-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nandamuri Ramakrishna"



చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, మంజుల, రామకృష్ణ, లత, అంజలీ దేవి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాతలు: లక్ష్మీ రాజ్యం, శ్రీధర్ రావు, శ్రీకాంత్ నహత
విడుదల తేది: 19.05.1990



Songs List:



కొట్టేసిండు.. జింజర.. పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

పల్లవి:
కొట్టేసిండు.. జింజర.. జింజర.. జింజర.. జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర  జింజర కొట్టేసిండు

చరణం: 1
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా
గాలి రెక్కలపై ఏ వేళవస్తాడో.. పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏ వేళ వస్తాడో..  పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో

వాడు తుమ్మెదలంటాడు..  ఆ తుంటరిదంటాడు
తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు.. తేనెలు దోచుకుపోయిండు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు.. కొట్టేసిండు....  కొట్టేసిండు

చరణం: 2
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా... ఆ... 
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాడు పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు 
పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు . . భల్ సెగలు రేపుతాడు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర కొట్టేసిండు

జింజర జింజర జింజర జింజర




కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

ఏనాడో నేను నీదాన్నీ ...నీ హృదయానికి అనువాదాన్ని
హూ....హూ..హూ..
కోరుకున్నాను.. నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 1
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు.. ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు.. ఊ.. ఊ...

ఆరడుగుల వాడివే...ఆరిపోని వేడివే...
మంచులా.. మౌనిలా ..మాటాడకున్నావేం?
మంచులా.. మౌనిలా.. మాటాడకున్నావేం?

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 2
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే... తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే.. ఊ... ఊ...

ఆకు మాటు పిందెవే ... అరుగు దిగని పాపవే...
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?

కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
ఏనాడో నేను నీవాణ్ణి ... నీ హృదయానికి అనువాదాన్ని..హూ..హూ....

కోరుకున్నాను... హ..హ..హ..
నిన్నే చేరుకున్నాను...హ..హ..హ..
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను... ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

హూ..హూ.. హూ..హూ..




సల సల సల పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

సల సల సల సల సల సలా 
కాగిన కొద్దీ, నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్దీ వలపే ఊపిరి అవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా, ఏమిటలా

విత్తనం మొలకవుతుంది 
మొలకేమో, మొక్కవుతుంది
మొక్క ముదిరితే చెట్టవుతుంది
ముద్దు పెరిగితే మోజవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

కోరికేదో పులకిస్తుంది
గుండెలోని కలకేస్తుంది 
కొత్త కొత్తగా విసురొస్తుంది 
మెత్త మెత్తగా మెరుపొస్తుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల - సలసల
కాగిన కొద్దీ
మెరుపుంటే మబ్బుంంది 
మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపూ మబ్బూ ఒకటైతేనే
జల్లు కురుస్తుంది హరివిల్లు పొడుస్తుంది
ಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల సలసల సలసలా 
కాగిన కోద్దీ  నీరు ఆవిరి అవుతుంది
సాగిన కొద్దీ, వలపే ఊపిరి అవుతుంది


Palli Balakrishna Sunday, February 3, 2019


చిత్రం: శుభలేఖలు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , లైలా
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 1998

ఓ ప్రియ స్వాగతం ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం పరిమళ గీతం
పరిచిన పూదారిలో ఓ ఓ ఓ ఓ..

ఓ ప్రియ స్వాగతం నీవే నా జీవితం
వలపు వసంతం ఇక మన సొంతం
విరిసిన పులకింతలో ఓ ఓ..

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం

పరాకుగా కొంగే జారే సంగతి ఏమంటున్నదో
తరంగమై పొంగే ఎదలో రహస్యమేముందో
కుమారిగా ఎన్నాళ్ళింక కూర్చోవాలో ఏమిటో
సుమారుగా సూచిస్తావ సుమూర్తమేనాడో
కరిగిన మౌనంలో...
కదిలిన ప్రాణంలో...
చెలియ సరాగం చెలిమి పరాగం
చిలికిన తేనె వానల్లో...

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం

మనోహర మన్నిస్తావా నిన్నే చేరే లాలస
స్వయంవరం చాటించి నే స్వయానా విచ్చేశా
మనోరధం చెల్లిస్తానే మైమరపించే మానస
మదాలస శృతిమించాలి సుఖాల హైలెస్సా
తరిగిన దూరంలో...
దొరికిన తీరంలో...
తొలి శుభలేఖ తలపులు తాక
వెలిగిన మేని వన్నెల్లో...

ఓ ప్రియ స్వాగతం - ఈ క్షణం శాశ్వతం
ప్రణయ ప్రభాతం పరిమళ గీతం
పరిచిన పూదారిలో ఓ ఓ ఓ ఓ..

Palli Balakrishna Saturday, February 2, 2019



చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
నటీనటులు: సంఘవి , సిమ్రాన్, సాధిక
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 21.07.2000



Songs List:



నీ హైటు ఇండియా గేటు పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుఖ్వింధర్ సింగ్, పూర్ణిమ

పల్లవి:
స స స స స స స

Wazzup... Where are you...
Been looking for you
ha.. ha.. Come on Come on

Hollywood... Bollywood...

బల్లే బల్లే బల్లే బల్లే.. బల్లే...

నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ
నీ జబ్బ జాంనగరు స్వీటు నీ సొగసు పిట్రమాక్సు లైటూ
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ

నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ
నీ జబ్బ జాంనగరు స్వీటూ హోయ్ నీ సొగసు పిట్రొమాక్సు లైటూ

చరణం: 1
నవ్వై చాలు లలనా  నీ తల్లో పూవునై పోనా
వైఫై వస్తానంటే  నా లైఫే రాసి ఇచ్చేయ్ నా
నీ అడుగుజాడలే వలపు బాటలై పిలిచె నన్ను నెరజాణ
నీ లేత పెదవులే తేనె వరదలై ముంచి వేసే నన్ను జాణ
ఇంక ఆగలేనె కూన

టీజింగు నీకు అలవాటు టీనేజి పిల్లకది చేటు
ఓ మధన సుంధర రెచ్చిపోకురా
రగులుతోంది నా హార్టు

నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ...

చరణం: 2
Ding Ding dong rock so well
Common girl let me ring your bells..
Now feel the pain if you want again
Your mama so new it makes me feel Doom
I like the way you move on to way you boom

నకరాలింక మాని నా చెంత చేరవే భామ
నందమూరి వాన్ని మురిపిస్తా మార్వలెస్ ప్రేమా..
నీ నడుము కొలతలు సొగసు బరువులు
తెలిసే నాకు అలివేణీ
నీ లిటిల్ హార్టులో ఒదిగి ఉంటా
జర ప్లేసునీయవే యువరాణి
చేసేయివే ముద్దుబోణి

ప్రేమించగలగటం గ్రేటు అది తెలియకుంటే నీ ఫేటూ
నీవు కూత పెట్టినా కొంగు పట్టినా కరగదోయీ నా హార్టూ

నీ హైటు ఇండియా గేటు హోయ్ నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ
నీ జబ్బ జాంనగరు స్వీటూ నీ సొగసు పిట్రమాక్సు లైటూ
ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ
ఆ అ థర రా ర రా ర రా థరరా రీ





నాచీరే నాచీరే పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ 
గానం: సుఖ్వింధర్ సింగ్, మానస 

నాచీరే  నాచీరే 



ముద్దొచ్చే గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: చిత్ర 

ముద్దొచ్చే గోపాల 




ప్రేమిస్తే ఎంతో గ్రేట్ పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: దేవన్,  చిత్ర 

ప్రేమిస్తే ఎంతో గ్రేట్ 



వచ్చేస్తుందో చేస్తుందో పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు,  చిత్ర 

వచ్చేస్తుందో చేస్తుందో 



అమ్మగారికి పెసరట్టు పాట సాహిత్యం

 
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

అమ్మగారికి పెసరట్టు 

Palli Balakrishna Friday, August 25, 2017


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నందమూరి తారకరత్న, జివిదా శర్మ
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 29.11.2002

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

చరణం: 1
ఉత్తరాన్ని చించిందంటే నీపై చిత్తశుద్ధి ఉన్నట్టే
గిఫ్టు తిప్పి పంపిందంటే నిన్ను గాడుగిఫ్టు అనుకున్నట్టే
బండబూతు తిట్టిందంటే నీపై బండెడంత ప్రేమున్నట్టే
చెప్పు చేత పట్టిందంటే నీ చెప్పు చేతల్లొ ఉంటుందన్నట్టే
కస్సంటే కిస్సనిరో  బుస్సంటే కస్సనిరో
ఆడాళ్ళ మాటలకు అర్థాలు రివర్సురో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో

చరణం: 2
పైట కాస్త సర్దిందంటే నిన్ను సైటు కొట్టమన్నట్టే
వెనక తిరిగి చూసిందంటే నీ పై ముందు చూపులున్నట్టే
పళ్ళు కాస్త కొరికిందంటే నీకు పచ్చ జండ చూపినట్టే
అన్నతోటి చెప్పిందంటే నిన్ను అల్లుడిగ ఇంట్లోకి రమ్మన్నట్టే
తప్పంటే తప్పదనిరో  ఉ ఊ అంటే ఉన్నదనిరో
ఆడాళ్ళ మాటలకు కొత్త డిక్షనరి కావాల్రో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాధనా సర్గం , కళ్యాణి మాలిక్

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 1
ఏతోటలో ఏ కొమ్మకో తారల్లె విరిసిన పువ్వా...
నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె మెరిసిన పువ్వా...
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రం వేయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ
పరిమళ భరితం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 2
ముత్యానికే ముస్తాబులా తెల్లంగ పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచులా స్వచ్చంగ విచ్చిన పువ్వా
నాలో సిగ్గులు కనవా నా తేనెలు తనకందీవా
ఇటు అటు తెలియని వయసుల గొడవా
ఇదియని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమన వారధి కావా
ఈ ఒక సాయం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: షాన్

నీది 98480...  నాది 98490...
నెంబరు మాత్రం బంపరు గుంది ఇంతకి నీదేం పేరో
నీది 98480... నాది 98490...
స్ట్రక్చరు మొత్తం సూపరు గుంది ఈ ఊరో పొరుగూరో
మనకిక లేదు టుమారో  కనుకే దుమ్ము దుమారో
చూడరు బారో గీరో  కొడదాం జిన్నో బీరో
రోము నగరమే తగలడుతున్నా ఫిడేలు మీటెను నీరో
పాపం పుణ్యం పక్కన పెట్టి సుఖపడి పోదాం యారో

నీది 98481... నాది 98491...
వన్ను వన్ను ఒకటే ఐతే ఉన్నది ఎంతో ఫన్నూ
నీది 98481... నాది 98491...
వెన్ను వెన్ను కలిసాయంటే మైకం కలుగును టన్నూ
నాకో మారుతి జెన్ను ఉందోయ్ ఇంతకు మున్ను
మొన్నే చూశా నిన్ను  నీకై అమ్మేశాను
కోతి నుంచి మనిషొచ్హాడంటూ చెప్పెనురా డార్విన్నూ
కోతి పనులనే చెయ్యకపోతే తోచదు దారి తెన్నూ

నీది 98482... నాది 98492...
ఆఖరి అంకెలు టూలే ఐతే ఇంకా ఎందుకు లేటూ
నీది 98482... నాది 98492...
నోకియ సెల్లును చేతిలో ఉంటే సఖియా మనకేం లోటు
నాకో మెసేజ్ కొట్టు  చీకటి మూర్తం పెట్టు
కొంచెం భయమే పుట్టు బోలెడు సుఖమే గిట్టు
మొబైల్ ఫోను కనిపెట్టిన వాడికి రోజు సలాము కొట్టు
ఫోను బిల్లు కట్టాల్సిన రోజు నాకే గుడ్ బై కొట్టు

నీది 98483...  నాది 98493...
ఈ త్రీ ఆ త్రీ రెండు కలిపెను నీకు నాకు మైత్రీ
నీది 98483...  నాది 98493...
మైత్రే కలిసిన గుర్తుగ మనము గడిపేద్దాం ఓ రాత్రి
నేనే మన్మధ శాస్త్రి  ఇస్తా ముద్దు భజంత్రి
ఇస్తే ఒంపుల పత్రి చేస్తా ఇంపుగ ఇస్త్రి
ఆట పాటలు అయిపోయాయి టాటానోయ్ అభినేత్రి
అదిగో అదిగో వచ్చేస్తోంది నావైపే ఇంకో స్త్రీ

Palli Balakrishna Saturday, August 12, 2017

Most Recent

Default