Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Arjuna Phalguna (2022)
చిత్రం: అర్జున ఫాల్గుణ (2022)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మనియమ్
నటీనటులు: శ్రీ విష్ణు , అమ్రిత అయ్యర్ 
దర్శకత్వం: తేజ మర్ని
నిర్మాత: నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి 
విడుదల తేది: 2022Songs List:గోదారి వాళ్ళే పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున ఫాల్గుణ (2022)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మనియమ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: అమల చేబోలు , అరవింద్ మురళి 

పచ్చాని ఊళ్ళే సందమామ
ఏడ సూడు నీళ్ళే సందమామ
బంగారు మట్టే సిరి పండేనిట్టా
ముత్యాల ముగ్గల్లే ముంగిళ్ళలో
అందాలు చిందాడే అందరిలో

గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
లేత కొబ్బరంటి మనసువాళ్ళే
పూతరేకు కన్నా తియ్యనోల్లే, హో హో


అరె కొట్టాలి ఈతనే… ఈ పంట వాగుల్లో
కొమ్మచ్చులాడాలే… కొత్తల్లే తోటల్లో
ముంజికాయ బండి… ముందుకెళ్ళమండి
కొబ్బరాకు బూర సన్నాయే

కింగులాగ మారి… గేదె మీద స్వారీ
పాల ఐస్ కోరి తిన్నారే
ఇక కట్టాలి పిచ్చుక గూళ్ళు
తన్నేసి వెల్తే వెల్లు

దొంగాటలు దోబూచులు
చల్లాలి ఉప్పు కారం
పుల్లాని మామిడి ప్రాణం
గోలి సోడా గోలే కదా

గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
మట్టగిడస లాంటి మనసు వాళ్ళే
మట్టికుండలాగ చల్లనోల్లే, ఓ ఓ

అరె ఈనాటి వీళ్ళే… కసున్న కుర్రోల్లే
సమస్యలెన్నున్నా… సరదాల సోగ్గాల్లే
సినిమాల మోజు… హీరోలాగ ఫోజు
రచ్చరచ్చ రోజు చేస్తారే

పాత ఆటలన్నీ చాటుకెళ్ళిపోయే
క్రికెట్టు అంటే ప్రాణమిస్తరే
అరె సైకిల్లు చాల్లే బాసు
బైకుంటే రేసే రేసు

పోటీపడి పోరాడగా
ద్వేషాలు రోషం కన్నా
స్నేహాలు ఎంతో మిన్న
అంటారురా సంతోషంగా

గోదారి వాళ్ళే సందమామ
భలేటోళ్లులే సందమామ
ఆసికాలు ఆడే అల్లరోళ్లే
భేషజాలు లేని బుజ్జిగాళ్ళే

కాపాడేవా పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున ఫాల్గుణ (2022)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మనియమ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: మోహన భోగరాజు , అరవింద్ మురళి 

ఏదేమైనా కానీ రానీ లేరా పోరా
మీలా మీరే సాగి పోవాలే

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ, ఓ ఓ

ఏ, అమ్మోరిలో ధమ్మే నువ్వై
కత్తే పట్టుకుంటావో
మండుతున్న నిప్పురవ్వై
నువ్వే దూసుకొస్తావో

ఓ, వచ్చేయ్ వచ్చేయ్
అర్జునుడల్లే వచ్చేయ్
కొట్టేయ్ కొట్టేయ్
ఫల్గునుడల్లే కొట్టేయ్

జంకావంటే మేకల్లే చంపేస్తారే
పంజా ఎత్తి సై అంటే జై అంటారే
పులే అవుతావో… బలే అవుతావో
నువ్వే తేల్చాలి నడుంబిగించి

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ, ఓఓ ఓ

హే, ఇల్లే దాటి ఇట్టాగ వచ్చేసామే
కష్టాలన్నీ ఇష్టంగా మోస్తున్నామే
రేపెట్టుందో ఎటేపెల్తుందో
భయాలొగ్గేసి వచ్చాం తెగించి

అదిరా అదిరా రా… అర్జునకై
అడ్డుతలక ఫాల్గుణకై రా
ఒక తియ్యని మాటతో పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున ఫాల్గుణ (2022)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మనియమ్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: శ్రేయ అయ్యర్, సస్వాత్ సింగ్

ఒక తియ్యని మాటతో కళ్ళు మెరిసే
ఒక చల్లని చూపుతో గుండె తడిసే
ఎదలోపల ప్రేమల వెల్లువెగసే
చిరునవ్వుల పువ్వుల వెల్లివెరిసే

మనసూయల ఊగినదే
ఎద సవ్వడి సాగినదే
వయసల్లరి చేసినదే
ఈ స్నేహంలో

ఒక తియ్యని మాటతో కళ్ళు మెరిసే
ఒక చల్లని చూపుతో గుండె తడిసే
ఎదలోపల ప్రేమల వెల్లువెగసే
చిరునవ్వుల పువ్వుల వెల్లివెరిసే

చిన్నారి నీ చెలిమి… కళ్లారా కన్నాను
కాపాడుకుంటాను నా కంటిపాపను
నీ జంటకలిశా… నీ వెంట నడిచా
నీ గుండె తరిచా… నా గుండె పరిచా

రావే వెన్నెలా నా కన్నె లేడీలా
చాటుమాటు వేళల్లో… స్వీటు ముద్దులా
(అడుగేయాలిలే ఈ ప్రేమ… ఒకటవ్వాలిలా)

నన్ను మరిచే… నే ఒళ్ళు మరిచే
నిన్ను కలిశాక… పిచ్చి పిల్లనే
నా నీవు, నే నేను
సుందరుడా, ఓ సుందరుడా
ఎందుకురా ఈ గుండె దడ
విందులకే ఏం తొందరయా, హే ఏ ఏ ఏ

వయసన్నది ఆగదు
మనసన్నది దాగదు
నిను ఎన్నడు వీడదు
ఏం మాయో..!!

ఒక తియ్యని మాటతో కళ్ళు మెరిసే
ఒక చల్లని చూపుతో గుండె తడిసే
ఎదలోపల ప్రేమల వెల్లువెగసే
చిరునవ్వుల పువ్వుల వెల్లివెరిసే

అవునా చెలియా..!
మదిలో మదివై రావా
సరదా నదిలా చిందేయనా
# పాట సాహిత్యం

 
Song Details# పాట సాహిత్యం

 
Song Details# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default