-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "R.P.Patnaik"
Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Leka Nenu Lenu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Banner : Suresh Productions
Music : R. P. Patnaik
Director : Y. Kasi Viswanath
Producer : D. Suresh Babu
Actors : Tarun
Actresses : Aarthi Agarwal, Laya
Supporting Cast : Sarath Babu, Chandra Mohan
Release Date : 14 January 2002

Edo Edo Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Edo Edo' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వై. కాశీ విశ్వనాథ్ గానం: ఉష ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని నీతో ఉండాలని నేనే ఓడాలని నువ్వే గెలవాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక నువ్వే కావాలని నిన్నే కలవాలని మనసే విప్పాలని మాటే చెప్పాలని ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఎదలో ఏదో మొదలయ్యింది

Ela Ela Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Ela Ela' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉష ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను రామచిలక గోరువంక బొమ్మ గీసి తెలుపనా రాధాకృష్ణుల వంక చేయిచూపి తెలుపనా చిరునవ్వుతో తెలుపనా కొనచూపుతో తెలుపనా నీళ్ళు నమిలి తెలుపనా గోళ్ళు కొరికి తెలుపనా తెలుపకనే తెలుపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను కాలివేలు నేల మీద రాసి చూపనా నా చీరకొంగు తోటి వేలు చుట్టి చెప్పనా కూనలమ్మ పాటలో రాయబారమంపనా గాలికైనా తెలియకుండా మాట చెవిని వేయనా నాలో ప్రాణం నీవనీ... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలుజడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా... ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎదలోని ప్రేమను మృదువైన మాటను

Nindu Godari Kada Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nindu Godari Kada' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik and Kousalya.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Y. Kasi Viswanath
Singers : R. P. Patnaik, Kousalya
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: ఆర్. పి. పట్నాయక్, కౌసల్య నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని ఆనకట్టలాంటి హద్దులంటు లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికి బంధువుగా ఈ ప్రేమ

Nuvvante Naakistam Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Nuvvante Naakistam' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్ నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపన ఆగేనా ఆపిన ఎదలో లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం చరణం: 1 చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం చరణం: 2 ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విష్టం ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం... నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....

Chinni Chinni Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chinni Chinni' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Chi Chi Chi Song Lyrics in Telugu – Nuvvu Leka Nenu Lenu (2002)

'Chi Chi Chi' song from Nuvvu Leka Nenu Lenu (2002) movie is composed by R. P. Patnaik and sung by R. P. Patnaik, Lenina Chowdary and Usha.

SONG INFORMATION
Movie : Nuvvu Leka Nenu Lenu (2002)
Music : R. P. Patnaik
Lyricist : Veturi
Singers : R. P. Patnaik, Lenina Chowdary, Usha
చిత్రం: నువ్వు లేక నేను లేను (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్. పి. పట్నాయక్, లేనీనా చౌదరి, ఉష పల్లవి: చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి బుల్లోడ చి చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చరణం: 1 ఉంటే జానకిలా రాముని వలచీ వచ్చే శూర్పణక వరసలుమార్చీ సిగ్గేలేని చెలీ తగ్గుమరి చీ చి చి చి బుద్దేలేని ప్రియ పట్టెనట కొత్తపిచ్చి నాతో బడాయిలా లడాయిలా చీ చి చి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లెమ్మ చి బుల్లెమ్మ చి చి పో చి బుల్లోడ చి పిల్లోడ చి చరణం : 2 మెచ్చా మేనకనే మెత్తగ వలచి ఇచ్చా నామనసే మల్లెలు తెచ్చి పైపై మెరుగులకే పోయెమతి చి చి చి చి భౌ భౌమనకె చెలీ భానుమతి చి చి చి చి ఐతే జులాయికే జిలాయిలే చి చి చి చి చి చి చి బుల్లెమ్మ చి చి చి చి పరిగెడతావె అలా ఛీచి ఛీచి ఛీ చి చి చి బుల్లోడ చి చి చి చి ఎగబడతావె ఇలా ఛీచి ఛీచి ఛీ గునగున నడకల్లో నీకులుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీపొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో తిక్కకాస్తదించి పెడతా ఇవాళ పేచీ చీ చీ చీ చి చి చి బుల్లెమ్మ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ చి చి చి బుల్లోడ చి చి చి చి చీచి చీచి చిచి చీచి చీచి చీచి చీ

Palli Balakrishna Thursday, June 18, 2026


చిత్రం: అప్పుడప్పుడు  (2003)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్, మధుకర్
నటీనటులు: రాజా అబెల్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: ఎ.రమేష్ గౌడ్
విడుదల తేది: 16.05.2003

Palli Balakrishna Tuesday, March 26, 2019


చిత్రం: స్వాగతం (2008)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం:  భాస్కరభట్ల
గానం: టిప్పు
నటీనటులు: జగపతిబాబు , అనుష్క , భూమిక , అర్జున్ సార్జా
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: ఆదిత్యారామ్
విడుదల తేది: 25.01.2008

ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం
సరదాగా చిందులు వేసేద్దాం
వెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణం
కాలంలో పాటే పరిగెడదాం
నేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటే
నీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనే
ఏ సరిహద్దుని నో ఇక వద్దని
ఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌

అప్పుడప్పుడు చాలా చిన్న సంగతే
ఎంతో తృప్తి నివ్వదా నీలో నీకు
చూడగలిగితే ఎన్నో అధ్భుతాలని లోకం
చూపగలదని మరిచిపోకు
కోటల్లో కోరికలన్ని కొండెక్కే వీలివ్వద్దు ఎదురొచ్చే ఆనందాన్ని
వద్దొద్దంటూ ఆపెయ్యద్దు
ఈ బ్రతుకన్నది హే బహు చిన్నది
ఓ చిరునవ్వుతో స్వర్గం చేసెయ్
లా ల ల ల ల

కంటి చూపుతో కొంచెం పలకరించుతూ
ప్రేమే చిలకరించుతూ
ఆనందించు నోటి మాటతో బంధం కుదురుతుందని
భారం తగ్గుతుంది ఆలోచించు
హే నలుగురితో పాటే నేను అనుకోడం ఆరంభించు
సంతోషం రెక్కలు తొడిగి ఎగిరొస్తుంది ఆహ్వానించు
ఈ పదిమందిలో నీ పరదాలను
ఓ చిరునవ్వుతో మాయం చేసెయ్


******   *******  *******


చిత్రం: స్వాగతం (2008)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తిక్ , చిత్ర

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా
చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా
చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా
ఎదలోతుల్లో ఆనందమా !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా మౌనమా !

నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా

వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా

Few see It’s Lust..
Few see It’s Love..
For me It’s You..Only You !

భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన
నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ
మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన
నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా

జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన !

మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా క్షేమమా..మనిషే ప్రాణమా

Palli Balakrishna Wednesday, December 13, 2017


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష
నటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యమ్. ఎస్. రాజు
విడుదల తేది: 01.11.2002

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం

ఓ హాని - ఐ లవ్ యు

నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపే నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనే దాటిరాదే కలలో ఆశ
పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
నిన్నే చూసే కల కోసం
సర్లేకాని చీకట్లోనే చేరుకోని
నువ్వు కోరే అవకాశం
తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది యదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
దక్కినంత ఆనందం
అయ్యో పాపం ఎక్కడ్లేని ప్రేమ రోగం
తగ్గదేమో ఏ మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం


********    ********   ********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , ఉష

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంటపడకుంటే
తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలజడి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి


*********   *********    *********


చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ... ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గసగా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా
రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
ఆ...రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ...ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యేత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీపేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా

చూపులో శూన్యమై పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత  ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదిటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా



*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ , రాజేశ్

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

బొమ్మా బొరుసులేని నాణేనికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడూ చంద్రుడూ లేని గగనానికి వెలుగుటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి నీ స్నేహం

కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వూ నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్నూ నన్నూ చూడగానే నమ్మితీరాలి




*********   *********    *********



చిత్రం: నీ స్నేహం (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్

 (సోలో సాంగ్)

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం!
ప్రాణమే నీకూ కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా!

వేయి కన్నులతో వేచిచూస్తున్నా
తెరచాటు దాటి  చేరదా నీ స్నేహం!

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా
అందాల ఆకాశమా

Palli Balakrishna Thursday, November 16, 2017




చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: ఉదయ్ కిరణ్ ,  రీమా సేన్
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: యం5.యస్.రాజు
విడుదల తేది: 19.10.2001



Songs List:



తూనీగా తూనీగా పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవని , ఉష  

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటాలే నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలుకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా
ఓ...ఓ...ఓ...ఓ...

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెలుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా
ఓ...ఓ...ఓ...ఓ...

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటావా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా



చెప్పవే ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వనీ
ఇపుడు నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదెలా


చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీతలపులు చినుకు చునుకుగా 
దాచిన బరువెంత పెరిగెనో
నిను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా
స్నేహామా నీకు తెలిపేదెలా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...



కిటకిట తలుపులు పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం

కంట తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ (3)





నీ స్నేహం ఇక రాను అని పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్ 

నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా
ఈ దూరం నువు రాకు అని నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే



ధిన్ ధిన్ ధినక్ పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మహాలక్ష్మి అయ్యర్

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా
హో ల ల ల ల ల...

హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో  పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
కోరికె రెక్కలై ఎగరవేయన్నది
హో ల ల ల ల ల...

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది



మనసంతా నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. చరణ్, సుజాత

చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...

వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని
పరికిణీ బొమ్మకి పైట చుడుతుందని
దూరమే చెప్పదే నీ రూపు మారిందని
స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని
ఇకపై మన కౌగిళింతకి చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ...

చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా

రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడక
దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని 
ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని
విరహమే తెలుసుకోవాలని...

చెప్పనా ప్రేమా చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే 
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే 
హే హే హే... హే హే హే... హే హే హే...



ఆకాశానా ఎగిరే పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కే.కే‌, సుజాత

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా

అటు ఇటు తిరుగుతు కన్నులు
చిలిపి కలలను వెతుకుతు ఉన్నవి
మదిని ఊరించు ఆశనీ కలుసుకోవాలనో
మధురభావాల ఊసుని తెలుసుకోవాలనో
 
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా

తడబడు తలపుల అల్లరి ముదిరి మనసును తరుముతు ఉన్నది
అలలుగా తేలి నింగిని పలకరించేందుకో
అలసటే లేని ఆటలో అదుపు దాటేందుకో

ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది ఎంత ఆపుతున్నా
పిల్ల గాలితో తూగుతున్నది వింత హాయిలోనా
ఆకాశానా ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా



ఎవ్వరినెప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: మనసంతా నువ్వే (2001)
సంగీతం: ఆర్. పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్)

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్దం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్దం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో ఈ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 

Palli Balakrishna


చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిహాల్, ప్రాణవి
నటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ (తొలిపరిచయం)
దర్శకత్వం: తేజ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.02.2007

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక....

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే...

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక...

Palli Balakrishna




చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
నటీనటులు: ఆర్.పి.పట్నాయక్ , నవనీత్ కౌర్, పద్మప్రియ
దర్శకత్వం: ఇ. శ్రీనివాస్
నిర్మాత: యన్.యమ్.సురేష్
విడుదల తేది: 26.03.2003



Songs List:



కుకుకూ కుకుకూ పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ
చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ

చరణం: 1
కుశలములెన్నో అడిగినదీ కులికే గోదావరీ
పులకలు నాలో చిలికినదీ ఎగసే ఈ లాహిరి
కరిమబ్బునే మహముద్దుగా ఎదముందుకు తెచ్చెను గాలీ
తడికన్నుల్లో సిరివెన్నెల్లే కురిపించెను జాబిలీ... 

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ

చరణం: 2
అడుగులు తానై నడిపినదీ పుడమే ఓదారినీ
పదములు పాడీ పంచినది ఒడిలో ఓదార్పుని
రుణమన్నదే యిక తీరదే నా ప్రాణములిచ్చిన గానీ
నేల తల్లికే నేను యివ్వనా ఈ గీతాంజలీ... 

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూ కూ
నవలోకం చూపింది ఈ పిలుపూ

చిగురాకుల సవ్వడి ఐనా చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా నాలో ఏదో మైమరపూ

కుకుకూ కుకుకూ కుకుకూ కూ
తొలిరాగం నేర్పింది ఈ పలుకూ





పాడనా శిలను కరిగించు గీతం పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్, నిహాల్

పాడనా శిలను కరిగించు గీతం
పరమేశ్వరుడే యిలకేతెంచి
పులకించి నర్తించు నవ నాట్య వేదం

పాడనా మదిని మురిపించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

పాడనా...

నారద ప్రణిపాతం స్వర భారతి పదపీఠం
ఓంకార నాదాల నిగమార్ధసారం సంగీతం
వెన్నెల జలపాతం మరుమల్లెల మణిదీపం
స్వరరాగ రసయోగ గంగాప్రవాహం సంగీతం
దిగంతాల శ్రుతి సుగంధాలు వెదజల్లును సంగీతం

పాడనా శిలను కరిగించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

చరణం: 1
తుంబురు వరదానం తుహినాచల పరిధానం
మందార మకరంద మాధుర్యపానం..నా గానం
తుమ్మెద ఝంకారం నా పాటకి శ్రీకారం 
పరువాల పరవళ్ళ సెలయేటి వేగం  నా రాగం 
కళాభారతికి కళాఘాతమది  ఏమిర నీ గీతం 

పాడనా శిలను కరిగించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

నాదబ్రహ్మ గురు త్యాగరాజ కృత
పంచరత్నములకించుమించు సరిసాటియైన
మమ గాన వాహినికి మంజుల మార్దవ మానస గీతికి ఊపిరులాడక స్వరములు తోచక 
తికమక పడిపడి పదములు తడబడి
శ్రుతి తప్పి మతిపోవు పసివాడవు  జన్యజనకాల, ధన్యగామకాల నా మూర్చనలకింక మూర్చిల్లిపోతావు

|| పాడనా ... ||

చరణం: 2
గలగల పారే సెలయేరమ్మ  సరిగమలంటే నేర్పింది
కిలకిల పాడే ప్రతి గువ్వమ్మ గమకములంటే చూపింది
అమ్మ పాటలో లాలి లాలన చిన్ని పాపలో హాయి భావన గాలి తరగలో గాన మధురిమ
పేద వెదురులో ప్రాణ స్పందన
కడలి అలల కమనీయ కీర్తన
పుడమి ఎదను చినుకమ్మ నర్తన
సుప్రభాత సుమ రాగ రంజన
సూర్యదేవ కిరణాల దీవెన
వేద మంత్రముల నాద ఘోషణ
కాగితాలలో కావ్య వేదన
గుండె గూటిలో వాయులీనమై
కంటి పాపలో స్వప్న రాగమై 
గాన పథమ్మున నను నడిపించే
జానపదమ్ముల జాను తెలుగు
తొలి పాటతల్లి నా జోతలందుకొని పొంగిపోగా ... 

పాడనా...




కోదండ రాముణ్ణి పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
కోదండ రాముణ్ణి చూడు కోరింది యిచ్చేటివాడు
ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు
అందాలన్ని చూడ కళ్ళు చాలకుంటె
నా మనసుతొ చూడు చూడయ్యో 
ఆ రూపం అపురూపం
నిలపాలోయ్ గుండెలోపలా
ఆదైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై యిలా

చరణం: 1
శ్రీరాముని చిరునవ్వుగ వెలుగొందిన సీత
ఆ దేవుని వెనకాతలె వనికేగెను మాత
లంకేశుడు బెదిరించెను పలుమాయలచేత
బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మనసీత
ఆ బాధే నాలో పాటై పాడేను రామాయణం

కోదండ రాముణ్ణి చూడు

చరణం: 2
హనుమంతుడు వివరించెను సీతాసతి జాడ
శ్రీరాముడు వదిలించెను లంకేశుని చీడ 
పరనిందకు శీలమ్మును శంకించుట చేత
పెనుమంటలలో దూకి పునీత అయ్యె సీత 
ఆ గాథే నాలో పాటై పాడేను రామాయణం 

కోదండ రాముణ్ణి చూడు





అమెరిక అన్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: మాలతి, ఆలి, సునీల్

ఏ పిల్లాయ్ 
ఏటి
నువ్వు నాకు నచ్చావ్
నాకూ నా గోపి నచ్చాడు
గోపిగాడ ఆడెక్కడుంటాడు
ఏమో...

అమెరిక అన్నాడు అరెకరమమ్మాడు
అడ్డరోడ్డు సంతలో నన్నొదిలి పోయాడు

తెలిసినోడు, తెలియనోడు, 
పడుచోడు, ముసలోడు 
ఉన్నోడు, లేనోడు, వెంటపడి నవ్వుతాడు హా...

పిల్లా బాగున్నా వంటడూ - అంతనచ్చావా ?
పిల్లా ఏవూరు అంటడూ - ఊరు చెప్పేనా?
అమ్మాయ్ ఏఁ పేరు అంటడూ - పేరు చెప్పేవా ?
అలా ఓ సారి అంటడూ - చాటుకెళ్ళావా ?

అమ్మ దొంగా చాటుకెళ్ళినావా
అందమంతా అప్పగించినావా ?

ఏంటి తెగమెలికలు తిరిగిపోతున్నావు

నా గోపి యే గుర్తోస్తున్నాడు 
అంత గుర్తొచ్చేసే పనేంచేశాడేంటి...?

మనువని చెప్పాడు మడతలు విప్పాడు
మావిడి తోపులో మంచం వేశాడు
అమ్మతోడు అందగాడు మల్లెలవీ జల్లినాడు
దగ్గరగా వచ్చినాడు బుగ్గలవీ గిల్లినాడు  హాఁ

అబ్బా మా చడ్డ గుంటడూ - మీద కొచ్చాడా ?
అమ్మీ ముద్దెట్ట మంటడూ - ముద్దుపెట్టావా ?
ఛీపో సిగ్గంటే ఒగ్గడూ - పట్టుకున్నాడా?
కుర్రాడేమాత్రం తగ్గడూ - అంత పనోడా?

కొంటె వాడా కోకలాగినాడా ?
సూపుతోటే కాక రేపినాడా ?

చెట్టంతుంటాడు చెప్పినదింటాడు
నలుగురినెప్పుడూ  నవ్విస్తుంటాడు
కొత్తలుంగీ కట్టినాడు గళ్ళ బనీనేసినాడు
మండగొలుసు పెట్టినాడు 
మందులవీ అమ్ముతాడు

మందులమ్ముతాడా ?

పిల్లా నీ వాడు ఎవ్వడే? - డాక్టరబ్బాయి 
అబ్బో ఏఁమందులున్నవే? - బోలెడున్నాయీ
సరే మీ బావ ఎక్కడ? - తెలీదబ్బాయి

కండపుష్టికి ధాతుపుష్టికి తిరుగులేని వనమూలికలమ్ముతాం
మూలిక వాడండి మూలన పడ్డ మగతన్నాని వెలికి తీయండి
చీకటి పడితే చాలు చిరుత పులైపోతారు మామాట నమ్మండి
గజ్జిగాని, దురద గాని, తామరగాని
గోక్కోవడానికి గోళ్ళు లేవని బాధపడకండి
ధనుర్వాతం, పక్షవాతం కాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు, నడుంనొప్పులు, వెన్నునొప్పులు
మెడనొప్పులు, తొడ నొప్పులు
అన్ని నొప్పులకూ ఒకటే మందు

రూపాయ్ కొడితే ఉంటుంది మీ ముందు
పెద్దాపురం తైలం నొప్పులన్నీ మటుమాయం

అరే మా బావ గొంతులా ఉందే...?
ఏటి మీ బావ సందుల్లో మందులమ్ముతాడా ?
మరి డాక్టరని పెద్ద బిల్డప్పిచ్చావ్ ....
మా ఊళ్ళో సందుల్లో మందులమ్మేవాళ్ళని డాక్టరనే అంటారు

మందులోడా  ఓరి మాయలోడా
మాతరేసి మాయ చేసినోడా 





వానా వానా వానా పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్

పల్లవి:
వానా వానా వానా నీలాకాశంలోన
నీతో చిందేసి ఆడన
వానా వానా వానా మేఘాలాపన లోన
నేనూ ఓ పాట పాడన
పన్నీటి పూలతోన  ఊసులాడుకోన
పసిపాపలా హరివిల్లునే చెయిచాపి అందుకోన

వానా వానా వానా

చరణం: 1
వానలోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం
యింకాగురుతే చిన్నినేస్తం
యేటిలోన గాలమేసి ఎదురుచూసే మనసు పాపం
మదిలో మెదిలే నాటి బాల్యం 
వాననీటిలో ఆడుకున్న ఈతలు
జామతోటలో పాడుకున్న పాటలు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు 

వానా వానా వానా

చరణం: 2
నింగిలోన మబ్బుకూన అందుకుంది చినుకురాగం
దాహంకోరే నేలకోసం 
నేలపైన నీటివీణ పల్లవించే మబ్బుకోసం
స్నేహం పంచే పూలగీతం
కోయిలమ్మతోపాటు కొంటె పాటలు
జాబిలమ్మతో ఎన్ని జామురాత్రులు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు

వానా వానా వానా



గోదారి నవ్వింది పాట సాహిత్యం

 
చిత్రం: శీను. వాసంతి.. లక్ష్మి... (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

ఆనందమె బ్రహ్మ తుమ్మెదా
మనిషికానందమె జన్మ తుమ్మెదా
కోరుకున్నదంత కళ్ళు ముందు ఉంటె 
ఆనందమె కద తుమ్మెదా
ఆకాశమేమంది తుమ్మెదా
చిటికెడాశుంటె చాలంది తుమ్మెదా
అంతులేని ఆశ గొంతుదాటలేక 
ఇరక పడతాదమ్మ తుమ్మెదా
ఈ నవ్వు తోడుంటె తుమ్మెదా
ఇంక కష్టాలదేముంది తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

గోధూళి వేళల్లొ తుమ్మెదా
ఎద రాగాలు తీసింది తుమ్మెదా
కొంటె గుండెలోన సందె పొద్దువాలి 
ఎంత ముద్దుగుంది తుమ్మెదా
అందాల చిలకమ్మ తుమ్మెదా
కూని రాగాలు తీసింది తుమ్మెదా
కన్నె మూగ ప్రేమ హాయి పాటల్లోన 
ఊయలూగిందమ్మ తుమ్మెదా
పుణ్యాల నోమంట తుమ్మెదా
ఈ లోకాన ఈ జన్మ తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా
మా పల్లె నవ్వింది తుమ్మెదా
మల్లె పువ్వల్లె నవ్వింది తుమ్మెదా
సంబరాల వేళ తుమ్మెదా
ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెదా
ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్ళుంటె
ఎంత బాగుంటుందె తుమ్మెదా

గోదారి నవ్వింది తుమ్మెదా
నిండు గోదారి నవ్వింది తుమ్మెదా 
హోయ్ తుమ్మెదా

Palli Balakrishna Sunday, October 8, 2017

Most Recent

Default