-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kalyanram Kathi"

చిత్రం: కళ్యాణ్ రామ్ కత్తి (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బాలాజీ
గానం: శ్రీరామ చంద్ర
నటీనటులు: కళ్యాణ్ రామ్, శామ్, సనా ఖాన్, శరణ్య మోహన్
దర్శకత్వం: మల్లికార్జున్
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 12.11.2010

ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో
ఏకాంతం కాదిది నాలో సగమే కరిగి కదిలి నాకే ఎదురౌతున్నది
ఏ చోట లేనిది నీవే మనసై కనులు కలిపి హృదయం దోచేస్తున్నది
మనసే రోజులా లేదు తిరుగుతుంది నా ముందు
కాలం కదిలేలాలేదు చేసుకుంది నను ఖైదు
కొత్తగ లోకం చూస్తున్నా చంటిపాపనౌతున్నా
ఏమని చెప్పను ఏమైనా ఎదకు బదులు నేనున్నా

ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో

గాలమేసుకుంది ప్రాణాలు లాగుతోంది నాగుండెల్లో ప్రేమ
ఊపిరాడకుంది శ్వాస పట్టుకుంది ఈ నిమిషంలో ప్రేమ
చిరు కానుకై తొలివేడుకై తను మొదలౌతుంది ప్రేమ
ఔననో మరి కాదనో మది చెడగొడుతుంది ప్రేమ
రెక్కలకోసం వెతికేనా చినుకు నేల పడుతున్నా
రెప్పలు దారే మూస్తున్నా మనసు అడుగులాపేనా
చుక్కలు తాకే ఊహేన ఎగురుతోంది నా లోన
మొన్నా నిన్నా నేనున్నా నేటినుంచి ఎవరోనా

నేల తేలుతోంది ఆకాశమందుతుంది ఏ చిత్రం ఈ ప్రేమ
గాలి తాకుతోంది తుఫానులాగ ఉంది ఏ మంత్రం ఈ ప్రేమ
ఈ నీరిలా పన్నీరులా ఎద తడిపేస్తుంటే ప్రేమ
అమ్మలా నను కమ్మగా తెగ లాలిస్తుంటే ప్రేమ
ఒంటరిగానే నేనున్నా ఎంతమందిలో ఉన్నా
పరుగే తీసే వయసున్నా మనసు దాటలేకున్నా
పెదవుల మద్యే దాగున్నా దొరకలేదు మాటైనా
తియ్యని గాయం అవుతున్నా తెలపలేదు ఆశైనా

ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలో
ఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో


Palli Balakrishna Thursday, March 22, 2018

Most Recent

Default