-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sobhan Babu"



చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి (All)
గాయనిగాయకులు: యస్.పి.బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, శారద, సుమలత,రంగనాథ్, శరత్‌బాబు
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరి రావు
నిర్మాతలు: టి.భద్రయ్య, టి.రాజమౌళి
విడుదల తేది: 10.02.1983



Songs List:



కాలాలు కర్పూరమై కరగాలి పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

కాలాలు కర్పూరమై కరగాలి ..పాడవే ఓ కోయిలా ( బిట్ )



బూచి బూచి బూచి పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

బూచి బూచి బూచి బుగ్గల మీద మొగ్గల బూచి



పాడవే ఓ కోయిలా పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పాడవే ఓ కోయిలా శృతి చేసి నీవు సరాగం చివురించని




జేజేమ్మో డాకటేరు పోజమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు

జేజేమ్మో డాకటేరు పోజమ్మో కోపమొస్తే క్లోజమ్మో ఆదివారం



ఎవరి కోసం జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు

ఎవరి కోసం జీవితం ఎగిరిపోయే కాగితం ఏది దానికి గమ్యం



సా సా సావిత్రి పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు

సా సా సావిత్రి గ గ గ గాయిత్రి మ మ మ మహలక్ష్మి



ఓ రబ్బా ఓర రబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: రఘు రాముడు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్

ఓ రబ్బా ఓర రబ్బా


Palli Balakrishna Thursday, May 21, 2026



చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, లలితా సాగరి, నాగూర్ బాబు
నటీనటులు: శోభన్ బాబు, శరత్ బాబు,  రాధిక, జీవిత 
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి 
నిర్మాతలు: వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబు
విడుదల తేది: 02.09.1988



Songs List:



అందాల మరదలా ఆడపడుచు పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: పి. సుశీల, నాగూర్ బాబు, లలితా సాగరి, యస్.పి.బాలు 

అందాల మరదలా ఆడపడుచు



అందాలు ఆవురావురన్నాయి సందేకాడ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: పి. సుశీల,, యస్.పి.బాలు 

అందాలు ఆవురావురన్నాయి సందేకాడ



నిన్న పూలతోట నేడు గాలిపాట పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
గానం: నాగూర్ బాబు 

నిన్న పూలతోట నేడు గాలిపాట 




మరులే చిలికే మన్మధ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1988)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , యస్.జానకి 

మరులే చిలికే మన్మధ చిలకా

Palli Balakrishna Saturday, May 16, 2026



చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణరాజు, శారద, జయంతి, జ్యోతిలక్ష్మి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
నిర్మాతలు: సూర్యచంద్రరావు, గిరిబాబు
విడుదల తేది: 18.05.1973



Songs List:



మామిడి తోపుల్లోనా.. పాట సాహిత్యం

 
చిత్రం:  జీవితం (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు 
సాహిత్యం::  సినారె
గానం:  ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :
మామిడి తోపుల్లోనా..  మాపటేల మాటేసి
చిక్కుడు పాదూకాడా ..  చీకటేల పట్టేసి
మామిడితోపుల్లోనా..  మాపటేల మాటేసి
చిక్కుడుపాదూకాడా..  చీకటేల పట్టేసి
చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి.. చూపించి ? 
 
మాయ చేసి పోతివిరో నాగులూ... నా మాట మరచిపోతివిరే నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో
 
చరణం: 1 
నిన్నే కావాలని ఎన్నుకొంటిని.. నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని
రేకెత్తే నా సొగలే నీకు ముడుపు కడితిని
ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని
ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని
 
మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో

చరణం: 2
నట్టింట ఒంటరిగా కాచుకొంటిని.. నడిరాతిరి ఉసురుసురంటూ వేచియుంటిని
ఆకు చప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని
నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని....  కాదు మరి

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ
ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో
ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో



ఇక్కడే కలుసుకొన్నాము.. పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, రామకృష్ణ

పల్లవి :
ఇక్కడే కలుసుకొన్నాము..  ఎప్పుడో కలుసుకున్నాము
ఈ జన్మలోనో... ఏ జన్మలోనో..  ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో కలుసుకున్నాము
 
చరణం: 1
నీలనీల గగనాల మేఘ తల్పాల పైన.. 
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా.. 
నీ రూపమే నా గుండెలో నిండగా  
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి.. కౌగిలిలో చవి చూసి
 
ఇక్కడే కలుసుకొన్నాము.. ఎప్పుడో కలుసుకున్నాము
 
చరణం: 2 
నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు? 
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం.. ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
 
ఇక్కడే కలుసుకొన్నాము...  ఎప్పుడో క





అంతేనేమో అది ఒక వింతేనేమో.... పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల, రామకృష్ణ

అమ్మో యీవేళ మనసే అదోలా 
కువకువమన్నది ఎందుకో ఎందుకో.........

విను నేను తాకితే వను వీపు తాకితే 
అంతేనేమో అది గిలిగింతేనేమో ?

అంతేనేమో అది ఒక వింతేనేమో....

ఎవరైనా పిలిచారా యీ ఏరు పరుగిడుతున్నది ఎందుకో

దూరాన సాగరాన కలవాలని కలవరపడినది 
అందుకెనేమో పరుగులు అందుకేనేమో

అంతేనేమో అది ఒక వింతేనేమో 
అందుకేనేమో పరుగులు అందుకేనేమో 
అంతేనేమో అది ఒక వింతేనేమో

పండుమీదే రామచిలక పదేపదే వాలుతుంది 
ఎందుకో ఎందుకో

పండులోనే రసముందని గండుచిలక గమనించింది. 
అందుకేనేమో రుచులను అందుకోనేమో

అంతేనేమో అది ఒక వింతేనేమో ?
అందుకేనేమో రుచులను అందుకోనేమో
అంతేనేమో అది ఒక వింతేనేమో 

మన మేనులూ ఒకలాగే-పెనవేసుకుపోతున్నాయి ఎందుకో ?

ఎందుకో ?

ఇద్దరు ఒకరౌతారంటే ఇదేనేమో ఇదేనేమో 

అంతేనేమో అది మరి అంతేనేమో 
అంతేనేమో అది ఒక వింతేనేమో ....




చిన్నారి ఓ బాబు పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

చిన్నారి ఓబాబూ
బలేబలేబాబూ వరాల బాబ
అమ్మానాన్న దీవనలంది వర్ధిల్లాలి
అలా అలా నవ్వు

మీ అమ్మ మోము చూడ మిసిమినవ్వు 
విరిసేను మిసిమినవ్వు విరిసేను

మీ నాన్న కళ్లు చూడ ముత్యాలై మెరిసేను 
ఆ నవ్వుల పువ్వుగా - ఆకన్నుల దివ్వెగా 
ఉదయించిన నిన్నుగని నా మనసే మురిసేను

బాబూ నిన్నెత్తుకుంటే - పసిడికొండనౌతాను 
పాపా నిను హత్తుకుంటే పాలవెల్లినౌతాను 
పాలవెల్లినౌతాను …

మీ ఇద్దరూ వుండగా, నా ముద్దుల పండగా 
ఏ తల్లీ పొందలేని ఆనందం పొందేను -ఉఁహూఁహూఁ

అమ్మా నానా దీవనలంది వర్ధిల్లాలి అలా అలా నువ్వు



తొలిరేయి పాట సాహిత్యం

 
చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి

పెళ్ళిపందిట నీవువేసిన మూడుముళ్ళూ
చల్ల చల్లగా వుండాలి... అవి ఒక నూరేళ్ళూ
మూగ గదిలో నేడు పలికే... ఈ రాగం..
ఆ.... ఆ... ఆ.... ఆ

ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం
నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ 

తొలిరేయీ... ఇది తొలిరేయి

కన్నులేమో వేరు వేరు... కలలు ఒకటేలే
తనువులేమో వేరు వేరు... మనసులొకటేలే
పూలపానుపులా... వేయిమల్లెల పిలుపులొకటేలే
కలవరించే కోటికోర్కెలా... గమ్యమొకటేలే... గమ్య మొకటేలే
ఆలుమగల అంతరంగాల...అందాలతొలకరి..ఈ రేయీ

తొలిరేయీ... ఇది తొలిరేయి
ఇద్దరమూ  చెరిసగమూ
ముద్దూ ముచ్చట పంచుకొనే... తొలిరేయీ..ఇది తొలిరేయి

Palli Balakrishna Thursday, April 9, 2026



చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, పి.సుశీల 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ 
మాటలు: సముద్రాల
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
నిర్మాణ సంస్థ: కవితా ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 06.05.1978



Songs List:



అంతా నాటకం మనదంతా నాటకం పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ

అంతా నాటకం మనదంతా నాటకం



మంచోడు దొరికాడు పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మంచోడు దొరికాడు మంగళవారం మారుతుంది జాతకం బుధవారం



కొండా కోనా పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కొండా కోనా పిలిచింది కొమ్మా రెమ్మా పిలిచింది




పడిందిరోయ్ పడనే పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, వి. రామకృష్ణ, పి.సుశీల 

పడిందిరోయ్ పడనే పడిందిరోయ్ అచ్చోసిన ఆంబోతు పచ్చాని చేలోన విరుచుకు పడిందిరోయ్



ఎవరున్నారు ఇంకెవరున్నారు పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఎవరున్నారు ఇంకెవరున్నారు నిన్నుమించిన దైవం?



రంగూ రంగూల పండగ పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల & బృందం 

రంగూ రంగూల పండగ ఇది రామా చక్కని పండగ




గున్నా గున్నా గువ్వల పాట సాహిత్యం

 
చిత్రం: కాలాంతకులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: వి.రామకృష్ణ,  పి.సుశీల 

గున్నాగున్నా గువ్వలచెన్నా కన్నాకన్నా

Palli Balakrishna Wednesday, January 3, 2024



చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, మోహన్ బాబు 
మాటలు: రాజశ్రీ 
దర్శకత్వం: రాజాచంద్ర
నిర్మాత: 'జ్యోతి' కుమార స్వామి 
విడుదల తేది: 20.02.1980



Songs List:



ఇన్నిన్ని కన్నె పూలు పాట సాహిత్యం

 
చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఇన్నిన్ని కన్నె పూలు 



లోకానికిది మేలుకొలుపు పాట సాహిత్యం

 
చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల 

లోకానికిది మేలుకొలుపు 



ఎన్నెలంత ఏరాయే పాట సాహిత్యం

 
చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఎన్నెలంత ఏరాయే 




అల్లరి చేసే ఊహల్లో పాట సాహిత్యం

 
చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అల్లరి చేసే ఊహల్లో 



ఈ గీతం సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: మహాలక్ష్మి (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఈ గీతం సంగీతం

Palli Balakrishna



చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక, విజయలలిత, చంద్రమోహన్, స్నేహ ప్రభ (నూతన తార)
కథ: విజయబపినీడు
అసోసియేట్ డైరెక్టర్స్: దాసరి నారాయణరావు, ఎం.ఎస్. కోటా రెడ్డి
దర్శకత్వం: కె.వి. నందనరావు
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ
విడుదల తేది: 18.06.1970



Songs List:



జానీ జింజర్ జానీ జింజర్ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు
వారే వారే వా వా | భలే హుషారు |
తిరుగులేదు మనదెబ్బకు తిరుగులేదురా
తిరుగులేదు మన దెబ్బకు తిరుగులేదురా!

రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడతదీ ।
మీ చేయి చేయి కలిపితే డబ్బూడిపడతదీ
నిప్పుకు గాలికి యిప్పుడు నేస్తమయ్యింది
ఇక చూస్కో నారాజా మజాగుంటదీ॥
కొండనైన పిండిపిండిగ కొట్టేస్తారూ ।
అ కొండమీద కోతినైన దింపేస్తారూ||
సాటిలేని మేటి వీరసింహులుమీరు
మీ ధాటి కెదురులేరు ! ఎదురైతే బ్రతికిపోరు

పడుచుపిల్ల కాస్త ప్రక్కనుంటేచాలు |
ఎంతపనినైనా చిటికెలోన చెయ్యగవీలు||
మన ముగ్గురమొకటైతే ఇంకేముందీ ।
అనుకున్నది చేతిలోకి చిక్కిపోతుందీ |
మనకు దక్కిపోతుందీ




చిరునవ్వు దివ్వె ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం

చిరునవ్వు దివ్వె ఏమన్నదీ
అరమోడ్పు కన్నులేమన్నదీ
తనకున్న మున్నె మగడున్నచోటికి
మనసుపోయేనంటున్నదీ

లేడిలా మనసు పరుగిడినా
వగలాడి ఆ బిగువెందులకే
వేడికోరికల దాడులకే పూబోణి రవ్వంత జంకెనులే
తొలినాటివేనే ఈ బిగువు| ఒక రాతిరేనే ఈ బెదురు
ఆ పైన మనవైపు చూడదులే

ఇంతి ముంగురులు సరదవే
వెన్నెల రాసి నొకపరి చూడాలి
ఎంతమురిపాలె అన్నకు
తన చెల్లి సొగసులు చూసుకొని
అల్లారు మేనల్లు నెత్తుకొని అంతలో తిరిగివచ్చుననీ
శ్రీవారితో ముందే చెప్పాలనీ

కలికిరో కలువరేకులలో
కనిపించు ఆ మంచు ఎందులకే
కమ్మగా వరుని విరిపాన్పు
రమ్మంటే వలపుల విందులకు
వింత తళుకులూ విరిశాయి ఏదో విశేష మీరేయీ
కదలవే మదనుకొలువునకు




షోకైన మల్లెపువ్వుమీద పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

(Note: ఇది ఆడియో వెర్షన్,  వీడియో వెర్షన్ లో కొన్ని మర్పులు చేశారు)

షోకీల్లా పిల్లా బుగ్గమీద
ముద్దిచ్చే మోజు నీకులేదా
ఉంటేలే-లే-లేచి రా-రా- రా
నీకు వైకుంఠమే చూపుతా

ఈ మగువ నవ్వులలో నా బిగువు కౌగిలిలో
మత్తు ఉందీ | గమ్మత్తు ఉంది.
రంజైన సుఖముంది రా
ఒక్కసారీ చిక్కితేనూ
ఇక పైన పోలేవురా

ఈ మేని ఒంపులలో లేమెరుపు చూపిస్తా
తేనెలూరే వయసులోని
రుచి నీకు అందించుతా
నిన్నలేదు రేపుదూ
జల్సాగ జీవించరా




అంబ పలుకవే జగదంబ పలకవే పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల

అంబ పలకవే జగదంబ పలకవే
కొండకింద కోటమ్మ పలకవే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే

టక్కుటమారం నేర్చినోళ్ళు
నిను చిక్కించుకోను చూస్తారే
పక్కన పొంచులు వేస్తారే
బొందిలో ప్రాణం ఉండువరకు
ఆ చవటల ఆటలు సాగనియ్యమే
ఆ చవటల ఆటలు సాగనియ్యమే

ఎదురుగానే నీవున్నావా.
ఎవరికి కనపడకున్నావా
లోకోద్ధరణకు పుట్టావమ్మా
నీకు సాటి ఎవరమ్మా బొమ్మా

నీదయ మాపై ఉంటేచాలు
మట్టినైన మాణిక్యం చేస్తాం
రాళ్ళనైన రత్నాలుగ చేస్తాం
దేశద్రోహుల నాశంచేసి
ఆశాజ్యోతుల వెలిగిస్తాం

Palli Balakrishna Tuesday, November 28, 2023



చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, విజయరత్నం
గానం: ఘంటసాల, పి.సుశీల , యస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక
కథ, మాటలు, అసోసియేట్ డైరెక్టర్: దాసరి నారాయణరావు 
దర్శకత్వం: పి.లక్ష్మీదీపక్
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు
విడుదల తేది: 30.12.1971



Songs List:



ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో




హరి ఓం హరి ఓం ఆనరా పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: యస్.పి.బాలు 

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా
హరి ఓం హరి ఓం ఆనరా

చరణం: 1
ఎందరి కొంపలు తియ్యందే వీడింతవాడెలా అయ్యాడు
వీడి గుబీ తియ్యాలని వీరబ్రహ్మం చెప్పాడు

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా


చరణం: 2
నిప్పు నీరు గాలి నేల నీవి నావి అన్నారు
డబ్బు జూడ అందరి దేనిని కై దెబ్బకొడితె రైతన్నారు 
హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా

చరణం: 3
పాపం పుణ్యం అనుకోకుండా పైసా సంపాదించాలోయ్ 
జేబులు బాగా నిండిన పిమ్మట
గుళ్లు గోపురాల్ కట్టాలోయ్

చరణం: 4
జిందాబాద్  జిందాబాద్ 
సోషలిజం కావాలని లెక్చరు దంచేస్తారూ
పార్టీ మార్చేస్తారూ ఆ తరువాత .....
సొంతం మీదకు ముంచుకు వస్తే 
శోష వచ్చి పడిపోతారు



చీరియో టాటా ? పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి: 
చీరియో టాటా ?
కన్నులనిండా కైపులువుంటే నో ఫియర్
మై డియర్ - కం నియర్
వెన్నెలకన్నా వెచ్చనిహాయి ఐయాం హియర్
తారనై లేచి యున్నానురా -
చంద్రుడా సాగి రావేమిరా రా 

చరణం: 1
నాకురులు నీలాల మేఘాలుగా
నా కనులు ఆకాశ దీపాలుగా
రేయిలో – హాయివై ఆడుకో - పాడుకో
తనువులో - అణుపుగా నిలిచిపోవాలిరా....

చరణం: 2
నామధుర గానాలు నీ మధువుగా
ఈ వలపులోకాలు కనువిందుగా
చెలిమిలో కలిమివై ఏలుకో ఏలికా
ఒకరిలో ఒకరమై ఇమిడి పోవాలిరా




పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో
నువ్వు పై లాపచ్చీసుమీద వున్నావయ్యో
అబ్బ - పండువంటి కన్నె మనసు లాగేవయ్యో

పచ్చజొన్న చేనుకాడా చూచానమ్మీ
నువ్వూ - దొంగచూపులతోటి మనసు దోచావమ్మీ
అబ్బ - తిప్పుకుందామంటే తిరిగి రాదోలమ్మీ 

కమ్మని నీ కౌగిట్లో రంజుగ కులకాలని నాకున్నది
కసిదీరంగా నాలుగు చేతులు కలపాలని నాకున్నది
ఇద్దరి ఆశలు తీరేవేళ దగ్గరలోనే వున్నది
అందాకా అమ్మాయిగారిని తమాయించమంటున్నది 

ఎన్ని జన్మలు మారిన నువ్వే కావాలని నేనంటాను
కన్నుమూసినా కలలో నువ్వే రావాలని అనుకుంటాను
నీడల్లే నీజాడ తెలుసుకొని కొంగుబట్టు కొని వస్తాను
నువ్వు వదిలినా నేను వదలనని నీళ్ళలో మునిగిచెబుతాను

కాదుకూడదని ఠలాయిస్తివా పక్కనబావి ఉందయ్యో
అవునని తలవూపావా చూస్కో కందిచేను పెరిగుందయో
చూపులు రెండూ ఏకమైనపుడు మాటలపని ఏమున్నది
పూల తెప్పపై జోరుజోరుగా తేలిపోతె హాయున్నది 




నీ మనసులోకి రావాలీ కాపురానికీ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నీ మనసులోకి రావాలీ కాపురానికీ
నే అద్దె ఎంత యివ్వాలీ మాసానికీ
నా మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలీ యివ్వడానికి

అమ్మమ్మో అయ్యయ్యొ అల్లరిచేశాడు
అబ్బబ్బో-అయ్యయ్యో-మెల్లగ దోచాడు
ఏమేమో చేశాడమ్మో
నే మైమరచి పోయానమ్మో
చేసింది యేముంది చేసేది రేపుంది
ఉలికి ఉలికి పడబోకు
ఉన్నదంత ముందుందీ
ఎంతెంతో ఉందమ్మో
ఇంకెంతో ఉందమ్మో

అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసింది
అయ్యయ్యో ఒళ్ళంత అల్లుకు పోయింది
ఎన్నెన్నో చేసిందమ్మో
అందకుండ పోయిందమ్మో
వారేవా మొనగాడా
తగ్గాలి నీ జోరు
జగజ్జంత్రి నీవై తే
జగజ్జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే
జగమంతా మనదేలే
జగమంతా మనదేలే
ఈ యుగమంతా మనదేలే
అహో...

Palli Balakrishna

Most Recent

Default