Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Saloni Aswani"
Kokila (2005)



చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
నటీనటులు: రాజా ఏబుల్, శివబాలాజీ, రాజీవ్ కనకాల, సలోని అశ్వని, అర్చన (వేద), సుహాసిని జూనియర్
దర్శకత్వం: కొండా
నిర్మాత: జి.రవికుమార్ రెడ్డి
విడుదల తేది: 12.01.2006



Songs List:



వర్షం ఫేమ్ త్రిష పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: షాన్, కె.కె., టిప్పు

వర్షించే మేఘం నువ్వా వర్షం ఫేమ్ త్రిష నువ్వా 



కోకిల కోకిల పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: శ్రీనివాస్, శ్రేయా ఘోషాల్ 

కోకిల కోకిల 



శుభమో సుఖమో పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: సునీత్ 

శుభమో సుఖమో 




అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: ఉదిత్ నారాయణ్, సునీత

అనగనగా 



వీరి వీరి గుమ్మడి పండు పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: మధుకర్ 

వీరి వీరి గుమ్మడి పండు 



స్నేహమా పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: పెద్దాడ మూర్తి 
గానం: రూప్ కుమార్ రాథోడ్,  కె.యస్.చిత్ర 

స్నేహమా 




పవన్ లా ఫోజు పాట సాహిత్యం

 
చిత్రం: కోకిల (2006)
సంగీతం: ఎం. ఎస్.మధుకర్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: సోను కక్కర్ 

పవన్ లా ఫోజు 

Palli Balakrishna Sunday, March 17, 2019
Adhinayakudu (2012)



చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: బాలకృష్ణ , లక్ష్మి రాయ్, సలోని , జయసుధ
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యం.ఎల్. కుమార్ చౌదరి
విడుదల తేది: 01.06.2012



Songs List:



ఓలమ్మి అమ్మీ పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి,బాలు, రీటా

ఓలమ్మి అమ్మీ




గురుడా ఇటు రారా పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మనో , రీటా

గురుడా ఇటు రారా 




ఊరంతా పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కళ్యాణి మాలిక్ 

ఊరంతా 




మస్త్ జవాని పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యస్.పి. బాలు, చైత్ర అంబడిపూడి

మస్త్ జవాని




అందం ఆకుమడి పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మనో , నేహా

అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి
తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి
నీ ఉయ్యాల నడుములో మడతల్పడి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి

అరె అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి

ఏయ్ ఎక్కడో సుర్రంది 
అబ్బా మంచమే కిర్రంది
హేయ్ ఎక్కడో సుర్రంది చెయ్యేపడి 
నులమంచమే కిర్రంది కుస్తీ పడి 
బోల్డన్ని ముద్దులే బాకిపడి 
ఈడు అల్లాడుతున్నదే బెంగేపడి
సరేయ్ వడ్డీతో కలిపిస్తా ఉండొద్దే డీలాపడి...
అరె అరె వచ్చేవులే ఎండనపడి 
ఆకలినే తీర్చేసుకో ఎంగిలి పడి

అందం ఆకుమడి వేసేయ్ తలుపు గడి
వచ్చాను ఇష్టంబడి డి డి డి డి
వయసే వీధి బడి తెరిచా మోజు పడి 
వచ్చేయ్ నా వెంబడి 

ఘాటుగా ఉన్నావే
హా గాటులే పెట్టవే
ఘాటుగా ఉన్నావే కారప్పొడి
పంటి గాటులే పెట్టవో మీద పడి 
నీకేడో ఉన్నదే బాగా సుడి
జర ఆధరాలే నాలుగు ఆటల్బడి
పదా ఒళ్ళోంచి తెల్లార్లు చేసేద్దాం సాగుబడి 
మనం మనం బరంపురం అయితే సరి
అదోరకం మహాసుఖం అందిస్తాది

అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
అ వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి
తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి
నీ ఉయ్యాల నడుములో మడతల్పడి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి



అదిగో పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కళ్యాణి మాలిక్ 

అదిగో 

Palli Balakrishna Friday, December 15, 2017
Oka Oorilo (2005)


చిత్రం: ఒక ఊరిలో (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:
గానం: మల్లికార్జున్
నటీనటులు: తరుణ్ కుమార్ , రాజా , సలోని
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: చంటి అడ్డాల
విడుదల తేది: 01.07.2005

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఏ చోట మలుపు తిరిగెనో తన చివర అ ఆ ఏదో
కథ కంచికె ఎపుడు వెళుతుందో తెలిపేది ఎవరో...

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

ఒంటరిగా నువ్వుంటే జత చేసుకున్నానే
జంటగానే నన్ను అనుకుంటే నేను ఒంటరిగా చేయిచ్చనే
చితిమంట నను రమ్మందే బ్రతుకింక నాకు లేదే
కడసారి నేను చూడాలి కోన ఊపిరుండగా

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

తుది క్షణమే ఒక హృదయం  అందే ఒక మాట ఏమందే
ఆ నిజమే కడదాక నాలో అంటుందే
మెతకటి నను చూడందే అటువైపు నువునా
నీ ప్రేమ నేను కాదు అనా ఈ స్నేహము ఉందిలే

ఒక ఊరిలో మొదలు అయింది
ఒక ప్రేమ కథే ఆ రోజు
ఈ చోటుకే ఏక చరణ మన కనుల ముందే ఈ రోజు

Palli Balakrishna Wednesday, December 6, 2017
Dhana 51 (2005)



చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
నటీనటులు: సుమంత్, సలోని అశ్వని
దర్శకత్వం: ఆర్.సూర్యకిరణ్
నిర్మాతలు: యమ్. యల్. కుమార చౌదరి
విడుదల తేది: 14.01.2005



Songs List:



టైటిల్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: వాసు, విశ్వా, ఆర్. సూర్య కిరణ్ 

టైటిల్ సాంగ్ 



ఐ యామ్ ఇన్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌశల్య

పల్లవి:
ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఏమేమో అవుతుంది ఏమో మరి
నా కేమైందో తొలిసారి ఈ లాహిరి
ఏలో ఏలో ఏలో చలేస్తుంది నీలో
ఉయ్యాలెక్కి ఊగాలి ఈ వేళలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్

చరణం: 1
ఏదోటిచేయి ఇలా కలుపు చేయి
మదే నిండిపోయి భళేగుంది హాయి
అలై నువ్వు వచ్చేమరీ
సూదంటు రాయి నీ చూపేనురోయి
లాగేసింది నీ వైపుకి హోయ్ హోయ్
సరికొత్త గిలిగింత ప్రేమేనని 
తనువంత పులకించి పోయిందని
హుషారాల హేల తుఫానైన వేళ
తమాషాలు చేరాలి ఈ ప్రేమలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్

చరణం: 2
నువులేని దారి సహారా ఎడారి
నేనే నిన్ను కోరి నాలో నువ్వు చేరి
ఇలా ఉండిపోతే సరి
నీ గుండెలోని నన్నే ఉండిపోని
ఎలాగైన నీ దానిని హోయ్ హోయ్
శిల లాగ ఇన్నాళ్లు ఉన్నానని
అలలాగ మార్చింది నువ్వే చెలి
నువ్వే నేను కాదా నీలో నేను లేన
ఇలా ఏకమవ్వాలి ఈ ప్రేమలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్



అరవిరిసిన మొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి

అరవిరిసిన మొగ్గ




చైనా గోడ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శంకర్ మహదేవన్ 

చైనా గోడ 



ఔననవే ఔనని అనవే పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శంకర్ మహదేవన్ 

ఔననవే ఔనని అనవే



కోవా కోవా పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవివర్మ, పల్లవి, వాసు, బాలాజీ, మతిన్, గౌరీ, ఆర్. సూర్య కిరణ్, కామేశ్వరి 

కోవా కోవా 

Palli Balakrishna Wednesday, November 22, 2017
Maryada Ramanna (2010)



చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: సునీల్ , సలోని
దర్శకత్వం: యస్.యస్. రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 23.07.2010



Songs List:



అమ్మాయి కిటికీ పక్కన పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్  శ్రీరామ్
గానం: కారుణ్య, చిత్ర

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది


ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది




ఉద్యోగం ఊడిపోయింది.. పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

ఉద్యోగం ఊడిపోయింది..
పోయిందా...పొ పొ పొ పోయిందా..
సద్యోగం సంతకెళ్ళింది
గోవిందా.. గొ గొ గొ గోవిందా..
గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..
ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..?
కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!!
చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..?
ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..!
ఛీ అంది.. చేతిలో గీత
నలిగింది.. నుదిటిపై రాత..
టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..
పెదవి ఎండిపోయింది..

పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..

శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను..
పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..
ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..
భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను)
జేబు కత్తెర..! (వెయ్యనే లేను)
చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను...
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..
తిక్క తీరిపోయింది
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.




తెలుగమ్మాయి... తెలుగమ్మాయి... పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యమ్. యమ్. కీరవాణి, గీతా మాధురి

రాయలసీమ మురిసిపడేలా...
రాగలవాడి జన్మ తరించేలా...
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి

పలికే పలుకుల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే....

తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి

గీతలే అని చిన్న చూపెందుకు

వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి... తెలుగమ్మాయి...
అందుకోమన్నది నిన్ను తన చేయి




రాయే రాయే పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: రఘుకుంచే, గీతామాధురి

రాయే రాయే రాయే రాయే రాయే సలోని 



ఉరకలువేయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మర్యాధ రామన్న (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 

ఉరకలువేయ్ చర చర చర చర చర చర చర చర 
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర

దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై 
వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై 
ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై

పరుగులుతీయ్ ఉరకలువేయ్ 
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర
బిరబిర బిరబిర బిరబిర బిరబిర 
చరచర చరచర చరచర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర 

గుత్తుకకోసే కత్తికొనలు  కత్తికొనలు

గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్ 
మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్

పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర 
ఉరకలువేయ్ చర చర చర చర

ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్ 
నిస్సత్తువతో నిలబడనీయ్యక 
ఒక్కోఅడుగు ముందుకువేయ్ 
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై 
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై

పరుగులుతీయ్ పరుగులుతీయ్
ఉరకలువేయ్ ఉరకలువేయ్ 
పరుగులు పరుగులు పరుగులుతీయ్
ఉరకలు ఉరకలు ఉరకలువేయ్
బిరబిర చరచర బిరబిర చరచర 
బిరబిర చరచర బిరబిర చరచర 

హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర

Palli Balakrishna Thursday, August 17, 2017
Chukkallo Chandrudu (2006)

చిత్రం: చుక్కల్లో చంద్రుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: షాన్, సిద్దార్ధ్
నటీనటులు: సిద్దార్ధ్, సదా, చార్మీ కౌర్, సలోని
దర్శకత్వం: శివకుమార్
నిర్మాత: అలెగ్జాండర్ వల్లభ
విడుదల తేది: 14.01.2006

మళ్ళి మళ్ళి రాదంట ఈ క్షణం
నచ్చినట్టు నువ్వుండరా
యవ్వనం అంటెనె ఓ వరం
తప్పువొప్పు తేడాలేనేలేదురా

చిన్న మాట నీ చెవిన వేయని
నిన్ను నువు నమ్ముకుంటె నింగి వంగద
విన్న మాటని విప్పి చెప్పని
బ్రతుకుతు బ్రతకనిస్తే నువు దేవుడె

hey every body lets break this body
walk your body with meeee (2)

నా లాగె నేనుంటాను
నా మది మాటే వింటుంటాను
this is the way i am
నా తోనె నేనుంటాను నచ్చిన పనినే చెస్తుంటాను
i dont give it down
నవ్వులు రువ్వుతు నవ్వును పంచుతు
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలుర...
అందని పండుని పొందాలి అంత ఆనందం
అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
అల్లరి పనులే చెయాలి అప్పుడె ఆరోగ్యం
నా సాటి ననంటాను పోటిలోనె ముందుంటాను
కెరటం నాకె ఆదర్శం పడిన లేస్తాగా
సమరంకే ఆహ్వానం గెలుపే నాదేగా
కష్టం ఉంటె కష్టం రాదంట
నమ్మిందె చెస్తుంటాను ప్రాణం పెట్టీ సాధిస్తాను

hey every body lets break this body
walk your body with mee

నవ్వులు రువ్వుతు నవ్వును పంచుతు
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలుర...

o my love i have been taken that ia its all abt givingbut life of me is just a part of livung so i was living living living living livinga mistake done i take in to step ,taken in to step & start ahha walk walk walk walk hey i just walk with love i just wanna have fun.....thats rite......

చిన్న మాట నీ చెవిన వేయని
నిన్ను నువు నమ్ముకుంటె నింగి వంగద
విన్న మాటని విప్పి చెప్పని
బ్రతుకుతు బ్రతకనిస్తే నువు దేవుడె

hey every body lets break this body walk your body with mee

ఆకాశం నీ సరిహద్దు అవకశాన్ని అసలొదలొద్దు
this is the way iam
సందేహం ఏది లేదు పోయెటప్పుడు ఏదిరాదు
స్వేచ్చగామంచిని పంచుతు
నాలుగు రోజులు ఉన్న చాలు జన్మ ధన్యమే


*******   *******   *******


చిత్రం: చుక్కల్లో చంద్రుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, చిన్మయి

ప్రేమే పరవశం ప్రతి క్షణం తెలుసున
ప్రేమే అను దినం మధు వనం మనసున
బుర్ర తినకురో వెంట పడకురో వేళ కాని వేళ
ఎంత చెప్పిన రూటు మార్చవ నిది కాకి గోల
రాసె కధలలొ మొదలు ఇదె మలుపు ఇదే
మూసే కనులలో కలలకు కొలువు ఇదే
మరి ప్రేమేనే కద పిచ్చి అందురు గుర్తుచేసుకోర
మందు గ్లాసుతో దేవదాసులా మారిపొకు లేరా

ఉక్కిరి బిక్కిరి ప్రేమే ,తియని తిమ్మిరి ప్రేమే
ఊహల వాకిట ఉయల ప్రేమే ఊపిరి ప్రేమే ప్రేమే
ప్రేమే కురవద చిటపట చినుకుల
తానే మారదా చివరికి వరదల
ప్రేమే కద సుర్యొదయం ఆగేది కాదె ఏ సంబరం
ఆ సుర్యుడె కనిపించడె తీరా సాయంకాలం
ప్రేమే ఒక మహ భాగ్యం వరం అట
ఇక చాల్లె ఆపెయ్యవ
ప ప పద మహత్తే తనదేనట
పోవోయి  నే రానుగా
తొణికె హుషారు  ప్రేమే, పలికే పెదాలు ప్రేమే
ఏదలో ఉగాది ఎగసి పోదది ఇదిగొ ఏ ప్రేమే
పోతుందిగా ఒంటరి తనం ప్రేమించినాక ఏదో క్షణం
నేహాయిగా ఉన్నానుగా లేదేదాని అవసరం
ప్రేమే తెగ రహస్యాలు తెలుపద
నాకెం అదె పనా
త త తరి తహ తహలు కలగవ
ఐన భరించన
విరిసే గులబి ప్రేమే నిలిపే పునాది ప్రేమే
నిన్నే స్మరించి... నిన్నే వరించు నిజమే ఏ ప్రేమే


********   *********   *********


చిత్రం: చుక్కల్లో చంద్రుడు (2006)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , హరిణి

కలనైన...ఇలనైన...నువులేక క్షణమైనా
కదలదు కాస్తైన ఈ కాలము
దొరికెను వరమల్లె నీ స్నేహము
ప్రియ ప్రియ నువ్వే లోకము నాలో సగం జగం

మనుసుపడే ఓ స్నేహమా చెప్పవే ప్రేమ సాగరమ..
ఎగసి పడే కెరటానికి తీరమై చేరనా
విరహ పడె ఓ గగనమా మేఘమై విడి వెళ్ళకుమా
చిలికి పడె ఈ చినుకుని సంధ్రమై దాచన
ఈ సమయం నీ ప్రణయం నన్ను ఏదో ఏదో చేసే
నీ తరుణం నా హ్రుదయం చెలి నిన్నె నిన్నె కోరే
ఇది ఎంతటి అతిసయము
ప్రియ ఆసై శ్వాసై ద్యాసై ఊసై ఉంటా ప్రతి క్షణము

కలనైన... ఇలనైన...

కలిగెనులే సందేహము నేనే నేనే కాదని
తెలిసెనులే ఓ సత్యము నాలొ నువు చెరావని...
గడవదులే ఏ నిమిషము ఇది ప్రేమోమాయో ఏమో
కలవరమై నా కళ్ళలో...ఏవో కొంటె స్వప్నాలలో
గ్రహణలె తొలగిస్తు ఆ గగానలె దటొస్త
చిరు మబ్బుల మీదుగ పగడపు దేవికి
రెక్కల గుర్రం మీదన వచ్చి
నీకలలన్ని తీర్చే రాజుని నేనేనంటా

కలనైన......ఇలనైన....


Palli Balakrishna Wednesday, August 16, 2017
Race Gurram (2014)



చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, శృతిహాసన్
దర్శకత్వం: సురేందర్  రెడ్డి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావు
విడుదల తేది: 11.04.2014



Songs List:



భూ...భూచాడే పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, శ్రేయగోషల్

భూ...భూచాడే 
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
భూ...
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
రేసుగుర్రంలాంటోడే రివర్సు గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్సవుతాడే డోలే కొడతాడే

భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసం ఉంటాడే...

భూ...భూచాడే 
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే

భూ...భూచాడే...
హొ సాలా సాలా సాలా
నీ చూపే మసాలా 
హొ సాలా సాలా సాలా
నీ ఊపే మిస్సైలా 
ఓ నిక్కిన చుక్కల నక్కిన కిక్కుల
లెక్కలు ఒక్కలు తేల్చేరా 
చిక్కిన చుక్కని చెక్కర ముక్కను 
వక్కల చెక్కలు చేసేరా
తూ ఆజారే తూ ఆజారే తూ లేజారే సాలా

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసంఉంటాడే...

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
గెలాంటోడే గిలాంటోడే బీకేర్ఫుల్ అంటాడే
హొ..హో భూచోడే 
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
సునామీకే మిలానోడే నోటె తెస్తాడే...
భూచాడే...భూచాడే...భూచాడే...భూచాడే




మై స్వీటీ పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సిద్దార్ధ్ మహదేవన్, రాబిట్ మాక్

ఐమె సౌత్ ఇండియన్ 
ఐమ్ గొన టెల్లింగ్ గర్ల హు ఈస్ ప్రెట్టి 
హొ...హొ...రిచ్చి ద నేమ్ ఈస్ స్పందనా
షి గాట్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ షి ఈస్ విత్ ఇట్ 
ఒహ్ గరాబొ షి ఈస్ గొన్న మై స్వీటీ...
మై స్వీటీ...ఒహ్ మై స్వీటీ... స్వీటీ...

హెయ్ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టూగా 
నీటి లాగ సాగిపోనీ
హెయ్ ఊహలోన తేలనీ ఉప్పెనల్లె పొంగనీ 
గాలిలాగ ఊరేగనీ
హెయ్ ఫేసుకున్న మాస్కునీ సీసికొట్టు నేలనీ 
చూడు నీలొ ఒరిజినల్నీ 
క్లాసులోన మాసునీ మాసులోన క్లాసునీ
మిక్సు చేస్తే బ్యూటీ హనీ 
ఒహ్ మై స్వీటీ  - కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే 
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

చాలు చాల్లే చలాకి వైటు నాటు తుపాకి 
పారిపోతారె లోకమంతా నిన్ను చూసీ 
కొంచెం వీలేసి చూడు
పెద్దకేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇక నీలో హార్టు ఎంతొ లైటు స్మూతు సౌండు 
స్వీటీ  -  కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ - కొంచెం కోపగించవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

స్వీటీ -  కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ -  కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే 
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...
మై స్వీటీ.....




సినిమా చూపిత్త మామా పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సింహా, దివ్య , గంగ

మామా నువు గిట్ల గబర గిబర 
తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు 
దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

డప్పు కొట్టి పిలవబట్టే ఈని తీరే
నిప్పులెక్క కాల్చ వట్టే ఈని పోరే
కొప్పు గూడ గొట్ట వట్టే ఈని జోరే

హే మామ దీని సూడకుంటే మన్నుతిన్న పాములెక్క మనసు పండబట్టే
అయ్యో ఈడు చూడగానే పొయ్యిమీద పాల లెక్క దిల్లు పొంగబట్టే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో 
ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో

మామ ని బిడ్డవచ్చి తగిలినంకనే 
లవ్వు దర్వాజా నాకు తెరుసుకున్నదే
ఓ రయ్య ఈ పోరగాడు నచ్చినంకనే 
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు వట్టేసెనే కుట్టేసెనే పాగళ్ గాన్ని చేసెనే
సుట్టూత బొంగరంలా తిప్ప బట్టెనే 
సిటారు కొమ్మ మీద కుకో బెట్టేనే
మిఠాయి తిన్నంత తీపిబుట్టెనే 
సందులల్ల దొంగలెక్క తిప్పవట్టెనే
దీని బుంగమూతి సూత్తే నాకు 
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

మామ ... మామ

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా... పుంగి బజానా... 

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన




గల గల గల గల గల్లంటు మనసే పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: దినేష్ కనగరత్నం, మేఘ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో 
ఓ అమ్మాయో
యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో 
ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత
మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో 
ఓ అమ్మాయో
ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ

గల గల గల గల గల్లంటూ మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
I want to say my love
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో 
ఓ అమ్మాయో

రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే - హేయ్
నేను రెప్పలైన వేయలేను అందుకే - హేయ్ 
హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే
నువ్వు చెతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే - హేయ్
నా శ్వాసలోన నువు చేరినందుకే

I wish i wish i could be with you 
for longer longer life along
Don’t break my heart 
don’t just leave me all alone alone alone

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
ఐ వన్న సే మై లవ్
నువ్వంటే పిచ్చ ప్రేమలే
గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో 
ఓ అమ్మాయో

నువ్వంటే పిచ్చి ప్రేమలే  నువ్వంటే పిచ్చి ప్రేమలే



Down Down పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: విశ్వా 
గానం: ఎస్. ఎస్. థమన్, శ్రుతి హసన్ 

Down Down



రేసు గుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: ఉషా ఉతఫ్, యం.యం.మానసి, యం.యం.మోనీషా

రేసు గుర్రం 

Palli Balakrishna Saturday, August 5, 2017

Most Recent

Default