-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Allu Sirish"



చిత్రం: బడ్డీ (2024)
సంగీతం: హిప్‌హాప్ తమిజ
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్
దర్శకత్వం: శామ్‌ ఆంటోన్‌
నిర్మాతలు: జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా
విడుదల తేది: 02.08.2024s



Songs List:

Palli Balakrishna Saturday, May 2, 2026



చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ 
దర్శకత్వం: రాకేష్ శశి 
నిర్మాత: బన్నీ వాసు 
విడుదల తేది: 04.11.2022



Songs List:



ధీంతనన ధీంతనన పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: సిద్ శ్రీరాం 

అనగా అనగనగ కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా

అరెరే అరెరె మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే

ఆరాటము మెహమాటము
జతగా కలిగే నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో..!

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే (2)

నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు ప్రతి చోటున
నీ పెదవులు తాకే నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట

కాలం కలిపింది ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే

ఆకాశం తానే చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా

రాయబారాలు పంపాను నా భాషలో
రాయలేనన్ని భావాలు నా ఊహలో
మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ

ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి నీతో కలిసే




మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా

చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఏం లేక
బారుకాడ అబ్బాయి

మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

ఏ ఆకలుండదు నిద్దరుండదు
వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు
ఫ్రెండు అంటరు లవ్వు అంటరు
డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు

మంటల కలిసి పోయేది మనం
మనల్నే తిడతారు ఎర్రి జనం
పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు
బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు

మాయారే ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే
మాయారే ఈ అమ్మయిలంతా మాయారే

మాయ మాయ మాయ మాయ
జిందగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా

పోరిల ఎంట పోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా వై వై ఎందూకలా

పడిపోకురా ఇస్తే స్మైలు
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా వై వై ఎందూకలా
ఎందూకలా ఎందూకలా ఎందూకలా

వద్దుర పోరిల జోలికి
పోరి దూల తీర్చి పోతది
ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ
ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ

వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను
వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను
షాపింగ్ మాల్లు లాకైపోను
పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్క పోను
బ్యూటీ పార్లర్లు బందైపోను

కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి
ఉన్న జుట్టు ఊడిపోను
అమ్మాయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగ మారిపోను మారిపోను
పోను పోను పోను పోను



కలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అర్మాన్ మాలిక్ 

కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉంది నమ్మవా
ఎప్పటికి నా మనసే ఇక నీకే

ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా
అల్లావే అన్ని వైపులా
నిను చూసే ప్రతిసారి పడతానే

ఓ ఓ చెలివే చెలివే
సరిపోదే గుప్పెడు గుండె
చెలివే చెలివే
మరు హృదయం అప్పడిగానే

నను తాకే ఊపిరి
ఓ ఓఓ అలవాటే అయినది
నదిలో అలలా కలిసేపోనీ

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష

వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే
సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే
బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే
మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే

ఓ ఓ సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండి పోవే

సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదే
సమానమై పోదాం రావే
నువ్వుండి పోవే

స స సస స ని ని స
కవిత్వాలు నేర్పే సొగసా
సస స సస ని ని స ని ని స
మాటే మూగబోయెను తెలుసా

స సస ని ని స
కొంచెం తెలుగునడిగే చూసా
సస స సస ని ని స ని ని స
సరిపోదులే పొగడగా ఓ భాష





సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022)
సంగీతం: అచ్చు రాజమణి 
సాహిత్యం: శ్రీమణి 
గానం: శ్రీకృష్ణ 

సీతాకోక చిలుక 

Palli Balakrishna Monday, October 17, 2022


చిత్రం: ABCD (2019)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్, అదితి భావరాజు
నటీనటులు: అల్లూ శిరీష్ , రుక్షర్ ధిల్లోన్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: .మధురా శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 01.03.2019

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందే
చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదా రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందులేదే ఈ హాయి
సందడేమో అల్లుతూనే నీ వైపోయే
ప్రతీ క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూశానులే నీలా ఏదీ లేదంటే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

మెరిసే లోపలే మనసే
మురిసే నిన్నిలా కలిసే
నిమిషాలు రోజులై
నిలిచేను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే అల్లారేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

Palli Balakrishna Saturday, February 23, 2019


చిత్రం: గౌరవం (2013)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్ , సుచిత్ర
నటీనటులు: అల్లు శిరీష్ , యామి గౌతమ్
దర్శకత్వం: రాధామోహన్
నిర్మాత: ప్రకాష్ రాజ్
విడుదల తేది: 19.04.2013

హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి ఏకం చేసేచెయ్యి
చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి
ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఎన్నో తేడాలు బేదాలు వాదాలు మాని
అందరం మనమందరం
ఎవేవో దూరాలు తీరాలు  భారాలు
వీడి ఈ క్షణం కిలిశాం మనం
లోలోన పంతాలు కోపాలు భావాలు
అన్ని ఈ దినం మన ఇంధనం
ఎగిరెగిరిన అలలకు అలసట రాదు వెను తిరుగుట రాదు
వడుదుడుకులలోన విసుగే రాదు
అనుమానమే రాదు అపజయమను మాటే రాబోదు
నిగ నిగ నిప్పు రవ్వలకు నిధురిక రాదు
నిషి ఎదురుగ రాదు మన మనసుకు మసకిక కనరాదు
కరువు రాదు మన పరుగుకు పరిమితి రాబోదు

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా
ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా
ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా

కలపాలి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి
నిన్న మొన్నంత కేరింత తుళ్ళింతల్లోన
జీవితం గడిపాం మనం
నేడే సై అంటూ రై అంటూ హుయ్ అంటూ
చెలరేగదాం కొనసాగుదాం
ఇక ఇంటర్నెట్ కేఫుల్లోన కబురులు చాలు
కాలక్షేపం చాలు
ఒక లక్ష్యం కోసం తెరిచేయ్ ఫైల్  పంపించెయ్ మెయిల్
నీ తెలివికి తీసేయ్ తాళాలు
సిటీ సెంటర్లోన సందుల్లోన సందడి చాలు
చిరు విందులు చాలు అరచేతిలో ఆపేయ్ ఘోరాలు
అదే చాలు రెండు చేతులెత్తి మొక్కును లోకాలు

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

ఒకటై  ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్
దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ
నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా

హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి



Palli Balakrishna Monday, March 19, 2018


చిత్రం: ఒక్క క్షణం (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాహితి, అనురాగ్ కులకర్ణి
నటీనటులు: అల్లు శిరీష్ , సీరత్ కపూర్, సురభి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: వి.ఆనంద్
నిర్మాత: చక్రి చిగురుపాటి
విడుదల తేది: 28.12.2017

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే
ఏం జరుగుతుంది చెలిమనసిది
వెలిపోతుందెటో సరిగా కలువలేదే
నిన్ను అపుడే మిస్సింగ్ ఏమిటో

ఏమిటిది కొత్త కథ ఎప్పటిలా లేనుకదా
యు అర్ మై బేబీ
యు డ్రైవ్ మీ క్రేజీ
సీ యు బేబీ  యు అర్ మై బేబీ
కాంట్ టేక్ ఇట్ ఈజీ


Wanna wanna see you baby
Wanna wanna see you

సో మెనీ సో మెనీ  తలపులే మొదలాయెనే
సో మెనీ సో మెనీ మెరుపులే కనులలో కదలాడెనే

సో సో జిందగి నిన్నిలా కలిశాకనే
సో మెనీ రంగుల కళలతో వెలుగాయెనే

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లా చెలీ నువ్వేనే నా కల
వాట్సప్ స్మైలీ లా మది మెరిసెనే మిల. మిల
ఇప్పటికిప్పుడు చూడాలని
అనిపిస్తున్నదే
రారమ్మంటు నా మౌనమే పిలిపిస్తున్నది

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby
Gonna gonna see

రోజు నాకు తెల్లవారదే నీ మెసేజ్ రానిదే
ఎంతసేపు మాటలాడినా సమయమే తెలియదే
వదిలిపోని ఈ పిచ్చికి పేరే ఏమిటో
నీకవుతున్న ఆ సంగతే నాలోను డిటో

You’re my baby
You drive me crazy
See you baby
You’re my baby
Can’t take it easy (2)

Gonna gonna see you baby (2)


Palli Balakrishna Wednesday, December 27, 2017


చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (2015)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రేవంత్
నటీనటులు: అల్లు శిరీష్ , లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 05.08.2015

ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసి
నా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యాసి
తను లేని బతుకంత వీడు సన్యాసి
ప్రతి కళలో ఆ పిల్లకి
మార్కులు పడవా వందేసి
వెరసి ఆ వనితేరా అచ్చమైన దేశీ దేశీ దేశీ

దేశీ గర్ల్... దేశీ గర్ల్....

శారీలో అచ్చంగా సావిత్రిలా
పరికిని ఓణీలో పరిణీతిలా

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

మణిరత్నం సినిమాలో మధుబాలలా
అతిలోక అందాల శ్రీదేవిలా

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

హే మాంజాలా వచ్చేసి నా మనసు తెంపేసి
దర్జాగా లాగేసుకున్నాదిలే
కాబట్టే తన పిచ్చి గంజాయ్లా ఎక్కేసి
తనచుట్టు చక్కర్లు కొడుతున్నాలే

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

మాయాబజార్ లో సావిత్రీరా
బాపు సినిమాలో సీతమ్మరా

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

అసలైన దేశీ అమ్మాయిరా
ఆపైన కొంచం అమ్మోరురా

దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్

హే తొలి బాల్ కే సిక్సర్
తొలి ఫిల్మ్ కే ఆస్కార్
కొట్టేసినట్టుంది తనతో ప్యారు
పిల్లేమో బంగారు పలుకేమో బేజారు
అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

బంగాళాఖాతం లోతెంతని
వేలెట్టి చూస్తే తెలిసేదేనా

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

ఆ పిల్ల మనసు అంతేలేరా
అయినా ప్రేమించా నే మనసారా

దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్

ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో
తన బొమ్మే చెక్కే కసి ఆ బ్రహ్మకు
ఎదురవని ఏ రిస్కో చేస్తాలే నే ఇష్క్
రాదంట క్షణమైనా నాలో విసుగు

దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్  దేశీ దేశీ దేశీ గర్ల్

Palli Balakrishna Tuesday, October 24, 2017

చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భువన చంద్ర
గానం: సాహితి
నటీనటులు: అల్లు శిరీష్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 01.05.2014

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ...బోటున్నదీ...
రా సంతకీ... తస్సాదియ్యా ''అటు''

కోనసీమలో...కూరగాయలూ...
గోదారిలో... కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో....
తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో ''సూపరు''
బేరమాడుకో...తస్సాదియ్యా ''అటు''

తప్పుడు కథల అప్పలరాజూ....
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చవయ్యో....
తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పెద్దపురము సంత చేరి
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకులూ
ఎంతో నాణ్యవైనదయ్యో
హెలుసేలుగా బేరమాడుకో....
ఒకటే మాటా ఒకటే రేటూ ''ఒకటే మాటా''
రైటు చేసుకో... తస్సాదియ్యా...''అటు''


********  *******   ********


చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: రమ్య

ఓహో.... ఎన్ని ఎన్ని ప్రేమలో...
ఓహో... ఎన్ని ఎన్ని పేరులో
కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
అమ్మా, బాబుకి మేటర్ లీకయ్యి
Left and right కోటింగ్ మొదలయ్యి
జిందగి మొత్తం  చిరిగీ చేటయ్యి... life long ఏడుస్తారే
ఇట్టా ఇట్టా ఎల్లాకిల్లా డల్లైపోయే మీకోసం
గండాలన్నీ గట్టెక్కించే కొత్త జంట మా ప్రోగ్రాం
లవ్వూ గివ్వూ లావాదేవీ క్షణాలలో తేలుస్తాం
ఇష్కే మీది రిస్కే మాది... బ్యాండు బాజా మోగిస్తాం

కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
ఆర్య సమాజూ... రిజిస్టార్ ఆఫీసూ
చర్చీ, మసీదులూ... వెడ్డింగ్ వెన్యూలే
ఎక్కడా లేనంతా... పక్కా గ్యారెంటీ

టైటూ సెక్యూరిటీ మేం అందిస్తంలే
కొత్తా జంటలకి ఊపిరిపోస్తాం
పెండింగ్ ప్రేమా కథలు సెటిలే చేస్తాం
బాబులకీ... బాంబులకీ...లొంగని మా...సత్తా చూపిస్తాం...

చలో చలో మీలో వున్న భయానికే బ్రేకేస్తాం
మీకూ మీకూ ఓకే ఐతే మిగతాదంతా మేం చూస్తాం
నిజంగానే మీ ప్రేమకి మా ప్రాణాలే అడ్డేస్తాం
నిఖార్సుగా నమ్మారంటే నిఖా షురూ చేసేస్తాం

Palli Balakrishna Tuesday, October 3, 2017

Most Recent

Default