఉందని నీక్కూడా తెలిసొస్తే ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందేమైండు బ్లాక్ అవుతుందే, బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే ఓఓ బాత్రూంలో బోంచేస్తున్నట్టుందే బెడ్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుందే, కాఫీలో కారం కలిపి ఇస్తున్నట్టుందే కాక్లెయిల్ లో కాకరకాయ రసమే మిక్సయిందే, ఎల్టీ టైం తనకే తాను ఎనిమిలా కనిపిస్తే తను పీల్చే ఊపిరి వల్ల తన ఎనిమి బతికేస్తే ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే... ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే, బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే తనలో ఉన్న నీ మైండు బ్లాక్ అవుతుందే అట్టాగే నీలో ఉన్న తన మైండు బ్లాక్ అవుతుందే
చిత్రం: బస్ స్టాప్ (2000) సంగీతం: JB (జీవన్ బాబు) నటీనటులు: ప్రిన్స్ , శ్రీ దివ్య, ఆనంది రచన: నందిని రెడ్డి.వి దర్శకత్వం: దాసరి మారుతి నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 11.11. 2012
కళలకే కనులొచ్చిన పాట సాహిత్యం
చిత్రం: బస్ స్టాప్ (2000) సంగీతం: JB (జీవన్ బాబు) సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: రేవంత్ కళలకే కనులొచ్చిన క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది ని వల్లే నివల్లే కథ మొదలై ఇవాళే జతపడి నడకలై సాగిందే ఓ శైలు నివల్లే నా శైలే మారెలే పడి పడి మనసిలా ఊగిందే కళలకే కనులొచ్చిన క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది ఇంకొంచెం అందంగా నిఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతినిమిషము అనుకుంటున్నా నా సొంతం నువ్వనగా పదిమందిలో బిగ్గరగా చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్నా కలిసిన వేళల్లో అల్లరి నేనై పెదవుల అంచుల్లో పుడుతున్నా You’re my lovely precious pearl My heart is your shell never ever leave me girl You’re my soul you’re in my lovely heart Just don’t tear me apart trust me girl Touch the soul o sailu నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందని గురుతుండదె ఏదేమైనా నీ వెంటే వుంటానుగా నన్నొదిలిన దూరంగా ఊహాలలో ఊపిరిలో తోడై రానా సాగే దారుల్లో సాయంత్రం నేనై చలి చలి గాలుల్లో తడుస్తున్నా యూ మై లవ్లీ ప్రిసిస్ బర్డ్ మై హార్ట్ ఈస్ యువర్ సోల్ నెవెర్ ఎవర్ లీవ్ మీ గో యువర్ మై సోల్ యువర్ ఇన్ మై లవ్లీబర్డ్ You’re my lovely precious pearl My heart is your shell never ever leave me girl You’re my soul you’re in my lovely heart Just don’t tear me apart trust me girl Touch the soul o sailu
రెక్కలొచ్చిన ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: బస్ స్టాప్ (2000) సంగీతం: JB (జీవన్ బాబు) సాహిత్యం: వేటూరి గానం: కార్తీక్ రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా కురిసే కన్నీరే వరదయ్యే వేళ రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం బ్రతుకంతా ఈడుంటుంద చివరంత తోడుంటుంద నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక కలలే నిజమవున కలవరమేమైన రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక నీ కథ నీకెదురయ్యాక రగిలింద గాయం పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం ఏనాడో రాశాడమ్మ తలరాతే బ్రహ్మ ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ బ్రతుకే నవలైనా కథలింతే ఏవైన గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: ఆరుద్ర, కొసరాజు, సినారె, కె.అప్పలాచార్య గానం: ఘంటసాల, జయదేవ్, పి.సుశీల, వసంత నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , కాంచన, సంధ్యారాణి రచన: భమిదిపాటి రాధాకృష్ణ దర్శకత్వం: వి. రామచంద్ర రావు నిర్మాతలు: సుందర్ లాల్ నహతా, డూండీ విడుదల తేది: 27.07.1967
Songs List:
ఉలికి ఉలికి పాట సాహిత్యం
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల గానం: బి.వసంత ఉలికి ఉలికి
హల్లో నిలు నిలు నాకోసం పాట సాహిత్యం
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: టి. ఆర్. జయదేవ్, పి.సుశీల హల్లో నిలు నిలు నాకోసం
గంగా యమునా పాట సాహిత్యం
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల గంగా యమునా
కళ్యాణమే పాట సాహిత్యం
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల కళ్యాణమే
నూటికొక్క పాట సాహిత్యం
చిత్రం: మరుపురాని కథ (1967) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల నూటికొక్క
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 04.09.1982
Songs List:
ఎల్లువొచ్చి గోదారమ్మా పాట సాహిత్యం
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల (గమనిక: ఎల్లువచ్చి గోదారమ్మ పాట ని వరుణ్ తేజ్ నటించన గద్దలకొండ గణేష్ (2019) సినిమాలో రీమేక్ చేశారు) ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా.. మీగడంతా నీదేలేరా బుల్లోడా ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు.. ఆగడాల పిల్లోడైనా నీవోడు ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు.. ఆగడాల పిల్లోడైనా నీవోడు ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు.. గుండెల్లో చోటుంది చూడు ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా.. మీగడంతా నీదేలేరా బుల్లోడా ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు.. ఆగడాల పిల్లోడైనా నీవోడు నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు.. నీ తోడులో ఊపిరాడు.. ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓలమ్మో..రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా మీగడంతా నీదేలేరా బుల్లోడా
చీర కట్టింది సింగారం పాట సాహిత్యం
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం కట్టుకున్న చీరకేమో గీర వచ్చెను కట్టుకునే వాడినది గిచ్చి పెట్టెను హొయ్ నిన్ను చూసి వయస్సుకే వయస్సు వచ్చెను హే వెన్నెలొచ్చి దాన్ని మరీ రెచ్చగొట్టెను హొయ్ కన్నె సొగసుల కన్ను సైగలు ముద్దులు ఇచ్చి నిద్దర లేపి వేదించెను నిన్ను రమ్మని నన్ను ఇమ్మని మెలుకువ తెచ్చి పులకలు వచ్చి మెప్పించెను పొద్దు పొడుపు పువ్వల్లె పువ్వు చుట్టూ తేటల్లే నిన్ను నన్ను నన్ను నిన్ను ఆడించెను హా... చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం ఆహ హ... ఆహ హ... ఆహ హ... ఆశలన్నీ అందమైన పందిరాయెను హొయ్ ఆనందం అందుకుని చంద్రుడాయెను హొయ్ కళ్ళు రెండు నీకోసం కాయలాయెను హొయ్ పెళ్లినాటికి అవి మాగి ప్రేమ పండును హొయ్ సన్నజాజులు ఉన్న మోజులు విరిసే రోజు మురిసే రోజు రానున్నది పాలపుంతగా మేను బంతిగా జీవితమంతా సెలయేరంతా కానున్నది నిండు మనసు నావల్లే కొండమీది దివ్వల్లే నీలో నాలో వెలుగే వెలిగే వలపన్నది చీర కట్టింది సింగారం చెంప పూసింది మందారం మేను మెరిసింది బంగారం అమ్మమ్మో కొత్తగుంది ఈ మేళం ఇన్నాళ్లు ఎక్కడున్నది ఈ వయ్యారం
కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని పాట సాహిత్యం
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా వంకాయ్.. హొయ్.. హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండుకళ్ళు కొట్టనేలా ఈ గుండె తలుపు తట్టనేలా వంకాయ్.. హయ్.. హయ్ కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా గుమ్మా.. ముద్దుగుమ్మా ముద్దు గుమ్మాలు దాటింది లెమ్మంటా అరె.. అమ్మో.. ఎవడి సొమ్మో దాచుకోకమ్మో.. దోచాలి రమ్మంటా జోరుగా.. నీరునారుగా పచ్చపైరల్లే ఉర్రూతలూగాలంటా ఊగాలా.. తత్తరపడి విచ్చలవిడి ఉయ్యాలా నిద్దరచెడి ముద్దరపడి పొద్దుల గురితప్పాల ముద్దుల ముడి విప్పాల అల్లరిపడి సందేల మల్లెలతో చెప్పాలా వంకాయ్.. హొయ్.. హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా బుగ్గో.. పూతమొగ్గో.. కొత్తబేరాలు కోరింది రమ్మంట అహ.. సిగ్గో చిలిపి ముగ్గో పట్టపగ్గాలు లేవంది తెమ్మంట జోడుగా ఏరు నీరుగా పల్లెసీమల్లో ఊరేగి పోవాలంట రేగాలా.. బిత్తర చెలి చూపులు సుడి రేగాలా నడిరాతిరి కొన ఊపిరి చక్కలిగిలి కాగాలా దిక్కులు చలికూగాలా చుక్కలు దిగి రావాలా మొక్కుబడులు చెయ్యాలా.. వంకాయ్... హొయ్ హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని కుడికన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని ఆ రెండు కళ్ళు కొట్టరాదా నన్ను రెచ్చగొట్టి చూడరాదా వంకాయ్.. హొయ్ హొయ్ హొయ్ కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా కుడికన్ను కొట్టగానే కుర్రోడా ఎడంకన్ను కొట్టుకుంది పిల్లోడా ఆ రెండుకళ్ళు కొట్టనేలా ఈ గుండె తలుపు తట్టనేలా
చల్లగాలి చెప్పేది..ఏమని? పాట సాహిత్యం
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి. శైలజ పల్లవి: చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..? పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని మళ్ళి మళ్ళి..రమ్మని చల్లగాలి చెప్పేది..ఏమని? చరణం: 1 Ring-a-ring-a roses A pocket full of posies Ashes! Ashes! We all fall down. Ring-a-ring-a roses A pocket full of posies A-tishoo! A-tishoo! We all fall down. హా హా హా హా హా హా నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..? కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..? కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని ఇల్లంట వెలిగించే..సిరి దివ్య ఏదనీ..ఈ..? ఇల్లు మెచ్చి వచ్చినా..శ్రీదేవి..చూపనీ కొలుచుకొనే దైవాన్ని..కోరుకొనే దేమనీ..? ఏమనీ..ఈ..? దిద్దుకొనే..తిలకానికి..దీర్ఘాయువు..ఇమ్మని దీర్ఘాయువు ఇమ్మని..ఈ చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ చరణం: 2 Johny Johny! Yes, Papa Eating sugar? No, papa Telling lies? No, Papa Open your mouth! Ha! Ha!! Ha!!! హా హా హా హా హా ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ పగటిపూట ఎండలే..రాత్రిపూట వెన్నెలనీ..ఈ పంచుకొన్న హృదయాలకు..పగలు రేయి ఒకటనీ మన జీవిత పయనంలో..చివరికోర్కే..ఏదనీ..?? ఒకరి కన్న ఒకరు ముందు..కన్నుమూసి వెళ్ళాలనీ మరుజన్మకు..కలవాలనీ.. చల్లగాలి చెప్పేది..ఏమని? చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..? పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని మళ్ళి మళ్ళి..రమ్మని లాల లాల లాల లాల లాలలా లాల లాల లాల లాల లాలలా
ఎండావానా నీళ్ళాడాయి.. పాట సాహిత్యం
చిత్రం: దేవత (1982) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో ఎండావానా నీళ్ళాడాయి.. కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి.. కోనసీమల్లో కొండ కోన దాటాలంటే.. మనమేం చేయాలి.. ఓహో చెప్పొద్దు చేసేయి.. సందె పొద్దుల్లో ఈ పొద్దు ముంచేయి ముద్దే ముద్దుల్లో ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో చరణం: 1 హ్హ హ్హ హ్హ హ్హ హ్హ.. చేయి చేయి కలవంగానే..చెరిగే పొలిమేరా..ఆ కన్ను కన్ను నీలో నన్ను..కలిపేయ్ కసితీరా..ఆ ప్రేమకు..పెళ్ళీడొస్తుంటే.. పెదవులు ముద్దాడేస్తుంటే కాలం ఆపు కాసేపూ.. లోకం రాదు మనవైపు మల్లెల పందిరి..అల్లరి వయసును..తొందర పెడుతుంటే సన్నాయి మోగాలి.. గుండెగొతుల్లో తువ్వాయి..గెంతాలి..కొండ కోనల్లో ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..ఓహో..ఓఓఓ చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో చరణం: 2 చూపు చూపు..కలవంగానే..పొడిచే చుక్కంటా..ఆ చుక్కా..ఎన్నెల..పక్కే మనకు..మాపటి దిక్కంటా ఇంకా దగ్గరకొస్తుంటే..ఏ..అందం అక్కరకొస్తుంటే..ఏ అలలే ఆపు కాసేపూ.. కలలే రేపు నీ చూపు పొడిచే ఊహల ఊపిరి కబురులు వడగాలౌతుంటే వెచ్చంగ నిండాలి..పల్లె పాటల్లో..ఓ పచ్చంగ పండాలి..పైరు పంటలూ..ఓ ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో కొండ కోన దాటాలంటే..మనమేం చేయాలి..లోహో..ఓఓఓ చెప్పొద్దు చేసేయి..సందె పొద్దుల్లో..హహ్హా ఈ పొద్దు ముంచేయి ..ముద్దే ముద్దుల్లో ఎండావానా నీళ్ళాడాయి..కొండకోనల్లో కొమ్మా రెమ్మా..పెళ్ళాడాయి..కోనసీమల్లో