-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kamalakar"


చిత్రం: రాంబాబు గాడి పెళ్లాం (2010)
సంగీతం: కమలాకర్
నటీనటులు: అల్లరి నరేష్ , గజాల, సోనాలి జోషి, గీతా సింగ్, కౌశల్య
దర్శకత్వం: కాపుగంటి రాజేంద్ర
నిర్మాత: ఎమ్. వెంకటేశ్వర రావు
విడుదల తేది: 26.02.2010

Palli Balakrishna Friday, February 15, 2019


చిత్రం: పెళ్లయింది కానీ (2007)
సంగీతం: కమలాకర్
సాహిత్యం:
గానం:
నటీనటులు: అల్లరి నరేష్ , హరీష్ కుమార్, కమిలిని ముఖర్జి , భానుప్రియ , సునీల్ , అభినయ శ్రీ
దర్శకత్వం: ఇ. వి.వి. సత్యనారాయణ
నిర్మాత: యమ్.నరసింహా రావు
విడుదల తేది: August 2007

త్వరలో...

Palli Balakrishna Wednesday, March 14, 2018



చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
నటీనటులు: ఆర్యన్ రాజేష్ ,  దీపిక
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: లగడపాటి శ్రీధర్
విడుదల తేది: 21.01.2005



Songs List:



బంగాళాఖాతం పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: కె. కె.

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం

చిలిపి చిలక వయసు కనుక ఇవ్వనా కానుకా
వలపు చిలికి పెదవి కొరికి చూపనా వేడుకా
తనువుతో తనువు తలబడి తాకగా హాయి రాబడి
నమ్మితే చూపుతా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం

వలపు పనికి పిలవకున్నా వేచివుంటానుగా
సొగసు ఉనికి తెలపకున్నా తెలుసుకున్నానుగా
నిప్పుకి తప్పు అంటదే యవ్వనం నిప్పులాంటిదే
అందుకే అందుమా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం





తక తక తయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: కార్తిక్, ఉష

తక తక తయ్యా



బంతిలాంటి భామ పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సురేష్ కృష్ణ
గానం: టిప్పు, పాప్ షాలిని

బంతిలాంటి భామ




కల కాదుగా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: బండారు దానయ్య
గానం: కార్తిక్, సాధన సర్గమ్

కల కాదుగా




అమ్మో వాడెవడో గాని పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీహరి జగన్నాథ్
గానం: మల్గాడి శుభ, టిప్పు

అమ్మో వాడెవడో గాని కమ్మలెడతనన్నడే

Palli Balakrishna Saturday, October 21, 2017



చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
నటీనటులు: సుమంత్ , అనుష్క , శ్రీహరి
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: అనసూయ దేవి
విడుదల తేది: 03.12.2005



Songs List:



ఏమైనా ఏదేమైనా పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: బండారు దానయ్య కవి
గానం: హరిహరన్ , చిత్ర

పల్లవి:
ఏమైనా ఏదేమైనా
ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
ఏమైనా ఏదేమైనా మనసు తెలుసుకున్న
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 1
నువ్వంటే ప్రాణం నీలో నా స్థానం
పదిలమవ్వాలి  పద పద మని పదికాలాలు
ప్రేమంటే దైవం వెంటుంటే ధైర్యం
సాగిపోవాలి కనుమరుగై మన దూరాలు
ప్రేమెంతో పోసి చీటీలను రాసి కొరాను దైవాలని
ఆ ఆశను చూసి ఆశ్చర్యం వేసి
నువు నాకు కావాలనే
ఇన్నాళ్ల నా ప్రేమ నువ్వే నా చిరునామా
అని అనగా అనగా కలలు కనగ

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా

చరణం: 2
అందాల రాశి నన్నేదో చేసి తిష్ట వేసావు
తొలి వలపుల తలుపులు తీసి
పక్కింటి పెళ్లి అంటుంది తుళ్ళి
ఒప్పుకోవాలి వధు వరులం మనమైపోయి
చూపుల్లో భావం చేతల్లో జీవం
మార్చింది నీవాడిగా
మాటల్లో మాఘం ఆశల్లో భాగం
అడిగింది నిను తోడుగా
మరణాలే ధరిరాని గగనాలే విడిపోని
ప్రతి జన్మలోను ఒకటి మనము

ఏమైనా ఏదేమైనా ప్రేమ తెలుపుతున్నా
అణువు అణువున  ఆరాధన
పెదవి దాటింది ఈ రోజున
మనసులో కొత్త ప్రియభావన
మరచి పోలేను కలిసి బ్రతుకు చివరివరకు





టైట్ జీన్ ప్యాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: తైదల బాపు 
గానం: టిప్పు 

టైట్ జీన్ ప్యాంట్



ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: ఈశ్వర్ తేజ
గానం: శ్రేయా ఘోషల్ 

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

స్వరాలూ ఏడూ సముద్రాలేడు
వెంకన్న వుండే కొండలు ఏడు
పెళ్లితో వేసే అడుగులు ఏడు
నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు
నింగి నెల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

వచ్చింది ఈడు కోరింది తోడు
కన్నేసి చూడు తప్పించు కోడు
చూపులతో వాడు గాయం చేసాడు
ప్రేమించమంటే మాయమౌతాడు

ప్రతి రేయిలో ఇదే స్వప్నము
తెల్లవారితే అదే మౌనము
ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తా
గోల చేస్తుంది నా ఈడు గోల చేస్తుంది
ఆగనంటుంది అందాకా ఆగనంటుంది

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

చూసింది మొదలు గుండెల్లో గుబులు
ఏమైందో అస్సలు ని పైనే కళలు
కౌగిళ్ళ కధలు చెప్పాలా బదులు
ఎందయ్యో అస్సలు ఈ పిచ్చి పనులు

ప్రేమన్నది ఓ అద్భుతం
ప్రేమించడం మరో అద్భుతం
ఇదే అర్ధం ఇదే నిత్యం ఇదే సత్యం
నన్ను ప్రేమిచే మగడు ఎక్కడున్నాడో
కల్లముందొచ్చి షొక్కిస్తే ఎంత బాగుందో

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు
బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు

నింగి నేల ఓ అద్భుతం
నీరు గాలి ఓ అద్భుతం

నువ్వు నాతోడు ఓ నేస్తం నేను ని తోడు
నేను ని తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు




ఎటు చుస్తే అటు నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేల్పుల వెంకటేష్ 
గానం: చిత్ర 

ఎటు చుస్తే అటు నువ్వే 




చంపకమాల పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మాలతి, శంకర్ మహదేవన్ 

చంపకమాల



నా పంచప్రాణాలు పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: గురుచరణ్
గానం: యస్.పి.బాలు , చిత్ర

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా (2)
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

ఈ నేల అన్నదీ నా గంగ నువ్వని నీ ప్రేమ స్వాతివాననీ
ఈ గాలి అన్నదీ నువ్వంటే నిప్పని ఆ అగ్నిసాక్షి చాలనీ
తారలతోటి ప్రేమకు నింగి పందిరి వేసే నేలకి వంగి
అడగలేక అడుగుతుంటే అడుగడుగుకి తడబడే హృదయం
నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా

కార్తీక మాసమే కళ్ళల్లో ఉన్నది కల్యాణమెప్పుడన్నది
పెదాల మాటున ఏ మౌనమంత్రమో అక్షింతలేయమన్నది
అందరి మాటే మంగళవాద్యం అందెను నీకే మంగళసూత్రం
అదును చూసి పదును చూసి ముడిపడినది మనసుల ప్రణయం

నా పంచప్రాణాలు నీ ప్రేమా గీతాలని తెలుపనా
ఈ పంచభూతాలే మన పెళ్ళి సాక్షాలని తెలుసునా
ఇలా మనం చెరోసగం ఇదేకదా స్వయంవరం
ఏడేడు జన్మాలదే ఈ వరం




కత్తిలాంటి అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: మహానంది  (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వేటూరి 
గానం: అద్నాన్ సామి, సుజాత 

కత్తిలాంటి అమ్మాయి 

Palli Balakrishna Thursday, September 14, 2017



చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
నటీనటులు: అల్లరి నరేష్ , సదా
దర్శకత్వం: మల్లి
నిర్మాత: మాగంటి బాబు
విడుదల తేది: 25.07.2003



Songs List:



నిండు నూరేళ్ళ సావాసం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: సోను నిగమ్, మహాలక్ష్మి అయ్యర్

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం

బతుకు ఆడు ఆటలో మరణమంటే ఏమిటి
ఆటలోని అలుపు అంటి చిన్న మలుపులే
జీవితాన్ని అందక జీవమెళ్లిపోదులే
ఆరిపోని అనిగిపోని చిరంజీవిని
కల నిండుగా ఆశీస్సులే
ఇక నిండదా ఆ ఆశలే
యముని పాశమే బిగుసుకున్నను
మరణమన్నది మరల జననమే

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే

లా ల లా లా లా లా లా లా (3)





సయ్యరి నా యెంకి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: యస్.పి.బాలు 

సయ్యరి నా యెంకి 



స్నేహమా స్వప్నమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: హరిహరణ్, కె.ఎస్.చిత్ర 

స్నేహమా స్వప్నమా





వాతాపి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: E.S.మూర్తి 
గానం:  కె.ఎస్.చిత్ర 

వాతాపి 



బ్రహ్మాండం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: యస్.పి.బాలు 

బ్రహ్మాండం 



నిండు నూరేళ్ళ సావాసం (Sad) పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీ సాయి హర్షా
గానం: కమలాకర్, గోపిక పూర్ణిమ

నేల తల్లి సాక్షిగా ...   కోరస్: నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా... కోరస్: నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా...  కోరస్: గాలి దేవర సాక్షిగా
అగ్గి దేవుని సాక్షిగా...  కోరస్: అగ్గి దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
హా హా హా హా హా హా హా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు పుచ్చపూల పున్నమేనులే ఓ ఓ ఓ
రెళ్ళు కప్పు నేసినా ఇంద్రధనస్సు గూటిలో
రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలులా పళ్ళకీలలో సుక్క సుక్కనీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో చెలిమే చేద్దాములే

వర్జమంటు లేదులే రాహు కాలమేదిలే
రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే ఓ ఓ ఓ
అతిధులంటు లేరులే మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే
ఏ ఏడుపు దిగి రాడులే మన కూడికే మన తొడులే 
ఇసుక దోసిలే తలంబ్రాలుగా తలలు నింపగా మనువు జరిగెలే 
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం
ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
లా ల లా లా లా లా లా లా
లా ల లా లా లా లా లా లా





ధిం ధిం ధిం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణం (2003)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజా
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

ధిం  ధిం  ధిం 


Palli Balakrishna Monday, July 31, 2017



చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
నటీనటులు: వినయ్ రాయ్, మీరా చోప్రా
దర్శకత్వం: యమ్.ఎస్. రాజు, శ్రీకాంత్ బుల్లా
నిర్మాత: యమ్.ఎస్. రాజు
విడుదల తేది: 15.01.2007



Songs List:



ఆకాశ గంగా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా

ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా

ఆకాశ గంగా దూకావె పెంకితనంగాఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా




ఢోలారే ధుమారం దేఖోరే పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే
ఝూమోరే ఝమాఝం నాచోరే
హుర్రే హుర్రే అనదా ఊపిరే
అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా
అరె కళ్ళలోన కులికిందా హరివిల్లు నేడిలా
కింద మీద చూడనంటు సందడేదొ ఆగనంటు
బొంగరాల గింగిరాల చందనాలు రేగు వేళ
ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

మనింటిలో వేడుక విన్నంతటా హంగామా
కళ్యాణమే చూడగ ఖంగారు కలిగిద్దామా
జగాలకే చాటుగా జువ్వల్ని ఎగరేద్దామా
చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా
ఈవాళే రావాలి పగలే ఇలా
రంగేళి రేగాలి నలువైపులా
నింగి నేల ఏకమైన రంగ రంగ వైభవాన
ఛంగు ఛంగు ఛంగుమంటు చిందులాట సాగువేళ

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

పొద్దెక్కినా లేవక బజ్జోకుమా పాపాయి
నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపేయి
కుర్రాళ్ళతో దీటుగ కుంగ్ఫులవీ మానేయి
ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లలుగా అడుగెయ్యి
అమ్మయ్యి లోకాన్నే అమ్మాయివై
తీరంత మార్చాలి ఆరిందవై
పిల్లతాను నీ బడాయి చెల్లదింక ఆకతాయి
అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ
ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే




మువ్వంటే మైనా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, గోపికా పూర్ణిమ (హమ్మింగ్)

మువ్వంటే మైనా





సిరిమల్లె వానా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, రంజిత్

(ఈ పాట యొక్క ట్యూన్  చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్ని అందించిన  బల్లెమ్మ బుల్లోడు (1972) సినిమాలోని కురిసింది వాన నా గుండెలోన పాట యొక్క ట్యూన్ )

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వానా ఉరిమింది వీణా వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం: 1
వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం: 2
చిలిపిగా ఆడి చెలిమికి ఓడి గెలిచా నీ పైనా
తగువుకి చేరి తలపుగ మారి నిలిచా నీ లోనా
మనసే ఈ వింతా మునుపే చూసిందా సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వానా ఉరిమింది వీణా వినిపించదే జంటకి



ఉన్నట్టా లేనట్టా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

ఉన్నట్టా లేనట్టా



ఆకాశ గంగా (Sad Version) పాట సాహిత్యం

 
ఆకాశ గంగా (Sad Version)

చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా




ఎదుట నిలిచింది చూడు పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా

ఎదుట నిలిచింది చూడు

చరణం: 1
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి?
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ?
ఔనో కాదో  అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం...
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా !!

ఎదుట నిలిచింది చూడు

చరణం: 2
నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో  కాదో  వ్రాసున్న చిరునామా
ఉందో  లేదో ఆ చోట నా ప్రేమా...
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా...

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా

ఎదుట నిలిచింది చూడు





వెంట పడుతుంది చూడు పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2007)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

వెంట పడుతుంది చూడు కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో
మధురమైన యాతనేదో బయట పడదిలా ఓ...
వెంట పడుతుంది చూడు

Palli Balakrishna Friday, July 28, 2017


చిత్రం: అభి (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: మాలతి
నటీనటులు: కమలాకర్, సొనాలి జోషి
దర్శకత్వం: డా౹౹. కిరణ్
నిర్మాత: బుచ్చేపల్లి సుబ్బారెడ్డి
విడుదల తేది: 2004

వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే ఏ... ఏ... ఏ...

వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
హే... హే... హే...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా లాగాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంత ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే
పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే

హయ్య రామ హయ్య రామ
హయ్య రామ హయ్యయ్యో
హయ్య రామ హయ్య రామ
హయ్య  హయ్యయ్యో

వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

హే వచ్చినీడు వచ్చినట్టే అరె గిచ్చి గిచ్చి చంపుతుంటే
కుచ్చిళ్ళ వంకలో వత్తిళ్ల వంకతో ఒళ్ళంత తొక్కినారే
పచ్చి పచ్చి సిగ్గులెన్నో చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మ మూతికి బుగ్గమ్మ బంతికి
ముద్దెట్టి పోయినాడే హే
అయ్యబాబోయ్ ఎక్కడోడే
చక్కనోడే గాని తిక్కలోడు
గోడెక్కి వస్తడు గోరుముద్దలిస్తడు
తుఫాను లాంటి వాడు బాలక్రిష్ణుడు

వంగ తోటా... వంగ తోటా...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

హే గోంగూర సేను కాడ లంగోటి కాడ కంగారు పెట్టినాడే
వంగుంటే వాలుగా తొంగుంటే తోడుగా వాటేయ్య వచ్చినాడే
ఒంగోలు సంత కాడ శృంగారపోడు తింగేటు చూసినోడే
తూచేది తూచక  సూచాయి తప్పక దోచేసి పోయినాడే
అయ్యబాబోయ్ పిల్లగాడే గంప దించి నా కొంప ముంచినాడు
మ్యాట్నీకి రమ్మని నడిరేత్రి రమ్మని దీపాలు పెట్టగానే ఏసుకుంటడు

వంగ తోటా... వంగ తోటా...
వంగ తోట మలుపు కాడ కొంగుపట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా లాగాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంత ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే
పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే

హయ్య రామ హయ్య రామ
హయ్య రామ హయ్యయ్యో
హయ్య రామ హయ్య రామ
హయ్య  హయ్యయ్యో



********  *******   ********


చిత్రం: అభి (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: సాగర్, సుమంగళి

ఎవరో అతనెవ్వరో  అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో...

ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

అణువణువు అతని తలపై ఏతించ సాగె
అనుదినము వినని కథలే వినిపించేనే
చెలి మనసు అడిగి మనసు వెంటాడే సాగె
తొలివలపో జతకు పిలుపో బదులే రాదే
మనసంటే నేరం మనసంటే భారం
నిలిచేనా ప్రాణం ఒంటిగా...

ఎవరో తను ఎవ్వరో ఎదురే వచ్చింది
వివరం ఏం చెప్పను విరహం రేపింది
ఎవరో అతనెవ్వరో  అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు

హో పరిచయమే ఓ పరిమళమై గంధాలు పూసే
పరువమిలా ఓ పరవశమై గ్రంథం రాసే
ప్రతి నిమిషం బ్రతుకు సుఖమై ఉయ్యాలలూగే
జతకలిసే అతని కొరకే ఎదురే చూసి
హృదయంలో దాహం తడిపే ఓ మేఘం
ఎపుడో నీ స్నేహం ఓ ప్రియా...

ఎవరో అతనెవ్వరో  అతిధిగ వచ్చాడు
నిదరే పోతున్న నా ఎదనే కదిపాడు
తెలవారే వేళా కలగన్నా తననే
అది ప్రేమో ఏమో ఏమిటో...

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default