Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vinta Dongalu (1989)


చిత్రం: వింత దొంగలు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి.బాలు, ఎస్.జానకి, లలితా సాగరి
నటీనటులు: రాజశేఖర్, నదియా
మాటలు: తనికెళ్ళ భరణి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్. అంబరీష్
విడుదల తేది: 01.01.1989


Palli Balakrishna Saturday, July 13, 2019
Bhakta Prahlada (1967)




చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, బేబి రోజారమని
దర్శకత్వం: చిత్రపు నారాయణ రావు
నిర్మాణం: ఏ.వి.ఎమ్. ప్రొడక్షన్స్
విడుదల తేది: 12.01.1967



Songs List:



రారా ప్రియా సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గాయకులు : సుశీల
రచన: దాశరథి

రాజనర్తకి

రారా ! ప్రియా ! సుందరా !
కౌగిలిలో నిన్ను కరగింతురా  (రారా)

వెన్నెలవేళ విలాసాలతేల
వేచితినీకై క్షణాలేయుగాలై

విరహముతో నేను వేగినదాన
సరగున నన్నేలరా  (రారా)



భుజశక్తి నాతోడ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గాయకులు : మాధవపెద్ది సత్యం
సాహిత్యము: (భాగవతము లోనిది)

హిరణ్యకశిపుడు


భుజశక్తి నాతోడ పోరాడ శంకించి
మున్నీట మునిగిన మునుగుగాక
అలయించి పెనగు నా అచల సంభ్రమమున
కెరగి వెన్నిచ్చిన విచ్చుగాక
జగడంబు సైపక సౌకర్య కాంక్షియై
యిలక్రింద నీగిన నీగుగాక
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున
హరిభంగి నడరిన నడరుగాక
వాని శోణితమున వాడి మెరసి
కఠిన హలధార కంఠంబు విదళించి
మత్స హూదరునకు మహా తర్పణము చేసి
మరలి వత్తు మీకు మేలుదెత్తు



జననీ జననీ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గాయకులు: జానకి
రచన : పాలగుమ్మి పద్మరాజు

లీలావతి

జననీ  జననీ,
జననీ వరదాయనీ త్రిలోచని
నీపద దాసిని కావగదే (జననీ)

పతి ఎడబాటే సైపగలేక, పశుపతిలోన నగమైనావే
కాంతుని చూపే కరవైపోయె! (యిన)
దీనను దయగన రాదా  (జననీ)

నా పతి ఏగతి తాపసియై
ఘోరాటవిలో కృశియించేనో
తపమును వేగమె సఫలము జేయవె (జేసీ)
విజయము ఈయవె దేవీ (జననీ)



ఆది అనాదియు నీవే దేవా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గాయకులు: బాలమురళీకృష్ణ
రచన: దాశరథి

నారదుడు

ఆది అనాదియు నీవే దేవా
నింగియు నేలయు నీవే కావా
అంతట నీవే ఉండెదవు
శాంతివై కాంతివై నిండెదవు 

(ఆది అనాదియు)

దీనజనావన నారాయణా
మదమోహిత దానవ సంహరణ
మాయని జ్యోతివో, తీయని గీతివో
ఏమని వర్ణింతురా
తరుణ బిందువున, విరళ సింధువున
ఎచట చూచినను నీవేకదా
కనులలోన మనసులోన నీ రూపమే 

(ఏమని వర్ణింతురా)

నారద సన్నుత నారాయణా
నరుడవో సురుడవో
శివుడవో లేక శ్రీసతి పతివో
నారద సన్నుత నారాయణా!
దానవ శోషణ మానవ పోషణ
శ్రీ చరణా భవ హరణా
కనకచేల భయశమనల
నిజ సుజనపాల హరి ననాతనా
క్షీర జలధిశయనా ! అరుణ కమలనయనా
గాన మోహనా! నారాయణా!




సిరి సిరి లాలి చిన్నారి లాలి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
గాయకులు : జానకి, బాలమురళీకృష
రచన: ఆరుద్ర

లీలావతి, నారదుడు

సిరి సిరి లాలి చిన్నారి లాలి
నోముల పంటకు నూరేళ్ళ లాలీ
ఊరుమా! ఊయలా

పాలకడలిలో జాబిలిరీతి
వరలుము రతనాల గారాల బాల
ముద్దుల మూట మురిపాల తోట
ముసిముసి నవ్వుల ముత్యాలకోట
ఊగుమా! ఊయలా

పదునాల్గు లోకాల తరియింపజేయ
ప్రభవించి నావయ్య వరభక్త శీల
కలలెన్నో నీ కొరకు కాచుకొని పూచే
ఫలియింపజేయుమా అరుదైన దాల
ఊగుమా! ఊయలా

కులదీపమై వెలుగు కొమరుని జూచి
దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా
నీవారి ఆకలు వెత్తావులీని
నిరతము నీ కీర్తి వికసించునన్నా
ఊగుమా ! ఊయలా




గాలి, కుంభిని పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు : మాధవపెద్ది సత్యం

హీరణ్యకశిపుడు

గాలి, కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ దమ : ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ
వ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్ నమస్తాన
సౌళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే



అందని సురసీమ నీదేనోయీ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల జూనియర్
గాయకులు : సుశీల, జానకి, రాజ్యలక్ష్మి

రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ

జయ హె జయ హే!
నమస్త దానవ సామ్రాజ్య సంస్థాపన ధురీణా
జయ హె!
అందని సురసీమ నీదేనోయీ
అందరు ఆశించు అందాల హాయి
అందించే నెరజాణలమోయి (అందని)

రంభ: 
మంజులవల్లి నికుంజములోన, రంజిలగా మోవి అందీయనా
పాలవెన్నెలా జాలునా, వాలుకన్నులా ఏలనా
అందమందు చిందులందు, దృఢ పరి రంభమందు
నాకు సాటి నేనే

మేనక: 
కోరికేమొ సెలవీర, సుకుమార ! రణధీర సోయగాల నడలా
వాలి ఒడిలో సోలిపోయేనా, లాలించి రాగ రసదోలా
తేలింతు | ప్రేమభోగాలా, మేన కానరాని వలపు తీరుల
మెలగి మేను మరువజేయు మేటిని

ఊర్వశి: 
మై మనుతుఫులేరా ! మగరాయా
వగదీర మనసార కౌగిలీర, వయను తలపులూర
వల పేరు పొంగు వార, మరుని కోర్కెతీర
మన సేల ఊర్వశేరా

తిలోత్తమ: 
వన్నెలా కడకన్నులా విన్యాసాలలోనా
నరి నరికేళీ విలాసాలలో వారి
తారాల తార




హిరణ్యకశిపుని దివ్య చరిత్రము పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు, మాధవపెది. పిఠాపురం నాగేశ్వరరావు

చండా మార్కులు

చండా: హిరణ్యకశిపుని దివ్య చరిత్రము
నవరస భరితమురా (హిర)

చండా: వినవిన నెంతో వీనుల విందై 
వింత గొల్పుగదరా (హిర)
 
చండా: వెడలెను రాక్షసనాధుడు
విజయ దుందుభులు మొరయగ

చండా: బేలలగుచు దిక్పాలకులందరు
భీతి జెంది గొందులబడిపారగ

చండా: ఓరోరీ వరుణా రారా !
చర్మమొలిపించెదను చూడరా
నెల మూడు వానాలు

అమర్క: కురిపించుటలుమాని
అహ పైరు పచ్చల పెంపు

అమర్క : గావించుటలు మాని .
దేశదిమ్మరులగుచు తిరుగుచున్నారటర
ఓరోరి వరుకా రారా చర్మమొలిపించెదను చూడరా




చెట్టుమీదా ఒక్క చిలకుంది పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు: సుశీల

చెట్టుమీదా ఒక్క చిలకుంది!
దాని పక్కగానే జామ పండుంది !
చూచి చూడకుండ చప్పరించకుండ
ఎగిరిపోతే లాభమేముంది ! అయ్య !

ఊర్వశితావచ్చి వొయ్యార మొలికింప
మొగము తిప్పుకొని వచ్చావు
రాజాధిరాజ హిరణ్య మహారాజు
వలపు జూపక మనసు దాచేవు – అయ్యొ
మెత్తని నీ మనను దాచేవు

చందమామ వచ్చి ముందునిల్చిన ఏమొ
వెచ్చంగ వుందయ్యా దేహం — అబ్బ
వెచ్చంగ వుందయ్య దేహం నా దేహం " "
చల్లని నీచేయి తగిలితేనే చాలు
తీరిపోతుందయ్య మోహం
చల్లారిపోతుంది తాపం విరహతాపం






కరుణలేని మనసు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: దాశరథి
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

కరుణలేని మనసు కఠిన పాషాణంబు
జాలి గలుగువు సజ్జనుండు
సౌడు జంతువులను బాధింపవలదయ్య
ప్రాణి హింస ఘోర పాపమయ్య



ఓం అగ్నిమీళే పురోహిత పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: వేదం
గాయకులు : సుబ్రహ్మణ్య శాస్త్రి, పద్మ

చండా మార్కులు, ప్రహ్లాదుడు

ఓం అగ్నిమీళే పురోహితం, యజ్ఞస్య దేవ
మృత్విజం, హెతారం రత్నధాతమం
ఓం ఇ షేత్వోర్టేత్వ వాయవస్థ పాయవస్థ
దేవోవత్సవితా ప్రార్పయతు
శ్రేష్ఠతమాయ కర్మణే !
ఓం అగ్న ఆయాహి వీతయే,
నో హవ్య దాతయే నిహతా నత్సీ బిషి 
ఓం శవ్నో దేవి రభిషయ అపోభవంతు పీతయే
శంయో రభిస్రవంతున




చదివించిరి ననుగురువులు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

చదివించిరి ననుగురువులు
చదివితి ' ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి




ఎల్ల శరీర ధారులకు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు - సుశీల

ప్రహ్లాదుడు

ఎల్ల శరీర ధారులకు నిలను చీకటి మాతిలోపలం
రైళ్ళక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ
రైల్లక నర్వమున్ అతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లము జేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి,



మందార మకరంద పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: సుశీల

మహాదుడు

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకివీ వీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరగునే సాంద్రనీహారములకు
అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపాన విశేషమత్త
చిత్త, మేరీతి నితరంబు జేర నేర్చు
వినుత గుణశీల మాటలు వేయువేల 



కునకుగాని కాయంబు ఆగమే పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు 

కునకుగాని కాయంబు ఆగమే
పవన కుంభిత చర్మ
వైకుంఠు డొగడని వక్తంబు వక్తమే,
ఢమఢమ ధ్వనితోడి థక్కగాక,
హరి పూజనములేని హస్తంబు హస్తనే
తరుశాఖ నిర్మిత దర్విగాక,
కమలేకు జూడని కన్నులు కన్నులే
తనుకుడ్య జాల రంధ్రములుగాక
ఆ. చక్రి చింతలేని జన్మంబు జన్మమే
తరళ నలిల బుద్బుదంబుగాక,
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే
పాదయుగముతోడి పశువుగాక !



పటుతర నీతి శాస్త్ర పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు : మాధవ పెద్ది సత్యం

హిరణ్యకశిపుడు

చ: పటుతర నీతి శాస్త్ర చయ పారగు చేసెదనంచు బాలునీ
వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్
కుటిలత జెప్పినాడపు భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్
గట కట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండ వే



వరమొనగే వనమాలీ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: బాలమురళీకృష్ణు

నారదుడు

వరమొనగే వనమాలీ!
నా వాంఛితమ్ము నెరవేరును గా
తామనవాదుల దర్పము తొలగీ
ధర్మపాలనా ధరణి వెలయగా
దాసుల.చీ శాంతినిలుపగా
వన్నగశయనుడు నరసిజనచునుడు
అవతరించుగా!

ఎందు వెదకిన కనరాక హేమక శివు
హృదయమున తిష్ఠ వేసి తబ్బిబ్బు జేసీ
విసుగు నుసికొల్పి ఆడించు నీదులీల
పరులకు గ్రహింప శక్యమా! గరుడగమనా!




ఓం నమో నారాయణాయ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాలు
గాయకులు : సుశీల బృందం

ప్రహ్లాదుడు

ఓం! నమో ! నారాయణాయ !
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవ బంధాలు పారద్రోలి
పరము నొనంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

గాలిని బంధించి హరింటా గాసిన పని లేదు 
అంది. నీ క్రతువులా చేయగి పనిలేదు
మధుసూదనా ! అని
మననున తలన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లి తండ్రి నారాయణుడే 
గురువూ చదువూ నారాయణుడే!
యోగము యాగము నారాయణుడే!
ముక్తియు దాతయు నారాయణుడే !

భవ బంధాలూ పారద్రోలి
పరము నొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

నాధ హరే! శ్రీనాధ హరే! నాధ హరే! జగనా ధ హరే!!



బలయుతులకు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును
బలమెవ్వండు అట్టి విభుడు బలమ నురేంద్రాల



కనులకు వెలుగువు నీవే కావా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు : సుశీల, జానకి

ప్రహాదుడు

కనులకు వెలుగువు నీవే కావా
కనబడు చీకటి మాయే కాదా
నిను గనలేనీ ప్రాణీ బ్రతుకే
నిజముగ చీకటి యౌగా దేవా

పేరుకు నేను తల్లిని గానీ , ఆదుకొనాలే నైతి
పాలను త్రాగి ఆకలిబా పే | భాగ్యమునైనా నోచని నాకూ
ఏల జనించితివయ్యా ! నా కేల జనించితివయ్యా!
అండగనుండా విధాతనీవూ | ఆకలిదప్పుల బాధే లేదు
నారాయణ నామామృత రనమే |
అన్నము పానముగావా దేవా !




ఆదుకోవయ్యా ఓ రమేశా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు : సుశీల బృందం

ప్రహ్లాదుడు

ఆదుకోవయ్యా ! ఓ ! రమేశా
ఏతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా !
భువవనాయక ముక్తి దాయక భక్తపాలక కేశవా !
సర్వలోక కారణా ! నకలశోక వారణా !
జన్మ జన్మ కారణా ! జన్మ బంధ మోచనా !
సుష్టగర్వ శిక్షణా ! శిష్ట శాంత రక్ష! శాంతి నిక్షం!



పంచాబ్దంబులవాడు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు : మాధవ పెద్ది సత్యం, బృందం

హిరణ్యకశిపుడు

గా: పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంచు నిందించి | య
క్కించిద్భీతియులేక | విష్ణున్ నహితుం కీర్తించు చున్నాడు వ
లంచున్ చెప్పిన మానడు ! అంగమున పుత్రాకారతన్ వ్యాధి జు
న్మించెస్ ) దీని వధించి రండు దనుజుల్ మిమీ పటుత్వంబులన్



జీవము నీవేకదా దేవా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: సముద్రాల
గాయకులు : సుశీల

జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !
జనకుడు నీపై కినుక వహించి నను వధియింపా మది నెంచే
చంపే దెవరూ సమసే దెవరూ 
సర్వము నీవేకదా స్వామీ!



నిన్నేగానీ పరుల నెరుంగా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు : సుశీల

ప్రహ్లాదుడు

నిన్నేగానీ పరుల నెరుంగా !
రావే! వరదా ! ద్రోవగ రావే! వరదా ! వరదా !
అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!
జీవము నీవేకదా!




హే ప్రభో పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

హే ! ప్రభో ! హే ! ప్రభో !
లక్ష్మీవల్లభ ! దీనశరణ్యా ! కరుణా భరణా ! కమలలోచను
కన్నులవిందువు చేయగరావే!
ఆశ్రిత భవ బంధ నిర్మూలనా !
జీవము నీవేకదా!




పాములోళ్లమయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన: కొసరాజు
గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, L. R. ఈశ్వరి

పాములవాళ్లు (సూరి, సింగి)

సూరి: పాములోళ్లమయ్యా | మా పెట్టె చూడరయ్య బల్లె
సూరి: ఈరిగాడి తమ్ముడు బంగారు గాడు ఉన్నడు
సింగి: కంకణాల కాటిగాడు లంకణాల కోటిగాడు
సూరి: సింకికళ్ల పోతడు మా జాతికెల మొనగాడు
సింగ్: గొరైనైన బర్రెనైవ గుటకేసే కొండపిలవ
మడిసిన్న మాకు నైన మట్టుబెట్టు మిన్నాగు
యినము గక్కు బొక్క బెరుడు తరిమికరను తాడిగిరి ఆహా"
సూరి: యీటిపాలబడ్డ వాడు బతికి బట్టగట్టలేడు
బొమ్మజెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది
తస్సదియ్య, దీని తస్సదియ్య చెయ్యి పెడితే కస్సుకన్సు మన్నది...
సింగి కట్టుగట్టి పడితేను కదలకుండ ఉన్నదీ ఓ హెయ్ !
సూరి: ఒదిలి పెడితె పేణాలు గావుపడుతనన్నది
సింగి: పగబట్టినపుడు దీని పరవళ్ళు నూడాలి కాటే సేటపుడు
దీని కవ్వింపు సూడాలి అబ్బో అబ్బో అబ్బో
సూరి: అచ్చమైన తాచు ధీని కచ్చె యెపుడు కానలేడు ఆహా ఓహో
పడిగే తిప్పి కొట్టెనంటె బెమ్మకూడ తిప్పలేడు





నిన్నే నమి యుగళీ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన:
గాయకులు:

నిన్నే నమి యుగళీ, నన్ను తిడే సే
కవ భయమదియేలా, పని అయినా రా.......
జీవము నీవేకదా



మదిలో వెలలో చీకటి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు : సుశీల

ప్రహ్లాదుడు

మదిలో వెలలో చీకటి సూపీ, పధము జూ పే పతితపావనా !
జీవము నీవేకదా.




భవజలధినిబడి తేలగ లేని పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

భవజలధినిబడి తేలగ లేని, జీపులబ్రోచే పరమపురుషా !
నను కాపాడీ నీ బిరుదమునూ, నిలుపుకొంటివా
శ్రీతమందారా |జీవము నీవేకదా!



ముంచితి వార్డులన్ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు : మాధవపెద్ది సత్యం

హిరణ్యకశిపుడు

ముంచితి వార్డులన్ గదలమొత్తితి, శైల తటంబులందు ద్రో
బ్బించితి | శనరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంకి రొ
ప్పించితి | ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్ను లందు త్రో
యించితి | పెక్కు పొట్లు నలయించితి చావడు 2 వేమి చిత్రమో |



విశ్వమునిండీ వెలిగే నీవే పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు: సుశీల

ప్రహ్లాదుడు

విశ్వమునిండీ వెలిగే నీవే, నాలోనుండి నన్ను కావగా
విషమును ద్రావా వేరువగనేలా, విషధర శయనా,
విశ్వపాలనా! 1జీవము నీవేకదా!



కలడంభోధి గలండు గాలి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు: సుశీల
ప్రహ్లాదుడు

కలడంభోధి గలండు గాలి గల డాకాశంబునం కుంభినిస్
కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటస్
కలదీశుండు కలండు తండ్రి ! వెదకంగా నేల యీ యాయెడన్ !




ఇందుగలడు అందులేడను గాలి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: (భాగవతము లోనిది)
గాయకులు : సుశీల

ప్రహ్లాదుడు

ఇందుగలడు అందులేడను,
సందేహమువలదు | చక్రి సర్వోపగతుం |
డెందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి, వింటే ||



శ్రీ మానసి మందిరా గాలి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త ప్రహ్లాద (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
రచన : సముద్రాల
గాయకులు : సుశీల

శ్రీ మానసి మందిరా !
త్రైలోక్య సమ్మోహనాకారా ! ప్రేమావతారా !
జగన్నాధా ! లోకాధినాథా !
మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి,
వేదా? రక్షించి, దేవాసురుల్ క్షీర
వారాన్ని ధిన్ ద్రచ్చగా గోర, కూర్మావతారుండ వై
మందరంబెత్తి, ఆ మోహినీ వేష ముంబూని
పీయూష దానంబుగావించి, వారాహ రూపంబునన్
భంగ పాటొందు భూదేవి రక్షించి, ఈనాడు
నీ తత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్
సత్య దీపంబు చూపించి, మోహంబు వారించి
నీ విష్ణు భావంబు రూపించి, నీదాసకోటిన్ కటాక్షింపగా
ఈ విచిత్రా కృతింబూని వేంచేసినావా
పరంధామా ! వెకుంఠ ధామా !
నమో! నారసింహా!
నమో ! భకపాలా !
విధాతాదులే వెరగు చెందునీ
ఉగ్రరూపమూ ఉపశమింపుమా !
త్రిలోకాలకూ ప్రియంబైననీ
ప్రసన్నాకృతి ప్రసాదింపుమా !


Palli Balakrishna Monday, July 1, 2019
Ninu Veedani Needanu Nene (2019)



చిత్రం: నిను వీడని నీడను నేనే (2019)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: సందీప్ కిషన్, ప్రగతి
దర్శకత్వం: కార్తీక్ రాజు
నిర్మాతలు: దయ పన్నెం, విజి సుబ్రమనియన్
విడుదల తేది: 12.07.2019



Songs List:



Excuse Me Rakshasi పాట సాహిత్యం

 
చిత్రం: నిను వీడని నీడను నేనే (2019)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: సామ్రాట్
గానం: సిద్ధార్ద్ 

Excuse Me Rakshasi



అమ్మ పాట పాట సాహిత్యం

 
చిత్రం: నిను వీడని నీడను నేనే (2019)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీకృష్ణ, నందితా జ్యోతి

అమ్మ పాట



నిను వీడని నీడను నేనే పాట సాహిత్యం

 
చిత్రం: నిను వీడని నీడను నేనే (2019)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: నీరజ కోన
గానం: యాజిన్ నిజార్

నిను వీడని నీడను నేనే

Palli Balakrishna
Vajra Kavachadhara Govinda (2019)


చిత్రం: వజ్రకవచదర గోవింద (2019)
సంగీతం: విజయ్ బుల్గానిన్
నటీనటులు: సప్తగిరి, వైభవీ జోషి , అర్చన శాస్త్రి
దర్శకత్వం: అరుణ్ పవర్, రోయల్ విష్ణు
నిర్మాతలు: ఈదల నరేంద్ర , GVN రెడ్డి
విడుదల తేది: 14.06.2019








చిత్రం: వజ్రకవచదర గోవింద (2019)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ బుల్గానిన్

కీచురాయి కీచురాయి 
కంచుగొంతు కీచురాయి 
నింగిదాక ఖంగుమందె నీ సన్నాయి

లంగా వోణి రాలుగాయి 
చాలు చాలు నీ బడాయి 
మచ్చుకైన కానరాదె నీలో అమ్మాయి

మరీ అలా మగాడిలా పోటెత్తమాకే
గందరగోళాలకీ 
పూరేకులా నాజుకులు నేర్పించుకోవే
అందచందాలకీ 

హేయ్ నా మాట వినీ 
హేయ్ నీ పద్దతినీ 
హేయ్ జర మార్చుకుని 
ప్రేమలో పడవే 

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

అచ్చతెలుగు అందం నీలో ఎంతో దాగుందే 
గుర్తుపట్టు దాన్ని ఓ కొంచెం 
రౌడీ పిల్లలాగా తిరుగుతుంటే బాలేదే 
మారిపోవే పిల్లా నా కోసం

తవలా పాకంటీ లేత చేతుల్తో 
తగువులాటేలా ఒంపుల వయ్యారీ
కలలే తారాడే కాటుక కన్నుల్లో 
కోప తాపాలు వద్దే సుకుమారీ

ఛూ మంత్రాలే వేసి 
నిను మార్చుకుంటాలే

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

కీచురాయి కీచురాయి 
కోయిలల్లె మారవోయి 
ప్రేమ పాట పాడవోయి నా జోడీగా

చేరుకోవె దాయి దాయి 
కలుపుకోవే చేయి చేయి 
మనసు మనసు మార్చుకుందాం
రా సరదాగా

తొలిచూపుకే నిన్నెందుకో మెచ్చింది కన్ను
సొగసరి గోదావరి 
మలి చూపులో ప్రాణాలనే ఇచ్చేసినాను 
ఊపిరి నీదే మరి

హే యువరాణివనీ 
హే పరువాలగనీ
నా కలలో నిజమై 
కదలి రమ్మన్నా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా

ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ అన్నా 
అయ్యయ్యో మనసారా వినరాదా 
ఔనన్నా కాదన్నా ఒట్టేసి చెబుతున్నా
నీ కోసం పుట్టాడీ గోవిందా


Palli Balakrishna
Hippi (2019)



చిత్రం: హిప్పీ (2019)
సంగీతం: నివాస్ కె.ప్రసన్న 
నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్య వన్షి, జె.డి.చక్రవర్తి
దర్శకత్వం: కృష్ణ
నిర్మాణం: నరంగ్ గ్రూప్
విడుదల తేది: 06.06.2019



Songs List:

Palli Balakrishna
Thanks (2006)


చిత్రం: థ్యాంక్స్ (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం:
గానం:
నటీనటులు: శ్రీనాథ్, వినీత్, రేష్మి
మాటలు: మధురూరి రాజా
దర్శకత్వం: మన్ రాజ్
నిర్మాత: ముల్లేటి నాగేశ్వరరావు
విడుదల తేది: 2006

త్వరలో

Palli Balakrishna
Dorasani (2019)



చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్
దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని
విడుదల తేది: 12.07.2019



Songs List:



నింగిలోన పాలపుంత పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: అనురాగ్ కులకర్ణి 

నింగిలోన పాలపుంత  




కళ్లలో కలవరమై పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: చిన్మయి శ్రీపాద

కళ్లలో కలవరమై కలవరమై 
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమో వరమే అవగా
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమై  కలిగే కోరిక

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా 
ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల వడిలో ఆడుతూ ప్రాణమే
ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో 
ఉడికిస్తూ చంపుతుంటే
ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల 
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే

ఏమో ఏమో ఏమో అసలే మెల్లగా
ఎదపై తీపి మధువే చెల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా
మైమరపించు మాయే చెయ్యగా
అణువణువు అలజడి రేగి
తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల 
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే




కప్పతల్లి పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: అనురాగ్ కులకర్ణి 

కప్పతల్లి 




ఆడి పాడే పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: లోకేశ్వర్

ఆడి పాడే

Palli Balakrishna
Kalki (2019)


చిత్రం: కల్కి (2019)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: లలిత కావ్య
నటీనటులు: రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేతా
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: సి.కళ్యాణ్, శివాని, శివాత్మిక
విడుదల తేది: 28.06.2019

నీలోడు బండి ఆపేయ్ రా
వేడి మీద ఇంజినుంది దించేయ్ రా
ఈ రోడ్ నా అడ్డా రా
సల్ల తాగి సల్లగై పోవేరా
తెచ్చారా తాటి కల్లు
ఎక్కిస్తా కిక్కు ఫుల్
ఓ పట్టు పట్టవేమి రా
వళ్లే నే వంచుతుంటే కళ్ళే నువు తిప్పవేరా
కిర్రెక్కి ఊగిపోకూర

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఆ నాటు కోడి తేవాలా
నా నోటి ఘాటు కావాలా
ఈ బోటి కూర వండాల
నాతోటి గుండె నిండాల

నీకళ్ల ముందు ఎర్ర కోక సోకులుండగా
ఆ నల్లమందు దండగా
నా బుగ్గ రైక మీద పైట జరుగుతుండగా
ఏ మత్తు ఎక్కుతుందిరా

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఈ పక్కకొస్తే ఓ లెక్క
ఆ పక్కకొస్తే నా లెక్క
తాగి పన్నావంటే ఒక రేటు
హోస్  లున్నవంటే సెపరేట్

ఈ సీకు ముక్కలాగ సోకు సొత్తులున్నాయ్
నువ్వు జుర్రుకోరా
లేత బుగ్గలన్నీ జోలీ పౌడరద్ది
నీకు దాచినారా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (8)


Palli Balakrishna
Oh Baby (2019)


చిత్రం: ఓ బేబీ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మోహన బోగరాజు
నటీనటులు: సమంత అక్కినేని, నాగ శౌర్య, లక్ష్మీ, తేజ
దర్శకత్వం: బి.వి.నందిని
నిర్మాతలు: సురేష్ బాబు, తాతి సునీత, టి.జి.విశ్వప్రసాద్, హ్యూనో థామస్ కిమ్
విడుదల తేది: 05.07.2019

నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా
నాలో నాకే ఏదో తడబాటే! హా...

పాతపూల గాలే పాడుతుంటే లాలే
కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే

చందమామ జారి చెలిమిలాగ మారి
గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే...

నన్ను గారం చేసే బాటసారై ఎవరివోయి?
నేను మారాం చేస్తే నవ్వుతావు ఎందుకోయి?
నా స్వరం నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం
ఇలా ఈ క్షణం శిలై మారితే, లిఖించాలి ఈ జ్ఞాపకం!

నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోందే
నెమలిఫించమల్లే నన్ను తాకుతోందే

తేలికైన భారం, దగ్గరైన దూరం
సాగినంత కాలం సాగనీ ప్రయాణం...

దాచిపెట్టే నవ్వే కళ్ళలోనే తొంగి చూసే...
సిగ్గు మొగ్గైపోయే గుండెలోనే పూలు పూసే...




Palli Balakrishna
BurraKatha (2019)


చిత్రం: బుర్రకథ (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర
నటీనటులు: ఆది, మిస్తీ చక్రవర్తి, నైరా షా
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ దీపాల
విడుదల తేది: 05.07.2019

హే అందానికే నువ్వు అందానివే
ఆ బ్రహ్మ చదవని గ్రంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగెలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే

ముద్దు బేబీ, లవ్లీ జిలేబి

నీ పేరు వింటే పరధ్యానమే
సిరివెన్నెల రాదా మధ్యాహ్నమే
హే పిచ్చి పిచ్చిగా ఇట్టా నచ్చేస్తూ ఉంటే
ఈడు గోడమీద కోడిలాగ కూసెయ్ దా పిల్లా
నడిచే ఓ చందమామ కులికే ఓ సత్యభామ
ఇంకా నీకర్ధం కాదా నా ప్రేమ
ఉన్నావే నువ్వు తబలా జాజల్లే
నే బీటే వేస్తా జాకీర్ హుస్సేనల్లే

హే అందానికే నువు అందానివే
ఆ బ్రహ్మ చదవని గంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగేలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే


Palli Balakrishna
Brochevarevarura (2019)







చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: హసిత్ గోలి
గానం: వివేక్ సాగర్, బాలాజీ దాకే, రామ్ మిరియాల, మనీషా ఈరబత్తిని
నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, నివేత పేతురాజ్
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాత:
విడుదల తేది: 2019

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
పొద్దెక్కి నాదిక పలుకులాపమని
అంటావేంటే వయ్యారి
సురుక్కు మంటూ కుర్రమూకతో ఏంటో ఈ రంగేళి

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ

హే  హల హల
హే  హల హల

ససస సరికొత్తైన తమాషా
చవి చూసేద్దాం మరింత
సరిపోతుందా ముకుందా కవి శారదా

ఆ అంతో ఇంతో గురుందా
అంతేలేని కల ఉందా
సింగారించేయ్ సమంగా ఓ నారద హల

ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి
ఓయే వగలాడి  వగలాడి ఏ వగలాడి

మీరంతా గుంపు కట్టి
వెంటనే సూటిగొచ్చి పోయిన
రానురా నేను రానురా
హే పాత లెక్కలన్ని ఇప్పి చూపే పనిలే
నాకంత ఓపీకింక లేదురా

హే పలికినాదిలే చిలక జోశ్యమే
పనికిరామని మేమే
తెలిసి పిలిసే చిలకవు నువ్వే
కాస్త అలుసిక ఇవ్వే
అరె అప్పనంగా మోగే జాతరే
నువు ఒప్పుకుంటే వెలుగే ఊరే
అది సరికాదంటే వెనక్కి రాదే
మత్తెక్కి జారిన నోరే

వగలాడి  వగలాడి (8)

కలుపు తోటలా తోటమాలినే
కులుకులాపిటు చూడే
ఈ కవితలన్ని కలిపి పాడితే
కనుక పటిక రాదే
మనకొచ్చినంత భాషే చాలులే
మరి కచ్చితంగా అది నీకేలే
నువు జతకానంటే మరొక్కమారే
వెనక్కి రాధిక పోవే

వగలాడి  వగలాడి
వగలా... డి

వేటకెళ్లి సేతుపతిను
తప్పిపోతే అధోగతి
చింతపండేరో భూపతి
అంగడే నీ సంగతి (2)

వగలాడి  వగలాడి
వగలా... డి







చిత్రం: బ్రోచేవారెవరురా (2019)
సంగీతం: వివేక్ సాగర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: వందన శ్రీనివాసన్

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
హో తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నా
ఎందుకో ఏమో తెలియని మౌనం
తేల్చుకోలేనే సమాధానం

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా

రోజంతా అదే ధ్యానం తన పేరే అనేలా
చూస్తూనే మరోలాగా మారాలెలా
భూగోళం చేరేలా ఆకాశం దిగాలా
సందేహం సదా నాకు లోలోపలా
ముడిపడినా సరిపడునా
ఇరువురి సహవాసం జతపడునా
జగము ఇదేంటీ అనదు కదా
అయోమయం లో ఉన్నా అదో మాయగా 

తలపు తలుపు తెరిచానా స్వయానా
చినుకు చినుకై మెరిసా మనసులోనా
ఓ తడిలేని ఈ తేనెజల్లుల్లోనా
ఓ ఆనందమందుకున్నా
హా తడాబాటు చూస్తున్నా ఆలోచనగా
సతమతమౌతున్నా



Palli Balakrishna

Most Recent

Default