చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ నటీనటులు: యన్.టి.ఆర్, జాన్వి కపూర్ దర్శకత్వం: కొరటాలశివ నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల తేది:27.09.2024
Songs List:
Fear Song సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనిరుద్ రవిచందర్ అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనానీ జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యింది వేళ విధికే ఎదురై వెళితే విలవిలా అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ
చుట్టమల్లే చుట్టేస్తాంది.. పాట సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శిల్పా రావు చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు... అస్తమానం నీలోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు... రా.. నా నిద్దర కులాసా.. నీ కలలకిచ్చేశా.. నీ కోసం వయసు వాకిలి కాశా.. రా.. నా ఆశలు పోగేశా.. నీ గుండెకు అచ్చేశా.. నీ రాకకు రంగం సిద్దం చేశా.. ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది.. పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది.. వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది.. సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. చరణం 1 మత్తుగా మెలేసింది.. నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి.. వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి.. ఆస్తిగా అల్లేసుకో కోసరి కోసరి.. చెయ్యరా ముద్దుల దాడి.. ఇష్టమే నీ సందడి.. ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి.. రా.. ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే.. నీ కౌగిలితో నన్ను సింగారించు.. రా.. ఏ వెన్నెల జోలాలి..నన్ను నిద్దర పుచ్చట్లే.. నా తిప్పలు కొంచెం ఆలోచించు.. ఎందుకు పుట్టిందో పుట్టింది.. ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది.. పుడతానే నీ పిచ్చి పట్టింది..నీ పేరు పెట్టింది.. వయ్యారం ఓణీ కట్టింది.. గోరింట పెట్టింది.. సామికి మొక్కులు కట్టింది.. చుట్టమల్లే చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..హాహా..అరారారే చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు..
దావూదీ పాట సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నకాష్ అజీజ్, ఆకాశ కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల పొయిమీన మరిగిందె మసాలా చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల కసి మీన తొలి విందులియ్యాల కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే రంగుల పొంగుల బొంగరమే సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే కాముడి చేతికి లొంగడమే హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే.. కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
Anirudh Ravichander
,
Devara
,
Janhvi Kapoor
,
Koratala Siva
,
Kosaraju Harikrishna
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Sudhakar Mikkilineni
Devara: Part 1 (2024)
Palli Balakrishna
Monday, August 5, 2024
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ నటీనటులు: కళ్యాణ్ రామ్ , శృతి సోది, సాయికుమార్ దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాత: కళ్యాణ్ రామ్ విడుదల తేది: 23.01.2015
Songs List:
అరె ఓ సాంబ (Remix) పాట సాహిత్యం
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: భువనచంద్ర గానం: జాస్ప్రీత్ జస్జ్ , దివ్య కార్తీక్ (ఈ పాట బాలకృష్ణ నటించిన రౌడి ఇన్స్పెక్టర్ (1992) సినిమా నుండి రీమిక్స్ చేశారు. పాడినవారు: యస్.పి.బాలు, చిత్ర, సంగీతం: బప్పీ లహరీ ) బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది లవ్వాడదాం చలో రె రాణీ... అరె ఓ రంబా ఆయారే రేంబో అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది అయినా సరే లొంగను ఛా ఛా అరె ఓ సాంబ ఆయిరే రంబా చరణం: 1 ఓ కేడి.. కనకమ్మో ఓ కేడి కనకమ్మో కవ్వించకే ముద్దు గుమ్మో షేకించి బ్రేకించి పగ్గాలు వేస్తానే బొమ్మో ఏదన్నా ఎంతున్నా నేరాలు రాసుంది కాడా ఊరంతా చూస్తారు వలవెయ్ కు నీ సోకుమాడ కమ్మలు పెడతా గాజులు పెడతా ఒల్లోకొస్తే గుడులే కడతా నా మాట విని చల్ రె రాణీ... This is the tribute to Balayya చరణం: 2 ఆ లాటిలు.. చూపించి లాటిలు చూపించి బెదిరించకోయ్ టింగు రంగా ప్రేమంటూ నీకుంటే దరి చేరనా సుబ్బరంగా హేయ్ రంగేళి రంగమ్మో ఓ చోటు చూసేసుకుందాం నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది లేటెెందుకిక చల్ రె రాజా
పవరు న్నోడు - పటాసే పాట సాహిత్యం
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: బి. సుబ్బరాయ శర్మ గానం: రంజిత్ & కోరస్ పవరు న్నోడు - పటాసే పొగరున్నోడు - పటాసే పదునైనోడు - పటాసే వీడి ఫైరే - పటాసే డేర్ ఉన్నోడు - పటాసే డాష్ ఉన్నోడు - పటాసే డిఫరెంటోడు - పటాసే వీడి పంచే - పటాసే వీడు కాస్కో అంటే రిస్కే రో వీడు లుక్కే ఇస్తే - దౌడే రో వీడు ఉడికే ఉరికే లావా రో పటాసే మాస్ మసాలా వీడే క్లాస్ ఖులాస వీడే బాస్ భరోసా వీడే వీడే పటాసే దేఖో ఈ పోలీస్ వాలా పేలే టెన్ తోజండ్ వాలా క్రైమే ది ఎండ్ అయ్యేలా చేసే పటాసే లెక్కకు అందని ఒక్కడురో వీడెంతకి అంతే చిక్కడురో హే తోపుగాడు వీడురో టాప్ లేపుతాడురో రఫ్ టఫ్ వీడి టైపు రో ఎప్పుడు వీడొక ట్విస్టే రో వీడి ట్విస్ట్ కు మైండే బ్లాస్టే రో హే వేటగాడు వీడు రో వీడి సాటి లేడు రో వాటమైన పోటుగాడు రో న్యూ ట్రెండ్ కి బ్రాండే వీడే రో వీడి దెబ్బకు సౌండే గ్రాండే రో శివకాశి ఆటమ్ బాంబే రో పటాసే మాస్ ఉమసాలా వీడే క్లాస్ ఖులాస వీడే బాస్ భరోసా వీడే వీడే పటాసే
హే ధమ్కీ మారో యారో పాట సాహిత్యం
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: శ్రీమణి గానం: టిప్పు ఆగయా హైదరాబాద్ క నయా నవాబ్ ట్వంటీ ఫోర్ కారట్ ల ఫోర్ ట్వంటీ బాబు స్టేషన్ ని బ్యాంకులా మార్చేశాడు. అండర్ కవర్ కాసుల వాడు క్యా బాత్ హైం మియా హే ధమ్కీ మారో యారో యారో దుమ్మే లేపి దున్నేసేయఁరో కుంభస్థలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో హే మనిషికి ఉందొ డేట్ అఫ్ బర్త్ ఉంటుందంట డేట్ అఫ్ డెత్ నోట్ కి మాత్రం ఉండదులేరా అల్ టైం ఎక్స్పైరి డేట్ మీకెంత పవర్ ఉన్న చస్తే అడిగే దిక్కెవడన్న నువ్వు కాళీ అయ్యేలోగా ఖాళి జేబులు నింపేయమన్న మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా దండేసి దండం పెట్టి హారతులే పట్టేమయ్య పేరున్నోల్లని ఫేమ్ ఉన్నోల్లని లిస్ట్ వేసేయరా ఆళ్ళ పేరున ఉన్నవి పోలీసోళ్ళకి ఫిక్స్డ్ ఏసేయరా కరెన్సీ నోట్ లే కాజేసిస్తే కేసు లు మాఫీ రా నీ నల్ల సొమ్మే నాకే ఇస్తే ఫుల్ ఉ గ వైట్ ఐ పోతావురా డే అండ్ నైట్ డ్యూటీ లు చేస్తే శాలరీ సరిపోదు ఓ గంట నువ్వే లూటీలు చేస్తే సెటిల్ అయిపోతావులే మా దేవుడు మా దేవుడు స్వామి మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా నీ పేరున మాలె వేసి తల నీలాలిస్తామయ్యా హే ఆజా ఆజా ఆజా ఇదర్ ఆవో బులెట్ రాజా హే ఆజా ఆజా దేఖో ముజికో కాకినాడ ఖాజా హే భక్తులం మేమె కానీ మాకిచ్చేది బెత్తెడు భూమి మేమేలే నీ బినామీ పొంగించే సొమ్ము సునామి రౌడీ షీటర్ గుండా గళ్ళ షట్టర్ ఉ షట్ డౌన్ ఏ నేను సెంటర్ వోచి కౌంటర్ పెడితే డబ్బులు డంప్ అవునే నా లా అండ్ ఆర్డర్ ఉండే ల్యాండ్ నాదై పోవాలి న సైరెన్ సౌండ్ కి సైడ్ ఏ ఇచ్చి సైట్ ను ఖాళీ చెయ్యాలి CM కైనా PM కైనా పదవులు ఐదేళ్లే హే ప్యాచెస్ ఉంచి పచ్చస్ దాకా పటాస్ మనమెలా మా వొంట్లో బీపీ నువ్వే మా హెడ్ కి జండుబాం వె మా గ్రౌండ్ కి టెండూల్కర్ మా పాలిట పోలీస్ లారీ
ఓసి చిన్నదాన మూతి తిప్పకే పాట సాహిత్యం
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: శ్రీమణి గానం: రాహుల్ నంబియర్ ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకే ఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే ఓసి చిన్నదాన మూతి తిప్పకే ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే ఓసి కుర్రదాన తుర్రు మనకే చిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకే ఓ చంచాడు జాలి చూపవే ఓ గుప్పెడు ప్యార్ పంచవే ఓ గంపెడు ముద్దులు నా ఖాతాలో వెయ్యవే మిల్లీ మీటరంత చూపు చాలే సెంటీమీటరంత స్మైల్ చాలే నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే రాసులే ఇస్తా రాణిలా చూస్తా నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే ని కనులకు కాజల్ లా నీ కలలన్నీ చదివేస్తానే నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా నీ చెవులకి లోలాకై ప్రేమల ఊసులే వినిపిస్తానే నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్తా కంచె లాగ నిన్ను కాపు కాస్తా ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా పచ్చబొట్టు లాగ అంటి ఉంటా గట్టులేని ఒట్టు నేనౌతా నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే ఓ బేబీ లవ్ మీ అంటూ వెంట వెంట నీకై తిరిగాడమ్మ రఫ్ అండ్ టఫ్ పోలీసోడే రోమియోలా మారిపోయెనే నీకై పడిచస్తున్నాడే కేసులన్ని పక్కనెట్టి వస్తున్నాడే వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మా బుజ్జగించి ప్రేమ పంచవే వేసవిలో నీకోసం ప్రేమల వానల మేఘాన్నవుతా ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నౌతా వేకువలో నిను తాకే తొలి కిరాణాన్నై తలుపే తడతా చీకటిలో నీకోసం జాబిలల్లే వస్తా పిలుపు కంటే ముందే పలికేస్తా తలుచుకోక ముందే కనిపిస్తా కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవుతా ఆగిపోని గుండె చప్పుడంటే అలిసిపోని ఊపిరంటు ఉంటే నీ అశలే శ్వాసగా మారిన నేనేనంటా పూవులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే రాసులే ఇస్తా రాణిలా చూస్తా నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
టప్ప టపం పాట సాహిత్యం
చిత్రం: పటాస్ (2015) సంగీతం: సాయి కార్తీక్ సాహిత్యం: తైదల బాపు గానం: M.L.R. కార్తికేయన్, సుచిత్ర టప్ప టపం టప్ప టపం టప్ప టపం టప్ప టపం టప్ప టపం టప్ప టపం పోరి చూస్తే సూపర్ రో జోరుదారు గున్నదిరో చాకోబార్ సోకులతోనే సంపెత్తాందిరో టప్ప టపం టప్ప టపం టప్ప టపం ధూమ్ ధామ్ పిల్లోడే దుమ్ము రేపుతున్నాడే గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడే వహ్ టప్ప టపం టప్ప టపం టప్ప టపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్ప టపం టప్ప టపం టప్ప టపం దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది లోటస్ మీది వాటర్ లాగ జారుతున్నదే దిల్దారు పోరగాడే ఫెవికాల్ లాగ నన్నే ఫిక్స్ అయి పోయి హగ్స్ ఇచ్చి మిక్స్ ఐపోయాడే అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే ఎహ్ రా రా రా రావే రాతిరి జాతరకే ఓకే కే కే ఆడెయ్ కిస్ కబ్బాడే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే టప్ప టపం టప్ప టపం టప్ప టపం హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ పూలు పెట్టి గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ వస్తావా పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఆపివేస్తే టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ నన్ను టెన్షన్ పెట్టొడ్డే క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే 3డి డీ డీ డీ ఫిగర్ నువ్వేలే బాడీ డీ డీ డీ వేడెక్కేస్తున్నాదే అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే టప్ప టపం టప్ప టపం టప్ప టపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్ప టపం టప్ప టపం టప్ప టపం
2015
,
Anil Ravipudi
,
Nandamuri Kalyan Ram
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Pataas
,
Sai Karthik
,
Shruti Sodhi
Pataas (2015)
Palli Balakrishna
Thursday, March 22, 2018
చిత్రం: కళ్యాణ్ రామ్ కత్తి (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బాలాజీ
గానం: శ్రీరామ చంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, శామ్, సనా ఖాన్, శరణ్య మోహన్
దర్శకత్వం: మల్లికార్జున్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 12.11.2010
ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో
ఏకాంతం కాదిది నాలో సగమే కరిగి కదిలి నాకే ఎదురౌతున్నది
ఏ చోట లేనిది నీవే మనసై కనులు కలిపి హృదయం దోచేస్తున్నది
మనసే రోజులా లేదు తిరుగుతుంది నా ముందు
కాలం కదిలేలాలేదు చేసుకుంది నను ఖైదు
కొత్తగ లోకం చూస్తున్నా చంటిపాపనౌతున్నా
ఏమని చెప్పను ఏమైనా ఎదకు బదులు నేనున్నా
ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో
గాలమేసుకుంది ప్రాణాలు లాగుతోంది నాగుండెల్లో ప్రేమ
ఊపిరాడకుంది శ్వాస పట్టుకుంది ఈ నిమిషంలో ప్రేమ
చిరు కానుకై తొలివేడుకై తను మొదలౌతుంది ప్రేమ
ఔననో మరి కాదనో మది చెడగొడుతుంది ప్రేమ
రెక్కలకోసం వెతికేనా చినుకు నేల పడుతున్నా
రెప్పలు దారే మూస్తున్నా మనసు అడుగులాపేనా
చుక్కలు తాకే ఊహేన ఎగురుతోంది నా లోన
మొన్నా నిన్నా నేనున్నా నేటినుంచి ఎవరోనా
నేల తేలుతోంది ఆకాశమందుతుంది ఏ చిత్రం ఈ ప్రేమ
గాలి తాకుతోంది తుఫానులాగ ఉంది ఏ మంత్రం ఈ ప్రేమ
ఈ నీరిలా పన్నీరులా ఎద తడిపేస్తుంటే ప్రేమ
అమ్మలా నను కమ్మగా తెగ లాలిస్తుంటే ప్రేమ
ఒంటరిగానే నేనున్నా ఎంతమందిలో ఉన్నా
పరుగే తీసే వయసున్నా మనసు దాటలేకున్నా
పెదవుల మద్యే దాగున్నా దొరకలేదు మాటైనా
తియ్యని గాయం అవుతున్నా తెలపలేదు ఆశైనా
ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో
2010
,
Kalyanram Kathi
,
Mallikarjun
,
Mani Sharma
,
Nandamuri Kalyan Ram
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Sana Khan
,
Saranya Mohan
,
Shaam
Kalyanram Kathi (2010)
Palli Balakrishna
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: మమతా మోహన్ దాస్ నటీనటులు: కళ్యాణ్ రామ్, హన్సిక మోత్వాని దర్శకత్వం: నరేన్ నిర్మాత: కళ్యాణ్ రామ్ విడుదల తేది: 23.10.2009
Songs List:
కంటి చూపుతో పాట సాహిత్యం
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్, నవీన్ కంటి చూపుతో
జిందగీ పాట సాహిత్యం
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అద్నాన్ సమీ, ఆండ్రియా జిందగీ
తెలుపు రంగు పాట సాహిత్యం
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణ చతన్య గానం: కార్తీక్, ప్రియ దర్శిని తెలుపు రంగు
గుండెలోన నిన్ను పాట సాహిత్యం
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: మమతా మోహన్ దాస్ గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త చలో చలో గురు దిల్బరు చెయ్ నాతో కాస్తా కరో కరో పుర దిన్బార్ చెయ్ నాతో సాల్సా కొర కొర కొర నన్ను చూసి ఎందుకంత గుస్సా జర జర జర ప్రేమ లోకి ఇచ్చుకోవ వీసా సైటేస్తే క్రేజీ బిల్డప్పా ముడి ముడి గా మూకీ మూమెంట్సా ఓపెన్ గా మనసే చెప్పేసా డే అండ్ నైట్ నీ మీదే ధ్యాసా... వేర్ ఎవర్ యు గో నీతో వస్తా వాట్ ఎవర్ యు డు నేను చేస్తా వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త కెట్ విన్స్లెట్ నేనే కలిపిస్తా నాతో ఐస్ క్రీమ్ పార్లర్ కొస్తావా జాకీచాన్ తో హాండ్ షేక్ ఇప్పిస్తా నాతో ఫుల్ మూన్ డేటింగ్ చేస్తావా స్తావా ఇఫ్ యు వన్నా మై డియర్ ఈఫిల్ టవర్ టాపులో ఐ లవ్ యు నీకు చెప్పుకోన వన్నా టెల్ యు నౌ హెర్ ఉయ్ అర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ డిటిఎస్ లో ఓన్లీ వన్స్ ఓకే బోలోనా వేర్ ఎవర్ యు గో నీతో వస్తా వాట్ ఎవర్ యు డు నేను చేస్తా వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా గుండెలోన నిన్ను ప్రింటు చేస్తా ఒంటిపైన నిన్ను టాటూ వేస్తా కళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తా లవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త రెహమాన్ తో మ్యూజిక్ చేయిస్తా ఓపెరా డాన్స్ పార్టనర్ అవుతావా స్పిల్బర్గ్ తో సినిమా తీపిస్తా నా సరసన హీరో చేస్తావా స్తావా ఫెయిర్ అండ్ లవ్లీ కోకన ధీరన్ ఓన్లీ కోరన జస్ట్ ఎ సెకండ్ నిన్ను వీడి ఉండగలనా టామ్ అండ్ జెర్రీ ట్రెండ్ లో హైడ్ అండ్ సీక్ చాలింక సోలో సోలో సొగసును హ్యాపీ కోరన వేర్ ఎవర్ యు గో నీతో వస్తా వాట్ ఎవర్ యు డు నేను చేస్తా వాట్ ఎవర్ యు వాంట్ దిల్ సే ఇస్తా వై డోంట్ యు షో మీ ప్యార్ కా రాస్తా చలో చలో గురు దిల్బరు చెయ్ నాతో కాస్తా కరో కరో పుర దిన్బార్ చెయ్ నాతో సాల్సా కొర కొర కొర నన్ను చూసి ఎందుకంత గుస్సా జర జర జర ప్రేమ లోకి ఇచ్చుకోవ వీసా
ఒక్కసారి పాట సాహిత్యం
చిత్రం: జయీభవ (2009) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్ ఒక్కసారి
2009
,
Hansika Motwani
,
Jayeebhava
,
Nandamuri Kalyan Ram
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Naren Kondepati
,
S. S.Thaman
Jayeebhava (2009)
Palli Balakrishna
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ నటీనటులు: రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల తేది: 21.08.2015
Songs List:
మమ్మీ మమ్మీ పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: బాంబే బోలే గానం: బాంబే బోలే మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మా మా మా మా మా మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మా మా మా మా మా మా మా మా మా మా మా మా మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్ నేను ఏడు నెల్లకే బయటకు తన్నుకు వచ్చాను థిస్ ఇస్ మై ఆటిట్యూడ్ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మా మా మా మా మా మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్ నను ఏడు నెల్లకే బయటకు తన్నుకు వచ్చాను థిస్ ఇస్ మై ఆటిట్యూడ్ నను ఢిల్లీకి రాజుని చేసి కిరీటం పెట్టిన నా దిల్లోని కంఫోర్టుకే దాసోహం నేనే డ్యూడ్ అరేయ్ కంఫర్ట్ ఏర నా కిక్కు అది ఉన్నోడేరా యమా లక్కు ఎవరికీ వారే కంఫర్ట్ ఉంటె ఉండదు ఏ చిక్కు అరేయ్ అల్లో నేరడల్లో నా కంఫర్ట్ కె జై బోలో మేరె అందనమే డాన్స్ ఎయ్యిరా నాతో డ్యూడ్ మై నేమ్ ఇస్ రొబ్బిన్ హుడ్ నను గెలికితే ఉండదు ఫ్యూడ్ ఉ కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్ మమ్మీ కడుపులో నాకు మై మమ్మీ కడుపులో నాకు మా మా మా మా మా మా మా మా మా మా మా మా మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్ నేను ఏడు నెల్లకే బయటకు తన్నుకు వచ్చాను థిస్ ఇస్ మై ఆటిట్యూడ్ ఓహ్ మై గాడ్ నా ఓహ్ మై గాడ్ నా అలగలగువారు కంఫర్ట్ మమ్మీ డాడీ వెంట్ టూ ది పార్టీ అలగలగువారు కంఫర్ట్ వీ నీడ్ ది కంఫర్ట్ బ్రో డే అండ్ నైట్ లెట్ థెం బ్లో ఒహ్హ్ మియ్య మియ్య మియ్యె కంఫర్ట్ కంఫర్ట్ గో జెల్ జెల్ జిగా జిగా గో గో జెల్ జిగా జిగా గో కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్ ఓ పక్కోడి మీద నీకు థింకింగ్ ఏ స్టార్ట్ అయ్యిందంటే నీ సెల్ఫ్ కంఫర్ట్ లోన కిక్ దొబ్బినట్టే ఓ నీది నువ్వు చూసుకుంటే లోకం పర్ఫెక్ట్ గున్నట్టే కంఫర్ట్ ఏ కాదని వెళ్తే కొంప మునిగినట్టే ఓ సీతమ్మ గీత దాటితే రామాయణం ఏమైంది కంఫర్ట్ కె కంచె దాటితే కర్మాయణం స్టార్ట్ అయ్యిది నీ కంఫర్ట్ లో నువ్వుంటే పక్కోడికి ప్రాబ్లెమ్ లేదు డ్యూడ్ అరేయ్ అల్లో నేరడల్లో నా కంఫర్ట్ కె జై బోలో మేరె అందనమే డాన్స్ ఎయ్యిరా నాతో డ్యూడ్ మై నేమ్ ఇస్ రొబ్బిన్ హుడ్ నను గెలికితే ఉండదు ఫ్యూడ్డు కంఫర్ట్ నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్ మమ్మీ కడుపులో నాకు మై మమ్మీ కడుపులో నాకు మా మా మా మా మా మా మా మా మా మా మా మా మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిస్తెన్ టూ మీ వర్డ్ డ్యూడ్ నను ఏడు నెల్లకే బయటకు తన్నుకు వచ్చాను థాట్ ఇస్ మై ఆటిట్యూడ్ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ కడుపులో నా కడుపులో నా కడుపులో నా కడుపులో నా
నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: జొనితా గాంధి, యస్. యస్.థమన్ ఈ తేనే కల్లది ప్రేమల్లో పడ్డది ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు నీకు నీడలాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగి పోనని ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంత ప్రేమరంగు పూసుకున్నది నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నాకోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం ఈ తేనే కల్లది ప్రేమల్లో పడ్డది ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు నీకు నీడలాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగి పోనని ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంత ప్రేమరంగు పూసుకున్నది నువ్వుగా ఓడాలని నేనుగా గెలవాలని కోరికే నన్నిలా తరిమిందని ప్రేమంటే ఇంతేమరి దైవంలా తుదిలేనిది ఆ దైవం ఉంటే నాలోనూ నావైపే నిన్నే నదిపించదా నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం నువ్వే నడిపే కాలం నువ్వే నువ్వే సైన్యం నాకోసం నువ్వే నువ్వే సమరం నాలోన నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం నువ్వే దొరికే విజయం ఈ తేనే కల్లది ప్రేమల్లో పడ్డది ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి మళ్ళి గెలవటానికంటు నీకు నీడలాగ సాగుతున్నదే ప్రాణాలు వీడని నేనాగి పోనని ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంత ప్రేమరంగు పూసుకున్నది
జండా పై కపిరాజు పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: శ్రీమణి గానం: దివ్య కుమార్ ,రాహుల్ నంబియార్ , జొనితా గాంధి, దీపక్ నివాస్ జండా పై కపిరాజు ముందు సిత్వాధి శ్రేణిని గూర్చి నే దండంబునుకొని తోలు స్యందనము నీదం నారి ఘండివంబు ధరించి ఫల్గుణుడు మా కంచెండు చూర్లభుడు ఒక్కడి నీ మోర ఆలకింపడు గురుత్బానాద సంధింపడం పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స ఈ పద్మవ్యూహంలో పడతారో పడకొడతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స గీతలో కృష్ణుడికే తెలియనిది రాతలో బ్రహ్మ ఏ రాయానిధి అటది ఏ శకుని ఆడనిది నాటకం ఏ కన్ను చుడనిది జండాపై కపి రాజు దండెత్తగా వచ్చాడు ఇలా నర సైన్యం చేసే పనులకు ఏ భూకంప తెస్తాడో ఏ బాణం వేస్తాడో ఏ ప్రాణం తీస్తాడో పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స కడ దాకా వస్తాడో కల తీరినా అతిథవుతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స ఈ స్వార్ధపు సంద్రాన్ని మధిస్తే మిగిలేది హాలాహలమె నీ అడుగు పడితే ప్రతి ఎకరం శిఖరం అవుతుందయ్యా మా పిరికి తనం నీ కోసం సమరం చేస్తుందయ్యా ఏ చరిత పుటలు మార్చిన మా చిన్ని ప్రపంచం మాయ హోం బ్రతుకు ఎడారిలా వెతికి పోగేసి పువ్వా నీకై దాచిందయ్యా వేగి విసిగి గుండె ఆగి పొయెటి ప్రేమ నీపై కూరిసిందయ్యా జండాపై కపి రాజు దండెత్తగా వచ్చాడు ఏ కాళ్ళ కపటం లేని కవచం చూసే కన్నీరవుతాడో ఏ కంచికి చేరేనో ఈ మంచాన మంచెనో పద్మవ్యూహం మొదలయింది అర్జున రథమే కదిలింది స్వార్థం సారథి అయ్యింది హాయ్ లేస్సో లెస్స ఈ పద్మవ్యూహం లో పడతారో పడకొడతాడో రంగుల రంధ్రం కుదిరింది ఈ చదరంగం అదిరింది ఆఖరి యుద్ధం మిగిలుంది హాయ్ లేస్సో లెస్స అర్జున రథమే రంగుల రంధ్రం గెలుపు ఎవరిదో
మస్తానీ మస్తానీ పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: దీపక్ , నివాస్ , మానసి, రాహుల్ నంబియార్ మస్తానీ మస్తానీ మస్తుందే ని బాడీ అద్దాన్ని అందాన్ని కలిపిస్తే నువ్వే జానీ నాలోని కోణాన్ని చూపించే ఫీచర్ ని నీ బ్యూటీ కళ్ళల్లో చూసానే దిల్కిరాణి నా స్మైలేయ్ స్మైలేయ్ రోజాలన్నీ అందుకుని అయిపోతే పోనీ దూరంగాని వేడుకని నీ చుట్టూరా నే షాని నిర్మించ ఆదేశాన్ని నువ్వొచ్చాకే నేనైపోయా నీ లైఫ్ దేశం రాజధాని దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది తుర్బాని గురుబని చేసానే ఖుర్బానీ మేకల్ని ఎద్దుల్ని నాలోన ఉన్న అన్ని అద్దాన్ని అందాన్ని నీ ఎయె లోనో దీపాన్ని మొహాన్ని మైకాన్ని నువ్వు మెచ్చే ఉద్యోగాన్ని నీ గాలి నన్ను గిల్లకే నా దారి మారి పోయిందే నీ చోరీ చోరీ చూపుల్లో చేరి నా దిల్ కూడా నీతో వచ్చేంసిదే పోనీ పోనీ పొథెయ్ పోనీ అనుకున్న కానీ కనుగున్నానోయ్ ఎప్పుడు లేని ఒంటరి రోగాన్ని హే నన్ను నిన్ను కట్టేసింది ఇష్క్ అని హే ఒద్దు అన్న మేలు అన్న కాను అని మన సాటి సంగీత్ బాణీ వినిపించు వచ్చే వీని పట్టేసేయ్ వద్దు ఆపులేక వాయిస్తూనే ఉంటున్నాని దంచిక దుంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది
వరమల్లే కనబడుతుందా పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: శ్రీమణి గానం: దీపక్, నివాస్ , రాహుల్ నంబియార్ , సంజన, మనీషా వరమల్లే కనబడుతుందా తలవంచి తలపించైనా తుది శ్వాస నాపదార్చన ప్రాణం నీకోసం కుంభవృష్టేయ్ కురిసినదా అంబరం కరివిరిగేనా ఊపిరాగే పండగకాదిది కుంభోత్సవమేరా రాలిపోయిన పువ్వులకి చిగురులు చిరు నవ్వుల జోల నీతి అలలకు సంద్రము ఊగెనే రంగుల ఉయ్యాలా బ్రహ్మాండమే తొణికేలా బ్రహ్మోత్సవం ఈ వేళా వెయ్యేళ్ళు గుండె లోతులో ఈ నిమిషం నిలిచేలా ఆఆ
కిక్ పాట సాహిత్యం
చిత్రం: కిక్-2 (2015) సంగీతం: యస్. యస్.థమన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: సింహ, స్ఫూర్తి కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ తీస్మార్ ఖాన్ బరిలో షేర్ ఖాన్ తీన్ మారిస్తే ఎక్కింది కిక్కు కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ మాస్ మార్ ఖాన్ దిల్ క చోర్ ఖాన్ మీసం మందికే దక్కింది కిక్కు కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ మై హు మెహర్బాన్ నీ కిక్కే మెచ్చినాన్ నా సరుకే తెచ్చినాన్ నీ సరసు వచినన్ కళ్ళల్లో ఐస్ ఉంది మెడ వంపు గ్లాస్ ఉంది చోళీ లో మాల్ ఉంది స్ట్రక్చర్ లో స్టఫ్ ఉంది నువ్వు చీర్స్ ఏ కొట్టేస్తే నను జొర్సే చుట్టేస్తే ఎక్కువైదా నీ డబల్ కిక్ కిక్ కిక్ కిక్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కిక్ మాస్ మార్ ఖాన్ దిల్ క చోర్ ఖాన్ మీసం మందికే దక్కింది కిక్కు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురు కే ఐ సి కే దుమ్మురేపే కిక్కురోయ్ అరెరే నా వల్లే బుల్లెట్ల బుట్టారో పిల్ల నీ కౌగిటిల్లే కుకురుకూరు కుకురు కూతే నీ పెడితే బందూకుల మోతారో పిట్టా నిను ఒగ్గేస్తే చక్కరొచ్చే కిక్కురో వాటం దేకొరేయ్ ఆటం బాంబు హాయ్ రేయ్ ఐటెం కాస్టలీ రేయ్ మేరి చేస్కోరేయ్ మై హు సింగలు కరిగిస్తా హంగులు నా అడ్డా చంబలు నే సెక్సీ సింబలు కిక్కిరుల్ని నాకన్నా తయారు ఏమైందో పగలంతా ఊపేస్తా రాత్రంతా రేగిస్తా కమ్మేసి కుమ్మేసి అదిమేసి కుదిపేసి ముదిస్తా నే డబల్ కిక్ కిక్ కిక్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ తీస్మార్ ఖాన్ బరిలో షేర్ ఖాన్ తీన్ మారిస్తే ఎక్కింది కిక్కి కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కిక్ మాస్ మార్ ఖాన్ దిల్ తో చోర్ ఖాన్ మీసం మందికే దక్కింది కిక్కు కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కే ఐ సి కే తీన్ మార్ కుకురు కే ఐ సి కే దుమురేపే కికూరోయ్ కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్
2015
,
Kick 2
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Rakul Preet Singh
,
Ravi Teja
,
S. S.Thaman
,
Surender Reddy
,
Vakkantham Vamsi (As a Writer)
Kick 2 (2015)
Palli Balakrishna
Monday, January 22, 2018
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: జూ. యన్.టి.ఆర్, రాశిఖన్నా, నివేద థామస్, తమన్నా దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబీ ) నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల తేది: 21.09.2017
Songs List:
రావాణా..జై జై జై పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దివ్య కుమార్ అసుర రావణాసురా అసుర అసుర రావణాసురా విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా ఓ..ఓ…ఏక వీర..సూరా.. క్రూరా..కుమారా… నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా ఓ...ఓ..రక్త ధారా.. చోర..ఘోరా..అఘోరా కర్కశంగ రేగుతున్న కాలకింకరా రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై… రావాణా..జై జై జై… సింహాసనా..జై జై జై… అసుర..అసుర....అసురా..అసుర..రావణాసురా అసుర..అసుర.అసురా..అసుర..రావణాసురా చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షకా రామనగర పట్టణాల సకల జన ఘర్షక ఓఓఓఓ…అంధకరా.. తార..ధీర..సుధీరా.. అందమైన రూపమున్న అతి బయంకరా ఓ..ఓ..దుర్వితారా.. భైరా..స్వైరా..విహార పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకరా రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై నవరసాల పోషక నామరూప నాశకా వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక చరమగీత నాయకా నరక లోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా ఓఓఓ…అహంకారా.. హారా..బారా..కిషోరా.. నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా… ఓ..ఓ..తిరస్కార… తీరా..ఎరా..కుబేరా… కణము కణము రణములైనా కపాలేశ్వర… రావాణా..జై జై జై … శత్రు శాసన..జై జై జై … రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై …
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: జస్ప్రీత్ జస్జ్ , రనైనా రెడ్డి ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ నరాల్లో మోగుతోంది క్లారినైట్ ఫిరంగి గుచ్చినట్టు రొమాన్స్ గుప్పు మంది పార్టు పార్టు ఫిరంగి జ్ హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పరెయ్యకే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ ఓ.. ఇష్క్ శాండిలైట్ లా చుట్టుముట్టి తిరగనా ఇష్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి గాగ్ర చోళీ కట్టులా అందనంత ఎగరనా ఆవురావురన్న నిన్ను మాయచేసి జపాన్ ఎర్త్క్వెక్ మొదలైయిందే జవాని పొంగులోన పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే ఒకింత పంచుకోన థెర్మోమీటరే దాటుతోంది మేటరే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ కవర్ పేజ్ చిరిగిన బ్యూటీ మ్యాగజీన్ లా డళ్లయ్యేదే భూమి నువ్వు పుట్టకుంటే హే గ్లాసు లోకి ఒరిగిన ముచ్చి ఐస్ క్యూబ్ లా చుమ్మాయిందె ఫోజు నువ్వు ముట్టుకుంటే రెబాన శాకాహారి హద్దు మీరి గుద్దావే పూల లారీ లిరిక్స్ లేని ధన్ దనా నా ఫెడారీ కమాన్ బ్రహ్మచారి బ్రేక్ లేని దూకుడే ఆపుతుంది ఊపుడే ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
కళ్ళలోన కాటుక పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: హేమచంద్ర పల్లవి: కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా... తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా చరణం: 1 నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా... తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా అసుర అసుర అసుర అసుర రావణాసురా అసుర అసుర అసుర అసుర రావణాసురా చరణం: 2 హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా నీ పెదవిలోని ఎరుపు నా పెదవికి గాయం చేస్తే అసుర అసుర అసుర అసుర రావణాసురా మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే అసుర అసుర అసుర అసుర రావణాసురా దారులంత ఒక్కటై ఒత్తుతంగ ఒక్కరై అందమైన ఔషదాన్ని తాగనా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
దోచేస్తా పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్ దిన దినా దా దిన దినా దా దిన దినా దా దిన దినా దా కృష్ణ ముకుంద మురారి జై జయ కృష్ణ ముకుంద మురారి మీ కష్టాలన్నీ దోచేస్తా కన్నిలన్నీ దోచేస్తా చీకు చింత దోచేస్తా చీకటినంత దోచేస్తా బయాలన్నీ దోచేస్తా బారాలన్నీ దోచేస్తా అప్పు సొప్పు దోచేస్తా ఆపదనంత దోచేస్తా ఏయ్య్ మూర్తి బాబాయ్ ఏయ్ జ్యోతి అక్కాయి నీ చేతులోన దాగిన వంకర గీతాలు నుదిటి రాసిన వంకర రాతను వెంట వెంటపడి ఎత్తుకెళ్లిపోతా జంతర మంతర జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా చిందర వందర చిందులు వేసి గందర గోళం చేసేస్తా కళ్ళ కపటం లేని పిల్లాడినయి వస్తా నే వస్తా మీరు వెళ్లే ధారులలోన ముళ్లంటిని ఏరేస్తా పారేస్తా సంద్రం లోని ఉప్పుని మొత్తం చదువులో తప్పులు మొత్తం ఉద్యోగంలో తిప్పలు మొత్తం మాయం చేసేస్తా జాబిలి లోని మచ్చలు మొత్తం కూరలలోన పుచ్చులు మొత్తం దేశంలోని చిచ్చులు మొత్తం దూరం చేసేస్తా జంతర మంతర జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా చిందర వందర చిందులు వేసి గందర గోళం చేసేస్తా రాముని గుణమే కలిగిన క్రిష్ణయ్యా ల వస్తా నే వస్తా అరె చీరలు బదులు నీలో చేదు లక్షణాలే లాగేస్తా దాచేస్తా నవ్వుల మాటుల ఏడుపులన్న్ని ప్రేమల మాటున ద్వేషాలన్నీ వేషం మాటున మోసాలన్నీ స్వాహా చేసేస్తా రంగుల మాటున రంగాలని మాటల మాటున మరణాలని సాయం మాటున స్వార్ధాలని సఫా చేసేస్తా జంతర మంతర జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా చిందర వందర చిందులు వేసి గందర గోళం చేసేస్తా అరెయ్ వెన్న కృష్ణ దోచేయ్ దోచేయ్ చిన్ని కృష్ణా దోచేయ్ దోచేయ్ ముద్దు కృష్ణా దోచేయ్ దోచేయ్ బొద్దు కృష్ణ దోచేయ్ దోచేయ్ క్యూట్ కృష్ణ దోచేయ్ దోచేయ్ ఫ్లూట్-యూ కృష్ణ దోచేయ్ దోచేయ్ నాటి కృష్ణ దోచేయ్ దోచేయ్ బ్యూటీ కృష్ణ దోచేయ్ దోచేయ్ గోకుల కృష్ణ దోచేయ్ దోచేయ్ గోపాల కృష్ణ దోచేయ్ దోచేయ్
స్వింగ్ జర పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నేహా బాసిన్, దేవి శ్రీ ప్రసాద్ స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (4) నేనో గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జార స్విన్గు జార స్వింగ్ జర స్వింగ్ అందం తిన్నానండి అందుకే ఇట్టా ఉన్నానండి స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్వింగ్ నా మత్తుకళ్ల నుంచి ఓ కొత్త కళ్ళు తీసి ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండి నా భెల్లీ డాన్స్ చూసి నోరారా గుటకాలేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (4) హుక్కా బార్ ఏ నేను పక్కాగా కిక్ ఇస్తాను మబ్బులోకెక్కిస్తాను చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను కంట్రీ బీర్ ఏ నేను లోకాలు చూపిస్తాను లెక్కలు మరిపిస్తాను భూమ్మీద బాలన్స్ ఏ తప్పిస్తాను ఏ మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను నీ ఎనర్జీ కి 4G స్పీడ్ ఇస్తాను అందుకేగా నేను మీకోసమోచ్ఛను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ బ్యూటీ బాటిల్ నేను నిండా నషా నింపాను ఇష్టాంగా వచ్చేసాను నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను నే కోరే నషా వేరు దూసుకెళ్ళాలి నాలో జోరు మోత మోగేట్టుగా నా పే ..రూ అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను హే సిగ్గు సింగారాల ఓ అగ్గిపుల్ల నేను నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను హే పుట్టుకతో నేను ఓ నిప్పుతో పుట్టాను అడిగాడో సూర్యుడికి ఆహ్ ..అప్పిస్తాను అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (4)
అందమైన లోకం పాట సాహిత్యం
చిత్రం: జై లవ కుశ (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: విశ్వప్రసాద్ ఎం.గంగి అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు చిన్న వాటి కంట నీరు రానీకుండా తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దొడు కావలుండే గుండె వాడు సేవ చేసే చేయి వాడు అన్న అంటేనే వాడు తననే మరిచాం ఆనాడు అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతుతున్న పక్షులే మూడు ఒక్క చోటనే ఉన్న పక్క పక్కనే ఉన్న మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచె రోజు రాగ జాలే లేని సంతోషం నిన్నే చేసే సుదూరం ఎంతో దూరం చాల దూరం
2017
,
Devi Sri Prasad
,
Jai Lava Kusha
,
Jr.NTR
,
K.S.Ravindra (Bobby)
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Nivetha Thomas
,
Raashi Khanna
Jai Lava Kusha (2017)
Palli Balakrishna
Tuesday, September 5, 2017
చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
నటీనటులు: కళ్యాణ్ రామ్ , ప్రియమణి
దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 18.07.2008
ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..
హరిలో రంగా హరి ఇదేం తమాషే..కారంగా వాడే జోడి తరవాత రాసే..
భాగోతం బాగుందా ఓ సరే సభాసే..ఐసే ఐసే ఒకటే దురుసే..
ఆనందో బ్రహ్మా అంటూ షికార్లు చేస్తే..అమ్మోరు పూనినట్టు ఈరంగమేస్తే..
ఎన్నాళ్లీ చోరా చోరీ తోచింది చేస్తే..చూస్తే గీస్తే మతే మటాషే..
జంట కుదిరిన జోషే..కంటపడితే వెంటపడక ఒంటి కలతో ఉంటదా..
నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే..
కత్తి పదునై కోసే..కొత్త చినుకు గుండె తొడుగుతుంటే కునుకు పడతదా..
నరం నరం నములు గరం గరం గుబులు..క్షణం క్షణం దిగులు ఇచ్చే అంటంతా..
అదో రకం తెగులు అయోమయం సెగలు..పుట్టించడం తగని పనే కదా..
లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం..కాకుల్లాగా కవ్విస్తే 'కేర్ ఏ పిన్' అంటాం..
ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం...మున్ముందుకు పోతాం ఆగం మీ కోసం..
*********** ************ *******
చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
సయ్యన్నారా సరదాగా సంగతి చెప్పుకుందాం
కాదన్నారా..ఎసేయి రా..సేయి రా అనుకుందాం..
అసలెందుకులే మీ అందరి ఒప్పందం..
వై...కాపేస్తే కంచెలు తుంచుకు పోతాం..
వై..ఆపేస్తే తప్పక తప్పుకు పోతాం..
వై..కోపిస్తె కొండల నుంచి కిందికి వచ్చి కిక్కున తుంచే కొంపలు ముంచే గోదారైపోతాం..
వై..ఆవారా గాలిని బంధిస్తారా..
వై..కెరటాలకు కొరడా చూపిస్తారా..
వై..గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందే..
పొందేయ్ లాభం..మ్..మ్..మ్..
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..
[జంట కుదిరిన జోషే]
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
********* ********** ***********
చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
ఒంటరి ఈడు కదా..తుంటరి తొందర ఉండదా..ఎందుకు ఈ బెడదా..తగునా..
అందుకు ఆడ జతా..తప్పక అవసరమే కదా..నువ్వది కాదు కదా..అవునా..
ఇంతలేసి కళ్లు ఉన్నా గంతలేసుక్కుచున్నావా..నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా..
బాప్ రే బాప్ తెగ బెదిరానే..నమ్మవేం చెబుతున్నా..గాభరా పడుతున్నానే..చాలదా..పులి కూనా..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
దక్కిన చుక్కనిలా..తక్కువ చేయకు ఇంతగా..మక్కువ దాచకలా మదిలో..
కమ్ముకు రాకే ఇలా..తిమ్మిరి పెంచకె వింతగా..గమ్మున ఉండవెలా తెరవో..
ఆశపుడితే ..దాగుతుందా.. రాసకార్యం ఇన్నాళ్లుంటే..మూతపెడితే దాగుతుందా.. చాలు రాదది జోకొడితే..
క్యా కరే నాకేం దారి..నౌకరీ పోతుందే..పోకిరి వైఖిరి చాలే..ఛోకిరి వదిలెయ్వే..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..
********* ********* **********
చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ
సుడిలో పడవై ఎపుడూ తడబడకూ
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవనీ నీ కళ్ళు
కన్నఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో
నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడ్లో చిచ్చల్లే రగిలించె నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదా
నీలా నవ్వే క్షణాలలో
చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్లై దైవం అనరా శిలను కొలిచీ
అమృతమే నువు పొందూ విషమైతే అది నావంతూ
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో
********** ********* **********
చిత్రం: హారేరామ్ (2008)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం:
గానం:
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా
ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా
కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా
ఊరికే ఉసూరుమంటావే ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే
రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించీ రంగుల లోకాన్ని
కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా
ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమపడుతుందంటే
గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవీ
ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా
కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ
లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా
2008
,
Hare Ram
,
Harshavardhan (Tamil Director)
,
Mickey J Meyer
,
Nandamuri Kalyan Ram
,
Nandamuri Kalyan Ram (as a Producer)
,
Priyamani
Hare Ram (2008)
Palli Balakrishna
Monday, August 14, 2017