Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gamanam (2022)




చిత్రం: గమనం (2022)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: శ్రేయా శరన్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జ్వాల్కర్, సుహాష్ 
దర్శకత్వం: సుజనా రావు 
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకి పుషాడపు, వి.ఎస్.జ్ఞానశేఖర్
విడుదల తేది: 2022



Songs List:



ఎంత చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: గమనం (2022)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: జతిన్ రాజ్,  విభవరి

ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన రాకతోనే తీరెనా, ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహుమ్ మే క్యా హే ప్యార్ మే జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్

తాను కాస్త ముందుకొస్తె… ఆగిపోయే ఊపిరి
కానరాని వేళలోన ఉండలేదులే
ఓరకంట చూడగానే మేలుకోవ ఊహలే
పెదవి దాటి రానే రావు మనసు మాటలే
ముందులేని అల్లరేదో కమ్ముకున్న వైఖరి
ఒంటరన్న మాటకింకా ఆఖరే కదా
ఎక్కడున్నా ఒక్కసారి పెరిగిపోవు అలజడి
దోర నవ్వు సోకగానే కలత తీరదా
కహుమ్ మే క్యా హే ప్యార్ మే… జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్

ఇన్నినాళ్ళు గుండెలోన జాడలేని హాయిది
నీడ కూడ రంగు మారే ప్రాయమే ఇది
దేనినైనా దాటిపోయే వేగమేమో వయసుది
తరుముతున్న ఆపలేని అదుపు లేనిది
రెప్పపాటు కాలమైన ఆగలేని జోరిది
చూడగానే నేల మీద తేలిపోయెనా
నువ్వు వేరు నేను వేరు అసలు కాని చోటిది
ఇద్ధరింక ఒకటిగానే కలిసెతనమిది
దుబా దియా బురి తరహ్ యే కైసా ప్యార్

ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన రాకతోనే తీరెనా, ఈ వేదన
మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహుమ్ మే క్యా హే ప్యార్ మే జో మేరా హాల్
ఎంత ఎంత చూసిన… చాలదే ఈ మనసున, ఓ మేరె జాన్





Song Of Life పాట సాహిత్యం

 
చిత్రం: గమనం (2022)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: కైలాష్ కెహర్

ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఏ కుదా-షా-హే మర్ద
ఓ మేరే మౌలా
ఏ కుదా షేర్ హే యజుదాన్
ఓ మేరే మౌలా

ఏ అలీ మౌలా
మేరి మన్నతోఁకో సున్ మౌలా
ఏ అలీ మౌలా
మేరీ ముష్కిలే మిట్టా మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా

ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా
ఏ అలీ మౌలా… భవ బంధనాన ముంచాలా
ఏ అలీ మౌలా… ఇహ శృంకలాలు తెంచాలా

అందని ఆకాశాలే… కోరేనే నేలా
ఆఆ ఆ ఆ ఆఆ ఆ
తీరనీ ఆశేనంటూ ఒప్పుకోవేలా
నమ్ముకుని కదిలిన గమనం
మార్చకిక ఒంటరి పయనం
వేడుకుని కరిగెను నయనం
వేడుకగా కొలవకు సహనం

మేరె మౌలా హాజీ మౌలా
ఆపదేరా ఆదుకోరా
మలుపులు ఎన్నెన్నో అసలెటు వెళ్ళేనో
కథలు కడకు ఎటు చేరేనేమో

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా
ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా

ఒక్కరో తప్పే చేస్తే సర్దుకోలేవా
ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
లోకమే ఏకం చేసి… శిక్ష వేస్తావా
ఎందుకని వదలవు గగనం
పాపమని కలుగదా చలనం
వేదనని తరుమిదే తరుణం
రోదనకు జరుపిక దహనం

మేరె మౌలా హాజీ మౌలా
ఆపదేరా ఆదుకోరా
అసలిది విన్నావో… వినపడి ఉన్నావో
వెతలు చెరుపు… ఒక దైవం నీవే

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా

ఏ కుదా-షా-హే మర్ద
ఓ మేరే మౌలా
ఏ కుదా షేర్ హే యజుదాన్
ఓ మేరే మౌలా

ఏ అలీ మౌలా
మేరి మన్నతోఁకో సున్ మౌలా
ఏ అలీ మౌలా
మేరీ ముష్కిలే మిట్టా మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా
ఆటలే చాలిస్తావా… ఓ మేరే మౌలా

సుడులు తిరుగు నడి కడలినా
పడవ నడపమని అడగాలా
పిడుగు పడిన ప్రతి క్షణమున
అడుగు నిలపమని పిలవాలా



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default