-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aryan Rajesh"



చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య 
దర్శకత్వం: ఇ. వి. వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: ఈదర శ్రీనివాస్, ఈదర రవికుమార్ 
విడుదల తేది: 30.04.2010



Songs List:



మందారమా మాటాడు మా పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: వనమాలి 
గానం: శ్రీకృష్ణ, సునీత 

మందారమా మాటాడుమా 



ఓ స్నేహమా నా ప్రాణమా పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: దీపు, నిత్య సంతోషిని 

ఓ స్నేహమా నా ప్రాణమా 



ఇంద్రధనుస్సులకు ఇంటిపేరు పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శశి కిరణ్, గీతామాధురి 

ఇంద్రధనుస్సులకు ఇంటిపేరు 




పాటల పల్లకి (పేరడీ సాంగ్స్) పాట సాహిత్యం

 
చిత్రం: బురిడి (2010)
సంగీతం: కోటి 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో శ్రీకృష్ణ, సాగరి, సాయి శిల్ప 

పాటల పల్లకి (పేరడీ సాంగ్స్)

Palli Balakrishna Thursday, August 11, 2022



చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, సదా 
దర్శకత్వం: దేవి ప్రసాద్ 
నిర్మాత: సి. హెచ్. యస్. మోహన్ 
విడుదల తేది: 04.12.2004



Songs List:



బాలమణమ్మో బాలమణమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శంకర్ మహదేవన్, మాలతి

బాలమణమ్మో బాలమణమ్మో
లీలామహల్ వెనుక నీతో చాలా పనమ్మో



చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి. బాలు 

చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా 
తోటకెల్లావా పండు తెచ్చావా
ఉయ్యాలా జంపాల నిన్నెవరు ఊపాలా



ఆ తుమ్మెద రెక్కలనడుగు పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: E.S. మూర్తి 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నల్లో ఈ దూరం అన్నవి...
నీ ఒకే చూపు తాకి, నా ఎదే తెలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి....

చరణం: 1
ఏదారుండి ఎదలో నువ్వు ప్రేమ జల్లువై కురిసావు
ఎలా శిలను ప్రేమించావు చెలియా చెప్పవా
గులాబీల ముల్లును చూసి అదేదాని గుణమనుకుంటే
అమృతాలు పంచె మనసు మళ్ళీ దొరుకునా
ఇలా పూల తోటను విడిచీ రాళ్లదారినీ
ఎలా చేరగలవో నడిచీ ప్రేమ గూటిని
ఒకే పిలుపు చాలనులే ప్రాణాలే పోయిన నా మనసే ఆగునా
ప్రాణాలే పోయినా  నా మనసే ఆగునా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...

చరణం: 2
మనసులేని కాలం మనకు విధించింది ఈ ఎడబాటు
నవ్వుతూనే చూపించాలి లోకం తీరుని
రమ్మంటేనే పండగ రాదు ప్రతి రాత్రి పున్నమి కాదు
వలె వేసి రప్పించాలి వాసంతాలని
ఒకే మాట ఒకటే గమ్యం ప్రేమ జంటకీ
ప్రపంచాన్ని ఓడించాలి గెలుపు భాదనీ
విధే వచ్చి తలవంచాలి ప్రేమ నిజమనీ.. నీకెదురే లేదని
ప్రేమే నిజమని, నీకెదురే లేదని

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నాల్లో ఈ దూరం అన్నవి....
నీ ఒకే చూపు తాకీ ఎదేతేలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా....





ఓ హంపీ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: హరిహరన్, సుజాత 

ఓ హంపీ బొమ్మ ఎల్లోర గుమ్మా కల్లార్పలేనమ్మా



చిట్టీ చిలకమ్మా (Bit) పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: దీపిక 

చిట్టీ చిలకమ్మా (Bit)



సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కె.యస్.చిత్ర 

సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ
ఆనందం పొంగాలి ఆడుతూ పాడుతూ 




పరమ పావని పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కల్పన 

పరమ పావని 

Palli Balakrishna Tuesday, August 2, 2022



చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, నమిత, రోహిత్, నేహా పెండ్సే 
దర్శకత్వం: శ్రీను వైట్ల 
నిర్మాతలు: యస్. సోంపల్లి , వి. ఆర్. కన్నెగంటి 
విడుదల తేది: 23.08.2002



Songs List:



సొంతం పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: టిప్పు 

Close Your Eyes And Open Your Dreams
The World Is So Large Sontham
Spread Your Arms And Give All Your Love
The World Is So Large Sontham
ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఐనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్షం ఈ చిరునవ్వుల సాక్షం
వారమల్లే అందిన స్నేహం మన సొంతం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం

Close Your Eyes And Open Your Dreams
The World Is So Large Sontham
Spread Your Arms And Give All Your Love
The World Is So Large Sontham

ఊపిరిలో ఉరకలేసే వుత్సవాహం మనకు సొంతం
ఉప్పెనతో పందెమేసే ఉల్లాసం మనకు సొంతం
రెప్పల్లో స్వప్నాలు సొంతం గుప్పిట్లో పంతాలు సొంతం
అనుకుంటే ఎదైన సొంతం అనిపించే నమ్మకం సొంతం
తనకేలే ప్రతి నిమిషము సొంతము
సొంతం సొంతం ప్రతి ఋతువు మన సొంతం
సొంతం సొంతం ప్రతి మలుపు మన సొంతం

Aa Give Me ‘S’
Give Me ’O’
Give Me ’N’
Give Me ’T’
Give Me ‘H A M’
Say Sontham
సొంతం సొంతం సొంతం సొంతం సొంతం
సొంతం సొంతం సొంతం సొంతం సొంతం

దిక్కులనే ధిక్కరించే ఉడుకుతనం మనకు సొంతం
చిక్కులనే వెక్కిరించే చిలిపితనం మనకు సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం ఊహల్లో లోకాలు సొంతం
ఎగిరొచ్చ్ ఉదయాలు సొంతం
ఎదిరించే శిఖరాలు సొంతం
ఆణువణువూ ఈ యవ్వనం సొంతము
సొంతం సొంతం ఆశలన్నీ మన సొంతం
సొంతం సొంతం సరదాలే మన సొంతం

ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికి ఇది మిన్నగా మారని నిజం కదా నేస్తం
అందాల అనుభందం వందేళ్లు మన సొంతం
తన కాంతి లో ఈ ప్రతి క్షణం వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్షం ఈ చిరునవ్వుల సాక్షం
వారమల్లే అందిన స్నేహం మన సొంతం
సొంతం సొంతం భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం ఆకాశం మన సొంతం
ఆశలన్నీ మన సొంతం సరదాలే మన సొంతం
లోకమంతా మన సొంతం ఈ సృష్టే మన సొంతం



తెలుసునా తెలుసునా పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.యస్.చిత్ర 

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండి పొయిందే
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా



ఎపుడు నీకు నే తెలుపనిది పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మల్లికార్జున్ 

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం
వెతికె తీరమె రానంది
బతికె దారినె మూసింది
రగిలె నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమె నీడగా మారింది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసె మోయగలదా జీవితాంతం

జ్ఞాపకం సాక్షిగా పలకరించవు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేశావు ప్రతి పూట
ఒంటిగా బ్రతకలేనంటూ వెంటతరిమావు ఇన్నాళ్లు
మెలుకువే రానీ కలగంటు గడపమన్నావు నూరేళ్లు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే కానీ ఊపిరిగా సొంతం కాదా





ఈనాటి వరకు పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: షాన్ , సుమంగళి 

ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా

ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే
మనసా ఆ ఆ
ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
are u in love
are u in love

ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటు నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటు వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే వున్నా అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా
ఈనాటి వరకు నా గుండెలయకు
ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా

ఒక్కచోటే కలిసి ఉన్న తనతో పాటు ఇంత కలం
ఒక్క పూట కలగలేదు నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్న ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంట పాడనీ ప్రాణం లాగా గుండె లోనే తానున్న
జ్ఞాపకాలే తరిమే దాక గుర్తు రాలేదే
ఈ తిపిడిగులు మొదలైంది మొదలు
ఎన్నెన్ని కళలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా



అక్కడో ఇక్కడో ఎక్కడో పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: రవికిరణ్ 
గానం: మల్గాడి శుభ 

అక్కడో ఇక్కడో ఎక్కడో సెగ రేగే నాలో ఎక్కడో
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చలి రేగే నాలో ఎప్పుడో 




హే నాయుడో నాయుడో...పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: దేవిశ్రీ ప్రసాద్ 

హే నాయుడో నాయుడో... జమ్మప్పల నాయుడో
హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల
హే నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో భూలోకం బద్దలయ్యేలా
కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
చూపులతో సుందరికి గాలమెయ్యాల
చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల ఏ ఏ ఏ
అరె ఊదరా

ఏయ్ అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే
అప్పప్ప సోడిపప్ప మాడిపోయిందే
ఏయ్ పక్కనున్న రైలుబండి పారిపోయిందే
పక్కనున్న రైలుబండి పారిపోయిందే
ఏయ్ పిడతలోన పప్పు చారు కారిపోయిందే
పిడతలోన పప్పు చారు కారిపోయిందే
అయ్యో సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే
సూరులోన సుట్ట ముక్క రాలిపోయిందే
అప్పప్ప సోడిపప్ప ఏయ్ అప్పప్ప ఏయ్ సోడిపప్ప
ఏయ్ అప్ప ఏయ్ అప్ప ఏయ్ అప్ప పప్ప అప్ప
ఏయ్ అప్ప ఏయ్ అప్ప ఏయ్ అప్ప పప్ప అప్ప ఏయ్

ఏలో – ఏలో ఏలేలో – ఏలేలో
అల్లరి పాటలు పాడాలయ్యో నూరేళ్ళు – నూరేళ్ళు
ఏయ్ ఐస్సా – ఐస్సా అరె హైలెస్సా – హైలెస్సా
గుండెలో చప్పుడు ఉండేదాకా సందళ్ళు – సందళ్ళు
అరె వేళాపాలంటూ ఏదీ లేకుండా బేలాగోలలు చేసుకోవాల
అమ్మో కుర్రాళ్ళు పందెం కుర్రాళ్ళు అంటూ ఊరంతా జడుసుకోవాల
అరె ఈలే వెయ్యాల గోలే చెయ్యాల చిన్నా పెద్దా తేడా లేకుండా
కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల

హయ్యో – హయ్యో హయ్యయ్యో – హయ్యయ్యో
ఏయ్ ఉక్కిరి బిక్కిరి చేసే అందం చూడయ్యో – చూడయ్యో
హయ్యో – హయ్యో అబ్బాయో – అబ్బాయో
ఏయ్ చక్కని చుక్కకు చక్కిలి గింతలు పెట్టయ్యో – పెట్టయ్యో
పక్కోళ్ళింట్లోన ఓణీ పాపలకి రోజాలిస్తూనే చెయ్యి తాకాల
తేడా వస్తేను చెల్లీ అంటూనే జాదూ చేసేసి జారుకోవాల
ఏయ్ తాజా అందాల బాజాబందుల వయ్యారితో జిత్తులు తొక్కాల

కుమ్మెయ్యరో ఏ ఏ ఏ అరె దులిపెయ్యరో ఏ ఏ పపపప్ పపపప్
అరె నాయుడో నాయుడో జమ్మప్పల నాయుడో
చూపులతో సుందరికి గాలమెయ్యాల
హోయ్ చూపులతో సుందరికి గాలమెయ్యాల
అరె చాటుగా మాటుగా గడ్డివాము మాటుగా
డండనక డండనక ముద్దులియ్యాల
హోయ్ డండనక డండనక ముద్దులియ్యాల




ఎపుడూ నీకు నే తెలుపనిది (Female) పాట సాహిత్యం

 
చిత్రం: సొంతం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సుమంగళి 

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది ఓ ఓ

ఎపుడూ నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

గుండెలో ఆశని తెలుపనేలేదు నా మౌనం
చూపులో బాషని చదవనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్నా
కలుసుకోలేను ఎదురున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్నా
అడగవే ఒక్కసారైనా
నేస్తమా నీ పరిచయం
కల కరిగించేటి కన్నీటి వానేగా

Palli Balakrishna


చిత్రం: నువ్వంటే నాకిష్టం (2005)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: కె. కె., చిత్ర
నటీనటులు: ఆర్యన్ రాజేష్ , అల్లరి నరేష్ , అను మెహతా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 12.08.2005

సంభాషణలు:
వీరబాబు దేవుడెక్కడ

దేనికమ్మాయి గారు

వాడు చేసిన హెల్ప్ వల్ల నేను పరీక్ష బాగా రాశాను అది చెప్దామని

పంపు షెడ్ దగ్గర మోటర్ బాగుజే త్తన్నాడండి

అమ్మో... ఆంబోతు
దేవుడు... దేవుడు...

ఎంటమ్మాయి గారు ఏమైంది

దేవుడు ఆ ఆంబోతు నన్ను పొడవటానికి వస్తుంది
పట్టుకొని కట్టెయ్

దానిని పట్టుకోమంటే నవ్వుతావేమిటి నువ్వు

అదొస్తున్నది మిమ్మల్ని పొడవటానికి కాదు
అవుకోసం వచ్చింది చూడండి
అది మీ దత్తుడు మమయ్యగారి ఆంబోతు
అనికి కూడా ఆయన బుద్దులొచ్చినట్టున్నాయి

నీకు నవ్వులాట గానే ఉంటుంది ఆది నా వెనకాల వచ్చేసరికి నేనెంత హడలిపోయానో నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో


పల్లవి:
ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు
తెగ నచ్చాడన ఎద గిచ్చాడనా
మగతోడై మనసిచ్చాడనా

నీ గాలి తగిలితే మురళివా
ఏ కొత్తరాగమో కదలగా
ఈ రాధ గుండెలో కదలిక చెలరేగెనే సరిగమ
నీ పురుష మేఘమే ఉరమగా
నే పురులువిప్పగా నెమలిగా
నా మేను మెరుపులే మెరవగా
మొదలాయే మధురిమ

ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు

చరణం: 1
ఓ తేనె గోదారి నాలోన పొంగింది
నావేసె నా ఈడుకి
ఓ ఆకుల్లో సూరీడు సోకుల్ని తాకాడు
సూదంటు నా చూపుకే
నిన్నా మొన్నా ఎరుగనిదీ నేడే నాలో జరిగినదీ
ప్రేమే ఏమో ఏదో ఏమిటిదీ

చిరుగాలి సోకిన వణుకులో  బిగి రైక చాటున ఇరుకులో
పదహారు వయసులో దరువులా చెలరేగెనే ప్రియతమా

ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు

చరణం: 2
ఈ పైరగాలుల్లో నీ పైట ఈలల్లో చలి ఊసులాడిందిలే
ఆ గూటి పడవల్లో  నీ చాటు గొడవల్లో
చిరు గాజు చిక్కిందిలే
నీకు నాకు తెలియనిది నిన్ను నన్ను కలిపినది
ప్రేమేనేమో పేరే చెప్పనిది
నీ చేయి తాకితే పరవశం  నీ పెదవి సోకితే మధురసం
నీ గాలి జన్మకే పరిమళం ఇది సుందరం సుమధురం

ఎందుకీ పరువమా ఈ పరుగులిప్పుడు
ఏమిటి అధరమా నీ అదురుడిప్పుడు

Palli Balakrishna Sunday, October 22, 2017



చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
నటీనటులు: ఆర్యన్ రాజేష్ , నిఖిత
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 24.05.2002



Songs List:



నిను చూసిన ఆ తొలి నిమిషాన పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్ , సుజాత

నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా

నిను చూసిన ఆ తొలి నిమిషాన
నా మనసుకి తెలుసా ఏమైనా
తనప్రేమలోన పుడుతుందో
తను ప్రేమలోన పడుతుందో
అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో

నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా

చూపులతో చెప్పుకునే భాషే ఇది
ఊపిరితో అక్కుకొనే బంధం ఇది
ఇద్దరికే సొంతమయే లోకం ఇది
ముద్దులతో ఏకమయే లోకం ఇది
ఏ జాతీయని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో
సరిహద్దులని చలిపొద్దులని కరిగించని వెచ్చని కోరికలో
ఎంత మధురమో... ప్రేమ అన్నది

అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా
నిను చూసిన ఆ నిమిషాన

ఎన్నటికీ తీరననే దాహం ఇది
చెరిసగము పంచుకునే ప్రాయం ఇది
ఏ ఋణమో తీర్చుకునే స్నేహం ఇది
ఇష్టపడి పెంచుకునే భారం ఇది
నీ చెలిమి నిజం ఈ క్షణము నిజం
అణువణువు మీటిన హాయి నిజం
ఈ వలపు నిజం మైమరపు నిజం
ఎడబాటుకి అందని మనం నిజం
కోటి కలలతో... కొత్త జీవితం

అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో
నిను చూసిన ఆ తొలి నిమిషాన
నీ మనసుకి తెలుసా ఏమైనా
తనప్రేమలోన పుడుతుందో
తను ప్రేమలోన పడుతుందో
అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో
మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో




ప్రేమలో పడ్డాడురో పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: శ్రీరామ్ ప్రభు, టిప్పు, కోటి, మురళీ, కన్నన్, సరోజా 

ప్రేమలో పడ్డాడురో 



హాయ్ రే హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: ఆర్. పి. పట్నాయక్, ఉష 

హాయ్ రే హాయ్ 




మనసూరుకోదే పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: టిప్పు, హరిణి 

మనసూరుకోదే 



Excuse me పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: దేవి, సంజయ్ కృష్ణ, మోహన్, రఘు, 

Excuse me 



తంతే పడిపోయా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రాజేష్, సుజాత 

తంతే పడిపోయా 

Palli Balakrishna



చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
నటీనటులు: ఆర్యన్ రాజేష్ ,  దీపిక
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: లగడపాటి శ్రీధర్
విడుదల తేది: 21.01.2005



Songs List:



బంగాళాఖాతం పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: కె. కె.

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం

చిలిపి చిలక వయసు కనుక ఇవ్వనా కానుకా
వలపు చిలికి పెదవి కొరికి చూపనా వేడుకా
తనువుతో తనువు తలబడి తాకగా హాయి రాబడి
నమ్మితే చూపుతా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం

వలపు పనికి పిలవకున్నా వేచివుంటానుగా
సొగసు ఉనికి తెలపకున్నా తెలుసుకున్నానుగా
నిప్పుకి తప్పు అంటదే యవ్వనం నిప్పులాంటిదే
అందుకే అందుమా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం
వయ్యారి వాటం పొంగే జలపాతం
ప్రతిఅందం నాకే సొంతం
కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా

బంగాళాఖాతం శృంగార ద్వీపం
రతీ తీరం భలే ఇష్టం





తక తక తయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: కార్తిక్, ఉష

తక తక తయ్యా



బంతిలాంటి భామ పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సురేష్ కృష్ణ
గానం: టిప్పు, పాప్ షాలిని

బంతిలాంటి భామ




కల కాదుగా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: బండారు దానయ్య
గానం: కార్తిక్, సాధన సర్గమ్

కల కాదుగా




అమ్మో వాడెవడో గాని పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడిగోల వాడిది (2005)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: శ్రీహరి జగన్నాథ్
గానం: మల్గాడి శుభ, టిప్పు

అమ్మో వాడెవడో గాని కమ్మలెడతనన్నడే

Palli Balakrishna Saturday, October 21, 2017



చిత్రం: అనుమానాస్పదం (2007)
సంగీతం: ఇళయరాజా 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, హంసానందిని
దర్శకత్వం: వంశీ
నిర్మాతలు: సతీష్ తాడి, జై ఆర్నల
విడుదల తేది: 10.02.2007



Songs List:



ప్రతి దినం నీ దర్శనం పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం (2007)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వంశీ
గానం: ఉన్నికృష్ణన్, శ్రేయాఘోషల్ 

ననన నానాన నానా నానా నా నా న నానాన  నన నానా నన నానా

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
 
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...

నిదురే రాదు రాత్రంతా కలలు నేసే నాకూ
వినగలనంటే తమాషగ ఒకటి చెప్పనా...
హహహ చెప్పు...
ఇంధ్రధనుస్సు కిందా కూర్చునీ మాట్లాడుదాం
అలాగే చందమామతోటీ కులాసా ఊసులాడదాం
వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటీ కథనం
పొరపాటు... కథ కాదు...
గత జన్మలోన జాజి పూల సువాసనేమో...

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...
 
ననన నానాన నానా నానా నా నా న నానాన  నన నానా నన నానా

పువ్వుల నదిలో అందంగా నడుచుకుంటుపోనా
ఊహల రచనే తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడిమినీ చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకీ అద్ది ఆడనా
అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో
జడి వాన కురవాలీ...
ఎద లోయలోకి జారిపోయి దారి చూడూ
 
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు
 
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా...



నిను వెతికి పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం 
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: విజయ్ ఏసుదాస్, శ్రేయ ఘోషల్

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా
కనరాని చారుశీలా

ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ

మన అసలు పేరు నీడ అడుగడుగు తోడుగ
కథ నడుపు తమరి జాడ కనపడదు వేడుక
కరిమబ్బు చాటు తారా కనిపించె నా సితారా
చిరుచీకటింట నీడా వెలిగింది కంటినిండా
విరహాల ఆలయానా విరజాజి హారతేలా
ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం
చెలి కనుల ఎరుపులె వలపు గెలుపులె తెలుతుం

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ

ఉసిగొలుపు ఉడుకుతనము చెలి పొగరు చాలులె
కుదురైన కలికితనమా కసి కథలు చెప్పకె
ఎదకెదుకు చిలిపితనమా సొద పెట్టి చంపుతావా
వదలడుగు వలపుతనమా పెదవుల్లొ దాచుతావా
నిదురమ్మ పలకరింతా నివురోయె వలచినంత
హృదయాల సీమలోనా ఎదగాన కోకిలేనా
మన ఏడు జన్మలై ఏడు రంగులై కలిసి

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు
నిను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు
మరుపేల వలపువేళా మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా వెన్నెల్లు కరుగువేళా
కనరాని చారుశీలా

ఓ మై లవ్ ఓ మై లవ్
ఓ మై లవ్ ఓ మై లవ్

నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసూ.





కుయ్ లాలో కుయ్ లాలో పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం 
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: శ్రేయ ఘోషల్

కుయ్ లాలో కుయ్ లాలో చిలక చిలక




మల్లెల్లో ఇల్లేసే చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం 
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: హరిహరన్, సాధనా సర్గమ్

మల్లెల్లో ఇల్లేసే చందమామ వెన్నెల్లు చల్లేసే చందమామ



రా రా రా గుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం 
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: సోనూ నిగమ్, ఇళయరాజా

రా రా రా గుమ్మా రా తుళ్ళే కొమ్మ 



రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా పాట సాహిత్యం

 
చిత్రం: అనుమానాస్పదం 
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: వేటూరి 
గానం: టిప్పు, భవతరంగిణి

రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా

Palli Balakrishna Tuesday, July 18, 2017

Most Recent

Default