Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ma Manchi Akkayya (1970)




చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
నటీనటులు: కృష్ణ, రాజశ్రీ, శోభన్ బాబు
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
నిర్మాత: కె.ఆనంద మోహన్
విడుదల తేది: 15.05.1970



Songs List:



ఆహా కలా వైపరీత్యమా పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: బొల్లిముంత శివరామకృష్ణ
గానం: యస్.పి.బాలు, ధూళిపాళ 

వచనం :
ఆహా. కాల వైపరీత్యమన నిట్టిదే
కాబోలు గయుని జంపెదనని నేను
శపధం బొనర్ప, నర్జనుండు శరణు
మిచ్చుటయా నాకై నేను కబురంపిన
గూడా కాదని త్రోసి పుచ్చుటయా?
చెలినై, చుట్టమునై కాండవ దహ
నాద్యనేక విజయంబులకు కారణమైన
నాతో - అకారణమూ, అనూహ్యమూ
నైన కయ్యంబునకు కాలు ద్రువ్వుటయా
అర్జునా! నీవు కృతఘ్నుడవు....
నా శత్రువు గయుడు కాదు.... నీవు.... నీవు

పద్యం:
విలయం బైన, విరుదమైన, ధరణీ విద్వంశ మేయైన, ను
జ్వలుడౌ భానుడు చల్లనైనను, చతుస్సంద్రంబు లొక్కుమ్మడిన్
జల శూన్యం బయినన్, కిరీటితో సహా సర్వోర్వియే దాకినన్
కలనన్, యీ గయునొంతు, దుృంతును, ప్రతిజ్ఞ దీక్ష చెల్లింతునే



మనసే చల్లని జాబిలిగా పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి :
మనసే చల్లని జాబిలిగా - మన వలపే పున్నమి వెన్నెలగా
జీవిత మంతా వెలగాలి - ఈ లోకమే స్వర్గము కావాలి
మరదలు పిల్ల ఇల్లాలై - నా మదిలో మల్లెలు చల్లెనులే
కోరిన చిన్నది పలికే పలుకే
తీయని పాటె కోరికేదో ఊరించేలే
కలతలు లేనీ సంసారం - నా నోముల పంటై విరిచెనులే 
ప్రతి రోజూ ఒక పండుగలాగా
బ్రతికే మనకూ లేని భాగ్యం ఏముందిలే
చిన్నారి పొన్నారి పాపాయిలూ
చిరునవ్వు రవ్వలు చిందించగా
మైమరచి ఉయ్యాల లూపేములే
జత గలిపి జోలల్లు పాడేములే



చెల్లీ ఓ చెల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

పల్లవి:
చేతికందే పంట చేయి జారిపోయింది.
నీడ నొసగేకొమ్మ వీడి పడి పోయింది
చెల్లీ  ఓ చెల్లీ - చెల్లీ  ఓ చెల్లీ
విలపించకు చల్లని తల్లీ ఇది ఎవరు చేసిన పాపం
విధి కెందుకు ఇంతటి కోపం

చరణం : 1
సుగుణాల కల్ప వల్లీ దిగులేల నీకు చెల్లీ
నీ పెళ్ళి జరిగి తిరాలి . నీ నోము లన్ని పండాలి॥

చరణం : 2
తన కాళ్ళపై నడచిన వాడు - తన వారిని నడిపించిన వాడు
కుంటి బ్రతుకుతో కుమిలెను నేడు
కుంపటి ఎదపై రగిలెను చూడు।





ఏమో ఏమో అడగాలనుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల 
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి 

ఏమో ఏమో అడగాలను కున్నావు
ఏమీ రానీ పసి పాప వైనావు
ఏదో ఏదో చేయాలనుకున్నావు - మాటేరాని పసివాడవై నావు
నిగ నిగ లాడే బుగ్గలలో - కెంపుల నీడలు కులికినవీ
ఊహలు ముందుకు సాగినవీ - అడుగులు తడబడి ఆగినవీ
నల్లని నీ జడలో మల్లెలు నవ్వినవీ
చక్కిలి గింతలు కలిగినవీ -

జాబులు పనిచేస్తున్నయ్
జంటను కలిపేస్తున్నయ్
కళ్ళారా చూశాను
విరహంతో నిలిచాను
అయితే ఇంకేం అయినై పోదాం దొరకదు ఛాన్సు
తొలకరి నవ్వుల సవ్వడిలో - తీయని వీణలు పలికినవీ
సొగసులు చూసిన మైకంలో కనులే కావ్యము రాసినవీ
వెచ్చని కౌగిలిలో వొంపులు కందినవీ
నను నీ సొంతం చేసినవీ 




చూపులు కలిసిననాడే పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

చూపులు కలసిననాడే నీ రూపం మిసమిస లాడే
మనువులు కలసిన నేడే| మన - మమతలు గుసగుస లాడే:
మరుమల్లె తెల్లనిది - చిరునవ్వె చల్లనిది
నీలో మరి నాలో: విరబూసిన వలపే తెల్లనిది చల్లనిది

తొలి రోజు పూచినది - మలి రోజు వేచినది
నాలో మరి నీలో అది నాడు నేడు మాయినది తీయనిది
సూర్యం : విరి పానుపు చూచినది - నను తొందర చేసినది
ఎదలో పయ్యెదలో పులకింతల పున్నమి విరిసినది: మెరిసినది
అనురాగం ఆరనిది మన బంధం తీరనిది |
కలగా కోయిలగా కలకాలం కమ్మగ నిలిచేది పిలిచేది




చిట్టిపాప చిన్నారి పాప పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: కౌసల్య,  పి.సుశీల 

చిట్టి పాపా చిన్నారిపాపా - మీ అమ్మగానీ
మా అమ్మగానీ - లోకాన అందరికితొలి దైవమే
పసిపాప పలికేటి మొదటి మాట
అదే అమ్మా! అమ్మా! అన్న తెలుగు మాట
అనురాగ క్షీరాలు అందించు తల్లీ 
కనిపించు దైవమే కన్నతల్లీ 

ప్రతిచోట దేవుడే కనిపించలేక - అమ్మనే సృష్టించి పంపినాడు
ఏ వేళ మీ యమ్మ నీ వెంట ఉంది
కను పాపలా నిన్ను కాపాడు తుంది





ఓ బుల్లెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల  
గానం: బసవేశ్వర రావు, కౌసల్య

బుల్లెమ్మ, బుల్లెమ్మ, బుల్లెమ్మ, బుల్లెమ్మ
జలసా బుల్లెమ్మా  చిట్టిమ్మ, చిట్టిమ్మ, చిట్టిమ్మ, చిట్టిమ్మ
సినిమా చిట్టిమ్మా - స్టీమరువలె! రివ్వునభలే, దూసుకురావమ్మా

ఓ .... బుల్లోడా  బుల్లోడ, బుల్లోడ, బుల్లోడ, బుల్లోడ
దసరా బుల్లోడా!  పిల్లోడ పిల్లోడ, పిల్లోడ, పిల్లోడ
సినిమా పిల్లోడా 
బాణము వలే ప్రాణము ఇలా తీయకు పోవయ్యా
వలపులు పులకలు - మెలికలు తిరిగెను
పిల్లా రక్షించూ 
పెనిమిటి ఇతడని పెద్దలు పలికిన రాత్రికి కనిపించూ
అయ్యో చెలీ  చచ్చె చలీ 
తొందర పడి చావకు మరీ నీదేలే రా వెచ్చని నా కౌగిలి

మిస మిస జిలుగులు ముసి ముసి నగవులు
ప్రేమతో చిలికించా
అడయార్ చెట్టును - మోర్ మార్కెట్టును
నేనూ చూపించా
సినిమాలలో చేర్పించవా?
తప్పదుకదా - పోదాం పద
తారల మైతే ఎంతో జాలీలే 




ఎవరన్నారురా ఇది లోకమని పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

చరణం: 
కొలచిన దేవం వెలి వేసినా కోవెల తలుపులు మూసెనా
యుగయుగాలుగా అబలబ్రతుకున మిగిలిన శాపం ఇదేనా?

పల్లవి: 
ఎవరన్నారు. ఇది లోకమని
కానేకాదు, రుజువై పోయెను నరక మని 

చరణం : 
తన ప్రాణముగా తలచిన అన్నయ్య
నిను కులటాయని నిందించె - పుడమిని తడిపే చలువమబ్బులే
పిడుగు లెందుకో కురిపించె




ప్రణయ పర్యంకమున పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

గేయం : 
ప్రణయ పర్యంకమున పవళించు పరువాన
పంచభూతాలలో లీనమైనావా
పూల పల్లకిలోన పులకించువేళ మే
ఘాల పల్లకి పైన వెళ్ళిపోయినావా !

పల్లవి: 
వెళ్ళి రావమ్మాః చెల్లీ వెళ్ళిరావమ్మా
మళ్ళీ జన్మకు ఈ అన్నయ్యకు చెల్లాయిగ జన్మింతువుగానీ

No comments

Most Recent

Default