-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nandita Das"



చిత్రం: OMG (ఓ మంచి ఘోస్ట్)(2024)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: నందిత శ్వేత , నవమి నాయక్, వెన్నెల కిషోర్ 
దర్శకత్వం: శంకర్ మారథాన్ 
నిర్మాత: Dr. అభినిక ఇనబత్తుని
విడుదల తేది: 21.06.2024



Songs List:



పైసా రే పైసా పాట సాహిత్యం

 
చిత్రం: OMG (2023)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: అనూప్ రూబెన్స్ 
గానం: అనూప్ రూబెన్స్ , చింతల శ్రీనివాస్

(యే రా రా రారా రరర్రే)
డబ్బు చుట్టు లోకం తిరుగుతుంది
లోకం మొత్తం డబ్బే ఏలుతుంది
తెల్లారిందో నిన్ను ఉరికిస్తుంది
ఓ నీతో ఒట్టి చాకిరి చేయిస్తుంది

రౌండు రౌండు రౌండురౌండు
రౌండు రౌండు రౌండురౌండు

గోలు తిప్పుతుంది
నిన్ను మత్తుల ముంచేస్తుంది
వేళాపాళా లేదు
ఒట్టి చాకిరి చేయిస్తుంది

పొద్దున్నుంచి రాతిరి వరకు
పుట్టుకనుంచి పోయే వరకు
ఓ మొత్తం మొత్తం లోకం మొత్తం
కావాల్సింది డబ్బే డబ్బు

పైసా..! ఓయ్, పైసారే పైసా
నీ దశ తిప్పునురా పైసా
పైసారే పైసా
నీ దిశ మార్చునురా పైసా
పైసారే పైసా
నీ దశ తిప్పునురా పైసా

రౌండు రౌండు రౌండురౌండు
రౌండు రౌండు రౌండురౌండు

గోలు తిప్పుతుంది
నిన్ను మత్తుల ముంచేస్తుంది
వేళాపాళా లేదు
నీతో చాకిరి చేయిస్తుంది, (అవును)

(ఏయ్ డబ్బులు తీసుకురా)
ఓ యాడికెళ్లి తేవాలి ఈ డబ్బులు
ఎవన్నడుగుతే ఇస్తాడు ఈ డబ్బులు
ఎందుకిట్ట సస్తారు డబ్బులకోసం
కట్టకట్టుకుపోతారా..!

ఇంటోళ్లనొదిలేస్తారు డబ్బుల కోసం
తిండి తిప్పలు మానేస్తారు డబ్బుల కోసం
సావనైనా సస్తారు డబ్బుల కోసం
కట్టకట్టుకుపోతారా..! చెప్పండ్రా

ఎందుకిట్టా సంపుతారు, ఓ ఓ
ఓ, డబ్బులుంటే అమ్మాయి
ఫట్టునా పడిపోతాది
డబ్బులేందే డాగు కూడా
దొబ్బెయ్ మంటాది

రోడ్డుమీద ఉన్నోన్ని
రాజులాగా మార్చేది
మచ్చలేని మంచోన్నైనా
మాయగాడ్ని చేసేది

కూటికైనా గూటికైనా
ఓటుకైనా సూటుకైనా
ఏదికావాలన్నా నీకు కావాల్సిందీ
(పైసల్ పైసల్)

ఓయ్, పైసారే పైసా
ఇది కింగ్ మేకరు తెలుసా
ఓయ్, పైసారే పైసా
ఇది రింగు మాష్టరు తెలుసా

రౌండు రౌండు రౌండురౌండు
రౌండు రౌండు రౌండురౌండు

ఓ రంగులోకం కావాలా
రాంగు రూటు తప్పదురా
లోటులన్నీ తీరాలంటే
లూటీ తప్పదురా

బాధలన్నీ పోవాలా
బ్లాకుమెయిలు తప్పదురా
తప్పు ఒప్పు నిప్పని అంటూ
నీతులు చెప్పకురా

మంచి ఉంటే మనీ లేదు
మనీ లేందే విలువ లేదు
ఏది కావాలన్నా నీకు కావాల్సిందీ
(పైసల్ పైసల్)

ఓయ్, పైసారే పైసా
ఇది కింగ్ మేకరు తెలుసా
ఓయ్, పైసారే పైసా
ఇది రింగు మాష్టరు తెలుసా
పైసారే పైసా
ఇది కింగ్ మేకరు తెలుసా

రౌండు రౌండు రౌండురౌండు
రౌండు రౌండు రౌండురౌండు

గోలు తిప్పుతుంది
నిన్ను మత్తుల ముంచేస్తుంది
ఒట్టి చాకిరి చేయిస్తుంది
నిన్ను నిండా ముంచేస్తుంది
(పైసలు పైసలూ)





ఓ పాప నువ్వు తోపు పాట సాహిత్యం

 
చిత్రం: OMG (2023)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: మన్నేళ్ళ సింహాచలం, శ్రీనివాస్ తేజ 
గానం: షకలక శంకర్, బాడా సూరన్న 

ఓ పాప నువ్వు తోపు 




ఓ రసిక పాట సాహిత్యం

 
చిత్రం: OMG (2023)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: చింతల శ్రీనివాస్ 
గానం: ఇంద్రావతి చౌహాన్ 

ఓ రసిక 

Palli Balakrishna Thursday, April 23, 2026



చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

Palli Balakrishna Tuesday, June 28, 2022



చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
నటీనటులు: ప్రిన్స్ , శ్రీ దివ్య, ఆనంది
రచన: నందిని రెడ్డి.వి 
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.11. 2012



కళలకే కనులొచ్చిన పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది 
ని వల్లే నివల్లే కథ మొదలై ఇవాళే
జతపడి నడకలై సాగిందే 
ఓ శైలు నివల్లే నా శైలే మారెలే
పడి పడి మనసిలా ఊగిందే

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది

ఇంకొంచెం అందంగా నిఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతినిమిషము అనుకుంటున్నా
నా సొంతం నువ్వనగా పదిమందిలో బిగ్గరగా చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్నా
కలిసిన వేళల్లో అల్లరి నేనై
పెదవుల అంచుల్లో పుడుతున్నా

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu

నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందని గురుతుండదె ఏదేమైనా 
నీ వెంటే వుంటానుగా నన్నొదిలిన దూరంగా ఊహాలలో ఊపిరిలో తోడై రానా
సాగే దారుల్లో సాయంత్రం నేనై
చలి చలి గాలుల్లో తడుస్తున్నా

యూ మై లవ్లీ ప్రిసిస్ బర్డ్
మై హార్ట్ ఈస్ యువర్ సోల్ 
నెవెర్ ఎవర్ లీవ్ మీ గో
యువర్ మై సోల్
యువర్ ఇన్ మై లవ్లీబర్డ్

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu




రెక్కలొచ్చిన ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళ

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం 
గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం 
బ్రతుకంతా ఈడుంటుంద చివరంత తోడుంటుంద 
నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం 
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా 
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక 
కలలే నిజమవున కలవరమేమైన

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా

నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యాక రగిలింద గాయం 
పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి 
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం 
ఏనాడో రాశాడమ్మ తలరాతే బ్రహ్మ 
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ 
బ్రతుకే నవలైనా కథలింతే ఏవైన

గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా

Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna Thursday, May 21, 2020



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, కీర్తన పార్థిబన్, జె. డి.చక్రవర్తి, నందిత దాస్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: జి. శ్రీనివాసన్
విడుదల తేది: 14.02.2002



చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, బలరాం

పల్లవి:
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 1
తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..

చరణం: 2
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా...

కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్

పల్లవి:
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా

చరణం: 1
గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేళ మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

చరణం: 2
లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా

మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా -  విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా -  తపనగా





చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్

పల్లవి:
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 1
ఎదకు సొంతం లే  ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే

చరణం: 2
సిరుల దీపం నీవే  కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని
ఇంటి వెలుగని కంటి నీడని
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా...

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా



Palli Balakrishna Saturday, August 5, 2017

Most Recent

Default